ఆన్‌లైన్‌ కంటే తక్కువ ధరకే!.. పోస్ట్‌ వైరల్‌ | Bengaluru Vendor Challenge To Quick Commerce Giants Goes Viral | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ కంటే తక్కువ ధరకే ఇస్తున్నా.. వ్యాపారి పోస్ట్‌ వైరల్‌

Published Sat, Nov 9 2024 6:57 PM | Last Updated on Sat, Nov 9 2024 9:19 PM

Bengaluru Vendor Challenge To Quick Commerce Giants Goes Viral

బెంగళూరు నగరానికి చెందిన ఒక కొబ్బరి బొండాల వ్యాపారి.. జెప్టో, బ్లింకిట్, బిగ్ బాస్కెట్ వంటి వాటికి సవాలు విసిరారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ వ్యాపారి విసిరినా సవాల్ ఏమిటి? దీనిపై నెటిజన్లు ఎలా స్పందిస్తున్నారు అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులో.. కొబ్బరి బోండాం రేటు జెప్టోలో రూ. 80, బ్లింకిట్‌లో రూ. 80, బిగ్‌బాస్కెట్‌లో రూ. 70 ఉంది. కానీ వ్యాపారి కేవలం రూ. 55కే కొబ్బరి బోండాం అంటూ వెల్లడించారు. ఈ పోస్ట్ చూసిన చాలామందిలో చర్చ మొదలైంది. యాప్‌లు వ్యసనంగా మారితే వస్తువులు ఖరీదైనవిగా మారతాయని నెటిజన్లు పేర్కొంటున్నారు.

క్విక్ కామర్స్ సైట్‌లు ఎప్పుడూ ధరలను భారీగా పెంచుతాయి. ప్రజల సమయాన్ని, సౌకర్యాలను బట్టి బిల్లు వేస్తాయి. వీటిపైనే ఆధారపడితే భవిష్యత్తులో ఖర్చులు భారీగా పెరుగుతాయి. జొమాటో, స్విగ్గీ వంటి వాటిని తొలగించినప్పటి నుంచి నా ఖర్చులు చాలా తగ్గాయని ఒక నెటిజన్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: రెండో ఆదాయంపై కన్నేసిన సినీతారలు: అందరి చూపు అటువైపే..

క్విక్ కామర్స్ సైట్‌లలో మోసాలు కూడా విపరీతంగా జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ధన త్రయోదశి సందర్భంగా ఒక నెటిజన్ బ్లింకిట్ ద్వారా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నుంచి 1 గ్రాముల బంగారు నాణెం, 10 గ్రాముల వెండి నాణెం ఆర్డర్ చేసినప్పటికీ 0.5 గ్రాముల బంగారు నాణెం వచ్చినందుకు మోసపోయానని ఆరోపించాడు. ఇలా నెటిజన్లు ఎవరికితోచిన విధంగా వారు కామెంట్స్ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement