Land dispute case
-
కంటతడి పెట్టిస్తున్న అమ్మ ప్రేమ.. తెగిపడిన కుమారుడి తలను ఒడిలో పెట్టుకుని లాలిస్తూ.. రోదిస్తూ
లక్నో: అయ్యో బిడ్డా.. అప్పుడే నీకు నూరేళ్లు నిండాయా! ఉన్నతంగా చదువుకుని నన్ను, మీ నాయనను మంచిగా చూసుకుంటావని చెబితవిగా ..అప్పుడే ఇంత పనైందేంది బిడ్డా అంటూ.. అల్లంతా దూరాన మొండం.. పక్కనే తెగి పడిన కుమారుడి తలను ఒడిలోకి తీసుకుని లాలిస్తూ.. రోదిస్తున్న తీరు చూసి చూపరులు కన్నీటి పర్యంతమయ్యారు.ఉత్తరప్రదేశ్‌లో భూ తగాదా ఓ 17 ఏళ్ల అనురాగ్‌ను బలి తీసుకున్నాయి. రెండు వర్గాల మధ్య జరిగిన భూ తగాదాలో ఓ వర్గం ప్రత్యర్థి వర్గానికి చెందిన బాలుడిని తలను నరకడంతో భయానక వాతావరణం నెలకొంది.గౌరబాద్‌షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కబీరుద్దీన్ గ్రామంలో రెండు వర్గాల మధ్య భూతగాదా కొన్నేళ్లుగా కొనసాగుతూ వస్తుంది. తాజాగా, బుధవారం రోజు ఘర్షణ హింసాత్మకంగా మారింది. భూ తగాదాలో రామ్ జీత్ యాదవ్ కుటుంబం సభ్యులపై ప్రత్యర్థి వర్గం దాడులకు తెగబడింది. ఈ దాడులు జరిగే సమయంలో ప్రత్యర్థులు మారణాయుధాలతో రామ్ జీత్ కుమారుడు అనురాగ్ వెంటబడ్డారు.నిందితుల్లో ఓ వ్యక్తి అనురాగ్ తలను పదునైన కత్తి నరికాడు. దీంతో అతడి తల, మొండెం వేరయ్యాయి. అనంతరం నిందితుడు పరారయ్యాడు. అయితే కుమారుడి మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కొన్ని గంటల పాటు కుమారుడి తలను ఒడిలోకి తీసుకొని గుండెలవిసేలా రోదిస్తున్న తల్లిని చూసేవారి కళ్ళు కూడా చెమర్చాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దారుణానికి ఒడిగట్టిన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
పరారీలో టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డి
సాక్షి, నంద్యాల/సాక్షి, హైదరాబాద్: టీడీపీ నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డిని ఓ భూ వివాదం కేసులో అరెస్టు చేసేందుకు తెలంగాణ పోలీసులు ప్రయత్నించారు. ఆయన వారి కళ్లుగప్పి పరారయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన భార్యను, కుమారుడిని హైదరాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసైన్డ్ భూముల కొనుగోలు పంచాయితీకి సంబంధించి భాగస్వాముల వివాదాలతో హైదరాబాద్ నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్)లో కేసులు నమోదయ్యాయి. వీటిని దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో మాజీ పోలీసు అధికారి అయిన శివానందరెడ్డి నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూములు కొనుగోలు చేయడం, వాటిలో నిర్మాణాల పేరుతో ప్రీలాంచ్ ఆఫర్లు ఇచ్చి అడ్వాన్సులు వసూలు చేయడం వంటి పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో శివానందరెడ్డిని అరెస్టు చేసేందుకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు సోమవారం నంద్యాల జిల్లా అల్లూరు గ్రామంలో ఆయన ఇంటికి వచ్చారు. భూ కబ్జాకు సంబంధించిన కేసులో విచారణకు సహకరించాలని ఆయన్ని కోరారు. నోటీసులు ఇవ్వకుండా తాను సహకరించనని మాండ్ర చెప్పారు. దీంతో పోలీసులు నోటీసులను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు శివానందరెడ్డి ఇంటికి చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలోనే శివానందరెడ్డి పోలీసుల కళ్లుగప్పి కారులో పరారయ్యారు. ఆయన్ని వెంబడించేందుకు ప్రయత్నించిన పోలీసుల్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులు బయటికి వెళ్లకుండా ఆయన అనుచరులు గేట్లు మూసేశారు. దీంతో మాండ్ర తప్పించుకుని పారిపోయారు. దీంతో హైదరాబాద్‌లో ఉన్న సీసీఎస్ పోలీసులు నగరంలోని తారామతి బారాదారి వద్ద ఉన్న వెస్సెల్లా మెడోస్‌లోని శివానందరెడ్డి ఇంటిపై దాడిచేశారు. ఆయన భార్య ఉమాదేవిని, కుమారుడు కనిష్్కరెడ్డిని, ప్రశాంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని సీసీఎస్ కార్యాలయానికి తరలించారు. పరారీలో ఉన్న శివానందరెడ్డి కోసం పోలీసులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటకలోను ముమ్మరంగా గాలిస్తున్నారు. శివానందరెడ్డి తమ విధులకు ఆటంకం కలిగించి పరారయ్యారని సీసీఎస్ పోలీసులు బ్రాహ్మణకొట్కూరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో శివానందరెడ్డి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తాను భూ కబ్జాలకు పాల్పడలేదని, కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇస్తే విచారణకు సహకరిస్తానని అందులో పేర్కొన్నారు. బుద్వేల్లోని అసైన్డ్ భూములు కేంద్రంగా.. సీఐడీలో సైబర్ క్రైమ్ ఎస్పీగా పనిచేస్తూ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న శివానందరెడ్డి 2019లో తెలుగుదేశం పార్టీ తరఫున నంద్యాల ఎంపీ అభ్యరి్థగా పోటీచేసి ఓడిపోయారు. ఇప్పుడు టీడీపీ నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జిగా ఉన్న ఆయన హైదరాబాద్ బుద్వేల్లోని అసైన్డ్ భూములు కేంద్రంగా పాల్పడిన నేరం బయటపడింది. రాజేంద్రనగర్ శివారులో ఉన్న ఈ ప్రాంతంలోని 282, 283, 284, 289 సర్వే నంబర్లలో 480 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని 1986లో అప్పటి ప్రభుత్వం అసైన్డ్ ల్యాండ్‌గా ప్రకటిస్తూ దళితులకు పంపిణీ చేసింది. అనంతర పరిణామాల నేపథ్యంలో 1997లో అప్పటి ప్రభుత్వం ఈ భూముల్ని వెనక్కి తీసుకుంది. దీన్ని సవాల్ చేస్తూ అసైనీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత అక్కడున్న అసైనీలతోపాటు అప్పటికే ఆ స్థలాల్లో ఉంటున్న వారికీ న్యాయం చేయాలని ఆదేశాలొచ్చాయి. 2008లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఒక్కో అసైనీకి 800 చదరపు గజాలు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వారికి విక్రయించే హక్కుల్ని మాత్రం ఇవ్వలేదు. దీంతో అసైనీలు విక్రయహక్కుల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం మీద ఒక్కో అసైనీకి 800 చదరపు గజాల చొప్పున 66 మందికి, ఆ స్థలంలో ఉంటున్న ఒక్కొక్కరికి 400 చదరపు గజాల చొప్పున 82 మందికి ఇచ్చే ప్రయత్నాలు జరిగాయి. భాగస్వాముల విభేదాలతో.. ఈ నేపథ్యంలో ఈ భూముల కోసం టి.జె.ప్రకాష్, కోనేరు గాంధీ, ఎస్.దశరథరామారావు రంగంలోకి దిగారు. అసైనీలుగా ఉన్న గుంటి నర్సింహులు తదితరులతో 69,200 చదరపు గజాల స్థలంపై అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) చేసుకున్నారు. వీరికి చెల్లింపులు చేయడానికి గూడూరు కృష్ణ, రవి రాంబాబు, ఎంసీహెచ్ రాఘవరావు తదితరుల నుంచి 2014, 2018ల్లో పెట్టుబడులు తీసుకున్నారు. ఆ సందర్భాల్లో సర్వే నంబర్లు 282, 289ల్లో ఉన్న స్థలం నుంచి కొంతభాగం వీరికి ఇచ్చేలా, అది అసైన్డ్ భూమి కావడంతో గరిష్టంగా ఆరునెలల్లో ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు పొందేలా ఒప్పందాలు చేసుకున్నారు. 2022 నాటికీ ఈ తంతు పూర్తిగాకపోవడంతో భాగస్వాముల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో గూడూరు కృష్ణ, రవి రాంబాబు, ఎంసీహెచ్ రాఘవరావు తదితరులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో 2022 అక్టోబర్ 18న ప్రకాష్, గాం«దీ, దశరథ్‌లపై నాలుగు కేసులు నమోదయ్యాయి వీటి దర్యాప్తులో ఆయన పాత్ర వెలుగులోకి.. ఈ నాలుగు కేసుల దర్యాప్తులో శివానందరెడ్డితో పాటు ఆయన భార్య ఉమాదేవి, కుమారుడు డైరెక్టర్లుగా ఉన్న కంపెనీ పాత్ర వెలుగులోకి వచి్చంది. 2015–16లో రంగంలోకి దిగిన శివానందరెడ్డి తాను బయటకు రాకుండా టి.జె.ప్రకాష్, కోనేరు గాందీ, ఎస్.దశరథరామారావులను ముందుపెట్టి కథ నడిపారు. ఆ భూముల్ని తన కంపెనీ పేరుతో రాయించుకోవడంతోపాటు రాత్రికిరాత్రే అనుమతి జీవోలు తెప్పించుకున్నారని వెలుగులోకి వచ్చింది. పట్టాలు కూడా అసైనీలకు ఇవ్వకుండా, లేఔట్ కూడా వేయకుండా వారిని భయపెట్టి రిజి్రస్టేషన్లు కూడా పూర్తిచేసినట్లు సీసీఎస్ పోలీసులు గుర్తించారు. గజం కనిష్టంగా రూ.12 వేల నుంచి రూ.15 వేలకు సొంతం చేసుకున్నట్లు బయటపడింది. ఈ విషయాలు వెలుగులోకి రావడంతో కేసులు మరో మలుపు తిరిగాయి. ఈ వ్యవహారంలో అప్పటి కొందరు అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు తేలింది. జనవరిలో కోర్టు అనుమతితో సీసీఎస్ పోలీసులు శివానందరెడ్డికి చెందిన వెస్సెల్లా గ్రూప్ కార్యాలయాల్లోను, ఆయన ఇంట్లోను సోదాలు చేశారు. పలు కీలక డాక్యుమెంట్లు స్వా«దీనం చేసుకున్నారు. మొత్తం 26 ఎకరాల అసైన్డ్ భూముల్ని చేజిక్కించుకున్న శివానందరెడ్డి.. వెస్సెల్లా గ్రూప్ పేరిట 400 చదరపు గజాలు (5 వేల చదరపు అడుగుల బిల్డప్ ఏరియా), 800 చదరపు గజాల (10 వేల చదరపు అడుగుల బిల్డప్ ఏరియా) విస్తీర్ణంలో లగ్జరీ విల్లాలు నిర్మిస్తామని ప్రచారం చేయడమేగాక ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో చదరపు అడుగుకి రూ.10 వేల చొప్పున అనేకమంది నుంచి అడ్వాన్సులు సైతం వసూలు చేశారని ఈ డాక్యుమెంట్ల ఆధారంగా గుర్తించారు. -
భూ వివాదంలో ఎస్సై అత్యుత్సాహం.. బలైన నిండు ప్రాణం!
చింతపల్లి: పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కిన భూ వివాదం చివరకు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. నల్లగొండ జిల్లా చింతపల్లిలో ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘటనపై బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చింతపల్లి మండల పరిధిలోని పాలెం తండాకు చెందిన నేనావత్ సూర్య (56) హైదరాబాదులోని కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడి తోడ మరో ముగ్గురు సోదరులు ఉన్నారు. స్వగ్రామంలో సూర్యా తల్లి పేరిట ఉన్న నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిని సమానంగా పంచుకుని సాగు చేసుకుంటున్నారు. కాగా, సూర్యా హైదరాబాద్‌లో ఉంటుండగా అతడి తమ్ముడు భీమా కొంత అన్న భూమిని సాగు చేసుకుంటున్నాడు. ఇదే విషయంపై సూర్యా అతడి తమ్ముడు భీమా మధ్య చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయి. అప్పుకు భూమికి లింక్ పెట్టి.. సూర్యా కుమారుడు కిరణ్ తరచూ స్వగ్రామానికి వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో బాబాయి బీమా వద్ద కిరణ్ అవసరాల నిమిత్తం రూ. 3లక్షల వరకు అప్పు చేశాడు. వాటిని తిరిగి చెల్లించాలని బీమా కోరడంతో తమ భూమిని కొంత పట్టా చేయించుకున్నావని, ఆ సమస్య పరిష్కారం అయితేనే అప్పు డబ్బులు చెల్లిస్తామని సూర్యా అతడి కుమారుడు కిరణ్ తేల్చిచెప్పారు. విషయం పెద్ద మనుషుల వద్దకు చేరడంతో రెండు నెలల క్రితం బీమా తన పేరిట అధికంగా ఉన్న పట్టా భూమిని సోదరుడు సూర్యాపై ఎక్కించాడు. డబ్బులు ఇవ్వడం లేదని ఫిర్యాదు బీమా తన పేరిట అధికంగా ఉన్న భూమిని సూర్యా పేరిట పట్టా చేయించిన తిరిగి అప్పు చెల్లించలేదు. దీంతో విసిగిపోయిన బీమా శుక్రవారం చింతపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్ఐ సతీష్‌రెడ్డి అప్పు తిరిగి ఇవ్వడంతో తాత్సారం చేస్తున్న సూర్య, అతడి కుమారుడిని పిలిపించాలని అదే రోజు సిబ్బందిని ఆదేశించాడు. దీంతో వారు సూర్యకు ఫోన్ చేసి ఠాణాకు రావాలని హుకుం జారీ చేశారు. రెండు రోజుల తర్వాత వచ్చారని.. సూర్య, అతడి కుమారుడు కిరణ్ ఆదివారం చింతపల్లి పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. సాయంత్రం తిరిగి విధులకు హాజరైన ఎస్ఐ స్టేషన్‌కు రావాలని ఫోన్ చేస్తే రెండు రోజుల తర్వాత వస్తారా అంటూ వారిపై కోపంతో చేయిచేసుకున్నాడు. దీంతో సూర్యా అస్వస్థతకు గురై వాంతి చేసుకున్నాడు. వెంటనే పోలీస్ సిబ్బంది, కుటుంబ సభ్యులు సూర్యను దేవరకొండ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా కుప్పకూలి మృతిచెందాడు. ఎస్ఐ చేయి చేసుకోవడంతోనే సూర్య మృతిచెందాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులకు వాగ్వాదం జరిగింది. మృతదేహాన్ని చింతపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా పోలీసులు అడ్డుకుని దేవరకొండ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. అయితే, సూర్యకు బీపీ పెరగి గుండెపోటుతో మృతిచెందాడని దేవరకొండ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాములు నిర్ధారించారని పోలీసులు తెలిపారు. చింతపల్లి పోలీస్‌స్టేషన్‌ను నల్లగొండ ఎస్పీ అపూర్వరావు సందర్శించారు. ఘటన పూర్వాపరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చింతపల్లి ఎస్ఐని వీఆర్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. -
రాష్ట్ర హైకోర్టు చరిత్రలో తొలిసారి తెలుగులో తొలి తీర్పు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు చరిత్రలో తొలిసారి ఓ తీర్పు తెలుగు భాషలో వెలువడింది. ఉమ్మడి హైకోర్టు చరిత్రలోనూ ప్రాంతీయ భాషలో ఉత్తర్వులు రావడం ఇదే మొదటిది కావడం విశేషం. సికింద్రాబాద్ మచ్చ బొల్లారంలోని ఓ భూ వివాదానికి సంబంధించి దాఖలైన అప్పీల్‌ను కొట్టివేస్తూ జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం ఈ నెల 27న 45 పేజీల తీర్పును తెలుగులో ఇచ్చింది. ఈ కేసులో విచారణ జరిపి కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. కోర్టు అధికారిక కార్యకలాపాల కోసం ఆంగ్లంలో కూడా ప్రతిని వెలువరించింది. కొన్ని ఆంగ్ల పదాలకు సందర్భానుసారం తెలుగు పదాలు అందుబాటులో లేకపోవడంతో, మరికొన్ని ఆంగ్ల పదాలు జన బాహుళ్యంలో ఎక్కువగా వినియోగంలో ఉండటంతో వాటిని తీర్పు కాపీలో ఆంగ్లంలోనే పేర్కొన్నారు. ఇదిలాఉండగా, దేశంలో ప్రాంతీయ భాషలో హైకోర్టు తీర్పు వెలువరించడం ఇది రెండోసారి. కేరళ హైకోర్టు గతంలో అక్కడి స్థానిక భాషలో తీర్పునిచ్చింది. కేసు ఇదీ.. మచ్చబొల్లారంలో సర్వే నంబర్ 162, 163లో కె.వీరారెడ్డికి 13.01 ఎకరాల భూమి ఉండేది. వీరారెడ్డికి ఇద్దరు కొడుకులు. వీరారెడ్డి మరణానంతరం అందులో 4.08 ఎకరాలు తల్లి సాలమ్మకు ఇచ్చి మిగిలినది కొడుకులిద్దరు పంచుకున్నారు. సాలమ్మ జీవించి ఉండగానే ఆమె భూమిని వాదప్రతివాదులు మౌఖిక అగ్రిమెంట్ ప్రకారం చెరోసగం తీసుకున్నారు. 2005లో సాలమ్మ చనిపోవడంతో తనకు ఆమె ద్వారా సంక్రమించిన ఆస్తిని మ్యుటేషన్ చేయాలని ఒక కుమారుడు కె.చంద్రారెడ్డి మండల రెవెన్యూ అధికారికి దరఖాస్తు చేసుకున్నారు. సాలమ్మ రాసిన వీలునామాపై మరో కుమారుడు కె.ముత్యంరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందూ వారసత్వ చట్టం–1956 ప్రకారం హిందూ మహిళ తన భర్త నుంచి వారసత్వంగా సంక్రమించిన ఆస్తి (4.08 ఎకరాలు)ని భర్త వారసులకు బదలాయించాలని, భారత వారసత్వ చట్టం–1925కు అనుగుణంగా వీలునామా లేదని, సాలమ్మను 80 ఏళ్ల వయసులో భయపెట్టి వీలునామా రాయించారని, కాబట్టి ఆమె ఆస్తిని వారసులందరికీ సమంగా పంచాలన్నారు. వీరి వాదనలను కిందికోర్టు ఆమోదించింది. ఈ తీర్పును రద్దు చేయాలని కోరుతూ చంద్రారెడ్డి హైకోర్టులో అప్పీల్ చేశారు. దీనిపై జస్టిస్ నవీన్‌రావు, జస్టిస్ నగేశ్ ధర్మాసనం విచారణ జరిపి తీర్పునిచ్చింది. -
భూవివాదంలో కేసు నమోదు.. పరారీలో మంత్రి మల్లారెడ్డి బావమరిది
సాక్షి, హైదరాబాద్: గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని భూవివాదంలో మంత్రి మల్లారెడ్డి బావమరిది, గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ భర్త ముద్దుల శ్రీనివాస్ రెడ్డితో పాటు 15 మందిపై కేసు నమోదైంది. వారిలో ఎనిమిది మంది మహిళలు, ఇద్దరు వ్యక్తులు మొత్తం 10 మందిని రిమాండుకు తరలించినట్లు పేట్ బషీరాబాద్ పోలీసులు తెలిపారు. సీఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకా రం గుండ్లపోచంపల్లిలోని సర్వే నంబర్ 5,6లో ఉన్న భూ యజమానులు మల్లారెడ్డి, వేణునాయుడు మధ్య స్థలవివాదం నడుస్తోంది. మూడు రోజుల కిందట రాత్రి ఒంటి గంట సమయంలో మల్లారెడ్డికి సంబంధించిన వ్యక్తులు మద్యం సేవించి స్థలంలో ఉన్న కడీలను పడగొట్టి సెక్యూరిటీ సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేశారని తమకు అందిన ఫిర్యాదు మేరకు 15 మంది నిందితులపై కేసు నమోదు చేయగా అందులో 10 మందిని ఇప్పటికే రిమాండ్ తరలించామని చెప్పారు. మరో ఐదుగురిలో మంత్రి మల్లారెడ్డి బావమరిది శ్రీనివాసరెడ్డి, మల్లారెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, నర్సింహారెడ్డిలు పరారీలో ఉన్నారని తెలిపారు. చదవండి: దెయ్యం పట్టిందని వస్తే చుక్కలు చూపించిన భూత వైద్యుడు.. నిప్పులపై నడిపించి -
లాయర్ తలకు తుపాకీ గురి.. భూవివాదం
సాక్షి, హైదరాబాద్: భూ వివాదానికి సంబంధించి న్యాయస్థానంలో తాము కేసు ఓడిపోవడానికి న్యాయవాదే కారణమని భావించిన కక్షిదారులు దారుణానికి తెగబడ్డారు. సదరు న్యాయవాదిపై హత్యాయత్నం చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న నారాయణగూడ పోలీసులు నిందితుల్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గతవారం జరిగిన ఈ విషయాన్ని అధికారులు రహస్యంగా ఉంచడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హిమాయత్‌నగర్ స్ట్రీట్ నంబర్ 7లో ఉండే హైకోర్టు న్యాయవాది జశ్వంత్ ఓ భూ వివాదానికి సంబంధించిన కేసు వాదిస్తున్నారు. ఈ కేసులో ఇటీవల కక్షిదారులకు వ్యతిరేకంగా తీర్పువచ్చింది. న్యాయవాది నిర్లక్ష్యం వల్లే తాము కేసు ఓడిపోయామని కక్షిదారులు భావించారు. దీంతో కక్షకట్టిన వాళ్లు ఈ నెల 17 సాయంత్రం 6 గంటల సమయంలో గౌడ హాస్టల్ సమీపంలో న్యాయవాదిని అడ్డగించి బాహాబాహీకి దిగారు. భూ యజమాని తరఫు వాళ్లు తమ వెంట తెచ్చుకున్న తుపాకీని న్యాయవాది తలకు గురిపెట్టడంతో పాటు కత్తితో పొడిచేందుకు సిద్ధపడ్డారు. అక్కడకు చేరిన స్థానికులు తమ ఫోన్లలో వీడియోలు తీస్తుండటాన్ని గమనించిన వాళ్లు వెనక్కు తగ్గారు. డయల్–100 ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఇరువైపుల వారినీ అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం, సెక్టార్ ఎస్సై కాకుండా మరొకరికి దర్యాప్తు బాధ్యతలు అప్పగించడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
8,289 ఎకరాలు.. 789 కేసులు
సాక్షి, మేడ్చల్ జిల్లా: హైదరాబాద్ సహా శివారు (మేడ్చల్ జిల్లా)లో సుమారు 8,289.62 ఎకరాల ప్రభుత్వ భూములు వివిధ కోర్టు వివాదాల్లో మగ్గుతున్నాయి. వీటి విలువ రూ.35 వేల కోట్లకుపైగానే ఉంటుందని అంచనా. ఆయా కోర్టుల్లో భూ వివాదాలకు సంబంధించిన కేసుల సంఖ్య 789 ఉండగా.. అత్యధికంగా హైకోర్టులో 545 కేసులు ఉన్నాయి. వివిధ కోర్టుల్లో మొత్తం భూముల్లో హైదరాబాద్ జిల్లాకు సంబంధించి 831.62 ఎకరాలు. వీటిలో వివిధ కోర్టుల్లో 83 కేసులు నడుస్తున్నాయి. నగర శివారులోని మేడ్చల్ జిల్లాలో వివాదాలకు సంబంధించిన భూములు 7,458 ఎకరాలు ఉన్నాయి. వీటిలో వివిధ కోర్టుల్లో 706 కేసులు కొనసాగుతున్నాయి. వివాదాల్లో ఉన్న హైదరాబాద్ జిల్లా పరిధిలోని భూముల విలువ రూ. 9489.16 కోట్లకుపైనే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అలాగే శివారు (మేడ్చల్ జిల్లా)లో వివాదాస్పద భూములు 7,458 ఎకరాలకు సంబంధించి రూ.26 వేల కోట్లకుపైగా ఉంటుందని పేర్కొంటున్నారు. వివాదాస్పద భూములన్నీ అధికంగా పలువురు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులకు సంబంధించినవి ఉన్నట్లుగా భావిస్తున్నారు. భూవివాదాల సమాచారాన్ని రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి ఇటీవల నివేదిక సమర్పించారు. దీంతో భూవివాదాలకు సంబంధించిన కోర్టు కేసుల స్టేటస్‌పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ప్రభుత్వం సత్వర పరిష్కరానికి చొరవ చూపాలని ఆదేశించినట్లు సమాచారం. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములకు సంబంధించిన కేసులు పలు కోర్టుల్లో ఏళ్ల తరబడి నడుస్తుండటంతో ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగించలేకపోతున్నామన్న అభిప్రాయాలు కూడా లేకపోలేదు. ఈ పరిస్థితుల్లో అధికారులు, ప్రభుత్వ న్యాయవాదులు సమన్వయంతో పని చేసి భూ వివాదాల పరిష్కారానికి అవసరమైన కార్యాచరణ రూపొందించుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కోర్టు వివాదాల్లో ఉన్న ప్రభుత్వ భూముల జాబితా సిద్ధం చేసి కేసుల పరిష్కారానికి అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. -
ఏసీపీ జయరాం సస్పెన్షన్‌పై అధికారుల విచారణ
సాక్షి,హైదరాబాద్: వనస్థలిపురం ఏసీపీ జయరాం సస్పెన్షన్‌కు కారణమైన భూ వివాదంలో అధికారుల విచారణ కొనసాగుతోంది. బాధితులు డీజీపీ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో రాచకొండ సీపీ కార్యాలయం అధికారులు భూవివాదానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో విచారణా అధికారులు బాధితులతో కలిసి భూమిని పరిశీలించారు. బాచారం సర్వే నెంబర్ 73 నుంచి 101మధ్య సర్వే నెంబర్లలోని 412 ఎకరాల భూమిని పరిశీలించారు. ఔటర్ రింగు రోడ్డుకు ఆనుకొని ఉన్న ఈ భూమి వేల కోట్ల విలువ కలిగి ఉంది. సానా సతీష్ బినామీల ఆధీనంలో ఉన్న 412 ఎకరాల్లో వివాదం చోటు చేసుకుంది. ఇటీవల తప్పుడు కేసులు, బెదిరింపులతో భూమి స్వాధీనం చేసుకొని అక్రమంగా ఫెన్సింగ్ నిర్మాణం చేశారు. కమల ప్రియా ఆటో జనరల్ ఏజన్సీ పేరుతో ఈ వివాదాస్పద భూమిపై భారీ లోన్ కూడా తీసుకున్నారు. కోల్‌కతా ఫైనాన్స్ కంపెనీ నుంచి భారీగా రుణం తీసుకున్న సానా సతీష్ బినామీ కంపెనీ హైపొతికేషన్ పేరుతో ఆ భూముల్లో బోర్డ్ ఏర్పాటు చేశారు. గతంలో టెనెంట్స్‌కు, యజమానులకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ భూమి అసలు యజమానులు పూణేకు చెందిన రాజా ఆనందరావు కుంటుంబ సభ్యులు. దీంతో సాన సతీష్ డాక్యుమెంట్లు నకిలీ అని రంగారెడ్డి కోర్టులో ఆనందరావు వారసులు పిటిషన్ దాఖలు చేశారు. ఇదే భూమిపై ప్రస్తుతం హైకోర్టులో మరో కేసు విచారణలో ఉంది. ఈ కేసు విషయంలో గతంలో తహశీల్దార్, వీఆర్ఓలపై సస్పెన్షన్ వేటు పడింది. విజయా రెడ్డి అనే తహశీల్దార్ దారుణ హత్యకు గురయ్యారు. ఇప్పుడు వనస్థలిపురం ఏసీపీ జయరాం సస్పెండ్ అయ్యారు. ఈ కేసుపై ప్రస్తుతం స్పెషల్ టీం అధికారులు సమగ్రంగా విచారణ చేస్తున్నారు. పూర్తిగా విచారిస్తే సానా సతీష్‌తో పాటు మరికొందరు పెద్దల పాత్ర ఉంటుందని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్పై వేటు అమీర్‌పేట: ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్.మురళీకృష్ణపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రేమించిన వ్యక్తి తనను మోసం చేశాడని న్యాయం చేయాలని పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఓ మహిళను ఏసీపీ జయరాం వద్దకు పంపించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడంలో కారకుడయ్యాడని నిర్ధారించిన ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేసినట్లు తెలిసింది. కాగా సానా సతీష్ భూ వివాదంలో ఇటీవల సస్పెన్షన్‌కు గురైన ఏసీపీ జయరాం కార్యాలయంలోనే ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు సమాచారం. బాధితురాలి ఫిర్యాదు మేరకు మురళీకృష్ణను సస్పెండ్ చేశారు. ఎస్ఆర్నగర్ నూతన ఇన్స్పెక్టర్గా నర్సింహారెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇబ్రహీంపట్నం భూములపై సీబీఐ విచారణ జరిపించాలి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అన్యాక్రాంతముతున్న ప్రభుత్వ భూముల విషయంలో ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించాలని మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాచారం భూ వివాదంతో పాటు ఓ ప్రైవేటు సంస్థ 500 ఎకరాల్లో ఫెన్సింగ్ వేసి కుంటలు, చెరువులను కబ్జా చేసిందని, ప్రభుత్వ సంస్థలకు కేటాయించిన భూములు ప్రైవేటు పరం అయ్యాయన్నారు. ఈ విషయంలో స్థానిక ఎంఎల్ఏ ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. -
వనస్థలిపురం ఎసీపీ సస్పెన్షన్ కేసు దర్యాప్తు వేగవంతం
సాక్షి, హైదరాబాద్ : వనస్థలిపురం ఎసీపీ జయరాం సస్పెన్షన్ కేసులో దర్యాప్తును అధికారులు ముమ్మరం చేశారు. బాధితులతో కలసి స్పెషల్ టీం సభ్యులు ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న స్థలాన్ని పరిశీలించారు. బాచారం సర్వే నెంబర్ 81నుంచి 200 మద్య లోని 400 ఎకరాలను అధికారులు పరిశీలించారు. సానా సతీష్ ఆదీనంలోని ఈ 147ఎకారాల్లోని వేలకోట్ల విలువైన భూమి వివాదంలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ భూమిపై కలకత్తా ఫైనాన్స్ కంపెనీ నుంచి సానా సతీష్ భారీగా రుణం తీసుకోగా.. కలకత్తా కంపెనీ హైపొతికేషన్ పేరుతో భూముల్లో బోర్డ్‌లు పాతారు. (కీసర ఇంచార్జ్ తహశీల్దార్‌గా గౌతమ్ కుమార్) అయితే టెనెంట్స్‌కు , యజమానులకు అనుకూలంగా కోర్టు తీర్పు అవ్వడంతో ఈ భూమి అసలు యజమానులు పూణేకు చెందిన రాజా ఆనందరావు కుటుంబం అని రుజువైంది. సానసతీష్ డాక్యుమెంట్లు నకిలీ అని రంగారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులు ప్రస్తుతం హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఇదే కేసులో గతంలో ఏమ్మార్వో ,వీఆర్వో సస్పెన్షన్.. విజయారెడ్డి అనే ఎమ్మార్వో దారుణ హత్య చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వనస్థలిపురం ఏసీపీ జయరాం సస్పెన్షన్‌తో పాటు తాజాగా సానాసతీష్ అనుచరులకు జయరాం సహకరిస్తున్నాడన్న ఆరోపణలతో ఏసీపీపై బాధితులు అధికారులకు పిర్యాదు చేశారు. (బయటపడుతున్న కీసర ఎమ్మార్వో అక్రమాలు) -
భూ వివాదం కేసు.. మరొకరు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: షేక్‌పేట్‌లో విలువైన ప్రభుత్వ స్థలాన్ని ఫోర్జరీ సంతకాలతో కబ్జా చేసేందుకు ప్రయత్నించిన సయ్యద్ అబ్దుల్‌ను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఏసీబీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సెంట్రల్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్- 14 షేక్‌పేట్ మండలంలోని 4865 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఫోర్జరీ సంతకాలతో కబ్జా చేసేందుకు సయ్యద్ అబ్దుల్ ప్రయత్నించినట్లుగా విచారణలో తేలింది. ఫోర్జరీ సంతకాలతో ప్రభుత్వ స్థలం తనదేనంటూ రెవెన్యూ అధికారులకు తప్పుడు ఆధారాలు చూపించినట్లు గుర్తించారు. గతంలో ఈ భూ వివాదంలో బంజారాహిల్స్ ఎస్ఐ తో పాటు షేక్‌పేట్ ఎమ్మార్వో, ఆర్ఐను కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
బంజారాహిల్స్ ల్యాండ్ కేసులో మరో కోణం
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లో 50 కోట్ల రూపాయల విలువైన ల్యాండ్ కేసులో మంగళవారం కొత్త కోణం బయటపడింది. ఎకరా 20 గుంటలకు చెందిన ల్యాండ్ పత్రాలన్నీ ఏసీబీ అధికారులు నకిలీవిగా తేల్చారు. ఈ కేసులో కోర్టుకు అందజేసిన పత్రాలు సైతం అన్ని ఫోర్జరీవేనని విచారణలో విల్లడైంది. ఈ కేసులో అరకోటి లంచం తీసుకుంటూ ఆర్ఐ నాగార్జున రెడ్డి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. షేక్‌పేట తహసీల్దారు సుజాతను సైతం అరెస్ట్ చేశారు. ఈ కేసును ఆలస్యం చేసేందుకు ఎస్సై రవీంద్ర నాయక్ రూ. 3 లక్షలు డిమాండ్ చేస్తూ ఏసీబీకి పట్టుబట్టాడు. ఇప్పటికే ఈ కేసులో భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన పాతబస్తీకి చెందిన సయ్యద్ ఖాలీద్‌పై చర్యలు తీసుకోవాలని గతంలో రెవెన్యూ అధికారులు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీనిపై సీపీ అంజనీకుమార్‌కు ఏసీబీ అధికారులు లేఖ రాశారు.(కబ్జాదారుడికి సహకరించిన రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఎస్ఐ అరెస్ట్ ) ఏం జరిగిందంటే.. బంజారాహిల్స్ రోడ్ నెం.14లో ఉన్న 4865 గజాల(సుమారు రెండెకరాలు) ప్రభుత్వ స్థలాన్ని సయ్యద్ అబ్దుల్ ఖాలిద్ అనే వ్యక్తి ఆక్రమించి హెచ్చరిక బోర్డును తొలగించి తన పేరుతో బోర్డు ఏర్పాటు చేశాడు. అయితే అది ప్రభుత్వ స్థలం కావడంతో తహసిల్దార్ సుజాత పలుమార్లు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సదరు స్థలాన్ని ప్రైవేట్ పరం చేస్తూ హద్దులు చూపిస్తానంటూ అదే కార్యాలయంలో పని చేస్తున్న ఆర్ఐ నాగార్జున రెడ్డి ఖాలిద్ నుంచి రూ.30 లక్షలు డిమాండ్ చేశాడు. ఇందులో భాగంగా శనివారం ఖాలిద్ రూ.15 లక్షల నగదును నాగార్జున రెడ్డికి ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మరోవైపు పోలీసులు అతడిని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు లంచం అడిగిన ఎస్సై రవీందర్‌ను సైతం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. (శివారుపై ఏసీబీ కన్ను) -
శ్రీకాళహస్తి భూ వివాదాలతో హత్యాయత్నం
సాక్షి, చిత్తూరు : శ్రీకాళహస్తిలో భూ వివాదాలు కలకలం రేపుతున్నాయి. ఓ భూ వివాదానికి సంబంధించి ఇద్దరు దళిత యువకులపై హత్యాయత్నం జరగడం పట్టణంలో కలవరం పుట్టిస్తోంది. శ్రీకాళహస్తి ఎమ్ఎమ్ వాడకు చెందిన కిరణ్,నరసింహులు అనే యువకులు పిచ్చాటూరు మార్గంలో రాజీవ్ నగర్ సమీపంలో వెళ్తుండగా వారిపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడులకు పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన యువకులను హుటాహుటిన ఏరియా హాస్పిటల్ కు తరలించారు. యువవకులకు ఏరియా హాస్పిటల్ లో వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి దర్యాప్తు చేపట్టారు. బాధితులు కిరణ్ నరసింహులు విలేకరులతో మాట్లాడుతూ.. తమపై అగ్రవర్ణాలకు చెందిన వారు హత్యాయత్నం చేయించారని ఆరోపించారు. పట్టణంలోని దళితులకు చెందిన భూమి ఆక్రమించుకోవడంతో తాము అభ్యంతరం చెప్పగా తమపై హత్యా ప్రయత్నం చేయించారని వాపోయారు. (వైద్యం పేరుతో వికృత చేష్టలు ) కారు బోల్తా.. మాజీ మంత్రికి తప్పిన ప్రమాదం -
విగ్రహాలు ‘ప్రత్యక్షం’.. గోరఖ్‌నాథ్ పరోక్షం!
1949లో తొమ్మిది రోజుల పాటు రామచరిత మానస్‌ను పారాయణం చేశారు. చివర్లో బాబ్రీ మసీదులో రాముడు, సీత విగ్రహాలు ప్రత్యక్షమయ్యాయి! ఫలితంగా బాబ్రీ మసీదుని మూసివేశారు. ఈ పారాయణం చేసింది, అప్పటి రామ జన్మభూమి ఉద్యమానికి నాయకత్వం వహించింది మహంత్ దిగ్విజయ్ నాథ్. ఈ సంఘటనే నాథ్ని హిందూమహాసభలో తిరుగులేని నాయకుడిని చేసింది. తరవాత హిందూ మహాసభ ప్రధాన కార్యదర్శిగా ఎంపికై, జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాడు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి 1967లో గోరఖ్‌పూర్ ఎంపీగా గెలిచారు. నిజానికి 1921లోనే దిగ్విజయ్నాథ్ కాంగ్రెస్‌లో చేరి, చౌరీచౌరా సంఘటనలో కీలకపాత్ర పోషించారు. అదే ఘటనలో ఆరెస్టయ్యారు. తరవాత హిందుత్వ వాదులతో కలిసి పనిచేస్తూ హిందూ మహాసభలో చేరారు. హిందూ మహాసభ సభ్యుడు గాడ్సేని మహాత్మాగాంధీ హత్యకు ఉసిగొల్పారన్న నేరారోపణపై నాథ్ 9 నెలల పాటు జైల్లో గడిపారు. బయటికి వచ్చాకే రామజన్మభూమి ఉద్యమాన్ని ఆరంభించారు. మఠం నుంచి రాజకీయాల్లోకి... గోరఖ్‌నాథ్ మఠం ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఉంది. 11వ శతాబ్దారంభంలో హిందూ యోగి, సాధువు యోగి గోరఖ్‌నాథ్ దీనికి బీజం వేశారు. దిగ్విజయ్నాథ్ తరవాత ఆయన వారసుడు మహంత్ అవైద్యనాథ్ 1962, 1967, 1969, 1974, 1977లో మణిరామ్ స్వతంత్ర ఎమ్మెల్యేగా, 1970, 1989లో గోరఖ్‌పూర్ ఎంపీగా ఎన్నికయ్యారు. సంఘ్ పరివార్ స్వయంగా రామజన్మభూమి ఉద్యమానికి శ్రీకారం చుట్టడంతో అవైద్యనాథ్ బీజేపీలో చేరి గోరఖ్‌పూర్ ఎంపీగా 1991, 1996లో ఎన్నికయ్యారు. ఇదే మఠం నుంచి వచ్చిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ 1998 నుంచి ఎంపీగా గెలిచారు. ఎంపీగా ఉంటూ∙ప్రస్తుతం ముఖ్యమంత్రి కూడా అయ్యారు. బాబ్రీ కూల్చివేతలోనూ యోగి ఆదిత్యనాథ్ పాత్ర కీలకమని చెబుతారు. మూలవిరాట్టునాయర్... రామ జన్మభూమి–బాబ్రీ మసీదు వివాదానికి మూలవిరాట్టు ఎవరైనా ఉన్నారంటే 1949 నాటి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కె.కె.కె.నాయర్ అనే యూపీ అధికారి. కృష్ణకుమార్ కరుణాకరన్ నాయర్ కేరళ వాస్తవ్యుడు. కేరళలోని అలెప్పీలో పుట్టి, మద్రాస్ యూనివర్సిటీలో బారాసెనీ కాలేజీలోనూ, అలీగఢ్ యూనివర్సిటీలోనూ, లండన్‌లోనూ ఉన్నత విద్యనభ్యసించారు. 1930లో ఇండియన్ సివిల్ సర్వీసెస్‌లో చేరారు. నాయర్ ఉత్తరప్రదేశ్‌లో వివిధ పదవుల్లో పనిచేశారు. 1949లో ఫైజాబాద్ జిల్లా మేజిస్ట్రేట్‌గా పనిచేశారు. 1949లో గోరఖ్‌నాథ్ మఠం సభ్యుల రామచరిత మానస్ పారాయణం సందర్భంగా బాబ్రీ మసీదులోని ప్రధాన గుమ్మటంలోపల హిందూ దేవతా విగ్రహాలు హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాయి. దీనిపై విచారణ జరిపిన నాటి ప్రభుత్వం విగ్రహాలను మసీదులో పెట్టడంలో నాటి జిల్లా అధికారి నాయర్ కీలక సూత్రధారి అని నిర్ధారించింది. సంఘటన జరిగిన క్షణాల్లోనే నాయర్ అక్కడికి చేరుకున్నారని, విగ్రహాలు పెట్టి, వ్యవహారమంతా పూర్తయ్యాకే పై అధికారులకు సమాచారమిచ్చారని ఆరోపణలొచ్చాయి. నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విగ్రహాలను అక్కడి నుంచి తరలించాలని, నాయర్‌ని పదవి నుంచి తొలగించాలని ఆదేశించారు. నాయర్ పదవిని వదిలి నేరుగా హిందూ మహాసభలో చేరారు. ఈ చర్యతో హిందూత్వ వాదుల్లో కె.కె.నాయర్ హీరోగా మారాడు. నాల్గవ లోక్‌సభలో భారతీయ జనసంఘ్ పార్టీ తరఫున పోటీ చేసి నాయర్ గెలిచారు కూడా. మందిరం.. మసీదు 1528 నుంచి 2019 వరకూ...డేట్ టు డేట్ 1528: మొఘల్ చక్రవర్తి బాబర్ కమాండర్ మిర్ బక్వి బాబ్రీ మసీదును నిర్మించారు. 1885: బాబ్రీ మసీదు ప్రాంతానికి పక్కనే దేవాలయ నిర్మాణానికి అనుమతివ్వాల్సిందిగా ఫైజాబాద్ కోర్టులో మహంత్ రఘుబీర్ దాస్ దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత. డిసెంబర్ 22–23, 1949: బాబ్రీ మసీదు లోపల రాముడి విగ్రహాలు ప్రత్యక్షం. హిందువులు దీనిని స్వయంభూగా భావించారు. పూజలకు ప్రయత్నించడం ప్రారంభించారు. విగ్రహాలను తీసుకుని వచ్చి అక్కడ పెట్టారని కొందరి ఆరోపణ. 1950: విగ్రహాలకు పూజలు చేసేందుకు అనుమతివ్వాలని ఫైజాబాద్ కోర్టును కోరిన గోపాల్ విశారద్, పరమహంస రామచంద్రదాస్. 1959: వివాదాస్పద స్థలాన్ని తమ అధీనం చేయాలని కేసు వేసిన నిర్మోహీ అఖాడా. 1961: బాబ్రీ మసీదులోని విగ్రహాలను తొలగించడంతోపాటు వివాదాస్పద స్థలం తమకు చెందినదిగా ప్రకటించాలని కోర్టును ఆశ్రయించిన యూపీ సెంట్రల్ సున్నీ వక్ఫ్ బోర్డు. 1984: రామ జన్మభూమి ఉద్యమాన్ని ప్రారంభించిన విశ్వహిందూ పరిషత్. ఫిబ్రవరి 1, 1986: రామ్‌లల్లా విగ్రహాలకు పూజలు చేసేందుకు హిందువులకు అనుమతిస్తూ ఫైజాబాద్ సెషన్స్ కోర్టు తీర్పు. నిరసన తెలిపేందుకు బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీ ఏర్పాటు. ఆగస్టు 14, 1989: అలహాబాద్ హైకోర్టుకు స్థల వివాదం. వివాదాస్పద స్థలానికి సంబంధించి యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశం. నవంబర్ 9, 1989: వివాదాస్పద రామ జన్మభూమి స్థలం సమీపంలో శిలాన్యాస్ నిర్వహించేందుకు విశ్వహిందూ పరిషత్‌కు అనుమతిస్తూ అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వ నిర్ణయం. సెప్టెంబర్ 1990: భవ్య రామమందిర నిర్మాణం లక్ష్యంగా గుజరాత్‌లోని సోమనాథ్ నుంచి భారతీయ జనతాపార్టీ నేత ఎల్.కె.అద్వానీ రథయాత్ర ప్రారంభం. డిసెంబర్ 6, 1992: కరసేవకుల చేతుల్లో నేలమట్టమైన బాబ్రీ మసీదు. చెలరేగిన హింస. డిసెంబర్ 16, 1992: బాబ్రీ మసీదు కూల్చివేతకు దారితీసిన పరిస్థితులపై విచారణకు జస్టిస్ లిబర్హాన్ కమిషన్ ఏర్పాటు. 1993: రామజన్మభూమి తాలూకూ వివాదాస్పద స్థలంతోపాటు పరిసరాల్లోని సుమారు 67 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్న పి.వి.నరసింహారావు నేతృత్వంలోని ప్రభుత్వం. 1994 : స్థల స్వాధీనానికి సుప్రీంకోర్టు సమర్థింపు. ఇస్లామ్ మతంలో మసీదు ఒక భాగం కాదంటూ డాక్టర్ ఇస్మాయిల్ ఫారూఖీ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు వ్యాఖ్య. ఏప్రిల్ 2002: వివాదాస్పద రామజన్మభూమి స్థల యాజమాన్య హక్కులపై అలహాబాద్ హైకోర్టులో విచారణ ప్రారంభం. మార్చి 2003: కేంద్రం స్వాధీనం చేసుకన్న భూమిలో మతపరమైన కార్యకలాపాలపై సుప్రీంకోర్టు నిషేధం. 2005: వివాదాస్పద స్థలంపై పేలుడు పదార్థాలు నిండిన జీపుతో ఉగ్రవాదుల దాడి. ఎదురు కాల్పుల్లో అందరూ హతం. 2009: ప్రభుత్వానికి జస్టిస్ లిబర్హాన్ కమిషన్ నివేదిక సెప్టెంబర్ 30, 2010: సున్నీ వక్ఫ్ బోర్డ్, రామ్‌లీలా, నిర్మోహీ అఖాడాకు సమానంగా స్థలాన్ని విభజించాలని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆదేశం. మే 2011: హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ç14 పిటిషన్లు దాఖలు. హైకోర్టు తీర్పుపై స్టే విధించిన సుప్రీం. మార్చి 2017: అయోధ్య వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జె.ఎస్.ఖేహర్ సూచన. ఆగస్టు 2017: సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌లతో కూడిన త్రిసభ్య బెంచ్ విచారణ ప్రారంభం. సెప్టెంబర్ 2018: 1994 నాటి ఇస్మాయిల్ ఫారూఖీ తీర్పును పునః పరిశీలించాలన్న పిటిషనర్ల అప్పీళ్లపై విచారించిన సుప్రీంకోర్టు. విషయాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించరాదంటూ 2:1 తేడాతో న్యాయమూర్తుల తీర్మానం. జనవరి 8, 2019: అయోధ్య వివాదంపై దాఖలైన పిటిషన్ల విచారణకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో జస్టిస్. ఎస్.ఎ.బొబ్డే, జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌లతో ధర్మాసనం. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా సూచించిన చీఫ్ జస్టిస్. జనవరి 10, 2019: విచారణ బెంచ్‌లో తాను ఉండరాదని జస్టిస్ యు.యు. లలిత్ నిర్ణయం. దీంతో బెంచ్ పునర్వ్యవస్థీకరణ. జస్టిస్ ఎన్.వి. నారాయణ, జస్టిస్ యు.యు.లలిత్ స్థానంలోకి జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్. మార్చి 8, 2019: కోర్టు పర్యవేక్షణలో ఉండే మధ్యవర్తిత్వ కమిటీకి వివాదాస్పద అంశం. అక్టోబర్ 2019: సమస్య సామరస్య పరిష్కారంలో మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎఫ్.ఎం.ఐ.ఖలీఫుల్లా నేతృత్వంలోని మధ్యవర్తిత్వ కమిటీ విఫలం. నివేదిక సమర్పణ. ఆగస్టు 6, 2019: రోజూవారీ విచారణకు చేపట్టిన ధర్మాసనం. అక్టోబర్ 16, 2019: తుదితీర్పు రిజర్వ్. నవంబర్ 9, 2019: వివాదాస్పద స్థలంలో రామ మందిరం నిర్మాణానికి అనుకూలంగా సుప్రీం తీర్పు బాబర్ ఆదేశాల మేరకు మసీదు నిర్మాణం జరిగిందంటూ గోడలపై ఉన్న శాసనాలు చెబుతున్నాయి. రాముడు జన్మించిన ప్రాంతంలో దేవాలయాన్ని కూల్చివేసి ఆ శిథిలాలపై మసీదు కట్టారన్నది స్థానికులు చెప్పే మాట. 1717: మసీదు స్థలాన్ని కొనుగోలు చేసి రాముడికి దఖలు చేసిన రాజ్‌పూత్ వంశీకుడు జై సింగ్ –2. మసీదు బయట రాముడి విగ్రహాలకు పూజలు. 1768: బాబ్రీ మసీదును ఔరంగజేబు నిర్మించారని కొందరు, బాబర్ కట్టించాడని మరికొందరు స్థానికులు చెప్పినట్లు రికార్డు నమోదు చేసిన జెసూట్ పూజారి జోసెఫ్ టీఫెన్ట్హాలర్. 1853:బాబ్రీ–మందిర్ వివాదంపై దేశంలో తొలిసారి మతఘర్షణలు నమోదు. 1859: బాబ్రీ మసీదు ప్రాంతంలో హిందువులు, ముస్లింలు ప్రార్థనలు చేసేందుకు కంచె రూపంలో వేర్వేరు ప్రాంతాలను కేటాయించిన బ్రిటిష్ ప్రభుత్వం. సుమారు 90 ఏళ్లు ఈ పద్ధతి కొనసాగింపు. శనివారం అయోధ్యలోని ఓ ఆలయంలో సీతారాముల విగ్రహాలకు నమస్కరిస్తున్న ఓ భక్తురాలు బాబ్రీ మసీదులో పూజలు చేస్తున్న దృశ్యం (ఫైల్) -
పుప్పాలగూడ భూములు సర్కారువే
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కాందిశీకులకు భూముల కేటాయింపు వివాదంపై సుప్రీంకోర్టులోనూ రాష్ట్ర ప్రభుత్వానికి భారీ విజయం లభించింది. రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలో రూ. కోట్ల విలువైన 198.30 ఎకరాలను రమేష్ పరశరాం మలాని తదితరులకు కేటాయిస్తూ 2003లో ఉమ్మడి ఏపీ సీసీఎల్ఏ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ 2016లో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. కాందిశీకుల భూములను కేటాయించే అధికారం సీసీఎల్ఏకి లేదని పునరుద్ఘాటించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రమేష్ మలాని దాఖలు చేసిన అప్పీల్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వర్రావు, జస్టిస్ హేమంత్ గుప్తాలతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. కాందిశీకుల భూములను ఒకసారి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం బదిలీ చేసిన తర్వాత ఆ భూములను ఇతరులకు కేటాయించే అధికారం రాష్ట్ర పరిధిలోని మేనేజింగ్ అధికారి లేదా సెటిల్మెంట్ కమిషనర్‌కు మాత్రమే ఉందంది. 13 ఏళ్ల పాటు కోర్టుల్లో నడచిన ఈ కేసులో ప్రభుత్వానికి ఊరట లభించింది. ప్రస్తుత మార్కెట్ ప్రకారం ఈ భూములు ఎకరా రూ. 35 కోట్లు పలుకుతోంది. మొత్తం ఎకరాలను పరిగణనలోకి తీసుకుంటే దీని విలువ రూ.7 వేల కోట్లు ఉంటుందని అంచనా. ఇప్పటికే భూముల అమ్మకం ద్వారా రూ. 