British Soldiers Faint In Front Of Prince William Amid Heat In London - Sakshi
Sakshi News home page

పరేడ్‌లో కుప్పకూలిన బ్రిటిష్‌ సైనికులు..వీడియో వైరల్‌

Jun 11 2023 11:18 AM | Updated on Jun 11 2023 12:18 PM

British Soldiers Faint In Front OF Prince William Amid Heat In London - Sakshi

దాదాపు 30 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలో బ్రిటన్‌ సైనికులు ఉన్ని ట్యూనిక్స్‌, బేర్‌ స్కిన్‌ టోపీలు ధరించారు. దీంతో..

బ్రిటన్‌లో వార్షిక ట్రూపింగ్‌  ది కలర్‌ సందర్భంగా ప్రిన్స్‌ విలయమ్స్‌ ఎదుట సైనికులు పరేడ్‌ రిహార్స్‌ల్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ముగ్గురు సైనికులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆ సమయంలో లండన్‌లో ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు చేరుకోవడంతో.. సైనికులు ఆ వేడికి తాళ్లలేక స్ప్రుహ తప్పి పడిపోయారు. చక్రవర్తి అధికారిక పుట్టిన రోజు సందర్భంగా ప్రతి జూన్‌లో లండన్‌లో ట్రూపింగ్‌ ది కలర్‌ అనే కార్యక్రమం నిర్వహిస్తారు. అందుకోసం వార్షిక కవాతు నిర్వహించడం ఆనవాయితీ.

అందులో భాగంగానే విలియమ్స్‌ ఎదుట రిహార్సల్స్‌  చేస్తున్నారు సైనికులు. అదే సమయంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో..ఆ వేడికి తాళ్లలేక ముగ్గురు సైనికులు కుప్పకూలినట్లు బ్రిటన్‌ మీడియా పేర్కొంది. ఈ మేరకు ప్రిన్స్‌ విలియం సైనికులను కృతజ్ఞతలు తెలుపుతు ఒక ట్వీట్‌ చేశాడు. ఆ ట్వీట్‌లో విలియమ్స్‌..ఈ ఉదయం కల్నల్‌ రివ్యూలో పాల్గొన్న ప్రతి సైనికుడుకి చాలా కృతజ్ఞతలు.

క్లిష్ట పరిస్థితుల్లో మీరు నిబద్ధతతో మీ విధులను నిర్వర్తిస్తున్నారు. ప్రతి ఏటా నిర్వహించే కార్యక్రమం విజయవంతం కావడం కోసం తమ వంతుగా కృషి చేస్తున్నందుకు ధన్యావాదాలు అని ట్వీట్‌ చేశారు. సైనికులు విధి నిర్వహణలో భాగంగా ఆ సమయంలో ఉన్ని ట్యూనిక్స్, బేర్ స్కిన్ టోపీలు ధరించడంతో ఎండకు తాళ్లలేకపోయారు. దీంతో స్ప్రుహ కోల్పోయిన ఆ సైనికులకు వైద్యులు తక్షణ చిక్సిత్స అందించారు.  కాగా, జూన్‌ 17న అంగరంగ వైభవంగా జరగనున్న సదరు కార్యక్రమాన్ని చార్లెస్‌ III పర్యవేక్షిస్తారు.

(చదవండి: రన్‌వేపై రెండు ప్యాసింజర్‌ విమానాలు ఢీ..ప్రయాణికులకు తీవ్ర గాయాలు)


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement