Fast food
-
ట్రంప్, ఇలాన్ మస్క్ తో కలిసి బర్గర్ తిన్న కెన్నెడీ జూనియర్
-
ఇదేందయ్యా ఇది..! మొన్న విషం.. ఇప్పుడేమో కలిసి పంచుకున్నాడు
వాషింగ్టన్: అమెరికా నూతన అధ్యక్షునిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వంలో ఆరోగ్య శాఖకు అధిపతిగా రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్‌ను నియమించారు. ఈయన అమెరికా ఎన్నికల సమయంలో ట్రంప్ తినే ఫాస్ట్ ఫుడ్‌ను విషంగా అభివర్ణించి, ఇప్పుడు ట్రంప్ పక్కన కూర్చుని ఫాస్ట్ ఫుడ్‌ను తింటున్న ఉదంతానికి సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది.సోషల్ మీడియా సైట్ ‘ఎక్స్’లో డొనాల్డ్ ట్రంప్ జూనియర్ షేర్ చేసిన ఫొటోలో ఎలన్ మస్క్, ట్రంప్, యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ మైక్ జాన్సన్ కూడా ఉన్నారు. అలాగే ఈ ఫొటోలో కెన్నెడీ జూనియర్ మెక్‌డొనాల్డ్స్ బర్గర్‌ను చేతిలో పట్టుకోవడం కనిపిస్తుంది. అక్కడి టేబుల్‌పై కోకా-కోలా బాటిల్ కూడా కనిపిస్తోంది. దీనికితోడు మెక్‌డొనాల్డ్స్ బర్గర్, ఫ్రైస్ ఉన్న ప్లేటు ట్రంప్, మస్క్ ముందు ఉంచారు. ట్రంప్ జూనియర్ ‘మేక్ అమెరికా హెల్దీ అగైన్ టుమారో స్టార్ట్స్’ అనే క్యాప్షన్‌తో చిత్రాన్ని షేర్ చేశారు. Make America Healthy Again starts TOMORROW. 🇺🇸🇺🇸🇺🇸 pic.twitter.com/LLzr5S9ugf— Donald Trump Jr. (@DonaldJTrumpJr) November 17, 2024ఇటీవల ఎన్నికల సమయంలో ఒక ఇంటర్వ్యూలో కెన్నెడీ జూనియర్ ట్రంప్ తినేవాటిని ‘విషం’గా అభివర్ణించారు. ప్రచార సమయంలో ఆయన ట్రంప్ చెడ్డ ఆహారం తింటున్నారని పేర్కొన్నారు. ఈయన గతంలో దుకాణాల్లోని షెల్ఫ్‌ల నుండి ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల ప్యాకెట్లను తొలగించాలని కోరారు. అయితే అమెరికాలో ఫాస్ట్ ఫుడ్ కల్చర్కున్న ప్రాముఖ్యతను కెన్నెడీ జూనియర్ ఒప్పుకున్నారు.ఇది కూడా చదవండి: మంచు కురిసే వేళలో.. మూడింతలైన కశ్మీర్ అందాలు -
50 గంటల్లో 16 వేల కేలరీల ఫాస్ట్ ఫుడ్ ఛాలెంజ్..కట్‌చేస్తే..!
ఆరోగ్యం కోసం మంచి సమతుల్య ఆహారం తీసుకోవడమే మేలు. కానీ ఒక్కోసారి జిహ్వ చాపల్యం చంపుకోలేక ఇష్టమైన జంక్ ఫుడ్‌ని లాగించేస్తాం. పైగా ఏదో అప్పుడప్పుడే కదా అని సర్ది చెప్పుకుని మరీ తినేస్తాం. ఆ తర్వాత వర్కౌట్లు చేసి అదనపు కేలరీలను తగ్గించే యత్నం చేస్తాం. కానీ ఇలా తినడం వల్ల మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో ప్రయోగాత్మకంగా తెలియజేశాడు ఓ యూట్యూబర్. అందుకోసం అతడు ఏం చేశాడంటే..ఫిట్నెస్ కంటెంట్ క్రియేటర్ అయిన 30 ఏళ్ల కెనడియన్ టెన్నిసన్ ఓ విచిత్రమైన ఫుడ్ ఛాలెంజ్‌ని తీసుకున్నాడు. ఆయన 50 గంటల ఫాస్ట్ ఫుడ్ మారథాన్ సవాలును స్వీకరించాడు. అందుకోసం తన బ్రేక్‌ఫాస్ట్ నుంచి లంచ్, డిన్నర్‌తో సహా మొత్తం ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఐటెమ్స్ వంటివి మాత్రేమ తీసుకున్నాడు. వాటిలో తృణధాన్యాలు, పెరుగు వంటివి కూడా ఉన్నాయి. తొలిరోజు అలాంటి ఫుడ్ తింటూ 8 వేల కేలరీలను వినియోగించినట్లు పేర్కొన్నాడు. ఈ ఆహారం కారణంగా తన మానసిస్థితి, శక్తి స్థాయిలోని ప్రతికూల భావాలను గుర్తించినట్లు తెలిపాడు. రెండో రోజు కూడా ఇలానే తినడం వల్ల గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడ్డట్లు తెలిపాడు. ఎక్కువ మొత్తంలో కేలరీలను పెంచినప్పటికీ పోషకాహార లోపంతో ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడించాడు. ఈ ఫుడ్ కారణంగా ముఖంపై మొటిమలు రావడం మొదలయ్యిందని వెల్లడించాడు. ఆ తర్వాత కండరాలు తిమ్మిరిగా ఉండి బద్ధకంగా ఏదో తెలియని నీరసంతో ఇబ్బంది పడుతున్నట్లుగా అనిపించిందని వెల్లడించాడు. అలాగే ఈఫుడ్కి తగ్గట్టు చేయాల్సిన పదివేల స్టెప్స్‌కు బదులుగా తాను 4 వేల స్టెప్స్ నడిచినట్లు పేర్కొన్నాడు. ఈ రెండు రోజుల ఛాలెంజ్ తదనంతరం మూడో రోజు జిమ్సెషన్ అత్యంత భయంకరమైనది. ఎందుకంటే ఈ అధిక కేలరీల ఫుడ్ కారణంగా విపరీతమైన చెమట్లు పట్టి..వర్కౌట్లు చేయడం చాలా కష్టంగా అనిపించిందని చెప్పుకొచ్చాడు.అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల కలిగే పరిణమాల గురించి తెలియజేసేందుకే ఈ 50 గంటల ఫాస్ట్ ఫుడ్ ఛాలెంజ్‌ని స్వీకరించానని యూట్యూబర్ వెల్లడించాడు. అందుకు సంబంధించిన వీడియోని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఆహారంతో మిళితమైన శారీరక సంబంధం గురించి చాలా క్లియర్‌గా వివరించి మరీ చెప్పారంటూ సదరు యూట్యూబర్‌ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: సులభంగా ఇమ్యూనిటీ పెంపొందించుకోండి ఇలా..!) -
బర్గర్ కింగ్ వర్సెస్ బర్గర్ కింగ్..!
పుణె: అంతర్జాతీయ ఫాస్ట్–ఫుడ్ చెయిన్ బర్గర్ కింగ్ కార్పొరేషన్‌పై పుణెలో బర్గర్ కింగ్ పేరుతో ఉన్న రెస్టారెంట్ 13 ఏళ్లపాటు సాగిన న్యాయ పోరాటంలో విజయం సాధించింది. ‘బర్గర్ కింగ్’పేరును వాడుకుంటూ ప్రపంచవ్యాప్తంగా 13 వేలకుపైగా ఔట్లెట్లు కలిగిన తమ పేరును దెబ్బతీస్తున్నారని అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థ బర్గర్ కింగ్ కార్పొరేషన్ 2011లో పుణె కోర్టులో కేసు వేసింది. ఆ పేరును వాడకుండా సంబంధిత రెస్టారెంట్‌ను ఆదేశించాలని, తమ బ్రాండ్‌కు పూడ్చలేని నష్టాన్ని కలుగజేసినందుకు రూ.20 లక్షలు చెల్లించాలని కూడా అందులో కోరింది. దీనిపై పుణె బర్గర్ కింగ్ యజమానులైన అనహిత, షాపూర్ ఇరానీలు న్యాయపోరాటం జరిపారు. ఒక్క పేరు తప్ప, బర్గర్ కింగ్ కార్పొరేషన్‌తో ఎలాంటి సారూప్యతలు తమ రెస్టారెంట్‌కు లేవన్నారు. తమ వంటి చిన్న వ్యాపారాలను దెబ్బకొట్టే దురుద్దేశంతోనే ఆ సంస్థ ఈ కేసు ఏళ్లపాటు కొనసాగించిందని ఇరానీ ఆరోపించారు. దీని కారణంగా తాము తీవ్ర వేదనకు, మానసిక ఒత్తిడికి గురయ్యామని చెప్పారు. విచారించిన జడ్జి సునీల్ వేద్ పాఠక్..‘ఇరానీ 1992లోనే బర్గర్ కింగ్ పేరుతో రెస్టారెంట్‌ను ప్రారంభించారు. కానీ, అమెరికా కంపెనీ 2014 తర్వాతే దేశంలోకి అడుగుపెట్టింది. ఆ కంపెనీ వాదన చాలా బలహీనంగా ఉంది. పుణెలోని రెస్టారెంట్ బర్గర్ కింగ్ పేరుతో వినియోగదారులను తికమకపెట్టినట్లు గానీ, తప్పుదోవ పట్టించినట్లు గానీ నిరూపించలేకపోయింది’అని స్పష్టం చేశారు. అంతేకాదు, పుణె బర్గర్ కింగ్ రెస్టారెంట్‌తో తమ బ్రాండ్‌కు వాటిల్లిన నష్టంపై సరైన ఆధారాలను సైతం అమెరికా కంపెనీ చూపలేదన్నారు. అందుకే పరిహారం పొందే అర్హత కూడా ఆ సంస్థకు లేదన్నారు. ఈ విషయంలో ఎవరూ ఎవరికీ పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పుణె రెస్టారెంట్ అదే పేరుతో తమ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని పేర్కొన్నారు. -
ఢిల్లీలో మరో ప్రమాదం.. రెస్టారెంట్లో మంటలు.. పలువురికి గాయాలు
దేశరాజధాని ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్రనగర్‌లో గల ఒక కోచింగ్ సెంటర్లో జరిగిన ప్రమాదాన్ని మరచిపోకముందే మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని ఐఎన్ఏ మార్కెట్లో ఫాస్ట్‌ఫుడ్ దుకాణం, రెస్టారెంట్లో మంటలు చెలరేగాయి. స్థానికులంతా భయాందోళనలతో పరుగులు తీశారు. ఈ ఘటన ఈరోజు (సోమవారం) తెల్లవారు జామున చోటుచేసుకుంది.ప్రస్తుతం ఘటనా స్థలంలో ఎనిమిది అగ్నిమాపక యంత్రాలు మంటలను నియంత్రించే పనిలో ఉన్నాయి. ఈ ప్రమాదంలో కొందరు గాయపడినట్లు తెలుస్తోంది. ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారి మనోజ్ మెహ్లావత్ మాట్లాడుతూ నేటి(సోమవారం) ఉదయం 3:20 గంటలకు మంటలు చెలరేగాయని, ఎనిమిది ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పుతున్నామని తెలిపారు. చైనీస్ ఫుడ్ కార్నర్‌తో పాటు ఒక రెస్టారెంట్లో మంటలు చెలరేగాయని, ఘటన జరిగిన సమయంలో ఫాస్ట్ ఫుడ్ కార్నర్లో ఐదారుగురు ఉన్నారని తెలిపారు. వారంతా గాయపడ్డారని అన్నారు. #WATCH | Delhi: Fire broke out at a fast food restaurant in INA market. 8 fire tenders at the spot. Parts of the roof of the restaurant have collapsed. 4 to 6 people have been injured: Delhi Fire service pic.twitter.com/glnFOXqg60— ANI (@ANI) July 28, 2024 -
ఇంట్లో కంటే బయటి దానికే ఎక్కువ ఖర్చు
మారుతున్న జీవనప్రమాణాల కారణంగా మనం తీసుకునే ఆహారంలోనూ విభిన్న ధోరణి కనిపిస్తుంది. గడిచిన దశాబ్దకాలంలో పట్టణ ప్రాంతంలోని ప్రజలు ఆహారం విషయంలో దేనికి ఎక్కువగా ఖర్చు చేస్తున్నారో తెలియజేస్తూ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇప్లిమెంటేషన్(మోస్పీ), ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఆసక్తికర నివేదికను విడుదల చేశాయి. నివేదిక వివరాల ప్రకారం.. దశాబ్దకాలంలో ఆహార ఖర్చులు పెరిగాయి. మొత్తం ఫుడ్ బడ్జెట్లో ఇంట్లో ఆహారం తయారీకి 2012లో 42.6 శాతం వెచ్చించేవారు. ఫాస్ట్‌ఫుడ్, జంక్‌ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ వంటి బయటి ఆహారానికి 57.4 శాతం ఖర్చు చేశారు. అదే 2023లో ఇంట్లో ఫుడ్ తయారీకి 39.7 శాతం, బయటిఫుడ్ కోసం 60.3శాతం ఖర్చు చేసినట్లు తెలిసింది. అందులో భారీగా ప్రాసెస్డ్ ఫుడ్, బెవరేజెస్‌కు ఎక్కువగా డబ్బు వెచ్చించినట్లు నివేదికలో తెలిపారు. కింద ఇచ్చిన వివరాల ద్వారా కేటగిరీవారీగా ఎంత శాతం ఖర్చుచేశారో తెలుసుకోవచ్చు. ఇదీ చదవండి: 100 నుంచి 75 వేల పాయింట్ల వరకు ప్రస్థానం 2012లో.. 2023లో.. బేవరేజెస్, ప్రాసెస్డ్ఫుడ్ 9 శాతం 10.5 శాతం పాలు, పాల ఉత్పత్తులు 7 శాతం 7.2 శాతం తృణధాన్యాలు 6.6 శాతం 4.5శాతం కూరగాయలు 4.6 శాతం 3.8 శాతం గుడ్లు/ ఫిష్/ మాంసం 3.7 శాతం 3.5 శాతం పండ్లు/ డ్రైఫ్రూట్స్ 3.4 శాతం 3.8 శాతం పప్పులు 1.9 శాతం 1.2 శాతం చక్కెర, ఉప్పు 1.2 శాతం 0.6 శాతం -
ఇవి తిన్నారంటే చాలా డేంజర్.. ఎందుకంటే?
కరీంనగర్: ప్రజారోగ్యానికి పారిశుధ్యం ఎంత ముఖ్యమో.. తినే పదార్థాలు శుచిగా ఉండాలనేది అంతే ముఖ్యం. కానీ కరీంనగర్లో రోడ్డు పక్కన ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లే కాదు.. ఎక్కువ శాతం హోటళ్లలోనూ శుచీ, శుభ్రత, సరఫరా చేసే ఆహారపదార్థాల నాణ్యత దారుణంగా ఉంటోంది. కల్తీ మయంగా మారిన ఈ పరిస్థితిని నివారించేందుకు కొరడా ఝళిపించాల్సిన ఆహార తనిఖీ అధికారులు మొద్దు నిద్ర పోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏడాదికి ఒకసారో.. రెండుసార్లో మొక్కుబడిగా హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లపై దాడులు చేస్తూ ఒకటి రెండు కేసులు నమోదు చేస్తూ మమ అనిపిస్తున్నారు. ఆహార పదార్థాల శాంపిళ్లను సేకరించి ప్రయోగశాలలకు పంపి ఇక తమ పని అంత వరకేనన్నట్లుగా వ్యవహరించడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఇలా జరిగింది.. సరదాగా కుటుంబ సభ్యులతో బయటకు వెళ్లిన తిరుపతి చికెన్ మంచూరియా కోసం నగరంలోని ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ వద్దకు వెళ్లారు. అక్కడ సుష్టుగా తిని ఇంటికి వచ్చారు. కొద్ది సేపటికే వాంతులు, విరోచనాలు మొదలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి వెళ్తే ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఇలా జరిగిందని వైద్యులు తేల్చారు. కృష్ణకుమార్ పుట్టిన రోజు అని సరదాగా ఫ్రెండ్స్‌తో కలిసి రోడ్డు పక్కన ఫాస్ట్ సెంటర్ వద్ద చికెన్ ఫ్రైడ్ రైస్ తిన్నారు. మరుసటి రోజు కడపునొప్పి రావడం, కొద్ది సేపటికే విరోచనాలు మొదలవడంతో నీరసించిపోయాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రిలో చేర్పించగా ఫుడ్ పాయిజన్ అని చెప్పి వైద్యులు చికిత్స అందించారు. హోటల్ పెట్టాలంటే.. గతంలో హోటల్ పెట్టాలంటే కార్పొరేషన్ ఇచ్చే ట్రేడ్ లైసెన్సుకు తోడు వివిధ రకాల అనుమతులు పొందాల్సి వచ్చేది. మారిన పరిస్థితులు, నిబంధనల దృష్ట్యా ట్రేడ్, ఫుడ్ లైసెన్సులు పొందితే చాలు. ఇవీ ప్రమాణాలు ► వంట కోసం ఉపయోగించే నూనెను ఒకసారి కంటే ఎక్కువ వాడరాదు. ► వండిన పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిజ్‌లలో నిల్వచేయొద్దు. ► తాగునీటికి తప్పనిసరిగా ఫిల్టర్ వినియోగించాలి. ► కుళ్లిన పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగదారుడికి సరఫరా చేయరాదు. ► కోడి, మేక మాంసంలను ఒకేచోట పెట్టరాదు. పదార్థాలను సరైన వాతావరణంలో నిల్వ ఉంచాలి. ► వంటగది శుభ్రంగా ఉంచుకోవాలి. మురుగునీటి వ్యవస్థ చుట్టుపక్కల ఉండరాదు. తనిఖీలతో సరి హోటళ్లు, ఫాస్ట్సెంటర్లు, బేకరీలు.. ఇతర సంస్థలపై అప్పుడప్పుడు అధికారులు తనిఖీలు చేస్తున్నా వాటి యాజమాన్యాల తీరులో మార్పు ఉండటం లేదు. అపరిశుభ్ర పదార్థాలను సరఫరా చేస్తూనే ఉన్నారు. కారణం.. తనిఖీలు చేసినా అంతగా ఇబ్బంది పెట్టే చర్యలు ఉండవన్న ధీమా వారిలో నెలకొంది. పూర్తిస్థాయిలో ఆయా సంస్థలపై కఠిన చర్యలు తీసుకున్న ఉదంతాలు మచ్చుకై నా లేవు. హెచ్చరికలు, ట్రేడ్ లైసెన్సులను ఉపసంహరించడం వంటి చర్యలతో సరిపెడుతున్నారు. స్కిన్ అలర్జీలు వస్తాయి.. కల్తీ నూనెలు, కల్తీ వస్తువులతో చేసే ఫాస్ట్, జంక్ ఫుడ్ తినడం వల్ల స్కిన్ అలర్జీలు ఎక్కువగా వస్తాయి. కండ్ల వద్ద వాపు, పెదాలు వాపు రావడం, అక్కడితో ఆగకుండా గొంతు వాపు వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో అత్యవసరంగా చికిత్స అందించాల్సి ఉంటుంది. – డాక్టర్ రాచకొండ రమేశ్, చర్మ వ్యాధి నిపుణులు జంక్ ఫుడ్‌తో ప్రమాదం.. హోటల్స్, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో తినే జంక్‌ఫుడ్‌తో చాలా ప్రమాదాలు ఉన్నాయి. రెగ్యులర్‌గా తినే వారు గ్యాస్ట్రబుల్, అల్సర్ వంటి వ్యాధుల భారినపడుతున్నారు. ఈ మధ్య కాలంలో కేసులు 20 శాతం పైగా పెరిగాయి. సహజసిద్ధమైన ఫుడ్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం కాపాడుకోవచ్చు. – డాక్టర్ అనిల్‌కుమార్, జనరల్సర్జన్ నియంత్రణ ఉండాలి.. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు ఇష్టారీతిన సెకండ్ క్వాలిటీ వస్తువులు, అడ్డగోలుగా కెమికల్స్ వాడుతూ ఫుడ్ రుచికరంగా తయారుచేస్తున్నారు. దీంతో జనాలు సైతం రుచికి అలవాటు పడి తింటున్నారు. అది తినడం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురై ఇబ్బందులు పడుతున్నారు. వాటిపై నియంత్రణ ఉండాలి. – శ్యాంసుందర్, కరీంనగర్ నిరంతర తనిఖీలు చేపట్టాలి.. ఆహార కల్తీకి పాల్పడుతున్న హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లపై నిరంతరం తనిఖీలు చేపట్టాలి. రుచి కోసం హానికరమైన కెమికల్స్ వాడినట్లు గుర్తిస్తే క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. నూనెను ఎక్కువ రోజులు వాడడం వల్ల వివిధ రకాల రోగాలు వస్తున్నాయి. – భాస్కర్, కరీంనగర్ ఊబకాయులుగా తయారవుతారు.. కల్తీ ఆహారపదార్థాలు, చీజ్, బట్టర్ వంటివి వాడడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఊబకాయులుగా తయారయ్యే ప్రమాదం ఉంది. మనిషికి ఊబకాయంతో పాటు బ్లడ్‌లో కొవ్వు చేరడం వల్ల రక్తనాళాలు మూసుకుపోతాయి. దీంతో రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. – డాక్టర్ ఉపేందర్‌రెడ్డి, క్రిటికల్‌కేర్ నిపుణులు -
అమ్మో ఫాస్ట్‌ఫుడ్! హైదరాబాద్‌లో కల్తీ పంది నూనె కలకలం.. కొవ్వు కొని..
సాక్షి, హైదరాబాద్: సిటీ లైఫ్‌లో ప్రజల దినచర్య బిజీబిజీగా గడుపుతుంటారు. కాలుష్య కోరల్లో ప్రయాణం, ఫాస్ట్ ఫాస్ట్‌గా పరిగెత్తుతూ ఫాస్ట్ పుడ్ సెంటర్లో ఆహారం తింటూ.. అలా బతుకు బండిని నడిపిస్తుంటారు. అయితే నగర కాలుష్యాన్ని మనం నియంత్రించడం అంత సులువు కాదు కాబట్టి, కనీసం మనం తినే ఆహారం విషయంలో నాణ్యత ఉండేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. ఇదిలా ఉండగా మరోవైపు ఆహార పదార్థాలే టార్గెట్‌గా కొన్ని ముఠాలు వ్యాపారాలు మొదలుపెట్టాయి. ఇటీవల నగరంలో కల్తీ అల్లంవెల్లుల్లీ పేస్ట్, ఐస్ క్రీమ్స్, సాస్, చాక్లెట్స్ బాగోతం బయటపడింది. అయితే, తాజాగా పంది కొవ్వుతో కల్తీ నూనెలు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్న ముఠా గుట్టురట్టు చేశారు నేరెడ్మెట్ పోలీసులు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని నేరేడ్మెట్ పరిధిలోని ఆర్కేపురంలో ఓ వ్యక్తి తాను నివసిస్తున్న ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా పంది కొవ్వుతో వంట నూనెలు తయారు చేస్తున్నాడు. తొలుత పంది మాంసం విక్రయించే వారి నుంచి కొవ్వు తెచ్చుకుని.. వాటిని వేడి చేసి పలు రకాల కెమికల్స్ కలిపితే అచ్చం వంట నూనెలాగా కనిపించే ఆయిల్స్‌ను తయారు చేయడం.. వాటిని రోడ్డు పక్కన ఉండే ఫాస్ట్‌పుడ్ సెంటర్లకు తక్కువ ధరకు అమ్ముతున్నాడు. ఈ దందా గతకొంత కాలంగా నిర్వహిస్తున్నాడు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు అతని ఇంటిపై ఆకస్మిక సోదాలు నిర్వహించగా.. కల్తీ గుట్టు మొత్తం బట్టబయలైంది. దీంతో నిందితుడిని నేరెడ్మెట్ పోలీసులు అరెస్టు చేశారు. చదవండి: IT Scam Hyderabad:హైదరాబాద్‌లో మరో భారీ ఐటీ కుంభకోణం -
అభివృద్ధీ... నీ పయనం ఎటు?
ఏడు సంవత్సరాల క్రితం 87 ఏళ్ల వయసులో మరణించిన భవిష్యత్తు వాది ఆల్విన్ టాఫ్లర్ ‘ఫ్యూచర్ షాక్’ అనే పుస్తకాన్ని 1970లో రాశాడు. వేగవంతమైన మార్పు ప్రజలను పిచ్చిగా మార్చుతుందని అందులో ఊహించారు. ఆ ఊహ నిజమే నని నా అనుభవాలే చెబుతున్నాయి. 75 ఏళ్ల వయసులో, ముందూ వెనుకా ఐదు తరాల వాళ్లను చూసిన మాలాంటి వారికి అభివృద్ధి పేరుతో వివిధ రంగాలలో చోటుచేసుకుంటున్న కొన్ని మార్పులు గమనిస్తుంటే ఆశ్చర్యం సంగతి అటుంచి, ఏంచేయాలో పాలుపోని పరిస్థితి కలుగుతున్నది. అన్నపూర్ణ లాంటి తెలుగు రాష్ట్రాలలో ఏ పట్టణంలో, ఏ హోటల్లో పోయినా కడుపునిండా తినే తెలుగువారి భోజనం దొరకదు. అన్నం, కూర, పప్పు, నెయ్యి, సాంబారు, రసం, గోధుమ పిండి రొట్టె, పూరీ లాంటి పదార్థాలతో భోజనం పెట్టే హోటళ్లు మచ్చుకైనా కానరావు. పేరుకు అన్నీ ఫైవ్ స్టార్, త్రీ స్టార్ హోటళ్లు. బిరియానీ, పలావ్, జింజర్ రైస్, పన్నీర్, మైదా పిండో మరేదో దానితో చేసిన బటర్ నాన్, నాన్, రోటీ, కుల్చా లాంటివి తినాల్సిందే. లేదా పస్తు ఉండాల్సిందే. ‘పేదరాసి పెద్దమ్మ’ సంస్కృతి రోజుల రుచికరమైన భోజనం, సత్రాల భోజనం, తరువాత కాలంనాటి ఉడిపి హోటళ్ళ భోజనాలు ఏమయ్యాయి? డాక్టర్ దగ్గరికి పోతే పాతరోజుల్లాగా ఒంటి మీద చేయి వేసి, స్టెతస్కోప్ పెట్టి పరీక్ష చేసి, చూడడం గత చరిత్ర అయిపోయింది. గుడికి పోతే దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టనివ్వరు. తీర్థం ఒకచోట, ప్రసాదం ఇంకొక చోట ఇస్తారు. వివిధ రకాల సేవల పేరు మీద ఛార్జీలు ఉంటాయి. మొదట్లో పెద్ద గుళ్లకే పరిమితమైన ఈ సంస్కృతి ఇప్పుడు గ్రామాలకు, చిన్నచిన్న దేవాలయాలకు కూడా పాకింది. అన్నింటికీ అనవసరమైన పరిమితులు. ఇంటికి కావాల్సిన నెలవారీ సరుకులు ఒకప్పుడు హాయిగా దగ్గరలోని కొట్టుకుపోయి, స్వచ్ఛమైన, కల్తీలేని వాటిని, కొట్టువాడి ముందర పరీక్ష చేసి చూసుకుని, తూకం వేయించుకుని కొనుక్కునే వాళ్లం. ఇప్పుడు సంస్కృతి మారింది. పెద్దపెద్ద సూపర్ బజార్లలోకి పోయి, మనమే మనకు కావాల్సిన సామాన్లు వెతికి పట్టుకుని, ఒక బండిలో వేసుకుని తెచ్చుకోవాలి. అన్నీ ప్యాక్ చేసి ఉంటాయి. ఇన్ని గ్రాములు, ఇన్ని కేజీలు అని ఉంటుంది వాటిమీద. నిజంగా అంత తూకం ఉంటాయా లేదా అనేది సందేహమే! పైగా ఒక ఎక్స్పైరీ డేట్ వేస్తారు. అందులో ఎంత కల్తీనో తెలుసుకునే మానిటరింగ్ మెకానిజం లేదనాలి. సరుకు తెచ్చుకున్న తరువాత ప్యాకెట్లు విప్పిచూస్తే కొన్నిట్లో పురుగులు ఉంటాయి. ఇదేంది అని అడిగితే పాకింగ్ చేసింది మేం కాదుకదా! అని జవాబు. ఇక మెడికల్ షాప్‌కు పోతే మనకు కావాల్సింది ఒక ఐదారు టాబ్లెట్స్ అయినా... షాపువాడు మొత్తం స్ట్రిప్ కొనమంటాడు. ఏ వస్తువు కొన్నా (ఫర్నిచర్ దగ్గర నుండి, ఎలక్ట్రానిక్ పనిముట్ల వరకు) వాటికి రిపేర్ వస్తే, కొన్న చోట కాకుండా వేరే వర్క్ షాప్‌కు వెళ్లాలి. వాళ్లకు ఫోన్ చెయ్యాలంటే, టోల్ ఫ్రీ అనే నెంబర్‌కు చేయాలి. అది ఏ దేశంలో ఉంటుందో తెలియదు. వాళ్లు ‘ఒకటి నొక్కు, రెండు నొక్కు...’