'నూడిల్స్' మూవీ: అనుకోకుండా ఓ మనిషిని చంపేస్తే? | Noodles Movie Trailer And Release Date Details | Sakshi
Sakshi News home page

Noodles Movie: డిఫరెంట్ స్టోరీ.. భయపెడుతున్న ట్రైలర్

Published Wed, Sep 6 2023 4:37 PM | Last Updated on Wed, Sep 6 2023 6:54 PM

Noodles Movie Trailer And Release Date Details - Sakshi

ఈ మధ్య కాలంలో 'లవ్‌టుడే', 'గుడ్‌నైట్‌', 'పొర్‌ తొళిల్‌' చిత్రాలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై తమిళంలో అనూహ్య విజయం సాధించాయి. మరోవైపు 'అరువి' మూవీతో గుర్తింపు తెచ్చుకున్న మదన్‌కుమార్‌ ఇప్పుడు దర్శకుడిగా మారిపోయాడు. 'నూడిల్స్‌' సినిమా తీశాడు.

(ఇదీ చదవండి: Bigg Boss 7 రెండో రోజు హైలైట్స్: అందరితోనూ శోభా గొడవలు.. అడ్డంగా దొరికిపోయిన తేజ!)

మదన్ కుమార్ పోలీసు అధికారిగా కీలక పాత్రలో నటించాడు. హరీష్‌ ఉత్తమన్‌, షీలారాజ్‌ కుమార్‌ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ నెల 8న రిలీజ్‌కి రెడీ అయింది. కథ విషయానికొస్తే.. ఓ రోజు రాత్రి ఓ ప్లాట్స్‌లో నివసిస్తున్న వారు మిద్దైపెన ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సమయంలో పహారా కోసం వచ్చిన పోలీసులు వారితో దురుసుగా ప్రవర్తిస్తారు. దీంతో గొడవ జరుగుతుంది. 

మరోవైపు హీరో అనుకోని పరిస్థితుల్లో ఓ వ్యక్తిని చంపి, తన ఇంట్లో దాచిపెడతాడు. మరి చివరకు ఏమైందనేదే 'న్యూడిల్స్' స్టోరీ. అత్యంత సహజంగా తీసిన ఈ చిత్రాన్ని రోలింగ్‌ సౌండ్‌ పిక్చర్స్‌ పతాకంపై అరుణ్‌ ప్రకాష్‌ నిర్మించారు. కాగా చిత్రాన్ని చూసిన నిర్మాత సురేష్‌ కామాక్షి ఎంతో ఇంప్రెస్‌ అయ్యి తమిళనాడు విడుదల హక్కులను తీసుకున్నట్లు తెలిపారు. 

(ఇదీ చదవండి: దివ్యస్పందన మృతి అంటూ వార్తలు.. మండిపడ్డ నటి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement