మరమరాలతో చేసే చాట్ అంటే అబ్బా..! ఆ రుచి తలుచుకుంటేనే నోటిలో నీళ్లూరిపోతుంటాయి. ఆ టేస్ట్ వేరేలెవెల్. మన ఊర్లలోనే కాదు పట్టణాలో చిన్న బండిలపై ఈ మరమరాల చాట్‌ను అమ్ముతుంటారు. ముఖ్యంగా శీతాకాలంలో తింటుంటే ఓ పక్క పుల్లగా.. కారంగా భలే రుచిగా ఉంటుంది. ఇదంతా ఎందుకంటే ఇలా మరమరాల చాట్‌ని మనవాళ్లు అమ్ముతుంటే పెద్ద ఫీల్ ఉండదె. అదే తెల్ల దొరలు అమ్మితే..కచ్చితంగా అవాక్కవుతాం కదా..!. నిజం అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో ఒక బ్రిటిష్ వ్యక్తి అచ్చం మన వాళ్లలా మరమరాల చాట్ అమ్ముతూ కనిపిస్తాడు. అచ్చం మనలానే ఓ గిన్నేలో మరమరాలు వేసుకుని ఉల్లిపాయలు, కొత్తిమీర, కీర దోస, కాస్త మసాలా చాట్ వేసి కలిపి..పేపర్ పొట్లంలో చుట్టి ఇవ్వడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇది దగ్గర దగ్గరగా కోల్‌కతా స్టీట్ విక్రేతల మాదిరిగా అమ్ముతున్నాడు. అయితే ఈ ఘటన లండన్‌లో చోటు చేసుకుంది.
అతడు అలా మన వాళ్లలా "ఝల్మురి ఎక్స్‌ప్రెస్" పేరుతో చిన్న బండిపై మరమరాల చాట్ అమ్ముతున్న విధానం చూస్తే భారత్‌లోనే ఉన్నామా..! అని షాక్ అవ్వుతాం. అందుకు సంబంధించిన వీడియోని ఒక ఫుడ్ వ్లాగర్ నెట్టింట షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. అయితే నెటిజన్లు బ్రిటిష్ వాళ్లు మన దేశాన్ని 200 ఏళ్లు పాలించి చివరికి ఇలా అయిపోయారని చమత్కరిస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ అమిత్ ఠాకూర్: ఆ హెయిర్ ట్రీట్‌మెంట్‌లు వద్దు..!)
Comments
Please login to add a commentAdd a comment