చింతలపూడి (పశ్చిమగోదావరి జిల్లా) : చింతలపూడి పోలీసు స్టేషన్‌లో పోలీసుల నిర్బంధంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బొడ్డు వెంకటేశ్వరరావు అస్వస్థతకు గురయ్యారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ అరెస్ట్‌కు నిరసనగా జరుగుతున్న బంద్‌ను నిర్వీర్యం చేసే క్రమంలో పోలీసులు బొడ్డు వెంకటేశ్వరరావుతోపాటు మరో ఇద్దరు కాపు సంఘం నాయకులను శనివారం ఉదయం ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
ఉదయం నుంచి స్టేషన్‌లోనే ఆహారం లేకుండా ఉండిపోవడంతో సాయంత్రం సమయంలో బొడ్డు వెంకటేశ్వరరావు సొమ్మసిల్లి పడిపోయారు. ఆయన్ను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి మెరుగు కాకుంటే ఏలూరు లేదా విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించనున్నట్టు సమాచారం.
పీఎస్ లో సొమ్మసిల్లిన వైఎస్సార్‌సీపీ నేత
Published Sat, Jun 11 2016 5:03 PM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM
Advertisement
Advertisement