ఇటీవలకాలంలో ఇన్‌స్టంట్ ఫుడ్ ఐటెమ్స్‌కి ప్రివరెన్స్ ఇస్తున్నారు చాలామంది. ఈ ఉరుకులు పరుగులు జీవితంతో ఏదో స్పీడ్‌గా తయారయ్యే ఇన్‌స్టంట్ రెసిపీలు వండుకుని తినేసి హమ్మయ్యా..! అనుకుంటున్నారు. ఇది ఆరోగ్యానికి మంచిదా? కాదా? అన్నది ముఖ్యం కాదు. కేవలం ఆకలి తీరిపోతే చాలు అన్నట్లుగా రెడీమేడ్ ఫుడ్‌పై ఆధారపడుతున్నారు జనాలు. ముఖ్యంగా ఇన్‌స్టంట్ నూడుల్స్ లాంటివి అయితే ప్రజలు ఎగబడి మరీ తింటున్నారు. కానీ ఇలాంటి నూడుల్స్ మరింత ప్రమాదమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు
ఫుడ్ పాయిజనింగ్‌కి దారితీస్తుందా..
మాములు న్యూడిల్స్‌లా కాకుండా దీనిలో ఆయిల్‌తో సహా అన్ని ఇన్‌గ్రేడియంట్స్ మిక్స్ చేసి ఉంటాయి. జస్ట్ దాన్ని తీసి గిన్నెలో వేసుకుని వేడి చేసుకుంటే చాలు న్యూడిల్స్ రెడీ అంతే..అయితే దీనిలో అన్ని ఇన్‌గ్రేడియంట్స్ ఉండటంతో తటస్థ పీహెచ్ స్థాయిలు ఎక్కుకవగా ఉంటాయి. అందువల్ల దీనిలో ఈజీగా బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఫుడ్ పాయిజినింగ్ దారితీసే స్థాయికి చేరుకుంటుంది. దీనిలో నీరు, ఉప్పు, మసాలా జత చేసి ఉంటాయి.
అందువల్ల తొందరగా పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి ఆల్కలీన్ కూడా జోడించడం జరుగుతుంది. నిజానికి దీనిలో ఫైబర్, విటమిన్ల, ప్రోటీన్లు చాలా తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ ఇన్‌స్టెంట్ న్యూడిల్స్‌లో ఎక్కువ సోడియంతో ప్యాక్‌చేయడం జరుగుతంది. ఇది శరీరానిక అస్సలు మంచిది కాదు. ఇలాంటివి తీసుకుంటే దీర్ఘకాలిక తలనొప్పి, అధిక రక్తపోటు, వికారం, దడ, విరేచనాలకు దారితీసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ఫుడ్ పాయిజనింగ్ అంటే..
ఫుడ్ పాయిజనింగ్ అనేది బ్యాక్టీరియా, ఫంగస్, పరాన్నజీవి లేదా వైరస్ వంటి వాటి వల్ల కలుషితమైన ఆహార తీసుకోవడం వల్ల జరుగుతుంది. దీంతో బాధితుడికి వాంతులు, విరేచనాలు, జ్వరం వంటి సమస్యలు వస్తాయి. నార్మల్‌గా అయతే రెండు రోజల్లో మెరుగయ్యి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి వెళ్లిపోతారు రోగులు.
ఒక్కోసారి శరీరం అధిక స్థాయిలో నీటిని కోల్పోయి ఈ ఫుడ్ పాయిజనింగ్ కాస్త ప్రాణాంతకంగా మారుతుంది. అంతేగాదు ప్రతి ఏడాది ఇలాంటి అసురక్షిత ఆహారం వల్ల దాదాపు 600 మిలియన్ల మంది ఆహార సంబంధత వ్యాధులు బారినపడుతున్నారని, సుమారు 4 లక్షలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయని నివేదికల్లో వెల్లడయ్యింది. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లలో దాదాపు 30%నికి పైగా పిల్లలు ఫుడ్ పాయిజనింగ్ వల్లే చనిపోతున్నట్లు పేర్కొంది.
ఎవరికీ ఎక్కువ ప్రమాదం అంటే..
గర్భిణి స్త్రీలు
దీర్ఘకాలిక వ్యాధులతో బాధుపడుతున్న వారు
రోగనిరోధక శక్తి తక్కు ఉన్నవారు
వృద్ధులు, చిన్నపిల్లలు
తీసుకోవాల్సిన చర్యలు..
ఆహార పదార్థాలు తాజాగా ఉండేలా చూసుకోవడం. పాడవ్వకుండా ఉండేలా మంచి పద్ధతిలో నిల్వ చేయడం వంటివి చేయాలి.
పచ్చి కూరగాయాలతో చేసే ఆహారపదార్థాలను నిల్వ చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి
పచ్చిమాంసం, గుడ్లను, ఒక్కసారి క్రాస్ చెక్‌చేసుకుని సరైన ఉష్ణోగ్రత వద్ద ఉడికించాలి.
అలాగే ఉడికించిన రెండు గంటల్లోపు తయారు చేసుకున్న రెసిపీలను ఫ్రిజ్‌లో ఉంచుకోండి.
(చదవండి: వీల్‌చైర్‌కి పరిమితమైన వెనక్కి తగ్గలేదు..వ్యాపారవేత్తగా..!)
Comments
Please login to add a commentAdd a comment