Noodles
-
ఇన్స్టంట్ నూడుల్స్ మంచివి కావా? తింటే ఫుడ్ పాయిజనింగ్ అవుతుందా?
ఇటీవలకాలంలో ఇన్స్టంట్ ఫుడ్ ఐటెమ్స్‌కి ప్రివరెన్స్ ఇస్తున్నారు చాలామంది. ఈ ఉరుకులు పరుగులు జీవితంతో ఏదో స్పీడ్‌గా తయారయ్యే ఇన్స్టంట్ రెసిపీలు వండుకుని తినేసి హమ్మయ్యా..! అనుకుంటున్నారు. ఇది ఆరోగ్యానికి మంచిదా? కాదా? అన్నది ముఖ్యం కాదు. కేవలం ఆకలి తీరిపోతే చాలు అన్నట్లుగా రెడీమేడ్ ఫుడ్‌పై ఆధారపడుతున్నారు జనాలు. ముఖ్యంగా ఇన్స్టంట్ నూడుల్స్ లాంటివి అయితే ప్రజలు ఎగబడి మరీ తింటున్నారు. కానీ ఇలాంటి నూడుల్స్ మరింత ప్రమాదమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారుఫుడ్ పాయిజనింగ్‌కి దారితీస్తుందా..మాములు న్యూడిల్స్‌లా కాకుండా దీనిలో ఆయిల్‌తో సహా అన్ని ఇన్‌గ్రేడియంట్స్ మిక్స్ చేసి ఉంటాయి. జస్ట్ దాన్ని తీసి గిన్నెలో వేసుకుని వేడి చేసుకుంటే చాలు న్యూడిల్స్ రెడీ అంతే..అయితే దీనిలో అన్ని ఇన్‌గ్రేడియంట్స్ ఉండటంతో తటస్థ పీహెచ్ స్థాయిలు ఎక్కుకవగా ఉంటాయి. అందువల్ల దీనిలో ఈజీగా బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఫుడ్ పాయిజినింగ్ దారితీసే స్థాయికి చేరుకుంటుంది. దీనిలో నీరు, ఉప్పు, మసాలా జత చేసి ఉంటాయి. అందువల్ల తొందరగా పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి ఆల్కలీన్ కూడా జోడించడం జరుగుతుంది. నిజానికి దీనిలో ఫైబర్, విటమిన్ల, ప్రోటీన్లు చాలా తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ ఇన్స్టెంట్ న్యూడిల్స్‌లో ఎక్కువ సోడియంతో ప్యాక్‌చేయడం జరుగుతంది. ఇది శరీరానిక అస్సలు మంచిది కాదు. ఇలాంటివి తీసుకుంటే దీర్ఘకాలిక తలనొప్పి, అధిక రక్తపోటు, వికారం, దడ, విరేచనాలకు దారితీసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఫుడ్ పాయిజనింగ్ అంటే..ఫుడ్ పాయిజనింగ్ అనేది బ్యాక్టీరియా, ఫంగస్, పరాన్నజీవి లేదా వైరస్ వంటి వాటి వల్ల కలుషితమైన ఆహార తీసుకోవడం వల్ల జరుగుతుంది. దీంతో బాధితుడికి వాంతులు, విరేచనాలు, జ్వరం వంటి సమస్యలు వస్తాయి. నార్మల్‌గా అయతే రెండు రోజల్లో మెరుగయ్యి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి వెళ్లిపోతారు రోగులు. ఒక్కోసారి శరీరం అధిక స్థాయిలో నీటిని కోల్పోయి ఈ ఫుడ్ పాయిజనింగ్ కాస్త ప్రాణాంతకంగా మారుతుంది. అంతేగాదు ప్రతి ఏడాది ఇలాంటి అసురక్షిత ఆహారం వల్ల దాదాపు 600 మిలియన్ల మంది ఆహార సంబంధత వ్యాధులు బారినపడుతున్నారని, సుమారు 4 లక్షలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయని నివేదికల్లో వెల్లడయ్యింది. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లలో దాదాపు 30%నికి పైగా పిల్లలు ఫుడ్ పాయిజనింగ్ వల్లే చనిపోతున్నట్లు పేర్కొంది. ఎవరికీ ఎక్కువ ప్రమాదం అంటే..గర్భిణి స్త్రీలుదీర్ఘకాలిక వ్యాధులతో బాధుపడుతున్న వారు రోగనిరోధక శక్తి తక్కు ఉన్నవారువృద్ధులు, చిన్నపిల్లలుతీసుకోవాల్సిన చర్యలు..ఆహార పదార్థాలు తాజాగా ఉండేలా చూసుకోవడం. పాడవ్వకుండా ఉండేలా మంచి పద్ధతిలో నిల్వ చేయడం వంటివి చేయాలి.పచ్చి కూరగాయాలతో చేసే ఆహారపదార్థాలను నిల్వ చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలిపచ్చిమాంసం, గుడ్లను, ఒక్కసారి క్రాస్ చెక్‌చేసుకుని సరైన ఉష్ణోగ్రత వద్ద ఉడికించాలి. అలాగే ఉడికించిన రెండు గంటల్లోపు తయారు చేసుకున్న రెసిపీలను ఫ్రిజ్‌లో ఉంచుకోండి.(చదవండి: వీల్‌చైర్‌కి పరిమితమైన వెనక్కి తగ్గలేదు..వ్యాపారవేత్తగా..!) -
నూడుల్స్‌లో డైమండ్స్ : ఏం తెలివితేటలు రా అయ్యా!
బంగారం, విలువైన వజ్రాలను అక్రమంగా రవాణా చేసేందుకు కేటుగాళ్లు అనుసరిస్తున్న పద్దతులు అధికారులను సైతం విస్మయపరుస్తున్నాయి. కానీ చివరకుఅధికారుల తనిఖీల్లో అడ్డంగా దొరికి పోతున్నారు. తాజాగా ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ డిపార్ట్మెంట్ కోట్లరూపాయల విలువైన వజ్రాలను, బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. ముఖ్యంగా నూడుల్స్ ప్యాకెట్లలో డైమండ్స్ దాచిన తీరు హాట్ టాపిక్‌గా నిలిచింది. ముంబైనుంచి బ్యాంకాక్‌కు వెళ్తున్న భారతీయుడు ట్రాలీ బ్యాగ్‌లో నూడుల్స్ ప్యాకెట్లో డైమండ్లను తరలిస్తూ గుట్టుగా అధికారుల కన్నుగప్పాలని చేశాడు. కానీ తనిఖీల్లో అడ్డంగా బుక్కయ్యాడు. రూ.2.02 కోట్ల విలువైన 254.71 క్యారెట్ల నేచురల్ లూజ్ డైమండ్, 977.98 క్యారెట్ ల్యాబ్ గ్రోన్ డైమండ్ లభ్యమయ్యాయి.మరో ఘటనలో కొలంబో నుండి ముంబైకి ప్రయాణిస్తున్న ఒక విదేశీ మహిళను తనిఖీ చేయగా ఆమె లోదుస్తుల లోపల దాచిన 24 క్యారెట్ల గోల్డ్ బిస్కట్లు కనుగొన్నారు. వీటి మొత్తం బరువు 321గ్రాములు. మరో వైపు ఫేస్ మాస్క్‌లోనూ డైమండ్స్ తరలిస్తున్నట్లు గుర్తించారు. దుబాయ్ నుంచి ఇద్దరు, అబుదాబి ఇద్దరు, బహ్రెయిన్ ఇద్దరు, దోహానుఎంచి ఇద్దరు రియాద్ ఇద్దరు మస్కట్ బ్యాంకాక్ ,సింగపూర్ నుంచి ఒక్కొక్కరు చొప్పున 10 మంది అనుమానితులను తనిఖీ చేయగా, రెక్టమ్, ఇతర శరీర భాగాల్లో దాచిన రూ.4.04 కోట్ల విలువైన 6.199 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మొత్తం గా 13 వేర్వేరు కేసుల్లో రూ.6.46 కోట్ల విలువైన అక్రమ రవాణా బంగారం, డైమండ్స్,తదితరాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేశారు.During 19-21 April, 2024, Airport Commissionerate, Mumbai Customs Zone-III seized over 6.815 Kg Gold valued at Rs. 4.44 Cr & Diamonds valued at Rs. 2.02 Cr total amounting to Rs. 6.46 Cr across 13 cases. Diamonds were found concealed in noodle packets. Four pax were arrested. pic.twitter.com/j5wAPV5jAk— Mumbai Customs-III (@mumbaicus3) April 22, 2024#WATCH | Maharashtra: During 19-21 April, 2024, Mumbai Customs seized over 6.815 Kg of gold valued at Rs 4.44 crores and diamonds valued at Rs 2.02 crores, total amounting to Rs 6.46 crores across 13 cases. Diamonds were found concealed in noodle packets. Four Passengers were… pic.twitter.com/02LzDS1aDZ— ANI (@ANI) April 22, 2024 -
పసివాళ్ల ఆహారంతో ఆటలా!
తొమ్మిదేళ్లనాటి మ్యాగీ నూడిల్స్ వివాదం నుంచి బయటపడి రెండు వారాలు గడిచాయో లేదో... నెస్లే కంపెనీ మెడకు కొత్తగా సెరిలాక్ తగువు చుట్టుకుంది. ఈసారి దీని మూలం మన దేశంలో కాదు, స్విట్జర్లాండ్‌లో వుంది. భిన్న రకాల ఉత్పత్తుల ద్వారా లాభాల రూపంలో ఏటా వేలాదికోట్ల రూపాయలు తరలించుకుపోతున్న బహుళజాతి సంస్థలకు ఇక్కడి ప్రజల ఆరోగ్యం విషయంలోగానీ... ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలపైగానీ పెద్దగా పట్టింపు వుండదని చాలామంది చేసే ఆరోపణ. అడపా దడపా వెల్లడవుతున్న అంశాలు వాటిని బలపరిచేవిగానే వుంటున్నాయి. భారత్‌లో పసివాళ్ల ఆకలి తీర్చడానికి తల్లులు ఉపయోగించే సెరిలాక్లో అధిక శాతం చక్కెరవుంటున్నదని స్విట్జర్లాండ్‌లోని స్వచ్ఛంద సంస్థ ‘పబ్లిక్ ఐ’ మరో సంస్థ అంతర్జాతీయ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్వర్క్ (ఐబీ–ఫాన్)తో కలిసి గురువారం బయటపెట్టాక దేశం నివ్వెరపోయింది. నెస్లే సంస్థ ఒక్క భారత్‌లో మాత్రమే కాదు, యూరప్ దేశాలతోపాటు ఆఫ్రికా, లాటిన్ అమెరికా, దక్షిణాసియా దేశాల్లో కూడా సెరిలాక్ విక్రయిస్తోంది. కానీ యూరప్ దేశాల పిల్లల కోసం తయారుచేసే సెరిలాక్కూ, వేరే దేశాల్లో విక్రయించే సెరిలాక్కూ చాలా వ్యత్యాసం వుంది. యూరప్ దేశాల్లో విక్రయించే సెరిలాక్లో అసలు చక్కెర పదార్థాలే వాడని నెస్లే... ఇతరచోట్ల మాత్రం యధేచ్ఛగా వినియోగిస్తున్నట్టు ‘పబ్లిక్ ఐ’ తెలిపింది. మూడేళ్లలోపు పిల్లలు తినే ఆహార పదార్థాల్లో కృత్రిమంగా తీపిని పెంచే సుక్రోజ్, ఫ్రక్టోజ్ వంటి పదార్థాలేవీ కలపరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసింది. పసిపిల్లల ఆహారోత్పత్తుల్లో కృత్రిమ తీపి పదార్థాలు, అదనపు చక్కెర వుండరాదన్నది 2022 సంవత్సర ప్రధాన నినాదం కూడా. కానీ దురదృష్టమేమంటే మన దేశం వాటి వినియోగాన్ని అనుమతిస్తోంది. తమ చిన్నారులకు అవసరమైన ప్రొటీన్లు, విటమిన్లు, ఐరన్ తదితర పోషకాలు లభిస్తాయన్న ఆశతో తల్లులు సెరిలాక్ వంటి ఉత్పత్తులను ఆశ్రయిస్తారు. గత అయిదేళ్లుగా సెరిలాక్లో కృత్రిమ తీపి పదార్థాల వాడకాన్ని 30 శాతం తగ్గించామని నెస్లే కంపెనీ తాజా వివాదం తర్వాత సంజాయిషీ ఇస్తోంది. మంచిదే. కానీ అసలు వాడరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్నప్పుడు ఈ తగ్గించటమేమిటి? ఇన్ని దశాబ్దా లుగా వాటిని ఎందుకు కొనసాగించినట్టు? ఇది తప్పించుకునే ధోరణి కాదా? నెస్లే సంస్థ సంగతలావుంచి అసలు మన దేశంలో అమ్ముడవుతున్న బహుళజాతి సంస్థల ఉత్పత్తుల్లో తగిన ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో చూసి నియంత్రించాల్సిన ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఐ) ఏమైనట్టు? ఎక్కడో స్విట్జర్లాండ్‌లోని స్వచ్ఛంద సంస్థలు వివిధ దేశాల్లో విక్రయించే సెరిలాక్ ఉత్పత్తుల నమూనాలను సేకరించి నిగ్గుతేల్చే వరకూ ఆ సంస్థ గాఢ నిద్రపోయిందా అనే సందేహం రావటం సహజం. పసివాళ్లకు అందించే ఆహారంలో పరిమితికి మించి చక్కెర లేదా ఉప్పు ఎక్కువైతే వారి ఆరోగ్యానికి ఎంతో హాని కలుగుతుందనీ, చిన్న వయసునుంచే తీపి పదార్థాలకు వారు అలవాటుపడతారనీ నిపుణులంటారు. ఈ పదార్థాలు ఊబకాయాన్ని పెంచుతాయని, పిల్లలు శ్వాసకోశ వ్యాధులు, గుండె సంబంధ వ్యాధులు, కేన్సర్, మధు మేహంవగైరా వ్యాధులకు లోనవు తారని హెచ్చరిస్తారు. మన పిల్లల్లో ఇటీవలకాలంలో ఊబకాయం లక్షణం పెరుగుతున్నదని అనేక సర్వేలు గొంతు చించుకుంటున్నాయి కూడా. అయినా నియంత్రణ వ్యవస్థల చెవులకు సోకలేదు. ఒక అంచనా ప్రకారం కేవలం సెరిలాక్ అమ్మకాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా నెస్లే సంస్థ ఏటా వంద కోట్ల డాలర్ల (రూ. 8,400 కోట్లు)కుపైగా ఆర్జిస్తోంది. ఇందులో భారత్, బ్రెజిల్ దేశాల వాటాయే 40 శాతం వుంటుందని అంటారు. ఇంతగా లాభాలొచ్చే ఉత్పత్తి విషయంలో తగిన జాగ్రత్తలు తీసు కోవాలనీ, అంతర్జాతీయ ప్రమాణాలు పాటించాలనీ నెస్లేకు తెలియదా? పోనీ అన్నిచోట్లా ఇలానే చేస్తే అజ్ఞానమో, నిర్లక్ష్యమో అనుకోవచ్చు. కానీ ధనిక దేశాల్లో ఒకరకంగా, వర్ధమాన దేశాల్లో మరో విధంగా ద్వంద్వ ప్రమాణాలు పాటించటం ఏ వ్యాపార నీతి? ఆహార ఉత్పత్తులు, శీతల పానీయాలు తదితరాల విషయంలో ఏమరుపాటు పనికిరాదు. వాటిని ఎప్పుడో ఒకసారి పరీక్షించి చూసి వదిలేయకూడదు. నిర్ణీత కాలపరిమితుల్లో నిరంతరం వాటి నమూనాలను పరీక్షిస్తూ వుండాలి. మనం తినే తిండి ఆరోగ్యదాయకమేనా, సురక్షితమేనా అని మాత్రమే కాదు... ఉత్పత్తిదారు చెప్పుకుంటున్నవిధంగా అందులో పోషకాలున్నాయో లేదో గమనించాలి. ప్రమాణాలకు అనుగుణంగా లేనివాటిని నిర్దాక్షిణ్యంగా మార్కెట్ నుంచి తొలగించాలి. ప్రపంచంలో చైనా తర్వాత మన దేశమే అతి పెద్ద మార్కెట్. అందుకే బహుళజాతి సంస్థలు సినీతారలనూ, క్రీడా దిగ్గజాలనూ తమ బ్రాండ్ అంబాసిడర్లుగా రంగంలోకి దించి ప్రకటనలతో ఊదరకొడుతూ అచిరకాలంలోనే లాభాల బాట పడుతుంటాయి. ఆ ఉత్పత్తుల్ని వాడటం ఆధునికతకూ, ఉత్తమాభి రుచికీ నిదర్శనమని బ్రాండ్ అంబాసిడర్లు చెప్తే మోసపోవటానికి మన మధ్యతరగతి ఎప్పుడూ సిద్ధంగా వుంటుంది. 2015లో మ్యాగీ నూడిల్స్‌లో అత్యంత హానికరమైన సీసం, మోనోసోడియం గ్లూటామేట్ వంటి పదార్థాలున్నాయని వెల్లడైనప్పుడు గగ్గోలైంది. తీరా తొమ్మిదేళ్లు గడిచాక జాతీయ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార కమిషన్ మ్యాగీ నూడిల్స్ విషయంలో కేంద్రం నిర్ణయం సరికాదని ఈనెల మొదటివారంలో తోసిపుచ్చింది. నెస్లేకు క్లీన్చిట్ ఇచ్చింది. భవిష్యత్తులో సెరిలాక్ విషయంలోనూ ఇదే జరుగుతుందా? ఇతరత్రా అంశాల మాటెలావున్నా హానికారక ఆహార పదార్థాలు మార్కెట్లోకి రాకుండా చూడాల్సిన కనీస బాధ్యత తమకున్నదని కేంద్ర ప్రభుత్వం గుర్తించటం అవసరం. -
చికెన్ నూడుల్స్ ఇలా చేస్తే..పిల్లలేంటి...పెద్దోళ్లు కూడా!
చికెన్ సూప్ మీద మనసుపోతే రెస్టారెంట్‌కి వెళ్లాల్సిందేనా? ఫైవ్‌స్టార్ హోటల్ రేంజ్లో చికెన్ టిక్కా ఇంట్లో చేయలేమా? పిల్లలు సరదా పడే నూడుల్స్‌కి చికెన్‌ని జోడించలేమా? పిల్లలు ఎంతో ఇష్టంగా ఆరగించే వీటన్నింటినీ ఎలా చేసిపెడితే..పిల్లలేంటి, పెద్దవాళ్లు కూడా చికు బుకు చికు బుకు... చికెనే! అంటూ లాంగించేస్తారు.. మరి ఇంకెందుకు ఆలస్యం..పోషకాల కూరగాయల ముక్కలతోపాటు చికెన్ నూడల్స్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి! చికెన్ నూడుల్స్ కావలసినవి: చికెన్ – 200 గ్రాములు (బోన్‌లెస్); నూడుల్స్ – 150 గ్రాములు; నూనె – 2 టీ స్పూన్లు; ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి; మారినేట్ చేయడానికి .... మిరియాల పొడి– అర టీ స్పూన్; ఉప్పు – పావు టీ స్పూన్; సోయా సాస్ – టీ స్పూన్; గరం మసాలా పౌడర్ – టీ స్పూన్; పోపు కోసం .... వెల్లుల్లి – 2 రేకలు (సన్నగా తరిగినవి); ఉల్లిపాయ ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు; క్యాప్సికమ్ ముక్కలు – పావు కప్పు; క్యారట్ ముక్కలు – పావు కప్పు; క్యాబేజ్ తరుగు – పావు కప్పు; ఉల్లికాడల ముక్కలు – ΄ావు కప్పు; చిల్లీసాస్– టేబుల్ స్పూన్; సోయాసాస్ – టేబుల్ స్పూన్; ఉప్పు – రుచికి తగినంత. తయారీ: ∙చికెన్‌ను సన్నని పొడవు ముక్కలుగా కట్ చేసి శుభ్రం చేసి ఒక పాత్రలో వేసి అందులో మిరియాల ΄÷డి, ఉప్పు, సోయాసాస్, గరం మసాలా పొడి కలిపి మూత పెట్టి పక్కన ఉంచాలి. ∙ఒక పెద్ద పాత్రలో రెండు లీటర్ల నీటిని మరిగించి అందులో నూడుల్స్ వేసి ఉడికించాలి. నూడుల్స్ ఉడుకుతున్నప్పుడే ఆ నీటిలో టీ స్పూన్ నూనె కలపాలి. నూనె కలిపితే నూడుల్స్ తీగలు ఒకదానితో మరొకటి అతుక్కోకుండా విడివడుతుంటాయి. నూడుల్స్ ఉడికిన తరవాత నీటిని వడ΄ోసి నూడుల్స్‌లో మరో టీ స్పూన్ నూనె వేసి కలిపి పక్కన ఉంచాలి. క్యాప్సికమ్, క్యారట్, క్యాబేజ్, ఉల్లిపాయ ముక్కలను ఉడికించి పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి బాణలి పెట్టి టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. అందులో వెల్లుల్లి తరుగు, మారినేట్ చేసి సిద్ధంగా ఉంచిన చికెన్ ముక్కలు వేసి మీడియం మంట మీద వేయించాలి. చికెన్ ఉడికేలోపు నూనె తగ్గిపోయినట్లయితే అరకప్పు నీటిని పక్కన వేడి చేసి చికెన్‌లో కలపాలి. చికెన్ ఉడికిన తరవాత ఆ పాత్రను పక్కన ఉంచాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో బాణలి పెట్టి మిగిలిన నూనె వేడి చేసి ఉల్లికాడల ముక్కలు వేసి వేయించాలి. అవి వేగిన తరవాత ఉడికించి పక్కన పెట్టిన కూరగాయల ముక్కలన్నీ వేసి నిమిషం పాటు వేయించి నూడుల్స్, చికెన్ ముక్కలు, చిల్లీసాస్, సోయాసాస్, ఉప్పు వేసి కలిపి వేడెక్కిన తర్వాత స్టవ్ ఆపేయాలి. అంతే వేడి వేడి చికెన్ నూడుల్స్రడీ..! -
నేపాల్‌లో ఇతడే రిచ్.. సంపద తెలిస్తే అవాక్కవుతారు!
