పెద్ద చదువులు చదువుకుని ఏ ఉద్యోగం లేక ఇంకా తల్లిదండ్రులపై ఆధారపడే యువత ఎంతోమంది ఉన్నారు. కనీసం తమ వ్యక్తిగత ఖర్చులకు కూడా తమ పెద్దవాళ్ల ముందు చేయిచాపనిదే పని అవ్వదు. కనీసం అవయవాల్ని సక్రమంగా ఉన్నాయి కదా అని ఏదోక పనిచేసే యత్నం కానీ ఆలోచన కానీ అస్సలు చెయ్యరు. పైగా అనుకున్నది కాలేదని నిరాశనిస్పృహలకు లోనై అక్కడితో ఆగిపోతారు. కానీ అ మహిళ చిన్నతనంలో వచ్చిన వ్యాధి నడవకుండా చేసి వీల్‌చైర్‌కే పరిమితం చేసినా..భయపడలేదు. ఒక కష్టం మీద మరో కష్టం వస్తూనే ఉన్నా వెనక్కి తగ్గలేదు. పైగా సమర్థవంతమైన వ్యాపారవేత్తగా విజయాలను సాధిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఆమె ఎవరంటే..
కాశ్మీర్‌లోని విశాలమైన వ్యాలీ లోయల్లో పుట్టి పెరిగిన సదాఫ్‌కి పదేళ్ల వయసులో తీవ్ర జ్వరం వచ్చింది. డాక్టర్ వద్దకు వెళ్లగా ఆమె ఇక ఎప్పటికి మళ్లీ నడవలేదని తేల్చి చెప్పేశారు. దీంతో చదువుకి దూరమవ్వాల్సి వచ్చింది. అయినప్పటికీ ఏదో ఆశతో తల్లిదండ్రులు ఆమెను అనేకమంది వైద్యుల వద్దకు తిప్పేవారు. ఆమెకు శస్త చికిత్స చేసి ప్రత్యేకంగా నడిచే బూట్లను పెట్టించాలని ప్రయాసపడ్డారు ఆమె తల్లిదండ్రులు. కానీ బరువు ఎక్కువగా ఉండటంతో అది సాధ్యం కాదని చెప్పేశారు.
పొరుగున ఉన్న పిల్లలు పాఠశాలకు వెళ్తుంటే తానెందుకు వెళ్లలేకపోతున్నాను అనేది కూడా తెలియని స్థితిలో ఉంది సదాఫ్. అయినపటికీ.. ఆమెలో మనోబలం తగ్గకుండా ఉండేలా ధైర్యాన్ని నూరిపోసేవాడు తండ్రి. ఆ తండ్రినే విధి సదాఫ్ నుంచి దూరం చేసింది. దీంతో ఆయన మరణం కారణంగా సదాఫ్‌పై కుటంబ బాధ్యత పడ్డాయి. ఆమె తండ్రి మాత్రమే తనలోని శక్తి సామర్థ్యాను నమ్మేవారు, మిగతావారందరూ కించపరుస్తూనే ఉండేవారు.
తన కాళ్ల మీద నిలబడే క్రమంలో అడగడున అవమానాలే ఎదుర్కొంది. వాటన్నింటిని తన తండ్రి ఇచ్చిన ధైర్యాన్ని స్ఫూరణకు తెచ్చుకుని అధిగమించే యత్నం చేసింది. అలా మసాలా వ్యాపారాన్ని పెట్టకునే స్థాయికి ఎదిగింది. అలా అంచెలంచెలుగా ఎదగుతూ సక్సెస్‌ఫుల్ వ్యాపారవేత్తగా విజయాలను అందుకుంది. అక్కటితో ఆగలేదు బొటిక్ లాంటి పెద్ద వ్యాపారాన్ని కూడా సొంత చేసుకుని సమర్థవంతంగా రన్ చేస్తోంది. ఈ క్రమంలో తాను ఎన్నో రోజులు ఒంటరిగా కూర్చొని ఏడ్చిన రోజులు లెక్కలేనన్నీ ఉన్నాయని అంటోంది సదాఫ్. వీ
ల్ చైర్‌లో ఉండే తాను ఏం చేయగలను, కుటుంబానికి ఏ విధంగా తోడ్పడగలననేది ఆమెలో తలెత్తిన సందేహాలు, భయాలు. ఇలా ఆలోచించి..ఒక్కోక్కసారి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయేది. అయినప్పటికీ వాటన్నింటిని తన చేతులతో ఎందుకు చేయలేనన్న మొండి తెగింపు లోలోపల ఎక్కువగా ఉండేది. అదే ఈ రోజు సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మీ ముందు నిలబడేలా చేసిందని చెబుతోంది సదాఫ్. ఆమె విజయపరంపర అక్కడితో ఆగిపోలేదు సదాప్ మంచి బాస్కెట్ బాల్ ప్లేయర్ కూడా.
జమ్మూ కాశ్మీర్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ద్వారా ఎన్నో అవార్డులను అందుకుంది. నాడు హేళన చేసి బాధ పెట్టిన వ్యక్తులే ఈ రోజు తన విజయగాథను తమ పిల్లలకు చెబుతూ స్ఫూర్తిగా తీసుకోమనడం తనకు ఎంతో గర్వంగా ఉంటుందని ఆనందంగా చెబుతోంది సదాఫ్. చివరిగా ఆమె వీల్‌చైర్‌లపై ఉన్న వ్యక్తులు లేదా దివ్యాంగులను ఎప్పుడూ అనుమానించొద్దని చెబుతోంది. వీలైతే నమ్మకాన్ని, దైర్యాన్ని అందివ్వండి గానీ జాలీ మాత్రం చూపించి శాపగ్రస్తులుగా నిలబెట్టొదని కోరుతోంది సదాఫ్.
(చదవండి: పూర్వకాలంలో అరటిపండ్లను అలా ముగ్గబెట్టేవారా!నెటిజన్లు ఫిదా)
Comments
Please login to add a commentAdd a comment