( ఫైల్ ఫోటో )
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సమీప బంధువు ఇంట్లో ఐటీ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. సుచిత్రలో నివాసం ఉంటున్న మల్లారెడ్డి బంధువు త్రిశూల్‌రెడ్డి ఇంట్లో రూ. 2కోట్లు సీజ్ చేశారు. త్రిశూల్ రెడ్డి కూడా కాలేజీలు నడుపుతుండగా ఉదయం నుంచి ఆయన ఇంట్లోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
మంత్రి సెల్‌ఫోన్ స్వాధీనం
కాగా మంత్రి మల్లారెడ్డి నివాసం, కార్యాలయాలపై ఐటీ సోదాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఏక కాలంలో మొత్తం 50 బృందాలుగా అధికారులు. మంత్రితోపాటు ఆయన బంధువుల నివాసాలు, కార్యాలయాల్లోనూ విస్త్రృత దాడులు నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి కొడుకు, అల్లుడు, సోదరుడు, వియ్యంకుడు ఇళ్లల్లో తనిఖీలు జరుపుతున్నారు. మంత్రి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
కొత్త విషయాలు వెలుగులోకి
మంత్రి మల్లారెడ్డి విద్యాసంస్థలపై జరుపుతున్న ఐటీ సోదాల్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. క్యాసినోలో పెట్టుబడులు పెట్టిన జైకిషన్ ఇంట్లో ఐటీ సోదాలు చేస్తోంది. జైకిషన్, మాధవరెడ్డి, చికోటి ప్రవీణ్‌లు కలిసి క్యాసినోలో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు. గతంలో కూడా జైకిషన్ ఇంట్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. జైకిషన్ తండ్రి నరసింహ, మంత్రి మల్లారెడ్డి వ్యాపార భాస్వాములు. సీఎంఆర్ స్కూల్స్‌లో నరసింహ యాదవ్, మల్లారెడ్డి పార్ట్‌నర్స్‌గా ఉన్నారు. దీంతో నరసింహయాదవ్, జైకిషన్ ఇళ్లల్లో ఐటీ దాడులు జరుపుతోంది.
14 విద్యాసంస్థల ప్రధాన కార్యాలయాల్లో ఐటీ తనిఖీలు చేపట్టింది. కాలేజీల ఆర్థిక లావాదేవీల రికార్డులు పరిశీలిస్తున్నారు. క్రాంతి బ్యాంక్ చైర్మన్ రాజేశ్వరరావు ఇంట్లో ఐటీ సోదాలు జరుపుతున్నారు. క్రాంతి బ్యాంక్‌లో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ లావాదేవీలు గుర్తించారు. అలాగే కన్వీనర్ కోటా సీట్లను ప్రైవేటు వ్యక్తులకు అమ్మినట్లు అధికారులు గుర్తించారు. నాలుగు మెడికల్ కాలేజీల లావాదేవీల పరిశీలిస్తున్నారు.
సంబంధిత వార్త: మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ రైడ్స్.. ఒకేసారి 50 బృందాలతో..
Comments
Please login to add a commentAdd a comment