ప్రపంచం కుబేరుడు ఎవరు అంటే 'ఎలాన్ మస్క్' అని, భారతదేశంలో అత్యంత సంపన్నుడెవరు అంటే వెంటనే 'ముఖేష్ అంబానీ' అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మన సమీప దేశమైన నేపాల్‌లో ధనికుడెవరు? అతని సంపద ఏమిటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ప్రస్తుతం నేపాల్‌లో అధిక సంపన్నుడు 'బినోద్ చౌదరి' (Binod Chaudhary) అని తెలుస్తోంది. నేపాల్‌లోని ఖాట్మండులో మార్వాడీ కుటుంబంలో జన్మించిన బినోద్ మొత్తం ఆస్తి విలువ రూ. 14,977కోట్లు అని సమాచారం. బినోద్ చౌదరి తాత నేపాల్‌కు వలస వెళ్లి వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించాడు, ఇదే వ్యాపారం అతని తండ్రికి వచ్చింది. ఆ తరువాత ఈ వస్త్ర వ్యాపారమే అనేక రంగాల్లో అడుగుపెట్టాలా చేసింది. జేఆర్డీ నుంచి ప్రేరణపొంది వ్యాపార సామ్రాజ్యాన్ని క్రమంగా విస్తరించాడు. నిజానికి బినోద్ చౌదరి చదువుకునే రోజుల్లో చార్టర్డ్ అకౌంట్స్ చదవడానికి భారతదేశానికి వెళ్లాలనుకున్నాడు, కానీ తండ్రి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల వ్యాపారాలు చూసుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత వ్యాపార రంగంలో తనదైన రీతిలో ముందుకు వెళ్ళాడు. ఈ నేపథ్యంలో భాగంగా 1990లో సింగపూర్‌లో సినోవేషన్ గ్రూప్ ప్రారంభించారు. ఆ తరువాత వాయ్ వాయ్ నూడుల్స్ ప్రారంభించి మంచి ఆదరణ పొందాడు. ఇదీ చదవండి: ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ సూపర్‌కార్.. జెనీవా మోటార్ షోలో ఇదే స్పెషల్ అట్రాక్షన్! బినోద్ చౌదరి బిజినెస్ మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లింది, దీంతో 1995లో నబిల్ బ్యాంక్‌లో దుబాయ్ ప్రభుత్వ నియంత్రణ వాటాను కొనుగోలు చేశారు. వ్యాపారవేత్తగా మాత్రమే కాకుండా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు ఎక్కువగా విరాళాలు అందిస్తూ ఉంటాడు. ఇందులో భాగంగానే 2015లో భూకంపం వల్ల ధ్వంసమైన పాఠశాలలు, ఇళ్లను పునర్నిర్మించడంలో సహాయం చేయడానికి ఏకంగా రూ. 20 కోట్లకు పైగా విరాళం అందించమే కాకుండా 5,00,000 వాయ్ వాయ్ నూడుల్స్ (Wai Wai Noodles) ప్యాకెట్లు, ఆహారం, నీటిని సరఫరా చేసాడు. -
'నూడిల్స్' మూవీ: అనుకోకుండా ఓ మనిషిని చంపేస్తే?
ఈ మధ్య కాలంలో 'లవ్‌టుడే', 'గుడ్‌నైట్', 'పొర్ తొళిల్' చిత్రాలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై తమిళంలో అనూహ్య విజయం సాధించాయి. మరోవైపు 'అరువి' మూవీతో గుర్తింపు తెచ్చుకున్న మదన్‌కుమార్ ఇప్పుడు దర్శకుడిగా మారిపోయాడు. 'నూడిల్స్' సినిమా తీశాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7 రెండో రోజు హైలైట్స్: అందరితోనూ శోభా గొడవలు.. అడ్డంగా దొరికిపోయిన తేజ!) మదన్ కుమార్ పోలీసు అధికారిగా కీలక పాత్రలో నటించాడు. హరీష్ ఉత్తమన్, షీలారాజ్ కుమార్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ నెల 8న రిలీజ్‌కి రెడీ అయింది. కథ విషయానికొస్తే.. ఓ రోజు రాత్రి ఓ ప్లాట్స్‌లో నివసిస్తున్న వారు మిద్దైపెన ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సమయంలో పహారా కోసం వచ్చిన పోలీసులు వారితో దురుసుగా ప్రవర్తిస్తారు. దీంతో గొడవ జరుగుతుంది. మరోవైపు హీరో అనుకోని పరిస్థితుల్లో ఓ వ్యక్తిని చంపి, తన ఇంట్లో దాచిపెడతాడు. మరి చివరకు ఏమైందనేదే 'న్యూడిల్స్' స్టోరీ. అత్యంత సహజంగా తీసిన ఈ చిత్రాన్ని రోలింగ్ సౌండ్ పిక్చర్స్ పతాకంపై అరుణ్ ప్రకాష్ నిర్మించారు. కాగా చిత్రాన్ని చూసిన నిర్మాత సురేష్ కామాక్షి ఎంతో ఇంప్రెస్ అయ్యి తమిళనాడు విడుదల హక్కులను తీసుకున్నట్లు తెలిపారు. (ఇదీ చదవండి: దివ్యస్పందన మృతి అంటూ వార్తలు.. మండిపడ్డ నటి) -
ఇగో హర్ట్ అయితే.. అట్లుంటది మరి!
ఎక్కడైనా ధర దగ్గర భేరమాడటం సహజమే.. అయితే.. కొన్నిసార్లు అడిగిన ప్రతి ఒక్కరికీ ధరను చెప్పలేక వ్యాపారి విసిగిపోవడమూ అప్పుడప్పుడు చూస్తుంటాం. అయితే.. ఇదే వ్యవహారంపై చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్ లో విచిత్రమైన సంఘటన జరిగింది. కొనలేకపోతే వెళ్లిపోండని కసురుకున్న వ్యాపారికి తిక్క కుదిర్చాడో వ్యక్తి. రూ. 9 వేలు పెట్టి ఖరీదు చేసి వ్యాపారి అమ్ముతున్న న్యూడుల్స్‌ని కిందపడేసి ధ్వంసం చేశాడు. వీడియోలో చూపిన విధంగా కొనుగోలుదారుడు వ్యాపారి వద్దకు వెళ్లాడు. న్యూడుల్స్ ధర ఎంత అని అడుగుతాడు. ఒక కప్ న్యూడుల్స్కు రూ.164 అని అతడు చెబుతాడు. ఎందుకు అంత ధర చెబుతున్నారని కస్టమర్ ప్రశ్నిస్తాడు. న్యూడుల్స్ లో వాడుతున్న ముడి సరకులు ఎంటో చెప్పాలని అడుగుతాడు. దానికి వ్యాపారి రెండు గుడ్లుతో సహా వాడే ముడి పదార్థాలను వివరిస్తాడు. విన్న తర్వాత దానికే మరీ ఇంత రేటా? అని కస్టమర్ అనగానే పక్కనే ఉన్న వ్యాపారి కొడుకు లేచి ఆర్థిక స్తోమత లేకపోతే వెళ్లిపోవాలని కసురుకుంటాడు. దీంతో ఆగ్రహానికి గురైన కస్టమర్ వ్యాపారిపై విచిత్రంగా ప్రవర్తించాడు. వ్యాపారి వద్ద ఉన్న అన్ని న్యూడుల్స్ కు రూ.9,920 వెచ్చించి కొనుగోలు చేస్తాడు. ఆ తర్వాత అన్నింటిని పనికిరానివాటిగా పరిగణిస్తూ కిందపడేస్తాడు. కాలితో తొక్కుతూ నన్నే అవమానిస్తావా? అని అంటాడు. వ్యాపారి కుమారుడు క్షమాపణలు కోరుకున్నా ఫలితం లేకపోయింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెట్టారు. ఇగో హర్ట్ అయితే ఇలాగే ఉంటది? అంటూ కామెంట్లు పెట్టారు. వ్యాపారి తిట్టినందుకు బహుమతిగా రూ.9 వేలు ఇచ్చావా? సరిపోయిందా? అంటూ ఫన్నీగా రెస్పాండ్ అయ్యారు. ఇదీ చదవండి: డబ్ల్యూడబ్ల్యూఈ స్టైల్లో ఫైటింగ్.. సెక్యూరిటీ గార్డ్‌పై మరీ ఇంత దారుణమా..? వీడియో వైరల్.. -
జాన్వీ కపూర్ సమర్పించు... గోచుజాంగ్
జాన్వీ కపూర్ ఫేవరెట్ ఫుడ్... గోచుజాంగ్. ఈ కొరియన్ ఫుడ్ గురించి ఒక యూట్యూబ్ వీడియోలో చవులూరించేలా మాట్లాడింది. లాక్డౌన్ టైమ్‌లో బోలెడు కుకింగ్ వీడియోలు, ట్రావెల్ వీడియోలు చూసింది జాన్వీ, క్విక్ నూడుల్స్ ‘గోచుజాంగ్’ తనను బాగా ఆకట్టుకుంది. అట్టే శ్రమ పడకుండా క్విక్‌గా ఈ నూడుల్స్‌ను తయారు చేయవచ్చు. రకరకాల ప్రోటీన్లు జత చేసి గోచుజాంగ్కు తనదైన హెల్తీ ట్విస్ట్ ఇచ్చింది జాన్వీ. ఈ వంటకం పుట్టుపుర్వోత్తరాలతో పాటు, ఎలా చేయాలి? ఏం వాడాలి... మొదలైన వివరాలు తెలుసుకోవడానికి జాన్వీ అభిమానులతో పాటు భోజన అభిమానులు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. -
నోరూరించే నూడుల్స్‌పై చిరు కప్పలు.. లొట్టలేసుకుంటూ తింటున్న జనం!
మనదేశంలో తయారయ్యే ఫాస్ట్‌ఫుడ్‌లలో అత్యధికంగా అమ్ముడయ్యే ఆహారం నూడుల్స్. దేశంలో ఏ మూల చూసినా నూడుల్స్ దుకాణాలు కనిపిస్తాయి. అయితే ఇటీవలికాలంలో తైవాన్‌లో నూడుల్స్‌తో రూపొందించిన ఒక డిష్ ఎంతో ఆదరణ పొందుతోంది. ప్రపంచంలో రకరకాల ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. మనదేశంలో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లినప్పుడు అక్కడి ఆహారాలలో ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. ఆహార ప్రియులు అన్ని రకాల ఆహారాలను ఆస్వాదించేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. అటు మాంసాహారులు, ఇటు శాకాహారులు తమకు అనువైన వంటకాల కోసం వెదుకుతుంటారు. కొన్ని దేశాల్లో పురుగులు, కీటకాలు, కప్పలు ఆహారంలో భాగంగా మారిపోయాయి. కొన్ని ఆహారాలు ఎంత వింతగా ఉంటాయంటే వాటి గురించి వినగానే ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి విచిత్రమైన ఒక డిష్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిరు కప్పలతో నోరూరించే నూడుల్స్.. తైవాన్‌లో ఇటీవలికాలంలో కప్పల నూడుల్స్ ఎంతో ఆదరణ పొందుతోంది. ఆహార ప్రియులు ఈ నూడుల్స్‌ను తెగ ఎంజాయ్ చేస్తూ లాగించేస్తున్నారు. నోరూరించే వేడివేడి నూడుల్స్‌పై చిరు కప్పలను ఉంచి, సర్వ్ చేయడం ఈ డిష్ ప్రత్యేకత. కప్పలను ఉడికించి, మసాలా దట్టించి.. ఆడిటీ సెంట్రల్ న్యూస్ అందించిన ఒక రిపోర్టు ప్రకారం తైవాన్‌లోని యున్‌లిన్‌లో యువాన్ రమెన్ అనే రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్లో కప్పల నూడుల్స్‌ను ప్రత్యేకంగా తయారుచేస్తారు. ఈ డిష్ ప్రత్యేకత ఏమిటంటే గార్నిషింగ్‌లో కప్పలను వినియోగిస్తారు. ఇందుకోసం కప్పలను ముందుగా బాగా ఉడికించి, వాటికి మసాలా దట్టించి, నూనెలో దోరగా వేయిస్తారు. ఈ డిష్ పేరు ఏమిటంటే.. నూడుల్స్‌పై అప్పటికే మసాలా దట్టించి సిద్ధం చేసిన కప్పలను గార్నిషింగ్ చేస్తారు. కప్పల పైచర్మాన్ని తీయకుండానే ఇందుకోసం వినియోగిస్తారు. సోషల్ మీడియా యూజర్స్ ఈ డిష్‌కు ‘ఫ్రాగ్, ఫ్రాగ్, ఫ్రాగ్ రమెన్’ అనే పేరు పెట్టారు. ధర ఎంతంటే.. మీడియాకు అందిన సమాచారం ప్రకారం రమెన్ రెస్టారెంట్లో ఈ డిష్‌ను కేవలం మంగళవారం, బుధవారం రాత్రి డిన్నర్ సమయాలలో మాత్రమే వడ్డిస్తారు. ఈ విచిత్రమైన డిష్ ఖరీదు 8 అమెరికన్ డాలర్లు. భారత కరెన్సీలో రూ. 650. రెస్టారెంట్‌కు వెళ్లిన ఎవరైనా ఈ డిష్‌కు ఫొటో తీసుకోవాలనుకంటే 3.2 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఈ డిష్‌ను అక్కడి ఆహార ప్రియులు లొట్టలేసుకుంటూ తింటారు. ఇది కూడా చదవండి: చైనాలో మరో అద్భుతం: బిల్డింగ్ మధ్య నుంచి దూసుకుపోయే రైలు.. -
ఫాస్ట్‌ఫుడ్ సెంటర్స్‌లో తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త అంటూ..
వైరల్: మనం రోజూ తినే ఆహారం.. ఎంత హైజెనిక్ అనేది ఊహించలేం. అలాగే ప్రాసెసింగ్ ఫుడ్ విషయంలోనూ ఎలాంటి పద్ధతులు పాటిస్తారు, ఎంత నాణ్యంగా వ్యవహరిస్తారు అని అంచనా వేయడమూ కష్టమే!. ఈ రెండింటి విషయంలో పట్టింపు ఉన్నవాళ్లు బయటి ఫుడ్ల జోలికి పోరనేది వాస్తవం. మరి బయటి ఫుడ్ ఎక్కువగా లాగించే వాళ్ల పరిస్థితి!. అలాంటి వాళ్లను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో తరచూ కొన్ని వీడియోలు, ఫొటోలు కనిపిస్తున్నాయి. వాటిని పట్టించుకోవడం, పట్టించుకోకపోవడం ఇక వాళ్ల వంతు. తాజాగా.. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో నూడుల్స్ తింటున్నారా? అయితే జాగ్రత్త అంటూ ఓ వీడియో నెట్లో వైరల్ అవుతోంది. తయారీ విధానం చూడండి అంటూ ఓ వ్యక్తి ఆ వీడియోను ట్విటర్ ద్వారా వదలడంతో హల్ చల్ చేస్తోంది. ఓ చిన్నఫ్యాక్టరీలో చిన్నస్థాయి రెస్టారెంట్లలో, రోడ్‌సైడ్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో వాడే నూడుల్స్ తయారీ విధానం ఇదంటూ ఓ వ్యక్తి వీడియోను పోస్ట్ చేశాడు. దీంతో ఆహార నాణ్యతపై మరోసారి చర్చ మొదలైంది. ఇది ఎక్కడ ఎప్పుడు తీశారనే దానిపై స్పష్టత లేదు. రకరకాల కామెంట్లు కనిపిస్తున్నాయి. స్టార్ హోటల్స్‌లోనూ ఇంతకంటే దారుణమైన పరిస్థితులు ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. నిత్యం మనం తీసుకునే ఆహారాన్ని అంచనా వేయడం కష్టమని కొందరు.. ఇలాంటి ఆహారం తినకపోవడమే మంచిదంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఆ వీడియోను మీరూ చూసేయండి. When was the last time you had road side chinese hakka noodles with schezwan sauce? pic.twitter.com/wGYFfXO3L7 — Chirag Barjatya (@chiragbarjatyaa) January 18, 2023 -
ఇక ఆపండి ప్లీజ్! నూడుల్స్ తినాలనే ఉత్సాహం చచ్చిపోయింది
-
విషాదం.. ఎలుకల కోసం విషం పూసిన టమాట తిని
ముంబై: ఇంట్లో ఎలుకల బెడదను నివారించడానికి ఉపయోగించిన విషం పూసిన టమాటోను తిని ఓ మహిళ మృత్యువాతపడింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ముంబైలోని పశ్చిమ మలాడ్‌లోని మార్వే రోడ్డు పాస్కల్ వాడీలో శుక్రవారం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉండటంతో వాటిని అరెకట్టేందుకు రేఖాదేవి నిషద్(27) రెండు రోజుల క్రితం టమాటాలకు ఎలుకలమందు పూసి ఉంచింది. ఈ విషయాన్ని పూర్తిగా మర్చిపోయిన రేఖాదేవి రోజువారీ పనుల్లో నిమగ్నమైపోయింది. అయితే ప్రతిరోజు రేఖాదేవికి టీవీ చూసే అలవాటుంది. ఈ క్రమంలో శుక్రవారం టీవీ చూస్తూ ఎలుకల కోసం మందు పెట్టిన టమాటాలను నూడుల్స్ తయారు చేసుకునేందుకు కట్ చేసింది. మందు రాసిన విషయాన్ని మర్చిపోయి టమాటాలను నూడుల్స్‌లో వేసుకొని తినేసింది. కొద్దిసేపటికి అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ అసలు విషయం చెప్పడంతో వైద్యులు చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. చదవండి: గుడ్ న్యూస్.. మంకీపాక్స్ నుంచి కోలుకున్న తొలి బాధితుడు -
8 షేపుల్లో పాస్తా తయారు చేయగలదు.. ఈ డివైజ్‌ధర రూ. 1,990
Food Preparation Equipment: పాస్తా, నూడూల్స్ వంటి ఫాస్ట్‌ఫుడ్ రుచులకు పిల్లలే కాదు పెద్దలు కూడా ఫిదా అవుతుంటారు. మరి ఆ రుచులను నిత్యం బయట కొనుక్కుని.. లేనిపోని ఆరోగ్య సమస్యలు తెచ్చుకునేకంటే ఇంటి పట్టునే చేసుకుంటే రుచికి రుచి.. శుచికి శుచి కదా! అందుకే ఈ డివైజ్. కావల్సిన ఇంగ్రీడియన్స్ సిద్ధం చేసుకుంటే చాలు.. మొత్తంగా 8 షేపుల్లో పాస్తా తయారు చేయగలదు. దీని ముందు భాగంలో (కనిపిస్తున్న విధంగా) మనకు కావల్సిన షేప్‌కి సంబంధించిన వైట్ కలర్ క్యాప్ సెట్ చేసుకుని, మెషిన్ పైభాగంలో అన్ని ఇంగ్రీడియన్స్‌తో పాటు.. గుడ్లు లేదా వెజిటబుల్స్ జ్యూస్ లేదా వాటర్ జోడించి పెట్టుకోవాలి. మనకు ఎగ్ నూడూల్స్ కావాలంటే ఎగ్ జోడించుకోవచ్చు. లేదంటే వెజిటబుల్ జ్యూస్ లేదా వాటర్ పోసుకోవచ్చు. ఈ మెషిన్ పార్ట్స్‌ని వేరు చేసి క్లీన్ చేసుకోవడం కూడా చాలా సులభం. దాంతో చాలా ఫ్లేవర్స్‌లో పాస్తా, నూడూల్స్ వంటివి వండుకోవచ్చు. అందుకు సంబంధించిన అన్ని ఆప్షన్స్ డివైజ్ పైభాగంలోని ఒకవైపున ఉంటాయి. దాంతో దీన్ని తేలికగా ఉపయోగించుకోవచ్చు. ధర: 26 డాలర్లు (రూ.1,990) చదవండి👉🏾Baby Food Device: బుల్లి బుజ్జాయిల కోసం.. ఈ డివైజ్ ధర 4,947 రూపాయలు -
నూడుల్స్‌తో సమోసా ట్రై చేశారా?
నూడుల్స్ సమోసా కావలసినవి: మైదా పిండి – పావు కిలో, ఉడికించిన నూడుల్స్ – 2 కప్పులు, వాము – అర టీ స్పూన్, అల్లం–వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్, క్యాబేజీ తురుము, క్యారెట్ తురుము – 2 టేబుల్ స్పూన్ల చొప్పున, రెడ్ చిల్లీ సాస్ – 1 టీ స్పూన్, సోయాసాస్ – 2 టీ స్పూన్లు, ఉల్లికాడ ముక్కలు – 2 టీ స్పూన్లు, మొక్కజొన్న పిండి – 1 టీ స్పూన్, నీళ్లు – సరిపడా, ఉప్పు – తగినంత తయారీ: ముందుగా కళాయిలో నూనె వేసి.. అల్లం–వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి.. అందులో క్యాబేజీ తురుము, క్యారెట్ తరుగు, రెడ్ చిల్లీసాస్, సోయాసాస్, ఉల్లికాడ ముక్కలుతె పాటు వాము కూడా వేసుకుని, గరిటెతో తిప్పుతూ బాగా వేయించుకోవాలి. అనంతరం సరిపడా ఉప్పు, మొక్కజొన్న పిండి వేసి తిప్పుతూ ఉండాలి. అవి వేగాక ఉడికించిన నూడుల్స్ కూడా వేసుకుని కాసేపు వేయించి, బయటికి తీసి ప్లేటులో పరిచినట్లుగా వేసి... కాస్త ఆరనివ్వాలి. తర్వాత మరో గిన్నె తీసుకుని, అందలో మైదాపిండి, ఉప్పు, కాస్త నూనె, నీళ్లు వేసి బాగా కలుపుతూ.. చపాతి ముద్దలా కలుపుకుని అరగంట పాటు మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ ముద్దని చిన్న ఉండలుగా చేసుకుని పూరీల్లా ఒత్తాలి. పూరీని సగానికి కోసి త్రికోణాకారంలో మడతబెట్టి, లోపల నూడుల్స్ మిశ్రమాన్ని పెట్టి అంచులు మూసేయాలి. అన్నీ ఇలాగే చేసుకుని... వాటిని నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పుచ్చకాయ హల్వా కావలసినవి: పుచ్చకాయ జ్యూస్ – 2 కప్పులు(వడకట్టుకుని రసం మాత్రమే తీసుకోవాలి), పంచదార పొడి – రుచికి సరిపడా, మొక్కజొన్న పొడి – 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి – 2 లేదా 3 టేబుల్ స్పూన్లు, డ్రైఫ్రూట్స్ ముక్కలు – అభిరుచిని బట్టి(నేతిలో వేయించినవి) తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో పుచ్చకాయ రసంలో పంచదార పొడి, మొక్కజొన్న పిండి వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని.. పాన్‌లో ఆ మిశ్రమాన్ని వేసుకుని.. చిన్న మంట మీద గరిటెతో తిప్పుతూ మరిగించుకోవాలి. బాగా దగ్గర పడే సమయంలో కొద్దికొద్దిగా నెయ్యి వేసుకుంటూ.. మరింత దగ్గరపడే వరకూ గరిటెతో తిప్పుతూ ఉండాలి. చివరిగా స్టవ్ ఆఫ్ చేసి.. ఒక బౌల్‌కి అడుగు భాగంలో నెయ్యి లేదా నూనె రాసి.. అందులోకి ఆ మిశ్రమాన్ని మొత్తం తీసుకుని, దానిపైన డ్రై ఫ్రూట్స్ ముక్కలు గార్నిష్ చేసుకుని, 2 గంటల తర్వాత నచ్చిన షేప్‌లో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. బనానా ఎగ్ కేక్ కావలసినవి: అరటిపండ్లు – 2(మీడియం సైజ్‌వి తీసుకుని, చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి), చిక్కటి పాలు – 2 టేబుల్ స్పూన్లు, గుడ్లు – 4, పంచదార, నెయ్యి – 2 టేబుల్ స్పూన్ల చొప్పున, ఏలకుల పొడి – పావు టీ స్పూన్, ఎండుద్రాక్ష, జీడిపప్పు – గార్నిష్‌కి సరిపడా తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని గుడ్లు, పాలు వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని.. ఒక పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, వేడి చేసి, అందులో ఎండుద్రాక్ష, జీడిపప్పు వేయించి పక్కకు తియ్యాలి. ఇప్పుడు ఆ పాన్‌లో అరటిపండ్ల ముక్కలు వేసుకుని చిన్న మంట మీద 3 నిమిషాల పాటు గరిటెతో తిప్పుతూ వేయించుకోవాలి. తర్వాత ఆ ముక్కల్ని పాలు–గుడ్ల మిశ్రమంలో వేసి గరిటెతో అటు ఇటుగా తిప్పి.. పంచదార, ఏలకుల పొడి వేసుకుని మరో సారి అలానే కలపాలి. ఇప్పుడు పాన్‌లో మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని.. గుడ్లు–అరటిపండ్ల మిశ్రమాన్ని దిబ్బరొట్టెలా వేసుకుని.. నేతిలో వేయించిన ఎండుద్రాక్ష, జీడిపప్పులతో గార్నిష్ చేసుకుని, చిన్న మంట మీద మూతపెట్టి 4 నిమిషాల పాటు ఉడికించుకుంటే బనానా ఎగ్ కేక్ రెడీ. -
9 మంది ప్రాణాలు తీసిన నూడిల్స్
బీజింగ్ : సంవత్సరం పాటు ఫ్రిజ్‌లో ఉంచిన న్యూడిల్స్‌ను తిన్న తొమ్మిది మంది కుటుంబ సభ్యులు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన చైనాలోని హీలాంగ్జియాంగ్లో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. చైనా, హీలాంగ్జియాంగ్ నార్త్ ఈస్ట్రన్ ప్రావిన్స్‌లోని జిసి నగరానికి చెందని ఓ కుటుంబం కొద్దిరోజుల క్రితం.. దాదాపు ఒక సంవత్సరం పాటు ఫ్రిజ్‌లో ఉంచిన సుఅన్టాంగ్జీ ( న్యూడిల్స్‌తో తయారు చేసిన వంటకం)ని తిన్నారు. దీంతో కుటుంబంలోని తొమ్మిది మంది అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తీసుకుపోగా అక్కడ చికిత్స పొందుతూ అక్టోర్ 10వ తేదీన 8 మంది మృత్యువాత పడ్డారు. ఈ సోమవారం మరో మహిళ మృతిచెందింది. అదే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు సదరు వంటకం రుచి నచ్చక దాన్ని తినటం మానేయటంతో ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ఘటనపై ‘హీలాంగ్జియాంగ్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్’కు చెందిన ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ గావో పీయ్ మాట్లాడుతూ.. ‘‘ బాంగ్‌క్రెక్ అనే విషం కారణంగానే వారు మృత్యువాత పడ్డారు. చెడిపోయిన పదార్థాలలో అది ఎక్కువగా ఉంటుంది. ( ఏనుగును కి.మీ. ఈడ్చుకెళ్లిన రైలు ఇంజన్ సీజ్ ) బాంగ్‌క్రెక్ మన శరీరంలోకి చేరిన వెంటనే ప్రభావం చూపుతుంది. కడుపునొప్పి, చెమట పడ్డటం, నీరసం, కోమా.. 24 గంటల్లో మరణం కూడా సంభవించవచ్చు. ఆ విషం మన శరీరంలోని కీలక అవయవాలైన కిడ్నీలు, లివర్, గుండె, బ్రెయిన్‌ను దెబ్బ తీస్తుంది. ప్రస్తుతం దానికి విరుగుడు మందు లేదు. ఒక సారి ఆ విషం మన శరీరంలోకి చేరితే చనిపోయే అవకాశాలు 40-100 శాతం వరకు ఉన్నాయి. మనం ఎంత వేడి చేసినా బాంగ్‌క్రెక్ నశించదు. అది కొబ్బరి పదార్థాలను ఎక్కువ రోజులు పులియబెట్టడం వల్ల ఉత్పత్తి అవుతుంది. అందుకే ఇండోనేషియన్ సంప్రదాయ వంటకం ‘టెంపె బాంగ్‌క్రెక్’ను నిషేధించార’’ని తెలిపారు. -
‘కాపీ కొట్టినట్లు ఆధారం ఏమిటి?’
మెప్పుల కోసం గొప్పలు చెప్పుకోవడం ఎవరి పేటెంట్ హక్కూ కాదని మద్రాస్ హై కోర్టు తీర్పు ఇచ్చింది. రెండు పెద్ద కంపెనీల మసాలా గొడవ ఇది. 2013 నుంచీ సాగుతోంది. ఐ.టి.సి. కంపెనీ ‘ఇప్పీ’ నూడుల్స్ ప్యాకెట్ మీద ‘మేజిక్ మసాలా’ అని ఉంటుంది. నెస్లే కంపెనీ మ్యాగీ నూడుల్స్ ప్యాకెట్ మీద ‘మేజికల్ మసాలా’ అని ఉంటుంది. ఈ కారణంగానే నెస్లే మీద ఐ.టి.సి. కేసు వేసింది. తమ ‘మేజిక్’ నే ‘మేజికల్’గా నెస్లే కాపీ కొట్టిందని ఐ.టి.సి ఆరోపణ. ‘కాపీ కొట్టినట్లు ఆధారం ఏమిటి?’ అనే వాదనకు ‘మేము మేజిక్ అని పెట్టిన మూడేళ్లకు వాళ్లు మేజికల్ అని పెట్టుకున్నారు’ అని తన వాదన వినిపించింది. కోర్టుకు ఆ వాదన సంతృప్తికరంగా అనిపించలేదు. ‘మేజిక్ మసాలా, మేజికల్ మసాలా అని చెప్పుకొనే గొప్పలపై ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదని అంటూ కేసును కొట్టేసింది. బిజినెస్ అన్నాక కాపీలు తప్పవు. కోర్టు వెళ్లడం కన్నా కొత్తదారిలోకి వెళ్లడం కొన్నిసార్లు లాభదాయకంగా ఉంటుంది. కానీ.. పెద్ద కంపెనీలు కదా.. తాడో పేడో అనుకుంటాయి.(కాలక్షేపం కోసం వీటిని తినేస్తున్నారు..) చదవండి: 'ఇది తయారు చేసినవాడిని చంపేస్తా’ -
కాలక్షేపం కోసం వీటిని తినేస్తున్నారు..
సాక్షి, సిటీబ్యూరో : చిన్న పిల్లలు నుంచి పెద్దవారి వరకు అందరూ ఎంతో ఇష్టపడేది స్నాక్స్, ఇన్స్టంట్ ఫుడ్ ఐటెమ్స్. లాక్డౌన్ కారణంగా ఇప్పుడు వాటికి కష్టకాలం వచ్చింది. సూపర్ మార్కెట్, కిరాణా దుకాణాల్లోనూ స్టాక్ లేక వినియోగదారులు నిరాశకు గురవుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు బిస్కెట్లు, చాక్లెట్లు, వేపర్స్, చిప్స్, కార్న్‌ఫ్లేక్, కుర్కురే, పల్లీ చిక్కీలు, ఐస్‌క్రీమ్, నూడిల్స్, పాస్తా, చుడువా, సూప్స్, నమ్కిన్, గులాబి జామున్ తదితర స్నాక్, ఇన్స్టంట్ ఫుడ్ ఐటమ్స్ నిల్వలు నిండుకున్నాయి. ఒక వైపు కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో వినియోగదారులు ఇళ్లలో ఉండి కుటుంబ సభ్యులతో కలిసి కాలక్షేపం కోసం వీటిని ఎక్కువగా తింటున్నారు. దీంతో స్నాక్స్, ఇన్స్టంట్ ఫుడ్స్‌కు ఒకేసారి డిమాండ్ పెరిగింది. మరోవైపు లాక్‌డౌన్‌తో వాటి ఉత్పత్తి ఆగి సరఫరా లేకుండా పోయింది. ఈ కారణంగానే మార్కెట్లో ఇప్పుడు స్నాక్స్ కొరత ఏర్పడింది. తాజాగా ఇండస్ట్రీ సెక్టార్‌కు గ్రీన్ సిగ్నల్ లభించినా..కార్మికుల కొరతతో డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి కావడం లేదు. దీంతో వాటి సరఫరా తగ్గుముఖం పట్టింది. స్నాక్స్, ఇన్స్టంట్ ఫుడ్ ఐటెమ్స్‌కు ఇండెంట్ ఆర్డర్స్ పెడితే...పెట్టిన దాంట్లో కనీసం 30 శాతం కూడా సరఫరా కాని పరిస్థితి నెలకొందని వ్యాపారులు, సూపర్ మార్కెట్ల మేనేజర్లు పేర్కొంటున్నారు. (మహమ్మారి.. దారి మారి! ) లోకల్ ఉత్పత్తులు పెద్ద పెద్ద సంస్థలకు చెందిన స్నాక్స్, ఇన్స్టంట్ ఫుడ్ ఉత్పత్తుల సరఫరా నిలిచిపోవడంతో కొంతమేర లోకల్ ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇక కొన్ని సూపర్ మార్కెట్స్ తమ సంస్థల పేర్లతో స్నాక్స్, ఇన్స్టంట్ ఫుడ్ ఐటమ్స్ తయారు చేసి అమ్మడం ప్రారంభించాయి. పేరొందిన సూపర్ మార్కెట్లు, స్థానిక చిన్న చిన్న సంస్ధలు సైతం సొంతంగా బిస్కెట్లు, చిప్స్, ఐస్‌క్రీమ్, నమ్కిన్, నూడుల్స్, సూప్స్ తదితర ఐటెమ్స్‌ను సొంతంగా తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వినియోగదారులు మాత్రం బ్రాండ్ ఉత్పత్తులపైనే ఆసక్తి కనబర్చుతున్నట్లు తెలుస్తోంది. కిరాణా దుకాణాల్లో మాత్రం పేద, మధ్య తరగతి వర్గాల నుంచి మాత్రం లోకల్ ఉత్పత్తులకు ఆదరణ బాగానే లభిస్తోంది. (కరోనా: టాస్క్‌ఫోర్స్‌కు రిస్క్!) -
రెడీ టు ఈట్!
సాక్షి, హైదరాబాద్: వీకెండ్ వచ్చిందంటే చాలు.. నచ్చిన హోటల్‌కు వెళ్లి మెచ్చిన ఆహారాన్ని లాగించేవారు. హోటల్‌కు వె ళ్లే స్థోమత లేనివారుæ స్ట్రీట్ ఫుడ్ తిని ఎం జాయ్ చేసేవారు. ఇప్పుడు లాక్‌డౌన్‌తో హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంట ర్లన్నీ మూతపడ్డాయి. కరోనా కారణంగా కాలు బయట పెట్టే పరిస్థితి లేదు. దీంతో అంతా ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. నూడుల్స్, ఫ్రైడ్‌రైస్, పిజ్జా, బ ర్గర్లు, మంచురియా లాంటి జంక్‌ఫుడ్‌ను లాగించినవాళ్లు ఇప్పుడు నోళ్లు కట్టేసుకో వాల్సిన పరిస్థితి. దీన్ని అధిగమించేందు కు ఇంట్లోనే ఈ ఫుడ్‌ను సిద్ధం చేసుకుం టున్నారు. కరోనా రాకముందు షాపింగ్ మాల్స్, దుకాణాల్లో కుప్పలు తెప్పలుగా కనిపించిన నూడుల్స్, సేమియా, పాస్తా ఇప్పు డు ఖాళీ అయిపోయా యి. ఫింగర్ చిప్స్, బ్రె డ్, చీజ్, బట్టర్, కార్న్ ఫ్లేవర్లు, ఫాస్ట్‌ఫుడ్‌లో ఉపయోగించే చిల్లీ, సోయా, టమోటా సాస్‌ల ర్యాక్‌లు ఖాళీఅయ్యాయి. లాక్‌డౌన్‌తో ముందుచూపు... కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ ఎప్పటి వరకు కొనసాగుతుందో తెలియ ని పరిస్థితి... ఒకవేళ కేసుల సంఖ్య పెరి గితే మరికొన్నాళ్లు ఇంటికే పరిమితం కా వాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితిని అ ధిగమించేందుకు చాలా మంది ముందుచూపుతో వ్యవహరిస్తున్నారు. రెడీ టు ఈట్ లాంటి ఆహార పదార్థాలను సమకూర్చుకుంటున్నారు. నూడుల్స్, సాస్ లు, జంక్‌ఫుడ్‌లో వినియోగించే ఆహార పదార్థాలను కొనుగోలు చేస్తున్నారు. -
ప్రాణం మీదకి తెచ్చిన నూడుల్స్ చట్నీ
న్యూఢిల్లీ : నూడుల్స్ అంటే చిన్నా పెద్దా అంతా ఎగబడి మరీ లాగించేస్తారు. అయితే నోరూరించే చట్నీతో నూడుల్స్ తిన్న మూడేళ్ల చిన్నారి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. నూడుల్స్‌తో అందించే స్పైసీ చట్నీని ఆరగించి, తీవ్ర అనారోగ్యం పాలైన బాలుడు దాదాపు చావు అంచుల వరకు వెళ్లి తృటిలో బయట పడ్డాడు. హర్యానాకు చెందిన మజూర్ కుమారుడు ఉస్మాన్ నూడుల్స్ లో వేసే చట్నీ అంటే ప్రాణం. ఎంత ప్రాణం అంటే కప్పుల కొద్దీ దాన్ని లాంగించేంత. ఒక రోజుసాయంత్రం ఎప్పటిలాగే నూడుల్స్‌తో పాటు కప్ చట్నీని ఆబగా ఆరగించేశాడు. అంతే ఇక ఆ రాత్రి ఉస్మాన్ ఆరోగ్యం క్రమంగా క్షీణించడం ప్రారంభించింది. ఉస్మాన్ శరీరం నలుపు రంగులోకి మారింది. బీపీ పూర్తిగా పడిపోవడంతో అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు బాలుడిని ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు ఊపిరితిత్తులు పాడయ్యాయని గుర్తించారు. వెంటనే అతడికి వెంటిలేటర్‌పై వైద్యం అందించారు. దాదాపు 16 రోజులపాటు ఐసీయూలో ఉంచి చికిత్స అందించి బాలుడికి తిరిగి ప్రాణం పోశారు. అయితే స్ట్రీట్ ఫుడ్‌లో అమ్మకందారులు, నూడుల్స్ , ఇతర ఆహార పద్దార్థాల్లో రుచి కోసం వాడే ఎసిటిక్ యాసిడ్ దీనికి కారణమని వైద్యులు తేల్చారు. ఇది మోతాదు మించితే ఆరోగ్యానికి హానికరని చెప్పారు. అదే బాలుడి ప్రాణాలమీదకితెచ్చిందని స్పష్టం చేశారు. -
స్విగ్గీలో నూడుల్స్ ఆర్డర్ చేస్తే..
సాక్షి, చెన్నై: ఆన్లైన్ ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేసుకునే వారికి మరో షాకింగ్ న్యూస్. మొన్న జొమాటో డెలివరీ బాయ్ మధ్య దారిలో.. కస్టమర్ ఫుడ్‌ను తింటూ కెమేరాకు చిక్కిన వైనాన్ని ఇంకా మర్చిపోక ముందు మరో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ నిర్వాకం కలకలం రేపింది. స్విగ్గీ ద్వారా ఆర్డర్ చేసిన ప్యాక్‌లో బ్యాండేజ్ దర్శనమివ్వడంతో సదరు కస్టమర్‌కు వాంతులు ఒకటే తక్కువ. ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే చెన్నైకు చెందిన బాలమురుగన్ స్విగ్గీ ద్వారా సెలైయూర్ సమీపంలోని ‘చాప్ ఎన్ స్టిక్స్’ చైనీస్ రెస్టారెంట్ నుంచి చికెన్ నూడుల్స్ ఆర్డర్ చేశాడు. వేడి వేడి ప్యాకెట్ ను చూడగానే నోరూరింది. వెంటనే పార్శిల్ తెరిచి ఆరగిస్తుండగా అందులో రక్తంతో తడిచిన బ్యాండేజ్ కనిపించింది. దీంతో షాకైన బాలమురుగన్ వెంటనే ఆ రెస్టారెంట్‌కు ఫోన్‌చేసి ప్రశ్నించాడు. అయితే, ఆ హోటల్ వారు ఫుడ్ రీప్లేస్ చేయడానికి అంగీకరించలేదు. రిఫండ్ కూడా ఇవ్వమని కరాఖండిగా తేల్చి చెప్పారు. అయితే, స్విగ్గీ నిర్వాహకులతో నేరుగా మాట్లాడేందుకు ఫోన్ నెంబరు లేదు. దీంతో చాటింగ్ ద్వారా మాత్రమే మురుగన్ స్విగ్గీకి ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. అయినా ఫలితం శూన్యం. దీంతో దిక్కుతోచని మురుగన్ ఫేస్బుక్లో స్విగ్గీ పేజ్‌లో తన కంప్లయింట్ పోస్ట్ చేశాడు. తాను ఆర్డర్ చేసిన నూడుల్స్‌లో బ్లడ్ బ్యాండేజ్ ఉంది. దీనిపై తక్షణమే స్పందించి తప్పిదాన్ని సరిదిద్దుకుంటుందని భావిస్తున్నాననీ, వివిధ హోటళ్లతో భాగస్వామ్యం విషయంలో స్వీగ్గీ మరింత అప్రమత్తంగా ఉంటూ లోపాలను సరిదిద్దుకోవాలని డిమాండ్ చేశారు. దీనివల్ల తనకేమైనా అనారోగ్యం సోకితే కంపెనీయే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఇది వైరల్ కావడంతో చివరికి స్విగ్గీ దిగి రాకతప్పలేదు. వినియోగదారుడికి ఎదురైన అనుభవంపై చింతిస్తున్నామంటూ ఆయనకు క్షమాపణలు తెలిపింది. వినియోగదారుల ఆరోగ్యం, భద్రత మాకు ఎంతో ముఖ్యం. పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించే రెస్టారెంట్లతో కలిసి పనిచేస్తామని బాధితుని ఫిర్యాదు మేరకు రెస్టారెంటును మా జాబితా నుంచి తొలగిస్తున్నామని ప్రకటించింది దీనిపై థర్డ్ పార్టీ విచారణ జరుపుతామని పేర్కొంది. -
ముందుగా రైలెక్కితే నూడుల్స్ ఫ్రీ!
టోక్యో: ‘ఫ్రీగా నూడుల్స్ తినాలనుందా? అయితే కాస్త ముందుగా వచ్చి మా మెట్రో రైలు ఎక్కండి.. ఒక్కటి కాదు, రెండు రకాల నూడుల్స్ బౌల్స్‌ను ఫ్రీగానే ఇస్తాం. ఎంచక్కా ప్రశాంతంగా కూర్చొని, తింటూ వెళ్లొచ్చు’ అంటూ తాజాగా ఓ ప్రకటన చేసింది టోక్యో మెట్రో. ఇంతకీ ఈ ప్రకటన ఎందుకు చేసిందో తెలుసా? టోక్యో మెట్రోలో రోజుకు 72 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. ఉదయం ఆఫీసుకు వెళ్లే సమయంలో రద్దీ విపరీతంగా ఉంటుంది. సామర్థ్యానికి దాదాపు రెండింతలు ప్రయాణిస్తారు. ఎంతగా ఇరుక్కుని నిలబడతారంటే కాలూచేయీ ఆడించడం కూడా కష్టమే. అలా కాకుండా ఉదయమే కొంచెం ముందుగా ఆఫీసుకు బయలుదేరేవారి సంఖ్యను పెంచేందుకే టోక్యో మెట్రో ఫ్రీఫుడ్ ఆఫర్ ప్రకటించింది. అందరూ ఒక్కసారిగా ఎగబడకుండా కనీసం కొందరైనా ఫ్రీ నూడిల్స్ కోసం ముందుగా ప్రయాణిస్తే తర్వాత ఆఫీసు వేళల్లో రద్దీ తగ్గుతుందనేది ఆలోచన. ముందస్తు ప్రయాణికుల సంఖ్య 2,500 వరకు ఉంటే వారికి ఉచితంగా ఒక్కొక్కరికి సోబా నూడిల్ బౌల్ ఇస్తారు. ఆ సంఖ్య 3,000 దాటితే సోబాతోపాటుగా టెంపూరా బౌల్ ఇస్తారు. అంటే డబుల్ బొనాంజా అన్నమాట. -
స్ప్రింగ్‌రోల్ నూడుల్స్
