భూ వివాదం కేసులో 23 మంది అరెస్ట్
చింతలపూడి : టి.నరసాపురం మం డలం అల్లంచెర్ల రాజుపాలెం, కొత్తగూడెం అటవీ భూ వివాదాల నేపథ్యంలో రైతులకు చెందిన వ్యవసాయ బోర్లను ధ్వంసం చేశారనే అభియోగంపై 23 మందిని సోమవారం అరెస్ట్ చేసినట్టు జంగారెడ్డిగూడెం డీఎస్పీ ఏవీ సుబ్బరాజు తెలిపారు. చింతలపూడి పోలీస్ స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడారు. అల్లంచెర్ల రాజుపాలెం, కొత్తగూడెం గ్రామాల్లో శనివారం రాత్రి 18 మంది రైతులకు చెందిన వ్యవసాయ బోర్లు, మోటార్లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్టు అందిన ఫిర్యాదుపై విచారించామని చెప్పారు. ఘటనకు బాధ్యులైన 27 మందిపై సెక్షన్ 307, 447, 427, పీడీపీపీ, ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్టు వివరించారు.
నిందితుల్లో 23 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. వారినుంచి కత్తులు స్వాధీనం చేసుకున్నామన్నా రు. మిగిలిన నలుగురిని త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. గ్రామంలో 180 ఎకరాల అటవీ భూమిపై చాలాకాలంగా వివాదం కొనసాగుతోందని చెప్పారు. 2006 సంవత్సరంలో కేసు లు కూడా నమోదయ్యూయని చెప్పా రు. సదరు భూమిపై కోర్టులో నమోదైన కేసును కొట్టివేయగా, మళ్లీ భూ వివాదం తలెత్తిందని వివరించారు. ఈ నేపథ్యంలోనే నిందితులు ప్రత్యర్థులకు చెందిన బోర్లు, మోటార్లను కత్తులతో ధ్వంసం చేసి నష్టం కలిగించారన్నారు. సకాలంలో పోలీసులు స్పంది చడంతో ఉద్రిక్తత తగ్గిందన్నారు. ముందుజాగ్రత్త చర్యగా గ్రామంలో పోలీస్ పికెట్‌ను కొనసాగిస్తున్నామన్నారు. ప్రధాన నిందితులపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామన్నారు. వారి ప్రవర్తనపై నిరంతరం నిఘా ఉంచుతామని చెప్పారు. సమావేశంలో సీఐ ఎం.వెంకటేశ్వరరావు, టి.నరసాపురం ఎస్సై జీజే విష్ణువర్దన్, చింతలపూడి ఎస్సై వీఎస్ వీరభద్రరావు పాల్గొన్నారు.