chintalapudi
-
టీడీపీని మేమే ఓడిస్తాం.. జనసేన నేతల వార్నింగ్
సాక్షి, ఏలూరు జిల్లా: చింతలపూడిలో టీడీపీ-జనసేన పార్టీలో ముసలం పుట్టింది. జంగారెడ్డిగూడెంలో జరిగిన చింతలపూడి నియోజకవర్గం జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే తీరుపై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలిపించిన టీడీపీని తామే ఓడిస్తామంటూ మాజీ డీసీసీబి చైర్మన్ కరాటం రాంబాబు హెచ్చరించారు.టీడీపీ నేతలు జనసేన పార్టీ పట్ల వివక్ష చూపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఒకలా ఎన్నికల అనంతరం మరోలా టీడీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని నేతలు వాపోయారు. అన్ని గ్రామాల్లో.. జనసేన పార్టీకి, కేడర్‌కు సరైన ప్రాధాన్యత లభించడం లేదని సమావేశంలో ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. సమస్యలు త్వరగా పరిష్కరించకపోతే రాబోయే ఎన్నికల్లో టీడీపీకి ఓటమి ఖాయం అని జనసేన శ్రేణులు అంటున్నాయి. వెంటిలేటర్ మీద ఉన్న టీడీపీ పార్టీని బతికించింది జనసేన పార్టీ అని గుర్తు పెట్టుకోవాలంటూ టీడీపీ నేతలకు వార్నింగ్‌లు ఇస్తున్నారు. -
నల్ల బంగారులోకం!
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఆంధ్రా సింగరేణిగా ఏలూరు జిల్లా చింతలపూడి ప్రాంతం వెలుగొందనుంది. నల్ల బంగారు గనులతో రాష్ట్రానికి కాసుల పంట పండించనుంది. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనుంది. నవ్యాంధ్ర అభివృద్ధికి ఊతం అందించనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 80 బొగ్గు గనుల వేలానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆ జాబితాలో ఏలూరు జిల్లా చింతలపూడి సెక్టార్ ఏ–1 (ఎస్డబ్ల్యూ), చింతలపూడి సెక్టార్ ఏ–1 (ఎస్ఈ)లు 44, 45 స్థానాల్లో ఉన్నాయి. ఈ రెండు సెక్టార్లు కూడా చింతలపూడి మండలంలోనే ఉండటం విశేషం. దీంతో చింతలపూడి మండలంలో నాణ్యమైన బొగ్గు తవ్వకాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలోనే వేలంలో చోటు దక్కినా...!చాట్రాయి మండలం సోమవరం గ్రామం నుంచి చింతలపూడి వరకు 2వేల మిలియన్ టన్నుల నుంచి 3వేల మిలియన్ టన్నుల బొగ్గు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తెలంగాణలోని సింగరేణి తరహాలో ఇక్కడ బొగ్గు తవ్వకాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి 2015లో ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎండీసీ) లేఖ రాసింది. దానిపై కేంద్రం స్పందించలేదు. కానీ, గతంలో కేంద్రం దేశవ్యాప్తంగా నిర్వహించిన బొగ్గు గనుల వేలంలో ప్రస్తుతం ఏలూరు జిల్లా చాట్రాయి మండలం సోమవరం, తడికలపూడితోపాటుగా చింతలపూడి బ్లాక్‌లోని జంగారెడ్డిగూడెం కూడా ఉన్నాయి. ఈ వేలంలో సింగరేణి సంస్థ పోటీలో లేక పోవడంతో బొగ్గు గనుల వేలం వాయిదా పడింది. తాజాగా ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి దేశవ్యాప్తంగా నూతన బొగ్గు గనుల వేలం జాబితాను ప్రకటించగా, చింతలపూడి సెక్టార్ ఏ–1 (ఎస్డబ్ల్యూ), చింతలపూడి సెక్టార్ ఏ–1 (ఎస్ఈ)లకు చోటు దక్కింది. దీంతో బొగ్గు తవ్వకాలు ప్రారంభమైతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రజలు భావిస్తున్నారు.60 ఏళ్ల నుంచి అన్వేషణ.. » ఉమ్మడి పశ్చిమ, కృష్ణా జిల్లాల పరిధిలో బొగ్గు గనులను కనుగొనేందుకు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ)తోపాటు వివిధ సంస్థలు 60 ఏళ్ల నుంచి సర్వేలు చేశాయి. తొలి దశలో 1964 నుంచి 2006 వరకు నాలుగు దఫాలుగా సర్వేలు నిర్వహించారు. 2006 నుంచి 2016 వరకు మళ్లీ సర్వేలు కొనసాగాయి. » అన్ని సర్వేల్లోనూ చింతలపూడి ప్రాంతంలో నాణ్యమైన బొగ్గు గనులు ఉన్నట్లు గుర్తించారు. ఆయా సర్వే సంస్థల నివేదికల్లో కొన్ని స్వల్ప తేడాలు ఉన్నప్పటికీ చింతలపూడి మండలంలో 30 కిలో మీటర్ల వ్యాసార్థంలో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నట్లు దాదాపు అన్ని సంస్థలు అంచనా వేశాయి. » లక్నోకు చెందిన బీర్బల్ సహానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలియో బోటనీ అనే సంస్థ 2013లో నాటి కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో బొగ్గు గనులపై అధ్యయనం చేసింది. చాట్రాయి మండలం సోమవరం నుంచి చింతలపూడి, టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం మండలాల మీదుగా రాజమండ్రి వరకు నాణ్యమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించింది. ఇతర రాష్ట్రాల్లో లభించే బొగ్గుతో పోల్చితే ఇక్కడ అత్యంత నాణ్యమైన గ్రేడ్–1 రకం బొగ్గు ఉన్నట్లు ఆ సంస్థ పేర్కొంది. అది కూడా భూ ఉపరితలానికి 500 మీటర్ల లోతులోనే బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని వెల్లడించింది. » సౌత్ వెస్ట్ పినాకిల్ సంస్థ మరో సంస్థతో కలిసి చింతలపూడి ప్రాంతంలో 120 పాయింట్లను గుర్తించి అధునాతన రిగ్గులతో డ్రిల్లింగ్ చేపట్టింది. ఈ 120 పాయింట్ల ద్వారా సుమారు 65,000 మీటర్ల లోతున బొగ్గు అన్వేషణ చేపట్టి సుమారు 40,000 మీటర్ల పనులు పూర్తి చేసింది. » ఇక్కడ గనుల్లో తవ్వకాలు ప్రారంభమైతే ఏడాదికి 8 వేల మెగావాట్లు చొప్పున 60 సంవత్సరాల వరకు విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు సరిపోతుందని వివిధ సర్వే రిపోర్టుల ఆధారంగా అధికారులు అంచనా వేశారు. -
చింతలపూడి టీడీపీలో కొట్లాటలు
-
చింతలపూడి వంద పడకల ఆసుపత్రి పనులు వేగవంతం
-
దళారీ వ్యవస్థ లేకుండా ప్రజలకు సంక్షేమ ఫలాలు: విజయరాజు
-
చంద్రబాబు మీద నమ్మకం లేక మొహం చాటేస్తున్న జనం
-
పేదజనం కల నెరవేర్చిన జగనన్న ప్రభుత్వం
-
పవన్ కళ్యాణ్ పై చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా ఫైర్
-
స్థలం వివాదం పరిష్కరిస్తానని.. వివాహేతర సంబంధం పెట్టుకుని..
చింతలపూడి(ఏలూరు జిల్లా): చింతలపూడిలో మహిళ మిస్సింగ్ కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. మహిళను హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. స్థానిక పోలీస్ సర్కిల్ కార్యాలయంలో బుధవారం ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ కేసు వివరాలు వెల్లడించారు. చింతలపూడి ఎస్బీఐ నగర్‌కు చెందిన పొట్ల నాగమణి(37) భర్త చనిపోవడంతో ఇద్దరు కుమార్తెలతో పాటు అత్త , మామలతో కలిసి ఉంటుంది. ఖమ్మం జిల్లా గంగారం గ్రామంలో స్థలం విషయంలో వైరాకు చెందిన నంబూరి శ్రీనివాసరావుతో ఆమెకు పాత గొడవలు ఉన్నాయి. మృతురాలు 2016లో ఇదే స్థల వివాదంలో సివిల్ కోర్టులో పిటిషన్ వేసింది. మూడు సంవత్సరాల క్రితం చింతలపూడి మండలం, ఎండపల్లి గ్రామానికి చెందిన బర్రె రాంబాబు నాగమణికి పరిచయమయ్యాడు. తనకు తెలిసిన పెద్దలతో మాట్లాడి స్థలం వివాదం పరిష్కరిస్తానని నమ్మబలికాడు. అనంతరం నాగమణితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. స్థల వివాదం పరిష్కరించాలని నాగమణి పట్టుబట్టడంతో రాంబాబు శ్రీనివాసరావును కలిశాడు. నాగమణిని అడ్డు తప్పిస్తే ఉన్న స్థలంలో 6 కుంట్లతో పాటు రెండు లక్షల నగదు ఇస్తానని శ్రీనివాసరావు చెప్పడంతో రాంబాబు అంగీకరించాడు. దీంతో ఇద్దరూ పథకం ప్రకారం నాగమణిని అడ్డు తప్పించాలనుకున్నారు. గత నెల 19న రాంబాబు కారులో కాకినాడ సర్పవరం జంక్షన్లో ఉన్న శ్రీనివాస లాడ్జికి నాగమణిని తీసుకెళ్ళాడు. అదే రోజు రాత్రి కారు జాకీ రాడ్‌తో తలపై కొట్టి చీర చెంగుతో మెడకి గట్టిగా బిగించి హత్య చేశాడు. చదవండి: షాకింగ్.. ప్రియుడి మోజులో పడి.. భార్య ఎంతపని చేసిందంటే.. అనంతరం ఆమె మెడలో ఉన్న బంగారు ఆభరణాలు చేతికి ఉన్న బ్రాస్లెట్లు తీసుకున్నాడు. లాడ్జికి దగ్గరలో ఉన్న ఎరువుల దుకాణంలో పెట్రోలు డబ్బా, ఎరువుల సంచి కొని మృతదేహాన్ని మూటకట్టి కారులో వేసి 21వ తేదీ తెల్లవారుజామున తెలంగాణ రాష్ట్రం దమ్మపేట మండలం ఆర్లపెంట గ్రామ శివారులోని డంపింగ్ యార్డు వద్ద పెట్రోల్ పోసి నాగమణి మృతదేహాన్ని తగలబెట్టాడు. అనంతరం మృతురాలి సోదరుడితో కలిసి చింతలపూడి పోలీసులకు నాగమణి కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. రాంబాబుపై అనుమానం వచ్చి విచారించగా పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నారు. సీఐ ఎంవీఎస్ మల్లేశ్వరరావు తన సిబ్బందితో రాంబాబుతో పాటు నంబూరి శ్రీనివాసరావును పట్టుకుని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. -
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఎలీజాకు తప్పిన ప్రమాదం
-
చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజాకు తప్పిన ప్రమాదం
సాక్షి, ఏలూరు జిల్లా: చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజాకు ప్రమాదం తప్పింది. కామవరపుకోట మండలం ఆడమిల్లి వద్ద ఎమ్మెల్యే కారు కరెంట్ పోల్‌ను ఢీకొట్టింది. కార్లో ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే ఎలీజా, కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం మరొక కారులో జంగారెడ్డి గూడెం క్యాంప్ కార్యాలయానికి ఎమ్మెల్యే కుటుంబం చేరుకుంది. చదవండి: పవన్ గందరగోళం.. మళ్లీ ఆ ఇద్దరే రేసులో?! -
ఎంపీ రఘురామపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
పశ్చిమ గోదావరి: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి పోలీస్‌స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు సీఐ ఎంవీఎస్ మల్లేశ్వరరావు శుక్రవారం తెలిపారు. సీఐడీ చీఫ్ పీవీ సునీల్‌కుమార్‌ను అసభ్య పదజాలంతో దూషించడమే కాక కులం పేరుతో అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చింతలపూడికి చెందిన గొంది రాజు, ఎయిమ్ సభ్యుడు కాకర్ల సత్యనారాయణ, ఎంఎస్ రాజేంద్ర, బుచ్చిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అంబేడ్కర్ మిషన్ నాయకులు మాట్లాడుతూ.. బ్యాంకులను మోసం చేసి ప్రజల సొమ్మును దోచుకున్న రఘురామ నిజాయితీపరుడైన అధికారిని దూషించడాన్ని ఖండించారు. -
టిఫిన్ హోటల్‌కు రూ.21 కోట్ల కరెంటు బిల్లు
చింతలపూడి/ఏలూరు (ఆర్ఆర్ పేట): పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలోని ఒక చిన్న హోటల్ యజమానికి విద్యుత్ అధికారులు షాకిచ్చారు. పట్టణానికి చెందిన సాయి నాగమణి కొత్త బస్టాండ్ సమీపంలో టిఫిన్ హోటల్ నడుపుతున్నారు. సెప్టెంబర్ నెలకు సంబంధించి ఏకంగా రూ.21,48,62,224 విద్యుత్ బిల్లు ఆమె చేతిలో పెట్టడంతో నివ్వెరపోయారు. విషయాన్ని విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా బుధవారం అధికారులు రంగంలోకి దిగి బిల్లును సరిచేశారు. సాంకేతిక లోపం కారణంగానే బిల్లు తప్పు వచ్చిందని సరిచేసినట్లు ట్రాన్స్‌కో ఏఈ శంకర్రావు తెలిపారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వినియోగదారునికి కొత్త బిల్లు అందజేస్తామన్నారు. నిర్లక్ష్యంపై చర్యలు.. విద్యుత్ మీటర్లకు రీడింగ్ సమయంలో అప్పుడప్పుడు మీటర్లలో గానీ, మీటర్ రీడింగ్ మెషీన్లో గానీ సాంకేతిక లోపాల కారణంగా బిల్లులో సమస్యలు వస్తాయని తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏలూరు ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎస్.జనార్ధనరావు స్పష్టం చేశారు. ఈనెల 7న చింతలపూడి సెక్షన్లో గత నెలలో మార్చిన మీటర్లో ఏర్పడిన సాంకేతిక సమస్య వల్ల వినియోగదారుని బిల్లులో భారీ మొత్తం నమోదైందన్నారు. ఈ విషయం అక్కడి ఏఈ దృష్టికి రాగా బుధవారం తిరిగి రీడింగ్ తీసి బిల్లును సరిదిద్దినట్లు వెల్లడించారు. బిల్లు తీయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మీటర్ రీడర్ ప్రభాకర్‌ను విధుల నుంచి తొలగించామని, చింతలపూడి ఏఈని సస్పెండ్ చేశామని వివరించారు. ఇవీ చదవండి: మచ్చా అన్నందుకు డబుల్ మర్డర్ అందగత్తెకు మత్తు మరక.. మళ్లీ తెరపైకి ప్రముఖ యాంకర్ -
అంబేడ్కర్ విగ్రహానికి అవమానం
చింతలపూడి(పశ్చిమగోదావరి): భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి అవమానం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న ఆయన విగ్రహానికి శనివారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పుల దండ వేశారు. ఈ విషయం తెలిసి ఆగ్రహించిన దళిత సంఘాల నేతలు ఆదివారం ఉదయం పాత బస్టాండ్ సెంటర్లో ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. (చదవండి: అది టీడీపీ నేతల కుట్రే) దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు. ఆందోళనలకు వైఎస్సార్సీపీతో సహా పలు రాజకీయపారీ్టల నేతలు మద్దతు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ఎలీజా పాత బస్టాండ్ సెంటర్‌కు చేరుకుని అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. దళిత సంఘాల నాయకులతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. దళిత నాయకులు, ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.(చదవండి: టీడీపీ ప్రలోభాలు) దోషులకు కఠిన శిక్ష తప్పదు: డీఎస్పీ జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవికిరణ్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని చెప్పుల దండను తొలగించారు. దళిత సంఘాల నాయకులతో చర్చలు జరిపారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. డాగ్ స్క్వాడ్‌ను రప్పించి, సీసీ కెమెరాల ఆధారంగా దోషులను పట్టుకోవడానికి విచారణ జరుపుతున్నారు. -
అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసిన దుండగులు
సాక్షి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో అంబేడ్కర్ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. స్థానికంగా ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు చెప్పులు దండ వేసి రాజ్యాంగ రచయితను ఘోరంగా అవమానించారు. ఈ దురాఘాతానికి పాల్పడిన వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అంబేడ్కర్ విగ్రహానికి జరిగిన అవమానానికి నిరసనగా జంగారెడ్డిగూడెం, లక్కవరం మండలాల్లో దళిత సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. స్థానికంగా ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు దళిత సంఘాల నేతలు పాలాభిషేకం చేశారు. ఈ విషయంపై చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా మాల్లాడుతూ.. అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానించిన వారు ఎంతటివారైనా విడిచి పెట్టేది లేదని హామీ ఇచ్చారు. మేధావి, మహనీయుడు, ప్రతిభావంతుడైన అంబేడ్కర్‌కు ఘోర అవమానం జరిగిందని, అతని విగ్రహానికి చెప్పుల దండ వేయటం చాలా బాధాకరం ఆయన పేర్కొన్నారు. అంబేడ్కర్ ఆకాశం లాంటి వారని, ఆయన మీద ఉమ్మి వేసే ఆలోచన చేస్తే అది వారి మీదే పడుతుంది ఆయన వ్యాఖ్యనించారు. దళిత సంఘాలతో పాటు ఎమ్మెల్యే కూడా ర్యాలీలో పాల్గొన్నారు. -
కరోనా నివారణలో ఏపీ ముందంజలో ఉంది
సాక్షి, పశ్చిమగోదావరి: జిల్లాలోని చింతలపూడి నియోజకవర్గంలో డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ కోసం రు.10.20 కోట్లతో భవనాల నిర్మాణాలు చేపట్టామని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పశ్చిమగోదావరి జిల్లాలో 12 వైద్యవిధాన పరిషత్ హాస్పిటల్స్ అభివృద్ధికి రూ.94.88 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని హాస్పిటల్స్ లో మౌలిక సదుపాయాలతో పాటు నాణ్యమైన మందులను ప్రజలకు అందుబాటులో ఉంచామని తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్ నివారణకు అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రం ముందంజలో ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ వైద్య పరీక్షలు రేటును అన్ని ప్రైవేట్ క్యాన్సర్ ఆస్పత్రుల్లో రూ.1600 నుంచి రూ. 800లకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లాలో వైద్యం నిమిత్తం 1563 బెడ్స్, ఆక్సిజన్ పైప్‌లైన్స్ కోసం రూ. 3.10 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజి చొప్పున 16 మెడికల్ కాలేజీలు రూ. 7500 కోట్లతో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పించారని మంత్రి పేర్కొన్నారు. -
టీడీపీ అభ్యర్థికి వింత పరిస్థితి!
సాక్షి, చింతలపూడి (పశ్చిమగోదావరి జిల్లా) : రాష్ట్ర వ్యాప్తంగా అధికార టీడీపీకి వ్యతిరేక గాలి వీస్తోందనడానికి ఈ వీడియోనే నిదర్శనం. ఓ పక్క ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల బహిరంగ సభలతో పాటు పార్టీ అభర్థుల రోడ్‌షోలకు జనం పోటేత్తుతుండగా... మరోవైపు టీడీపీ రోడ్ షోలు మాత్రం జనం లేక వెలవెలబోతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి టీడీపీ అభ్యర్ధి కర్రా రాజారావుకు ఆదివారం వింత అనుభవం ఎదురైంది. జంగారెడ్డిగూడెం మండలం ఏ. పోలవరంలో కర్రా రాజారావు రోడ్ షో నిర్వహించగా ఒక్కరంటే ఒక్కరు కూడా రోడ్డుపై కనిపించలేదు. మరోవైపు ఆయన వెంట కూడా ప్రచారంలో ఇద్దరు ముగ్గురు అనుచరులే ఉండటం టీడీపీ దుస్ధితిని తెలియజేస్తోంది. రోడ్ పై ఒక్కరు లేకపోయినా కూడా కర్రా రాజారావు మాత్రం ఖాళీ రోడ్డు, గోడలకు దండం పెడుతూ.. తనకు, ఎంపీగా మాగంటి బాబుకి ఓటు వేయాలని చెప్పుకు పోవడం.. ఆయన వెంట జీపులో ఉన్న ఇద్దరు అనుచరులకి కూడా ఆశ్చర్యం కలిగించింది. కనీసం తెలుగుదేశం కార్యకర్తలు కూడా లేకుండా చింతలపూడి నియోజకవర్గంలో రోడ్ షో జరుగుతున్న తీరు వారి ఓటమికి సంకేతాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకొంటున్నారని, వైస్ జగన్ సీఎం కావడం కాయమని పేర్కొంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. -
ఒక్కరంటే ఒక్కరు కూడా రోడ్డుపై కనిపించలేదు..
-
చింతలపూడిలో ఎన్నికల ప్రచార సభలో వైఎస్ జగన్
-
ఎలీజా, శ్రీధరన్నను గెలిపించండి : వైఎస్ జగన్
సాక్షి, చింతలపూడి/పశ్చిమగోదావరి : తమ పార్టీ అధికారంలో రాగానే పొదుపు సంఘాల మహిళలకు సున్నావడ్డీ రుణాలు అందిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అదే విధంగా ఎన్నికల సమయం నాటికి పొదుపు సంఘాల్లో ఉన్న మహిళల రుణాలను నాలుగు దఫాలుగా మాఫీ చేస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని చింతలపూడిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. మండుతున్న ఎండను సైతం లెక్కచేయక తన కోసం వచ్చిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు మంచి చేయాలనే తలంపు గల చింతలపూడి వైఎస్సార్ సీపీ అభ్యర్ధి నిలిచిన ఎలీజాను...ఏలూరు ఎంపీ అభ్యర్ధిగా ఎన్నికల బరిలో దిగిన కోటగిరి శ్రీధరన్నను గెలిపించాలని వైఎస్ జగన్ కోరారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని బాబు అడ్డుకున్నారు.. వైఎస్ జగన్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ...‘సుదీర్ఘ పాదయాత్ర చేశాను. 3648 కిలోమీటర్లు నడవగలిగానంటే అందుకు దేవుడి దయ, మీ ఆశీస్సులే కారణం. పాదయాత్రలో మీరు చెప్పిన కష్టాలు, బాధలు విన్నాను. పాదయాత్రలో భాగంగా చింతలపూడిలో పర్యటించినపుడు అవ్వా, తాత, అక్కాచెల్లెమ్మలు, రైతన్నలు నా దగ్గరికి వచ్చి చంద్రబాబు పాలనలో తాము అనుభవిస్తున్న కష్టాల గురించి చెప్పారు. దివంగత మహానేత వైఎస్సార్ బతికి ఉంటే చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి అయ్యేదని రైతులు నాతో అన్నారు. ఐదేళ్లలో చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ఎలా అడ్డుకున్నారో చూశాం. ఈ ప్రాజెక్టు ముంపు మండలాల రైతులకు ఒక్కొక్క మండలంలో ఒక్కో రీతిన నష్టపరిహారం చెల్లించారు. ఒక మండలంలో రూ. 19 లక్షలు... ఇంకొక మండలంలో రూ. 12.50 లక్షలు మాత్రమే ఇచ్చి అన్యాయం చేశారు. ఇక్కడి రైతన్నలు పండిస్తున్న పామాయిల్ రేట్లలో కూడా చంద్రబాబు కోత విధిస్తున్నారు. పక్కనే ఉన్న తెలంగాణాతో పోలిస్తే పామాయిల్ ధర సుమారు వెయ్యి రూపాయిలు తక్కువగా ఉందని రైతులు నా దృష్టికి తీసుకొచ్చారు. అదే విధంగా చింతలపూడిలో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని ప్రజలు నా దృష్డికి తెచ్చారు. వంద పడకల ఆసుపత్రి లేకపొవడంతో 50 కిలోమీటర్ల దూరంలోని ఏలూరుకు వెళ్లాల్సి వస్తోందని తమ సమస్యలను చెప్పుకొన్నారు. ఇక ఎన్నికలు దగ్గర పడుతుంటే అధ్వానంగా ఉన్న చింతలపూడి రోడ్లు బాబుకు గుర్తుకు వచ్చాయి. అందుకే చింతలపూడి నుంచి నామవరం వెళ్లే రోడ్డుకు హడావుడిగా శంకుస్థాపన చేశారు. కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇలాంటి చంద్రబాబు మోసపూరిత మాటలను నమ్మవద్దు’ అని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. మీకు నేనున్నాను.. ‘గిట్టుబాటు ధర రాక రైతన్నలు పడిన బాధలు చూశా. మధ్యతరగతి కుటుంబాల కష్టాలు తెలుసుకున్నా. ఫీజు రీఎంబర్స్మెంట్ రాక డబ్బులు లేక...ప్రభుత్వం పట్టించుకోక ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థి కుటుంబాలను కలిశా. ఆరోగ్యశ్రీ అందక మంచాన పడ్డ పేదవాడి గుండె చప్పుడు విన్నాను. నిరుద్యోగ యువత ఆవేదన విన్నా. ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశపడి వేలకు వేలు కోచింగ్ సెంటర్లకు పెట్టిన యువత గాథలు విన్నా. అందుకే మీ అందరికీ నేనున్నా అనే భరోసా ఇస్తున్నా. ఐదేళ్లుగా మనల్ని మోసం చేసిన చంద్రబాబు కుట్రల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎన్నికల వేళ చంద్రబాబు మూటలు మూటల డబ్బులు పంపుతారు. ఆయనిచ్చే రూ. 3000 రూపాయిలకి మోసపోవద్దని ప్రతీ ఒక్కరికి చెప్పండి’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. రాజన్న రాజ్యం తెస్తా.. వైఎస్ జగన్ ఇంకా మాట్లాడుతూ.. ‘అన్న వస్తున్నాడని చెప్పండి. అన్న వస్తే పిల్లాడిని బడికి పంపిస్తే చాలు ఏడాదికి రూ. 15000 ఇస్తాడని ప్రతీ అక్కకి చెప్పండి. చంద్రబాబును నమ్మాం. ఐదేళ్ల సమయమిచ్చాం. డ్వాక్రా రుణమాఫీ చేస్తాడని ఓటేస్తే నమ్మించి మోసం చేశాడని చెప్పండి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత సున్నా వడ్డీ రుణాలు ఇవ్వటం లేదని చెప్పండి . మనం అధికారంలోకి వస్తే ప్రతీ అక్కకు ఉన్న డ్వాక్రా రుణాలను నాలుగు ధఫాలలో పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పండి. అంతేకాదు జగనన్న వస్తే మళ్లీ సున్నా వడ్డీకే రుణాలు ఇస్తాడని చెప్పండి. వైఎస్సార్ చేయూత పేరుతో 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ. 75000 ఇస్తాడని చెప్పండి. చంద్రబాబు పాలనలో ఏ ఒక్క పంటకి గిట్టుబాటు ధర లేదు. అన్న ముఖ్యమంత్రి అయితే ప్రతీ ఏటా మే నెలలో రూ. 12500 పెట్టుబడి సాయం చేస్తాడని రైతన్నకు చెప్పండి. మీ మనవడు ముఖ్యమంత్రి అయితే మీ పెన్షన్ మూడు వేల వరకు పెంచుకుంటూ పోతాడని అవ్వాతాతలకు చెప్పండి. రాజన్న రాజ్యంలో ప్రతీ పేదవాడికి ఇల్లు నిర్మాణం జరిగింది. మళ్లీ వైఎస్ జగనన్న సీఎం అయితే రాజన్న రాజ్యంలా ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టిస్తామని చెప్పండి. నవరత్నాలలోని ప్రతీ అంశం గురించి అన్ని వర్గాల వారికి తెలియజేయండి’ అని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. ఫ్యాను గుర్తుకు ఓటు వేసి ఎలీజా, శ్రీధరన్నను గెలిపించాలని కోరారు. -
ప్రజల హృదయాలకు హత్తుకునేలా ‘యాత్ర’
సాక్షి, ఏలూరు: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన చరిత్రాత్మక పాదయాత్ర నేపథ్యంతో తెరకెక్కిన సినిమా యాత్ర.. మలయాళ మెగాస్టార్ మమ్మూటి వైఎస్సార్ పాత్రలో నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రజల హృదయాలను హత్తుకునేలా ఈ సినిమా ఉందని సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా తడికలపూడిలో వైఎస్సార్సీపీ నేత కొఠారు అబ్బయ్య చౌదరి, చింతలపూడిలో ఆ పార్టీ నాయకుడు వీఆర్ ఎలీజా వైఎస్సార్ అభిమానులు, పార్టీ కార్యలర్తలతో కలిసి ‘యాత్ర’ బెనిఫిట్ షోను వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యాత్ర సినిమా చాలా బాగుందన్నారు. ప్రజల గుండెలకు హత్తుకునేలా సినిమా ఉందని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ 2003లో చేపట్టిన పాదయాత్రను కళ్లకు కట్టినట్లు సినిమాలో చూపించారని కొనియాడారు. పాదయాత్ర ద్వారా నేరుగా ప్రజల కష్టాలను వైఎస్సార్ తెలుసుకున్న తీరును సినిమాలో చక్కగా చూపించారని, వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి జీవించారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు చూడదగిన సినిమాగా యాత్రను రూపొందించారని అన్నారు. -
బొగ్గు అన్వేషణకు ఆటంకం
చింతలపూడి: జిల్లాలో బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు తెలియడంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టి చింతలపూడిపై పడింది. ముఖ్యంగా రాష్ట్ర విభజన తరువాత ఏపీలో బొగ్గు నిల్వలు బయట పడటం రాష్ట్రం పాలిట వరదాయినిగా మారింది. బొగ్గు తవ్వకాలు ప్రారంభమైతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడమేకాక ఉపాధి అవకాశాలుపెరుగుతాయని ఈ ప్రాంత ప్రజలు భావిస్తూ వచ్చారు. అయితే చివరి దశ సర్వే పనులకు వర్షాలు అడ్డంకిగా మారాయి. దీంతో రెండు నెలలుగా ఎక్కడా సర్వే పనులు జరగడం లేదు. 2016నాటికే పూర్తికావాలి వాస్తవానికి తుదిదశ సర్వే పనులు 2016 నాటికే పూర్తికావాలి. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తరించి ఉన్న బొగ్గు నిక్షేపాల అన్వేషణ చివరి దశ సర్వేకు 2016లో రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్ ఎక్స్‌ప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఈసీఎల్), నేషనల్ మైనింగ్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్ట్ (ఎన్ఎంఈటీ)లతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 2016 చివరినాటికి అన్వేషణ పూర్తి చేయాల్సి ఉంది. జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జిల్లాలోని చింతలపూడి మండలం, కృష్ణా జిల్లాలోని సోమవరం ప్రాంతాల్లో మరిన్ని అధునాతన యంత్రాలతో అన్వేషణ చేపట్టాలని భావించడంతో సర్వే ఇంకా పూర్తి కాలేదు. ఇందులో భాగంగా సౌత్ వెస్ట్ పినాకిల్ సంస్థ మరో సంస్థతో కలిసి 120 పాయింట్ల(ప్రదేశాలు)ను గుర్తించి అధునాతన రిగ్గులతో డ్రిల్లింగ్ చేపట్టింది. ఈ 120 పాయింట్లలో సుమారు 65 వేల మీటర్ల లోతున బొగ్గు అన్వేషణ చేపట్టి సుమారు 40 వేల మీటర్ల పనులు పూర్తి చేసినట్లు తెలిసింది. అయితే పినాకిల్ సంస్థ సర్వే పనుల గడువు ముగియడంతో ప్రసుత్తం ఎంఈసీఎల్ సంస్థ ద్వారా చివరి దశ అన్వేషణ పనులు చేపట్టాల్సి ఉంది. పనులు ప్రారంభం కాక ముందే వర్షాలు మొదలు కావడంతో సర్వే ముందుకు సాగడం లేదని సంస్థ సిబ్బంది తెలిపారు. సానుకూలంగా లేని కేంద్రం తెలంగాణలోని సింగరేణి తరహాలో బొగ్గును తవ్వుకోవడానికి అనుమతి కోరుతూ 2015లో రాష్ట్రానికి చెందిన ఏపీఎంఐడీసీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా పంపింది. దీనికి కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి పాలుపోవడం లేదు. రాజమండ్రి వరకూ బొగ్గు నిక్షేపాలు మూడేళ్ల నుంచి కృష్ణా జిల్లా సోమవరం, పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి కేంద్రంగా బొగ్గు నిక్షేపాలపై జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) నుంచి నిపుణులు సర్వే పనులు ప్రారంభించారు. మన రాష్ట్రంలోని కృష్ణా జిల్లా చాట్రాయి మండలం సోమవరం గ్రామం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి వరకు 2 వేల నుంచి 3 వేల మిలియన్ టన్నుల నల్ల బంగారం ఉన్నట్లు గతంలోనే గుర్తించారు. లక్నోకు చెందిన బీర్బల్ సహానీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాలియో బోటనీ అనే సంస్థ 2013లో కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చేపట్టిన అధ్యయనంలో కృష్ణా జిల్లా సోమవరం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి, టీ నరసాపురం, జంగారెడ్డిగూడెం మండలాల మీదుగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వరకు నాణ్యమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు కనుగొంది. ఇతర రాష్ట్రాలలో లభ్యమయ్యే బొగ్గుతో పోల్చితే ఇక్కడ అత్యంత నాణ్యమైన బొగ్గు ఉన్నట్లు ఆ సంస్థ పేర్కొంది. అదికూడా భూమి ఉపరితలానికి 500 మీటర్ల లోతులోనే ఈ బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని నివేదికలో పొందుపరిచింది. ఇక్కడ బొగ్గు తవ్వకాలు ప్రారంభమైతే సంవత్సరానికి 8 వేల మెగావాట్ల చొప్పున 60 సంవత్సరాల వరకు విద్యుత్ కొరత రాదని నిపుణులు చెబుతున్నారు. చింతలపూడి ప్రధాన కేంద్రంగా 30 కిలో మీటర్ల వ్యాసార్ధంలో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. గత సర్వేల్లోనే వెలుగులోకి .. చింతలపూడి ప్రాంతంలో ఉన్న బొగ్గు నిక్షేపాలను వెలికి తీస్తామని 2015లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించినా ఆయన ఆశ ఇంత వరకు నెరవేరలేదు. 1964 నుంచి 2006 వరకు సుమారు 4 దఫాలుగా అధికారులు సర్వేలు నిర్వహించారు. ఈ ప్రాంత భూభాగంలో బొగ్గు నిల్వలు ఉన్నట్లు గతంలోనే ఏపీఎండీసీ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా పశ్చిమ, ఖమ్మం సరిహద్దులను ఆనుకుని 2,500 స్క్వేర్ కిలో మీటర్ల పరిధిలో ఈ బొగ్గు నిల్వలు విస్తరించి ఉన్నట్లు ప్రభుత్వం వద్ద నివేదిక ఉన్నట్లు తెలిసింది. పశ్చిమ సరిహద్దు, ఖమ్మం జిల్లా రేజర్ల, నారాయణపురం, నుంచి పశ్చిమ గోదావరి జిల్లా గురుభట్లగూడెం, రాఘవాపురం గ్రామాల్లో 400 అడుగుల లోతు నుంచి 1,400 అడుగుల లోతులో సుమారు వెయ్యి అడుగుల మందంతో బొగ్గు తయారైనట్లు నిర్ధారించారు. అయితే సర్వే పనులే ఇంత వరకు పూర్తవ్వలేదు. ఇక బొగ్గు వెలికి తీతకు ఎన్ని సంవత్సరాలు పడుతుందోనని ఈ ప్రాంత వాసులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. -
బాలిక మిస్సింగ్ కేసు విచారణపై అసంతృప్తి
ఏలూరు టౌన్ : చింతలపూడిలోని సంక్షేమ వసతి గృహం విద్యార్థినిపై ఇద్దరు వ్యక్తులు పది రోజులు అత్యాచారానికి పాల్పడిన ఘటన జిల్లాలో సంచలనం రేపింది. తన కుమార్తె కనిపించటం లేదని బాలిక తండ్రి హస్టల్ వార్డెన్‌తో కలిసి ఫిర్యాదు చేసినా చింతలపూడి ఎస్సై పట్టించుకోలేదనే ఆరో పణలు ఉన్నాయి. దీంతో ఈ నెల 27న ఏలూరు రేంజ్ డీఐజీ టి.రవికుమార్‌మూర్తికి బాలిక తండ్రి ఫిర్యాదు చేశారు. ఆయన ఎస్పీ ఎం.రవిప్రకాష్‌కు విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. బాలిక అత్యాచార ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేసి నివేదిక ఇవ్వాలని జంగారెడ్డిగూడెం డీఎస్పీని ఎస్పీ ఆదేశించారు. ఏలూరు పవర్‌పేటలో బాలిక ను నిర్బంధించిన ఇంటి వద్ద శుక్రవారం రాత్రి జంగారెడ్డిగూడెం డీఎస్పీ విచారణ చేశారు. చింతలపూడి ఎస్సై నిర్లక్ష్యం కారణంగానే బాలిక అత్యాచారానికి గురైందనీ, వెంటనే ఆరా తీసుంటే ఇంత ఘోరం జరిగేది కాదని బాలిక బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సైపై పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక బాలికపై అత్యాచారం చేసిన ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటికే కలెక్టర్ కాటంనేని భాస్కర్ చింతలపూడి హాస్టల్ వార్డెన్లు ముగ్గురిని సస్పెండ్ చేశారు. ఏం జరిగింది! దుగ్గిరాల గ్రామానికి చెందిన దంపతులకు ఇద రు కుమార్తెలు సంతానం. ఆ దంపతుల మధ్య విభేదాలు రావటంతో దూరంగా ఉంటున్నారు. ఇద్దరు కుమార్తెలనూ చింతలపూడిలోని సంక్షేమ వసతి గృహంలో చేర్పించారు. పెద్ద కుమార్తె పదో తరగతి చదువుతుండగా, అక్కడే ఆమె చెల్లి కూడా ఉంటూ చదువుతోంది. ఇంటికి వచ్చిన బాలికను ఈనెల 16 ఉదయం చింతలపూడి హాస్టల్లో తల్లి దించి వెళ్లింది. అదే రోజు హాస్టల్లో అల్పాహారం తీసుకున్న బాలిక హాస్టల్ నుంచి బయటకు వెళ్లిపోయింది. చింతలపూడి నుంచి ఏలూరు వచ్చేందుకు బస్టాండ్‌లో ఒంటరిగా ఉన్న బాలికను గమనించిన కిరణ్ ఆమెను చింతలపూడి ఐటీఐ వద్దకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. 17న ఉదయం బాలిక తండ్రికి ఫోన్ చేసి మీ కుమార్తె చింతలపూడి బస్టాండ్‌లో ఉందనీ, ఒంటరిగా ఉండడంతో తన ఇంటికి తీసుకువచ్చాననీ చెప్పాడు. అనంతరం ఏలూరు పాతబస్టాండ్ వద్దకు బాలికను తీసుకెళ్లిన కిరణ్ అతని బంధువు చిట్టిబాబును అక్కడకు రప్పించాడు. ఇద్దరూ కలిసి పవర్‌పేటలోని ఒక ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ బాలికను నిర్బంధించారు. కిరణ్ మాట్లాడిన మాటలపై అనుమానంగా వచ్చిన బాలిక తండ్రి చింతలపూడి వెళ్లి హాస్టల్ వార్డెన్‌తో కలిసి చింతలపూడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కానీ ఎస్సై ఈ ఫిర్యాదును పట్టించుకోలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. అప్పటి నుంచీ బాలిక తండ్రి, బంధువులు వెతుకుతూనే ఉన్నారు. చివరికి ఈనెల 26న బంధువులే బాలికను నిర్బంధించిన ఇంటిని తెలుసుకుని ఏలూరు టూటౌన్ పోలీసుల సహాయంతో వారినుంచి రక్షించారు. అనంతరం బాలికను చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం పంపించారు. బాలిక అత్యాచారానికి గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ నెల 17న పోలీసులకు ఫిర్యాదు చేస్తే 23 వరకూ కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని తెలుస్తోంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అనంతరం కూడా బాలిక ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు ఏమాత్రం ప్రయత్నం చేయకపోవటంపై ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం. బాలికపై అత్యాచారం, ఫిర్యాదుపై పోలీసుల నిర్లక్ష్యంపై జంగారెడ్డిగూడెం డీఎస్పీ విచారణ చేసి నివేదిక సమర్పించిన అనంతరం చర్యలు ఉంటాయని తెలుస్తోంది. -
ఇదీ చింతలపూడి..!
