faint
-
మండుతున్న ఎండలు.. తట్టుకోలేక సొమ్మసిల్లిన విద్యార్థులు
పాట్నా: ఉత్తర భారత్‌లో ఎండలు మండిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నడూ లేనంతంగా ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలను దాటేసింది. తీవ్ర ఎండ, వాడగాలులతో జనం అల్లాడుతున్నారు. అయితే మండే ఎండల్లోనూ కొన్ని చోట్ల స్కూళ్లు తెరుచుకున్నాయి. తాజాగా బిహార్‌లో పాఠశాలలకు వచ్చిన విద్యార్థులు ఎండ వేడిని తట్టుకోలేక సొమ్మసిల్లిపోయారు.బిహార్‌లో వేసవిసెలవులు ముగియడంతో బుధవారం నుంచి పాఠశాలలు తెరుచుకున్నాయి. ప్రస్తుతం బిహార్‌లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలు ఉంది. ఇంత ఎండలోనూ విద్యార్ధులు స్కూళ్లకు వచ్చారు. అయితే ఎండ వేడిని తట్టుకోలేక.. పలు ప్రాంతాల్లోని స్కూళ్లలో విద్యార్థులు సొమ్మసిల్లిపోయారు. షేక్‌పురా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 16 మంది బాలికలు స్పృహతప్పి పడిపోయారు. టీచర్లు వారికి సపర్యలు చేశారు. సమయానికి ఆంబులెన్స్‌లు రాకపోవడంతో.. ఆటోలు, బైక్‌లపై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పిల్లలందరూ డీ హైడ్రేట్ అయ్యారని.. ప్రస్తుతానికి క్షేమంగానే ఉన్నారని వైద్యులు పేర్కొన్నారు.ఇదొక పాఠశాలలోనే కాదు బెగుసరాయ్, జాముయి జిల్లాల్లో పదుల సంఖ్యలో విద్యార్ధులు స్పృహతప్పి పడిపోయారు. వారిని అసుపత్రికి తరలించారు.కాగా, ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ బీహార్‌లో స్కూళ్లను తెరువడంపై విమర్శలు వెల్లువెత్తాయి. గ్రామస్తులు స్కూళ్లకు వెళ్లి టీచర్లతో ఘర్షణపడ్డారు. అలాగే రహదారిని దిగ్బంధించి నిరసన వ్యక్తం చేశారు. సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ స్కూళ్లను తెరువడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి.మరోవైపు బీహార్‌లో ప్రభుత్వం, ప్రజాస్వామ్యం లేదని, బ్యూరోక్రసీ మాత్రమే ఉందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ విమర్శించారు. ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు పైగా ఉన్నాయని, అత్యవసర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
కళ్లు తిరిగి పడిపోయారా... అయితే ఇది చదవాల్సిందే!
మీరు ఎప్పుడైనా కళ్లు తిరిగి పడిపోయారా? మనలో కనీసం 40 శాతం మంది జీవితంలో ఏదో ఒక దశలో ఇలా కళ్లు తిరిగి పడిపోతారని సైన్స్ చెబుతోంది. ఒకట్రెండు నిమిషాలు మాత్రమే మనం ఇలా కళ్లు తిరిగి పడిపోయినప్పటికీ ఆ తరువాత మాత్రం బోలెడంత గందరగోళం మనల్ని అలముకుంటుంది. ఏం జరిగిందో తెలియదు. ఎందుకు పడిపోయామో అర్థం కాదు. మనకే కాదు.. శరీరం లోపల ఏం జరిగితే పడిపోయామో ఇప్పటివరకూ శాస్త్రవేత్తలకూ తెలియకపోవడం గమన్హాం. అదృష్టవశాత్తూ అమెరికాలోని శాండియాగోలో ఉన్న కాలిఫోర్నియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఇప్పుడు ఈ గుట్టును ఛేదించారు. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలున్నప్పుడు ఇలా కళ్లు తిరిగి పడిపోవడం తరచుగా... ఎక్కువసార్లు జరుగుతూంటుంది కాబట్టి శాస్త్రవేత్తల ప్రయోగాలు ఈ సమస్యను అధిగమించేందుకు పనికొస్తాయని అంచనా. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ముందు ఒక్క విషయం. కళ్లు తిరిగి పడిపోవడాన్ని వైద్య పరిభాషలో సింకోప్ అని పిలుస్తారు. కాలిఫోర్నియా వర్శిటీ శాస్త్రవేత్తల ప్రయోగాల పుణ్యమా అని సింకోప్ తాలూకూ సంకేతాలు గుండె మెదళ్ల మధ్య ప్రయాణించేందుకు కారణమైన జన్యువుల గురించి కూడా స్పష్టంగా తెలిసింది. మామూలుగా అయితే సింకోప్‌కు మెదడు గుండెకు పంపే సంకేతం కారణమని అనుకునేవాళ్లు. మెదడు ఆదేశాల మేరకు గుండె పనిచేసి కళ్లు తిరిగి పడిపోయేలా చేస్తుందనన్నది ఇప్పటివరకూ ఉన్న అంచనా. అయితే వినీత్ ఆగస్టీన్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం పరిశోధించగా.. ఇందులో సగం మాత్రమే నిజమని తెలిసింది. సింకోప్‌కు ముందు గుండె కూడా మెదడుకు సంకేతం పంపుతోందని, ఇది మెదడు పనితీరును మార్చేస్తోందని స్పష్టమైంది. సింకోప్ సమయంలో గుండె కొట్టుకునే వేగం చాలా తక్కువగా ఉంటుందని, రక్తపోటు, ఊపిరి వేగం కూడా తక్కువగా ఉంటాయని 1867లో బెజోల్డ్ జారిష్ రిఫ్లెక్స్ (బీజేఆర్) అనే సిద్ధాంతం చెప్పింది కానీ ఇప్పటివరకూ ఇది రుజువు కాలేదు. కాలిఫోర్నియా వర్శిటీ శాస్త్రవేత్తలు మెదడు నుంచి శరీరానికి సంకేతాలు పంపే అత్యంత కీలకమైన వాగస్ నాడిని పరిశీలించారు. ఈ వాగల్ సెన్సిరీ న్యూరాన్లు మెదడు స్టెమ్ (కాండ భాగం)కు సంకేతాలు పంపుతుందని, బీజేఆర్ లక్షణాలకు, సింకోప్‌కు దీనికి సంబంధం ఉందని అంచనా. ఈ వాగల్ సెన్సిరీ న్యూరాన్లు విడుదల చేసే రెండు రకాల పెప్టైడ్లను అందించినప్పుడు ఎలుకలు ఠక్కున మూర్ఛపోయాయి. తరువాతి పరిశీలనల్లో ఎన్‌పీవై2ఆర్ అనే పెప్టైడ్ సింకోప్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు స్పష్టమైంది. ఈ ఫలితాల సాయంతో సింకోప్‌ను అరికట్టేందుకు కొత్త మందులు తయారు చేయవచ్చునని, పలు మానసిక, నాడీ సంబంధిత సమస్యలకు పరిష్కారాలు కనుక్కోవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త తెలిపారు. పరిశోధన వివరాలు ‘నేచర్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
పరేడ్‌లో కుప్పకూలిన బ్రిటిష్ సైనికులు..వీడియో వైరల్
బ్రిటన్‌లో వార్షిక ట్రూపింగ్ ది కలర్ సందర్భంగా ప్రిన్స్ విలయమ్స్ ఎదుట సైనికులు పరేడ్ రిహార్స్ల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ముగ్గురు సైనికులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆ సమయంలో లండన్‌లో ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు చేరుకోవడంతో.. సైనికులు ఆ వేడికి తాళ్లలేక స్ప్రుహ తప్పి పడిపోయారు. చక్రవర్తి అధికారిక పుట్టిన రోజు సందర్భంగా ప్రతి జూన్‌లో లండన్‌లో ట్రూపింగ్ ది కలర్ అనే కార్యక్రమం నిర్వహిస్తారు. అందుకోసం వార్షిక కవాతు నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగానే విలియమ్స్ ఎదుట రిహార్సల్స్ చేస్తున్నారు సైనికులు. అదే సమయంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో..ఆ వేడికి తాళ్లలేక ముగ్గురు సైనికులు కుప్పకూలినట్లు బ్రిటన్ మీడియా పేర్కొంది. ఈ మేరకు ప్రిన్స్ విలియం సైనికులను కృతజ్ఞతలు తెలుపుతు ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్లో విలియమ్స్..ఈ ఉదయం కల్నల్ రివ్యూలో పాల్గొన్న ప్రతి సైనికుడుకి చాలా కృతజ్ఞతలు. Conducting the Colonel's Review of the King's Birthday Parade today. The hard work and preparation that goes into an event like this is a credit to all involved, especially in today’s conditions. pic.twitter.com/IRuFjqyoeD — The Prince and Princess of Wales (@KensingtonRoyal) June 10, 2023 క్లిష్ట పరిస్థితుల్లో మీరు నిబద్ధతతో మీ విధులను నిర్వర్తిస్తున్నారు. ప్రతి ఏటా నిర్వహించే కార్యక్రమం విజయవంతం కావడం కోసం తమ వంతుగా కృషి చేస్తున్నందుకు ధన్యావాదాలు అని ట్వీట్ చేశారు. సైనికులు విధి నిర్వహణలో భాగంగా ఆ సమయంలో ఉన్ని ట్యూనిక్స్, బేర్ స్కిన్ టోపీలు ధరించడంతో ఎండకు తాళ్లలేకపోయారు. దీంతో స్ప్రుహ కోల్పోయిన ఆ సైనికులకు వైద్యులు తక్షణ చిక్సిత్స అందించారు. కాగా, జూన్ 17న అంగరంగ వైభవంగా జరగనున్న సదరు కార్యక్రమాన్ని చార్లెస్ III పర్యవేక్షిస్తారు. 💂 At least three British royal guards collapsed during a parade rehearsal in London ahead of King Charles' official birthday as temperatures exceeded 88 degrees Fahrenheit pic.twitter.com/V0fLjROoD5 — Reuters (@Reuters) June 10, 2023 (చదవండి: రన్‌వేపై రెండు ప్యాసింజర్ విమానాలు ఢీ..ప్రయాణికులకు తీవ్ర గాయాలు) -
Miyapur: బ్రష్ చేస్తుండగా మూర్ఛ.. సంపులో పడి యువతి మృతి
సాక్షి, మియాపూర్: ఓ యువతికి మూర్ఛరావడంతో సంపులో పడి మృతిచెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ గిరీష్ తెలిపిన మేరకు.. సూర్యాపేట జిల్లా గాం«దీనగర్‌లోని బాచనాయక్‌తండాకు చెందిన లునావత్ నిర్మల(26) మియాపూర్‌లోని మయూరినగర్ స్వదర్ గృహ అనాథాశ్రమంలో ఉంటుంది. నిర్మల మూర్చవ్యాధితో బాధపడుతుండేది. సోమవారం ఉదయం బ్రష్ చేసుకుంటూ ఉండగా మూర్ఛ రావడంతో అనాథాశ్రమ ప్రాంగణంలో ఉన్న సంపులో పడిపోయింది. ఎవరూ చూడకపోవడంతో అందులో మునిగి మృతిచెందింది. కొద్దిసేపటి తర్వాత నిర్మల అశ్రమంలో కనిపించకపోవడంతో నిర్వాహకులు వెతకగా సంపులో కనిపించింది. బయటకు తీయగా అప్పటికే మృతిచెంది ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాన్ని గాందీ ఆసుపత్రికి తరలించారు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
కాకినాడలో ఊపిరాడక 30 మంది విద్యార్థులకు అస్వస్థత..
సాక్షి, కాకినాడ జిల్లా: కాకినాడ రూరల్‌లోని వలసపాకల కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 5, 6 తరగతి గదుల్లో ఊపిరాడక 30 మంది స్కూల్ పిల్లలు కళ్లు తిరిగి పడిపోయారు. వీరిని వలసపాకలలోని ఓ ప్రైవేట ఆస్పత్రికి తరలించారు. అస్వస్థతకు గల కారణాలను టీచర్స్, విద్యార్ధులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. కాగా తమ పిల్లలకు ఏమైందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల రోదనలతో స్థానికంగా హృదయ విదారక పరిస్థితులు నెలకొన్నాయి. ఇక అస్వస్థతకు గురైన కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం విద్యార్థులు కోలుకుంటున్నారు. విద్యార్ధుల అస్వస్ధతకు గల కారణాలు తెలుసుకునేందుకు రక్త నమూనాలను వైద్యులు సేకరించారు. మంత్రి ఆరా కాకినాడ వలసపాకలలోని కేంద్రీయ విద్యాలయ విద్యార్దులు అస్వస్థతకు గురైన ఉదంతంపై విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరా తీశారు. కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. సంఘటనా స్థలానికి ఉన్నతాధికారులను పంపించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. -