కావలసినవి:వెర్మిసెల్లి నూడుల్స్ – ఒక ప్యాకెట్ (సూపర్ మార్కెట్లో దొరుకుతాయి); నూనె – 2 టీ స్పూన్లు;వెల్లుల్లి తరుగు – అర టీ స్పూను; క్యారట్ తురుము – ఒక కప్పు (నూడుల్స్లాగే పొడవుగా తురమాలి); ఉల్లి కాడల తరుగు – 2 టేబుల్ స్పూన్లుక్యాబేజీ తరుగు – 2 కప్పులు; పంచదార – పావు టీ స్పూను; సోయా సాస్ – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత స్ప్రింగ్ రోల్ షీట్లు – 7; మిరియాల పొడి – అర టీ స్పూను; కార్న్ ఫ్లోర్ – ఒక టీ స్పూను; నీళ్లు – 2 టేబుల్ స్పూన్లు; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ :ఒక పెద్ద పాత్రలో వేడి వేడి నీళ్లు పోసి, అందులో వెర్మిసెల్లి నూడుల్స్‌ను మధ్యకు విరిచి వేసి అరగంట సేపు పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి అందులో 2 టీ స్పూన్ల నూనె వేసి కాగాక వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి. ఉల్లికాడల తరుగు జత చేసి మరోమారు వేయించాలి. క్యాబేజీ తరుగు, క్యారట్ తరుగు కూడా జత చేసి బాగా కలిపి కొద్దిసేపు ఉడికించాలి. (మరీ ఎక్కువ ఉడికించకూడదు) సోయా సాస్, పంచదార, ఉప్పు, మిరియాల పొడి జత చేసి మరోమారు బాగా కలపాలి. నీళ్లలో నుంచి వెర్మిసెల్లి బయటకు తీసి, ఉడుకుతున్న క్యాబేజీ మిశ్రమంలో వేసి బాగా కలపాలి. చిన్న పాత్రలో కొద్దిగా నీరు, కార్న్‌ఫ్లోర్ వేసి మెత్తగా కలిపి, నూడుల్స్‌లో వేసి బాగా కలిపితే స్టఫింగ్ సిద్ధమైనట్లే ∙కొద్దిగా స్టఫింగ్ మిశ్రమం తీసుకుని, స్ప్రింగ్ రోల్ షీట్ మీద ఉంచి, రోల్ చేసి పక్కన ఉంచుకోవాలి స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాగాక, తయారుచేసి ఉంచుకున్న రోల్స్‌ను వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. -
ఫార్... ఇన్ కిచెన్
వియత్నాం వంటలోసారిప్రయత్నించి చూస్తారా? థాయ్ వంటకాలకు హాయ్ చెప్పాలని ఉందా? ఇవన్నీ మనవి. అంటే మన ఆసియా ఖండానివి. మరి పొరుగింటి పుల్లకూర రుచి కదా! అందుకే...యూరప్ ఖండపు పొరుగు ఖాద్యాలనూ చూద్దాం. టేస్టీ టేస్టీ ఫ్రెంచు... బోల్డంత నోరూరించు అంటూ... ఇటాలియన్ డిషెస్‌తో నాల్కను మిటకరిస్తూ... లాలాజల వర్షంతో నోరు చిరపుంజీ కాగా దేశదేశాల వంటల్ని మన ఇంట తయారు చేసుకుని... ఆవురావురుమంటూ తిందాం... బ్రేవు బ్రేవుమందాం. సెసేమ్కోటెడ్ స్వీట్ స్టఫ్డ్ పాన్ కేక్స్ (ఫ్రెంచ్) ఫ్రెంచ్ క్విజైన్ డెజర్ట్స్కి బాగా ప్రసిద్ధి. మనం కూడా ఈ రోజు ఇంటి దగ్గరే ఒక డెజర్ట్ తయారుచేసి ఫ్రెంచ్ రుచిని ఇంటి దగ్గరే ఆస్వాదించుదాం. కావలసినవి: మైదా పిండి – 2 కప్పులు; బేకింగ్ పౌడర్ – కొద్దిగా; కోడి గుడ్డు – 1; వెనిలా ఎసెన్స్ – కొద్దిగా; పాలు – అర కప్పు; బటర్ – తగినంత; పంచదార పొడి – 2 టేబుల్ స్పూన్లు; తేనె – కొద్దిగా; ఎల్లో బటర్ – కొద్దిగా; వేయించిన నువ్వులు – 25 గ్రా. స్టఫింగ్ కోసం: పచ్చి కొబ్బరి తురుము – అర కప్పు; డ్రై ఫ్రూట్స్ – తగినన్ని (కిస్మిస్, జీడి పప్పు); ఎండు ఖర్జూరాలు – ఆరు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; ఎల్లో బటర్ – ఒక టేబుల్ స్పూను; పంచదార – ఒక టే బుల్ స్పూను తయారీ: ∙ఒక పెద్ద పాత్రలో మైదా పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు, పంచదార వేసి బాగా కలిపాక, పిండి మధ్యలో గుంటలాగ చేసి పాలు, గిలకొట్టిన కోడి గుడ్డు, కరిగించిన బటర్ వేసి బాగా కలిపి సుమారు గంట సేపు పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక బటర్ వేసి కరిగించాలి ∙కొబ్బరి తురుము, డ్రై ఫ్రూట్స్, ఏలకుల పొడి, ఎండు ఖర్జూరాలు, పంచదార వేసి బాగా కలపాలి ∙మిశ్రమాన్ని తడిపోయేవరకు కలుపుతూ ఉడికించి, పక్కన ఉంచాలి ∙స్టౌ మీద నాన్ స్టిక్ పాన్ ఉంచి, వేడయ్యాక కొద్దిగా బటర్ వేసి కరిగించాలి ∙కలిపి ఉంచుకున్న మైదా పిండి కొద్దిగా తీసుకుని, పాన్ మీద దోసె మాదిరిగా వేసి రెండు వైపులా కాల్చాలి ∙బాగా కాలిన తరవాత స్టఫింగ్ మిశ్రమాన్ని దోసె మధ్యలో ఉంచి కర్రతో జాగ్రత్తగా ఒత్తి, మరోమారు కాల్చాలి ∙తయారయిన పాన్ కేక్‌లను కట్ చేసి, ఒక ప్లేట్లోకి తీసుకుని, పంచదార పొడి, తేనెలతో అలంకరించి, చివరగా నువ్వులతో గార్నిష్ చేసి అందించాలి. పాడ్ థాయి నూడుల్స్ ఎట్ హోమ్ థాయి క్విజీన్ గురించి మాట్లాడుకునేటప్పుడు మొట్టమొదటగా పాడ్ థాయి నూడుల్స్‌ను తలచుకుంటారు. ఈ వంటకాన్ని సులువుగా తయారు చేసుకుందామా. కావలసినవి: నూడుల్స్ – అర కేజీ; ఉల్లి కాడలు – ఒక కట్ట; పుట్ట గొడుగులు / బేబీ కార్న్ – 100 గ్రా. ; వేయించిన పల్లీలు – 100 గ్రా.; పల్లీ నూనె – 100 మి.లీ.; చిక్కుడు గింజలు – కొద్దిగా; వెల్లుల్లి తరుగు – కొద్దిగా; నిమ్మ రసం – ఒక టీ స్పూను; పసుపు – కొద్దిగా; ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి); ఉప్పు – తగినంత; పంచదార – టీ స్పూను; సోయా సాస్ – టీ స్పూను; పచ్చి మిర్చి – 4 (ముక్కలు చేయాలి); ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చి కొబ్బరి తురుము – అర కప్పు; మిరప కారం – అర టీ స్పూను; అజినమోటో – చిటికెడు తయారీ: ∙ఒక పాత్రలో నీళ్లు, ఉప్పు, నూనె వేసి బాగా కలిపి స్టౌ మీద ఉంచి మరిగించాలి ∙నీళ్లు మరుగుతుండగా నూడుల్స్ వేసి ఉడికించి దింపేయాలి ∙నీరు ఒంపేసి, నూడుల్స్‌ను ఒక ప్లేట్లోకి తీసి చల్లారబెట్టాలి ∙ఇవి చల్లారేలోగా పచ్చి మిర్చి, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి తురుము, బేబీ కార్న్, పుట్ట గొడుగులను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి అందులో నూనె వేసి కాగాక ఉల్లి తరుగు, వెల్లుల్లి తరుగు వేసి వేయించాక, పచ్చికొబ్బరి తురుము మిశ్రమం ముద్దను వేసి మరోమారు బాగా వేయించి, ఉడికించాలి ∙ఉడికించిన నూడుల్స్‌ను జత చేసి మిశ్రమం అంతా నూడుల్స్‌కు పట్టేవరకు కలపాలి ∙ఉప్పు, ఎండు మిర్చి, మిరియాల పొడి, పంచదార, అజినమోటో, సోయా సాస్, ఉల్లి కాడల తరుగు, చిక్కుడు గింజలు, నిమ్మ రసం జత చేసి బాగా కలపాలి ∙చివరగా పల్లీల పొడి వేసి కలిపి, ప్లేట్లోకి తీసుకుని కొత్తిమీర తరుగుతో అలంకరించి అందించాలి. ఇండియన్ హోమ్ మేడ్ పిజ్జా (ఇటాలియన్ ఫ్యూజన్) పిల్లలు ఈ రోజుల్లో సాయంత్రం స్నాక్స్‌లా తినడానికి ఫాస్ట్ ఫుడ్స్ ఇష్టపడుతున్నారు. ముందుగా మనం ఇటాలియన్ పిజ్జా తయారీ చూద్దాం. ఇంటి దగ్గరే ఈ పిజ్జాలను తయారుచేసుకోవచ్చు. కావలసినవి... బేస్ కోసం: మైదా పిండి – రెండున్నర కప్పులు; పంచదార – అర టీ స్పూను; ఉప్పు – అర టీ స్పూను; డ్రై ఈస్ట్ – అర టీ స్పూను; రిఫైన్డ్ ఆయిల్ లేదా ఎల్లో బటర్ – ఒక టీ స్పూను; గోరువెచ్చని నీళ్లు – ఒక కప్పు; మైదా పిండి∙– 3 టే బుల్ స్పూన్లు (అద్దడానికి) టాపింగ్ కోసం: మోజరిల్లా చీజ్ – 150 గ్రా. (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది); క్యాప్సికమ్ తరుగు – ఒక కప్పు (సన్నగా తరగాలి); కొత్తిమీర – అర కప్పు వెజ్ టాపింగ్స్: సన్నగా తరిగిన పుట్ట గొడుగులు – ఒక కప్పు; బేబీ కార్న్ / ఉడికించిన కూరలు / వేయించిన పనీర్ (వీటిలో ఏదో ఒకటి); నాన్ వెజ్ టాపింగ్స్; బోన్ లెస్ చికెన్ (బ్రాయిల్డ్ లేదా గ్రిల్డ్, ఏదైనా నాన్ వెజ్) సాస్ కోసం: టొమాటో తరుగు – 2 కప్పులు (తొక్క తీసేయాలి); ఆలివ్ ఆయిల్ లేదా రిఫైన్డ్ ఆయిల్ – 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు – రుచికి తగినంత; పంచదార – కొద్దిగా; నల్ల మిరియాల పొడి – అర టీ స్పూను; ఎండు మిర్చి – 1 (ముక్కలు చేయాలి); టొమాటో కెచప్ – 2 టీ స్పూన్లు; వెల్లుల్లి తరుగు –50 గ్రా.; ఉల్లి తరుగు – అర కప్పు; కార్న్ ఫ్లోర్ – కొద్దిగా (పావు కప్పు నీళ్లలో కలిపితే కార్న్ స్టార్చ్ తయారవుతుంది) సాస్ తయారీ: స్టౌ వెలిగించి, మంటను మీడియంలో ఉంచి, బాణలి పెట్టాలి. ఉల్లి తరుగు జత చేసి వేయించాలి. వెల్లుల్లి తరుగు, నల్ల మిరియాల పొడి, ఎండు మిర్చి ముక్కలు వేసి బాగా వేయించాక టొమాటో తరుగు, ఉప్పు, పం^è దార వేసి కలపాలి. టొమాటోలు మెత్తగా ఉడికి, నీరంతా పోయేవరకు కలుపుతుండాలి. టొమాటో కెచప్, కార్న్ స్టార్చ్ జత చేసి బాగా కలపాలి. మంట బాగా తగ్గించి, మిశ్రమం మృదువుగా అయ్యేవరకు ఉడికించాలి. (టొమాటలో మరీ పుల్లగా అనిపిస్తే మరి కాస్త పంచదార జత చేస్తే సరి). బేస్ తయారీ: ∙ఒక చిన్న పాత్రలో గోరువెచ్చని నీటికి