
సాక్షి, హైదరాబాద్: వీకెండ్ వచ్చిందంటే చాలు.. నచ్చిన హోటల్‌కు వెళ్లి మెచ్చిన ఆహారాన్ని లాగించేవారు. హోటల్‌కు వె ళ్లే స్థోమత లేనివారుæ స్ట్రీట్ ఫుడ్ తిని ఎం జాయ్ చేసేవారు. ఇప్పుడు లాక్‌డౌన్‌తో హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంట ర్లన్నీ మూతపడ్డాయి. కరోనా కారణంగా కాలు బయట పెట్టే పరిస్థితి లేదు. దీంతో అంతా ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. నూడుల్స్, ఫ్రైడ్‌రైస్, పిజ్జా, బ ర్గర్లు, మంచురియా లాంటి జంక్‌ఫుడ్‌ను లాగించినవాళ్లు ఇప్పుడు నోళ్లు కట్టేసుకో వాల్సిన పరిస్థితి. దీన్ని అధిగమించేందు కు ఇంట్లోనే ఈ ఫుడ్‌ను సిద్ధం చేసుకుం టున్నారు. కరోనా రాకముందు షాపింగ్ మాల్స్, దుకాణాల్లో కుప్పలు తెప్పలుగా కనిపించిన నూడుల్స్, సేమియా, పాస్తా ఇప్పు డు ఖాళీ అయిపోయా యి. ఫింగర్ చిప్స్, బ్రె డ్, చీజ్, బట్టర్, కార్న్ ఫ్లేవర్లు, ఫాస్ట్‌ఫుడ్‌లో ఉపయోగించే చిల్లీ, సోయా, టమోటా సాస్‌ల ర్యాక్‌లు ఖాళీఅయ్యాయి.
లాక్‌డౌన్‌తో ముందుచూపు...
కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ ఎప్పటి వరకు కొనసాగుతుందో తెలియ ని పరిస్థితి... ఒకవేళ కేసుల సంఖ్య పెరి గితే మరికొన్నాళ్లు ఇంటికే పరిమితం కా వాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితిని అ ధిగమించేందుకు చాలా మంది ముందుచూపుతో వ్యవహరిస్తున్నారు. రెడీ టు ఈట్ లాంటి ఆహార పదార్థాలను సమకూర్చుకుంటున్నారు. నూడుల్స్, సాస్ లు, జంక్‌ఫుడ్‌లో వినియోగించే ఆహార పదార్థాలను కొనుగోలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment