vendor
-
ఆన్లైన్ కంటే తక్కువ ధరకే!.. పోస్ట్ వైరల్
బెంగళూరు నగరానికి చెందిన ఒక కొబ్బరి బొండాల వ్యాపారి.. జెప్టో, బ్లింకిట్, బిగ్ బాస్కెట్ వంటి వాటికి సవాలు విసిరారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ వ్యాపారి విసిరినా సవాల్ ఏమిటి? దీనిపై నెటిజన్లు ఎలా స్పందిస్తున్నారు అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులో.. కొబ్బరి బోండాం రేటు జెప్టోలో రూ. 80, బ్లింకిట్‌లో రూ. 80, బిగ్‌బాస్కెట్‌లో రూ. 70 ఉంది. కానీ వ్యాపారి కేవలం రూ. 55కే కొబ్బరి బోండాం అంటూ వెల్లడించారు. ఈ పోస్ట్ చూసిన చాలామందిలో చర్చ మొదలైంది. యాప్‌లు వ్యసనంగా మారితే వస్తువులు ఖరీదైనవిగా మారతాయని నెటిజన్లు పేర్కొంటున్నారు.క్విక్ కామర్స్ సైట్లు ఎప్పుడూ ధరలను భారీగా పెంచుతాయి. ప్రజల సమయాన్ని, సౌకర్యాలను బట్టి బిల్లు వేస్తాయి. వీటిపైనే ఆధారపడితే భవిష్యత్తులో ఖర్చులు భారీగా పెరుగుతాయి. జొమాటో, స్విగ్గీ వంటి వాటిని తొలగించినప్పటి నుంచి నా ఖర్చులు చాలా తగ్గాయని ఒక నెటిజన్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: రెండో ఆదాయంపై కన్నేసిన సినీతారలు: అందరి చూపు అటువైపే..క్విక్ కామర్స్ సైట్లలో మోసాలు కూడా విపరీతంగా జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ధన త్రయోదశి సందర్భంగా ఒక నెటిజన్ బ్లింకిట్ ద్వారా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నుంచి 1 గ్రాముల బంగారు నాణెం, 10 గ్రాముల వెండి నాణెం ఆర్డర్ చేసినప్పటికీ 0.5 గ్రాముల బంగారు నాణెం వచ్చినందుకు మోసపోయానని ఆరోపించాడు. ఇలా నెటిజన్లు ఎవరికితోచిన విధంగా వారు కామెంట్స్ చేస్తున్నారు.Will Quick Commerce affect roadside coconut vendors? 📸: @nithishr46 found this in @peakbengaluru pic.twitter.com/LfQKpgO2uc— Peak Bengaluru (@peakbengaluru) November 7, 2024 -
మరమరాల చాట్ అమ్ముతూ బ్రిటిష్ వ్యక్తి..!
మరమరాలతో చేసే చాట్ అంటే అబ్బా..! ఆ రుచి తలుచుకుంటేనే నోటిలో నీళ్లూరిపోతుంటాయి. ఆ టేస్ట్ వేరేలెవెల్. మన ఊర్లలోనే కాదు పట్టణాలో చిన్న బండిలపై ఈ మరమరాల చాట్‌ను అమ్ముతుంటారు. ముఖ్యంగా శీతాకాలంలో తింటుంటే ఓ పక్క పుల్లగా.. కారంగా భలే రుచిగా ఉంటుంది. ఇదంతా ఎందుకంటే ఇలా మరమరాల చాట్‌ని మనవాళ్లు అమ్ముతుంటే పెద్ద ఫీల్ ఉండదె. అదే తెల్ల దొరలు అమ్మితే..కచ్చితంగా అవాక్కవుతాం కదా..!. నిజం అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక బ్రిటిష్ వ్యక్తి అచ్చం మన వాళ్లలా మరమరాల చాట్ అమ్ముతూ కనిపిస్తాడు. అచ్చం మనలానే ఓ గిన్నేలో మరమరాలు వేసుకుని ఉల్లిపాయలు, కొత్తిమీర, కీర దోస, కాస్త మసాలా చాట్ వేసి కలిపి..పేపర్ పొట్లంలో చుట్టి ఇవ్వడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇది దగ్గర దగ్గరగా కోల్‌కతా స్టీట్ విక్రేతల మాదిరిగా అమ్ముతున్నాడు. అయితే ఈ ఘటన లండన్‌లో చోటు చేసుకుంది. అతడు అలా మన వాళ్లలా "ఝల్మురి ఎక్స్‌ప్రెస్" పేరుతో చిన్న బండిపై మరమరాల చాట్ అమ్ముతున్న విధానం చూస్తే భారత్‌లోనే ఉన్నామా..! అని షాక్ అవ్వుతాం. అందుకు సంబంధించిన వీడియోని ఒక ఫుడ్ వ్లాగర్ నెట్టింట షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. అయితే నెటిజన్లు బ్రిటిష్ వాళ్లు మన దేశాన్ని 200 ఏళ్లు పాలించి చివరికి ఇలా అయిపోయారని చమత్కరిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Ansh Rehan | London📍 (@explorewithrehans) (చదవండి: సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ అమిత్ ఠాకూర్: ఆ హెయిర్ ట్రీట్మెంట్లు వద్దు..!) -
వొడాఫోన్‌లో నోకియా, ఎరిక్సన్ వెండర్లకు 166 కోట్ల షేర్లు
న్యూఢిల్లీ: భారీ రుణ భారాన్ని మోస్తున్న మొబైల్ రంగ కంపెనీ వొడాఫోన్ ఐడియా(వీఐఎల్)లో కీలక వెండార్ సంస్థలు నోకియా, ఎరిక్సన్ ఇండియాకు వాటా లభించనుంది. నెట్వర్క్ పరికరాలను సరఫరా చేసే వీటి బకాయిలను పాక్షికంగా చెల్లించేందుకు షేరుకి రూ. 14.8 ధరలో వొడాఫోన్ ఐడియా ఈక్విటీ షేర్లను కేటాయించనుంది. ఇది ఎఫ్‌పీవో ధరకంటే 35 శాతం అధికంకాగా.. ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన రూ. 10 ముఖ విలువగల 166 కోట్ల ఈక్విటీ షేర్ల జారీకి బోర్డు అనుమతించినట్లు వీఐఎల్ తాజాగా వెల్లడించింది. తద్వారా రూ. 2,458 కోట్ల విలువైన వాటాను నోకియా, ఎరిక్సన్ పొందనున్నాయి. అయితే వీటికి 6 నెలల లాకిన్ వర్తించనుంది. నోకియా సొల్యూషన్స్ అండ్ నెట్వర్క్స్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్, ఎరిక్సన్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ దీర్ఘకాలంగా కీలక వెండార్లుగా సేవలందిస్తున్నట్లు వీఐఎల్ పేర్కొంది. నోకియాకు రూ. 1,520 కోట్లు(1.5 శాతం వాటా), ఎరిక్సన్కు రూ. 938 కోట్ల(0.9 శాతం) విలువైన ఈక్విటీని జారీ చేయనున్నట్లు వెల్లడించింది. వీఐఎల్‌లో ప్రమోటర్లు ఆదిత్య బిర్లా గ్రూప్, వొడాఫోన్ సంయుక్త వాటా 37.3 శాతంకాగా.. ప్రభుత్వ వాటా 23.2 శాతానికి చేరనుంది. -
దటీజ్ "మహాలక్ష్మీ ఐస్ క్రీం"! అద్గది.. టెక్నాలజీని వాడటం అంటే..!
మన చుట్టూ సాధరణంగా ఉండే సామాన్యులు సైతం టెక్నాలజీని వాడుకునే సామర్థ్య కలిగి ఉంటారు. అవసరం వచ్చినప్పుడూ గానీ వారి నైపుణ్యం ఏంటో మనకు తెలియదు. వారు తమ నిత్యావసరాలకు టెక్నాలజీని వాడి చూపిస్తే..అందరూ అశ్చర్యపోతారు. నాలెడ్జ్ అనేది ఎవరీ సొత్తు కాదు. బుర్ర పెట్టి ఆలోచిస్తే ఎవ్వడైనా తమకు అందుబాటులో ఉన్నవాటితోనే అద్భుతాలు చేసి చూపగలరు. అచ్చం అలాంటి అద్భుత ఘటనే ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఢిల్లీలోని మహాలక్మీ ఐస్ క్రీం బండి చూస్తే..కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ ఐస్ క్రీం ట్రక్ టెక్నాలజీని వాడేంత స్థాయిని చూస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అంత టెక్నాలజీ వాడగలిగే స్థోమత ఆ ఐస్‌క్రీం విక్రయించే అతనికి ఉండటమే..ఇక్కడ హాట్‌టాపిక్‌గా మారింది. నిజానికి వీధుల్లో అమ్మే ఐస్‌క్రీం బండి వాళ్లు శీతలీకరణం కోసం ఇంటెన్సివ్ గ్లైకాల్ ఫీజర్లపైనే ఆధారపడతారు. అవి భారీగా ఉండటమే కాకుండా గణనీయమైన విద్యుత్‌ని డిమాండ్ చేస్తుంది. వేసవిలో వీటి వినియోగం మరింత ఎక్కువగా ఉంటుంది. ఐసీక్రీంని కూల్‌గా ఉంచటం కోసం అని సోలార్ విద్యుత్‌ని వాడాలన్న ఆలోచనే గ్రేట్గానూ, కొత్తగానూ ఉంది. ఇక అంత సాంకేతికతకు పెట్టుబడి పెట్టగలిగే సామర్థ్యం ఆ ఐస్‌క్రీం విక్రయించే వ్యక్తికి ఉండటం..అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విషయమే నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అతను ఆ వ్యాపారంలో లాభాలు గడించి ఆ స్థాయికి వచ్చాడని కొందరూ, విక్రయించే వ్యక్తికి వ్యక్తిగత సోలార్ టెక్నాలజీకి సంబంధించి కనెక్షన్ ఉంటే తప్ప ఇలా ఐస్‌క్రీం ట్రక్‌కి పెట్టలేరని కొందరూ కామెంట్లు చేస్తూ..పోస్ట్‌లు పెట్టారు. (చదవండి: -
ఇగో హర్ట్ అయితే.. అట్లుంటది మరి!
ఎక్కడైనా ధర దగ్గర భేరమాడటం సహజమే.. అయితే.. కొన్నిసార్లు అడిగిన ప్రతి ఒక్కరికీ ధరను చెప్పలేక వ్యాపారి విసిగిపోవడమూ అప్పుడప్పుడు చూస్తుంటాం. అయితే.. ఇదే వ్యవహారంపై చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్ లో విచిత్రమైన సంఘటన జరిగింది. కొనలేకపోతే వెళ్లిపోండని కసురుకున్న వ్యాపారికి తిక్క కుదిర్చాడో వ్యక్తి. రూ. 9 వేలు పెట్టి ఖరీదు చేసి వ్యాపారి అమ్ముతున్న న్యూడుల్స్‌ని కిందపడేసి ధ్వంసం చేశాడు. వీడియోలో చూపిన విధంగా కొనుగోలుదారుడు వ్యాపారి వద్దకు వెళ్లాడు. న్యూడుల్స్ ధర ఎంత అని అడుగుతాడు. ఒక కప్ న్యూడుల్స్కు రూ.164 అని అతడు చెబుతాడు. ఎందుకు అంత ధర చెబుతున్నారని కస్టమర్ ప్రశ్నిస్తాడు. న్యూడుల్స్ లో వాడుతున్న ముడి సరకులు ఎంటో చెప్పాలని అడుగుతాడు. దానికి వ్యాపారి రెండు గుడ్లుతో సహా వాడే ముడి పదార్థాలను వివరిస్తాడు. విన్న తర్వాత దానికే మరీ ఇంత రేటా? అని కస్టమర్ అనగానే పక్కనే ఉన్న వ్యాపారి కొడుకు లేచి ఆర్థిక స్తోమత లేకపోతే వెళ్లిపోవాలని కసురుకుంటాడు. దీంతో ఆగ్రహానికి గురైన కస్టమర్ వ్యాపారిపై విచిత్రంగా ప్రవర్తించాడు. వ్యాపారి వద్ద ఉన్న అన్ని న్యూడుల్స్ కు రూ.9,920 వెచ్చించి కొనుగోలు చేస్తాడు. ఆ తర్వాత అన్నింటిని పనికిరానివాటిగా పరిగణిస్తూ కిందపడేస్తాడు. కాలితో తొక్కుతూ నన్నే అవమానిస్తావా? అని అంటాడు. వ్యాపారి కుమారుడు క్షమాపణలు కోరుకున్నా ఫలితం లేకపోయింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెట్టారు. ఇగో హర్ట్ అయితే ఇలాగే ఉంటది? అంటూ కామెంట్లు పెట్టారు. వ్యాపారి తిట్టినందుకు బహుమతిగా రూ.9 వేలు ఇచ్చావా? సరిపోయిందా? అంటూ ఫన్నీగా రెస్పాండ్ అయ్యారు. ఇదీ చదవండి: డబ్ల్యూడబ్ల్యూఈ స్టైల్లో ఫైటింగ్.. సెక్యూరిటీ గార్డ్‌పై మరీ ఇంత దారుణమా..? వీడియో వైరల్.. -
కేసీఆర్ సారు సల్లంగుండాలె బిడ్డా..
సాక్షి, మల్యాల(చొప్పదండి): ‘ఇంటింటికీ పింఛన్లు ఇచ్చుకుంట.. మాకు ధీముగా ఉన్న కేసీఆర్ సారు సల్లంగుండాలె బిడ్డా..’అని రోడ్డు వెంట మక్కకంకులు కాల్చి విక్రయిస్తున్న ఓ మహిళ వ్యాఖ్యానించింది. ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటన ముగించుకుని తిరుగుప్రయాణంలో మల్యాల మండలం నూకపల్లి శివారులో కాసేపు ఆగారు. అక్కడే మక్కకంకులు అమ్ముతున్న ఓ మహిళ వద్దకు వెళ్లి వాటిని కొనుగోలు చేశారు. ఆమెతో మాటలు కలుపుతూ, కంకులు తింటూ సీఎం కేసీఆర్ పాలనపై కవిత ఆరా తీశారు. అయితే, తనకే కాదు ఇంటింటికీ పింఛన్ వస్తోందని ఆ మహిళ సంతోషంగా చెప్పింది. ‘కేసీఆర్ సారు పదికాలాలు సల్లంగుండాలె’అని దీవించింది. సీఎం కేసీఆర్ కూతురు కవిత తన వద్దకు వచ్చి కంకులు కొనుగోలు చేయడం చాలా సంతోషంగా ఉందని ఉబ్బితబ్బిబ్బయింది. ఎమ్మెల్సీ కవితను చూసి వచ్చిన స్థానికులు ఆమెతో సెల్ఫీలు దిగారు. -
టమాటా వ్యాపారికి బౌన్సర్లంటూ తప్పుడు వార్తా కథనం.. పీటీఐ క్షమాపణలు
వారణాసి: టమాటా ధరలు పెరిగిన నేపథ్యంలో షాపు ముందు ఓ వ్యాపారి ఇద్దరు బౌన్సర్లను నియమించాడనే వార్త పీటీఐకి చిక్కులు తెచ్చిపెట్టింది. ఎట్టకేలకు ఆ వార్త అవాస్తవమైనదని పీటీఐ తెలిపింది. ఇలాంటి సమాచారాన్ని ప్రసారం చేసినందుకు క్షమాపణలు చెప్పింది. నిజనిర్ధారణ చేయడంలో విఫలమయ్యామని వెల్లడించింది. ఆ షాపు ఓనర్‌ను సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తగా గుర్తించామని పీటీఐ తెలిపింది. టమాటా ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రశ్నించే ఉద్దేశంతోనే ఆ సమాచారాన్ని తమకు అందించినట్లు పీటీఐ భావించింది. వార్తల ఉన్నత ప్రమాణాలను చేరడంలో ఈ సారికి తప్పు జరిగిందని స్పష్టం చేసింది. ఆ ట్వీట్‌ను వెంటనే తొలగించినట్లు పేర్కొంది. ఉన్నత విలువలతో కూడిన నిష్పాక్షిమైన వార్తలను అందించడానికి కట్టుబడి ఉన్నామని హామీ ఇస్తున్నట్లు ట్వీట్ చేసింది. Earlier today, PTI tweeted a story about a vegetable vendor in Varanasi hiring bouncers in light of high price of tomatoes. It has since come to our notice that the vendor is a worker of the Samajwadi Party, and his motive for giving us the information was questionable. We have,… — Press Trust of India (@PTI_News) July 9, 2023 దేశంలో టమాటా ధరలు ఆకాశన్నంటుతున్నాయి. కేజీ ధర రూ.160 పైనే ఉంది. దీంతో ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే యూపీలోని వారణాసిలో ఓ షాపు యజమాని తన టమాటా షాపు ముందు వినియోగదారులను అదుపు చేయడానికి ఇద్దరు బౌన్సర్లను పెట్టుకున్నట్లు పీటీఐ వార్తను ప్రసారం చేసింది. దొంగలు షాపు నుంచి టమాటాను ఎత్తుకుపోతున్నట్లు ఆ యజమాని పేర్కొన్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ అంశం తప్పు అని చెబుతూ ప్రసారం చేసినందుకు క్షమాపణలు చెప్పింది. ఇదీ చదవండి: టమాటాలు తెచ్చిన తంటాలు.. బౌన్సర్లను పెట్టుకున్న వ్యాపారి.. -
ఛీ!.. ఇలానా కొబ్బరి బోండాలు విక్రయించేది..వీడియో వైరల్
ఈ వేసవిలో దాహార్తిని తీర్చడానికి కొబ్బరి బోండాలకు సాటి ఏదిరాదు. అలాంటి కొబ్బరి బోండాలు అనారోగ్యంగా ఉన్నప్పుడూ, లేదా పండగలు, శుభాకార్యాల్లోనే ఎంతగానో వినియోగిస్తాం. ఆరోగ్యానికి ఎంతో మంచిదని చాలా మంది కొబ్బరి బోండాలనే ప్రివర్ చేస్తుంటారు. కూల్‌డ్రింక్స్‌కి బదులు ఇవే ఆరోగ్యానికి మంచిదని వాటికే ప్రాధాన్యత ఇస్తారు చాలామంది. ఐతే ఈ వీడియో చూశాక కచ్చితంగా ఓపినియన్ మారిపోవడమే గాక తాగేందుకు భయపడతాం కూడా. ఆఖరికి కొబ్బరి బొండాలను కూడా ఇలా కలుషితం చేసి మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారా అని విస్మయం కలిగిస్తుంది ఈ వ్యక్తి చేసిన పని. ఆ వీడియోలో కొబ్బరి బోండాలను అమ్మే వ్యక్తి తన బండిపై ఉన్న లేత కొబ్బరి బోండాలపై డ్రైయిన్ వాటర్ చల్లుతున్నట్లు కనిపిస్తుంది. ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. సదరు వ్యక్తిని ఉత్తరప్రదేశ్‌లోని బరేలికి చెందని 28 ఏళ్ల సమీర్‌గా గుర్తించారు. #Watch | Vendor sprinkling drain water on coconuts. Noida Police caught after video viral on social media#Noida #viralvideo #Coconuts #News18JKLH pic.twitter.com/ZhuXEYCylz — News18 Kashmir (@News18Kashmir) June 6, 2023 (చదవండి: అభిమానానికి హద్దులు లేవంటే ఇదేనేమో!.. ఓ వ్యక్తి ధోనిపై ఉన్న ప్రేమను..) -
Viral Video: ఐస్‌క్రీం ఇవ్వకుండా చిన్నారిని ఏడిపించిన వ్యక్తి
-
ఐస్‌క్రీం ఇవ్వకుండా చిన్నారిని ఏడిపించిన వ్యక్తి.. పిల్లలతో ఆటలేంటి?
ఐస్ క్రీం అంటే అందరికి ఇష్టమే.. కాలంతో సంబంధం లేకుండా లొట్టలేసుకుంటూ తింటుంటారు. ఈమధ్య కాలంలో టర్కిష్ ఐస్ క్రీం పేరు అందరినోట ఎక్కువగా వినిపిస్తుంది. కారణం దాని రుచి కాకపోయిన అక్కడి వ్యాపారస్థులు చేసే జిమ్మిక్కులు. దీని వల్లే ఈ ఐస్‌క్రీం ఎక్కువ పాపులర్ అయ్యింది. ఐస్క్రీంను ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ వెనక్కి లాగుకుంటూ కస్టమర్లను సరాదాగా ఆటపట్టిస్తుంటారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం చూసే ఉంటాం. తాజాగా టర్కిష్ ఐస్ క్రీం వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇందులో కౌంటర్ ఎదురుగా ఐస్‌క్రీం కోసం నిలబడి ఉన్న చిన్నారితో విక్రేత ఫ్రాంక్ చేస్తుంటారు. తన ట్రిక్స్‌తో పాపను ఆటపట్టిస్తూ ఉంటాడు. ఐస్ క్రీం కోసం చేయి చాపిన ప్రతీసారి అతను మ్యాజిక్ చేసి ఖాళీ కోన్‌ను ఇస్తుంటాడు. అతని పిచ్చి చేష్టలు అర్థం కాక ఏడవడం మొదలు పెడుతుంది. అయినప్పటికీ ఆ పాపకు ఐస్‌క్రీం ఇవ్వకుండా అలాగే చేస్తుంటాడు. ఐస్‌క్రీం ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళీ వెనక్కు తీసుకుంటాడు. దీంతో పట్టరాని కోపంతో ఖాళీ కోన్‌ను అతనిపై విసిరేస్తుంది. ఎట్టకేలకు ఆ పాప తండ్రి ఆమెను ఎత్తుకున్నాక ఐస్‌క్రీమ్ దక్కుతుంది.ఈ వీడియోను ఓ యూజర్ ట్విటర్లో షేర్ చేశారు. क्यों परेशान कर रहे हो बेचारी को 😂👏😎 pic.twitter.com/V5slqNAqwr — ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) November 22, 2022 ఈ వీడియో వైరల్‌గా మారింది. లక్షకుపైగా వ్యూస్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అంత చిన్న పాపను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని మండిపడుతున్నారు. పిల్లలకు ఐస్‌క్రీం అంటే ఎంతో ఇష్టం. వారిని ఏడిపించకండి. పాప ఏడుస్తుంటే మిగతా వాళ్లంతా నవ్వడం ఏంటి. పిల్లల విషయంలో ఇలాంటి జోక్‌లు చేయవద్దు. ఐస్‌క్రీం అమ్మేవాడిని శిక్షించాలి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
రిషి, ద వెండర్!
మెడలో ట్రే వేలాడదీసుకుని పాపీస్ అమ్ముతున్నదెవరో గుర్తు పట్టారు కదూ! అవును. బ్రిటన్ ప్రధాని రిషియే. గురువారం ఉదయం పూట మంచి రష్ అవర్‌లో వెస్ట్‌మినిస్టర్ మెట్రో స్టేషన్లో ఇలా దర్శనమిచ్చి ప్రయాణికులను సర్ప్రైజ్ చేశారాయన. రాయల్ బ్రిటిష్ లెజియన్కు నిధుల సేకరణ కోసం సైనికులతో కలిసి ఇలా వెండర్ అవతారమెత్తారు. పేపర్‌తో చేసిన ఒక్కో పాపీని ఐదు పౌండ్లకు అమ్మారు! చాలామంది ఆయన నుంచి వాటిని కొనుగోలు చేస్తూ కన్పించారు. పలువురు రిషితో సెల్ఫీలు తీసుకుంటూ గడిపారు. రిషి చర్యను మెచ్చుకుంటూ, ఆయన వద్ద తాము పాపీస్ కొన్నామని పేర్కొంటూ చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. -
Sakshi Cartoon: ...కూరగాయలు తింటే, అమ్మితే ఇన్నేళ్లు బతకడం కాదు! పనిచేయడం
...కూరగాయలు తింటే, అమ్మితే ఇన్నేళ్లు బతకడం కాదు! పనిచేయడం వలన బతుకుతున్నాను! -
కోపంతో రెచ్చిపోయిన మహిళ.. రోడ్డుపై పండ్లు విసురుతూ.. వీడియో వైరల్
రోడ్డు పై వెళ్తున్నపుడు చిన్న చిన్న తప్పులు జరగడం సహజం. అయితే కొందరు మాత్రం చిన్న చిన్న వాటికి కూడా కోపంతో రెచ్చిపోతుంటారు. తాజాగా ఓ మహిళ రోడ్డుపై కోపంతో విచక్షణ లేకుండా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని చోటు చేసుకుంది. (చదవండి: వైరల్: దొంగతనానికి వచ్చి.. ఆకలేయడంతో వంటగదిలో కిచిడీ వండుతూ.. ) వివరాల్లోకి వెళితే.. తోపుడు బండపై పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగించే ఓ వ్యక్తి ఎప్పటిలానే తన బండిని రోడ్డు పై తోసుకుంటూ వెళ్తున్నాడు. ఆ దారిలో ఓ కారు పార్క్ చేసి ఉంది. పొరపాటున చిరు వ్యాపారి తోపుడు బండి ఆ కారుకు తగిలింది. ఈ విషయాన్ని గమనించిన ఆ కారు యజమాని అయన మహిళ విచక్షణ కోల్పోయి మరి అతని పట్ల కర్కశంగా ప్రవర్తించింది. కోపంతో ఊగిపోతు బండిపై ఉన్న పండ్లను రోడ్డుపై విసిరేసింది. అతను తప్పు జరిగింది క్షమించండి అంటూ వేడుకున్న ఏ మాత్రం కనికరం చూపలేదు. దారిన పోయే వాహనదారులు ఆమె అనూహ్య ప్రవర్తనను వీడియో తీస్తున్నా కూడా ఆగకుండా అలాగే చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా కూడా మారింది. Bhopal : After a slight touch of a car parked on the road, the woman in anger threw all the fruits of the fruit seller on the road. It is said that a professor of a private university in Bhopal, madam. The cartman kept pleading but madam did not listen.#Bhopal #MadhyaPradesh pic.twitter.com/cAFvPL7LRN — Mario David Antony Alapatt (@davidalapatt) January 11, 2022 -
డాక్టరవ్వాలని... ఓ కూరగాయలమ్మాయి ఎదురుచూపులు
‘ఒక పేదింటి బిడ్డ డబ్బు లేని కారణంగా చదువుకు దూరం కాకూడదు’ అనే స్ఫూర్తి ఏమైంది? ఒక విద్యా కుసుమం ఎందుకు వాడిపోవడానికి సిద్ధంగా ఉంది? ఎవరైనా వచ్చి పాదులో నీళ్లు పోస్తే సంపూర్ణంగా వికసించాలనే ఆశతో ఎదురు చూస్తోంది. డాక్టర్ అయి తీరాలనే కోరిక ఆ అమ్మాయి చేత ఓ సాహసం చేయించింది. తొలి అడుగు వేయగలిగింది. కానీ విధి పరీక్షల్లో తర్వాతి అడుగులు తడబడుతున్నాయి. ఇంత పెద్ద సమాజంలో పెద్ద మనసుతో ఎవరైనా ముందుకు రాకపోతారా అని బేలగా చూస్తోంది హైదరాబాద్, మోతీనగర్‌లోని అనూష. ‘‘నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్ అవాలనే కోరిక ఉండేది. స్కూల్‌డేస్ నుంచి అదే కలతో చదివాను. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్‌లో 945వ ర్యాంకు వచ్చింది. ఎన్సీసీ, స్పోర్ట్స్ పాయింట్లు ఉంటే ఫ్రీ సీటు వచ్చేది. మా పేరెంట్స్ ఇద్దరూ ఏమీ చదువుకోలేదు. నాకు చిన్నప్పుడు ఇలాంటివి చెప్పేవాళ్లెవరూ లేరు. ఏ రిజర్వేషనూ లేదు. ఓపెన్‌లో సీట్ తీసుకుంటే గవర్నమెంట్ కాలేజీల్లో కూడా ఏడాదికి ఏడు లక్షలుంది. ప్రైవేట్‌లో అయితే కోటిదాకా ఉంది. కిర్గిస్తాన్‌లో అయితే పాతిక లక్షల్లో కోర్సు పూర్తవుతుందని ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. మా ఆర్థిక పరిస్థితి నాకు తెలుసు. ఆ డబ్బు సమకూర్చుకోవడం కూడా జరిగే పని కాదు. అయితే మెరిట్ స్టూడెంట్‌ని కాబట్టి స్కాలర్షిప్లు వస్తాయని, మిగిలిన డబ్బు బ్యాంకు నుంచి లోన్ తీసుకోవచ్చనుకున్నాను. స్కాలర్షిప్ కోసం ఎన్ని అప్లికేషన్లు పెట్టానో లెక్కేలేదు. ‘ఈపాస్’ లో అయితే ఇరవై సార్లు అప్లయ్ చేశాను. బ్యాంకులోన్ కూడా రాలేదు విద్యాలక్ష్మి పథకానికి అప్లయ్ చేసిన తర్వాత బ్యాంకు నుంచి ఫోన్ వచ్చింది. కానీ ష్యూరిటీ లేకుండా లోన్ ఇవ్వడం కుదరదన్నారు. కూరగాయల బండిని ష్యూరిటీగా పెట్టుకోలేం. నీ సర్టిఫికేట్లన్నీ బాగున్నాయి. గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు ఉన్నా... ఆ ఇంటి మీద లోన్ ఇస్తామన్నారు. కానీ మాకు ఇల్లు లేదు. నాకు చదువుకోవడానికి సహాయం చేయమని ఎంతమంది కాళ్లమీదనో పడ్డాను. అందరమూ పని చేస్తున్నాం మా నాన్న వాచ్‌మన్, అమ్మ స్వీపర్‌గా కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తోంది. నెలకు తొమ్మిది వేలు వస్తాయి. ఆమె ఉదయం నాలుగు గంటలకు లేచి మార్కెట్‌కెళ్లి కూరగాయలు తెచ్చి, ఆరు గంటలకు తన డ్యూటీకి వెళ్తుంది. మధ్యాహ్నం తర్వాత కూరగాయలమ్మేది. ఇప్పుడు నేను కూరగాయలు అమ్ముతున్నాను. తమ్ముడు డిగ్రీ చదువుతూ ఖాళీ సమయంలో స్విగ్గీ డెలివరీ బాయ్‌గా చేస్తున్నాడు. రోజంతా క్షణం తీరిక లేకుండా పని చేసి కూడబెట్టుకున్న డబ్బును అనారోగ్యం హరించి వేసింది. ఇక ఇప్పుడు మూడవ సంవత్సరం చదువుకు వెళ్లాలి. రెండవ సంవత్సరం ఫీజు, ఈ ఏడాది ఫీజు కలిపి పది లక్షలు కట్టాలి. నేను కాలేజ్‌లో అడుగుపెట్టగలిగేది ఆ డబ్బు చేతిలో ఉంటేనే’’ అని కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది అనూష. ఆమె మాటల్లో అన్ని దారులూ మూసుకుపోయాయనే దిగులుతోపాటు ఏదో ఒక దారి కనిపించకపోతుందా అనే చిరు ఆశ కూడా కనిపించింది. ఆమె ఆశ, ఆశయం నెరవేరుతాయని భావిద్దాం. విధి కూడా ఆడుకుంటోంది ఎలాగైనా డాక్టర్నవ్వాలనే ఆశతోనే కిర్గిస్తాన్‌లో ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో చేరాను. కిర్గిస్తాన్ వెళ్లడానికి చెవి కమ్మలతో సహా ఇంట్లో ఉన్న బంగారం అంతా అమ్మేశాం. చిట్టీల డబ్బులు... అంతా కలిపితే మూడు లక్షలు జమయ్యాయి. మొదటి ఏడాది ఫీజు ఆరులక్షల్లో సగం ఫీజు కట్టాను. రెండవ ఏడాదిలో ఉండగా మరో మూడు లక్షలు కట్టాను. రెండవ ఏడాది ఫీజు కట్టాల్సిన సమయంలో అమ్మకు యాక్సిడెంట్ అయింది. ఫీజు కోసం సమకూర్చుకున్న డబ్బు వైద్యానికి అయిపోయింది. కాలేజ్ ప్రొఫెసర్లు ప్రత్యేక అనుమతి ఇవ్వడంతో ఫీజు కట్టకనే పరీక్షలు రాయగలిగాను. ఇంతలో కరోనా రూపంలో మరో ఉత్పాతం వచ్చి పడింది. కాలేజ్ యాజమాన్యం స్టూడెంట్స్ అందరినీ వారి దేశాలకు పంపించి వేసింది. నేను ఇండియాకి వచ్చిన తర్వాత కోవిడ్ వచ్చింది. నా వైద్యం కోసం మళ్లీ అప్పులు. ఐదు లక్షలు ఖర్చయ్యాయి. – వాకా మంజులారెడ్డి -
నా పిల్లలకింత విషం ఇవ్వండి
ఇండోర్: కరోనా వైరస్ ప్రజల ప్రాణాలు తీస్తుంటే ... లాక్డౌన్ కొందరి ఉపాధికి ఉరి వేస్తోంది. క్లిష్ట సమయంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ఉదాసీనత ప్రదర్శిస్తున్నాయి. ఫలితంగా చేయడానికి పని లేక .. తినడానికి తిండి లేక ఎంతో మంది సతమతం అవుతున్నారు. కరోనా రక్కసి తెచ్చిన ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ... ఇంత విషం ఇవ్వండి నాకు, నా పిల్లలకు అంటూ ఆవేదనతో కూడిన ఆగ్రహం వ్యక్తం చేశాడు ఓ తండ్రి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. నా వల్ల కావట్లేదు ఇండోర్‌కి చెందిన ఓ వీధి వ్యాపారి బండి మీద మామిడి పళ్లు అమ్ముతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇండోర్‌లో ఏ మూలకు బండి పెట్టిన ఎవరో ఒక అధికారి వచ్చి అక్కడ నుంచి బండి తీయమంటున్నారు. మరోవైపు ఎండుకు మామాడి కాయలు వాడిపోతున్నాయి. కడుపులో పేగులు ఎండిపోతున్నాయి. ఇంతలో మున్సిపల్ అధికారులు వచ్చి మళ్లీ మామిడి పళ్ల బండి తీయాలంటూ చెప్పడంతో విసిగిపోయాడా చిరు వ్యాపారీ. చుట్టుముట్టిన కష్టాలను తట్టుకోలేక ...నాకింత విషం ఇవ్వండి నేను, నా పిల్లలు తాగి చనిపోతానంటూ బండిపై ఉన్న మామిడి కాయలన్నీ రోడ్డుపైనే పడేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది. దీంతో అతన్ని ఆదుకునేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. దిక్కుతోచని స్థితిలో కరోనా కేసులు కంట్రోల్ కాకపోవడంతో మధ్యప్రదేశ్‌లో లాక్డౌన్ విధించారు. అంతకు రెండు నెలల ముందే ఆ రాష్ట్ర వాణిజ్య రాజధాని ఇండోర్‌లో కర్ఫ్యూని అమలు చేశారు. దీంతో మూడు నెలలుగా ఇండోర్‌లో ఉన్న వీధి వ్యాపారులకు సరైన బేరాలు లేక ఇక్కట్లు పడుతున్నారు. లాక్డౌన్ నుంచి వెసులుబాటు ఉన్న కొద్ది సమయంలో వ్యాపారం చేసుందామని ప్రయత్నిస్తే అధికారులు అడ్డుతగులుతున్నారు. దీంతో దిక్కు తోచని స్థితిలోకి వీధి వ్యాపారులు నెట్టివేయబడుతున్నారు. -
రాయచోటి మున్సిపల్ చైర్మన్‌గా కూరగాయల వ్యాపారి
రాయచోటి: రాయచోటి మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన ఓ కూరగాయల వ్యాపారి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కష్టనష్టాలకు ఓర్చి మున్సిపల్ చైర్మన్‌గా అతడు ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకంగా మారింది. వివరాల్లోకి వెళితే.. రాయచోటికి చెందిన షేక్ బాష డిగ్రీ వరకు చదువుకున్నారు. ఉద్యోగం దొరక్కపోవటంతో గ్రామంలోనే కూరగాయలు అమ్ముతూ జీవనం కొనసాగిస్తున్నారు. స్థానికంగా ప్రజల్లో మంచి పేరున్న షేక్ భాషకు వైఎస్సార్ సీపీ మున్సిపాలిటీ ఎన్నికలలో కౌన్సిలర్ టికెట్ ఇచ్చింది. దీంతో ప్రజలు షేక్ బాషను గెలిపించారు. గురువారం రాయచోటి మున్సిపాలిటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా షేక్ బాష సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తన జీవితంలో ఇలాంటి అవకాశం వస్తుందని ఊహించలేదన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వెనుకబడిన వర్గాల వారికి అధిక శాతం సీట్లు కేటాయించిందని పేర్కొన్నారు. ఈ మున్సిపాలిటీ, కార్పోరేషన్ ఎన్నికలలో వైఎస్సార్ సీపీ 86కు గాను, 84స్థానాలలో విజయకేతనం ఎగరవేసిందని అన్నారు. ఈ ఎన్నికలలో మహిళలకు 60.47 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ ,వెనుకబడిన వర్గాల వారికి 78 శాతం పోస్టులను కేటాయించడం గొప్ప విషయమని కొనియాడారు. చదవండి: ఏపీ: కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లు వీరే.. -
కుక్క పిల్ల దవడ విరిగేలా కొట్టి..
పుణె : వీధి కుక్కల సంరక్షణకు పుణె మున్సిపల్ కార్పోరేషన్ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వటం లేదు. పుణె నగరంలో రోజురోజుకు వీధి కుక్కలపై దాడులు పెరిగిపోతున్నాయి. ఒక నెల కాలంలో దాదాపు 20 కుక్కలకు విషమిచ్చి చంపారు కొందరు. కుక్క పిల్లలన్న జాలి కూడా లేకుండా దాడులకు తెగబడుతున్నారు. కూరగాయలు అమ్ముకునే వ్యక్తి కుక్క పిల్లను ఇనుప రాడ్‌తో దవడ విరిగేలా కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ సంఘటన పుణెలోని బావ్ పాటిల్ రోడ్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బావ్ పాటిల్ రోడ్‌లోని గణపతి దేవాలయం సమీపంలో జూలై 4న సలీమ్ షేక్ అనే కూరగాయల వ్యాపారస్తుడు రెండు నెలల కుక్క పిల్లపై దాడికి తెగబడ్డాడు. ఓ వ్యక్తి కుక్క పిల్లను విచక్షణా రహితంగా కొడుతున్నాడన్న సమాచారం అందుకున్న జంతు హక్కుల కార్యకర్త నికితా కదమ్ అక్కడకు చేరుకుంది. కుక్క పిల్లపై జరుగుతున్న దాడిని అడ్డుకున్న ఆమె అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. గాయపడ్డ కుక్క పిల్లను ఆస్పత్రికి తరలించగా దవడ భాగం విరిగినట్లు వైద్యులు తెలిపారు. ఏప్రిల్ నెలలో ఇటుకతో 8నెలల కుక్క పిల్లపై ఓ వ్యక్తి దాడి చేయగా కంటిని కోల్పోయింది. వీధి కుక్కలపై దాడులు పెరిగిపోతుండటంపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
డోన్‌లో ఘర్షణ.. యాసిడ్ తాగిన చిరువ్యాపారి!
