chamakura malla reddy
-
పార్టీ ఆదేశిస్తే మల్కాజిగిరి లోక్‌సభకు పోటీ చేస్తా: మల్లారెడ్డి
సాక్షి, మేడ్చల్: బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశిస్తే మల్కాజిగిరి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. బీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మల్లారెడ్డి.గురువారం తెలంగాణ భవన్లో కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలో మల్కాజిగిరి ఎంపీ గా పనిచేసిన అనుభవం ఉందని గుర్తు చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలైన మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో ఇటివల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించారన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఇదే తరహలో ప్రజలు బీఆర్ఎస్ను ఆదరిస్తారన్నారు. మల్కాజిగిరి లోక్‌సభ స్థానంతో పాటు రాష్ట్రంలో అత్యధిక లోక్‌సభ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని దీమాను వ్యక్తం చేశారు. లోక్‌సభ స్థానాల వారీగా సమీక్షలు నిర్వహించి గెలుపే లక్ష్యంగా పనిచేయనున్నట్లు వెల్లడించారు. తాను పోటీ చేసే విషయమై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుదని పేర్కొన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ సమీక్షా సమావేశం ఈ నెల 21 తెలంగాణ భవన్లో పార్లమెంట్పరిధిలోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులతో అదిష్టానం నిర్వహిస్తుందని మల్లారెడ్డి తెలిపారు. చదవండి: CM Revanth: అమిత్‌షాతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ -
మంత్రి మల్లారెడ్డి స్థిర ఆస్తులు రూ.90.24 కోట్లు
హైదరాబాద్: మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి చామకూర మల్లారెడ్డి స్థిర ఆస్తులు విలువ(భూములు, భవనాల విలువ) రూ.90,24,08,741 ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో తెలిపారు. ఇందులో ఆయన సతీమణి చామకూర కల్పనా స్థిర ఆస్తుల విలువ రూ.38,69,25,565 పేర్కొన్నారు. తమ స్థిర ఆస్తులు(భూములు, భవనాలు) సూరారం, దూలపల్లి, అలియాబాద్, జీడిమెట్ల, యాడారం, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ ప్రాంతాల్లో ఉన్నట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. అలాగే, వివిధ బ్యాంకుల్లో తీసుకున్న అప్పులు(లోన్లు) రూ.7,39,94,301 కాగా, ఇందులో ఆయన సతీమణి కల్పనా పేరుతో ఉన్న అప్పులను రూ.4,48,95,098 తెలిపారు. అలాగే, చరా ఆస్తులు(వివిధ బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు) రూ.5,70,64,666 ఉన్నట్లు పేర్కొన్న మంత్రి మల్లారెడ్డి, ఇందులో సతీమణి కల్పనకు సంబంధించివి రూ.72,39,185గా తెలిపారు. వాహనాలకు సంబంధించిన వివరాలతోపాటు చేతిలో నగదు ఉన్నట్లు గానీ ఎన్నికల అఫిడవిట్లో ఆయన పేర్కొనలేదు. 2018 ఎన్నికల అఫిడవిట్లో ఇలా.. 2018 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీహెచ్.మల్లారెడ్డి ఎన్నికల అఫిడవిట్లో స్థిర ఆస్తులు విలువ రూ.49,26,79,933 చూపించారు. అలాగే, 2014లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల అఫిట్విట్లో మల్లారెడ్డి తన స్థిర ఆస్తుల విలువ రూ.48,85,25,332 గా పేర్కొన్నారు. -
మేడ్చల్ జిల్లాలో రాజకీయ సంద‘ఢీ’.. ప్రత్యర్థులెవరు?
సాక్షి, మేడ్చల్ జిల్లా: బరిలో నిలిచేదెవరు? గులాబీ పార్టీ అభ్యర్థులను ఢీకొట్టేదెవరు? అనే చర్చ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ఊపందుకుంది. అనూహ్యంగా అధికార బీఆర్ఎస్ జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీలో నిలిపే వారి పేర్లను ఖరారు చేయటంతో అభివృద్ధి కార్యక్రమాలతో పేరుతో ప్రచార హోరుతో ప్రజలకు వద్దకు వెళ్తున్నారు. ఉప్పల్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డిని కాదని కొత్త వారికి ఇవ్వగా.. మల్కాజిగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లికి టికెట్ ఇచ్చినప్పటికీ, తనయుడికి మెదక్ టికెట్ కేటాయించలేదని అధిష్టానంపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఇద్దరు సిట్టింగ్‌లు బీఆర్ఎస్లో ఇమడలేక.. బయటకు వెళ్లలేని సంకట పరిస్థితిలో సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. మరో పక్క అధికార పక్షం అభ్యర్థులకు దీటుగా.. విపక్షాలు ఎవరిని రంగంలోకి దింపుతాయనే ఉత్కంఠ అందరిలో ఉంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలేంటి అన్న చర్చ కూడా జోరుగా సాగుతుండగా.. ఆ పారీ్టలకు చెందిన ఆశావహులు మాత్రం పలు రాజకీయ, సామాజిక సమీకరణాల నేపథ్యంలో టికెట్ తమకే లభిస్తుందనే ధీమాతో వివిధ కార్యక్రమాల పేరుతో ప్రజల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల కోసం ఇప్పటికే పలువురు దరఖాస్తు చేసుకోగా, అధిష్టానం వడపోత కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. మల్కాజిగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును అధిష్టానం ప్రకటించినా.. తనయుడు రోహిత్‌కు మెదక్ టికెట్ కేటాయించలేదన్న అసంతృప్తితో మంత్రి హరీష్‌రావుపై నిప్పులు చెరిగారు. ఈ విషయంలో మైనంపల్లి తీరుపై సీఎం కేసీఆర్ సహా వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రుగా ఉండగా, అధిష్టానం కూడా ఆయనపై వేటుకు రంగం సిద్ధం చేసినట్లు బీఆర్ఎస్లో చర్చ సాగుతోంది. బీఆర్ఎస్లో ఉండలేక.. బయటకు వెళ్లలేని సంకట పరిస్థితిని మైనంపల్లి ఎదుర్కొంటుండగా, అధిష్టానం కూడా మైనంపల్లిపై చర్యలకు సిద్ధపడకుండా మెత్తపడినట్లు ప్రచారం. ఒకవేళ అధిష్టానం మైనంపల్లి హన్మంతరావుపై సీరియస్‌గా వ్యవహరిస్తే.. మల్కాజిగిరి నుంచి మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి లేదా ఎమ్మెల్సీ శంబీపూర్ రాజును బరిలో దింపవచ్చనే చర్చ సాగుతోంది. మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం ముగ్గురు నాయకులు దరఖాస్తు చేసుకున్నా పార్టీ జిల్లా అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌కే దక్కుతుందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మరో ఇద్దరు అన్నె వెంకట సత్యనారాయణ, బోనగిరి సురేష్‌యాదవ్ ఉన్నారు. మల్కాజిగిరిలో బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, కొత్తగా పార్టీలో చేరిన ఆకుల రాజేందర్, యువమోర్చా నాయకుడు భానుప్రకాష్ పోటీ పడుతున్నారు. మేడ్చల్ సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి చామకూర మల్లారెడ్డికి మళ్లీ మేడ్చల్ టికెట్ దక్కడంతో బలమైన పోటీదారుడుగా ప్రచార పర్వంలో ముందువరుసలో ఉన్నారు. గడపగడపకూ కాంగ్రెస్ అనే నినాదంతో పీసీసీ ఉపాధ్యాక్షుడు తోటకూరి వజ్రేష్(జంగయ్య)యాదవ్, అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడి నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం వీరితోపాటు రోయ్యపల్లి మల్లేష్‌గౌడ్, పిసరి మహిపాల్‌రెడ్డి, పి.బాలేష్, గువ్వ రవి దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే తొటకూరి వజ్రేష్(జంగయ్య)యాదవ్, రెడ్డి సామాజిక వర్గానికి కేటాయిస్తే హరివర్ధన్‌రెడ్డికి దక్కవచ్చనే ప్రచారం ఆ పారీ్టలో సాగుతోంది. బీజేపీ నుంచి పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు కొంపెల్లి మోహన్‌రెడ్డి, రూరల్ జిల్లా అధ్యక్షుడు పటోళ్ల విక్రంరెడ్డితో సహా రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షుడు, రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు, ఘట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఉప్పల్ ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డిని కాదని, బండారి లక్ష్మారెడ్డికి బీఆర్ఎస్కు అధిష్టానం టికెట్ కేటాయించడంతో కార్యకర్తల సమావేశాల పేరుతో నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తానేని తప్పు చేశానో చెప్పకుండా.. టికెట్ నిరాకరించడంపై ఆయన గుర్రుగా ఉన్నారు. అనుచరులు, కార్యకర్తలతో చర్చించి పది రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తానని పేర్కొన్న తీరుపై పార్టీలో తీవ్ర చర్చ సాగుతోంది. అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి మాత్రం ప్రజల మద్దతు పొందేందుకు అనుచరులతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఉప్పల్ టికెట్ కోసం ఆరుగురు నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఎం.పరమేశ్వర్‌రెడ్డి, సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి, మేకల శివారెడ్డి, పసుల ప్రభాకర్‌రెడ్డి, అమరిశెట్టి నరేందర్ ఉన్నారు. టికెట్ విషయంలో ముగ్గురి మధ్యే పోటీ ఉండగలదని పారీ్టలో ప్రచారం సాగుతోంది. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎన్ఎస్ఎస్ ప్రభాకర్‌తో పాటు మరో నాయకుడు పద్మారెడ్డి పోటీ పడుతున్నారు. అధిష్టానం మాత్రం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ వైపు మొగ్గు చూపవచ్చనే ప్రచారం పారీ్టలో సాగుతోంది. కూకట్పల్లి బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరోసారి కూకట్‌పల్లిలో ప్రచారం నిర్వహిస్తుండగా, కాంగ్రెస్ నుంచి కూకట్పల్లి టికెట్ కోసం 16 మంది నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ నుంచి దరఖాస్తు చేసుకున్న వారిలో గొట్టిముక్కల వెంగళరావు, సత్యం శ్రీరంగం, గాలివీర రామచంద్రబాలాజీ, పటోళ్ల నాగిరెడ్డి, వెలగపూడి వీవీస్ చౌదరి, మన్నె సతీష్‌కుమార్, ఆశపల్లి విజయచంద్ర, జాఫర్ అలీ, కొండకింది పుప్పారెడ్డి, దండుగుల యాదగిరి, మెడికొండ వెంకటమురళీ కృష్ణ, భక్త వత్సలం, జూలూరి ధనలక్ష్మీగౌడ్, పోట్లూరి శ్రీనివాస్‌రావు, దెరాటి మధుసాగర్, గొట్టిముక్కల పద్మరావు ఉన్నారు. కూకట్‌పల్లిలో బీజేపీ నుంచి అర్బన్ జిల్లా అధ్యక్షుడు పి.హరీష్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు మాధవరం కాంతారావు, కొత్తగా పార్టీలో చేరిన ప్రేమ్‌కుమార్ పోటీ పడుతున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. కుత్బుల్లాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ వివేకాందగౌడ్‌కు బీఆర్ఎస్ మళ్లీ టికెట్ కేటాయించడంతో.. అభివృద్ధి పనుల పేరుతో ప్రజల వద్దకు వెళ్తుండగా, కాంగ్రెస్ నుంచి టికెట్ కోసం 12 మంది నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. నర్సారెడ్డి భూపతిరెడ్డి, కొలన్ హన్మంతరెడ్డి, కందాడి జ్యోత్సదేవి, సొంటిరెడ్డి పున్నారెడ్డి, ఉసిరిక అప్పిరెడ్డి, మహ్మద్ నిజాముద్దీన్, గుంజ శ్రీనివాస్, బండి సత్యంగౌడ్, దూళిపాక సాంబశివరావు, పోలీసు సుమిత్రారెడ్డి, అహ్మద్ నిజామొద్దీన్, బోనగిరి ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. ఇక్కడ బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, మాజీ ఉపాధ్యక్షుడు ఎస్.మల్లారెడ్డి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. -
బీఆర్ఎస్లో తిరుగుబావుటా.. మంత్రి మల్లారెడ్డి ఆదేశాలు బేఖాతరు!
అధికార పార్టీ బీఆర్ఎస్లో తిరుగుబాటు జెండా ఎగురుతోంది. నగర పాలక సంస్థ, మున్సిపాలిటీల్లో సొంత పార్టీ మేయర్లు, చైర్మన్ల పైనే అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసులు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌కు అందజేయడం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. సాక్షి, మేడ్చల్ జిల్లా: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 13 పురపాలక సంఘాలు ఉండగా, మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు ఆయన ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. కలెక్టర్‌కు అవిశ్వాసం నోటీసులు సమర్పించడంపై బీఆర్ఎస్ కేడర్‌ను తీవ్ర అయోమయానికి గురిచేస్తోంది. సొంత బంధువులు ప్రాతినిధ్యం వహిస్తున్న పురపాలక సంఘాల్లో కూడా కౌన్సిలర్లు మంత్రి మల్లారెడ్డి గీత దాటడంతో పాటు విపక్షాలతో చేతులు కలపడం వంటి విషయాలు రాజకీయ వర్గాలను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాష్ట్రంలోనే అత్యధిక పురపాలక సంఘాలు కలిగిన శాసన సభా నియోజకవర్గంగా మేడ్చల్‌కు పేరుంది. ఇక్కడనే స్థానిక ఎమ్మెల్యే, మంత్రి మల్లారెడ్డి ఆదేశాలను బీఆర్ఎస్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పాటించక పోవడంతో పట్టును కోల్పోతున్నారన్న చర్చ పార్టీ వర్గాల్లో వ్యక్త మవుతోంది. అలాగే మేడ్చల్ నియోజకవర్గంలోని పలు పురపాలక సంఘాలకు చెందిన డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కూడా అదే పార్టీకి చెందిన మేయర్లు, చైర్మన్లపై అవిశ్వాసం నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన మంత్రి మల్లారెడ్డి వివిధ మార్గాల ద్వారా అసమ్మతి వాదులను బుజ్జగించే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. బుధవారం ‘మన ఊరు–మన బడి’ కింద మరమ్మతులు పూర్తయిన ప్రభుత్వ పాఠశాలల భవనాల ప్రారం¿ోత్సవానికి హాజరైన మంత్రి మల్లారెడ్డి పోచారం, పీర్జాదిగూడ, బోడుప్పల్ పురపాలక సంఘాల్లోని అసమ్మతి వాదులతో సమావేశమై.. బుజ్జగింపుల పర్వానికి తెర లేపినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా... మంత్రి మల్లారెడ్డిపై దాదాపు నెల రోజుల కిందట మల్కాజిగిరి ఎమ్మెల్యే, సీనియర్ బీఆర్ఎస్ నేత మైనంపల్లి హన్మంతరావు ఇంట్లో సమావేశమైన జిల్లాకు చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు పలు ఆరోపణలతో తిరుగుబావుటా ఎగురవేసిన విషయం తెల్సిందే. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలను ఖాతరు చేయకుండా నామినేటెడ్ పదవులను మంత్రి మల్లారెడ్డి సొంత నియోజకవర్గం వారికి కట్టబెట్టారని ఎమ్మెల్యేలు ఆరోపించారు. అలాగే తమ నియోజక వర్గాల్లో అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు విషయంలో కలెక్టర్‌ను మంత్రి పక్కదారి పట్టిస్తున్నారని ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి వ్యవహార శైలిపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యేలు అప్పట్లోనే మీడియా సమావేశంలో ప్రకటించారు. జవహర్‌నగర్ బాటలో మరికొన్ని.. మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్‌నగర్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్యపై 20 మంది కార్పొరేటర్లు ఇటీవల కలెక్టర్‌కు అవిశ్వాస నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. మేడ్చల్ మున్సిపల్ చైర్మన్ మర్రి దీపికపై 15 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం తీర్మానానికి సంబంధించిన నోటీసు కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు. తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ 2019 సె క్షన్ 37 అనుసరించి నో కాన్ఫిడెన్స్ మోషన్ పిటిషన్ చైర్మన్‌కు వ్యతిరేకంగా సమర్పిస్తున్నట్లు వారు నోటీసులో పేర్కొన్నారు. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మరో 4 పురపాలక సంఘాలకు చెందిన అధికార బీఆర్ఎస్కు చెందిన అ మ్మతి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అవిశ్వాసం నోటీసులు కలెక్టర్ కు అందజేసేందుకు సిద్ధమవుతున్నారు. -
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ నేతలపై నజర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టిసారించాయి. విచారణ పేరుతో ఇప్పటికే ఒకరి తర్వాత మరొకరికి నోటీసులు జారీ చేస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యనేతలు, వారి కుటుంబ సభ్యులపై ఈడీ, ఐటీ దాడులు నిర్వహిస్తుండటంతో ఇన్నాళ్ల పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన బంధువులు, ముఖ్య అనుచరులు, వ్యాపార భాగస్వాములు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం వీరిని చూస్తే చాలు ముఖం చాటేస్తున్నారు. ఈ కేసుల్లోకి తమను ఎక్కడ లాగుతారోననే భయంతో బెంబేలెత్తిపోతున్నారు. ఆరు నెలల క్రితం వరకు ఆయా నేతల దృష్టిలో పడేందుకు రోజంతా వారి ఇళ్లు, క్యాంపు ఆఫీసుల ఎదుట పడిగాపులుగాసిన వారు సైతం అటువైపు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. విదేశాల్లో క్యాసినో గేమ్స్‌తో మొదలు.. మెయినాబాద్ ఫాం హౌస్ కేంద్రంగా ఎమ్మెల్యేల కొనుగోలు అంశం వరకూ ఇలా ప్రతి కేసు జిల్లా నేతలకు, వారి ముఖ్య అనుచరులకు, ఆర్థిక బినామీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మనీలాండరింగ్ కేసులో మంచిరెడ్డికి మనీలాండరింగ్‌కు పాల్పడిన అభియోగంపై ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి ఆగస్టులో ఈడీ నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 26, 27 తేదీల్లో వరుసగా రెండు రోజుల పాటు తమ ఆఫీసుకు పిలిపించి 14 గంటలకుపైగా విచారించింది. 2014లో మంచిరెడ్డి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో పర్యటించారు. ఈ సమయంలో చేసిన ఖర్చులతో పాటు 2015లో ఇండోనేషియా వేదికగా గోల్డ్‌మైన్స్ సంస్థలో పెట్టుబడులు పెట్టారనే అభియోగంపై విచారణ చేపట్టింది. ప్రస్తుతం ఆ కేసు పెండింగ్‌లోనే ఉంది. సాక్షాత్తూ పార్టీ జిల్లా అధ్యక్షుడిపై మనీలాండరింగ్ ఆరోపణ లు రావడం, ఆయనకు ఈడీ నోటీసులు జారీ చేయడం, విచారణకు సైతం హాజరు కావడంతో జిల్లా రాజకీయాల్లో కలకలం సృష్టించింది. అప్పటి వరకు ఆయన అపాయింట్మెంట్ కోసం రోజుల తరబడి ఎదురు చూసిన వారు ఆ తర్వాత మంచిరెడ్డి ఎదురుపడితే సైలెంట్‌గా సైడై పోతుండటం గమనార్హం. అక్రమ ఆస్తుల కేసులో మంత్రికి మెడికల్ కాలేజీల్లో ఫీజుల వసూలు, పన్నుల ఎగవేత వంటి పక్కా సమాచారంతో మంత్రి చామకూర మల్లారెడ్డి ఇంటిపై ఇటీవల ఐటీ సోదాలు నిర్వహించింది. నవంబర్ 22న ఏకకాలంలో 50 బృందాలు బోయిన్‌పల్లిలోని ఆయన ఇల్లుతో సహా విద్యా సంస్థలు, ఆస్పత్రుల్లో సోదాలు చేపట్టింది. వరుసగా మూడు రోజుల పాటు కొనసాగిన దాడుల్లో మంత్రి అల్లుడు, కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు, బినామీలు, వ్యాపార భాగస్వాముల బ్యాంకు లావాదేవీల వివరాలు, లాకర్లు తెరిపించి పెద్ద మొత్తంలో ఆస్తులను గుర్తించారు. ఈ సమయంలో మంత్రితో పాటు 16 మందికి నోటీసులు జారీ చేశారు. ఆర్థిక అవకతవకల కోణంలో విచారించేందుకు ఈడీకి లేఖ రాసినట్లు ప్రచారం సాగుతోంది. అప్పటి వరకు మంత్రి వెంట మౌనంగా ఉన్న జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ప్రస్తుతం ఆయనపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. రెండు రోజుల క్రితం మైనంపల్లి ఫాంహౌస్ వేదికగా ముఖ్యనేతలంతా భేటీ కావడం, మంత్రి వ్యవహారశైలిపై బహిరంగ విమర్శలు చేస్తుండటం గమనార్హం. ప్రస్తుతం పైలెట్ మెయినాబాద్ ఫాం హౌస్(ఎమ్మెల్యేల ఎర) కేసులో కీలక ఫిర్యాదుదారుడిగా ఉన్న తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిపై ఈడీ దృష్టి సారించింది. బెంగళూరు డ్రగ్స్ కేసులోనూ ఆయన పేరు వినిపిస్తోంది. ఇటీవలే పైలెట్‌కు నోటీసులు జారీ చేయగా, అత్యంత నాటకీయ పరిణామాల మధ్య గత సోమవారం మధ్యాహ్నం విచారణ సంస్థ ముందు హాజరయ్యారు. ఏడు గంటల పాటు విచారించిన ఈడీ మరుసటి రోజు మళ్లీ హాజరు కావాల్సిందిగా సూచించింది. దీంతో రెండో రోజైన మంగళవారం కూడా ఆయన ఈడీ ముందుకు వెళ్లారు. ఎన్నికల అఫిడవిట్లో ఆయన చూపిన స్థిర, చర ఆస్తులు, ఆ తర్వాత ఆయన కూడబెట్టిన ఆస్తులు, విద్యార్హత, బ్యాంకు ఖాతాలు, పాస్‌పోర్టు, పాన్, ఆధార్ కార్డు వంటి వ్యక్తిగత వివరాలను ఆరా తీసినట్లు తెలిసింది. ఎమ్మెల్యేల ఎర కేసులో ఆయనపై అనేక ఆరోపణలు రావడం, సిట్ విచారణ కొనసాగుతుండటం, మరో వైపు ఈ కేసును సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తుండటం, ఇదే సమయంలో ఆయనకు ఈడీ నోటీసులు రావడం వంటి వరుస పరిణామాలు అధికార బీఆర్ఎస్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అప్పటి వరకు ఎమ్మెల్యేతో అంటకాగిన నేతలు, అనుచరులు, రియల్ ఎస్టేట్ వ్యాపార భాగస్వాములు ప్రస్తుతం పైలెట్ వెంట వెళ్లేందుకు జంకుతున్నారు. (క్లిక్ చేయండి: ప్లాట్ కొంటున్నారా..? తస్మాత్ జాగ్రత్త) -
ఐటీ దాడుల్లేని అద్భుత భారతం.. ఇప్పుడందరి చూపూ 2024 వైపే
నెట్లో ట్రెండ్ అవుతున్న తండ్రీ కూతుళ్ల సంభాషణ.. పనిచేసుకుంటున్న తండ్రిని ఏడేళ్ల పాప... ‘ఏం చేస్తున్నావ్ నాన్నా...’ అని అడుగుతుంది. ‘ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నానమ్మా..’ అని సమాధానం చెప్పగా, ‘ఇన్కమ్ ట్యాక్స్ అంటే...’ ఆ పాప ప్రశ్న. కొద్దిగా ఆలోచించి, కాస్త నిట్టూర్చి. ఇలా అంటాడు. ‘... నిన్నూ, అన్నను పోషిస్తున్నట్టే రాజకీయనాయకులను, అధికారులను పోషించాల్సిన బాధ్యత నా మీద ఉందమ్మా.. వాటికి డబ్బులు తీసిపెట్టడమే ఇన్కమ్ ట్యాక్స్..’ – ఈ జవాబులో నిజం కాస్తే ఉన్నా, కడుపు మంట ఎక్కువగా కనిపిస్తుంది. సగటు మనిషి, ఉద్యోగిపై ప్రతినెలా, ప్రతి ఏడాదీ ‘ఐటీ దాడులు’ జరుగుతూనే ఉంటాయిగా... అందుకే. ► చరిత్ర చూస్తే సగటుమనిషి కడుపు మంట నుంచి విప్లవాలు, లేదా విప్లవాత్మక ఆలోచనలు పుట్టుకురావడం కనిపిస్తుంది. కానీ, సాక్షాత్తూ ఓ మంత్రి కడుపుమంట నుంచి కూడా విప్లవాత్మక ఆలోచనలు రావడం ముదావహం, ఆహ్వానించదగ్గ విషయం. మంత్రి మల్లారెడ్డి పన్నులు లేని, ఐటీ దాడుల్లేని భారతావనిని స్వప్నిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీతో అది సాధ్యమని మనలో ఆశలు కల్పిస్తున్నారు. ఆయన మాటలు చూడండి. ‘‘కేసీఆర్ స్థాపించిన భారత రాష్ట్ర సమితి 2024లో అధికారంలోకి వస్తది. ఎవరిపైనా ఇన్కమ్ ట్యాక్స్ దాడులు ఉండవు. మా పాలనలో ఎవరైనా, ఎట్లయినా సంపాదించుకోవచ్చు. ఎవరికి వారే స్వచ్ఛందంగా, తమకు ఇష్టమైతేనే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే విధంగా కొత్త రూల్స్ తీసుకొస్తాం..’ – వందల కొద్దీ ఐటీ అధికారులు రెండు మూడు రోజులపాటు దాడి చేసి, నానా ప్రశ్నలు వేసి, రక రకాల డాక్యుమెంట్లు అడిగి, కాస్తో కూస్తో దొరి కిన కరెన్సీని ఎక్కడిదని ప్రశ్నించిన ఫ్రస్టేషన్లో పుట్టిందే .. ‘బీఆర్ఎస్ నాయత్వంలో పన్నులు లేని భారతదేశం’ ఐడియా అని అందరూ అపోహ పడుతున్నా, వినడానికి ఎంత బావుందో... అని అందరూ ఆనందపడ్డారు. చాయ్ వాలా... మిల్క్వాలా ‘చాయ్‌వాలా’ మోదీ మన గొంతులో బలవంతంగా పోస్తున్న జీఎస్‘టీ’ కన్నా ‘మిల్క్వాలా’ మల్లారెడ్డి మాటలే మనకు ‘బూస్ట్’నిస్తాయి. ఇలా జనాన్ని ఆనంద పెట్టడంలో, ముఖ్యంగా కుర్రకారును ఉత్సాహపరచడంలో, మోటివేట్ చెయ్యడంలో మల్లారెడ్డికి పెట్టిందిపేరు. విజయానికి తానే మోడల్ నంటూ కుండ బద్దలు కొట్టేసి, 23 మూడేళ్ల వయస్సులో సైకిల్‌పై పాలమ్మిన తాను దేశంలోని టాప్ టెన్ ‘ఎడ్యుకేషనిస్టు’గా, మంత్రిగా ఎదగడంలో తన అవిర ళ కృషిని తరచూ యువతకు గుర్తుచేస్తుంటారు. బాగా ఎదగాలని మోటివేట్ చేస్తుంటారు. షార్ట్‌కట్స్ కూడా చెబుతుంటారు. పాతికేళ్ల వయస్సులో, అదికూడా ఎవరితో పడితే వాళ్లతో ప్రేమలో పడకూడదని ముఫ్పై ఏళ్లు దాటాకా ఆ పని చేయాలని సూచిస్తుంటారు. ప్రేమ, పెళ్లి అంటే ‘ఐశ్యర్యారాయ్ అమితాబ్ కొడుకును పట్టినట్టుగా, జాక్‌పాట్ కొట్టినట్టుగా...’ ఉండాలని అమ్మాయిలకు మార్గనిర్దేశనం చేస్తారీ ఎడ్యుకేషనిస్టు. అలాగే అబ్బాయిలు ఎలా పెళ్లి చేసుకోవాలో, ఎలా ఆర్థికంగా స్థిరపడాలో హీరో రామ్‌చరణ్‌ను చూసి నేర్చుకోవాలని సరదాగా చెబుతుంటారు. అలా రిచ్‌గా ఎలా రూపొందాలో తరచూ చెప్పే మంత్రిగారు, ఇప్పడు ఆ రిచ్‌నెస్‌ను ఎలా కాపాడుకోవాలో యోచించి.. అలా కష్టపడి సంపాదించిన దానికి ట్యాక్స్ కట్టకపోవడమే మార్గంగా ఊహించి బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ‘ట్యాక్స్లెస్ కంట్రీ’గా ఇండియాను రూపొందించే పనిలో పడ్డారు. ఇక్కడ పన్ను బాధలేదు.. నిజానికి పన్ను బాధలేని దేశాలు చాలానే ఉన్నాయి. కొన్ని చోట్ల కాస్తో కూస్తో కడితే చాలు. మంత్రి గారి మాటలు నిజమైతే మనమూ ఇలా హ్యాపీగా ఉండొచ్చు.. మచ్చుకు కొన్ని.. ► యూఏఈలో వ్యక్తిగత ఆదాయ పన్ను మాటే లేదు. జనం ఎంత సంపాదించుకున్నా ఎలాంటి పన్నులూ ఉండవు. పైగా విదేశాల వారూ ఇక్కడ ఆస్తులు కొనుక్కోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు. అందుకే చాలామంది యూఏఈలో సెటిల్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంటారు. ► దక్షిణ అమెరికా ఖండంలో అందమైన బీచ్‌లు, కేసినోలతో అలరారే పనామా దేశం పన్ను రహిత స్వర్గంగా పేరుపొందింది. ఇక్కడి జనం ఆదాయ పన్ను కట్టే పనిలేదు. విదేశాల్లో వ్యాపారం చేసి సంపాదించిన డబ్బుకూ పన్ను కట్టనక్కర లేదు. దేశంలో చేసే వ్యాపారంపై మాత్రం, అదీ స్వల్పస్థాయిలో పన్నులు కడితే చాలు. ► బహమాస్‌లోనూ వ్యక్తిగత ఆదాయ పన్ను లేదు. అక్కడ స్థిరాస్తులు కొనుగోలు చేస్తే శాశ్వత నివాస అవకాశమూ ఉంటుంది. ► గల్ఫ్ దేశాలైన ఖతార్, కువైట్ కూడా ప్రజల నుంచి ఎలాంటి ఆదాయ పన్ను వసూలు చేయవు. వాణిజ్య కార్యకలాపాలపై మాత్రం ఖతార్‌లో పదిశాతం, కువైట్‌లో 15 శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. ► మరో గల్ఫ్ దేశం ఒమన్‌లో వ్యక్తిగత ఆదాయ పన్ను మాత్రమే కాదు.. ఆస్తి పన్ను, స్థిరాస్తులపై పన్ను వంటివీ లేవు. ► ఆధునిక సదుపాయాలకు నిలయమైన బెర్ముడాలోనూ పౌరులకు ఆదాయ పన్ను లేదు. ► మొనాకో, సైమన్ ఐలాండ్స్, వనౌటు వంటి దేశాల్లోనూ ఎలాంటి వ్యక్తిగత ఆదాయ పన్ను లేదు. వనౌటు దేశం అయితే డ్యూయల్ సిటిజన్ షిప్‌ను అధికారికంగానే అంగీకరిస్తుంది. ► యూరప్‌లో ఫ్రాన్స్, స్పెయిన్‌ల మధ్య స్వతంత్ర పాలిత ప్రాంతమైన ఆండోరాలో వ్యక్తిగత ఆదాయ పన్ను కేవలం పది శాతం, అదీ గరిష్ఠంగా 40 వేల యూరోలకే పరిమితం. వారసత్వ ఆస్తులు, బహుమతులపై ఎలాంటి ట్యాక్సులూ ఉండవు. ... మొన్నటికి మొన్న బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు జరుగుతుంటే, ఆ జెండా నుంచి గులాబీ రేకుల్లాగే... సగటు, వేతన జీవుల కళ్లల్లో, ఇంకా చెప్పాలంటే ధనిక, పేద తేడా లేకుండా అందరి కళ్లల్లో ఆనంద బాష్పాలు రాలిపడ్డాయి. కళ్ల ముందు పైన చెప్పిన పన్నులేని దేశాలు యూఏఈ, ఖతార్, కువైట్ ఇత్యాదులు అక్కడి ప్రజల ఆనందం కళ్లముందు కదలాడాయి. మల్లారెడ్డి హామీ ఇచ్చిన ‘ఐటీ దాడుల్లేని స్వప్నలోకం’ ఆవిష్కృతమైంది. ఇక ప్రతి బడ్జెట్లో ఆదాయ పన్ను శ్లాబులు మారతాయా అని కామన్ మ్యాన్ ఆశగా చూడక్కర్లేదు. డోర్ బెల్ మోగితే ఐటీ పటాలమేమోనని రిచ్‌మ్యాన్ గాబరా పడక్కర్లేదు. మన డబ్బంతా మనకే.. ... ఇప్పుడందరి చూపూ 2024 వైపే, అందరి ఆశా ఒక్కటే.. బీఆర్ఎస్ ఎర్రకోట ఎక్కాలి.. మల్లారెడ్డి ఆర్థిక మంత్రి కావాలి.. అంతే. (క్లిక్ చేయండి: పొలిటికల్ తిట్లలో పోషకాలెక్కువ...) -
మల్లారెడ్డి ఆదాయాలపై ఐటీ విచారణ: 13 మంది హాజరు.. మరో 10 మందికి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డికి చెందిన విద్యాసంస్థల ఆదాయం, పన్నుల చెల్లింపులకు సంబంధించి ఈ నెల 22, 23 తేదీల్లో ఐటీ అధికారులు నిర్వహించిన సోదాలపై విచారణ ప్రారంభమైంది. అధికారులు మరో పదిమందికి నోటీసులు ఇచ్చారు. మల్లారెడ్డి విద్యాసంస్థలు, ఆయన బంధువుల ఇళ్లు, ఓ సహకార బ్యాంకు చైర్మన్ ఇంటిపై ఏకకాలంలో నిర్వహించిన దాడుల్లో కోట్లాది రూపాయల నగదు స్వాధీనంతోపాటు పలు కీలకపత్రాలు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌డిస్క్‌లు, బ్యాంకు అకౌంట్లు, లాకర్లను పరిశీలించిన విషయం తెలిసిందే. మంత్రి కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి, సోదరుడు గోపాల్‌రెడ్డి, వియ్యంకుడు లక్ష్మారెడ్డి, వైద్య, ఇంజనీరింగ్ కళాశాలల డైరెక్టర్లు, కొందరు ప్రిన్సిపాళ్లు, అకౌంటెంట్లను మొత్తం 13 మందిని ఐటీ అధికారులు బషీర్‌బాగ్‌లోని ఐటీ కార్యాలయంలో దాదాపు ఆరు గంటలపాటు ప్రశ్నించారు. వైద్య కళాశాలల్లో డోనేషన్ల పేరుతో సుమారు వందకోట్ల రూపాయలు వసూలు చేసిన అంశానికి సంబంధించి ప్రధానంగా ఐటీ అధికారులు దృష్టి సారించినట్లు చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టిన పెట్టుబడులు, వస్తున్న ఆదాయానికి చెల్లించిన పన్ను మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించి వాటిపై ప్రశ్నించారు. సొసైటీ పేరిట ప్రభుత్వం నుంచి రాయితీలు తీసుకుంటూ, విద్యార్థుల నుంచి నిర్దేశిత ఫీజుల కంటే ఎక్కువ మొత్తాన్ని వసూలు చేసిన అంశంపై అధికారులకు లభించిన ఆధారాలను వారి ముందుంచి ప్రశ్నల వర్షం కురిపించారు. సోదాల్లో లభించిన అంశాలపై విడతలవారీగా ఐటీ అధికారులు విచారిస్తున్నారు. ఐటీ సోదాలు జరిగిన సమయంలో ఛాతీలో నొప్పితో ఆసుపత్రిలో చేరిన మహేందర్‌రెడ్డి కానీ, మంత్రి మల్లారెడ్డి కానీ సోమవారంనాటి విచారణలో లేరు. మంగళవారం మంత్రి మల్లారెడ్డి తరఫున ఆయన ఆడిటర్‌తోపాటు మరికొంతమంది విచారణకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ సోదాలకు సంబంధించిన పూర్తి సమాచారం వచ్చేవరకు వారిని ప్రశ్నించనున్నట్లు ఓ అధికారి వ్యాఖ్యానించారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాం: రాజశేఖర్ రెడ్డి, భద్రారెడ్డి ఆదాయపన్ను శాఖ అధికారులు ఇచ్చిన నోటీసుల మేరకు సోమవారం తాము, తమ సంస్థల డైరెక్టర్లు, ప్రిన్సిపాళ్లు, అకౌంటెంట్లు విచారణకు హాజరైనట్లు మర్రి రాజశేఖర్‌రెడ్డి, భద్రారెడ్డి విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. సోదాల్లో స్వా«దీనం చేసుకున్న పలు పత్రాలకు సంబంధించి ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇచ్చామన్నారు. కాల్‌డేటాను ఓ క్రమపద్ధతిలో ఇవ్వాలని కోరగా సరేనని చెప్పామని భద్రారెడ్డి వివరించారు. కాగా, మరో పదిమందికి ఐటీ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. చదవండి: టీఆర్ఎస్లో భగ్గుమన్న వర్గపోరు.. కన్నీటి పర్యంతమైన కార్పొరేటర్ -
Malla Reddy: మల్లారెడ్డి ఇంటిపై ఐడీ దాడుల్లో కొత్త ట్విస్ట్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, భాగస్వాములపై జరిగిన ఐటీ దాడుల అంశంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఐటీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సీఎండీ రత్నాకర్ పంచనామాపై తన అన్న మహేందర్‌రెడ్డితో బలవంతంగా సంతకం పెట్టించుకున్నారంటూ మల్లారెడ్డి చిన్న కుమారుడు భద్రారెడ్డి బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు రత్నాకర్ కూడా ఫిర్యాదు చేశారు. మంత్రి తన విధులు అడ్డుకోవడంతో పాటు కీలక పత్రాలు ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ మేరకు కేసులు నమోదు చేసుకున్న బోయిన్పల్లి పోలీసులు తదుపరి దర్యాప్తు నిమిత్తం దుండిగల్ పోలీసుస్టేషన్‌కు బదిలీ చేశారు. నా అన్నను బెదిరించారు.. మంత్రి మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్‌రెడ్డి ఐటీ సోదాల నేపథ్యంలో అస్వస్థతకు గురై మల్లారెడ్డి నారాయణ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కాగా బుధవారం రాత్రితో మహేందర్‌రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు పూర్తి చేసిన అధికారులు దానికి సంబంధించిన పంచనామా రూపొందించారు. దీనిపై సంతకం చేయించుకోవడానికి డిప్యూటీ డైరెక్టర్ రత్నాకర్ ఆస్పత్రికి వెళ్లారు. అయితే గుండె నొప్పితో చికిత్స పొందుతున్న తన అన్న మహేందర్‌రెడ్డిని బెదిరించి, బలవంతంగా వాటిపై సంతకాలు తీసుకున్నారంటూ మల్లారెడ్డి చిన్న కుమారుడు, సీఎంఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ, మల్లారెడ్డి సొసైటీల అధ్యక్షుడు భద్రారెడ్డి బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు రత్నాకర్‌పై ఐపీసీలోని 384 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు రూ.100 కోట్ల డొనేషన్లకు సంబంధిత పత్రాలపై కూడా ఐటీ అధికారులు మహేందర్‌రెడ్డి సంతకాలు తీసుకున్నట్టు సమాచారం. కాగా తమ వద్ద రూ.100 కోట్లు లేవని, మేనేజ్మెంట్ కోటా లేనప్పుడు డొనేషన్ ఎలా ఇస్తారని మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించారు. చదవండి: Hyderabad: ట్రాఫిక్ చిక్కులకు చెక్.. ఐటీ కారిడార్‌లో ఇక రయ్ రయ్! ల్యాప్‌టాప్, హార్డ్‌డ్రైవ్‌లు ఉన్న బ్యాగులు దొంగిలించారు.. ఇలావుండగా.. తాను పంచనామాపై సంతకం చేయించుకోవడానికి ఆస్పత్రికి వెళ్లినప్పుడు అక్కడకు తన అనుచరులతో కలిసి వచ్చిన మంత్రి మల్లారెడ్డి తన విధులకు ఆటంకం కలిగించారంటూ రత్నాకర్ గురువారం తెల్లవారుజామున 3.40 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పంచనామా సహా కొన్ని పత్రాలు చించేశారని, అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు బెదిరించారని పేర్కొన్నారు. ల్యాప్‌టాప్, హార్డ్ డ్రైవ్స్‌తో ఉన్న తన రెండు బ్యాగులు కూడా దొంగిలించారని ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా బోయిన్పల్లి పోలీసులు మల్లారెడ్డి తదితరులపై ఐపీసీలోని 342, 353, 201, 504, 506, 379 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ రెండు ఉదంతాలు చోటు చేసుకున్న మల్లారెడ్డి ఆస్పత్రి దుండిగల్ పోలీసుస్టేషన్ పరిధిలోకి వస్తుంది. దీంతో జీరో ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన అధికారులు తదుపరి దర్యాప్తు నిమిత్తం ఆ ఠాణాకు బదిలీ చేశారు. ఠాణా గేటు వద్ద ప్రత్యక్షమైన ల్యాప్‌టాప్! ఈ 2 కేసులు నమోదైన కొద్దిసేపటికే ఓ ల్యాప్‌టాప్ నాటకీయంగా బోయిన్పల్లి పోలీసుస్టేషన్ వద్ద ప్రత్యక్షమైంది. రత్నాకర్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. ఆయన ల్యాప్‌టాప్ సహా ఇతర వస్తువులు మల్లారెడ్డి ఇంట్లో ఉన్నాయా? ఎవరైనా తీసుకున్నారా? తదితర అంశాలు ఆరా తీశారు. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున 4.15 గంటల ప్రాంతంలో ఓ ల్యాప్‌టాప్ బోయిన్పల్లి పోలీసుస్టేషన్ గేటు వద్ద ప్రహరీని ఆనుకుని ఉండటం కానిస్టేబుళ్ల కంటపడింది. దీంతో వారు దాన్ని రత్నాకర్‌కు చూపించగా.. ఆ ల్యాప్‌టాప్ తనది కాదని, దాన్ని ఎవరో మార్చేశారని అన్నారు. దీంతో దాని పంచనామా నిర్వహించిన సిబ్బంది దుండిగల్ పోలీసులకు అప్పగించాలని నిర్ణయించారు. -
ఏకధాటిగా ఐటీ దాడులు.. స్పందించిన మంత్రి మల్లారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బలగాలతో తమపై పెద్ద ఎత్తున దాడులు చేశారని మంత్రి మల్లారెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ కుట్రలకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. తన పేరు ప్రతిష్టలు డ్యామేజ్ చేయాలనే దాడులు చేశారని ఆరోపించారు. తమనే కాదు, సీఎం కేసీఆర్‌ను కూడా ఏమీ చేయలేరని అన్నారు. ఈ విషయం కేసీఆరా్ ముందే చెప్పారన్నారు. తాము ఎంతో మంది పేద విద్యార్థులకు చదవు చెప్పించామని మల్లారెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు తమపై మూడు సార్లు ఐటీ దాడులు జరిగాయని.. కానీ ఇంత దౌర్జన్యం జీవితంలో ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. ‘ఐటీ అధికారులు నమ్మించి మోసం చేశారు. బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు. నా సంస్థలు ఓపెన్ బుక్.. నాది హై థింకింగ్, లో ప్రొఫైల్. కొడుకు, కోడలు ఆసుపత్రిలో ఉన్నారని చెప్పిన నన్ను విడిచిపెట్టలేదు. నా కొడుకుతో దౌర్జన్యంగా సంతకం చేయించుకున్నారు. రూ. 6లక్షలు దొరికితే అక్కడే విడిచిపెట్టిపోయారు. ఇప్పటి నుంచి విచారణకు రావాలని వేధిస్తారు. సంబంధిత వార్త: మల్లారెడ్డిపై ఐటీ దాడులు: సంచలనం రేపుతున్న ‘రూ.100 కోట్లు’ మెడికల్ సీట్లు అడ్మిషన్లలో అక్రమాలు జరిగాయంటున్నారు. మెడికల్ కాలేజీ డొనేషన్స్‌లో డబ్బులు గుంజుకున్నారని ఆరోపిస్తున్నారు. మెడికల్ సీట్లకు డొనేషన్ తీసుకోవట్లేదు. ఎంబీబీఎస్‌లో మెనేజ్మెంట్ కోటా లేదు. వివిధ క్యాటగిరీలతో అన్నీ కౌన్సిలింగ్ సీట్లే. అంతా ఆన్లైన్లోనే, కౌన్సిలింగ్‌లోనే జరుగుతుంది. మేనేజ్మెంట్ కోటా లేనప్పుడు డొనేషన్లు ఎలా వస్తాయి? వందల కోట్లు ఎలా వస్తాయి?. నా కొడుకు ఎంబీబీఎస్ చదవాలన్న డొనేషన్‌తో నా కాలేజీలో సీటు ఇప్పించలేను. మేము తీసుకుంటే డబ్బులు దొరకాలి కదా. మా ఇంట్లో, కొడుకులు, అల్లుడు, మా కళాశాల, ప్రొఫెసర్, టీచర్, క్లర్స్, ఇళ్లలో చేసిన సోదాలో 28 లక్షలు దొరికాయి’ అని తెలిపారు. చదవండి: మంత్రి మల్లారెడ్డికి ఐటీ నోటీసులు.. సోదాల్లో ఎంత నగదు దొరికిందంటే? -
మల్లారెడ్డి తన ఫోన్‌ను చెత్తబుట్టలో ఎందుకు దాచిపెట్టారు: రఘునందన్ రావు
సాక్షి, హైదరాబాద్: ఐటీ దాడులపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఖండించారు. మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని విమర్శించారు. ఈ అంశానికి రాజకీయ కోణాన్ని ఆపాదించడం సరికాదని సూచించారు. చట్టం ముందు అందరూ సమానమేనని తెలిపారు. ఏ అధికారి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఎవరినీ కొట్టరని అన్నారు. ఐటీ అధికారులకు వచ్చిన ఫిర్యాదు ప్రకారమే దాడులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. కొడుకును కొట్టారంటూ మల్లారెడ్డి చేసిన ఆరోపణలు సరైనవి కాదని హితవు పలికారు. మల్లారెడ్డి కొడుకు అస్వస్థతకు గురవ్వడంపై ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ.. ఎవరికి నోటీసులు ఇచ్చినా గుండె నొప్పి అంటూ ప్రతి ఒక్కరూ అసుపత్రికి వెళుతున్నారని మండిపడ్డారు. సోమవారం ఉదయం కూడా వాకింగ్ చేశరు కదా.. నోటీసులు ఇవ్వగానే గుండె నొప్పి వస్తుందా అని ధ్వజమెత్తారు. మల్లారెడ్డి సంస్థల్లో పని చేసే వారే ఐటీకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోందని తెలిపారు. సంబంధిత వార్త: ఆస్పత్రి ఎదుట మంత్రి మల్లారెడ్డి ధర్నా.. కుమారుడి ఆరోగ్యంపై డాక్టర్లు ఏం చెప్పారంటే.. మల్లారెడ్డి తన ఫోన్‌ను చెత్తబుట్టలో ఎందుకు దాచిపెట్టారని ప్రశ్నించారు. ఫోన్లు దాచిపెట్టుకున్నారంటేనే ఏదో జరిగిందని అర్థమవుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే సరిపోతుందని అన్నారు. మల్లారెడ్డి తప్పు చేయనప్పుడు విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. అధికారం అడ్డుపెట్టుకుని తప్పు చేసిన వారే భయపడతారని విమర్శించాఉ. మల్లారెడ్డి ఫైర్ మంత్రి మల్లారెడ్డి ఐటీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సురారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన కొడుకును చూసేందుకు వెళ్లిన మంత్రిని సీఆర్పీఎఫ్ బలగాలు అడ్డుకున్నాయి. దీంతో మల్లారెడ్డి ఆసుపత్రి బయట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తరువాత తిరిగి ఇంటికి వెళ్లారు. తన కొడుకును సీఆర్పీఎఫ్ బలగాలతో కొట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. కక్ష సాధింపుతోనే ఐటీ దాడులు జరుపుతోందని విమర్శించారు. -
మంత్రి మల్లారెడ్డి బంధువు ఇంట్లో భారీగా నగదు సీజ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సమీప బంధువు ఇంట్లో ఐటీ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. సుచిత్రలో నివాసం ఉంటున్న మల్లారెడ్డి బంధువు త్రిశూల్‌రెడ్డి ఇంట్లో రూ. 2కోట్లు సీజ్ చేశారు. త్రిశూల్ రెడ్డి కూడా కాలేజీలు నడుపుతుండగా ఉదయం నుంచి ఆయన ఇంట్లోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మంత్రి సెల్‌ఫోన్ స్వాధీనం కాగా మంత్రి మల్లారెడ్డి నివాసం, కార్యాలయాలపై ఐటీ సోదాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఏక కాలంలో మొత్తం 50 బృందాలుగా అధికారులు. మంత్రితోపాటు ఆయన బంధువుల నివాసాలు, కార్యాలయాల్లోనూ విస్త్రృత దాడులు నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి కొడుకు, అల్లుడు, సోదరుడు, వియ్యంకుడు ఇళ్లల్లో తనిఖీలు జరుపుతున్నారు. మంత్రి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కొత్త విషయాలు వెలుగులోకి మంత్రి మల్లారెడ్డి విద్యాసంస్థలపై జరుపుతున్న ఐటీ సోదాల్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. క్యాసినోలో పెట్టుబడులు పెట్టిన జైకిషన్ ఇంట్లో ఐటీ సోదాలు చేస్తోంది. జైకిషన్, మాధవరెడ్డి, చికోటి ప్రవీణ్‌లు కలిసి క్యాసినోలో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు. గతంలో కూడా జైకిషన్ ఇంట్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. జైకిషన్ తండ్రి నరసింహ, మంత్రి మల్లారెడ్డి వ్యాపార భాస్వాములు. సీఎంఆర్ స్కూల్స్‌లో నరసింహ యాదవ్, మల్లారెడ్డి పార్ట్‌నర్స్‌గా ఉన్నారు. దీంతో నరసింహయాదవ్, జైకిషన్ ఇళ్లల్లో ఐటీ దాడులు జరుపుతోంది. 14 విద్యాసంస్థల ప్రధాన కార్యాలయాల్లో ఐటీ తనిఖీలు చేపట్టింది. కాలేజీల ఆర్థిక లావాదేవీల రికార్డులు పరిశీలిస్తున్నారు. క్రాంతి బ్యాంక్ చైర్మన్ రాజేశ్వరరావు ఇంట్లో ఐటీ సోదాలు జరుపుతున్నారు. క్రాంతి బ్యాంక్‌లో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ లావాదేవీలు గుర్తించారు. అలాగే కన్వీనర్ కోటా సీట్లను ప్రైవేటు వ్యక్తులకు అమ్మినట్లు అధికారులు గుర్తించారు. నాలుగు మెడికల్ కాలేజీల లావాదేవీల పరిశీలిస్తున్నారు. సంబంధిత వార్త: మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ రైడ్స్.. ఒకేసారి 50 బృందాలతో.. -
Telidevara Bhanumurthy: బీఆర్ఎస్ అంటే ఏంది?
ఇయ్యాల ఆనగొట్టింది. రేపు ఎండ గొట్టొచ్చు. ఎల్లుండి సలిబెట్టొచ్చు. దినాలెప్పుడు ఒక్క తీర్గనే ఉండయి. మా తాత జమాన్ల విక్రమార్కుడు నడ్సుకుంట బొందలగడ్డ కాడ్కి బోయెటోడు. బేతాలుడు చెట్టు మీద ఉండెటోడు. గాన్ని బుజం మీదేస్కోని విక్రమార్కుడు నడ్సెటోడు. గాడు జెప్పేటి కత ఇని ఆకర్కి అడిగిన సవాల్‌కు జవాబ్ జెప్పెటోడు. మా నాయిన జమాన్ల విక్రమార్కుడు సైకిల్ మీద బొందలగడ్డ దిక్కుబోతే, సైకిలెన్క గూసోని బేతాలుడు కత జెప్పెటోడు. జమానా బదల్ గయా. గిప్పుడు విక్రమార్కుడు మోటర్ల బొందలగడ్డ కాడ్కి బోయి హారన్ గొడ్తున్నడు. గాడ రొండంత్రాల బంగ్లలున్న బేతాలుడు ఇవుతల కొస్తున్నడు. మోటరెన్క సీట్ల గూసుంటున్నడు. గాడు గూసోంగనే విక్రమార్కుడు మోటర్ నడ్పబట్టిండు. ఎప్పటి తీర్గనే ఎన్క గూసున్న బేతాలుడు కత జెప్పబట్టిండు. మున్పటి లెక్క గాకుంట గాల్లిద్దరు ముచ్చట బెట్టుకుంట మోటర్ల బోబట్టిండ్రు. ‘అయ్యగారు బెట్టిన మూర్తంల దస్రనాడు కేసిఆర్ కొత్త పార్టీ బెట్టిండు’ అని బేతాలుడన్నడు. ‘మల్ల టీఆర్ఎస్ ఏమైంది?’ విక్రమార్కుడు అడిగిండు. ‘టీఆర్ఎస్, బీఆర్ఎస్ అయింది. ముల్లు బోయి కత్తి వొచ్చె ఢాంఢాం. తెలంగాన బోయి భారతొచ్చె రాంరాం’. ‘గది వీఆర్ఎస్ అయితదా?’ ‘కేటీఆర్ ముక్యమంత్రి గావాలంటె కేసీఆర్‌కు వీఆర్ఎస్ తప్పది. ఎప్పటి సందో ప్రతాని కుర్సి మీద గూసున్నట్లు గాయినకు కలలొస్తున్నయి. తెల్లారి నాలుగ్గొట్టంగ బడేటి కలలు నిజమైతయని ఒక సన్నాసి గాయినకు జెప్పిండు’. ‘కేసీఆర్ ఏం జేసిండు?’ ‘కర్నాటక రాస్ట్రం బోయిండు. కుమారస్వామిని గల్సిండు. వొచ్చె అసెంబ్లీ ఎలచ్చన్ల కోట్లు ఇస్త అన్నడు. గట్ల మాట ఇచ్చినంకనే కేసీఆర్‌తోని కుమారస్వామి ఫోట్వ దిగిండు. గని గాయిన తోని పని గాదు. అడుగు మాడదు, అట్టు పేరదు. బిహార్ ముక్యమంత్రి నితీశ్ కుమార్‌నే గాకుంట లాలూప్రసాద్ యాదవ్‌ను గుడ్క కేసీఆర్ గల్సిండు. చౌతాలను గల్సిండు. అందరం ఒక్కటై బీజేపీతోని కొట్లాడ్దామని అన్నడు. గని అస్సయ్ అంటె అదే సహి, దూలా అంటె ఇదే సహి అనె తంద్కు గాల్లు టీఆర్ఎస్ మంత్రులసొంటోల్లు గారు. కేసీఆర్ కడ్మ రాస్ట్రాల రైతు లీడర్లకు గాడి కిరాయి లిచ్చిండు. గాల్లు పట్నమొస్తె దావత్ ఇచ్చిండు. రైతుబందు పద్కంను తారీఫ్ జెయ్యమన్నడు. దేసమంత గా పద్కం బెడ్తె మంచిగుంటదని గాల్లతోని జెప్పిచ్చిండు’. ‘బేతాలా! ఏ బట్ట కాబట్ట మాస్క అయితెనే మంచి గుంటది. ఒక రాస్ట్రం పద్కం ఇంకొక రాస్ట్రంకు మంచి గుండదు.’ ‘నివొద్దే. మన్మన్ని, పెండ్లాంను దీస్కోని కేసీఆర్ యాద్గిరిగుట్టకు బోయిండు. నర్సిమ్మసామికి కిల పదారు తులాల బంగారమిచ్చిండు. దేవుడా! నన్ను ప్రతానిని జేస్తె నీ గుడినంత బంగారం జేస్త అని మొక్కిండు’ ‘ఇంకేం జేసిండు?’ ‘పట్నంల బిహార్ కూలోల్లు సస్తె గాల్ల కుటుంబాలకు తలా పది లచ్చలు ఇచ్చి వొచ్చిండు. మహారాస్ట్ర బోయి తీస్ మార్కాన్ నన్నడు. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టి బెడ్తె టీఆర్ఎస్ లీడర్లు ఏం జేసిండ్రు! కొందరు దేస్ కీ నేతా కేసీఆర్ అని వొల్లిండ్రు. కొందరు గాయిన ఫోట్వలకు పాలతోని అబిసేకం జేసిండ్రు. ఇంకొందరు కోవ పేడలు బంచిండ్రు. పటాకులు గాల్చిండ్రు. వరంగల్ టీఆర్ఎస్ లీడర్ రాజనాల శ్రీహరైతె డిస్కో డాన్సు జేసిండు. హమాలోల్లకు తలా ఒక కోడి, కోటర్ విస్కి సీస ఇచ్చిండు. కేసీఆర్ ప్రతానమంత్రి అయితున్నడని సాటిచ్చిండు. ఇగ కేసీఆర్ ప్రతాని గావాలనుకుంట చౌటుప్పల్‌ల బువ్వ దినే ముంగట మంత్రి మల్లారెడ్డి టీఆర్ ఎసోల్లకు మందు బోసిండు. గాయిన విస్కి సీసలెందుకు బంచిండు? గీయిన మందు ఎందుకు బోసిండు? గీ సవాల్‌కు జవాబ్ జెప్పకుంటివా అంటె నీ మోటర్ బిరక్ ఫేలైతది’ అని బేతాలుడన్నడు. (క్లిక్: బాలకిష్న ముక్యమంత్రి అయితడు.. పాదయాత్రలు మనకెంద్కు బిడ్డా) ‘బీఆర్ఎస్ అంటె బిరండి, రమ్ము, స్కాచ్ అనుకోని ఒకలు విస్కి సీసలు బంచితె, ఇంకొకలు గిలాసలల్ల మందు బోసిండ్రు’ అని విక్రమార్కుడు జెప్పిండు. సరింగ గప్పుడే బొందల గడ్డొచ్చింది. మోటరాగింది. మోటర్ల కెల్లి దిగి బేతాలుడు ఇంటికి బోయిండు. (క్లిక్ చేయండి: చల్నేదో బాల్ కిషన్) - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
భూవివాదంలో కేసు నమోదు.. పరారీలో మంత్రి మల్లారెడ్డి బావమరిది
సాక్షి, హైదరాబాద్: గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని భూవివాదంలో మంత్రి మల్లారెడ్డి బావమరిది, గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ భర్త ముద్దుల శ్రీనివాస్ రెడ్డితో పాటు 15 మందిపై కేసు నమోదైంది. వారిలో ఎనిమిది మంది మహిళలు, ఇద్దరు వ్యక్తులు మొత్తం 10 మందిని రిమాండుకు తరలించినట్లు పేట్ బషీరాబాద్ పోలీసులు తెలిపారు. సీఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకా రం గుండ్లపోచంపల్లిలోని సర్వే నంబర్ 5,6లో ఉన్న భూ యజమానులు మల్లారెడ్డి, వేణునాయుడు మధ్య స్థలవివాదం నడుస్తోంది. మూడు రోజుల కిందట రాత్రి ఒంటి గంట సమయంలో మల్లారెడ్డికి సంబంధించిన వ్యక్తులు మద్యం సేవించి స్థలంలో ఉన్న కడీలను పడగొట్టి సెక్యూరిటీ సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేశారని తమకు అందిన ఫిర్యాదు మేరకు 15 మంది నిందితులపై కేసు నమోదు చేయగా అందులో 10 మందిని ఇప్పటికే రిమాండ్ తరలించామని చెప్పారు. మరో ఐదుగురిలో మంత్రి మల్లారెడ్డి బావమరిది శ్రీనివాసరెడ్డి, మల్లారెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, నర్సింహారెడ్డిలు పరారీలో ఉన్నారని తెలిపారు. చదవండి: దెయ్యం పట్టిందని వస్తే చుక్కలు చూపించిన భూత వైద్యుడు.. నిప్పులపై నడిపించి -
కీసరగుట్ట జాతరకు రూ.50 లక్షలు
Maha Shivratri in Telangana, 2022: మహాశివరాత్రి సందర్భంగా మేడ్చల్ జిల్లా కీసర గుట్టలో రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని మంత్రి మల్లారెడ్డి సూచించారు. ఈ మేరకు ఏర్పాట్లు, వసతుల కల్పనలో అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇన్చార్జి కలెక్టర్ హరీష్, జిల్లా అదనపు కలెక్టర్లు ఏనుగు నర్సింహారెడ్డి, జాన్ శ్యాంసన్‌తో కలిసి సంబంధిత శాఖల అధికారులు, పోలీసులు, కమిటీ సభ్యులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 27 నుంచి మార్చి 4 వరకు కీసరగుట్ట జాతర జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించి కమిటీలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.50 లక్షలు ప్రత్యేక నిధులు విడుదల చేసిందని తెలిపారు. భక్తులు ఎటువంటి అసౌకర్యం తలెత్తకుండా చూడాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ ఛైర్మన్ వెంకటేశం, పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి, ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ పావని, ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, ఆలయ చైర్మన్ ఉమాపతి శర్మ, ధర్మకర్తల మండలి సభ్యుడు నారాయణ శర్మ, డీఆర్ఓ లింగ్యానాయక్, ఆర్డీఓలు రవికుమార్, మల్లయ్య, ఆలయ ఈఓ కట్ట సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశానంతరం ఉత్సవాల ఏర్పాట్లను మంత్రి మల్లారెడ్డి పరిశీలించారు. (క్లిక్: దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో శాసనాల ప్రదర్శనశాల) -
సవాల్ చేస్తున్నా, ప్రభుత్వాన్ని రద్దు చేసి రమ్మను: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డిపై టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. మల్లారెడ్డి భూ ఆక్రమణలపై విచారణ జరిపించాలని ఆధారాలు ఇచ్చినా.. సీఎం కేసీఆర్ ఈ అక్రమాలపై ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. మల్లారెడ్డి యూనివర్సిటీకి సంబంధించి తప్పుడు పత్రాలతో అనుమతులు పొందారని ఆరోపించారు. గాంధీభవన్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన కొన్ని ఆధారాలు ఇస్తున్నానని, 50 ఎకరాలలో లేఅవుట్ వేస్తే, మామూళ్లు ఇవ్వాలని మల్లారెడ్డి బహిరంగంగా వసూలు చేశారని మండిపడ్డారు. ఈ అక్రమాలపై సీఎం కేసీఆర్ ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని నిలదీశారు. చదవండి: రేవంత్‌రెడ్డికి సాయంత్రం వరకు గడువిస్తున్నా: మల్లారెడ్డి గుండ్లపోచంపల్లిలో సర్వేనెంబర్ 650లో 22 ఎకరాల 8 గుంటలు మాత్రమే ఉందని, ఈ భూమి ఒక్కసారిగా ధరణి పోర్టల్‌కు వచ్చేసరికి 33 ఎకరాల 26 గుంటలుగా మారిందని అన్నారు. న్యాక్ గ్రేడింగ్ కోసం పెట్టిన పత్రాలన్ని పోర్జరీ పత్రాలని, ఆయన కాలేజీలను 5 ఏళ్లు న్యాక్ నిషేధించిందన్నారు. 420 సెక్షన్ కింద జైల్లో వేయాల్సిన మల్లారెడ్డిని మంత్రిని చేసిన ఘనత కేసీఆర్‌దేనని దుయ్యబట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో విజిలెన్స్ విచారణలో వందల కోట్లు దోపిడీ చేసిందని వెల్లడైందని పేర్కొన్న రేవంత్ రెడ్డి.. దత్తత పేరుతో గ్రామాలను తీసుకొని, ఫాంహౌస్‌కు రోడ్డు వేసుకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరిస్తే, ప్రజల తరపున ప్రశ్నించే హక్కు ప్రతిపక్షానికి లేదా అని ప్రశ్నించారు. చదవండి: Malla Reddy Vs Revanth Reddy: తొడగొట్టి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన మంత్రి మల్లారెడ్డి ‘ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పిచ్చి కుక్కలుగా, ఉన్మాదులుగా ప్రవర్తిస్తున్నారు. సమస్యను పక్కదారి పట్టించేందుకు చిల్లర వేషాలు వేస్తున్నారు. తిట్ల పోటీ పెట్టుకుందామంటే మేం రెడీ. ప్రగతి భవన్‌కు లేదా ఫాంహౌస్‌కు రమ్మన్నా వస్తా. మల్లారెడ్డి అవినీతిని కేటీఆర్, కేసీఆర్ సమర్థిస్తున్నారా? సవాల్ చేస్తున్నా.. ప్రభుత్వాన్ని రద్దు చేసి రమ్మను. అంత ధైర్యం లేకపోతే.. గజ్వేల్‌లో రాజీనామా చేయి.. తేల్చుకుందాం. మధ్యలో చెంచాలతో తొడగొట్టడాల్లేవ్. ముందస్తు ఎన్నికలకు వస్తే కాంగ్రెస్ బలం ఏంటో చూపిస్తాం’ అని కేసీఆర్, మంత్రి మల్లారెడ్డిపై రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. -
రేవంత్‌రెడ్డికి సాయంత్రం వరకు గడువిస్తున్నా: మల్లారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి బుధవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ(గురువారం) సాయంత్రం వరకు రేవంత్‌రెడ్డికి గడువు ఇస్తున్నానని, తన సవాల్‌ని స్వీకరించాలని అన్నారు. తన రాజీనామాకు కట్టుబడి ఉన్నట్లు మరోసారి స్పష్టంచేశారు. తాను సంపాదించిన ప్రతిరూపాయి తన కష్టార్జితమేనని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి.. కేటీఆర్, కేసీఆర్‌పైన వాడిన భాష చూసే తీవ్రస్థాయిలో స్పందించానని తెలిపారు. చదవండి: Malla Reddy Vs Revanth Reddy: తొడగొట్టి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన మంత్రి మల్లారెడ్డి బుధవారం తెలంగాణ భవన్లో మల్లారెడ్డి మాట్లాడుతూ.. ‘నువ్వు అబద్ధాలు, బ్లాక్మెయిల్ వ్యవహారాల్లో నంబర్ వన్ కదా. గురువారం నేను నా మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. దమ్మూ ధైర్యం ఉంటే నువ్వు పీసీసీ చీఫ్, ఎంపీ పదవులకు రాజీనామా చేస్తావా..’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. ‘నువ్వు గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఇప్పుడు, రేపు, రెండేళ్లు ఆగు అని సవాల్ చేసుడు కాదు.. దమ్ముంటే ఇప్పుడు పోటీ చేసి గెలిచి ట్రైలర్ చూపించు. ఓడినోళ్లు ముక్కు నేలకు రాసి ఇంటికి పోవాలే’అని మల్లారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. -
పేకాటలో దొరికిన మంత్రి మల్లారెడ్డి సోదరుడు
సాక్షి, కంటోన్మెంట్(హైదరాబాద్): రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి సోదరుడు చామకూర నర్సింహారెడ్డి (66) పేకాట ఆడుతూ పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. నర్సింహారెడ్డి గత కొద్దిరోజులుగా తన స్నేహితులతో కలసి న్యూ బోయిన్‌పల్లిలోని మల్లారెడ్డి గార్డెన్స్ ప్రాంతంలో ఓ ఫంక్షన్ హాల్లో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్ బృందం బుధవారం దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో నర్సింహారెడ్డి (66)తో పాటుగా కౌడి సాయిలు (44), నర్సింహారావు (65), హనుమంతు (58), సుదర్శన్‌రెడ్డి (64), మోహన్‌రెడ్డి (49), భాస్కర్‌రెడ్డి (49), గోవర్ధన్‌రెడ్డి (42), జనార్ధన్‌రెడ్డి (42), శ్రీనివాసరాజు (57), వెంగళ్‌రెడ్డి (43), నర్సిరెడ్డి (64), కృష్ణ (40)లు పేకాడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. వీరిని అరెస్టు చేసి విచారణ నిమిత్తం నిందితులను బోయిన్పల్లి పోలీసు స్టేషన్లో అప్పగించారు. నిందితుల నుంచి రూ.1,40,740ల నగదును 13 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. -
కబడ్డీ ఆడుతూ కిందపడ్డ మంత్రి మల్లారెడ్డి
బోడుప్పల్: తెలంగాణ క్రీడాకారులు పట్టుదల, కసితో క్రీడలు ఆడి జాతీయ స్థాయిలో అద్భుతాలు సృష్టించాలని రాష్ట్ర క్రీడాభివృద్ధి శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బోడుప్పల్‌లోని వైష్ణవి క్రికెట్ గ్రౌండ్లో మంగళవారం రాత్రి దివంగత చెర్ల ఆంజనేయులు యాదవ్ జ్ఞాపకార్థం టీఆర్ఎ అధ్యక్షుడు మంద సంజీవ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి 68వ కబడ్డీ సీనియర్ ఇంటర్ మెన్ అండ్ ఉమెన్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని అందులో భాగంగా హకీం పేట్లో స్పోర్ట్స్ స్కూల్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారులు అసమానతలు తొలగించి అందరం ఒకే కుటుంబం అనే భావన కల్పించాలన్నారు. క్రీడల్లో పైరవీలకు తావు లేదని, గెలవాలనే తపన, లక్ష్యం ఉన్న క్రీడాకారులనే రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చదువుతోపాటు క్రీడలను ప్రోత్సహిస్తున్నారని, క్రీడల్లో రాణించే వారికి 2 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ శామీర్‌పేట్‌లో 250 ఎకరాల్లో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. క్రీడాకారులు రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో నిలిపేందుకు కృషి చేయాలన్నారు. కబడ్డీ ప్రాచీణమైనదని, క్రికెట్‌ను తలదన్నేలా కబడ్డీ క్రీడాకారులు రాణించాలన్నారు. తొలుత కబడ్డీ సంఘం పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిన్నారుల భరత నాట్యం ఆహుతులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, కార్యదర్శి జగదీశ్ యాదవ్, మేయర్లు సామల బుచ్చిరెడ్డి, జక్క వెంకట్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. కిందపడ్డ మల్లారెడ్డి కబడ్డీ పోటీల ప్రారంభంలో భాగంగా మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, చామకూర మల్లారెడ్డి కబడ్డీ ఆడారు. ఇరువురు రెండు జట్టులుగా ఏర్పడి కబడ్డీ ఆడుతుండగా కూతకు వెళ్లిన మల్లారెడ్డి గ్రౌండ్లో వేసిన మ్యాట్ జారడంతో కింద పడిపోయారు. దీనిని గమనించిన మంత్రి శ్రీనివాస్ మల్లారెడ్డిని లేపి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోబెట్టారు. -
తెలంగాణ అసెంబ్లీలో నవ్వులపువ్వులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డి మాటలతో మళ్లీ అసెంబ్లీ ఘోల్లున నవ్వింది. ఆయన వ్యాఖ్యలతో స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలు విరగబడి నవ్వారు.. నవ్వుల పువ్వులు విరిసాయి. సీఎం కేసీఆర్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం మంత్రి మల్లారెడ్డి సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లే దేశాన్ని కూడా కేసీఆర్ ప్రగతిపథంలోకి తీసుకెళ్తారని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. కేసీఆర్ ప్రధాని అయితే ప్రజలకు సమస్యలే ఉండవని తెలిపారు. దేశ చరిత్ర మారిపోతుందని తెలిపారు. 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ప్రైవేటీకరణ పేరుతో కేంద్ర ప్రభుత్వం కార్మికులను రోడ్డున పడేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ చూపు తెలంగాణ వైపు ఉందని పేర్కొన్నారు. మనం ఎదుగుతుంటే ఓర్వలేకుంటా.. అంటూ తడబడి ఇదే నా సవాల్ అని చెప్పడంతో ప్రతిపక్షంతో పాటు అధికార పక్షం సభ్యులు కూడా నవ్వారు. ఒక్కసారి.. ఒక్కసారి అంటూ సీఎం కేసీఆర్‌ను పీఎం కావాలని కోరారు. ఈ శాఖ పద్దు చాలా చిన్నది అని చమత్కరిస్తూనే సభ్యులందరూ సహకరించి ఆమోదం తెలపాలని మంత్రి మల్లారెడ్డి విజ్ఞప్తి చేశారు. -
మల్లన్నా.. ఏందన్నా ఇది?
శామీర్‌పేట్: రైతు వేదికలను ప్రారంభించేందుకు గాను రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి శుక్రవారం మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలంలో పర్యటించారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు రామ మందిరం నిర్మాణంపై కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ చేసిన వ్యాఖ్యలకు ఖండిస్తూ మజీద్‌పూర్ వద్ద మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్‌ని ఆపి నిరసన తెలిపేందుకు రాజీవ్‌రహదారిపై బైఠాయించారు. దీనిపై సమాచారం అందడంతో మంత్రి కాన్వాయ్ అలియాబాద్ చౌరస్తా వరకు రాజీవ్ రహదారిలో రాంగ్ రూట్లో అక్కడి నుంచి వెళ్లి పోయారు. రాంగ్ రూట్ లో వెళ్లిన మంత్రి వాహనాలకు ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధిస్తారా లేదా అని స్థానికులు చర్చించుకుంటున్నారు. -
మంత్రి మల్లారెడ్డిపై పోలీసు కేసు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై భూ కబ్జా కేసు నమోదైంది. మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. తన భూమిలో మల్లారెడ్డి అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ.. కుత్బుల్లాపూర్ మండలం సూరారంకు చెందిన శ్యామలదేవి అనే మహిళ మల్లారెడ్డిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మల్లారెడ్డి చెరలో ఉన్న భూమిని విడిపించాలంటూ ఓ న్యాయవాదిని సంప్రదిస్తే.. ఆయనతోనే మంత్రి మల్లారెడ్డి కుమ్మకై తప్పుడు పత్రాలు సృష్టించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళ ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు చేశారు. (చదవండి : భార్యను హతమార్చి.. పక్కనే వీడియో గేమ్ ఆడుతూ!) -
‘ఆ చెరువును కాపాడతా’
సాక్షి, మేడ్చల్: నాగారంలోని అన్నరాయని చెరువు పరిరక్షణకు కృషి చేస్తానని మంత్రి చామకూర మల్లారెడ్డి హామీయిచ్చారు. అన్నరాయని చెరువు పరిరక్షణ సమితి సభ్యులు, హెల్పింగ్ హ్యాండ్స్ హ్యుమానిటీ స్వచ్ఛంద సంస్థ సభ్యులు శనివారం మంత్రిని ఆయన నివాసంలో కలిశారు. చెరువును కాలుష్య కాసారంగా మార్చిన డ్రైనేజీని మళ్లించి, పూర్వవైభవం తీసుకురావాలని కోరారు. చెరువు చుట్టూ కట్ట నిర్మించి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని, మొక్కలు నాటించాలని మంత్రికి సభ్యులు విజ్ఞప్తి చేశారు. గతంలో మిషన్ కాకతీయ పథకం కింద చెరువు అభివృద్ధి పనులకోసం విడుదలయిన నిధుల గురించి ఆరా తీస్తామని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. అప్పటికప్పుడు నాగారం మున్సిపల్ కమిషనర్‌తో ఫోన్లో మాట్లాడి చెరువును పరిశీలించి పరిరక్షణ సమితి అడిగిన పనుల గురించి వివరాలు తెలియచేయలని ఆదేశించారు. పరిరక్షణ సమితి సభ్యులు ఇచ్చిన అభ్యర్థనపై మేడ్చల్-మల్కాజ్గిరి నీటిపారుదల శాఖ డిప్యూటీ ఇంజినీర్ స్పందించాలని సూచించారు. మంత్రి మల్లారెడ్డిని కలిసిన వారిలో మామిడాల ప్రశాంత్, కొమిరెల్లి సుధాకర్ రెడ్డి, బోగి వెంకట్, విజయశేఖర్, వీరేశం, కృష్ణమాచార్యులు, మల్లారెడ్డి, రఘుపతి, శర్మ, వివేక్, శ్రీనివాసరెడ్డి, సుధాకర్, నరసింహులు తదితరులు ఉన్నారు. తర్వాత పరిరక్షణ సభ్యులు నాగారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్‌ను కలిసి మంత్రికి ఇచ్చిన వినతిపత్రాన్ని అందించారు. -
నాడు ఇంద్రారెడ్డి.. నేడు మల్లారెడ్డి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాకు మరోసారి కార్మికశాఖ లభించింది. ఉమ్మడి రాష్ట్రంలో కార్మిక శాఖ మంత్రిగా పట్లోళ్ల ఇంద్రారెడ్డి ప్రాతినిథ్యం వహించగా.. తాజాగా జరిగిన కేబినెట్ విస్తరణలో బెర్త్ దక్కించుకున్న చామకూర మల్లారెడ్డిని అదే శాఖతో పాటు స్త్రీ శిశు సంక్షేమ శాఖ వరించింది. మేడ్చల్ శాసనసభ్యుడిగా తొలిసారి విజయం సాధించిన మల్లారెడ్డి మంగళవారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో ప్రమాణస్వీకారం చేశారు. 2014లో మల్కాజిగిరి ఎంపీగా టీడీపీ తరఫున గెలుపొందిన మల్లారెడ్డి ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ ఎమ్మెల్యేగా బరిలో దిగి భారీ మెజార్టీతో విజయం సాధించారు. మంగళవారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో సీఎం కేసీఆర్.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కోటాలో చామకూరకు అవకాశం కల్పిం చారు. మృదుస్వభావి, హాస్యచతురుడైన మల్లారెడ్డికి ఆమాత్య హోదా కట్టబెట్టడం సమంజసమని కేసీఆర్ భావించినట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణలను కూడా పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి.. గ్రేటర్ పరిధిలో బలమైన రెడ్డి సామాజికవర్గాన్ని దృష్టిలో ఉంచుకొని చామకూరకు చాన్స్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. నాడు ఇంద్రారెడ్డి.. నేడు మల్లారెడ్డి తొలిసారే మంత్రి పదవి దక్కించుకున్న మల్లారెడ్డికి కార్మికశాఖతో పాటు స్త్రీ శిశు సంక్షేమ శాఖను కేటాయిస్తూ మంగళవారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ శాఖను మన జిల్లా నుంచి ఇంద్రారెడ్డి నిర్వర్తించారు. ఆ తర్వాత ఇప్పుడు మల్లారెడ్డికి ఈ పోర్టుపొలియో లభించింది. గత ప్రభుత్వ హయాంలో రవాణాశాఖ మంత్రిగా పనిచేసిన మహేందర్‌రెడ్డి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓడిపోవడంతో అదే శాఖను మల్లారెడ్డికి కట్టబెడుతారనే ప్రచారం జరిగింది. అదేసమయంలో ఆయన వ్యవహారశైలిని అంచనా వేసిన విశ్లేషకులు.. ఆయనకు క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖలు దక్కుతాయని అంచనా వేశారు. అయితే, పరిశీలకుల ఊహలకందని విధంగా కార్మిక శాఖను సీఎం అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. కాగా, మంత్రి కావాలనే చిరకాల వాంఛ నెరవేరడంతో మల్లారెడ్డి ఆనందంలో మునిగిపోయారు. అమాత్య పదవిపై కన్నేసిన ఆయన ఎంపీ పదవిని కాదని ఎమ్మెల్యేగా పోటీచేయడం.. విజయం సాధించడం.. మంత్రి పదవిని దక్కించుకోవడం చకచకా జరిగిపోయాయి. ఇదిలావుండగా, ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న మేడ్చల్, పరిసర కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో పరిశ్రమలు భారీగా ఉండడం.. కార్మికులు కూడా రాష్ట్రంలోనే అత్యధికంగా ఇక్కడ పనిచేస్తుండడం ఆయన పనితీరును ప్రభావితం చేయనుంది. శుభాకాంక్షలు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చామకూర మల్లారెడ్డికి జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు. పలువురు నాయకులతో కలిసి బోయిన్‌పల్లిలోని మంత్రి నివాసానికి వెళ్లారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అనంతరం మల్లారెడ్డికి పూల మొక్కను బహూకరించారు. ఆమెతో జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు సంజీవ్‌రెడ్డి, శైలజ, రమాదేవి తదితరులు ఉన్నారు. -
‘మంత్రి అవుతానని కలలో కూడా అనుకోలేదు’
సాక్షి, హైదరాబాద్: తనపై నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతను అప్పగించిన సీఎం కేసీఆర్‌కు మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి అవుతానని కలలో కూడా అనుకోలేదని, కేసీఆర్‌కు ఎప్పటికీ విధేయత కలిగివుంటానని అన్నారు. చిన్నప్పటి నుంచి పేదల కోసం కష్టపడి పనిచేసినట్టు వెల్లడించారు. తనకు మంత్రి పదవి దక్కడమే ఎక్కువని, ఏ శాఖ అప్పగించినా సమర్థవంతంగా పనిచేస్తానని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపతానని, బంగారు తెలంగాణ సాధనకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. అదృష్టంగా భావిస్తున్నా: నిరంజన్ రెడ్డి కేసీఆర్‌తో పనిచేయడం తన అదృష్టమని ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డి అన్నారు. తొలిసారి గెలిచినా తనను మంత్రిని చేశారని సంతోషం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయినప్పటికీ తనకు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి ఇచ్చారని గుర్తు చేశారు. ఆ అనుభవం మంత్రిగా పనిచేయడానికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. (నేడే కేసీఆర్ కేబినెట్ విస్తరణ) కేసీఆర్‌కు స్పష్టత ఉంది: జగదీశ్‌రెడ్డి రెండోసారి మంత్రి కావడం ఆనందంగా ఉందని జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ ఏ బాధ్యత ఇచ్చిన సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు. ప్రజలకు, పార్టీకి విధేయుడిగా పనిచేస్తానన్నారు. నల్గొండలో టిఆర్ఎస్ జెండా ఎగరడం లో తమ వంతు కృషి చేశానని, ఈ అంశం కూడా మంత్రి పదవి రావడానికి దోహదపడిందన్నారు. గతంలో తాను నిర్వహించిన విద్యుత్ శాఖ పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నట్టు వెల్లడించారు. అనేక సమీకరణాలతో మంత్రి వర్గాన్ని విస్తరించారని, ఎవరి సేవలను ఎక్కడ ఉపయోగించుకుకోవాలనే దానిపై సీఎం కేసీఆర్‌కు స్పష్టత ఉందన్నారు. -
ఎంపీ పదవికి టీఆర్ఎస్ నేత మల్లారెడ్డి రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ: మల్కాజ్గిరి ఎంపీ, టీఆర్ఎస్ నాయకుడు చామకూర మల్లారెడ్డి లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. శుక్రవారం లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన మల్లారెడ్డికి స్పీకర్ అభినందనలు తెలిపారు. తాజాగా ముగిసిన తెలంగాణ శానససభ ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి ఆయన భారీ ఆధిక్యంతో గెలుపొందారు. సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిపై 87,990 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. తెలంగాణ కొత్త మంత్రి మండలిలో మల్లారెడ్డికి చోటు దక్కనుందని ప్రచారంలో జరుగుతోంది. పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. చెన్నూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.