భూమంతా కోల్పోయారు ఈ రైతు పేరు అనపర్తి కృష్ణారావు. స్వగ్రామం పోచవరం. గోదావరికి చెంతనే ఈయనకి పొలం ఉంది. గతంలో తాడిపూడి ఎత్తిపోతల పథకంలో 1.10 ఎకరాల భూమి కోల్పోయారు. గూటాల ఎత్తిపోతల పథకంలో 15 సెంట్లు భూమి పోయింది. ఇంకా ఈ రైతుకు 2.54 ఎకరాల భూమి ఉంది. ఇప్పుడు చింతలపూడి పథకం వచ్చింది. మొదటి ఫేజ్‌లో ఇతని నుంచి 54 సెంట్ల భూమిని సేకరించారు. మళ్లీ ఇప్పుడు 2 ఎకరాల భూమి సర్వే చేసి రాళ్లు వేశారు. ఈయనకు ఉన్న భూమి మొత్తం ప్రభుత్వం లాగేసుకుంటోంది. గతంలో ఇదే భూమిని కుమార్తెకి కట్నంగా ఇచ్చారు. ఇప్పుడు భూమి పోయింది. ఏం చేయాలో పాలుపోవడం లేదని కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా కృష్ణారావు ఒక్కరే కాదు, ఎంతో మంది రైతులు భూసేకరణలో భూములు కోల్పోయి రోడ్డున పడుతున్నారు. చింతలపూడి ఎత్తిపోతల వివరాలు కాలువ పొడవు 106 కిలోమీటర్లు పథకం లక్ష్యం 4.08 లక్షల ఎకరాలకు సాగునీరు ఖర్చు వివరాలు (రూ. కోట్లలో) ప్రాథమిక అంచనా వ్యయం : 1,701 సవరించిన అంచనాలతో : 4909.80 ఇప్పటివరకు చేసిన ఖర్చు : 804.82 భూసేకరణ వివరాలు (ఎకరాల్లో) అవసరమైన భూమి 22,962 రైతుల భూమి 13,403 సేకరించింది 8,815 అటవీ భూమి 9,559 సేకరించింది 1,282 కొవ్వూరు: మెట్ట ప్రాంత రైతుల సాగునీటి కష్టాలు తీర్చే చింతలపూడి ఎత్తిపోతల పథకంపై చంద్రబాబు సర్కారు శీతకన్ను వేసింది. రూ. 4,909.80 కోట్ల వ్యయం తో చేపట్టాల్సిన పథకానికి 2017–18 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.90 కోట్లు మాత్రమే కేటాయించింది. మరో వైపు వచ్చే నవంబర్ నాటికి ఈ పథకం పూర్తి చేసి పొలాలకు నీళ్లిస్తామంటూ రైతుల్ని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. నాలుగేళ్ల కాలంలో పూర్తి కావాలని నిర్దేశించిన పథకం ఇప్పటికి ఎనిమిదేళ్లు పూర్తయినా నేటికీ ఓ కోలిక్కి రాలేదు. క్షేత్రస్థాయిలో చింతలపూడి ఎత్తిపోతల పథకం భూసేకరణ ప్రక్రియ ప్రహసనంగా మారింది. రైతులకు పరిహారం చెల్లింపుల్లో వ్యత్యాసాలు చూపుతున్నారు. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం మొండి వైఖరితో ముందుకు సాగుతోంది. భూసేకరణలో భాగంగా ఎంతోమంది చిన్న, సన్నకారు రైతులు పూర్తిగా భూములు కోల్పోయి రోడ్డున పడుతున్నారు. ఒక్కోచోట ఒక్కోరకం పరిహారం చెల్లించడాన్ని రైతులు తీవ్రంగా తప్పు బడుతున్నారు. రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్దేశించిన ఈ పథకం సామర్థ్యాన్ని 4.80 లక్షలకు పెంచారు. దీంతో నిర్మాణ వ్యయం రూ.1,701 కోట్లు నుంచి రూ.4909. 80 కోట్లకి పెరిగింది. భూసేకరణ కూడా 17,122 ఎకరాల నుంచి ఇప్పుడు 22,962 ఎకరాలకు పెరిగింది. ఇంత వరకు భూసేకరణ ప్రక్రియతో కలిపి రూ.804.82 కోట్లు విలువైన పనులు చేపట్టారు. భూసేకరణ నిమిత్తం రూ.209.86 కోట్లు, పనుల నిమిత్తం రూ.594.96 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో గత ప్రభుత్వ హయాంలో రూ.344 కోట్లు ఖర్చు చేయగా టీడీపీ నాలుగేళ్ల పాలనలో రూ.467.82 కోట్లు ఖర్చు చేశారు. ఎక్కడి పనులు అక్కడే ప్రస్తుతం ఈ పథకం పనులు నాలుగు ప్యాకేజీలుగా నడుస్తున్నాయి. మొదటి ప్యాకేజీలో మూడు పంపుహౌస్‌లు, లీడింగ్ ఛానల్ 0 నుంచి 13.22 కిలోమీటరు వరకు, మెయిన్ కెనాల్ 0–36 కిలోమీటరు వరకు డిస్ట్రిబ్యూటర్స్‌తో పాటు చేపడతారు. దీనిలో లీడింగ్ ఛానల్ 13.2 కిలో మీటర్లకి 8.3 కిలోమీటర్లు పనులు పూర్తి చేశారు. మెయిన్ కెనాల్ 36 కి.మీ.లకు గాను 27.6 కి.మీ. మేరకు పనులు చేశారు. ఈ పనులను నాలుగు కాంట్రాక్టు సంస్థలు చేస్తున్నాయి. మొదటి అంచనా ప్రకారం 110 స్ట్రక్చర్స్ నిర్మించాల్సి ఉండగా 24 నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో కొన్ని పూర్తయ్యాయి. మరో మూడు స్ట్రక్చర్లు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటి సామర్థ్యం విస్తరిస్తున్న కాలువ సామర్ధ్యం మేరకు పెంచాల్సి ఉంది. ఇప్పుడు సామర్ధ్యం పెంచిన దృష్ట్యా లీడింగ్ ఛానల్లో 26, మొయిన్ కెనాల్లో 121 స్ట్రక్చర్స్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. రెండో ప్యాకేజీలో 36 కిలోమీటర్ నుంచి 68 కిలోమీటరు వరకు మెయిన్ కెనాల్, డిస్ట్రిబ్యూటర్లతో కలిపి తవ్వాల్సి ఉంది. ఈ ప్యాకేజీలో 32 కిలోమీటర్లకి గాను 28.875 కిలోమీటర్లు పనులు పూర్తి చేశారు. దీనిలో 83 స్ట్రక్చర్లకు గాను మూడు పురోగతిలో ఉన్నాయి. మూడో ప్యాకేజీ రూ.681.21 కోట్లతో పంప్ హౌస్‌లోను పెరిగిన సామర్థ్యం మేరకు డిస్చార్జీలను నిర్మించాల్సి ఉంది. నాలుగో ప్యాకేజీలో 68వ కిలోమీటరు నుంచి 106 కిలో మీటరు వరకు మెయిన్ కెనాల్, కొవ్వాడ, తమ్మిలేరు స్థిరీకరణ పనులు ఉన్నాయి. దీనిలో 85 స్ట్రక్చర్ల నిర్మించాల్సి ఉంది. వీటిలో ఏ ఒక్కటీ ప్రారంభం కాలేదు. రానున్న రోజుల్లో జల్లేరు జలశయం సామర్ధ్యం 8 టీఎంసీల నుంచి 20 టీఎంసీలకు పెంచనున్నారు. దీన్ని ఐదో ప్యాకేజీగా పరిగణిస్తారని అధికారులు చెబుతున్నారు. ప్రహసనంగా భూసేకరణ చింతలపూడి ఎత్తిపోతల పథకానికి మారిన అంచనా ప్రకారం కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 22,962 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. దీనిలో అటవీశాఖకు చెందిన భూమి ఏకంగా 9,559 ఎకరాలుంది. ఇంత వరకు రైతుల నుంచి 8,815 ఎకరాల సేకరణ పూర్తికాగా ఇంకా 4,588 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా అటవీ శాఖ కోల్పోతున్న భూములకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం వేరేచోట భూమి సూచించాల్సి ఉంది. దీనిలో భాగంగా ఇటీవలే విశాఖపట్నం జిల్లాలో 1,282 ఎకరాల (859 హెక్టార్లు) భూమిని అటవీ భూమిగా అభివృద్ధి పరచడానికి అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఫేజ్–1 క్లియరెన్స్ ఉత్తర్వులు ఇచ్చింది. ఇక్కడ అటవీ ప్రాంతంగా అభివృద్ధికి రూ.32 కోట్లు ఖర్చువుతుందని అంచనా వేశారు. ఇంకా 8,277 ఎకరాల అటవీ భూమికి ప్రత్యామ్నాయ భూములు చూపిస్తే తప్ప అటవీ భూముల్లో పనులు చేయడానికి వీలు ఉండదు. ఆరెకరాలకు తొంభై సెంట్లు మిగిలింది ఈయన పేరు కాకర్ల వెంకటేశ్వరరావు. తాళ్లపూడి మండలం పోచవరం గ్రామం. ఈయన ఒకప్పుడు 6.30 ఎకరాల రైతు. ఉన్న భూమంతా తాడిపూడి, చింతలపూడి ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు కేవలం ముప్పై సెంట్లు మాత్రం మిగిలింది. తాడిపూడి పథకంలో ఎకరం పోయింది. చింతపూడి పథకం పేజ్–1లో 1.30 సెంట్లు, ఫేజ్–2 లో తాజాగా 3.10 ఎకరాలు పోతోంది. ఇక మిగిలింది కేవలం 90 సెంట్లు మాత్రమే. చింతలపూడి పథకం పేరుతో ఈ రైతు జీవితం తారుమారైంది. చింతలపూడి మొదటి విడతలో ఎకరాకు రూ.12.50 లక్షలు ఇస్తామని నమ్మించి అధికారులు రూ.8.35 లక్షలు చొప్పున ఇచ్చారు. రెండో విడతలో ఎకరాకి రూ.26.50 లక్షలు అన్నారు. మంత్రి రూ.28 లక్షలు ఇప్పిస్తామన్నారు. చివరికి ఎకరానికి రూ.23.74 లక్షల చొప్పున ఇచ్చారు. ఈ సొమ్ముతో మళ్లీ భూమి కొందా మంటే ఆ రేటుకు మార్కెట్లో పొలం అందుబాటులో లేదని ఆయన వాపోతున్నారు. 20 శాతం పనులు పూర్తి చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు ఇరవై శాతం పూర్తయ్యాయి. పథకం విస్తరణ కారణంగా నీటి సామరŠాధ్యన్ని 15.5 టీఎంసీల నంచి 53.5 టీఎంసీలకు పెంచుతున్నారు. నీటి విడుదల రెండు వేల క్యూసెక్కుల నుంచి 6,875 క్యూసెక్కులకు పెరుగుతుంది. మొదటి విడతలో నిర్మించిన స్ట్రక్చర్లు సర్దుబాటు చేయడానికి వీలులేనివి ఉంటే తొలగిస్తాం. అటవీ భూములు ముందుగా కాలువ తవ్వకాలకు అవసరమైనవి ఇచ్చారు. రిజర్వాయర్ నిర్మాణం సమయంలో మరికొన్ని భూములు అవసరమవుతాయి. వాటిని కూడా సేకరిస్తాం. – డీఎస్ఎస్ శ్రీనివాసయాదవ్, ఎస్ఈ, చింతలపూడి ఎత్తిపోతల పథకం -
చింతలపూడి టీడీపిలో వర్గపోరు
-
చింతలపూడి టీడీపీలో ముదిరిన వివాదం
చింతలపూడి(పశ్చిమగోదావరి): చింతలపూడి నియోజకవర్గ టీడీపీలో విభేదాలు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి. మాజీ మంత్రి పీతల సుజాతకు వ్యతిరేకంగా జంగారెడ్డిగూడెంలో తెలుగు తమ్ముళ్లు రహస్య సమావేశం ఏర్పాటు చేసుకోగా దీనికి నాలుగు మండలాల నుంచి నేతలు హాజరయినట్లు సమాచారం. చింతలపూడి మార్కెట్ కమిటీ భర్తీ కాకుండా సుజాత మూడేళ్లుగా అడ్డుపడుతున్నారని ఎంపీ మాగంటి బాబు వర్గం ఆరోపిస్తోంది. ఆమె తీరుకు నిరసనగా మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రెండు వర్గాల మధ్య ముదిరిన వివాదం ఎక్కడి వరకు వెళుతుందోనని తెలుగు తమ్ముళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
మృత్యువులోనూ వీడని బంధం
మృత్యువులోనూ వీడని బంధం ప్రమాదంలో మృతి చెందిన ఎస్ఐ దంపతులు కన్నీరు మున్సీరు అవుతున్న కుటుంబ సభ్యులు అనాథగా రెండేళ్ళ చిన్నారి చింతలపూడిలో విషాద ఛాయలు చింతలపూడి, ఏలూరు అర్బన్ ః ప్రేమించి పెళ్లి చేసుకున్నారు... ఇరువర్గాలు అంగీకరించక పోయినా ఒక్కటయ్యారు... కష్టపడి ఉద్యోగం సంపాదించారు... చివరికి మరణంలో కూడా ఇద్దరూ కలిసే వెళ్లిపోయారు. అయితే వారి ప్రేమకు చిహ్నంగా పుట్టిన చిన్నారి మాత్రం అనాథగా మిగిలిపోయింది. చింతలపూడిలో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న బి.సైదానాయక్ (34), అతని భార్య శాంతి శనివారం లింగపాలెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో చింతలపూడిలో విషాదం నెలకొంది. శనివారం ఉదయం భార్య శాంతి, రెండేళ్ళ కుమార్తె ప్రిన్స్‌తో కలిసి కారులో చింతలపూడి నుండి ఏలూరు బయలు దేరారు. లింగపాలెం సీతమ్మ చెరువు వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెట్టును బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ముందు సీటులో పక్కనే కూర్చున్న భార్య శాంతికి తీవ్రగాయాలు కాగా, వెనక సీటులో కూర్చున్న రెండేళ్ల చిన్నారి స్వల్ప గాయాలతో బయటపడింది. గాయపడిన వారిని అంబులెన్స్‌లో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి అక్కడి నుంచి ఆశ్రం ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యంలో శాంతి(30) మృతి చెందింది. కుమార్తెకు స్వల్ప గాయాలవ్వడంతో చికిత్స చేసి బంధువులకు అప్పగించారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృత్యువులోనూ వీడని ప్రేమ బంధం సైదా నాయక్, శాంతిలది ప్రేమ వివాహం. తాడేపల్లిగూడెం జీఎంఆర్ బీఈడీ కళాశాలలో బీఈడీ చదువుతున్న సమయంలో వీరు ప్రేమలో పడ్డారు. 2014లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తరువాత శాంతిని సైదా నాయక్ వివాహం చేసుకున్నారు. ఇటీవలే కుమార్తె పుట్టిన రోజు పండుగను ఘనంగా జరిపారు. కలకాలం కలిసి బ్రతుకుదామని బాసలు చేసుకున్న వీరు రోడ్డు ప్రమాదంలో మృతి చెంది మృత్యువులో కూడ కలిసే ఉంటామని నిరూపించారు. తల్లిదండ్రులు చనిపోయిన విషయం తెలియని చిన్నారి ప్రిన్స్‌ను చూసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. చెట్టు రూపంలో మృత్యువు తల్లిదండ్రులను తీసుకు పోవడంతో చిన్నారి అనాథ అయ్యింది. ఆసుపత్రికి తీసుకు వచ్చిన మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు భోరున విలపించారు. కష్టాలు కడతేరాయనుకుంటే నువ్వే కడతేరిపోయావా కొడకా.. ఎన్నో కష్టాలు పడి తినీ తినకా, రిక్షా తొక్కి నిన్ను పెంచుకుని చదివించుకున్నాను. పోలీసు డ్రస్సులో నిన్ను చూసుకుని మురిసి పోయా, నా కష్టాలు కడతేరిపోయానుకున్నా ఇంతలో నువ్వే కడతేరి పోయావా కొడకా.. అంటూ ఎస్సై సైదానాయక్ తండ్రి కోటయ్య ఆ గుండెలు పగిలిపోయాలా రోదించడం చూపరుల కళ్ళు చెమర్చేలా చేసింది. సైదానాయక్ది కృష్ణా జిల్లా ఇబ్రహింపట్నం. తండ్రి కోటయ్య, తల్లి భద్రమ్మలు వ్యవసాయ కూలీలు. తండ్రి వ్యవసాయ పనులతో పాటు రోజూ రిక్షా తొక్కి కుటుంబాన్ని పోషించడమే కాక కుమారులిద్దరిని చదివించాడు. పెద్దకుమారుడైన సైదా నాయక్ చిన్నప్పటి నుండి కష్టపడి చదివి 2011లో జరిగిన ఎస్సై ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి జిల్లాలోని బుట్టాయిగూడెం, ఏలూరులో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. 2015 అక్టోబర్ నెలలో చింతలపూడి స్టేషన్‌కు బదిలీపై వచ్చారు. అప్పటి నుండి చింతలపూడిలోనే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. చిన్న కుమారుడు లక్ష్మణ్ ప్రస్తుతం విజయవాడలో బీఎల్ చదువుతున్నాడు. ఇతనికి ప్రభుత్వం తరపున ఉద్యోగం ఇప్పిస్తామని హోం మంత్రి చినరాజప్ప హామీ ఇచ్చారు. పలువురి పరామర్శ ఎస్సై సైదా నాయక్ అకాలమరణం పాలయ్యారనే వార్త తెలియడంతో పలువురు ప్రముఖులు ఆసుపత్రికి తరలి వచ్చారు. చిన్న వయసులోనే అర్ధంతరంగా భార్యతో సహా ఎస్సై దంపతులు రోడ్డు ప్రమాదంలో మరణించడం పట్ల చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్ళి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని ఆమె తెలిపారు. సైదా నాయక్ బ్యాచ్‌లో శిక్షణ పొందిన పలువురు ఎస్ఐలు భౌతికకాయాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. అనాథగా మారిన ప్రిన్స్ అప్పటి వరకూ తల్లిదండ్రుల ప్రిన్స్ (రాకుమారి)గా అల్లారుముద్డుగా ఆటలాడుకున్న సైదా నాయక్ ఏడాదిన్నర వయసున్న చిన్నారి కూతురు గంటల వ్యవధిలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. దాంతో ఆ చిన్నారి నేడు అనాథగా మారిపోయింది. -
రోడ్డు ప్రమాదంలో ఎస్సై దుర్మరణం
-
రోడ్డు ప్రమాదంలో ఎస్సై దుర్మరణం
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చింతలపూడి ఎస్సై సైదా నాయక్ దుర్మరణం చెందారు. ఆయన తన భార్య, రెండేళ్ల కూతురితో కలిసి కారులో ఏలూరుకు వస్తుండగా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో సైదానాయక్ కారు నడుపుతున్నారు. ఆయన భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మరోపోరాటం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులు తమకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ప్రభుత్వంపై పోరాడేందుకు ఏకతాటిపైకి వస్తున్నారు. ఇప్పటివరకూ గ్రామాల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన రైతులందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి న్యాయమైన డిమాండ్లు సాధించుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే కొందరు కోర్టులను ఆశ్రయించి ఆదేశాలు తెచ్చుకోగా.. కోర్టులకు వెళ్లలేని వారు ప్రభుత్వం చెల్లించిన అరకొర నష్టపరి హారం వల్ల నష్టపోయామని ఆవేదన చెందుతున్నారు. వీరంతా ఇకపై దశల వారీగా ఐక్య ఉద్యమాలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందుకోసం ప్రగడవరం గ్రామానికి చెందిన రైతులు చింతలపూడి ఎత్తిపోతల ఆయకట్టు రైతుల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేశారు. సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయించి.. ఈ నెల 24న తెడ్లం గ్రామంలో సమావేశమయ్యారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం ఆయకట్టు పరిధిలో భూములు కోల్పోతున్న రైతులందరినీ సంఘంలో సభ్యులుగా చేర్చుకోవాలని నిర్ణయించారు. భూములు కోల్పోతున్న రైతులకు భూసేకరణ చట్టం ద్వారా ఉన్న హక్కులు, వారికి రావాలి్సన పరిహారం విషయంలో అవగాహన కల్పించేందుకు పోస్టర్లు ముద్రించి అన్ని గ్రామాల్లో అతికించాలని నిర్ణయించారు. కాలం చెల్లిన జీఓ ఆధారంగా ఉద్యాన పంటలకు పరిహారం ఇస్తున్నారని, దీన్ని వ్యతిరేకిస్తూ ప్రస్తుతం అమల్లో ఉన్న మార్కెట్ విలువల ఆధారంగా పరిహారం పొందేందుకు హైకోర్టులో ప్రజావ్యాజ్యం వేయాలని నిర్ణయించారు. భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారాన్ని నాలుగు రెట్లు ఇచ్చే విధంగా అధికారులతో చర్చలు జరపడంతోపాటు కోర్టుల ద్వారా ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ప్రధాన రహదారుల పక్కన ఉన్న భూములు, నివాస యోగ్యమైన స్థలాలు, వాణిజ్యపరమైన స్థలాలకు అదనపు విలువలు నిర్ణయించడానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ప్రభుత్వంతో చర్చలు జరపడం.. ఆ ప్రయత్నాలు ఫలించని పక్షంలో కోర్టులను ఆశ్రయించాలని తీర్మానించారు. అసైన్డ భూములకు పట్టా భూములతో సమానంగా పరిహారం కోసం పోరాడాలని నిర్ణయించారు. ఈ అంశాలపై త్వరలో మరోసారి సమావేశమై కార్యాచరణ రూపొందించనున్నారు. -
చింతలపూడేనా!
చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణం నత్తనడకన సాగుతోంది. పథకం పనులు 28 శాతం మాత్రమే పూర్తయ్యాయి. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడు శాతం మాత్రమే పనులు జరిగాయి. భూసేకరణ, నష్టపరిహారంపై అన్నదాతలు ఆందోళన చేస్తున్నారు. తాజాగా రైతులతో కలెక్టర్ జరిపిన చర్చలు బెడిసికొట్టడంతో పథకం ఎప్పటికి పూర్తవుతుందోననే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. కొవ్వూరు : చింతలపూడి ఎత్తిపోతలు.. మూడేళ్ల క్రితం పూర్తి కావాల్సిన మెట్ట రైతుల ఆశా పథకం ఇదీ.. ఇప్పటికీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. భూసేకరణ ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నాటికి పథకం పూర్తి చేసి రెండు లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామంటూ జిల్లా మంత్రి పీతల సుజాత ప్రకటన చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది మెట్ట రైతులను మభ్యపెట్టె ప్రయత్నమేననే అసంతృప్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. 2014 మార్చి నాటికే ఈ పథకం 25 శాతం పనులు పూర్తయిపోయాయి. దీనికి రూ.344 కోట్లు ఖర్చయ్యాయి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 30 నెలల కాలంలో మూడు శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇప్పటి వరకు భూసేకరణతో కలిపి కేవలం రూ.714కోట్ల విలువైన పనులే పూర్తయ్యాయి. వీటిలో సగానికిపైగా పనులు తెలుగుదేశం ప్రభుత్వం రాకముందే పూర్తయ్యాయి. 2009 ఫ్రిబవరిలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ఈ పథకం మంజూరైంది. రూ.1,701 కోట్ల వ్యయంతో నాలుగేళ్ల కాలంలో అంటే 2013 ఫిబ్రవరి నాటికి పథకం పూర్తికావాలనేది అప్పటి లక్ష్యం. వై.ఎస్.రాజశేఖరరెడ్డి హఠాన్మరణం నేపథ్యంలో ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం తగిన చొరవ చూపక పోవడంతో మెట్ట రైతుల ఆశలు నెరవేరలేదు. పనుల్లో ఏదీ పురోగతి ఈ ప్రాజెక్టును రెండు ప్యాకేజీలుగా చేపట్టారు. మొదటి ప్యాకేజీలో జనవరి నెలాఖరు నాటికి 230 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు చేపట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 107లక్షల క్యూబిక్ మీటర్లు మట్టి తవ్వారు. ప్రధాన కాలువపైన మార్గమధ్యలో 110 నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా.. వీటిలో 18 మాత్రమే పూర్తి చేశారు. మరో ఐదు స్ట్రక్చర్లు పురోగతిలో ఉన్నాయి. ప్ర«ధాన కాలువలో 97.5ల„ýక్ష ల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకాలు చేయాల్సి ఉండగా 66.6లక్షల క్యూబిక్ మీటర్లు మట్టి తవ్వకం పనులు చేశారు. పిల్ల కాలువలకు సంబంధించి ఏడు లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వాల్సి ఉంటే కేవలం పదివేల క్యూబిక్ మీటర్లు మట్టి పనులు మాత్రమే చేశారు. రెండో ప్యాకేజీలో 60 లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వాల్సి ఉండగా 29.84 లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వారు.ఈ ప్యాకేజీలో 84 స్ట్రక్చర్లు నిర్మించాల్సి ఉండగా ఒక్కటీ పూర్తి కాలేదు. కేవలం ఆరు నిర్మాణాలు మాత్రం పురోగతిలో ఉన్నాయి. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో ఇప్పటి వరకు రూ.714 కోట్లు ఖర్చు చేస్తే దీనిలో రూ.525.34 కోట్లు విలువైన నిర్మాణ పనులు, రూ.188.93 కోట్లు భూసేకరణ వెచ్చించారు. మొదటి ప్యాకేజీ పనులు 31శాతం, రెండో ప్యాకేజీ పనులు 20 శాతం పూర్తి చేశారు. కొలిక్కిరాని భూ సేకరణ పథకం నిర్మాణానికి 17,042.61 ఎకరాలు అవసరం కాగా.. ఇప్పటి వరకు 7,725 ఎకరాల భూమి మాత్రమే సేకరించారు. ఇంకా 9,317 ఎకరాలను సేకరించాల్సి ఉంది. దీనిలో 6,683 ఎకరాల అటవీ భూమి, 2,634 ఎకరాల జిరాయితీ భూమి సేకరించాల్సి ఉంది. ప్రధానంగా అటవీ భూములకు ప్రత్యామ్నాయం చూపాల్సి ఉంది. భూసేకరణలో రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నష్టపరిహారంగా ఒక్కోచోట ఒక్కో ధర నిర్ణయించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తాజాగా శనివారం రైతులతో కలెక్టర్ జరిపిన చర్యలు బెడిసి కొట్టడంతో పనుల పూర్తిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫేజ్–2 ప్రకటనలతో సరి చింతలపూడి ఎత్తిపోతల పథకం పేజ్–2 ప్రకటనలకే పరిమితమైంది. జిల్లాలో 2.68 లక్షల ఎకరాలతో పాటు కృష్ణా జిల్లాలో 2.10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఏడాది క్రితం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది. అప్పటి నుంచి ఇది కార్యరూపు దాల్చడం లేదు.రూ.3.208 కోట్ల రివైజ్డ్ అంచనాలతో మొత్తం ప్రాజెక్టు విలువను రూ.1,701 కోట్ల నుంచి రూ.4,909 కోట్లకు పెంచారు. దీనికి పరిపాలనా ఆమోదం లభించినా టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇంత వరకు ఎలాంటి ఆదేశాలూ రాలేదు. ఎర్రకాలువ పరిధిలో 27వేల ఎకరాలు, తమ్మిలేరు ప్రాజెక్టు పరిధిలో 24 వేల ఎకరాలు, కొవ్వాడ ప్రాజెక్టు పరిధిలో 17వేల ఎకరాలను స్థిరీకరించడంతో పాటు జల్లేరు జలాశయం సామర్థ్యాన్ని 8 టీఎంసీల నుంచి 20 టీఎంసీలకు పెంచాలని నిర్ణయించారు. కృష్ణా జిల్లాలో తిరువూరు, నూజివీడు, మైలవరం నియోజకవర్గాల పరిధిలో సాగర్ ఆయకట్టుకు సాగు నీరు అందించాలని నిర్ణయించినట్టు ప్రకటించింది. పరిపాలనా ఆమోదం లభించినా టెండర్ల ప్రక్రియకు నోచుకోవడం లేదు. ఫేజ్–1లో చేపట్టిన పనులకు సంబంధించి తొమ్మిదేళ్ల క్రితం అంచనాలు రూపొందించారు. అప్పటి ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం టెండర్లు ఖరారు చేశారు. అదే రేట్లను అనుసరించి పనులు చేస్తున్నారు. ఇప్పుడు ఫేజ్–2లో ప్రస్తుత లెక్కల ప్రకారం టెండర్లు పిలిస్తే ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉంది. ఫేజ్–1లో పనులకూ ప్రస్తుత ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారం బిల్లులు చెల్లించాలన్న వాదన తెరపైకి వచ్చే అవకాశం ఉంది. -
బెడిసికొట్టిన చర్చలు
చింతలపూడి ఎత్తిపోతలకు భూములిచ్చే విషయంలో ప్రతిష్టంభన కాలువ పనులను జరగనిస్తే పరిహారం పెంపుకోసం పోరాడతానన్న కలెక్టర్ ససేమిరా అన్న రైతులు కలెక్టర్ వ్యాఖ్యలపై ఆగ్రహం సాక్షి ప్రతినిధి, ఏలూరు : చింతలపూడి ఎత్తిపోతల పథకానికి అవసరమైన భూములిచ్చే విషయమై రైతులతో కలెక్టరేట్లో శనివారం జరిపిన చర్చలు బెడిసికొట్టాయి. ముందు కాలువ పనులు జరగనివ్వాలని, ఆ తర్వాత రైతులు కోరుతున్న విధంగా నష్టపరిహారం పెంచే విషయమై తాను కూడా ప్రభుత్వంతో పోరాడతానని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ రైతలను కోరారు. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు తాము పనిచేయగలుగుతామే తప్ప ఏ రైతుకూ తక్కువ సొమ్ము ఇవ్వాలనే ఆలోచన ఉండదన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం భూసేకరణ అధికారిగా ప్రభుత్వం స్పెషల్ కలెక్టర్ భానుప్రసాద్‌ను నియమించిందని, రైతులకు పరిహారం ఇచ్చే ప్రతి అధికారం అతనికే ఉంటాయని చెప్పారు. భూసేకరణకు అడ్డుపడుతున్న రైతుల అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకుని ప్రభుత్వానికి అదనపు సహాయం కోసం సిఫార్సు చేసే అధికారం కూడా ఆయనకే ఉందన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి సహకారం అందిస్తే ప్రభుత్వ పరిధిలో తాను గట్టిగా మాట్లాడి రైతులకు అదనపు సహాయం అందేలా కృషి చేస్తానని చెప్పారు. భూముల మార్కెట్ ధరపై నాలుగు రెట్లు అదనంగా నష్టపరిహారం అడగటం తప్పుకాదని.. తాము చట్టానికి లోబడి సహాయం చేయగలమే తప్ప చేయికోసుకోలేమన్నారు. ఈ విషయాన్ని రైతులు అర్థం చేసుకుని చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి ముందుకు రావాలన్నారు. రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా గ్రామాల వారీగా భూములు కోల్పోయే రైతులతో త్వరలోనే సమావేశాలు నిర్వహించి ఏ మేరకు అదనపు సహాయం కావాలనే విషయమై స్పెషల్ కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్రాంతాలను బట్టి రైతులకు పరిహారం ఇచ్చామని.. కొన్ని గ్రామాల్లో ఎకరానికి రూ.90 వేలు, కొన్నిచోట్ల రూ.32 లక్షలు ధర పలికిందన్నారు. రైతు సంఘ నాయకుడు రంగారావు మాట్లాడుతూ భూములు కోల్పోయే రైతులకు ఎన్నో ఆశలు ఉన్నాయని, వారి భవిష్యత్ జీవితం దెబ్బతింటున్న దృష్ట్యా భూములకు నాలుగు రెట్లు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. అదనపు సహాయం ఏ మేరకు లభిస్తుందో ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి తాము సహకారం అందిస్తామని అన్నారు. పలు ప్రాంతాలలో పలు రకాల సమస్యలు ఉన్నప్పటికీ తామంతా ఏకతాటిపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని మంత్రులు ఇచ్చిన హామీ అమలు చేయాలని చిన్నంశెట్టి చినబాబు కోరారు. భూములకు స్పష్టమైన ధరలు ఇచ్చిన తర్వాతే పనులు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయకుండా పనులు చేయడానికి ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. సమావేశంలో పోలవరం ప్రాజెక్ట్ ఎస్ఈ శ్రీనివాసయాదవ్, భూసేకరణ అధికారులు ఆర్వీ సూర్యనారాయణ, డి.పుష్పమణి, ఆర్డీజీ జి.చక్రధరరావు, రైతు నాయకులు అంజిబాబు, రఘునాధరెడ్డి, శ్రీనివాసరావు పాల్గొన్నారు. కలెక్టర్ వ్యాఖ్యలపై ఆగ్రహం ’మోసం చేయడం అనేది భారతీయుల జీన్స్‌లోనే ఉంది. ఎప్పుడూ మోసం చేయాలనే ఆలోచిస్తుంటాం. ప్రభుత్వానికి పన్ను కట్టాల్సి వస్తుందని తక్కువ మొత్తానికి కొన్నట్టు రిజిస్ట్రేషన్లు చేయించడం వల్లే ఇబ్బందులు వస్తున్నాయి’ అని కలెక్టర్ భాస్కర్ చేసిన వ్యాఖ్యలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు పక్కన ఉన్న ఇళ్లకు, పొలాలకు గరిష్ట ధర నిర్ణయించాలని రైతులు కోరగా.. కమిటీ వేయడం సాధ్యం కాదని, అధికారులతో కమిటీ వేస్తే వారు అక్రమాలకు పాల్పడతారని సమాధానం ఇవ్వడంపై రైతు ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతులు, అధికారులను నమ్మకుండా ఎవరిని నమ్ముతారని ప్రశ్నించారు. -
పశ్చిమలో భారీగా బొగ్గు నిక్షేపాలు
-
అమీతుమీ
చింతలపూడి : ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి చింతలపూడి ఎత్తిపోతల పథకం రైతులు సిద్ధమవుతున్నారు. గత ఉగాది సంబరాలకు విచ్చేసిన నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి పీతల సుజాత, జిల్లా ఇన్చార్జి మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడును రైతులు కలిసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రితో చర్చించి నష్టపరిహారం పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో గురువారం భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించడం కోసం కామవరపుకోటలో జిల్లా రైతు సదస్సు తలపెట్టారు. సదస్సుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, వైఎస్సార్ సీపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డితో పాటు రాష్ట్ర, రైతు సంఘం నాయకులు, జిల్లాలోని రైతు సంఘాల ముఖ్య నాయకులు, రైతులు పెద్ద ఎత్తున సదస్సుకు తరలిరానున్నారు. సదస్సులో రాజకీయాలకతీతంగా జిల్లా రైతుల ప్రయోజనాలకు కాపాడేలా పోరాటానికి నిర్ణయం తీసుకోనున్నారు. రెండో దశ మంజూరుతో ఆందోళన మొదటి దశ పనులే ఇంకా పూర్తి కాని చింతలపూడి ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం ఇటీవల రెండో దశ మంజూరు చేయడం జిల్లా రైతుల్లో ఆందోళన కలిగి స్తోంది. జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో ప్రారంభించిన పథకం ఏడేళ్లు గడిచినా నిర్మాణం పూర్తికాలేదు. పరిహారం విషయంలో రైతుల అభ్యంతరాల నేపథ్యంలో భూసేకరణ సమస్యగా మారింది. రైతులు గత మే నెలలో ఆందోళనకు దిగి కాలువ తవ్వకం పనులను అడ్డుకోవడంతో 8 నెలలుగా పనులు నిలిచిపోయాయి. పరిహారంలో వ్యత్యాసం జిల్లాలో పట్టిసీమ పథకం కాలువకు ఒకలా, చింతలపూడి ఎత్తిపోతల పథకం కాలువకు మరోలా నష్టపరిహారం అందజేయడంతో రైతులు భూసేకరణకు అడ్డుపడుతున్నారు. జిల్లాలోని పట్టిసీమ ప్రధాన కాలువ కింద రైతులకు ఎకరానికి రూ.30 లక్షలకు పైగా చెల్లించగా ఇక్కడ మాత్రం రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షలు మాత్రమే ఇస్తామనడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. -
బొగ్గు భాగ్యాలు
చింతలపూడి : భూగర్భంలోని బొగ్గు నిల్వల అన్వేషణను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తరించి ఉన్న నల్ల బంగారం వెలికితీతకు ఇటీవల మైనింగ్ ఎక్స్‌ప్లొరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఈసీఎల్), నేషనల్ మైనింగ్ ఎక్స్‌ప్లొరేషన్ ట్రస్ట్ (ఎన్ఎంఈటీ)లతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది చివరినాటికి అన్వేషణ పూర్తి చేసి, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే బొగ్గును వెలికితీయాలనిప్రభుత్వం నిరీక్షిస్తోంది. ఏపీఎంఐడీసీ ఆధ్వర్యంలో తవ్వకాలు జరగనున్నాయి. మరిన్ని ప్రదేశాల్లో పాయింట్లు పెట్టి అన్వేషణ సాగించాలని భావించిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) సూచనల మేరకు జిల్లాలోని చింతలపూడి మండలం శెట్టివారిగూడెం, కృష్ణా జిల్లాలోని సోమవరం ప్రాంతాల్లో మరోమారు డ్రిల్లింగ్ ప్రారంభించారు. గత గురువారం నుంచి సౌత్ వెస్ట్ పినాకిల్ సంస్థ శెట్టివారిగూడెం ప్రాంతంలో డ్రిల్లింగ్ చేపట్టింది. ప్రస్తుతం 120 పాయింట్లను గుర్తించి అధునాతన రిగ్గులతో డ్రిల్లింగ్ చేస్తోంది. ఈ 120 పాయింట్లలో 65 వేల మీటర్ల లోతున తవ్వి బొగ్గు అన్వేషణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది నుంచి జీఎస్ఐ ఇంజినీర్లు చేపట్టిన తొలిదశ బొగ్గు అన్వేషణ పనులు మూడు నెలల క్రితమే పూర్తయ్యాయి. సుమారు 700 మీటర్లకుపైగా లోతులో డ్రిల్లింగ్ చేసి నివేదికను ప్రభుత్వానికి పంపారు. జీఎస్ఐ ఆరునెలల పాటు చేపట్టిన అన్వేషణలో ఈ ప్రాంతంలో 200 మీటర్ల లోతు నుంచి నాణ్యమైన బొగ్గు నిల్వలు ఉన్నట్టు తేల్చారు. సింగరేణి ప్రాంతంలో లభించే బొగ్గు కన్నా ఇక్కడ నాణ్యమైన నిల్వలు ఉన్నాయని తేల్చారు. 2వేల మిలియ¯ŒS టన్నుల బొగ్గు నిల్వలు మన రాష్ట్రంలోని కృష్ణా జిల్లా చాట్రాయి మండలం సోమవరం గ్రామం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి వరకు సుమారు 2 వేల మిలియన్ టన్నుల నల్ల బంగారం నిల్వలు ఉన్నట్లు తాజా సర్వేల ద్వారా వెల్లడైంది. అవికూడా భూమి ఉపరితలానికి 200 మీటర్ల నుంచి 500 మీటర్ల లోతులోనే ఉన్నాయని నివేదికలో గుర్తించారు. చింతలపూడి ప్రధాన కేంద్రంగా 30కిలోమీటర్ల వ్యాసార్థంలో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. 2013లోనే నిర్ధారణ లక్నోకు చెందిన బీర్బల్ సహానీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాలియో బోటనీ అనే సంస్థ 2013లో కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చేపట్టిన అధ్యయనంలో కృష్ణా జిల్లా సోమవరం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి, టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం మండలాల మీదుగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వరకు నాణ్యమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు కనుగొంది. ఇతర రాష్ట్రాల్లో లభ్యమయ్యే బొగ్గుతో పోల్చితే ఇక్కడ అత్యంత నాణ్యమైన బొగ్గు ఉన్నట్లు ఆ సంస్థ పేర్కొంది. అవీ భూమి ఉపరితలానికి 500 మీటర్ల లోపులోనే ఉన్నాయని నివేదికలో పొందుపరిచింది. 6 నెలలపాటు అన్వేషణ అధునాతన యంత్రాలతో 6నెలల పాటు బొగ్గు అన్వేషణ కొనసాగుతుంది. అన్వేషణ పూర్తయ్యాక ప్రభుత్వానికి తుది నివేదిక అందిస్తాం. ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుంచి రిగ్గులు వచ్చాయి. మొత్తం 120 రిగ్గులు రప్పిస్తున్నాం. – దాశరథి సుదర్శనం, సూపర్వైజర్, సౌత్ వెస్ట్ పినాకిల్ సంస్థ -
బొగ్గు భాగ్యాలు
చింతలపూడి : భూగర్భంలోని బొగ్గు నిల్వల అన్వేషణను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తరించి ఉన్న నల్ల బంగారం వెలికితీతకు ఇటీవల మైనింగ్ ఎక్స్ప్లొరేష¯ŒS కార్పొరేష¯ŒS లిమిటెడ్ (ఎంఈసీఎల్), నేషనల్ మైనింగ్ ఎక్స్ప్లొరేష¯ŒS ట్రస్ట్ (ఎ¯ŒSఎంఈటీ)లతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది చివరినాటికి అన్వేషణ పూర్తి చేసి, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే బొగ్గును వెలికితీయాలనిప్రభుత్వం నిరీక్షిస్తోంది. ఏపీఎంఐడీసీ ఆధ్వర్యంలో తవ్వకాలు జరగనున్నాయి. మరిన్ని ప్రదేశాల్లో పాయింట్లు పెట్టి అన్వేషణ సాగించాలని భావించిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) సూచనల మేరకు జిల్లాలోని చింతలపూడి మండలం శెట్టివారిగూడెం, కృష్ణా జిల్లాలోని సోమవరం ప్రాంతాల్లో మరోమారు డ్రిల్లింగ్ ప్రారంభించారు. గత గురువారం నుంచి సౌత్ వెస్ట్ పినాకిల్ సంస్థ శెట్టివారిగూడెం ప్రాంతంలో డ్రిల్లింగ్ చేపట్టింది. ప్రస్తుతం 120 పాయింట్లను గుర్తించి అధునాతన రిగ్గులతో డ్రిల్లింగ్ చేస్తోంది. ఈ 120 పాయింట్లలో 65 వేల మీటర్ల లోతున తవ్వి బొగ్గు అన్వేషణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది నుంచి జీఎస్ఐ ఇంజినీర్లు చేపట్టిన తొలిదశ బొగ్గు అన్వేషణ పనులు మూడు నెలల క్రితమే పూర్తయ్యాయి. సుమారు 700 మీటర్లకుపైగా లోతులో డ్రిల్లింగ్ చేసి నివేదికను ప్రభుత్వానికి పంపారు. జీఎస్ఐ ఆరునెలల పాటు చేపట్టిన అన్వేషణలో ఈ ప్రాంతంలో 200 మీటర్ల లోతు నుంచి నాణ్యమైన బొగ్గు నిల్వలు ఉన్నట్టు తేల్చారు. సింగరేణి ప్రాంతంలో లభించే బొగ్గు కన్నా ఇక్కడ నాణ్యమైన నిల్వలు ఉన్నాయని తేల్చారు. 2వేల మిలియ¯ŒS టన్నుల బొగ్గు నిల్వలు మన రాష్ట్రంలోని కృష్ణా జిల్లా చాట్రాయి మండలం సోమవరం గ్రామం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి వరకు సుమారు 2 వేల మిలియ¯ŒS టన్నుల నల్ల బంగారం నిల్వలు ఉన్నట్లు తాజా సర్వేల ద్వారా వెల్లడైంది. అవికూడా భూమి ఉపరితలానికి 200 మీటర్ల నుంచి 500 మీటర్ల లోతులోనే ఉన్నాయని నివేదికలో గుర్తించారు. చింతలపూడి ప్రధాన కేంద్రంగా 30కిలోమీటర్ల వ్యాసార్థంలో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. 2013లోనే నిర్ధారణ లక్నోకు చెందిన బీర్బల్ సహానీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాలియో బోటనీ అనే సంస్థ 2013లో కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చేపట్టిన అధ్యయనంలో కృష్ణా జిల్లా సోమవరం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి, టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం మండలాల మీదుగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వరకు నాణ్యమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు కనుగొంది. ఇతర రాష్ట్రాల్లో లభ్యమయ్యే బొగ్గుతో పోల్చితే ఇక్కడ అత్యంత నాణ్యమైన బొగ్గు ఉన్నట్లు ఆ సంస్థ పేర్కొంది. అవీ భూమి ఉపరితలానికి 500 మీటర్ల లోపులోనే ఉన్నాయని నివేదికలో పొందుపరిచింది. 6 నెలలపాటు అన్వేషణ అధునాతన యంత్రాలతో 6నెలల పాటు బొగ్గు అన్వేషణ కొనసాగుతుంది. అన్వేషణ పూర్తయ్యాక ప్రభుత్వానికి తుది నివేదిక అందిస్తాం. ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుంచి రిగ్గులు వచ్చాయి. మొత్తం 120 రిగ్గులు రప్పిస్తున్నాం. – దాశరథి సుదర్శనం, సూపర్వైజర్, సౌత్ వెస్ట్ పినాకిల్ సంస్థ -
ప్రభుత్వంపై సమరానికి రైతులు సై
–చింతలపూడిలో నేడు జిల్లా రైతు సదస్సు చింతలపూడి: ప్రభుత్వంపై సమరానికి చింతలపూడి ఎత్తిపోతల పధకం రైతులు సమాయత్తమవుతున్నారు. గురువారం చింతలపూడిలో జరిగే జిల్లా రైతుల సదస్సు ఇందుకు వేదిక కానుంది. జిల్లాలోని రైతు సంఘాల ముఖ్య నాయకులు, స్వచ్ఛంద సంఘాల నాయకులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొనేలా మార్కెట్ కమిటీలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సదస్సులో రాజకీయాలకు అతీతంగా జిల్లా రైతుల ప్రయోజనాలకు కాపాడే విధంగా పోరాటానికి నిర్ణయం తీసుకుంటారు. ఇదిలా ఉండగా మొదటి దశ పనులే ఇంకా పూర్తి కాని ఈ పధకానికి ప్రభుత్వం ఇటీవల రెండో దశ మంజూరు చేయడంతో జిల్లా రైతుల్లో ఆందోళన కలిగిస్తూంది. జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే లక్ష్యంతో ప్రారంభించబడిన ఈ పధకం ఏడేళ్ళు పూర్తయినా ఇంతవరకు పూర్తి కాలేదు. పరిహారం విషయంలో రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తుండటంతో భూసేకరణ అధికారులకు సమస్యగా మారింది. ఈ నేపధ్యంలోనే రైతులు గత మేనెలలో ఆందోళనకు దిగి కాల్వ త్రవ్వకం పనులను అడ్డుకోవడంతో ఏడు నెలలుగా పనులు నిలిచి పోయాయి. పెరిగిన వ్యయం ః మొదటి దశలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పభుత్వం మంజూరు చేసిన రు 17.01 కోట్లతో పాటు ప్రభుత్వం రెండో దశలో కృష్ణా జిల్లాలో మరో 2.80 లక్షల ఎకరాలను చేర్చి ప్రాజెక్టు వ్యయాన్ని రు 4,909.80 కోట్లకు పెంచారు. ఇందులో మొదటి దశ సామర్ధ్యాన్ని పెంచడం వల్ల మరో 808 కోట్లు అదనంగా ఖర్చు అవుతాయని అంచనా వేశారు. ఇక రెండో దశ పనులకు రు 2,400 కోట్లు అంచనా కట్టారు. దీంతో పశ్చిమ, కృష్ణా జిల్లాల్లో మొత్తం 4.80 వేల ఎకరాలకు సాగు నీరు. త్రాగునీరు అందే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. చింతలపూడి ప్రధాన కాలువ ద్వార తొలుత 2 వేల క్యూసెక్కుల నీరు పారడానికి వీలుగా 24 మీటర్ల వెడల్పు, 3.2 మీటర్ల లోతు ఉండేలా త్రవ్వకం పనులు చేపట్టారు. ఇప్పుడు సామర్ధ్యం పెరగడంతో మరో మూడు మీటర్ల మేర కాల్వ ఎత్తు పెంచడానికి నిర్ణయించారు. అయితే కాల్వ ఎత్తు పెంచితే కాల్వపై కట్టే వంతెనలు, తూములు నీటి ప్రవాహాన్ని తట్టుకునేలా డిజైన్‌లో మార్పులు చేయాల్సి ఉంటుంది. అలాగే జల్లేరు వద్ద తొలుత 8 టీఎంసీల సామర్ధ్యం ఉన్న రిజర్వాయర్‌ను నిర్మించాలని భావించారు. తీరా అది 20 టీఎంసీల సామర్ధ్యానికి పెంచుతూ ప్రతిపాదనలు పంపించారు. పేరుకే చింతలపూడి ఎత్తిపోతల ః పేరుకు చింతలపూడి ఎత్తిపోతల పధకం అయినా ఈ పధకం వల్ల ఎక్కువ ప్రయోజనం కృష్ణా జిల్లాకు కలుగుతూందని ఇక్కడి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ కృష్ణా జిల్లాకు చెందిన ప్రతినిధి కావడంతో ఈ నీటిని తమకు కాకుండ తరలించుకు పోవడానికి కుట్రలు పన్నుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్ధితిలో జిల్లా రైతుల అవసరాలు తీరాకే కృష్ణా జిల్లాకు నీరు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లాకు చెందిన మంత్రి పీతల సుజాత కాని ఎంపీ మాగంటి బాబు , ఇతర ప్రజా ప్రతినిధులు కాని ఈ ప్రాజెక్టుపై ఇంతవరకు నోరు మెదపక పోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్‌లో మంజూరైన పాత డిజైన్ ప్రకారం ప్రాజెక్టు పూర్తి చేసి జిల్లాలోని పంటలకు నీరు ఇచ్చాకే మిగులు వాటర్ కృష్ణాకు ఇవ్వాలని రైతులు yì మాండ్ చేస్తున్నారు. భూసేకరణకు ససేమీరా అంటున్న రైతులు జిల్లాలో పట్టిసీమ కాల్వకు ఒకలా, చింతలపూడి ఎత్తిపోతల కాల్వ రైతులకు మరోలా నష్టపరిహారం అంద చేయడంతో రైతులు భూ సేకరణ కు అడ్డు పడుతున్నారు. జిల్లాలోని పట్టిసీమ ప్రధాన కాల్వ క్రింద రైతులకు ఎకరానికి రు 30 లక్షలకు పైగా చెల్లించి , చింతలపూడి మండలంలో ఎకరానికి 12 నుండి 15 లక్షలే ఇస్తామని చెప్పడం పట్ల రైతుల్లో అభ్యతరం వ్యక్తమవుతూంది. ఒకే ప్యాకేజ్ అమలు చేయాలి జిల్లాలోని ఎత్తిపోతల పధకాల రైతులందరికీ ఒకే ప్యాకేజి అమలు చేయాలి. జిల్లాలోని మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు రైతులతో సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రితో మాట్లాడాలి. చింతలపూడి ఎత్తిపోతల పధకం ద్వార వచ్చే గోదావరి జలాలు పూర్తిగా జిల్లా రైతులు వినియోగించుకునేలా ఆదేశాలు ఇవ్వాలి. అలవాల ఖాదర్‌బాబురెడ్డి చింతలపూడి ఎత్తిపోతల పధకం అఖిల పక్షం రైతు సంఘం అధ్యక్షులు -
ముగిసిన హేండ్‌బాల్ పోటీలు
చింతలపూడి : నన్నయ విశ్వ విద్యాలయం పరిధిలోని కళాశాలలకు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో రెండు రోజులపాటు నిర్వహించిన హేండ్‌బాల్ పోటీలు మంగళవారంతో ముగిశాయి. ఈ పోటీల్లో అత్యంత ప్రతిభ కనపరిచిన 16 మందిని యూనివర్సిటీ టీమ్‌కు ఎంపిక చేసినట్టు పీడీ కె.నాగమణి తెలిపారు. జట్టు వివరాలు తెలిపారు. ఆర్.ఏసురత్నం(కాకినాడ ఐడియల్ కలాశాల), పి.జగదీష్(రామచంద్రాపురం వీఎస్ఎం కళాశాల), ఐ. ఉదయ్ భాస్కర్( గొల్లల మామిడాడ డీఆర్కే కలాశాల), ఎస్.కుమార్ (చింతలపూడి ప్రభుత్వ డిగ్రీ కళాశాల) కె. సాయికుమార్ (గోపన్నపాలెం ఎస్ఎస్ఆర్ జీపీఈ కళాశాల), జి.మహేష్ (రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల), వై.సతీష్ (రాజమండ్రి ఎస్‌కేవీటీ కళాశాల), టి.లక్ష్మీ నారాయణ(కపుల పాలెం ప్రకాష్ డిగ్రీ కళాశాల), ఎస్.గణేష్ (రామచంద్రపురం వీఎస్ఎం కళాశాల), కె.రాజేష్(జి.మామిడాడ, డీఆర్కే కళాశాల),జిఎల్.శ్రీనివాస్(కాకినాడ ఐడియల్ కళాశాల), డి.రాజ్‌కుమార్ (అమలాపురం ఎస్కేబీఆర్ కళాశాల), డీవీ అనిల్‌కుమార్ (కాకినాడ ఐడియల్ కళాశాల), డి.సతీష్(భీమడోలు వెంకటేశ్వర కాలేజ్), వి.రామాంజనేయులు (పెనుమంట్ర ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల), కె.నాగవంశీ (పెనుగొండ ఎస్వీకేపీ కళాశాల) వీరు కాక జట్టులో స్టాండ్ బై ఆటగాళ్లుగా ఎ.దుర్గా ప్రసాద్( కాకినాడ ఐడియల్ కళాశాల), ఎం.సురేష్‌బాబు (మల్కిపురం అమృతా ఆర్ట్స్ కళాశాల), జె.కుమార్‌బాబు (చింతలపూడి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సీహెచ్ ఎస్వీఎస్ దుర్గాప్రసాద్ (గొల్లమామిడాడ, డీఆర్కే కళాశాల). విజేత డీఆర్కే రెడ్డి కళాశాల జట్టు కాగా ఫైనల్ మ్యాచ్‌లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జి.మామిడాడ డీఆర్కే రెడ్డి కళాశాల జట్టు కాకినాడ ఐడియల్ కళాశాల జట్టుపై విజయం సాధించి విజేతగా నిలిచింది. విజేతలకు కళాశాల ప్రిన్సిపాల్ డా.వెలగా జోషి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో నన్నయ్య యూనివర్సిటీ పీడీ సత్యనారాయణ, ఎంపిక కమిటీ సభ్యులు పీడీ జయకుమార్, పీడీ సురేష్ పాల్గొన్నారు. ’ -
రాష్ట్ర స్థాయి పోటీల్లో సుధాకర్‌కు గోల్డ్ మెడల్
చింతలపూడి : స్థానిక బీవీఎం ఐటీఐ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న కోడూరి సుధాకర్ రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీల్లో ప్రథమస్థానం సాధించి గోల్డ్‌మెడల్ అందుకున్నాడు. ఈ నెల 5,6 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించిన పోటీల్లో 400/100 మీటర్ల పరుగు పందెంలో జిల్లా తరపున పాల్గొని ప్రథమస్థానంలో నిలిచాడు. టి.నరసాపురం మండలం, బొర్రంపాలెం గ్రామానికి చెందిన సుధాకర్ తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. సుధాకర్‌ను కళాశాల కార్యదర్శి ఎ.పవన్‌కుమార్, ఉపాధ్యాయులు అభినందించారు. -
పడకేసిన చింతలపూడి
–నత్తనడకన భూసేకరణ ప్రక్రియ –ఎక్కడిక్కక్కడే ఆటంకాలతో నిలిచిపోయిన పనులు –దృష్టి సారించని ప్రభుత్వం –నెరవేరని మెట్టరైతుల కల కొవ్వూరు: జిల్లాలో మెట్ట రైతుల మేలు చేకూర్చే చింతలపూడి ఎత్తిపోతల పధకం పనులు పడకేశాయి.రాష్ట్ర ప్రభుత్వం ఈపధకం పూర్తి చేయడం పట్ల శ్రద్ద చూపడం లేదు.పనులు ప్రారంభమై ఎనిమిదేళ్లు కావస్తున్నా నేటీకీ ఇరవైఐదు శాతంలోపు మాత్రమే పనులు పూర్తయ్యాయి.టీడీపీ అధికారంలోకి వచ్చి సుమారు మూఫైనెలలు కావస్తుంది.పనుల్లో పురోగతి ఏమాత్రం కనిపించడం లేదు.రూ.1,701 కోట్లు వ్యయంతో చేపట్టిన ఈ పధకం పనులు ఇప్పటి వరకు కేవలం రూ.456 కోట్లు విలువైన పనులు మాత్రమే పూర్తి చేశారు.భూసేకరణ ప్రక్రియ నత్తనడక కొనసాగుతుంది.ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన 1,828 ఎకరాలు సేకరించాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం మూఫైశాతం భూమిని మాత్రమే సేకరించారు. కష్ణ జిల్లా రైతులకు ప్రయోజనాల కోసం పట్టిసీమ పధకాన్ని ఆగమేఘాలపై పూర్తి చేసిన ప్రభుత్వం చింతలపూడి పధకం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందని మెట్ట రైతులు ్రçపశ్నిస్తున్నారు.ఈ జిల్లా అంటే నాకు ప్రత్యేక అభిమానం ఉంది.ఈ జిల్లాకి ఎన్ని మేళ్లు చేయాలో అన్నీ చేస్తాం...జిల్లా ప్రజలు చూపిన ఆధరణకి ఎప్పుడు రుణపడి ఉంటానని పదేపదే వల్లెవేస్తున్న సీఎం చంద్రబాబు చింతలపూడి పధకం పనులు పూర్తి విస్మరించడం విమర్శలకు తావిస్తోంది. మహానేత ఆశయానికి తూట్లు: దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మెట్టరైతుల సాగునీటి కష్టాలు తీర్చాలని రూ.1,701 కోట్లు వ్యయంతో గోదావరి నీటిని తరలించే ందుకు ఈ çపధకం మంజూరు చేశారు.2008 అక్టోబర్ 30న శంకుస్ధాపన చేశారు.మెట్టప్రాంతంలో 16 మండలాల్లో 196గ్రామాల పరిధిలో 2లక్షల ఎకరాల ఆయకట్టుకి సాగునీరు అందించేందుకు ఈ ప«దకాన్ని రుపోంది ంచారు.నాలుగేళ్ల కాలంలో అంటే 2013 ఫిబ్రవరికి పధకం పూర్తికావాల్సి ఉన్నప్పటికీ వైఎస్ఆర్ మరణాంతరం పనులు పడకేశాయి.మరోమూడేళ్ల సమయం అదనంగా పోడిగించి వచ్చే ఏడాది జూన్ నాటికి పనులు పూర్తి చేయాలని నిర్ధేశించారు.అయినా ఆగడువులోపు పనులు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. నత్తనడనక భూసేకరణ ప్రక్రియ: ఈపధకం నిర్మాణానికి 18,208 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉండగా దీనిలో 6,683 ఎకరాల అటవీశాఖ భూమి ఉంది.మిగతా భూమి రైతులను సేకరించాల్సి ఉంది. ఈపధకం పనులు రెండు ప్యాకేజీల కింద చేపట్టారు. దీనిలో మొదటి ప్యాకేజిలో 11,749 ఎకరాలకు గాను 6,050 ఎకరాల అటవీ భూమి ఉంది.రైతుల నుంచి సేకరించాల్సిన 5,699 ఎకరాల్లో 4,430 ఎకరాలు సేకరించారు.రెండో ప్యాకేజిలో 6,801 ఎకరాలు సేకరించాల్సి ఉండగా దీనిలో 633 ఎకరాలు అటవీభూమి ఉంది.మిగిలిన 6,168 ఎకరాల్లో కేవలం 1,600 ఎకరాలు మాత్రమే సేకరించారు.ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా అటవీ శాఖ నుంచి సేకరిస్తున్న భూమికి ప్రత్యామ్నాయంగా భూములు చూపించాల్సి ఉంటుంది.విశాఖపట్నం జిల్లా చోడవరం మండలంలో భూములను చూపించారు.ఇటీవలే అటవీశాఖ అధికారులు ఆభూములను పరిశీలించారు.అటవీశాఖకు ఈ భూములు బదలాయిస్తే ఇక్కడ ఆశాఖకి చెందిన 6,683 ఎకరాలు భూముల్లో పనులు చేపట్టే అవకాశం ఉంది.ప్రభుత్వం ఈ భూములు బదలాయింపు ప్రక్రియ తర్వతగతిన పూర్తి చేస్తే పనులు చేపట్టే అవకాశం ఏర్పడుతుంది. పురోగతి లేని పనులు: చింతలపూడి పధకం మొదటి ప్యాకేజీ పనులు రూ.1,202 కోట్లు వ్యయంతో చేపట్టారు.వీటిలో ఇప్పటి వరకు రూ.359 కోట్లు పనులు మాత్రమే పూర్తి చేశారు.ఈ ప్యాకేజీలో 110 స్ట్రక్చర్స్ నిర్మాణం చేపట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం పదహారు మాత్రమే పూర్తయ్యాయి. ఈప్యాకేజీలో 29.81శాతం పనులు పూర్తి చేశారు.రెండో ప్యాకేజీలో ఇప్పటి వరకు 19.55 శాతం పనులు పూర్తి చేశారు.మొత్తం రూ.497 కోట్లు వ్యయంతో చేపట్టిన ఈప్యాకేజీలో ఇప్పటి వరకు కేవలం రూ.97 కోట్లు పనులు మాత్రమే పూర్తి చేశారు. భూసేకరణ పరిహారం చెల్లింపుల్లో వివక్షత: జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి రెవెన్యూ పరిధిలో భూసేకరణ చేపట్టి 117 ఎకరాలు సేకరించారు.ఈ భూముల్లో భాగంగా 77.85 ఎకరాలకు గాను గత ఏడాది అక్టోబరులో రూ.25, 67,22,251 అవార్డు పరిహారాన్ని ప్రకటించారు. 50 మంది రైతుల నుంచి ఈ భూములను అధికారులు సేకరించారు.ఈపరిహారం నేటికి రైతుల బ్యాంకు ఖాతాలో జమకాలేదు.గత ఏడాది డిసెంబర్లో ఇక్కడ పనులు ప్రారంభించారు. ఈ పనులు పూర్తి కావస్తున్నా రైతులకు మాత్రం పరిహారం చెల్లించలేదు. తొలుత ఎకరాకు రూ.29.70 లక్షల చోప్పున అందిస్తామని నమ్మించి ఇప్పుడు అధికారులు రూ.21 లక్షల చొప్పున ఇస్తామంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.బుట్టాయి గూడెం మండలంలో భూసేకరణ చేసినప్పటికీ పరిహారం పూర్తిస్ధాయిలో అందకపోవడంతో నాలుగునెలలు నుంచి పనులు నిలిచిపోయాయి. చింతలపూడి మండలం యర్రగుంటపల్లిలో ఎకరాకు రూ.12.50 లక్షలు మాత్రమే చెల్లించారు.దెందులూరు మండలంలో పట్టిసీమ పధకానికి ఇచ్చిన మాదిరిగా తరహాలో ఎకరానికి రూ.38 లక్షలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.కొందరు రైతులు కోర్టుకు వెళ్ళి స్టేతెచ్చుకున్నారు. దీంతో యర్రగుంటపల్లితోపాటు వెంకటాపురం, కాంతంపాలెం, చింతలపూడి, ప్రగడవరం గ్రామాల్లో పనులు మే నెల నుంచి ఆగిపోయాయి.గోపాలపురం మండలం భీమోలు రైతులు పరిహారం తక్కువ మొత్తంలో చెల్లించారని కోర్టు ఆశ్రయించడంతో నాలుగు నెలలుగా పనులు నిలిచిపోయాయి.ఇక్కడ ఎకరాకి రూ.20లక్షల చోప్పున చెల్లించారు. పక్కనే ఉన్న అన్నదేవరపేట భూములకు రూ.24 లక్షల నుంచి రూ.28లక్షల వరకు చెల్లించారని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.జీలుగుమిల్లి మండలంలో రైతుల భూముల్లో పనులు పూర్తయినప్పటికీ అటవీశాఖ భూములు ఎక్కువగా ఉన్నాయి.ప్రస్తుతం అటవీ శాఖ భూములను పనులు కొనసాగడం లేదు. టి.నరసాపురం, బుట్టాయిగూడెంలోను అటవీ శాఖ భూములు స్వాధీనం చేసుకోకపోవడం పనులు చేపట్టలేదు. నాలుగు నెలలుగా పరిహారం ఇవ్వలేదు: మా గ్రామంలో సుమారు 30 మంది రైతుల నుంచి చింతలపూడి ఎత్తిపోతల పధకం కాలువ తవ్వకాలకు భూమిని తీసుకున్నారు. 4నెలలు కావొస్తున్నా మాకు నష్ట పరిహారం ఇంత వరకూ ఇవ్వలేదు.పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. –తెల్లం సూరిబాబు,కంగాలవారిగూడెం–బుట్టాయగూడెం మండలం. భూములకు పరిహారం తగ్గించారు: చింతలపూడి ఎత్తిపోతల పధకంలో భాగంగా తమ భూములు కూడా ఉన్నాయి. ప్రకటించిన అవార్డు సొమ్ము కాకుండా ఎకరాకు రూ.29.70లక్షలు ఇస్తామని చెప్పి ఇప్పుడు రూ. 21 లక్షల ఇస్తామని చెబుతున్నారు.ఎంతో విలువైన, సాగుకు ఉపయోగపడే భూములను పధకానికి తాము ఇచ్చాం. కానీ తమకు ఇస్తామన్న పరిహారం ఇవ్వడానికి అధికారులు నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తున్నారు. – పల్లా గంగాధరరావు, రైతు,తాడువాయి జంగారెడ్డిగూడెం మండలం -
2018 నాటికి ‘చింతలపూడి’ని పూర్తి చేస్తాం
చింతలపూడి : 2018 ఆగస్ట్ నాటికి చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత పేర్కొన్నారు. స్థానిక మార్కెట్ కమిటీ ఆవరణలో వర్షాలకు ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వం నుంచి వచ్చిన ఆర్థిక సహాయాన్ని అందచేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ వచ్చే బడ్జెట్లో పథకానికి కావాల్సిన నిధులను కేటాయించనున్నట్టు చెప్పారు. అదేవిధంగా ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి దష్టిలో పెట్టనున్నట్టు చెప్పారు. దోమల నిర్మూలనపై ప్రజల ఆరోగ్యం ఆధారపడిందని, అందుకే దోమలపై దండయాత్ర చేపట్టామని తెలిపారు. మండలంలో నివాసాలు కోల్పోయిన 14 మందికి బియ్యం, కందిపప్పు, నూనెతో పాటు నగదు సాయాన్ని అందచేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ తాళ్లూరి రాధారాణి, ఎంపీపీ దాసరి రామక్క, తహసీల్దార్ టి.మైఖేల్‌రాజ్, ఎంపీడీవో ఎం.రాజశేఖర్, చింతలపూడి, రాఘవాపురం సొసైటీ అధ్యక్షుడు నలమాటి రామకృష్ణ, ఎం.శ్రీనివాసరావు, ఎంపీటీసీలు, చిన్నంశెట్టి సీతారామయ్య, సయ్యద్ బాబు, బందెల ఆశీర్వాదం పాల్గొన్నారు. -
ప్రత్యేక హోదాకోసం.. కదం తొక్కిన విద్యార్థిలోకం
చింతలపూడి : ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సలాంబాబు ఆరోపించారు. చింతలపూడిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ రాష్ట్రానికి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామంటే పార్లమెంట్లో చెబితే పదేళ్లు కావాలని అడిగిన బీజేపీ, టీడీపీ అధికారంలోకి వచ్చాక హోదా ఊసే ఎత్తడం లేదన్నారు. 64 లక్షల జనాభా ఉన్న హిమాచల్‌ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తే ఆ రాష్ట్రానికి రూ. 60 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. 3 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. ఓటుకు నోటు కేసు మాఫీ కోసం చంద్రబాబు రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కె సలాంబాబు అన్నారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి కె.దినేష్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం చింతలపూడి పట్టణంలో ప్రత్యేక హోదా కోరుతూ నిర్వహించిన విద్యార్థుల ర్యాలీలో సలాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాతబస్టాండ్ సెంటర్లో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో గ్రామాల్లో ప్రత్యేక హోదా ఉద్యమం బలపడుతుందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వరకు ఉద్యమం ఆగదన్నారు. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ, మేము మాత్రమే తీసుకురాగలమని టీడీపీ చెప్పి ప్రజలను మోసం చేశాయని గుర్తు చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన పత్యేక హోదా పోరులో విద్యార్థులతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ సమన్వయకర్త డి.నవీన్‌బాబు మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు పోరాటం చేసి హోదాను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్ల ఎక్కువగా నష్టపోయేది విద్యార్థులు, నిరుద్యోగులేనన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకపల్లి డేవిడ్, రాష్ట్ర కార్యదర్శి కె.దినేష్‌రెడ్డి, నియోజకవర్గ కోఆర్డినేటర్ దయాల నవీన్‌బాబు, జిల్లా అధికార ప్రతినిధి బొడ్డు వెంకటేశ్వరరావు, మండల అధ్యక్షురాలు జగ్గవరపు జానకిరెడ్డి పాల్గొన్నారు. -
యువభేరీకి మద్దతుగా విద్యార్ధుల భారీ ర్యాలీ
-
టైల్స్ షాపులో చోరీ
చింతలపూడి: చింతలపూడి పట్టణానికి చెందిన గ్రాండ్ టైల్స్ అండ్ ఫర్నిచర్స్ షాపులో శనివారం తెల్లవారు జామున దొంగతనం జరిగింది. షాపు వెనుక ఉన్న సిమెంట్ కిటికీ బద్దలు కొట్టి లోపలికి ప్రవేసించిన దొంగలు డ్రాయర్ సొరుగులోని 22 వేల నగదును దొంగిలించుకుపోయారు. ఉదయం షాపు తెరిచి చూడగా దొంగతనం జరిగిన విషయం తెలుసుకున్న షాపు యజమాని హమీద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని పరిశీలించారు. ఎస్ఐ సైదానాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్‌తో సాగునీరు
కంచికచర్ల : పశ్చిమ కృష్ణా మెట్ట రైతులను ఆదుకునేందుకు చింతలపూడి ఎత్తిపోతల పథకం చేపడుతున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. స్వర్గీయ దేవినేని వెంకటరమణ, ప్రణీతల ఘాట్ వద్ద బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఐదు లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకు రూ.4900 కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పశ్చిమ కృష్ణాలోని నందిగామ, మైలవరం, తిరువూరు,నూజివీడు, గన్నవరం నియోజకవర్గంలోని 18 మండలాలకు ఈ పథకం ద్వారా సాగునీరు అందుతుందన్నారు. 410 గ్రామాల్లోని 21 లక్షల జనాభాకు తాగునీటి సౌకర్యం కలుగుతుందన్నారు. దశాబ్దకాలంలో జిల్లాలోని మూడో జోన్‌లోని నాగార్జున సాగర్ ఎడమ, కుడి కాల్వలకు సాగునీరు అందకపోవడంతో ఈ ప్రాంతంలో రైతులు సాగుచేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు నన్నపనేని నరసింహారావు, ఎంపీపీ వేల్పుల ప్రశాంతి, జెడ్పీటీసీ సభ్యుడు కోగంటి బాబు, ఏఎంసీ చైర్మన్ నన్నపనేని లక్ష్మీనారాయణ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు పాల్గొన్నారు. -
చింతలపూడి ఎత్తిపోతల పథకానికి రూ.4,909 కోట్లు
ఏలూరు (ఆర్ఆర్ పేట) : చింతలపూడి ఎత్తిపోతల పథకానికి రూ. 4,909 కోట్లతో సవరించిన అంచనాలతో పరిపాలనామోదం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసినట్టు రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు నంబర్–97తో సవరించిన పరిపాలనామోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసినట్టు చెప్పారు. -
చింతలపూడి పనులను అడ్డుకున్న రైతులు
చింతలపూడి : రైతులకు ఆమోదయోగ్యమైన నష్టపరిహారం ఇచ్చే వరకు చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను జరగనివ్వమని రైతు నాయకులు అన్నారు. వెలగలపల్లి, శెట్టివారిగూడెం గ్రామాల్లో ఎత్తిపోతల పథకం భూసేకరణ పనులను శుక్రవారం రైతులు అడ్డుకున్నారు. రైతులకు సమాచారం ఇవ్వకుండా భూసేకరణకు సర్వే చేయడానికి రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బలవంతంగా భూసేకరణ జరపాలనుకుంటే అడ్డుకుంటామని హెచ్చరించారు. సర్వే చేయనివ్వకుండా సర్వే సిబ్బందిని అడ్డుకుని వెనక్కు పంపారు. ఈ సందర్భంగా రైతు నాయకులు గోలి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తొలుత తమ భూములకు ఎకరానికి ఎంత నష్ట పరిహారం అందిస్తారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ టి.మైఖేల్రాజ్కు వినతిపత్రం అందచేశారు. ఆందోళనలో రైతులు తాళం మాధవరావు, చిలకబత్తుల సత్యనారాయణ, ఎం.నర్సయ్య, చిలుకూరి నారాయణరెడ్డి పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
చింతలపూడి : చింతలపూడి మండలం లింగగూడెం సమీపంలో శుక్రవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాఘవాపురం గ్రామానికి చెందిన సిద్దోజీ పుల్లాచారి (55) కోళ్ల వ్యర్థాలు తీసుకువెళ్తున్న డీసీఎం వాహనం డ్రైవర్‌తో మాట్లాడుతుండగా తెలంగాణ రాష్ట్రం వైపు నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో పుల్లాచారి అక్కడికక్కడే మృతిచెందారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్సై సైదానాయక్ మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పుల్లాచారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ
చింతలపూడి: చింతలపూడి పా త బస్టాండ్ సెంటర్లోని అభయాంజనేయస్వామి ఆలయం లో గురువారం వేకువజామున దొంగలు పడ్డారు. హుండీ తాళాలు పగులగొట్టి నగదు అపహరించారు. ఆలయ అర్చకులు రాఘవాచారి ఉదయం 4 గంటలకు ఆలయానికి రాగా హుండీ తాళాలు పగులగొట్టి ఉండటంతో ఆలయ కమిటీకి సమాచారం అందించారు. దీనిపై పో లీసులకు ఫిర్యాదు చేశామని కమిటీ అధ్యక్షుడు శేషగిరిరావు చెప్పారు. రెండు నెలలుగా హండీ తెరవలేదని సుమారు రూ.15 వేలకు పైగా నగదు ఉండవచ్చని అన్నారు. ఇటీవల కాలంలో చింతలపూడి పరిసర ప్రాంతాల్లో ఆలయాల్లో చోరీలు జోరుగా సాగుతున్నాయి. హుండీ తాళాలు పగులగొట్టి సొమ్ములు అపహరిస్తున్నారు. చింతలపూడిలో ముత్యాలమ్మ, జీబీజీ రోడ్డులో ఆంజనేయస్వామి, యర్రగుంటపల్లి ఆంజనేయస్వామి ఆలయాల్లో ఇదే తరహా చోరీలు జరిగాయి. -
జిల్లాలో 43 మినీ రైతు బజార్లు
చింతలపూడి: రాష్ట్రంలో పశ్చిమగోదావరి జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి 43 మండలాల్లో 43 మినీ రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత తెలిపారు. చింతలపూడి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన రైతు బజారును గురువారం ఆమె ప్రారంభించారు. జిల్లాలో ఆరు రైతు బజార్లలో మినహా మిగిలిన వాటిని శీతల గిడ్డంగులతో ప్రారంభిస్తున్నామన్నారు. చింతలపూడి, లింగపాలెం, జంగారెడ్డిగూడెం, తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొయ్యలగూడెం, నల్లజర్ల, మండలాల్లో రైతు బజార్ల కోసం ప్రభుత్వం రూ.47 లక్షలు మంజూరు చేసిందని చెప్పారు. ఏలూరులో ఈ–మార్కెట్ విధానం రాష్ట్రంలోని పది మార్కెట్ కమిటీల్లో ఈ–మార్కెట్ విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. దీనిలో భాగంగా ఏలూరు మార్కెట్ యార్డులో నిమ్మకాయల అమ్మకానికి ఈ–మార్కెట్ విధానం ప్రవేశపెట్టామని చెప్పారు. చింతలపూడిలో శీతల గిడ్డంగిని ఏర్పాటు చేసి పూర్తిస్థాయి రైతు బజారుగా అభివద్ధి చేస్తామన్నారు. శుక్రవారం ప్రారంభించనున్న కోటి మొక్కల ఉద్యమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వచ్చేనెల 5వ తేదీ నుంచి ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంలో ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామని చెప్పారు. రూ.10 కోట్లతో గుంటుపల్లి, కామవరపుకోట రహదారిని అభివద్ధి పరుస్తున్నామన్నారు. మార్కెటింగ్ శాఖ ఏడీ పి.ఛాయాదేవి,ఎంపీపీ దాసరి రామక్క, ఉద్యాన శాఖ ఏడీ దుర్గేష్, మార్కెట్ కమిటీ కార్యదర్శి టీటీవీఎస్ఎస్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. మంత్రిని కలిసిన ‘చింతలపూడి’ రైతులు చింతలపూడి ఎత్తిపోతల రైతులకు న్యాయం చేయడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పీతల సుజాత తెలిపారు. చింతలపూడి వచ్చిన ఆమె ఎత్తిపోతల పథకం రైతులను కలిశారు. ప్రభుత్వం తమకు నష్టపరిహారం చెల్లించకుండా కాలువ పనులు చేపడుతుందని రైతులు ఆమె దష్టికి తీసుకువచ్చారు. -
మాఫీ మెలిక
వ్యవసాయ రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం ఆదిలోనే ఎన్నో కొర్రీలు పెట్టింది. ఎందరో రైతుల పొట్టగొట్టింది. వడపోతల అనంతరం మిగిలిన రైతులకైనా సజావుగా సొమ్ము చెల్లించడం లేదు. తాజాగా రెండో విడత మాఫీకి కొత్త మెలిక పెట్టింది. మాఫీ సొమ్మును నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయకుండా ఉపశమన పత్రాలిస్తోంది. వాటిని బ్యాంకులో ఇస్తే సొమ్ము జమ అవుతుందని నమ్మబలికింది. తీరా బ్యాంకుకు వెళితే.. తమకెలాంటి ఆదేశాలు అందలేదని, సొమ్ము కూడా రాలేదని బ్యాంకర్లు చెబుతుండటంతో అన్నదాతలు అవాక్కవుతున్నారు. అడుగడుగునా తమను ఇబ్బందుల పాల్జేస్తున్న సర్కారు తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. చింతలపూడి/జంగారెడ్డిగూడెం : ప్రభుత్వం ఇచ్చిన రుణ ఉపశమన పత్రం చూపిస్తున్న ఈయన పేరు ఘంటా చంద్రశేఖర్. చింతలపూడికి చెందిన ఈయన అక్కడి ఆంధ్రాబ్యాంక్ శాఖలో రూ.2 లక్షల వ్యవసాయ రుణం తీసుకున్నారు. రూ.లక్షన్నర రుణం మాఫీ చేస్తున్నామని, ఆ మొత్తాన్ని 5 విడతలుగా చెల్లిస్తామని అధికారులు చెప్పారు. అప్పటివరకూ ఆగితే వడ్డీ పెరిగిపోతుందన్న భయంతో కుటుంబ సభ్యులు, స్నేహితుల సాయంతో బకాయిపడిన మొత్తం రుణాన్ని చెల్లించేశారు. గత ఏడాది మొదటి విడతలో రుణ మాఫీ సొమ్ము రూ.30 వేలు ఆయన బ్యాంక్ ఖాతాలో జమయ్యింది. రెండో విడత రుణమాఫీ నిమిత్తం రూ.30 వేలకు ఉపశమన పత్రాన్ని ఇటీవల అతనికి ఇచ్చారు. దానిని తీసుకుని బ్యాంకుకు వెళితే.. రెండో విడత రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం రాలేదని చెప్పారు. సొమ్ము వచ్చినప్పుడు అకౌంట్లో వేస్తాం వెళ్లమన్నారు. ఈ మాత్రం దానికి రైతులకు ఉపశమన పత్రాలు ఎందుకు ఇవ్వాలని, బ్యాంక్‌ల చుట్టూ తిరగలేక ఇబ్బందులు పడుతున్నామని చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ పరిస్థితి ఒక్క చంద్రశేఖర్‌కు మాత్రమే పరిమితం కాలేదు. రూ.లక్షకు పైబడి రుణం తీసుకుని.. రుణమాఫీ అర్హుల జాబితాలో చోటు సంపాదించుకున్న 3,35,456మంది రైతులు ఇదే ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. వీరందరికీ ఈ ఏడాది జనవరిలో రూ.262.32 కోట్లను చెల్లించాల్సి ఉండగా, తాపీగా ఇప్పుడు రుణ ఉపశమన పత్రాలు ఇస్తున్నారు. అవికూడా లబ్ధిదారుల్లో 50 శాతం మందికైనా అందలేదు. రూ.50 వేలలోపు రుణం తీసుకున్న వారిలో అర్హత ప్రాతిపదికన కొందరికి తొలి విడతలో రుణమాఫీ చేయగా, రూ.లక్ష దాటిన వారికి ఐదు విడతలుగా మాఫీ సొమ్ము చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటిం చింది. రూ.లక్ష బకాయి ఉన్న రైతులకు విడతకు రూ.20వేల చొప్పున, రూ.1.50 లక్షలు బకాయి ఉన్నవారికి విడతకు రూ.30వేల చొప్పున చెల్లిస్తామని పేర్కొంది. అంతకుమించి రుణాలు తీసుకున్న వారికి అత్యధికంగా రూ.1.50 లక్షలను మాత్రమే విడతల ప్రాతిపదికన చెల్లిస్తామని అభయమిచ్చింది. అడుగడుగునా అవాంతరాలే అధికారంలోకి వ స్తే రైతుల రుణాలను రద్దు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు.. రైతులకు అడుగడుగునా చుక్కలు చూపిస్తున్నారు. తాము తీసుకున్న మొత్తాన్ని మాఫీ చేస్తారని ఎదురుచూసిన రైతులకు రూ.లక్షన్నర మాత్రమే రద్దు చేస్తామంటూ ముఖ్యమంత్రి షాకిచ్చారు. పోనీ అదైనా ఒకేసారి చేశారా అంటే ఐదు విడతలుగా ఇస్తానని ప్రకటించడంతో రైతులు కంగుతిన్నారు. మొదటి విడత మాఫీ సొమ్ము రైతుల అకౌంట్లలో జమ చేయడానికి ప్రభుత్వానికి ఏడాది పట్టింది. పోనీ.. రెండో విడత సొమ్ము అయినా సకాలంలో అందడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రుణ ఉపశమన పత్రాల వల్ల ఉపయోగం లేకుండా పోతోందని రైతులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మంత్రు లు, అధికారులు అట్టహాసంగా బహిరంగ సభలు పెట్టి పత్రాలు పంపిణీ చేస్తున్నా.. బ్యాంకర్లు తమకు ఇంకా సొమ్ము రాలేదనిఅంటుండటంతో వాటిని పొందిన అన్నదాతలు నిరాశ చెందుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తరుణంలో రుణమాఫీ సొమ్ము వస్తే ఎరువులు, విత్తనాలు తెచ్చుకుందామని ఆశపడుతున్న అన్నదాతలకు నిరాశే ఎదురవుతోంది. బ్యాంకుల్లో డబ్బు జమ చేయకుండా తమకు రుణ ఉపశమన పత్రాలు ఇవ్వడమెందుకని రైతులు నిలదీ స్తున్నారు. అసలు అప్పు రద్దవుతుందా లేదా అని గగ్గోలు పెడుతున్నారు. ఖాతాల్లో జమ చేయాల్సిందిలా.. రుణ ఉపశమన పత్రాలు అందుకున్న రైతులు వాటిని బ్యాంకుకు తీసుకువెళ్లాలి. అక్కడ రైతు ఆధార్ నంబర్, రుణపత్రాన్ని తీసుకుని బ్యాంకు అధికారులు పరిశీలించి రుణ ఉపశమన పత్రంపై సంతకం చేసి తిరిగి రైతుకు ఇచ్చేయాలి. అనంతరం దానిని ఆన్లైన్ చేయాలి. ఇలా రైతుల పత్రాలన్నీ ఆన్లైన్ చేస్తే ఆ వివరాలన్నీ రైతు సాధికార సంస్థకు వెళతాయి. అక్కడి నుంచి ఏ బ్యాంకుకు ఎంత నగదు జమ చేయాలో చూసి ఆ సంస్థ తదుపరి చర్యలు చేపడుతుంది. అలా వచ్చిన నగదును ఆయా బ్యాంకులు రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ రైతు ఆ సొమ్మును ఖాతాల్లో నిల్వ ఉంచుకుంటే 10 శాతం వడ్డీ కూడా చెల్లించాలి. -
ప్రభుత్వం నిరంకుశ ధోరణి వీడాలి
చింతలపూడి : ‘సాక్షి’ ఛానల్‌పై సీఎం చంద్రబాబు ప్రభుత్వం అవలంభిస్తున్న నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా చింతలపూడిలో అఖిలపక్ష పార్టీల నేతలు ధ్వజమెత్తారు. సాక్షిపై వేధింపులు మానాలని, సాక్షి ఛానల్ ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలని కోరుతూ మంగళవారం పట్టణంలో కదం తొక్కారు. స్థానిక పాతబస్టాండ్ సెంటర్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అక్కడి నుంచి ప్రదర్శనగా బోసుబొమ్మ సెంటర్ చేరుకుని రాస్తారోకో చేశారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి బొడ్డు వెంకటేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యు డు ఎం.వసంతరావు, మండల కార్యదర్శి జంగా రామచంద్రారెడ్డి, పీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.థామస్, సీపీఎం డివిజన్ కార్యదర్శి ఆర్వీ సత్యనారాయణ, రైతు సంఘం నాయకులు కె.చంద్రశేఖర్‌రెడ్డి, పౌరహక్కుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పిడపర్తి ముత్తారెడ్డి మాట్లాడుతూ మీడియాపై చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరితంగా వేధింపులకు పాల్పడుతోందని విమర్శించారు. భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించడం రాజ్యాంగ ఉల్లంఘనేనని చెప్పారు. ప్రభుత్వ నిరంకుశ ధోరణి నశించాలని నినాదాలు చేశారు. వైఎస్సార్ సీపీ మండల మహిళా అధ్యక్షురాలు సాదరబోయిన వరలక్ష్మి, ఎంపీటీసీ యండ్రపాటి కుమారి, వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ మండల అధ్యక్షులు ఎం.ఇమ్మానియేలు, జిల్లా ట్రేడ్ యూనియన్ కార్యదర్శి బొల్లం రామారావు, వెంకటాద్రిగూడెం సర్పంచ్ మేడి రాములు, వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు ఎస్.కాంతారావు, వార్డు సభ్యులు, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
పీఎస్ లో సొమ్మసిల్లిన వైఎస్సార్సీపీ నేత
చింతలపూడి (పశ్చిమగోదావరి జిల్లా) : చింతలపూడి పోలీసు స్టేషన్లో పోలీసుల నిర్బంధంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బొడ్డు వెంకటేశ్వరరావు అస్వస్థతకు గురయ్యారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ అరెస్ట్‌కు నిరసనగా జరుగుతున్న బంద్‌ను నిర్వీర్యం చేసే క్రమంలో పోలీసులు బొడ్డు వెంకటేశ్వరరావుతోపాటు మరో ఇద్దరు కాపు సంఘం నాయకులను శనివారం ఉదయం ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఉదయం నుంచి స్టేషన్లోనే ఆహారం లేకుండా ఉండిపోవడంతో సాయంత్రం సమయంలో బొడ్డు వెంకటేశ్వరరావు సొమ్మసిల్లి పడిపోయారు. ఆయన్ను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి మెరుగు కాకుంటే ఏలూరు లేదా విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించనున్నట్టు సమాచారం. -
గ్యాస్ వినియోగదారులకూ బీమా
చింతలపూడి : పట్టణాలతోపాటు పల్లెల్లోనూ ప్రస్తుతం వంట గ్యాస్ వినియోగం పెరిగింది. ఈ నేపథ్యంలో గ్యాస్ వినియోగదారులకూ బీమా పథకం అందుబాటులోకి వచ్చింది. ఈ విషయం చాలామందికి తెలీదు. దీనిపై అవగాహన లేక చాలా మంది ప్రమాదాలు జరిగినప్పుడు బీమా సొమ్ము పొందలేకపోతున్నారు. ప్రమాదవశాత్తూ సిలిండర్లు పేలి నష్టం సంభవిస్తే బాధిత వినియోగదారులు గ్యాస్ కంపెనీల నుంచి పరిహారం పొందవచ్చు. ఈ బీమా రూ.ఐదులక్షల నుంచి రూ.50లక్షల వరకూ ఉంటుంది. దీనికోసం వినియోగదారులు ఎటువంటి ప్రీమియం చెల్లించనవసరం లేదు. ఇండియన్ ఆయిల్, భారత్ గ్యాస్, హిందూస్థాన్ పెట్రోలియం వంటి కంపెనీలే ప్రతి గ్యాస్ కనెక్షన్‌కూ ప్రీమియం చెల్లిస్తాయి. ఏజెన్సీలు చేయాల్సిన పని ప్రతీ గ్యాస్ ఏజెన్సీ బీమా కవరేజి విషయాలను వినియోగదారులకు తెలిసేలా నోటీస్ బోర్డులో పెట్టాలి. కనెక్షన్ విక్రయించే సమయంలోనే వినియోగదారులకు బీమాపై అవగాహన కల్పించాలి. కానీ ఒక్క గ్యాస్ ఏజెన్సీ కూడా దీనిని పాటించడం లేదు. వినియోగదారులే ఆ విషయాల గురించి ఆరా తీసి కనుక్కోవాలి. బీమా పొందాలంటే గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదం జరిగిన వెంటనే ముందుగా సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. గ్యాస్ ఏజెన్సీకి నిర్ణీత సమయంలో లిఖిత పూర్వకంగా సమాచారం అందించాలి. ఆ తరువాత పంపిణీదారు(ఏజెన్సీ డీలరు) ఆ విషయాన్ని గ్యాస్ కంపెనీకి, భీమా సంస్థకు తెలియజేయాలి. 30 రోజుల్లోగా కంపెనీ విచారణ పూర్తి చేసి క్లెయిమ్ సొమ్మును వినియోగదారులకు అందజేస్తారు. ఒకవేళ దుర్ఘటనలో మరణం సంభవిస్తే పరిహారం కోసం వినియోగదారులు కోర్టుకు కూడా వెళ్ళవచ్చు. మృతుల వయసు, అప్పటి వరకు వారి ఆదాయాన్ని లెక్కగట్టి కోర్టు పరిహారాన్ని నిర్ణయిస్తుంది. వినియోగదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు బీమా పొందాలంటే వినియోగదారులు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్ పైపు, లైటర్, రె గ్యులేటర్, పొయ్యి తదితర వస్తువులు ఐఎస్ఐ మార్కు ఉన్నవే వాడాలి. గ్యాస్ ఏజెన్సీ సిబ్బందితో తరుచూ సిలిండర్, పొయ్యిని తనిఖీ చేయిస్తూ ఉండాలి. ఒకవేళ వినియోగదారు నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగినా, నిబంధనలకు విరుద్ధంగా గ్యాస్ వినియోగించినా పరిహారం వచ్చే అవకాశం ఉండదు. -
రోడ్డు ప్రమాదంలో మహిళా ఉద్యోగి మృతి