ఈస్ట్ జత చేసి బాగా కలిపి పది నిమిషాల పాటు పక్కన ఉంచాలి ∙వేరొక పాత్రలో మైదా పిండి, పంచదార, ఉప్పు, నూనె వేసి బాగా కలపాలి ∙‘పిజ్జా మృదువుగా రావాలంటే పిండిని చాలాసేపు చే తితో బాగా అదమాలి) ∙ఈ మిశ్రమానికి ఈస్ట్ నీటిని జత చేసి మరోమారు కలపాలి ∙పిండిని కలుపుతూ మధ్యమధ్యలో ఆగుతూ సుమారు ఐదు నిమిషాల పాటు పిండిని కలపాలి ∙పిండి∙మెత్తగా ఉండాలే కాని, చేతికి అంటుకోకుండా చూసుకోవాలి ∙చేతికి అంటుతుంటే కొద్దిగా మైదా పిండి జత చేయాలి ∙పిండి బాగా కలిపిన తరవాత ఒక టేబుల్ స్పూను నూనె జత చేసి, పిండి సాగేలా అయ్యేవరకు కలపాలి ∙పెద్ద పాత్రకు నూనె పూయాలి ∙మైదా పిండికి కూడా మరి కాస్త నూనె పూసి, పాత్రలో ఉంచి వస్త్రంతో మూసేసి, సుమారు రెండు గంటల పాటు పక్కన ఉంచాలి ∙పిండి రెట్టింపు పరిమాణంలోకి అయ్యాక, పిండిని బయటకు తీసి కొద్దిగా పొడి పిండి జత చేసి మళ్లీ చేతితో బాగా కలిపి, పిండిని రెండు సమాన భాగాలుగా చేసి, సుమారు ఐదు నిమిషాలు పక్కన ఉంచేయాలి. నాన్ స్టిక్ పాన్ మీద బేస్ తయారుచేసుకోవాలి: ∙పిండిని చపాతీ కర్రతో ఒత్తి, గుండ్రంగా కట్ చేసుకోవాలి ∙గుండ్రంగా అక్కర్లేని వారు వారికి కావలసిన ఆకారంలో కట్ చేసుకుని, కొద్దిగా పొడి పిండి అద్ది, నూనె పూసిన పిజ్జా పాన్ మీద ఉంచాలి (అంచులు గుండ్రంగా వచ్చేలా కట్ చేసుకోవాలి) ∙గోధుమరంగులోకి వచ్చేవరకు సన్నని మంట మీద ఉంచాలి ∙చివరగా పిజ్జా బేస్‌ను వేరొక ప్లేట్లోకి తీసి, తయారుచేసి ఉంచుకున్న సాస్‌ను పిజ్జా మీద వేసి సమానంగా పరచాలి ∙ముందుగా కట్ చేసి ఉంచుకున్న టాపింగ్స్‌తో అందంగా అలంకరించాలి ∙కొత్తిమీర, చీజ్ తురుము కూడా చల్లాలి ∙ఇప్పుడు పిజ్జాను పాన్ మీద ఉంచి చీజ్ కరిగేవరకు ఉంచి దింపేయాలి ∙ఇలా ఇంటి దగ్గరే పిజ్జా తయారుచేసుకుని అందరూ కలిసి సరదాగా ఆరగించవచ్చు. సతాయ్ హోమ్ స్టైల్ ఇండోనేషియా ఇండోనేషియాలో ఈ వంటకాన్ని ప్రత్యేకంగా తయారుచేసుకుంటారు. ఈ వంటకాన్ని మనం ఇంటి దగ్గరే తయారుచేసుకుందాం. కావలసినవి: రొయ్యలు – పావు కేజీ; క్యాప్సికమ్ తరుగు – ఒక కప్పు; టొమాటో తరుగు – ఒక కప్పు; ఉల్లి తరుగు – అర కప్పు; ఉప్పు – తగినంత; మిరియాల పొడి – అర టీ స్పూను; నిమ్మ రసం – ఒక టీ స్పూను; చీజ్ – 100 గ్రా.; చిల్లీ సాస్ – ఒక టీ స్పూను; ఆవాల ముద్ద – అర టీ స్పూను; కొత్తిమీర – కొద్దిగా; టొమాటో సాస్ – ఒక టీ స్పూను; బటర్ – ఒక టీ స్పూను; (వెజిటేరియన్లు పుట్ట గొడుగులు, పనీర్, బేబీ కార్న్‌తో తయారుచేసుకోవచ్చు) తయారీ: ∙ఒక పాత్రలో శుభ్రం చేసిన రొయ్యలు, టొమాటో తరుగు, ఉల్లి తరుగు, క్యాప్సికమ్ తరుగు వేసి కలపాలి ∙వీటికి ఉప్పు, మిరియాల పొడి, నిమ్మ రసం, ఆవాల ముద్ద, చిల్లీ సాస్, టొమాటో సాస్, కొత్తిమీర జత చేసి బాగా కలిపి పక్కన ఉంచాలి ∙ఇదే విధంగా వెజిటేరియన్లు కూరముక్కలను ఊరబెట్టుకోవాలి. టూత్ పిక్‌లు తీసుకుని ఊరబెట్టిన ఉల్లి పాయ, క్యాప్సికమ్, టొమాటో, రొయ్యలను వరుసగా గుచ్చాలి ∙సమాంతరంగా ఉండే పాన్ తీసుకుని స్టౌ మీద ఉంచి, వేడయ్యాక బటర్ వేసి కరిగాక, గుచ్చి ఉంచుకున్న పుల్లలను పాన్ మీద ఉంచి బాగా కాల్చాలి ∙చివరగా చీజ్ తురుము వేసి బాగా కలపాలి. ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వీటిని వేడివేడిగా తయారుచేసి పెడితే బాగుంటుంది. – డా. స్వజన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజమ్ అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ -
సేమియా.. మజా లియా..!
రంజాన్ మాసం.. ముస్లింలకు ఎంతో పవిత్రమైనది. దీక్షతో ఉపవాసముంటూ అల్లాను స్మరిస్తూ, దైవచింతనలో ఉంటారు. ఈమాసం అందరికీ ఆనందదాయకమే.. ఈనెలలోనే ప్రత్యేకంగా తయారు చేసే వేడివేడి రుచికరమైన హలీంను ఉపవాస విరమణ అనంతరం సాయంత్రం సమయంలో ముస్లిం మిత్రులతో కలిసి అందరూ ఆస్వాదిస్తారు. అయితే హలీంతో పాటు సేమియాకు ఈ మాసంలో విశిష్ట స్థానం ఉంది. రంజాన్ పర్వదినాన తమ చుట్టుపక్కల వారికి కులమతాలకు అతీతంగా సేమియాతో తయారు చేసిన ఖీర్‌ఖుర్మాను అందజేసి ముస్లింలు సోదరభావాన్ని చాటుకుంటారు... వన్‌టౌన్: ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ పర్వదినం అనగానే అందరికీ గుర్తుకు వచ్చే తీపి వంటకం ఖీర్‌ఖుర్మా. రంజాన్ పర్వదినం రోజున ప్రతి ముస్లిం ఇంట సేమియాతో చేసే ఈ వంటకం తప్పనిసరి. పండుగ రోజన ముస్లింలు తమ ఆత్మీయులకు, బంధువులకు, స్నేహితులకు సేమియాతో చేసిన ఖీర్‌ఖుర్మాను అందజేస్తారు. అంతేకాకుండా తమ దగ్గర ఆత్మీయులకు రంజాన్ సందర్భంగా సేమియాను అందజేసి తమ ఆనందాన్ని పంచుకుంటారు. అందుకోసం పండుగ సమీపిస్తున్న వారం పది రోజులు ముందుగానే సేమియా తయారీకు సన్నద్ధమవుతుంటారు.అందులో భాగంగానే ఒకొక్కరి ఇంటæ కనీసం ఐదు నుంచి పది కిలోల మేర సేమియాను తయారు చేయిస్తుంటారు. వన్‌టౌన్‌లో సేమియా తయారీ కేంద్రాలు వన్‌టౌన్‌లోని సేమియా తయారీ కేంద్రాలు ఏడెనిమిది వరకూ ఉన్నాయి. రంజాన్ మాసంలో ఆ సేమియా తయారీ కేంద్రాలన్ని ఉదయం నుంచి రాత్రి వరకూ బిజీబిజీగా దర్శనమిస్తుంటాయి. అంతేకాకుండా కొంతమంది ఇళ్ల వద్ద సేమియా తయారీ యంత్రాలు కూడా ఉండటంతో వారే స్వయంగా తయారు చేస్తుంటారు. స్వయం తయారీకే ప్రాధాన్యం.. గోధుమలను శుభ్రం చేసి పిండి ఆడించి పిండిని సిద్ధం చేసుకుంటారు. తిరిగి దానిని శుభ్రపరచి సేమియా తయారీ కేంద్రానికి చేరుస్తారు. అక్కడ తయారీ చేసే సిబ్బంది ఆ పిండిని యంత్రంలో వేసి సేమియాను తీస్తారు. తరువాత తయారైన సేమియాను ఆరుబయట గాలి ఆడేవిధంగా ఆరబెడతారు. ఇది చూడటానికి చాలా ఆసక్తిగా ఉంటుంది. ఒకవైపు ఆధునికత వైపు పరుగులు తీస్తూ సంప్రదాయాలను పక్కనపెడుతున్న ప్రస్తుత కాలంలో ఇంకా సేమియా స్వయం తయారీకే ముస్లింలు అత్యధిక ప్రాధాన్యతనిస్తారు. బయట రకరకాల సేమియాలు విభిన్న రుచుల్లో అందుబాటులో ఉన్నా వాటిని తీసుకోవడానికి ఇష్టపడరు. చాలా కొద్దిమంది మాత్రమే అటుగా అడుగులు వేస్తారు. ఖీర్‌ఖుర్మా పంపిణీతో సోదరభావం.. సాధారణంగా పండుగ రోజున ముస్లింలు ఖీర్‌ఖుర్మాను తయారు చేస్తారు. దానిని చుట్టుపక్కల మిత్రులకు, ఇతర బంధువులకు పంపిణీ చేస్తారు. ఖీర్‌ఖుర్మాను పంపిణీ చేయటం ద్వారా రంజాన్ శుభాకాంక్షలు ఇచ్చిపుచ్చుకుంటారు. కేవలం తమ బంధువులకే కాకుండా చుట్టుపక్కల వారికి పంపిణీ చేసి తమ ఆత్మీయతను చాటుకుంటారు. ఖీర్ఖుర్మాతో పాటుగా సేమియాతో అనేక వంటకాలు చేసి తమ మిత్రులకు అందజేసి తమ సంతోషాన్ని పంచుకుంటారు. సాధారణంగా వన్‌టౌన్‌లో ముస్లింలు తమకు ఆత్మీయులైన హిందువులకు తప్పనిసరిగా ఈ వంటకాన్ని లేదా సేమియాను అందజేయడం అనేక దశాబ్ధాలుగా కొనసాగుతున్న సంప్రదాయం. మతసామరస్యానికి ఇటువంటి ఆత్మీయ పలకరింపులు వారి మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందంటారు ఇక్కడి స్థానికులు. సేమియా కూడా మతసామరస్యానికి ఒక సాధనంగా రూపుదాల్చడం ఒక విశేషం. -
నూడుల్స్ తిని వాంతులు, విరోచనాలు?
కల్లూరు (రూరల్): రిలయన్స్ మార్కెట్లో కొనుగోలు చేసిన నూడుల్స్ తిని తన కుమారుడు అఫ్రోజ్ హుస్సేన్ (9) వాంతులు, విరోచనాలతో ఆసుపత్రిపాలయ్యాడని తండ్రి పి.మహబూబ్‌బాష ఆరోపించారు. ఈ విషయాన్ని డాక్టర్ కూడా నిర్థారించారని చెప్పారు. అయితే రిలయన్స్ మార్కెట్ నిర్వాహకులు మాత్రం.. నూడుల్స్ తినడంతో వాంతులు, విరోచనాలు కాలేదని చెబుతున్నారు. బుధవారం బాధితుడు.. రిలయన్స్ మార్కెట్ ఎదుట నూడుల్స్‌ను పెట్టుకుని పట్టుకుని నిరసన తెలిపారు. నాల్గో పట్టణ పోలీసులు అక్కడికి చేరుకుని.. ఫుడ్ ఇన్స్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని చెప్పి పంపించారు.