లక్నో: అయ్యో బిడ్డా.. అప్పుడే నీకు నూరేళ్లు నిండాయా! ఉన్నతంగా చదువుకుని నన్ను, మీ నాయనను మంచిగా చూసుకుంటావని చెబితవిగా ..అప్పుడే ఇంత పనైందేంది బిడ్డా అంటూ.. అల్లంతా దూరాన మొండం.. పక్కనే తెగి పడిన కుమారుడి తలను ఒడిలోకి తీసుకుని లాలిస్తూ.. రోదిస్తున్న తీరు చూసి చూపరులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఉత్తరప్రదేశ్‌లో భూ తగాదా ఓ 17 ఏళ్ల అనురాగ్‌ను బలి తీసుకున్నాయి. రెండు వర్గాల మధ్య జరిగిన భూ తగాదాలో ఓ వర్గం ప్రత్యర్థి వర్గానికి చెందిన బాలుడిని తలను నరకడంతో భయానక వాతావరణం నెలకొంది.
గౌరబాద్‌షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కబీరుద్దీన్ గ్రామంలో రెండు వర్గాల మధ్య భూతగాదా కొన్నేళ్లుగా కొనసాగుతూ వస్తుంది. తాజాగా, బుధవారం రోజు ఘర్షణ హింసాత్మకంగా మారింది. భూ తగాదాలో రామ్ జీత్ యాదవ్ కుటుంబం సభ్యులపై ప్రత్యర్థి వర్గం దాడులకు తెగబడింది. ఈ దాడులు జరిగే సమయంలో ప్రత్యర్థులు మారణాయుధాలతో రామ్ జీత్ కుమారుడు అనురాగ్ వెంటబడ్డారు.
నిందితుల్లో ఓ వ్యక్తి అనురాగ్ తలను పదునైన కత్తి నరికాడు. దీంతో అతడి తల, మొండెం వేరయ్యాయి. అనంతరం నిందితుడు పరారయ్యాడు. అయితే కుమారుడి మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కొన్ని గంటల పాటు కుమారుడి తలను ఒడిలోకి తీసుకొని గుండెలవిసేలా రోదిస్తున్న తల్లిని చూసేవారి కళ్ళు కూడా చెమర్చాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దారుణానికి ఒడిగట్టిన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment