వైరల్: మనం రోజూ తినే ఆహారం.. ఎంత హైజెనిక్ అనేది ఊహించలేం. అలాగే ప్రాసెసింగ్ ఫుడ్ విషయంలోనూ ఎలాంటి పద్ధతులు పాటిస్తారు, ఎంత నాణ్యంగా వ్యవహరిస్తారు అని అంచనా వేయడమూ కష్టమే!. ఈ రెండింటి విషయంలో పట్టింపు ఉన్నవాళ్లు బయటి ఫుడ్‌ల జోలికి పోరనేది వాస్తవం. మరి బయటి ఫుడ్ ఎక్కువగా లాగించే వాళ్ల పరిస్థితి!.
అలాంటి వాళ్లను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో తరచూ కొన్ని వీడియోలు, ఫొటోలు కనిపిస్తున్నాయి. వాటిని పట్టించుకోవడం, పట్టించుకోకపోవడం ఇక వాళ్ల వంతు. తాజాగా.. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లలో నూడుల్స్ తింటున్నారా? అయితే జాగ్రత్త అంటూ ఓ వీడియో నెట్‌లో వైరల్ అవుతోంది. తయారీ విధానం చూడండి అంటూ ఓ వ్యక్తి ఆ వీడియోను ట్విటర్ ద్వారా వదలడంతో హల్ చల్ చేస్తోంది.
ఓ చిన్నఫ్యాక్టరీలో చిన్నస్థాయి రెస్టారెంట్‌లలో, రోడ్‌సైడ్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లలో వాడే నూడుల్స్ తయారీ విధానం ఇదంటూ ఓ వ్యక్తి వీడియోను పోస్ట్ చేశాడు. దీంతో ఆహార నాణ్యతపై మరోసారి చర్చ మొదలైంది. ఇది ఎక్కడ ఎప్పుడు తీశారనే దానిపై స్పష్టత లేదు. రకరకాల కామెంట్లు కనిపిస్తున్నాయి. స్టార్ హోటల్స్‌లోనూ ఇంతకంటే దారుణమైన పరిస్థితులు ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. నిత్యం మనం తీసుకునే ఆహారాన్ని అంచనా వేయడం కష్టమని కొందరు.. ఇలాంటి ఆహారం తినకపోవడమే మంచిదంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఆ వీడియోను మీరూ చూసేయండి.
When was the last time you had road side chinese hakka noodles with schezwan sauce? pic.twitter.com/wGYFfXO3L7
— Chirag Barjatya (@chiragbarjatyaa) January 18, 2023
Comments
Please login to add a commentAdd a comment