చింతలపూడి : ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకోవచ్చునని భావించిన ఒక మహిళా ఉద్యోగిని రోడ్డు ప్రమాదానికి గురై మృత్యు ఒడికి చేరిన ఘటన చింతలపూడిలో చోటు చేసుకుంది. కుక్కునూరి సునీత మండలంలోని తిమ్మిరెడ్డిపల్లి పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తోంది. శనివారం ఉదయం 6 గంటలకు తిమ్మిరెడ్డిపల్లి గ్రామం చేరుకుని పెన్షన్లు పంపిణీ చేసింది. 10 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై చింతలపూడి బయలుదేరింది. మార్గమధ్యంలో ఆంజనేయస్వామి గుడి సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆమెను 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చేర్చిన కొద్ది సేపటికి చికిత్స పొందుతూ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. సునీత రెండేళ్ల నుంచి కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నట్టు ఈవోపీఆర్డీ డి.రాజగోపాల్ చెప్పారు. ఆమె భర్త యానాంలో రిలయన్స్ కంపెనీలో పని చేస్తున్నారని, తల్లిదండ్రులు ద్వారకా తిరుమలలో ఉంటున్నట్టు తెలిపారు. వారికి సమాచారం అందించినట్టు చెప్పారు. కాగా ప్రమాదానికి కారణమైన లారీతో సహా డ్రైవర్ పరారయ్యాడు. ఎస్సై సైదానాయక్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మిన్నంటిన విషాదం రోడ్డు ప్రమాదంలో తోటి ఉద్యోగి మృతి చెందిన ఘటన ఉద్యోగవర్గాల్లో విషాదం నింపింది. ప్రమాద వార్త తెలిసిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ తమతో గడిపిన సహ ఉద్యోగి దుర్మరణాన్ని వారు జీర్ణించుకోలేక క౦ట తడి పెట్టారు. -
ఆశ్రయం ఇచ్చాడు.. అత్యాచారం చేశాడు
చింతలపూడి(పశ్చిమగోదావరి జిల్లా): బాలికపై ఓ కామాంధుడు నెల రోజులుగా అత్యాచారం చేస్తున్న దారుణ ఘటన బుధవారం వెలుగు చూసింది. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలోని డగ్లస్ మెమోరియల్ హోం (శరణాలయం)లో గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన 12 ఏళ్ల బాలిక నాలుగేళ్లుగా ఆశ్రయం పొందుతోంది. స్థానిక పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. డీఎంసీ హోం సంరక్షకుడు శ్యామన్సన్బాబు ఆమెపై కన్నేశాడు. నెల రోజులుగా ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. మాట వినకపోతే కొట్టడం, దుర్భాషలాడటం, అర్ధరాత్రి నిద్రలేపి ఆయన ఉంటున్న గదికి తీసుకెళ్లి అత్యాచారం చేస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. నెల రోజుల్లో అనేకసార్లు తనను గదికి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడని పేర్కొంది. ఈ నెల 24న కూడా బాలికపై అత్యాచారం చేయగా, బుధవారం ఆమె హోమ్ నుంచితప్పించుకుని చింతలపూడి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. చిన్న పిల్లలపై అత్యాచార నిరోధక చట్టం(ఫోక్స్ యాక్ట్) కింద కేసు నమోదు చేసినట్టు ఎస్సై సైదానాయక్ తెలిపారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ జె.వెంకట్రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బీమాతో మహిళలకు ధీమా
చింతలపూడి : రాష్ట్రంలో పలు బీమా పథకాలు పేద, మధ్య తరగతి కుటుంబాల్లోని మహిళలకు, వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇస్తున్నాయి. ముఖ్యంగా ఐకేపీ (ఇందిరా క్రాంతిపథం) ద్వారా అభయహస్తం, ఆమ్ ఆద్మీ బీమా యోజన, జనశ్రీ బీమా యోజన వంటి పథకాలను ప్రభుత్వాలే నిర్వహిస్తున్నాయి. ఈ పథకాల్లో చేరడానికి అర్హులు ఎవరంటే.. ఆమ్ ఆద్మీ బీమా యోజన ఈ పథకం పూర్తిగా ఎల్ఐసీ ద్వారా అమలు చేయబడుతోంది. ఐకేపీ ద్వారా రూ.15 చెల్లించి ఈ పథకంలో చేరవచ్చు. బీమా చేయించుకునే మహిళ వయసు 18 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉండాలి. భూమిలేని గ్రామీణ కుటుంబంలో పెద్ద లేదా సంపాదించే వ్యక్తి అయి ఉండాలి. బీమా చేయించుకున్న వ్యక్తి హఠాత్తుగా మరణిస్తే బీమా చేయబడిన మొత్తం రూ.30 వేలు నామినీకి ఇవ్వబడుతుంది. ఒకవేళ బీమా చేయించుకున్న వ్యక్తి ప్రమాదం కారణంగా మరణించినా లేదా ప్రమాదంలో పూర్తి అంగవైకల్యం కలిగినా రూ.75 వేలు, పాక్షికంగా వైకల్యం సంభవిస్తే రూ.37,500 పరిహారం చెల్లిస్తారు. ఈ పథకంలో సభ్యుల పిల్లలకు ఉపకార వేతనం రూపంలో అదనపు ప్రయోజనం కల్పించారు. ఇద్దరికి మించకుండా 9 నుండి 12 వ తరగతి చదువుతున్న పిల్లలకు నెలకు రూ.100 చొప్పున ఉపకార వేతనం లభిస్తుంది. ఈ మొత్తాన్ని 6 నెలలకు ఒకసారి జనవరి 1న , తిరిగి జూలై 1న చెల్లిస్తారు. అభయ హస్తం స్వయం శక్తి సంఘాల్లో ఉన్న మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకంలో చేరడానికి 18 నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్న మహిళలు అర్హులు. ఒక్కో సభ్యురాలు ఏడాదికి రూ.385 చెల్లించాలి. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మరో రూ.385 జమ చేస్తాయి. సభ్యులు 60 ఏళ్లు పూర్తయ్యాక పింఛన్ తీసుకోవడానికి అర్హులవుతారు. సభ్యులు 60 ఏళ్లలోపు మరణిస్తే రూ.30 వేలు, సభ్యురాలు జమ చేసిన సొమ్ము, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేసిన సొమ్మును కుటంబ సభ్యులకు అందచేస్తారు. ప్రమాదవశాత్తూ మృతి చెందితే కుటుంబ సభ్యులకు రూ.75 వేలు, అంగవైకల్యం ఏర్పడి మంచానికి పరిమితమైతే రూ.35 వేలు అందజేస్తారు. పథకంలో చేరిన వారి పిల్లలకు 9 వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఏడాదికి రూ.1,200 ఉపకార వేతనంగా అందజేస్తారు. జనశ్రీ బీమా యోజన ఆమ్ ఆద్మీ, అభయహస్తంలో చేరని వారికి ఈ పథకం వర్తిస్తుంది. సంవత్సరానికి రూ.165 చెల్లించి ఈ పథకంలో చేరవచ్చు. ఇందులో పింఛన్ సౌకర్యం ఉండదు. సహజ మరణం సంభవిస్తే కుటుంబ సభ్యులకు రూ.30 వేలు, ప్రమాదంలో మరణిస్తే రూ.75 వేలు, అంగవైకల్యం ఏర్పడితే రూ.35 వేలు అందిస్తారు. ఈ పథకంలో కూడా ఇద్దరు పిల్లలకు సంవత్సరానికి రూ.1,200 ఉపకార వేతనం అందిస్తారు. -
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సబ్‌రిజిస్ట్రార్
పశ్చిమగోదావరి జిల్లా: చింతలపూడి సబ్ రిజిస్ట్రార్ రేపల్లె వెంకట బాల గోపాలకృష్ణ లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. చింతలపూడి మండలం వెలగలపల్లి గ్రామానికి చెందిన శరత్ రెడ్డి అనే రైతు నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటూ సబ్‌రిజిస్ట్రార్ పట్టుబడ్డాడు. తనకున్న 70 సెంట్ల భూములను రిజిస్టర్ చేయించుకునేందుకు శరత్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లగా..సబ్‌రిజిస్ట్రార్ రిజిస్టర్ చేసేందుకు రూ.50 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సబ్‌రిజిస్ట్రార్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
24 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
చింతలపూడి: పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. గ్రామంలోని గుబ్బల ఆంజనేయులు అనే వ్యాపారి ఇంట్లో అక్రమంగా సేకరించి నిల్వ ఉంచిన 24 క్వింటాళ్ల బియ్యాన్ని బుధవారం ఉదయం పౌర సరఫరాల శాఖ అధికారులు సీజ్ చేశారు. బియ్యాన్ని స్థానిక రైస్ మిల్లో ఉంచి, కేసు నమోదు చేసి జాయింట్ కలెక్టర్‌కు నివేదించినట్లు తహశీల్దార్ మైఖేల్‌రాజు తెలిపారు. -
సినిమా చూసి వస్తూ తిరిగిరాని లోకాలకు..
చింతలపూడి : పండగపూట ఆ ఊరిలో విషాదం నెలకొంది. సంక్రాంతి సందర్భంగా మూడు రోజులూ కలిసి తిరిగిన స్నేహితులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లింగపాలెం మండలం శింగగూడెం గ్రామానికి చెందిన పి.శివాజి (16), గోపాలకృష్ణ, భూపతిరావు ముగ్గురు స్నేహితులు. గ్రామంలో పదో తరగతి చదువుతున్నారు. పండగ సందర్భంగా సరదాగా కలిసి మెలిసి తిరిగారు. శనివారం కనుము రోజు ద్విచక్ర వాహనంపై చింతలపూడి సినిమా చూడటానికి వచ్చారు. రెండో ఆట సినిమా చూసి అర్ధరాత్రి ఇంటికి బయలు దేరారు. వెలగలపల్లి సమీపంలో వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం చెట్టును ఢీ కొట్టడంతో శివాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన గోపాలకృష్ణను మెరుగైన చికిత్స కోసం విజయవాడ, భూపతిరావును ఏలూరు తరలించారు. ఎస్సై సైదా నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
'ప్రజలను మోసగించడంలో బాబు ఆరితేరారు'
ఏలూరు: ప్రజలను మోసగించడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరితేరారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి పక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆరోపించారు. సోమవారం చింతలపూడిలో వైఎస్సార్సీపీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ...గోదావరి పుష్కరాల పేరుతో రూ.1800 కోట్లు బూడిదలో పోసిన పన్నీరైనాయన్నారు. పుష్కరాల్లో 30 మంది చనిపోయిన ఘటనపై విచారణ ఏమైందని ఉమ్మారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ కార్యక్రమానికి పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే ఆర్కే రోజా, ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడుతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరైయ్యారు. -
పోలీసుల ఓవర్ యాక్షన్, వ్యక్తికి తీవ్రగాయాలు
గుంటూరు: పోలీసుల ఓవర్ యాక్షన్ కారణంగా ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. పొన్నూరు మండలం చింతలపుడిలో పోలీసులు ఆదివారం చెకింగ్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ ద్విచక్రవాహనదారున్ని అకస్మాత్తుగా ఏఎస్ఐ లాగడంతో.. గమనంలో ఉన్న వాహనదారుడు కిందపడిపోయాడు. తీవ్రగాయాలయిన అతన్ని గుంటూరు జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చెకింగ్ పేరుతో పోలీసులు చేసిన ఓవర్ యాక్షన్ పట్ల ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. -
టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
చింతలపూడి : చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో చాపకింద నీరులా ఉన్న వర్గ విభేదాలు శనివారం భగ్గుమన్నాయి. టీడీపీ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ బాబు అధ్యక్షతన స్థానిక మార్కెట్ యార్డు ఆవరణలో శనివారం పార్టీ సమావేశం నిర్వహించారు. మండల పరిషత్ అధ్యక్షులు దాసరి రామక్క ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పట్టణ కమిటీ సభ్యులను ప్రకటిస్తుండగా ఎంపీపీ మైక్ తీసుకుని తమను సంప్రదించకుండా కమిటీ ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించడంతో గొడవ మొదలైంది. పాతవారిని పక్కనపెట్టి కొత్తవారికి పదవులు ఎలా ఇస్తారని ఆమె ప్రశ్నించారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది. ఒక దశలో కమిటీ జాబితాను ఎంపీపీ లాక్కోగా, కార్యకర్తలు రెచ్చిపోయి ఎంపీపీని నెట్టివేశారు. ఆమె మొహంపై స్వల్ప గాయాలయ్యాయి. కన్నీటి పర్యంతమైన ఎంపీపీ అక్కడి నుంచే మంత్రి పీతల సుజాతకు ఫోన్ చేసి తనకు జరిగిన అవమానంపై ఫిర్యాదు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందాక నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు మంత్రి పీతల సుజాత, ఎంపీ మాగంటి బాబు వర్గాలుగా విడిపోయారు. పార్టీ కార్యకలాపాలను ఎవరికి వారు వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు ఈ ఘటనపై ఎంపీపీ రామక్క పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మాట్లాడు తూ ‘నేను చావాలా? బతకాలా.. ప్రతి పనిలో నాకు అడ్డుతగులుతున్నారు. తక్కువ కులం దాని వంటూ చిన్నచూపు చూస్తున్నారు. నానా బాధ లు పెడుతున్నారు. నేను పరువుగా బతుకుతున్నాను. ఇప్పుడు నాపై దౌర్జన్యం కూడా చేశారు. నన్ను వేదికనుంచి లాగి పక్కకు నెట్టేశారు. ఇంత అవమానం జరిగాక కార్యకర్తల ఎదుటే ఉరి వేసుకుని చచ్చిపోతాను’ అని వాపోయారు. -
నిమజ్జనానికి వెళ్లి ఇద్దరి మృతి
చింతలపూడి (పశ్చిమ గోదావరి) : వినాయకుడి నిమజ్జనానికి వెళ్లి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని ధర్మాజీగూడెంకు చెందిన షేక్ వలీ, మురళీలు వినాయకుడి నిమజ్జనానికి వెళ్లి ప్రమాదవశాత్తు తమ్మిలేరు ప్రాజెక్టులోపడి మృత్యువాతపడ్డారు. -
నిండా నిక్షేపాలు
గోదావరి బేసిన్లో అపార బొగ్గు నిల్వలు 3వేల మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు లభించే అవకాశం 30 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్నట్టు గుర్తింపు మొదలైన సర్వే పనులు చింతలపూడి :మన రాష్ట్రంలోనూ చెప్పుకోదగిన స్థాయిలో బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు తేలడం దేశ వ్యాప్తంగా చర్చకు తెరలేపింది. ఇదే సందర్భంలో ఇక్కడి భూమి పొరల్లో ఉన్న బొగ్గును వెలికి తీయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. చింతలపూడి, టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం, గోపాలపురం, కృష్ణా జిల్లా ముసునూరు, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రాంతాల్లో అపార బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించిన రాష్ట్ర గనుల అభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) వీటిని తవ్వితీసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికిలేఖ పంపించింది. ఈ నేపథ్యంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) నిపుణులు రంగంలోకి దిగారు. కృష్ణా జిల్లా చాట్రాయి మండల పరిధిలోని సోమవరం ప్రాంతంలో సర్వే చేపట్టారు. సింగరేణి గనుల నుంచి వెలికితీస్తున్న బొగ్గుకంటే నాణ్యమైన బొగ్గు నిల్వలు ఈ ప్రాంతంలో ఉన్నట్టు ఇప్పటికే జీఎస్ఐ నిపుణులు నిర్ధారించారు. ఈ ప్రాంతంలో సర్వే పనులు ఇంకా కొనసాగుతున్నాయి. మన జిల్లాలోని చింతలపూడి కేంద్రంగా బొగ్గు నిక్షేపాలపై త్వరలోనే సర్వే చేయనున్నారు. ఇది పూర్తయితే బొగ్గు వెలికితీత పనులను ప్రభుత్వం శరవేగంగా చేపట్టనుందని సమాచారం. కృష్ణా జిల్లా సోమవరం నుంచి చింతలపూడి వరకు 3 వేల మిలియన్ మెట్రిక్ టన్నుల నల్ల బంగారం ఉన్నట్టు ప్రాథమిక సర్వేలోనే గుర్తించారు. 2013లో లక్నోకు చెందిన బీర్బల్ సహాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలియో బోటనీ సంస్థ కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అధ్యయనం చేసి కృష్ణా జిల్లా సోమవరం నుంచి పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి, టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం, గోపాలపురం మండలాల మీదుగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వరకు నాణ్యమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు కనుగొంది. ఇతర రాష్ట్రాలలో లభ్యమయ్యే బొగ్గుతో పోల్చితే ఇక్కడ లభించే బొగ్గు అత్యంత నాణ్యమైనదని ఆ సంస్థ నిర్ధారించింది. భూమి ఉపరితలానికి 400 మీటర్ల నుంచి 1,400 మీటర్ల లోతున ఈ బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని నివేదించింది. ఎంతో ప్రయోజనం రాష్ట్ర విభజన తరువాత సింగరేణి బొగ్గును కోల్పోవడంతో రాష్ట్రంలో కొరత ఏర్పడింది. దీంతో మన ప్రభుత్వం ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గును సమీకరించే విషయంలో రానున్న నాలుగేళ్లలో సమస్య ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ లోగానే చింతలపూడి ప్రాంతం నుంచి బొగ్గు నిల్వలను వెలికితీయగలిగితే.. 60 ఏళ్ల పాటు ఏటా 8 వేల మెగావాట్ల విద్యుత్‌ను మన రాష్ట్రంలోనే ఉత్పత్తి చేసుకునే అవకాశం కలుగుతుందని అంచనా. మరోవైపు ఇక్కడి బొగ్గు తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే మన ప్రాంతంలోనే థర్మల్ విద్యుత్ ప్లాంట్లు నిర్మించే అవకాశం ఏర్పడుతుంది. తద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతోపాటు ఉపాధి అవకాశాలు పెరిగి నిరుద్యోగ సమస్య తీరుతుంది. రవాణా సౌకర్యాలు పెరుగుతాయి. బొగ్గు ఎగుమతుల ద్వారా రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. నిరంతర విద్యుత్ సరఫరాతో వ్యవసాయానికీ, పరిశ్రమలకు విద్యుత్ కొరత తీరుతుందని భావిస్తున్నారు. గత సర్వేల్లోనే వెలుగులోకి .. 1964 నుండి 2006 వరకు సుమారు 4 దఫాలుగా ఇక్కడి బొగ్గు నిక్షేపాలపై సర్వేలు చేశారు. ఈ నేపథ్యంలో చింతలపూడి ప్రాంతంలో అపార బొగ్గు నిల్వలు ఉన్నాయని, త్వరలో వెలికితీత పనులు చేపడతామని ఏపీ గనుల శాఖ సీఎండీ ఎండీ శాలినీమిశ్రా గత ఏడాది ఆగస్టులో ప్రకటించారు. ముఖ్యంగా పశ్చిమ, ఖమ్మం జిల్లాల సరిహద్దు ప్రాంతాలను ఆనుకుని 2,500 చదరపు కిలోమీటర్ల మేర బొగ్గు నిల్వలు విస్తరించి ఉన్నట్టు ప్రభుత్వానికి నివేదికలు అందాయి. మన జిల్లాకు సరిహద్దున గల ఖమ్మం జిల్లా రేజర్ల, నారాయణపురం నుంచి గురుభట్లగూడెం, రాఘవాపురం గ్రామాల్లో 400 అడుగుల లోతు నుంచి 1,400 అడుగుల లోతులో సుమారు వెయ్యి అడుగుల మందంతో నిక్షేపాలు ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా రాఘవాపురం, పట్టాయిగూడెం, వెంకటాపురం, నామవరం, సుబ్బారాయుడుగూడెం, సీతానగరం, చింతలపూడి గ్రామాల్లో అంతకంటే తక్కువ లోతులోనే నాణ్యమైన బొగ్గు నిల్వలు ఉన్నట్టునిర్థారించారు. -
మద్యం దుకాణాలను తరలించాలని ఆందోళన
చింతలపూడి (పశ్చిమగోదావరి) : విద్యా సంస్థలు, ప్రార్థనా స్థలాలకు సమీపంలో నిర్వహిస్తున్న మద్యం దుకాణాలను వెంటనే తరలించాలని డిమాండ్ చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలంలోని ఎర్రగుంటపల్లి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. సోమవారం చింతలపూడిలో ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయాన్ని సీపీఐ, వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజలు ముట్టడించారు. సిబ్బందిని వెలుపలికి పంపించి ఆందోళన కొనసాగిస్తున్నారు. -
కుటుంబ కలహాలతో యువకుడు ఆత్మహత్య
చింతలపూడి (పశ్చిమగోదావరి) : కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండల కేంద్రంలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన రాజశేఖర్(22) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా కుటుంబ సభ్యులతో గొడవ పెట్టుకొని బుధవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. అయితే గురువారం ఉదయం గ్రామ సమీపంలోని జామతోటలో చెట్టుకు వేలాడుతూ నిర్జీవంగా కనిపించాడు. ఇది గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. -
సన్న బియ్యం ధర మరీ లావు !
చింతలపూడి : మార్కెట్లో బియ్యం ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సాధారణంగా ఉత్పత్తి, డిమాండ్ల మధ్య ఉన్న వ్యత్యాసం ఆధారంగా ధరలు నిర్ణయిస్తారు. కాని ఎలాంటి లాజిక్కూ లేకుండా మార్కెట్లో బియ్యం ధరలు పెరిగిపోతున్నాయి. ఓవైపు పండించిన ధాన్యానికి మద్దతు ధర లేదని రైతులు గగ్గోలు పెడుతుంటే, మరోపక్క బియ్యం ధరలు మాత్రం పైపైకి ఎగబాకుతున్నాయి. సోనా మసూరి బియ్యం ధర 25 కిలోల బస్తా నాణ్యతను బట్టి రూ.1,000 నుంచి రూ.1,250కు అమ్ముతున్నారు. పీఎల్ రకం అయితే కిలో రూ.30 నుంచి రూ.35 వరకు పలుకుతోంది. కొద్ది సంవత్సరాలుగా ఒకపక్క ప్రకృతి వైపరీత్యాలు వ రి దిగుబడిని దెబ్బతీయడం, కృష్ణా డెల్టాలో సన్న బియ్యం పండించే రైతులు తగ్గిపోవడంతో ధరలు పెరిగాయి. అయితే బియ్యం వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించడంతో వీటి పెరుగుదలకు అడ్డూ అదుపూ ఉండడం లేదు. జిల్లాలో ఆకివీడు, పాలకొల్లు, భీమవరం ప్రాంతాల్లో బియ్యం ఎగుమతి చేసే మిల్లులు 300కు పైగా ఉన్నాయి. అయితే జిల్లాలోని ట్రేడింగ్ మిల్లుల పరిస్థితి కూడా దయనీయంగా ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో మిల్లర్ల నుంచి 75 శాతం ఎఫ్‌సీఐ కొనుగోలు చేసేదని, మిగిలిన 25 శాతం ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేవాళ్లమని స్థానిక వ్యాపారి తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం ఐకేపీ ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడంతో మార్కెట్లో ధాన్యం కొనే పరిస్థితి లేదు. దీంతో మెట్ట ప్రాంతంలో మిల్లులు మూతపడే పరిస్థితి వచ్చిందని మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండపేట నుంచి దిగుమతి తూర్పుగోదావరి జిల్లా మండపేట నుంచి సన్న బియ్యం రకరకాల బ్రాండ్ల లో జిల్లాలోని స్థానిక బియ్యం వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. అక్కడి హోల్ సేల్ వ్యాపారులతో ఒప్పందం చేసుకుని బియ్యం ధరలు విపరీతంగా పెంచి మార్కెట్‌ను శాసిస్తున్నారు. మార్కెట్లో ఈరోజు ఉన్న ధర రేపు ఉండడం లేదు. కర్నూలు రకం సన్న బియ్యం, జీలకర్ర సోనా రకం అంటూ వినియోగదారులను మభ్యపెట్టి అమ్ముతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రేషన్ బియ్యం రీ సైక్లింగ్ చేసి సోనా బియ్యంలో కలిపి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలొస్తున్నాయి. ఈ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులే అంటున్నారు. వర్షాభావం వల్ల ఈ ఏడాది గుంటూరు, కృష్ణా డెల్టాలో రైతులు అనుకున్నంత విస్తీర్ణంలో పంట వేయలేదు. అదీ కాక మెట్ట ప్రాంతంలో రైతులు వరికి ప్రత్యామ్నాయంగా వా ణిజ్య పంటలను సాగు చేస్తుండటంతో ఈ ప్రాంత ప్రజలు బియ్యం కోసం ఇతర జిల్లాలపై ఆధారపడుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం చర్యలు చేపట్టి ధరలను అదుపులోకి తేవాలని మధ్యతరగతి, సామాన్య ప్రజలు కోరుతున్నారు. -
మలుపు తిరిగిన ఫాదర్ ఆంథోని మృతి కేసు
చింతలపూడి :చింతలపూడికి చెందిన ఫాదర్ ఆంథోని అనుమానాస్పద మృతి కేసు బుధవారం కొత్త మలుపు తిరిగింది. మంగళవారం అనారోగ్యానికి గురైన ఆయనను హుటాహుటిన ఏలూరులోని ఆశ్రం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. కాగా, ఆంథోని మృతిపై చింతలపూడిలోని ఆంథోని నగర్ ప్రజలు, తోటి ఫాదర్లు, కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆంథోని నిర్వహిస్తున్న ప్రార్థనా మందిరంలో సూసైడ్ నోట్‌ను పోలీసులు కనుగొన్నారు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఫాదర్ ఆంథోని అందులో పేర్కొన్నారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై డి.రాంబాబు చెప్పారు. అంథోని మృతదేహాన్ని ఆశ్రం ఆసుపత్రి నుండి ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రత్యేక వైద్యుల బృందం సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించినట్టు చెప్పారు. కన్నీటి పర్యంతం ఆంథోని మృతితో ఆంథోని నగర్ మూగబోయింది. గ్రామంలోని ప్రజలు, ఆయన అభిమానులు ఆంథోని ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. 30 ఏళ్లుగా ఆంథోని పేద ప్రజలకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. తన పేరిట ఆంథోని నగర్ గ్రామాన్ని ఏర్పాటు చేసి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతోపాటు ఇళ్లు కూడా కట్టించారు. గ్రామంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తానున్నానంటూ ఆదుకునేవారని గ్రామస్తులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. బుధవారం రాత్రి 8 గంటలకు ఆంథోని మృతదేహాన్ని అంబులెన్స్‌లో చింతలపూడి ఆంథోని చర్చికి తీసుకువచ్చారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్దఎత్తున ఆంథోని నగర్ చేరుకున్నారు. ప్రజల సందర్శనార్థం ఆంథోని పార్ధివ దేహాన్ని చర్చి ఆవరణలో ఉంచారు. ముందుజాగ్రత్త చర్యగా జంగారెడ్డిగూడెం డీఎస్పీ వెంకట్రావు ఆధ్వర్యంలో సీఐ జి.దాసు ఆంథోని నగర్ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రజల సందర్శన అనంతరం చర్చి ఆవరణలోనే ఆంథోని అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు. మృతదేహంతో ఆందోళన పోస్టుమార్టం అనంతరం ఆంథోని మృతదేహంతో ఆయన అభిమానులు ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్లో కొద్దిసేపు ధర్నా నిర్వహిం చారు. అనంతరం ర్యాలీగా శాంతినగర్‌లోని బిషప్ హౌస్‌కు చేరుకుని అక్కడి సామగ్రిని ధ్వంసం చేశారు. లోనికి వెళ్లేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బిషప్ పొలిమేర జయరావు ఆందోళనకారులను ఉద్దేశించి మాట్లాడారు. ఆంథోని ఆత్మహత్యపై విచారం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపించి తగిన న్యాయం జరిగేలా తనవంతు కృషి చేస్తానన్నారు. అక్కడ ఎలాంటి అల్లర్లు జరగకుండా సీఐలు యు.బంగార్రాజు, రాజశేఖర్, ఎస్సైలు ఎం.సాగర్‌బాబు, ప్రసాద్‌కుమార్ బందోబస్తు నిర్వహించారు. ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత ఏలూరు అర్బన్ : ఫాదర్ ఆంథోని ఆత్మహత్యకు కారకులైన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏలూరు ప్రభుత్వాసుపత్రి ఆవరణలో మృతుని బంధువులు, అభిమానులు ఆందోళనకు దిగారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అంథోని ఆత్మహ త్య చేసుకునే విధంగా వేధింపులకు గురిచేసిన వారిపై హత్యకేసు నమోదు చేయాలని, ఆయన మృతిపై న్యాయ విచారణ జరిపించాలని నినాదాలు చేశారు. చింతలపూడి ఎస్సై డి.రాంబాబు వారితో మాట్లాడారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని, మృతదేమాన్ని పోస్టుమార్టం జరిపించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
సహకార సంఘం అధ్యక్షుడి ఆత్మహత్య
పొన్నూరు (గుంటూరు జిల్లా ): గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని చింతలపూడి సహకార పరపతి సంఘం అధ్యక్షుడు గాంధీ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆదివారం జిల్లాలోని మాచవరం రైల్వేట్రాక్‌పై జరిగింది. వివరాల ప్రకారం... ములుకుదురు గ్రామానికి చెందిన గాంధీ చింతలపూడి సహకార పరపతి సంఘం అధ్యక్షుడిగా పని చేస్తున్నాడు. అయితే ఇటీవల సొసైటీలోని నిధుల విషయంలో అవకతవకలు జరిగినట్లు అతనిపై ఆరోపణలు రావడంతో పోలీసులు విచారించారు. దీంతో మనస్తాపం చెందిన గాంధీ ఆదివారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మనస్తాపంతో అటెండర్ ఆత్మహత్య
చింతలపూడి : ప్రధానోపాధ్యాయుడు మందలించాడని అటెండర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చింతలపూడికి చెందిన కాళ్ల రమణారావు(45) అనే వ్యక్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఔట్సోర్సింగ్ పద్ధతిన అటెండర్‌గా పనిచేస్తున్నాడు. తమ నుంచి వసూలు చేసిన ఫీజులను సొంత పనులకు వాడుకున్నాడంటూ విద్యార్థులు కొన్ని రోజుల కిందట ఫిర్యాదు చేయడంతో ప్రధానోపాధ్యాయుడు రమణారావును మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన రమణారావు సోమవారం ఇంటినుంచి వెళ్లిపోయాడు. కాగా ఈరోజు ఉదయం ఆంజనేయస్వామి ఆలయం సమీపంలోని పొలాల్లో విష గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి జేబులో ఉన్న సూసైడ్ నోట్లో తన చావుకు అధ్యాపకుల తీరే కారణమని పేర్కొన్నాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చెరువులో గుర్తు తెలియని మృతదేహం
చింతలపూడి :పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలంలోని ఎర్రగుంటపల్లి గ్రామం ఎర్రచెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఆదివారం లభ్యమయ్యింది. గ్రామస్తుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మంగళసూత్రంతో పరారీ
చింతలపూడి : పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలంలో దొంగలు రెచ్చిపోయారు. స్తానిక మారుతీ నగర్ సమీపంలోని ఒక ఇంట్లో శనివారం తెల్లవారుజామున ఇద్దరు దొంగలు చొరబడ్డారు. ఇంట్లో ఉన్న సత్యవతి అనే మహిళ మెడలో మంగళసూత్రం లాక్కో బోతుండగా ఆమె భర్త పుల్లారావు అడ్డుకోబోయాడు. ఇంతలో మరో దొంగ పుల్లారావు తలపై బలంగా కొట్టడంతో కుప్ప కూలిపోయాడు. దీంతో సత్యవతి కేకలు వేయగా దొంగలు చేతికందిన మంగళసూత్రంతో పరారయ్యారు. పుల్లారావును ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు చింతలపూడి సిఐ జి దాసు, ఎస్ఐ వీఎస్ వీరభద్రరావులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇంటిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు -
చింతలపూడిలో బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్
పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లా చింతలపుడి మండలం సీతానగరంలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.5,200ల నగదు, మూడు బైక్ లు, ఒక ఎల్ఇడి టీవీ, 5 సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. (చింతలపుడి) -
స్వైన్ ఫ్లూనకం
సజిల్లాలో స్వైన్ ఫ్లూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే అధికారికంగా 7 అనుమానిత కేసులు నమోదు కాగా, బాధితులకు ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలోని స్వైన్ ఫ్లూ వార్డులో చికిత్స అందిస్తున్నారు. వారిలో ఆరుగురి నుంచి శాంపిల్స్ (వైరస్ కల్చర్ స్వాప్స్) సేకరించి పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించారు. ఇప్పటివరకూ నమోదైన స్వైన్ ఫ్లూ అనుమానిత కేసులలో విద్యార్థులే అధికంగా ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినవారు కాకుండా ఈ లక్షణాలు కలిగిన మరో ఇద్దరు హేలాపురి వాసులు కూడా ఉన్నారు. ఏలూరు బెనర్జీపేటకు చెందిన వి.ప్రసాద్‌బాబు, తూర్పువీధికి చెందిన ఆర్.జగదీశ్వరరావు హైదరాబాద్ పంపించే నిమిత్తం శాంపిల్స్ ఇచ్చి మందులు వాడుతున్నారు. చింతలపూడిలో విద్యార్థికి.. చింతలపూడి మండలం భట్టువారిగూడెంకు చెందిన బసవ మణిదుర్గారావు (14) స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 6వ తరగతి చదువుతున్న ఇతడు ఫిబ్రవరి 1న హైదరాబాద్‌నుంచి ఇంటికి తిరిగొచ్చాడు. విపరీతమైన జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతుండటంతో మంగళవారం ఉదయం అతడిని చింతలపూడి ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు బాలుడి పరిస్థితిని చూసి స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపిస్తున్నాయని పేర్కొంటూ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏవీఆర్ మోహన్ అతడిని స్వైన్ ఫ్లూ వార్డుకు తరలించి తక్షణ చికిత్స ప్రారంభించారు. బాలుడి గొంతు నుంచి వైరస్ శాంపిల్స్‌ను సేకరించి పరీక్షల నిమిత్తం హైదరాబాద్ పంపించారు. పాలకొల్లులో మహిళకు.. పాలకొల్లు మండలం యాళ్లవానిగరువు గ్రామానికి చెందిన బీడెల్లి లిల్లీ (28) అనే మహిళ స్వైన్ ఫ్లూ లక్షణాలతో బాధపడుతుండటంతో మంగళవారం ఏలూరు తరలించారు. పది రోజులుగా ఆమె జలుబు, జ్వరం,డయేరియా, వాంతులతో బాదపడుతూ పాలకొల్లులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొం దింది. రోజులు గడుస్తున్నా పరిస్థితిలో మార్పురాకపోవడంతో అక్కడి వైద్యులు ఆమెకు స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో పాలకొల్లు ఏరియా ఆసుపత్రికి పంపించగా, అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు అదే అనుమానంతో ఆమెను ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కామవరపుకోట, ద్వారకాతిరుమల మండలాల్లో.. ద్వారకాతిరుమల మండలం వేంపాడు గ్రామానికి చెందిన నిట్టా రవిరాజ్‌కుమార్ (26), కామవరపుకోటకు చెందిన వైట్ల ఆదినారాయణ (26) మంగళవారం స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఏలూరు ఆసుపత్రిలో చేరారు. వీరిద్దరూ కొన్ని రోజులుగా జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. వీరిని పరీక్షించిన ఏలూరు ప్రభుత్వాసుపత్రి వైద్యులు శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ పంపారు. బాధితులను స్వైన్‌ఫ్లూ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రి సేవల సమన్వయ అధికారి డాక్టర్ కె.శంకరరావు వారిని పరీక్షించారు. రోగులెవరూ భయపడాల్సిందేమీ లేదని, చికిత్స చేస్తున్నామని, అందరూ త్వరలోనే కోలుకుంటారని అయన భరోసా ఇచ్చారు. కోలుకుంటున్న విద్యార్థి సోమవారం స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఏలూరు ఆసుపత్రిలో చేరిన గోపాలపురం విద్యార్థి కోలుకుంటున్నాడని ఆసుపత్రి సూపరింటెండెండ్ డాక్టర్ ఏవీఆర్ మోహన్ చెప్పారు. వ్యాధి నిర్థారణ కోసం ఆ విద్యార్థి గొంతు నుంచి వైరస్ కల్చర్ స్వాప్ సేకరించి హైదరాబాద్ పంపించామని చెప్పారు. బాలుడికి టామీ ఫ్లూ మాత్రలు, యాంటీ బయోటిక్స్ మందులు వాడుతున్నామని చెప్పారు. అతడు త్వరలోనే కోలుకుంటాడని అన్నారు. చికిత్స కంటే నివారణ సులభం : మోహన్ స్వైన్ ఫ్లూ వ్యాధి వచ్చిన తరువాత చికిత్స తీసుకోవడం కంటే ముందుగా నివారించడమే సులభమని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏవీఆర్ మోహన్ పేర్కొన్నారు. వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. స్వైన్ ఫ్లూ వ్యాధి దగ్గు, తుమ్ములు, జలుబు, స్వేదం వంటి వాటిద్వారా వ్యాప్తి చెందుతుందన్నారు. అందువల్ల ప్రజలు, విద్యార్థులు గుంపులుగా తిరగకూడదన్నారు. మొహా నికి మాస్క్‌లు ధరించడం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం ద్వారా ఈ వ్యాధిని నిరోధించవచ్చన్నారు. వ్యాధి లక్షణాలు ఉన్నవారు సాధ్యమైనంత వరకూ త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. వ్యాధి సోకిన వారికి చికిత్స అందించేందుకు టామీ ఫ్లూ మాత్రలు, సిరప్ వంటివి పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయన్నారు. ఆసుపత్రిలో 7 పడకలతో ప్రత్యేక వార్డు సిద్ధం చేశామని, పేషెంట్లు పెరిగినా వార్డుల విస్తరణకు కావాల్సిన గదులు సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు. వ్యాధి మూడు కేటగిరీలలో ఉంటుందన్నారు. అందులో ఏ, బీ స్థారుులు ప్రమాదకరం కాదన్నారు. సీ కేటగిరీలో మాత్రం ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. అలాంటి వారు ఆసుపత్రికి వచ్చినా కృత్రిమ శ్వాస ఇచ్చి చికిత్స నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉన్నాయని ఆయన వివరించారు. -
రూ. 25 కోట్లతో సరుకుల పంపిణీ
చింతలపూడి : ఇంటింటా సంక్రాంతి పండగ జరుపుకోవడానికి ప్రభుత్వం చంద్రన్న సంక్రాంతి కానుక కిట్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్టు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత తెలిపారు. చింతలపూడి తాలూకాఆఫీస్ కార్యాలయం ఆవరణలో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఏలూరు ఆర్డీవో తేజ్‌భరత్ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి సుజాత, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, కలెక్టర్ కె.భాస్కర్ పాల్గొన్నారు. మంత్రి సుజాత మాట్లాడుతూ జిల్లాలో రూ. 25 కోట్లతో తెల్లరేషన్ కార్డుదారులకు ఆరు రకాల సరుకులను ఉచితంగా అందిస్తున్నట్టు చెప్పారు. జిల్లాలో 39 లక్షల మంది జనాభా ఉంటే 33 లక్షల మందికి నిత్యావసర సరుకులను అందిస్తున్నట్టు తెలిపారు. పండగలోపు కిట్లను లబ్ధిదారులకు అందజేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కె.భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను పటిష్టంగా అమలు చేయడానికి అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. చంద్రన్న సంక్రాంతి కిట్లు ఎవరికైనా అందకపోతే ఆయా మండలాల తహసిల్దార్ల దృష్టికి తీసుకురావాలని కార్డుదారులకు విజ్ఞప్తి చేశారు. జెడ్పీ చైర్మన్ బాపిరాజు మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం టీడీపీ కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ తాళ్లూరి రాధారాణి, ఎంపీపీ దాసరి రామక్క, సర్పంచ్ మారిశెట్టి జగదీశ్వరరావు పాల్గొన్నారు. -
మోదీతోనే దేశాభివృద్ధి
చింతలపూడి : దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టే సత్తా ప్రధాని నరేంద్రమోదీకే ఉందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. చింతలపూడి పాత బస్టాండ్ సెంటర్లో బీజేపీ నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం నియోజకవర్గ కన్వీనర్ తుల్లిమెల్లి కుటుంబరావు అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పల్లె ప్రాంతాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి సాధిస్తుందని నమ్మి జన్‌ధన్, స్వచ్ఛభారత్ వంటి వినూత్న కార్యక్రమాలను మోదీ ప్రవేశపెట్టారన్నారు. అధికారం చేపట్టగానే ప్రజలకు అవసరం లేని 70 చట్టాలను రద్దు చేశారన్నారు. పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని జిరాక్స్ కాపీలపై గెజిటెడ్ అధికారి సంతకాలను తీసుకునే విధానంతో పాటు, నోటరీ చేయించే పద్ధతిని మోదీ రద్దు చేశారని, ఇకపై సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే చాలన్నారు. కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడానికి బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే కారణమని అన్నారు. సమావే శంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, నియోజకవర్గ కన్వీనర్ కుటుంబరావు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బీవీ నాగచంద్రారెడ్డి తదితరులు ప్రసంగించారు. అనంతరం పలువురు మంత్రి మాణిక్యాలరావు ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. సభలో పట్టణ బీజేపీ కన్వీనర్ కొనకళ్ల రాము, బీజేపీ రాష్ట్ర నాయకులు పీవీఎస్ వర్మ, రామ్మోహన్రావు, కె.లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.త్వరలో ఆలయ కమిటీల భర్తీరాష్ట్రంలోని ఆలయ కమిటీలను త్వరలో భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు. ప్రగడవరంలోని శ్రీశ్రీశ్రీ విజయ శంకర బాల కనక దుర్గాదేవి శివ పంచాయతన క్షేత్రాన్ని సందర్శించారు. ద్వారకాతిరుమలలో సాంకేతిక విద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి మాణిక్యాలరావు చెప్పారు. -
ఎనిమిది రోజులైనా లభించని శ్రీనివాస్ ఆచూకీ
గుంటూరు: నైజీరియాలో కిడ్నాప్ కు గురైన శ్రీనివాస రావు (26) ఆచూకీ ఇంకా లభించలేదు. చింతలపూడి గ్రామానికి చెందిన శ్రీనివాస్ గతవారం నైజీరియాలో కిడ్నాప్ కు గురయ్యాడు. గత ఎనిమిది రోజుల నుంచి ఆ యువకుడి కోసం అన్వేషిస్తున్నా.. అతని ఆచూకీ లభించలేదు. దీంతో శ్రీనివాస్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తన కుమారుని ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. టంగుటూరి శేషయ్య, నాగమణి దంపతుల కుమారుడు శ్రీనివాసరావు ఎంబీఏ పూర్తి చేసి రెండున్నరేళ్లుగా నైజీరియాలోని మెరిట్ నైజీరియా లిమిటెడ్‌కు చెందిన లెగసీ అనే నిర్మాణ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. గుంటూరు పట్టణానికి చెందిన ఓ యువతితో అక్టోబర్ 7వ తేదీన అతనికి నిశ్చితార్థం జరిగింది. ఈ క్రమంలోనే అతను గుంటూరుకు వచ్చాడు. అనంతరం ఆ కార్యక్రమాన్ని ముగించుకుని శ్రీనివాస్ అక్టోబర్ 30 వ తేదీన నైజీరియా వెళ్లాడు. అతనితో పాటు ఉంటున్న ముగ్గురు పాకిస్థానీయులు కూడా కిడ్నాప్ కు గురయ్యారు. అయితే ఈ విషయాన్ని కొన్ని రోజుల పాటు గోప్యంగా ఉంచడం మాత్రం కలవరపెడుతోంది. -
లభించని శ్రీనివాసరావు ఆచూకీ
-
లభించని శ్రీనివాసరావు ఆచూకీ
దుగ్గిరాల: నైజీరియా దేశంలో కిడ్నాప్ కు గురైన టంగుటూరి శ్రీనివాసరావు(26) ఆచూకీ ఇంకా తెలియరాలేదు. అతడి ఆచూకీ తెయకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అతడి విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం నైజీరియాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించింది. కాగా, స్థానిక ప్రజాప్రతినిధులు శ్రీనివాసరావు తల్లిదండ్రులను కలిసి ధైర్యం చెప్పారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలోని చింతలపూడి గ్రామానికి చెందిన శ్రీనివాసరావు ఉద్యోగనిమిత్తం రెండున్నరేళ్లుగా నైజీరియాలో ఉంటున్నాడు. గుర్తుతెలియని దుండగులు శ్రీనివాసరావును కిడ్నాప్ చేశారని అతడి స్నేహితులు మంగళవారం ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.