సాక్షి, కర్నూలు: డోన్‌లో చిరువ్యాపారల మధ్య ఆదివారం ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణ చినికిచినికి ఓ వ్యాపారి మృతికి కారణమైంది. వివరాలివి.. తోటి వ్యాపారులతో గొడవ నేపథ్యంలో వరదరాజులు అనే చిరువ్యాపారి రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించారు. అయితే, అతనికి రక్షణ కల్పించాల్సిన పోలీసులే.. అడ్డం తిరిగి చితకబాదినట్టు తెలుస్తోంది. దీంతో మనస్తాపం చెందిన వరదరాజులు యాసిడ్ తాగి.. ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. -
బలవంతంగా నోట్లో యూరిన్ పోశారు!
రోజు రోజుకూ మానవత్వం మంటకలసి పోతోంది. అమానుషం కోరలు చాస్తోంది. సాటి మనిషిని భరించలేని తనం రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తోంది. ఓ కూరగాయల వ్యాపారిపై ఉత్తర ప్రదేశ్ లో జరిగిన దారుణ ఘటన అదే రుజువు చేస్తోంది. ఉత్తర ప్రదేశ్ ఆగ్రా నగరానికి దగ్గరలోని ఎత్మద్ పూర్ గ్రామంలో ఘోరం చోటు చేసుకుంది. ఓ కూరగాయల వ్యాపారి నోట్లో ఐదుగురు వ్యక్తులు బలవంతంగా యూరిన్ పోసిన ఘటన కాస్త ఆలస్యంగా వెలుగుచూసింది. భాయీ సాబ్ కాస్త తప్పుకొని దారివ్వండి అంటూ బాధితుడు అడగడమే తప్పయిపోయింది. స్థానికంగా కూరగాయల వ్యాపారం చేసుకుంటున్న నిరోత్తమ్ ఖాన్ ఆదివారం ఇంటికి వచ్చే సమయంలో ఓ సమాజ్ వాదీ పార్టీ జిల్లా యూనిట్ ఇంఛార్జి తోపాటు ఐదుగురు వ్యక్తులు తాను దారి అడిగినందుకు కొట్టడమే కాక తన నోట్లో బలవంతంగా యూరిన్ పోశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తనకు కాస్త దారివ్వమంటూ పున్నీఖాన్ ను అడగడమే తప్పయిపోయిందని, ఆగ్రహించిన అతడు తన బంధువులతోపాటు తనపై దాడి చేయడమే కాక తన నోట్లో యూరిన్ పోశారని నిరోత్తమ్ ఆందోళన వ్యక్తం చేశాడు. దాడి సమయంలో తనకు ఎటువంటి సహాయం దొరకకపోవడంతో దిక్కులేని స్థితిలో ఊరుకున్న బాధితుడు... బుధవారం కొంతమంది సహాయంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. -
19 నుంచి జాతీయ విక్రేత అభివృద్ధి ప్రదర్శన!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కేంద్ర సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) మంత్రిత్వ శాఖ, మహిళా పారిశ్రామికవేత్తల సమాఖ్య సంయుక్తం ఆధ్వర్యంలో ఈనెల 19, 20 తేదీల్లో జాతీయ విక్రేత అభివృద్ధి ప్రదర్శన (నేషనల్ వెండర్ డెవలప్మెంట్ ఎగ్జిబిషన్) జరగనుంది. కుషాయిగూడలోని ఎన్ఎస్ఐసీ బిజినెస్ పార్క్ ఈ ప్రదర్శన జరగనుంది. ఈ ఎగ్జిబిషన్లో దక్షిణ మధ్య రైల్వే, విశాఖ స్టీల్ ప్లాంట్, బీహెచ్ఈఎల్, ఎన్ఎండీసీ, ఎన్జీసీ, బీడీఎల్, గెయిల్, ఎన్టీపీసీ వంటి సుమారు 200లకు పైగా ప్రభుత్వం సంస్థలు పాల్గొంటాయి. -
చెట్నీ అడిగితే 'పచ్చడి' కింద కొట్టాడు
న్యూఢిల్లీ: హోటల్లో అయినా.... రోడ్డు పక్కన బండి దగ్గర టిఫిన్ చేస్తూ... కొంచెం పచ్చడి వేయమంటే మళ్లీ ఎవరైనా వేస్తారు. అది సహజం. కానీ చేస్తున్న టిఫిన్‌లో మరోసారి పచ్చడి వేయమని అడిగి... కాకా హోటల్ యజమాని ఆగ్రహానికి గురైన ఓ వ్యక్తి ఆసుపత్రి ఐసీయూలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ సంఘటన తూర్పు న్యూఢిల్లీలోని త్రిలోక్ పూరి బ్లాక్ 31లో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. సన్నీ అనే యువకుడు అతని స్నేహితులు రోడ్డు పక్కనే ఉన్న కాకా హోటల్లో టిఫిన్ తింటున్నారు. ఆ క్రమంలో సన్నీ ప్లేట్లో పచ్చడి అయిపోయింది. మళ్లీ పచ్చడి కావాలని హోటల్ యజమాని కమల్ని కోరాడు. దాంతో కమల్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సన్నీపై ఐరన్ రాడ్‌తో దాడి చేసి... విచక్షణరహితంగా కొట్టి 'పచ్చడి' చేశాడు. దాంతో అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతడి స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కమల్‌పై కేసు నమోదు చేశారు. సన్నీని చికిత్స నిమిత్తం లాల్ బహదూర్ శాస్త్రీ ఆసుపత్రికి తరలించారు. అయితే మరింత మెరుగైన వైద్య చికిత్స కోసం అతడిని మరో ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. దాంతో అతడిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాగా పచ్చడిని సన్నీ వృద్ధా చేశాడని... అలా చేయవద్దని చెప్పినందుకు అతడితోపాటు అతడి స్నేహితులు తనతో ఘర్షణకు దిగారని కమల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతే కాకుండా అతడి స్నేహితులకు ఫోన్ చేస్తే.. వారు కూడా వచ్చి తనతో వాదనకు దిగారని ఆ ఫిర్యాదులో కమల్ పేర్కొన్నాడు. దాంతో సన్నీపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.