Chinese Man Buys And Destroys Vendor's Noodles After Insult - Sakshi
Sakshi News home page

ఇగో హర్ట్ అయితే.. అట్లుంటది మరి! రూ. 100తో పోయేదాన్ని రూ. 9వేలు ఖర్చు చేసి..

Published Mon, Aug 7 2023 6:49 PM | Last Updated on Mon, Aug 7 2023 7:53 PM

Chinese Man Buys And Destroys Vendor's Noodles After Insult - Sakshi

ఎక్కడైనా ధర దగ్గర భేరమాడటం సహజమే.. అయితే.. కొన్నిసార్లు అడిగిన ప్రతి ఒక్కరికీ ధరను చెప్పలేక వ్యాపారి విసిగిపోవడమూ అప్పుడప్పుడు చూస్తుంటాం. అయితే.. ఇదే వ్యవహారంపై చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్ లో  విచిత్రమైన సంఘటన జరిగింది.  కొనలేకపోతే వెళ్లిపోండని కసురుకున్న వ్యాపారికి తిక్క కుదిర్చాడో వ్యక్తి. రూ. 9 వేలు పెట్టి ఖరీదు చేసి వ్యాపారి అమ్ముతున్న న్యూడుల్స్‌ని కిందపడేసి ధ్వంసం చేశాడు. 

వీడియోలో చూపిన విధంగా కొనుగోలుదారుడు వ్యాపారి వద్దకు వెళ్లాడు. న్యూడుల్స్ ధర ఎంత అని అడుగుతాడు. ఒక కప్ న్యూడుల్స్‌కు రూ.164 అని అతడు చెబుతాడు. ఎందుకు అంత ధర చెబుతున్నారని కస్టమర్ ప్రశ్నిస్తాడు. న్యూడుల్స్ లో వాడుతున్న ముడి సరకులు ఎంటో చెప్పాలని అడుగుతాడు. దానికి వ్యాపారి రెండు గుడ్లుతో సహా వాడే ముడి పదార్థాలను వివరిస్తాడు. విన్న తర్వాత దానికే మరీ ఇంత రేటా? అని కస్టమర్ అనగానే పక్కనే ఉన్న వ్యాపారి కొడుకు లేచి ఆర్థిక స్తోమత లేకపోతే వెళ్లిపోవాలని కసురుకుంటాడు.

దీంతో ఆగ్రహానికి గురైన కస్టమర్ వ్యాపారిపై విచిత్రంగా ప్రవర్తించాడు. వ్యాపారి వద్ద ఉన్న అన్ని న్యూడుల్స్‌ కు రూ.9,920 వెచ్చించి కొనుగోలు చేస్తాడు. ఆ తర్వాత అన్నింటిని పనికిరానివాటిగా పరిగణిస్తూ కిందపడేస్తాడు. కాలితో తొక్కుతూ నన్నే అవమానిస్తావా? అని అంటాడు. వ్యాపారి కుమారుడు క్షమాపణలు కోరుకున్నా ఫలితం లేకపోయింది.

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెట్టారు. ఇగో హర్ట్ అయితే ఇలాగే ఉంటది? అంటూ కామెంట్లు పెట్టారు. వ్యాపారి తిట్టినందుకు బహుమతిగా రూ.9 వేలు ఇచ్చావా? సరిపోయిందా? అంటూ ఫన్నీగా రెస్పాండ్ అయ్యారు. 

ఇదీ చదవండి: డబ్ల్యూడబ్ల్యూఈ స్టైల్‌లో ఫైటింగ్.. సెక్యూరిటీ గార్డ్‌పై మరీ ఇంత దారుణమా..? వీడియో వైరల్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement