
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని భూవివాదంలో మంత్రి మల్లారెడ్డి బావమరిది, గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ భర్త ముద్దుల శ్రీనివాస్ రెడ్డితో పాటు 15 మందిపై కేసు నమోదైంది. వారిలో ఎనిమిది మంది మహిళలు, ఇద్దరు వ్యక్తులు మొత్తం 10 మందిని రిమాండుకు తరలించినట్లు పేట్ బషీరాబాద్ పోలీసులు తెలిపారు. సీఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకా రం గుండ్లపోచంపల్లిలోని సర్వే నంబర్ 5,6లో ఉన్న భూ యజమానులు మల్లారెడ్డి, వేణునాయుడు మధ్య స్థలవివాదం నడుస్తోంది.
మూడు రోజుల కిందట రాత్రి ఒంటి గంట సమయంలో మల్లారెడ్డికి సంబంధించిన వ్యక్తులు మద్యం సేవించి స్థలంలో ఉన్న కడీలను పడగొట్టి సెక్యూరిటీ సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేశారని తమకు అందిన ఫిర్యాదు మేరకు 15 మంది నిందితులపై కేసు నమోదు చేయగా అందులో 10 మందిని ఇప్పటికే రిమాండ్ తరలించామని చెప్పారు. మరో ఐదుగురిలో మంత్రి మల్లారెడ్డి బావమరిది శ్రీనివాసరెడ్డి, మల్లారెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, నర్సింహారెడ్డిలు పరారీలో ఉన్నారని తెలిపారు.
చదవండి: దెయ్యం పట్టిందని వస్తే చుక్కలు చూపించిన భూత వైద్యుడు.. నిప్పులపై నడిపించి
Comments
Please login to add a commentAdd a comment