10 వేల కోట్లను సేకరించాలని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం హక్కులు దక్కించుకున్న భూములను వేలం వేసే వీలుంది. కేసు పూర్వాపరాలు ఇవీ.. పశ్చిమ పాకిస్తాన్ నుంచి మన దేశానికి శరణార్థునిగా వచ్చిన పరశరాం రాంచంద్ మలాని అనే వ్యక్తికి రంగారెడ్డి జిల్లాలో అప్పటి హయత్‌నగర్ మండలం బాటసింగారం, హైదరాబాద్ బోయిన్‌పల్లిలో మొత్తం 323.10 ఎకరాలను 60 ఏళ్ల క్రితం కేటాయించారు. బాటసింగారంలో 262.11 ఎక రాలు, బోయిన్‌పల్లిలో 60.39 ఎకరాలిచ్చారు. పాక్‌లో ఆయనకున్న 83.11 ఎకరాలను విడిచిపెట్టి వచ్చినందుకు బదులుగా హైదరాబాద్‌లో 200 ఎకరాలు ఇవ్వాలని కోరగా సదరు భూమిని పంపిణీ చేశారు. కొద్దికాలం తర్వాత సదరు భూమిని ఇతరులకు విక్రయించిన రాంచంద్... 1988లో మరణించారు. ఆయన బతికినన్ని రోజు లు సదరు భూమిపై ఎలాంటి అభ్యంతరాలూ వ్యక్తం చేయలేదు. ఆ తర్వాత 13 ఏళ్లకు అంటే 2001లో అసలు కథ మొదలైంది. పాక్‌లో తాము విడిచిపెట్టి వచ్చిన 83.11 ఎకరాల్లో.. 40.4 ఎకరాలకు సమానమైన ఆస్తిని మాత్రమే తమకు కేటాయించారని రాంచంద్ వారసులైన రమేష్ పరశ రాం మలాని, మరికొందరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. మిగిలిన 43.7 ఎకరాలకు సమానమై న ఆస్తిని కేటాయించలేదని, ఆ మేరకు భూమిని పంపిణీ చేయాలని 2001లో కోరారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి సీసీఎల్ఏ తీసుకెళ్లగా స్పందన రాలేదు. మరోసారి పిటిషనర్ సీసీఎల్ఏకు దరఖాస్తు చేయగా పుప్పాలగూడలో 301 నుంచి 308, 325 నుంచి 328, 331 సర్వే నంబర్లలో 2003 ఫిబ్రవరి 26న 148.3 ఎకరాలు, ఇత రులకు మరో 50 ఎకరాలను కేటాయించింది. అయితే ఈ కేటాయింపులను అదే సంవత్సరం మార్చి 20న ప్రభుత్వం నిలుపుదల చేసింది. ఇదే సమయంలో రెవెన్యూశాఖ కార్యదర్శి పిటిషనర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన స్టే, షోకాజ్ నోటీసులను సవాల్ చేస్తూ పిటిషనర్ ఉమ్మడి రాష్ట్ర హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయగా రివిజినల్ విభాగాన్ని సంప్రదించాలని కోర్టు సూచించింది. దీంతో అక్కడికి వెళ్లిన పిటిషనర్‌కు అనుకూలంగా సదరు విభాగం వ్యవహరిం చింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శేషాద్రి హైకోర్టులో 2016 ఫిబ్రవరి 16న రిట్ పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన న్యాయస్థానం ప్రభుత్వానికి అనుకూలం గా తీర్పు చెప్పడంతో భూ కేటాయింపులను రద్దు చేసింది. 50 ఎకరాలు పొందిన ఇతరులు కేసు ఉపసంహరించుకున్నారు. సదరు భూములను ప్రభుత్వం వేలం వేసేందుకు సిద్ధమవుతుండగా దీన్ని సవాల్ చేస్తూ పిటిషనర్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేశారు. అయితే కేసు తేలే వరకు భూములను విక్రయించకూడదని, యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు సూచించింది. తాజాగా ఈ కేసుపై వాదనలు జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఈ మేరకు తుది తీర్పును మంగళవారం వెలువరించింది. దీంతో ప్రభుత్వానికి ఊరట కలిగింది. ప్రస్తుతం ఈ భూమిలో 150 ఎకరాలు ఖాళీగా ఉండగా దీని చుట్టూ యంత్రాంగం ఫెన్సింగ్ వేసింది. మరో 40కి పైగా ఎకరాలను వివిధ అవసరాలకు వినియోగించింది. ఈ భూమిని 2006లోనే అప్పటి హుడా (ప్రస్తుత హెచ్ఎండీఏ)కు రాష్ట్ర ప్రభుత్వం బదలాయించింది. -
రాముడి వారసులున్నారా?
న్యూఢిల్లీ: అయోధ్య రామమందిరం–బాబ్రీమసీదు భూ వివాదం కేసు రోజువారీ విచారణలో భాగంగా శుక్రవారం సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. శ్రీరాముడి సంతతికి చెందిన రఘువంశం వారు అయోధ్యలో ఎవరైనా ఉన్నారా? అని రామ్‌లల్లా విరాజ్మాన్ తరఫు న్యాయవాది పరాశరన్‌ను ప్రశ్నించింది. శ్రీరాముడికి, ఆయన జన్మస్థలానికి చట్టబద్ధత ఉందనీ, కాబట్టి ఆయన పేరుపై ఆస్తులు ఉండొచ్చనీ, పిటిషన్లు దాఖలు చేయొచ్చని పరాశరన్ వాదించారు. ఈ నేపథ్యంలో సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్‌ల రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం స్పందిస్తూ..‘మేం ఉత్సుకతతోనే అడుగుతున్నాం. రఘువంశానికి చెందినవారు ఎవరైనా ఇంకా అయోధ్యలోనే నివాసం ఉంటున్నారా?’ అని అడిగింది. దీంతో పరాశరన్ స్పందిస్తూ..‘దీనికి సంబంధించి నా దగ్గర ఎలాంటి సమాచారం లేదు. త్వరలోనే వివరాలను మీ ముందు ఉంచుతాం’ అని జవాబిచ్చారు. జన్మస్థలాన్ని చట్టబద్ధత ఉన్నవ్యక్తిగా ఎలా పరిగణిస్తారని కోర్టు ప్రశ్నించడంతో..‘ కేదర్నాథ్ ఆలయాన్నే తీసుకుంటే, అక్కడ ఎలాంటి విగ్రహం లేకపోయినా ప్రజలు పూజలు నిర్వహిస్తారు. కాబట్టి ఈ కేసులో జన్మస్థలాన్ని చట్టబద్ధత ఉన్న వ్యక్తిగా పరిగణించవచ్చు’ అని పరాశరన్ తెలిపారు. రోజువారీ విచారణ సాగుతుంది అయోధ్య భూ వివాదం కేసులో ప్రస్తుతం జరుగుతున్న రోజువారీ విచారణ కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు రోజువారీ విచారణ చేపట్టడంపై సున్నీ వక్ఫ్ బోర్డు, ఇతర ముస్లిం పిటిషనర్ల తరఫు న్యాయవాది రాజీవ్ ధావన్ వ్యతిరేకించారు. ఇంతవేగంగా విచారణ జరపడం వల్ల సంబంధిత పత్రాలను అధ్యయనం చేసి విచారణకు సిద్ధం కావడం కష్టంగా ఉందని కోర్టుకు విన్నవించారు. -
ప్రభాస్‌కు ఊరట
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాయ్‌దుర్గ్ పన్మక్త గ్రామంలో కొనుగోలు చేసిన భూమి విషయంలో ప్రముఖ నటుడు ప్రభాస్‌కు హైకోర్టు ఊరట లభించింది. ఆరు దశాబ్దాలుగా సాగుతున్న వందల ఎకరాల భూ వివాదానికి ఫుల్స్టాప్ పెట్టే దిశగా కోర్టు పలు సూచనలు చేసింది. ప్రభాస్ స్వాధీనంలో ఉన్న భూమి నుంచి ఖాళీ చేయించడం చట్ట విరుద్ధమని తేల్చి చెప్పింది. ఈ విషయంలో ప్రభుత్వం చట్టం నిర్దేశించిన విధి విధానాలను అనుసరించలేదని స్పష్టం చేసింది. 1958 నుంచి ఇక్కడి భూములపై వివాదం నడుస్తున్న నేపథ్యంలో తిరిగి ఆ భూమిని ప్రభాస్‌కు స్వాధీనం చేయాలని ఆదేశించలేమంది. భూ క్రమబద్దీకరణకు అతను దరఖాస్తు పెట్టుకుంటే, విస్తృత ప్రజాప్రజాప్రయోజనాలు, ప్రభుత్వ ప్రయోజనాల దృష్ట్యా దాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తీర్పు కాపీ అందుకున్న 8 వారాల్లో ఆ దరఖాస్తుపై తగిన ఉత్తర్వులు జారీ చేయాలంది. ఏళ్ల నుంచి ఉన్న సుదీర్ఘ భూ వివాదాన్ని ప్రభుత్వం పరిష్కరించినట్లవుతుందన్న ఉద్దేశంతో ఈ ఆదేశాలు ఇస్తున్నామని హైకోర్టు తెలిపింది. ప్రభాస్ దరఖాస్తు విషయంలో జారీ చేసే ఉత్తర్వుల ఆధారంగా ఈ వందల ఎకరాల భూమిపై యాజమాన్య హక్కులు కోరుతున్న మిగిలిన వారు కూడా అదే రీతిలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. ప్రభాస్ పెట్టుకున్న దరఖాస్తును ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తే, ఆ భూమి అతని స్వాధీనమవుతుందంది. ప్రభుత్వం అతని దరఖా స్తు ను తిరస్కరిస్తే అతను కోర్టును ఆశ్రయించవచ్చంది. భూమి ఎవరి స్వాధీనంలో ఉందో వారు రిజిస్టర్ సేల్ డీడ్ల ద్వారా ఆ భూములపై సంక్రమించిన హక్కులను వదులుకుని, ప్రభుత్వం నిర్ణయించిన క్రమబద్దీకరణ ఫీజు చెల్లిస్తే, అప్పుడు ప్రభుత్వం ఆ భూములను క్రమబద్దీకరిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ పి.కేశవరావులతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. రాయ్‌దుర్గ్ పన్మక్త గ్రామంలో తనకున్న భూమిని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ అధికారులు ఆ భూమి గేటుకు తాళాలు వేయడాన్ని సవాల్ చేస్తూ ప్రభాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై వాదనలు విన్న ధర్మాసనం, మంగళవారం తీర్పునిచ్చింది. -
‘అయోధ్య మధ్యవర్తి’ తీర్పు రిజర్వు
న్యూఢిల్లీ: అయోధ్య భూవివాద కేసును మధ్యవర్తికి అప్పగించే విషయంలో సుప్రీంకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. సమస్య పరిష్కారానికి అర్హులైన మధ్యవర్తుల పేర్లు సూచించాలని కక్షిదారుల్ని కోరింది. ఈ వ్యవహారంలో త్వరలోనే ఆదేశాలు జారీచేస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్‌ల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం తెలిపింది. వివాద స్వభావం దృష్ట్యా మధ్యవర్తిత్వ మార్గం ఎంచుకోవడం సరైనది కాదని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. సమస్య సద్దుమణిగేందుకు అవకాశం ఉన్నప్పుడే ఈ దిశగా యోచించాలని పేర్కొన్నారు. గతంలోనూ మధ్యవర్తిత్వంతో సమస్య పరిష్కారానికి చాలాసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని కక్షిదారు రామ్‌లల్లా విరాజ్మాన్ తరఫు లాయర్ సీఎస్ వైద్యనాథన్ గుర్తుచేశారు. రాముడు అయోధ్యలోనే జన్మించాడన్న విషయంలో ఎలాంటి వివాదం లేదని, కాబట్టి ఈ వ్యవహారంలో మధ్యవర్తిత్వం అక్కర్లేదని అన్నారు. అయోధ్యలో వివాదాస్పద భూమి ప్రభుత్వానికే చెందుతుందని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి అన్నారు. ఆ స్థలంలో ఆలయం ఉండేదని గుర్తిస్తే, రామాలయ నిర్మాణానికి భూమి కేటాయిస్తామని 1994లో పీవీ ప్రభుత్వం కోర్టుకు మాట ఇచ్చిన సంగతిని ప్రస్తావించారు. వివాదం ఆస్తికే సంబంధించికాదని, సెంటిమెంట్లు, విశ్వాసాలతోముడిపడి ఉందని వ్యాఖ్యానించింది. మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోవాలన్న కోర్టు సూచనకు ముస్లిం సంస్థలు అంగీకరించగా, హిందూ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. -
లగడపాటి హైడ్రామా
-
లగడపాటి హైడ్రామా
హైదరాబాద్: ఫోర్జరీ పత్రాలతో ఖరీదైన స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన బంజారాహిల్స్ పోలీసులను మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అడ్డుకుని హైడ్రామా సృష్టించారు. వారంట్ లేకుండా అరెస్ట్ ఎలా చేస్తారంటూ వాగ్వాదానికి దిగడంతో పాటు రాత్రంతా నిందితుడి ఇంట్లోనే ఉన్నారు. ఈ ఘటన జూబ్లీహిల్స్‌లో కలకలం సృష్టించింది. బంజారాహిల్స్ రోడ్ నం.12లోని కమాన్ లోపల షేక్‌పేట మండలం పరిధిలోని సర్వే నం. 120/30లో ఉన్న స్థలానికి సంబంధించి చాలా ఏళ్లుగా వివాదం నడుస్తోంది. ఈ స్థలం ఉమెన్ కో ఆపరేటివ్ సొసైటీకి కేటాయించగా, ప్లాట్లుగా చేసి పలువురికి విక్రయించారు. కాగా జూబ్లీíహిల్స్ రోడ్ నం.65లో ఉండే గోడి పిచ్చిరెడ్డి అలియాస్ జీపీ రెడ్డి ఈ స్థలానికి ఫోర్జరీ పత్రాలను సృష్టించి కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారంటూ ఎం.కృష్ణారెడ్డి 2016లో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉమెన్ కో ఆపరేటివ్ సొసైటీకి చెందిన కల్పన నుంచి ఈయన ఈ స్థలానికి జీపీఏ పొందారు. ఈ కేసులో నిందితులైన ఆరుగురిని గత యేడాది డిసెంబర్లో అరెస్ట్ చేయగా, కీలక సూత్రధారి పిచ్చిరెడ్డి అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టును ఆశ్రయించి అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ పొందారు. ఏసీబీ దర్యాప్తు చేపట్టాలన్న హైకోర్టు... ఫిర్యాదుదారులు హైకోర్టును ఆశ్రయించడంతో బెయిల్ రద్దు చేయడంతోపాటు ఏసీబీ దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పిచ్చిరెడ్డి అజ్ఙాతంలోకి వెళ్లారు. గురువారం రాత్రి జూబ్లీహిల్స్‌లోని ఇంటికి నిందితుడు వచ్చినట్లు తెలియడంతో పోలీసులు అక్కడికి చేరుకుని స్టేషన్‌కు రావాలని కోరారు. బట్టలు మార్చుకుని వస్తానంటూ లోనికి వెళ్లిన పిచ్చిరెడ్డి తన స్నేహితుడైన లగడపాటికి ఫోన్ చేశారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో లగడపాటి అక్కడకు చేరుకున్నారు. స్థల (సివిల్) వివాదంలో పోలీసులు ఎందుకు కలుగజేసుకుంటున్నారంటూ హుంకరించారు. 5 నెలల క్రితం నుంచి పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేయడానికి వారెంట్ అవసరం లేదని ఎస్ఐలు శ్రీనివాస్, పీడీ నాయుడు లగడపాటికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. మీడియాను పిలిపిస్తానంటూ బెదిరింపులకు దిగారు. ఉదయాన్నే తాను పిచ్చిరెడ్డిని తీసుకువచ్చి అప్పగిస్తానంటూ చెప్పారు. ఇదే విషయాన్ని కాగితంపై రాసిస్తే తాము వెళ్లిపోతామని పోలీసులు అన్నారు. అయితే పేపర్‌పై రాసివ్వను.. అరెస్ట్ చేయనివ్వను.. అని రాజగోపాల్ భీష్మించుకుని కూర్చున్నారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న మీడియా ప్రతినిధుల ముందు లగడపాటి మరోసారి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం వేశారు. తనను దాటి వచ్చి అరెస్ట్ చేయాలంటూ సవాల్ విసిరి బెడ్రూమ్లోకి వెళ్లి పిచ్చిరెడ్డి నిద్రిస్తుండగా పక్కనే కూర్చున్నారు. తాము వెళ్లిపోతే పిచ్చిరెడ్డి పారిపోతారని పోలీసులు కూడా అతని ఇంటి వద్దే కూర్చున్నారు. తెల్లవారుజాము 6గంటల దాకా ఇదే హైడ్రామా సాగింది. ఐజీ నాగిరెడ్డి ఒత్తిడితోనే... ఉదయం 7గంటల తర్వాత లగడపాటి మళ్లీ పోలీసులపై ఆరోపణలు కొనసాగించారు. ఈ కేసు సివిల్ వ్యవహారం అని ఐజీ నాగిరెడ్డి ఒత్తిడితోనే అర్ధరాత్రి పోలీసులు ఇంటిపైకి వచ్చారని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు వచ్చిన కారణంగా ఎవరూ బదిలీ చేయరన్న ధీమాతో ఏమైనా చేయవచ్చని అనుకుంటున్నారా అని నిలదీశారు. పోలీసులకు ఎవరిపైనైనా కేసులు పెట్టే అధికారం ఉందని కానీ విస్తృత అధికారాలు ఉపయోగించి ఎవరినైనా అరెస్ట్ చేయాలని అనుకుంటే కుదరదని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ రోడ్ నం.12లో ఐపీఎస్ అధికారికి చెందిన భూమికి తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించారని పోలీసు కేసు ఉందని, ఈ విషయమై జీపీ రెడ్డి 20 సార్లు స్టేషన్లో హాజరయ్యారన్నారు. ఈ వ్యవహారాన్ని నాగిరెడ్డితో సెటిల్ చేసుకోవాలని పోలీసులు తన స్నేహితుడిని వేధిస్తున్నారన్నారు. ఈ సోదాల వెనుక నాగిరెడ్డితో పాటు ఓ డీసీపీ ఉన్నారని దీనిపై గవర్నర్, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందంటూ ఉన్నతాధికారులు చెప్పడంతో పోలీసులు వెనుదిరిగారు. జీపీ రెడ్డిపై లుక్ అవుట్ నోటీసు.. సుమారు రూ.300 కోట్ల విలువైన స్థలానికి సంబంధించి ఫోర్జరీ పత్రాలను తయారు చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియల్టర్ జీపీ రెడ్డిపై గతంలో కూడా పలు ఆరోపణలు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. బెంగళూరు కేంద్రంగా పలు వివాదాల్లో పిచ్చిరెడ్డి పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో 5 నెలలుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న ఆయనపై విదేశాలకు పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. లగడపాటి వ్యాఖ్యల్లో వాస్తవం లేదు తాము కూడా బాధితులమేనన్న ఐజీ నాగిరెడ్డి సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని ఉమెన్ కో–ఆపరేటివ్ సొసైటీ వివాదం నేపథ్యంలో తనను ఉద్దేశించిన లగడపాటి చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఐజీ వై.నాగిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఆ సొసైటీలో సభ్యురాలిగా ఉన్న తన సమీప బంధువు పల్లంరెడ్డి హంసమ్మ స్థలం ఖరీదు చేసి మోసపోయారని, ఈ నేపథ్యంతో తమ కుటుంబమూ బాధితులుగా మారిందని ఆయన వివరించారు. ఈ కేసు దర్యాప్తు తదనంతర చర్యల్లో రెండేళ్లు జాప్యం జరిగి, నిందితుడు మరికొన్ని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినప్పటికీ ఏ దశలోనూ తాను జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. జీపీ రెడ్డిని కానీ, ఆయన అల్లుడిని కానీ కలవడం, మాట్లాడటం జరగలేదని పేర్కొన్నారు. వారిని బెదిరించానంటూ లగడపాటి చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు. చట్ట ప్రకారం స్థానిక పోలీసులు తీసుకున్న చర్యల్ని తనకు ఆపాదించడం సబబుకాదన్నారు. పోలీసులు న్యాయం చేస్తారనే ఉద్దేశంతో సొసైటీ సభ్యులు రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారని నాగిరెడ్డి అన్నారు. -
ఆత్మహత్య చేసుకోబోతున్నా..సెల్ఫీ వీడియో
ధర్మసాగర్(స్టేషన్‌ఘన్‌పూర్): తనపై సీఐ చేయి చేసుకున్నందున మనస్తాపం చెంది రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసి వాట్సప్ గ్రూప్‌లో పోస్ట్ చేయడం శనివారం కలకలం సృష్టించింది. కొన్ని గంటలపాటు ఉత్కంఠకు దారితీయగా చివరకు ఆ యువకుడు క్షేమంగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్లే.. వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామానికి చెందిన యువకుడు జక్కుల సుధీర్‌కు, ఎంపీపీ వల్లపురెడ్డి లక్ష్మి భర్త రమణారెడ్డికి మధ్య కొన్నేళ్లుగా ఓ భూమి విషయంలో వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జూన్ 30న సుధీర్‌పై దాడి జరగ్గా, ప్రతిగా అతడి వర్గీయులు జూలై 1వ తేదీన నారాయణగిరి గ్రామంలో ఉన్న ఎంపీపీ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం 6 గంటలకు తనను సీఐ డి.శ్రీలక్ష్మి పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కొట్టిందని, సమాజంలో చట్టాలను గౌవించే వారికి న్యాయం జరగదని, తన చావుకు సీఐ, ఏసీపీ, ఎంపీపీ భర్త రమణారెడ్డి కారకులు అంటూ 5.10నిమిషాలు, ఒక్క నిమిషం వ్యవధి ఉన్న రెండు వీడియోలను గుర్తుతెలియని ప్రాంతంలో రైల్వేట్రాక్‌పై సెల్ఫీ వీడియో తీసి తానే అడ్మిన్‌గా ఉన్న వాట్సప్ గ్రూప్‌లో అప్లోడ్ చేశాడు. అనంతరం గంట తర్వాత సెల్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. వీడియో చూసిన గ్రూప్ సభ్యులు ఇతర గ్రూపులకు షేర్ చేయగా సర్వత్రా కలకలం రేగింది. సుధీర్ కుటుంబ సభ్యులు, స్నేహితులు 100కు డయల్ చేసి చెప్పి, జీఆర్పీ పోలీసులకు సంప్రదించారు. చివరకు ఉదయం 10గంటల సమయంలో జమ్మికుంట మండలం మడిపల్లిలోని కొడమల్ల సదయ్య ఇంట్లో అతడు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు జమ్మికుంట పోలీస్‌స్టేషన్‌కు తరలించి, అక్కడి నుంచి ధర్మసాగర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి తండ్రి వెంకట్రాజంకు అప్పగించారు. కాగా మూడు గంటల పాటు తీవ్ర ఉత్కంఠ రేపిన ఘటనలో ఆ యువకుడు క్షేమంగా ఉండటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇలా చేయడం సరికాదు... యువకుడి ఆత్మహత్యా బెదిరింపు వీడియో కలకలం రేపిన నేపథ్యంలో డీసీపీ వెంకట్‌రెడ్డి ధర్మసాగర్ పోలీస్ స్టేషన్లో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. విచారణ సమయంలో బాధితులు పోలీసులకు సహకరించాలని, అన్యాయం జరిగినట్లు భావిస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని అన్నారు. సుధీర్‌ను జమ్మికుంట మండలం మడిపల్లిలోని అతడి బాబాయి సదయ్య ఇంట్లో గుర్తించి పలువురు గ్రామస్తుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించి తండ్రికి అప్పగించామని చెప్పారు. కేసు విచారణలో ఉండగా ఇలాంటి వీడియోలు తీసి వాట్సప్‌లో పెట్టడం సరికాదని అన్నారు. సీఐ కొట్టడంతోనే మనస్తాపం చెందా... ధర్మసాగర్ పోలీస్‌స్టేషన్‌కు రావాలని శుక్రవారం ఉదయం ఓ కానిస్టేబుల్ ఫోన్ చేసి చెప్పగా వెళ్లాను. రమణారెడ్డితో జరిగిన గొడవ విషయంలో ఒప్పంద పత్రాన్ని తాను చింపేసినట్లు సంతకం పెట్టాలని, హ్యూమన్ రైట్స్ కమిషన్‌లో పెట్టిన కేసును వాపస్ తీసుకోవాలని సీఐ మేడం నన్ను తీవ్రంగా ఒత్తిడి చేసింది. మా పెద్దమనుషులతో మాట్లాడిన తర్వాత సంతకం పెడతానని నేను చెప్పాను. దీంతో సీఐ మేడం నన్ను తీవ్రంగా కొట్టింది. మేడం కొట్టడంతోనే ఆత్మహత్య చేసుకుందామని సెల్ఫీ వీడియో తీసి వాట్సప్‌లో పెట్టాను. ట్రైన్ ట్రాక్‌పై ఉన్న నన్ను జాగింగ్‌కు వచ్చిన వాళ్లు గుర్తించి తీసుకెళ్లి ఊర్లో వదిలారు. అక్కడి నుంచి మా బాబాయి ఇంటికి వెళ్లాను. మనస్తాపంతోనే ఈవిధంగా చేశాను. – జక్కుల సుధీర్, బాధితుడు సుధీర్‌ను కొట్టలేదు.. గతంలో ఉన్న కేసు విషయంపై సుధీర్‌ను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి మాట్లాడి పంపించా. అతడిపై ఎవరూ చేయి చేసుకోలేదు. సుధీర్ ఆరోపిస్తున్న హ్యూమన్ రైట్స్ కమిషన్ కేసు విషయంలో మేము వివరణ ఇచ్చుకుంటాం. కేసు వాపస్ తీసుకోవాలని ఒత్తిడి తీసుకువచ్చినట్లు చెబుతున్న ఆరోపణ పూర్తిగా అవాస్తవం. – డి.శ్రీలక్ష్మి, ధర్మసార్ సీఐ -
ఓవైసీ ఆస్పత్రికి భూమి కేటాయింపుపై హైకోర్టు స్టే
-
తల్లి, చెల్లిని రోడ్డుపైకి గెంటేసిన సోదరులు
ఖానాపూర్ : వ్యవసాయ భూమికోసం అన్నదమ్ములు మధ్య సఖ్యతలేక కన్న తల్లిని, తోడబుట్టిన చెల్లిని రోడ్డుపై వదిలేసిన సంఘటన ఖానాపూర్ మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని పాత ఎల్లాపూర్ పంచాయతీ పరిధి ఒడ్డెవాడలోని పల్లెపు ఎంకవ్వ, మల్లయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లున్నారు. మల్లయ్య ఎనిమిదేళ్ల క్రితం చనిపోయాడు. ఇద్దరు కూతుళ్లకు వివాహం అయినప్పటికీ ఒక కూతురు నర్సవ్వ తల్లి ఎంకవ్వతోనే ఉంటోంది. పదేళ్లుగా ఎంకవ్వ పెద్ద కొడుకు ఎంకటి, చిన్న కొడుకు జగన్ తల్లీచెల్లి సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో వారిద్దరూ కూలీ పనులు చేసుకునే చిన్న కొడుకు ఇంటి వద్ద ఉన్న ఓ గుడిసెలో నివసిస్తున్నారు. కాగా.. గ్రామంలోని చెరువు వద్ద ఆర్‌ఓఎఫ్‌ఆర్‌కు చెందిన సుమారు రెండెకరాల భూమి ఉంది. ఆ భూమి పదేళ్లకుపైగా పెద్ద కుమారుడు ఎంకటి సాగు చేసుకుంటున్నాడు. దీంతో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిలో నుంచి తనకు సగం వాటా ఇవ్వాలని జగన్ అన్నను కోరాడు. దానికి అన్న ససేమిరా అన్నాడు. దీంతో అన్న ఇంటి వద్ద కు పోవాలని ఇంటి నుంచి తల్లీచెల్లిని గెంటివేశా డు. పెద్ద కుమారుడు కూడా తన వద్ద వద్దనడం తో గ్రామంలోని ప్రధాన రహదారి వద్ద గల చెట్టు కిందకు తల్లీచెల్లి చేరారు. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా వారిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో పోలీసులు శుక్రవారం ఈ ఘటనపై కేసు నమోదు చేసే అవకాశాలున్నాయి. -
పూరి జగన్నాథ్ దంపతులపై ఫిర్యాదు
హైదరాబాద్: ప్రముఖ సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్ చిక్కుల్లో పడ్డారు. పూరీ జగన్నాథ్, ఆయన సతీమణి లావణ్యపై సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు అందింది. 5 కోట్ల రూపాయల భూవివాదంలో వారిపై బాధితులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. హిట్ సినిమాలతో టాప్ డైరెక్టర్ గా ఎదిగిన పూరి జగన్నాథ్ అగ్ర హీరోలందరితో సినిమాలు చేశాయి. సొంతంగా వైష్టో అకాడమి స్థాపించి సినిమాలు కూడా నిర్మించారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. -
భూ వివాదం కేసులో 23 మంది అరెస్ట్
చింతలపూడి : టి.నరసాపురం మం డలం అల్లంచెర్ల రాజుపాలెం, కొత్తగూడెం అటవీ భూ వివాదాల నేపథ్యంలో రైతులకు చెందిన వ్యవసాయ బోర్లను ధ్వంసం చేశారనే అభియోగంపై 23 మందిని సోమవారం అరెస్ట్ చేసినట్టు జంగారెడ్డిగూడెం డీఎస్పీ ఏవీ సుబ్బరాజు తెలిపారు. చింతలపూడి పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. అల్లంచెర్ల రాజుపాలెం, కొత్తగూడెం గ్రామాల్లో శనివారం రాత్రి 18 మంది రైతులకు చెందిన వ్యవసాయ బోర్లు, మోటార్లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్టు అందిన ఫిర్యాదుపై విచారించామని చెప్పారు. ఘటనకు బాధ్యులైన 27 మందిపై సెక్షన్ 307, 447, 427, పీడీపీపీ, ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్టు వివరించారు. నిందితుల్లో 23 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. వారినుంచి కత్తులు స్వాధీనం చేసుకున్నామన్నా రు. మిగిలిన నలుగురిని త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. గ్రామంలో 180 ఎకరాల అటవీ భూమిపై చాలాకాలంగా వివాదం కొనసాగుతోందని చెప్పారు. 2006 సంవత్సరంలో కేసు లు కూడా నమోదయ్యూయని చెప్పా రు. సదరు భూమిపై కోర్టులో నమోదైన కేసును కొట్టివేయగా, మళ్లీ భూ వివాదం తలెత్తిందని వివరించారు. ఈ నేపథ్యంలోనే నిందితులు ప్రత్యర్థులకు చెందిన బోర్లు, మోటార్లను కత్తులతో ధ్వంసం చేసి నష్టం కలిగించారన్నారు. సకాలంలో పోలీసులు స్పంది చడంతో ఉద్రిక్తత తగ్గిందన్నారు. ముందుజాగ్రత్త చర్యగా గ్రామంలో పోలీస్ పికెట్‌ను కొనసాగిస్తున్నామన్నారు. ప్రధాన నిందితులపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామన్నారు. వారి ప్రవర్తనపై నిరంతరం నిఘా ఉంచుతామని చెప్పారు. సమావేశంలో సీఐ ఎం.వెంకటేశ్వరరావు, టి.నరసాపురం ఎస్సై జీజే విష్ణువర్దన్, చింతలపూడి ఎస్సై వీఎస్ వీరభద్రరావు పాల్గొన్నారు.