
సాక్షి, కర్నూలు: డోన్‌లో చిరువ్యాపారల మధ్య ఆదివారం ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణ చినికిచినికి ఓ వ్యాపారి మృతికి కారణమైంది. వివరాలివి.. తోటి వ్యాపారులతో గొడవ నేపథ్యంలో వరదరాజులు అనే చిరువ్యాపారి రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించారు. అయితే, అతనికి రక్షణ కల్పించాల్సిన పోలీసులే.. అడ్డం తిరిగి చితకబాదినట్టు తెలుస్తోంది. దీంతో మనస్తాపం చెందిన వరదరాజులు యాసిడ్ తాగి.. ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.
Comments
Please login to add a commentAdd a comment