
నూడిల్స్... ఇంట్లోనే చేద్దామా!
స్నాక్స్ అనగానే పిల్లలకు గుర్తొచ్చేది నూడిల్స్. క్షణాల్లో ఏం వండగలమా అని ఆలోచించే తల్లులకు వెంటనే స్ఫురించేదీ నూడిల్సే. అందుకే వాటికి డిమాండ్ పెరిగిపోయింది. డిమాండ్‌ను బట్టి రేటూ పెరిగిపోయింది. ఆ ఖర్చుకు బ్రేక్ వేయాలంటే... నూడిల్స్‌ని మనమే ఇంట్లో తయారు చేసుకోవాలి. అది పెద్ద కష్టమేమీ కాదు... ఈ యంత్రం మన దగ్గరుంటే!
ముందుగా పిండిని కలిపి పెట్టుకోవాలి. దాన్ని చపాతీ మాదిరిగా చేసి, ఈ మేకర్‌కు ఫిక్స్ చేయాలి (టైప్ రైటర్‌లో పేపర్ పెట్టిన మాదిరిగా. మెషీన్‌తో పాటు వచ్చే క్యాటలాగ్‌లో ఎలా అమర్చాలో రాసి ఉంటుంది). తరువాత హ్యాండిల్‌ని తిప్పితే నూడిల్స్ తయారవుతాయి. కావలసిన పరిమాణంలో వచ్చేందుకు బ్లేడ్‌ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీని వెల 1800 రూపాయలు. ఆన్‌లైన్ స్టోర్స్‌లో పరిమాణాన్ని బట్టి రూ.1674, రూ. 1775... ఇలా రకరకాల ధరల్లో లభిస్తోంది.