వరుడికి చేదు అనుభవం.. వాంతి చేసుకుని కళ్లు తిరిగిపడిపోయిన వధువు
వాషింగ్టన్: పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో అందమైన మధుర జ్ఞాపకం. వివాహ వేడుకను జీవితాంతం మరచిపోలేని అందమైన జ్ఞాపకంగా మలుచుకోవాలని కలలు కంటారు. అందుకోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. ఇక పెళ్లి అంటే బోలేడు పనులు. ఇంట్లో సాయం చేసేవారు ఎవరు లేకపోతే.. పాపం కాబోయే వధువరులే ఆ పనులన్ని చూసుకోవాలి. ఇలా పనుల ఒత్తిడిలో పడి అలసిపోతే.. ఎలాంటి చేదు అనుభవాలు ఎదురవుతాయో ఈ వార్త చదివితే తెలుస్తుంది. ఈ జంటకు ఎదురైన కష్టాలు చూస్తే.. పాపం వీరంత దురదృష్టవంతులు ఈ భూమ్మీద ఇంక ఎవరు లేరనిపిస్తుది. ఆ వివరాలు.. అమెరికా, మిన్నెసోటాకు చెందిన హోలీ లిన్నియా-కోలెండా డార్నెల్లు వివాహం చేసుకుందామని భావించారు. డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఇక పెళ్లి పనులన్ని వారిద్దరే చక్కబెట్టుకున్నారు. పెళ్లికి ఒకరోజు ముందు వరకు కూడా వారు పనులతో బిజీగానే ఉన్నారు. పెళ్లి నాడు ఉదయం హోలీకి చాలా అలసటగా అనిపించడంతో పాటు కాస్త అనారోగ్యంగా కూడా అనిపించింది. దీని గురించి కాబోయే భర్తకు చెప్పింది. కానీ అతడు ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. (చదవండి: మహిళా వెడ్డింగ్ ప్లానర్స్ ఆకాశమే హద్దు...) మరికొన్ని గంటల్లో పెళ్లి పెట్టుకుని.. ఇప్పుడు అనారోగ్య కారణంగా దాన్ని వాయిదా వేయడం బాగోదని భావించింది హోలీ. ఎలాగోలా ఓపిక చేసుకుని.. రెడీ.. అయ్యి మంటపానికి వచ్చింది. అప్పటికే ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. పెళ్లి తంతు జరుగుతుండగా.. హోలీకి కళ్లు తిరిగాయి. కిందపడిపోతుండగా.. ఆమె కాబోయే భర్త పట్టుకున్నాడు. ముఖం మీద నీళ్లు చల్లితే హోలీ స్పృహలోకి వచ్చింది. దాన్నుంచి తేరుకునేలోపే ఆమెకు వాంతికి అయ్యింది. బయట బాగా వేడిగా ఉండటం వల్లనే హోలీకి ఇలా అయి ఉంటుందని భావించిన ఆమె సోదరి.. ఫ్యాన్ ఆన్ని చేద్దామని పైకి లేచింది. ఈ క్రమంలో చేతిలో ఉన్న పిల్లాడిని హోలీకి అప్పగించి ఆమె ఫ్యాన్ దగ్గరకు వెళ్లింది. వాడికి అప్పుడే గుర్తొచ్చిందేమో.. పెళ్లి కుమార్తె అని కూడా చూడకుండా.. హోలీ మీద మల విసర్జన చేశాడు. జరిగిన అన్ని సంఘటనలతో హోలీకి ఒకలాంటి విరక్తి కలిగింది. (చదవండి: మరికొద్ది నిమిషాల్లో పెళ్లి .. కారు దిగగానే వధువుకు షాక్!) త్వరగా పెళ్లి తంతు ముగుంచుకుని.. ఆస్పత్రికి వెళ్లింది హోలీ. ఆమెను పరీక్షించిన వైద్యులు.. లో బీపీ, రక్తహీనతతో బాధపడుతుందని.. అందుకే కళ్లు తిరిగి పడిపోయిందని తెలిపారు. ఇక విహానికి ముందు బాగా అలసిపోవడం.. ఆ రోజంతా నీళ్లు తాగకుండా ఉండటం వల్ల డీహైడ్రేషన్‌కు గురై వాంతి చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా హోలీ దంపతులు మాట్లాడుతూ.. ‘‘పెళ్లి అంటే అందరికి చాలా మంచి అనుభూతులు ఉంటాయి. మాకు ఎదురైన అనుభవాలు తల్చుకుంటే.. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం అలా జరిగిపోయింది. ఇప్పుడే ఇవే సంఘటనలను మా ముందు తరాలకు చెప్పాలి. కనీసం వారు అయినా జాగ్రత్త పడతారు’’ అని చెప్పుకొచ్చారు. చదవండి: ఖాకీలు చేసిన కల్యాణం: 'ఒకరిని విడిచి, మరొకరం ఉండలేమని..' -
ఆస్కార్ అవార్డు ఖచ్చితంగా దీనికే
-
ఓరి దీని వేషాలో.. ఏం గారాలు పోతున్నావే!
ఈ వీడియో చూశాకా మీరు కూడా ఈ ఏడాది ఆస్కార్ ఉత్తమ నటి/నటుడు అవార్డు ఖచ్చితంగా దీనికే అంటారు. ఇప్పటికే దాదాపు 60 లక్షల మంది ఈ వీడియో చూసి ఇలాగే అనుకున్నారు. ఇక్కడ మనం ఇంతలా చెప్పుకుంటుంది ఓ శునకం గురించి కావడం విశేషం. తన నటనతో ఇంతమందిని ఆకట్టుకోవడమే కాక రెండు రోజుల్లోనే చిన్న సైజు సెలబ్రిటీగా మారింది ఈ కుక్క. ఇంతకు ఈ వీడియోలో ఏం ఉందంటే.. ఓ మహిళ తన పెంపుడు కుక్క గోర్లు కత్తిరించడానికి ప్రయత్నిస్తుంది. దాని కోసం కుక్క కాలిని తన చేతిలోకి తీసుకుని.. కట్టర్‌తో గోర్లు కట్ చేయాలని ప్రయత్నిస్తుండగా.. ఉన్నట్లుండి ఆ కుక్క మూర్ఛబోయినట్లు నటిస్తూ.. నెమ్మదిగా కింద పడింది. కాళ్లు రెండు బార్లా చాపి.. కళ్లు తేలేసింది. మూడు రోజుల క్రితం ట్విటర్లో పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే దాదాపు 60 లక్షల మంది వీక్షించారు. అద్భుతమైన నటన.. స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వొచ్చు అంటూ నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. ript> -
పీఎస్ లో సొమ్మసిల్లిన వైఎస్సార్సీపీ నేత
చింతలపూడి (పశ్చిమగోదావరి జిల్లా) : చింతలపూడి పోలీసు స్టేషన్లో పోలీసుల నిర్బంధంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బొడ్డు వెంకటేశ్వరరావు అస్వస్థతకు గురయ్యారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ అరెస్ట్‌కు నిరసనగా జరుగుతున్న బంద్‌ను నిర్వీర్యం చేసే క్రమంలో పోలీసులు బొడ్డు వెంకటేశ్వరరావుతోపాటు మరో ఇద్దరు కాపు సంఘం నాయకులను శనివారం ఉదయం ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఉదయం నుంచి స్టేషన్లోనే ఆహారం లేకుండా ఉండిపోవడంతో సాయంత్రం సమయంలో బొడ్డు వెంకటేశ్వరరావు సొమ్మసిల్లి పడిపోయారు. ఆయన్ను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి మెరుగు కాకుంటే ఏలూరు లేదా విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించనున్నట్టు సమాచారం. -
రాజ్‌నాథ్ ప్రసంగం.. మహిళా పోలీసు అపస్మారకం
దేశ రాజధానిలో సాధారణ మహిళలకే కాదు పోలీసు అధికారులకూ తిప్పలు తప్పట్లేదు! మహిళల రక్షణే ప్రధాన లక్ష్యమని చెప్పే ఢిల్లీ పోలీసుశాఖ తీరులో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. సరిపడా సిబ్బందిని నియమించకపోవడంతో సర్వీసులో ఉన్న ఉద్యోగినులపై ఒత్తిడి పెరిగింది. సోమవారం ఢిల్లీ పోలీస్ రైజింగ్ డే పరేడ్‌లో చోటుచేసుకున్న ఘటనే ఇందుకు తాజా ఉదాహరణ. పరేడ్‌కు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సరిగ్గా ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఏసీపీ నియతి మిట్టల్ సొమ్మసిల్లి పడిపోయారు. పరేడ్ నిర్వహణ కోసం కొన్ని రోజులుగా శ్రమించిన ఆమె బాగా అలసిపోవడంతో పడిపోయారని సహ ఉద్యోగినులు తెలిపారు. అయితే అధికారిణి పడిపోవడాన్ని చూసి కూడా పట్టించుకోనట్లే రాజ్‌నాథ్ తన ప్రసంగాన్ని కొనసాగించారు! 'మహిళా అధికారిణి సొమ్మసిల్లడంలో వింతేముంది? అయినా మా డిపార్ట్మెంట్లో ఇలాంటివి సహజం' అంటూ విషయాన్ని చాలా తేలిగ్గా తీసిపారేశారు అక్కడున్న మగ పోలీసులు.