అంటూ డిస్కనెక్ట్ చేస్తారు. అసలు చిన్న చిన్న దుకాణాల సంస్కృతి పూర్తిగా పోవడం చాలా దురదృష్టకరం. చిన్నతనంలో తెల్ల కాగితాలు, పెన్సిల్, సిరా బుడ్డి, పిప్పరమింట్లు, చాక్లెట్లు, నువ్వుల జీడీలు, బిస్కట్లు లాంటివి కొనుక్కోవడానికి అక్కడక్కడ చాలా చిన్నచిన్న దుకాణాలు ఉండేవి. ఇప్పుడు చిన్న గుండు సూది కొనాలన్నా పెద్ద షాపునకు పోవాల్సిందే! అధిక ధరలు చెల్లించాల్సిందే. ఇంటి ముందుకు, తాజా కూరగాయలు తెచ్చి అమ్మే రోజులు పోయి కూరగాయల మార్కెట్లు వెలిశాయి. వాటిమీద బతికేవారు ఉపాధి కోల్పోయారు. ఫ్యామిలీ డాక్టర్ సంస్కృతీ పోయింది, పరాయి ఊరుకు వెళ్లినప్పుడు బంధువుల ఇళ్లలో ఉండే అలవాటు పోయింది. చక్కటి, చిక్కటి స్వచ్ఛమైన పాలను ఇంటి ముందర కొనుక్కునే ఆచారం పోయింది. ఇంటి వెనుక పెరుగు చిలికిన చల్ల కడుపు నిండా తాగే రోజులు పూర్తిగా పోయాయి. వేరు శనగపప్పుతో ఎవరికివారు శనగ నూనె చేయించుకుని ఏడాది పొడుగూతా వాడే అలవాటు పోయింది. నడక ప్రయాణం కనుమరుగైంది. కడుపు నిండా భోజనం తినే సంస్కృతి స్థానంలో పిజ్జా, బర్గర్స్ వచ్చాయి. స్వచ్చమైన వెన్న, నెయ్యి లభ్యమయ్యే ప్రదేశాలు మచ్చుకైనా లేవు. జొన్న చేలలో ఉప్పు, కారం కలుపుకున్న దోసకాయలు తినే రోజులు ఇకరావేమో! చేలల్లో పెసరకాయలు వలుచుకు తినే అదృష్టం ఇక లేనట్టేనేమో. అన్నీ ఫాస్ట్ ఫుడ్సే. పెరుగు, నెయ్యి, పాలు, తేనె, కూరలు, నూనె, ఒకటేమిటి... అన్నీ ప్యాక్ చేసిన (కల్తీ) ఆహారాలే! చివరకు సీజనల్ పండ్లు కూడా కలుషితమైనవే! కాలుతీసి కాలు బయట పెట్టకుండా, కనీస వ్యాయామం లేకుండా, ఒంటికి చెమట పట్టకుండా, నిరంతరం ఏసీ గదుల్లో ఉంటూ అన్నీ ఇంటి ముంగిటే పొందడం! బాత్రూమ్ కూడా బెడ్రూమ్కు అను బంధమే! ఇలా రాసుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇలా ఎన్నో కోల్పోతున్నాం. ఇంకా ఎన్ని కోల్పోవాలో? ఇదంతా చూస్తూ, అను భవిస్తూ ‘అభివృద్ధీ నీ పయనం ఎటువైపు?’ అని నిట్టూర్చడం కన్న చేయగలిగిందేముంది? వనం జ్వాలా నరసింహారావు వ్యాసకర్త తెలంగాణ సీఎం సీపీఆర్ఓ -
ఫాస్ట్ఫుడ్స్ హానికరం కాదు.. అవే అత్యంత ప్రమాదకరం
సాక్షి, కాకినాడ: తినే ఆహారమే వ్యక్తి ఆయుష్షును నిర్ణయిస్తుందని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ వ్యవస్థాపకుడు, ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి చెప్పారు. కాకినాడలోని రంగరాయ వైద్యకళాశాల ఆడిటోరియంలో ఆదివారం జరిగిన రీజినల్ అకడమిక్ కాన్ఫరెన్స్‌లో ఆయన విశిష్టవక్తగా పాల్గొన్నారు. ‘గ్యాస్ట్రోఎంట్రాలజీలో తాజా పురోగతులు’, ‘వ్యక్తిగా విజయం సాధించేందుకు దోహదంచేసే అంశాలు’ అనే అంశాలపై ఆయన మాట్లాడారు. ఫాస్ట్ఫుడ్స్ హానికారకం కాదని, రంగు, రుచి, వాసన, నిల్వసామర్థ్యం పెంచేందుకు వాటిలో కలిపే అడెటివ్స్ (సంకలనాలే) అత్యంత ప్రమాదకరమని తెలిపారు. ప్రపంచ ఆరోగ్యసంస్థతో కలిసి గత ఆరేళ్లలో తెలంగాణ ప్రభుత్వం మంచినీటి సరఫరా, నాణ్యతను విస్తృతం చేసి విజయవంతమైందని చెప్పారు. ఈ చర్య వల్ల నీటి ద్వారా వ్యాపించే ఎన్నో అనారోగ్యాలు తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నారు. కేవలం జంక్ఫుడ్స్ తినడానికి అలవాటుపడిన వారిలో వయసుతో నిమిత్తంలేని జీర్ణకోశ వ్యాధులను గుర్తిస్తున్నామని తెలిపారు. క్రోన్స్ డిసీజ్, ఐబీడీ, అల్సరేటివ్ కొలైటీస్ ఎక్కువగా నమోదవుతుండడం ఆందోళనకు గురిచేస్తోందని చెప్పారు. అనంతరం జీవితంలో విజయానికి దోహదం చేసే అంశాలపై చర్చించారు. సమయపాలన, ఎప్పటిపని అప్పుడే పూర్తిచేసే లక్షణం, నిరంతరం నేర్చుకునే ఆసక్తి ఏ వ్యక్తినైనా ఉన్నత శిఖరాలకు చేరుస్తాయని డాక్టర్ నాగేశ్వరరెడ్డి చెప్పారు. -
ఫాస్ట్‌ఫుడ్ సెంటర్స్‌లో తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త అంటూ..
వైరల్: మనం రోజూ తినే ఆహారం.. ఎంత హైజెనిక్ అనేది ఊహించలేం. అలాగే ప్రాసెసింగ్ ఫుడ్ విషయంలోనూ ఎలాంటి పద్ధతులు పాటిస్తారు, ఎంత నాణ్యంగా వ్యవహరిస్తారు అని అంచనా వేయడమూ కష్టమే!. ఈ రెండింటి విషయంలో పట్టింపు ఉన్నవాళ్లు బయటి ఫుడ్ల జోలికి పోరనేది వాస్తవం. మరి బయటి ఫుడ్ ఎక్కువగా లాగించే వాళ్ల పరిస్థితి!. అలాంటి వాళ్లను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో తరచూ కొన్ని వీడియోలు, ఫొటోలు కనిపిస్తున్నాయి. వాటిని పట్టించుకోవడం, పట్టించుకోకపోవడం ఇక వాళ్ల వంతు. తాజాగా.. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో నూడుల్స్ తింటున్నారా? అయితే జాగ్రత్త అంటూ ఓ వీడియో నెట్లో వైరల్ అవుతోంది. తయారీ విధానం చూడండి అంటూ ఓ వ్యక్తి ఆ వీడియోను ట్విటర్ ద్వారా వదలడంతో హల్ చల్ చేస్తోంది. ఓ చిన్నఫ్యాక్టరీలో చిన్నస్థాయి రెస్టారెంట్లలో, రోడ్‌సైడ్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో వాడే నూడుల్స్ తయారీ విధానం ఇదంటూ ఓ వ్యక్తి వీడియోను పోస్ట్ చేశాడు. దీంతో ఆహార నాణ్యతపై మరోసారి చర్చ మొదలైంది. ఇది ఎక్కడ ఎప్పుడు తీశారనే దానిపై స్పష్టత లేదు. రకరకాల కామెంట్లు కనిపిస్తున్నాయి. స్టార్ హోటల్స్‌లోనూ ఇంతకంటే దారుణమైన పరిస్థితులు ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. నిత్యం మనం తీసుకునే ఆహారాన్ని అంచనా వేయడం కష్టమని కొందరు.. ఇలాంటి ఆహారం తినకపోవడమే మంచిదంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఆ వీడియోను మీరూ చూసేయండి. When was the last time you had road side chinese hakka noodles with schezwan sauce? pic.twitter.com/wGYFfXO3L7 — Chirag Barjatya (@chiragbarjatyaa) January 18, 2023 -
Beauty Tips: నాలుగైదు పూటలు తింటా.. ఇంకా.. నా బ్యూటీ సీక్రెట్ అదే!
అందానికే అసూయ పుట్టించే అందం ఐశ్వర్యా రాయ్ సొంతం. పెళ్లై, ఓ బిడ్డకు తల్లైన తర్వాత కూడా 48 ఏళ్ల ఐష్ తన అందాన్ని కాపాడుకుంటోంది. రోజురోజుకీ ఆమె అందం ద్విగుణీకృతం అవుతోందనడంలో సందేహం లేదు. కాగా మంగళూరులో జన్మించిన ఐశ్వర్య 1994లో ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకున్న విషయం తెలిసిందే. ఓ తరానికి ఆరాధ్య హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ఐశ్వర్యారాయ్ బచ్చన్ బ్యూటీ సీక్రెట్ గురించి ఆమె మాటల్లోనే! ‘‘నాకు జెనెటికల్‌గా అందిన వరం.. మంచి స్కిన్. దాన్ని కాపాడుకోవడానికి వంశపారంపర్యంగా అందిన సంపద .. అద్భుతమైన చిట్కాలు. అవీ హైరానా పడకుండా పాటించే సింపుల్ సూత్రాలు. ఏం లేదు.. వేయించిన, మసాలా కూరలకు చాలా దూరం నేను. ఆవిరి మీద ఉడికించిన తాజా కూరగాయలను తింటాను. రైస్ విషయానికి వస్తే బ్రౌన్ రైస్ తీసుకుంటా. మూడు పూటలు కడుపు నిండుగా తినకుండా కొంచెం కొంచెంగా నాలుగైదు పూటలు తింటాను. మంచి నీళ్లు బాగా తాగుతాను. మా అమ్మ ఇవే పాటిస్తుంది. నేనూ అదే ఫాలో అవుతున్నాను.. చిన్నప్పటి నుంచీ’’. - ఐశ్వర్య రాయ్ బచ్చన్ చదవండి: Mint Paste Face Pack: పుదీనా పొడి, ముల్తానీ మట్టి, రోజ్ వాటర్.. మొటిమలు మాయం! -
కేఎఫ్‌సీ చికెన్‌లో కోడి తల.. కస్టమర్‌కు చేదు అనుభవం!
కేఎఫ్‌సీ చికెన్‌కు ప్రపంచవ్యాప్తంగా యమ క్రేజీ ఉందనడంతో అతిశయోక్తి లేదు! భోజన ప్రియులు ఈ ఫ్రైడ్ చికెన్‌ను లొట్టలేసుకులాగించేస్తారు. ఐతే ఓ మహిళ ముచ్చటపడి తన కిష్టమైన కేఎఫ్‌సీ చికెన్ బాక్స్‌ను ఆర్డరిచ్చిమరీ ఇంటికి తెచ్చుకుంది. తిందామని తెరిచిచూస్తే షాక్ కొట్టినంతపనైంది. ఇంగ్లాండ్‌లోని ట్వికెన్‌హామ్‌కు చెందిన గాబ్రియేల్ అనే మహిళ కేఎఫ్‌సీ టేక్అవే బాక్స్‌ను ఆర్డరిచ్చి తెప్పించుకుంది. ఐతే చికెన్ బాక్స్‌లో పిండి పూసిన కోడి తల కాయ వచ్చింది. పాక్షికంగా ఉడికిన తల, కళ్ళు, ముక్కుతో ఉన్న కోడి తలకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తను ఎదుర్కొన్న చేదుఅనుభవాన్ని పంచుకుంది. దీనిపై స్పందించిన కేఎఫ్‌సీ కంపెనీ ఈ ఫొటోను చూసి మేము ఆశ్చర్యపోతున్నాము. మొత్తం తల ఎలా వచ్చిందో, ఎలా జరిగిందో పరిశీలిస్తామని, ఈ తప్పు మళ్లీ జరగకుండా నివారిస్తామని తెలిపింది. అంతేకాకుండా ఆమెను కేఎఫ్‌సీ అధికారులు ఆమెను సంప్రదించి ఉచితంగా మరొక చికెన్ బాక్స్ అందించడమేకాకుండా ఆమెను, ఆమె కుటుంబం మొత్తాన్ని సదరు సెంటర్‌కు ఆహ్వానించింది. తాము ఏవిధంగా కిచెన్‌లో చికెన్ ప్రిపేర్ చేస్తామో తనిఖీ చేయమని అదే టేక్అవే కేఎఫ్‌సీ ప్లేస్‌కు రావల్సిందిగా కోరింది. కాగా గతంలో ఓ వ్యక్తికి కేఎఫ్‌సీ రెస్టారెంట్లో సరిగ్గా ఉడకని చికెన్ సర్వ్ చేసిన సంగతి తెలిసిందే! చదవండి: Good News! ఇక డెబిట్, క్రెడిట్ కార్డులు లేకుండానే ఆన్లైన్ షాపింగ్! -
ఫాస్ట్ఫుడ్స్కు స్వస్తి.. పూర్వీకుల ఆహారంపై మక్కువ చూపుతున్న జనం
తరం మారుతోంది...వారి స్వరం కూడా మారుతోంది. ఆరోగ్యమే మహా భాగ్యమంటూ చిరుధాన్యాలను తమ ఆహార మెనూలో చేర్చి అగ్రస్థానం కల్పిస్తున్నారు. తమ జాబితాలో మొదటి స్థానంలో ఉండే బిర్యానీ, ఫాస్ట్‌ఫుడ్, జంక్ ఫుడ్లను తొలగిస్తూ ఆరోగ్యప్రద ఆహారాలకు ప్రధానంగా యువత ప్రాధాన్యమిస్తున్నారు. ఫాస్ట్ఫుడ్స్కు క్రమేపీ దూరమవుతూ.. చిరు ధాన్యాల వైపు జనం దగ్గరవుతున్నారు. ఆహారపు అలవాట్లలో మార్పు రావడంతో ఇందుకు అనుగుణంగా మార్కెట్ కూడా మారుతోంది. చిరుధాన్యాల పట్ల ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుండడంతో బియ్యం దుకాణాల్లో ఇవి కూడా అమ్మకానికి పెడుతున్నారు. బిస్కెట్లు, చాక్లెట్లు, చపాతి, మురుకులు, ఇడ్లీలు కూడా చిరుధాన్యాలతో తయారు చేస్తున్నారు. కరోనా రాకతో మరింత గిరాకీ మనిషికి హిమోగ్లోబిన్ 15 గ్రాములుంటే వ్యాధి నిరోధక శక్తి బాగుంటుందని వైద్యులు సూచిస్తున్నారు. అన్నిటికంటే రాగులు ద్వారా శరీరానికి అవసరమైన పోషక పదార్ధాలు అందుతాయి. ముఖ్యంగా ఎముకలకు కాల్షియాన్ని అందిస్తుంది. ఈ విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు రాగికి బెల్లం జతచేసిన ఆహార పదార్ధాలు ఇళ్లల్లో తయారీ చేయిస్తూ తమ పిల్లలకు అందిస్తున్నారు. గ్లూకోజ్ స్థాయులను కూడా నియంత్రించడంలో రాగులు దోహదపడుతుండడంతో మధుమేహులు కూడా ఆకర్షితులవుతున్నారు. వీటితోపాటు జొన్నలు, సజ్జలు, కొర్రలు, సామలను కూడా తమ ఆహారంలో చేర్చుకుంటున్నారు. బెల్లంతో చేసిన తినుబండారాలను ఇప్పుడు ఎక్కువగా తీసుకుంటున్నారు. బెల్లం పాకంతో వేరుశెనగ, నువ్వు ఉండలు, రాగి లడ్డు, మినపలడ్డు, రాగి అట్టులను యువత ఇష్టపడుతుండడంతో మిఠాయి దుకాణాల్లో ఇవి స్థానం దక్కించుకుంటున్నాయి. -
ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ గొడవ.. కస్టమర్‌పై కత్తెర విసిరికొట్టిన ఉద్యోగి
ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌కు వచ్చిన కస్టమర్లకు రకరకాల రుచులు ఆహ్వానం పలుకుతుంటే.. వాటిని ఆరగించే తొందరలో హడావిడి చేస్తుంటారు. ఆ హడావిడి నార్మల్‌గా ఉంటే పర్లేదు. ఒక్కోసారి శృతి మించితే..! లేదంటే ఫాస్ట్‌ఫుడ్ సిబ్బంది విచక్షణ కోల్పోతే నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి అమెరికాలో చోటుచేసుకుంది. అమెరికాలోని మేరిల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్ నగరానికి చెందిన ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ 'చిపోటిల్'కు ఆంటోనీ ఎవాన్స్ అనే కస్టమర్ వచ్చాడు. ఆంటోనీ తనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్ ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చాడు. అయితే, ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ ఐటమ్ అందాలంటే అరగంట వెయిట్ చేయాల్సి ఉంది. కానీ ఆంటోనీకి ఇక్కడ సర్వీస్ బాగోలేదని తిట్టుకుంటూనే ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ ఐటమ్‌ను వెంటనే తీసుకొని రావాలని అడిగాడు. ఆలస్యం అవుతుందని మేనేజర్‌తో మాట్లాడాలని హడావిడి చేశాడు. అదే సమయంలో కౌంటర్లో ఉన్న ఓ మహిళా ఉద్యోగి తానే ఈ రెస్టారెంట్ మేనేజర్‌ను అంటూ కస్టమర్ తో వాదనకు దిగింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ మహిళా.. కస్టమర్‌పై కత్తెర విసిరి కొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నేను ఆర్డర్ ఇచ్చాను. మీరు ఆర్డర్‌ను తీసుకొని రాలేదు. అందుకే కంప్లెయింట్ ఇచ్చానంటూ మాట్లాడుతున్న వీడియో ఫేస్ బుక్‌లో లైవ్‌లో వస్తుంది. దీంతో కస్టమర్ తీరుతో ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు మహిళా ఉద్యోగి కిచెన్ రూమ్‌లో నుంచి కేకలు వేసింది. అయినా వీడియో తీస్తుండడంతో.. క్యాష్ కౌంటర్లో ఉన్న రెండు కత్తెర్లని కస్టమర్‌పై విసిరేసింది. దీంతో భయాందోళనకు గురైన కస్టమర్ .. వామ్మో మీరే చూశారుగా ఆమె నాపై కత్తెర్లతో ఎలా దాడి చేసిందో అంటూ కేకలు వేశాడు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న బాల్టిమోర్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. -
వారి టార్గెట్ యాత్రికులే.. మూడు పార్శిళ్లు ఆరు కర్రీలుగా దందా!
రద్దీ ప్రాంతాల్లోని బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో.. ఆకట్టుకునే రంగులతో మసాలాలు దట్టించిన ఆహారం.. నూనెల్లో వేయించిన పదార్థాలు.. చూస్తూనే నోరూరించేలా ఉండే కర్రీలు.. సర్వ సాధారణం. వీటి తయారీలో వాడే కృత్రిమ రంగులు, కల్తీ నూనెలు అత్యంత ప్రమాదకరమని అధికారులు ధ్రువీకరిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న పలు ఫుడ్ సెంటర్లు, హోటళ్లలో సేకరించిన శాంపిల్స్‌లో కేన్సర్ కారక పదార్థాలు ఉన్నట్లు తేలడంతో.. ఇవి తింటే రోగాలు తప్పవని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాక్షి,చిత్తూరు: జిల్లాలో కల్తీ ఆహార పదార్థాలు ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించాయి. ఈ దందా.. రోజురోజుకూ శృతి మించుతుండడంతో జనం రోగాల బారిన పడుతున్నారు. చిత్తూరులోని పాతబస్టాండ్, హైరోడ్డు, కట్టమంచి, తిరుపతిలోని కొత్తబస్టాండ్, లీలామహాల్రోడ్డు, తుడారోడ్డు, పుత్తూరు బస్టాండ్ సమీపంలోని ప్రాంతాలు, మదనపల్లె, పలమనేరు, శ్రీకాళహస్తిలోని కొన్ని కూడళ్లలో జనం రద్దీ అధికంగా ఉంటుంది. ఇక్కడ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, కర్రీ పాయింట్లు, మాంసాహార ఉత్పత్తులు అధికంగా విక్రయిస్తుంటారు. వీటిలో వినియోగించే పదార్థాలు పలు వ్యాధులకు కారణమవుతున్నాయని అధికారులు గుర్తించారు. జిల్లాలోని 75 హోటల్స్‌లో అధికారులు ఇటీవల తనిఖీలు నిర్వహించి, ప్రమాదకరమని భావిస్తున్న 17 శాంపిల్స్‌ను సేకరించి పరీక్షలకు పంపారు. వీటిలో 6 శాంపిల్స్ వినియోగానికి ఏమాత్రం తగవని తేలింది. అయినా ఈ కల్తీఫుడ్ దందా మాత్రం యథేచ్ఛగా సాగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. యాత్రికులే టార్గెట్.. జిల్లాలో ఆలయాలు ఎక్కువగా ఉండడంతో నిత్యం లక్షలాది మంది యాత్రికులు ఇక్కడికి వస్తుంటారు. తిరుపతి, తిరుచానూరు, కాణిపాకం, బోయకొండ, శ్రీకాళహస్తి వంటి రద్దీ ప్రాంతాల్లో ఫుడ్‌సెంటర్ల వ్యాపారం మూడు పార్శిళ్లు.. ఆరు కర్రీలు అన్న తరహాలో సాగుతోంది. దీనికితోడూ మాసం భోజన ప్రియులు గతంలో కంటే పెరగడంతో హోటల్స్, డాబా, ఫాస్ట్‌ఫుడ్, స్నాక్స్, బిర్యానీ దుకాణాలు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్నాయి. లైసెన్సులుండవు ఆహార పదార్థాలు తయారుచేసేవారు, నిల్వ చేసే వ్యాపారులు, రవాణా చేసే సంస్థలు తప్పనిసరిగా లైసెన్స్‌లు పొందాలి. ఆహార భద్రతా నియామావళి ప్రకారం లైసెన్సులు లేకుండా వ్యాపారం చేస్తే చట్టప్రకారం కేసులు నమోదు చేసి రూ.5 లక్షల జరిమానా, 6 నెలల జైలు శిక్ష విధిస్తారు. జిల్లా వ్యాప్తంగా లైసెన్స్ ఉన్న హోటళ్లు: 73, రెస్టారెంట్లు–395, క్యాంటీన్లు–98, డాబా లేదా ఫుడ్ వెండింగ్స్–56 మాత్రమే లైసెన్సులు కలిగి ఉన్నాయంటే అతిశయోక్తికాదు. వీటికి రెట్టింపు సంఖ్యలో దుకాణాలకు ఎలాంటి అనుమతులు లేవు. ప్రధాన సమస్య ఇదే.. ముఖ్యంగా మాంసాహార పదార్థాలు విక్రయింటే దుకాణాలు, బేకరీ, స్వీట్స్ తయారీలో ఎసెన్స్ సింథటిక్ రంగులు అధికంగా వినియోగిస్తుండడంతో కేన్సర్ బారిన పడే అవకాశం ఉందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. వీటికితోడు హోటల్స్‌లో చికెన్, మటన్, రొయ్యలు ఎక్కువ రోజులు డీప్‌ఫ్రిజ్‌లో ఉంచి వాడుతున్నారు. ఇవి వినియోగదారుల శరీరాలను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా జీర్ణకోశ సంబంధ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. -
రూ.750 జీతంతో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో పనిచేశాను: స్టార్ హీరో
చెన్నై : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయే గొప్ప నటుడాయన. విలక్షణమైన నటనతో పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతి త్వరలోనే బుల్లితెర ప్రేక్షకుల్ని సైతం అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన హోస్ట్‌గా ‘మాస్టర్ చెఫ్’ అనే కార్యక్రమం త్వరలోనే తమిళంలో ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రోగ్రామ్ ట్రైలర్ లాంఛ్ సందర్భంగా విజయ్‌సేతుపతి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తాను సినిమాల్లోకి రాకముందు కుటుంబ పోషణ కోసం ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో పనిచేసినట్లు పేర్కొన్నారు. 'చెన్నైలో చదువుకుంటున్న రోజుల్లో కాలేజీ పూర్తైన తర్వాత సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి అర్థరాత్రి 12:30 గంటలవరకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేసేవాడ్ని.అక్కడే రాత్రి భోజనం కూడా తినేవాడ్ని. డబ్బులతో పాటు ఆకలి కూడా తీరుతుందనే కారణంతో అదే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చాలాకాలం వరకు పనిచేశాను. అలా నాకు ప్రతి నెలా రూ.750 జీతం ఇచ్చేవాళ్లు. దీంతో పాటు ఓ మూడు నెలల వరకు టెలిఫోన్ బూత్‌లో కూడా పనిచేశాను' అని సేతుపతి అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఇక తనకు ఉల్లి సమోసా అంటే ఎంతో ఇష్టమని, కానీ ప్రస్తుతం అది ఎక్కడా దొరకడం లేదని తెలిపారు. దీంతో ఇంట్లో ఉన్నప్పుడు తానే స్వయంగా ఉల్లిసమోసా చేసుకొని, ఒక కప్పు టీ తాగుతానని వివరించారు. -
షాకింగ్: భార్య ప్రేమను అమ్మకానికి పెట్టి మరీ..
ఇంట్లో వారి కోసం ఎంతో ప్రేమగా వంట చేస్తారు ఆడాళ్లు. ఏ మాత్రం రుచి తగ్గినా తినే వారి కంటే వండిన వారే ఎక్కువ బాధపడతారు. ఇక భర్తకు, పిల్లల కోసం ప్రత్యేక శ్రద్ధతో లంచ్ బాక్స్ తయారు చేస్తారు. తినకుండా అలానే తీసుకొస్తే వారి మనసు విలవిల్లాడుతుంది. అలాంటిది ఓ భర్త ఫాస్ట్ ఫుడ్ మీద ఇష్టంతో భార్య తన కోసం ఎంతో ప్రేమగా వండి పంపిన ఆహారాన్ని అమ్ముకుని.. అలా వచ్చిన డబ్బుతో తనకు నచ్చిన ఆహారం తినేవాడు. ఓ రోజు సడెన్‌గా ఈ విషయం భార్యకు తెలియడంతో ఆమె సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేసింది. రెడిట్ అకౌంట్లో షేర్ చేసిన ఆ వివరాలు.. ‘‘నా భర్తకు ఇంట్లో చేసిన ఆహారం కంటే ఫాస్ట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఇందుకుగాను రోజుకు 20 డాలర్ల చొప్పున నెలకు 600 డాలర్లు ఖర్చు చేసేవాడు. ప్రస్తుతం మే అద్దె ఇంట్లో ఉంటున్నాం. ఇది చాలా ఖరీదైన ఏరియా. రెంటు కూడా చాలా ఎక్కువ. దాంతో సొంత ఇల్లు కొందామని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా అవనసర ఖర్చులు తగ్గించి.. పొదుపు చేద్దామని నిర్ణయించుకున్నాం. దాంతో నేను ఇంట్లోనే శాండ్విచ్ ప్రిపేర్ చేస్తాను.. ఫాస్ట్ ఫుడ్ తినడం మారేయమని నా భర్తని కోరాను. అందుకు తను అంగీకరించాడు. తనకు లంచ్ బాక్స్‌లో శాండ్విచ్ పెట్టి పంపించేదాన్ని’’ అంటూ చెప్పుకొచ్చింది. రహస్యం ఎలా భయపడిందంటే... ‘‘ఇలా ఉండగా ఓ రోజు నా భర్త స్నేహితులు మా ఇంటికి డిన్నర్‌కి వచ్చారు. నా వంటను మెచ్చుకున్నారు. అంతేకాక ‘‘మేం ప్రతిరోజు మీ భర్త దగ్గర శాండ్విచ్ కొంటున్నాం. చాలా రుచిగా ఉంటుంది. కానీ ధరే కాస్త ఎక్కువ’’ అన్నారు. దాంతో షాకవ్వడం నా వంతయ్యింది. అంటే నా భర్త నేను పంపే శాండ్విచ్లు తినకుండా అమ్ముతున్నాడని తెలిసింది. తన స్నేహితులు వెళ్లాక దీని గురించి ఆయనని ప్రశ్నించగా.. నేను పంపే శాండ్విచ్లు అమ్మి.. అలా వచ్చిన డబ్బుతో తనకు ఇష్టమైన ఫాస్ట్ ఫుడ్ కొనుక్కోని తింటున్నాను అని తెలిపాడు’’ అన్నది. ‘‘నేను ఎంతో ప్రేమగా ఆయన కోసం ఇష్టంగా చేసిన వంటను ఇలా అమ్మకానికి పెట్టడం నాకు ఏం నచ్చలేదు. అంటే పరోక్షంగా ఆయన నా ప్రేమను అమ్మకానికి పెట్టారు. దీని గురించి తెలిసిన నాటి నుంచి నా మనసు మనసులో లేదు. ఇక జీవితంలో తన కోసం వంట చేయకూడదని నిర్ణయించుకున్నాను’’ అంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది. ఈ స్టోరి ప్రస్తుతం తెగ వైరలవుతోంది. భార్యల వంట విలువ మగాళ్లకు ఏం తెలుస్తుంది.. ఒక్కరోజు వారు వంట చేసి.. దాన్ని ఎవరు తినకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అప్పుడు వారికి అర్థం అవుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: ఫాస్ట్ ఫుడ్ కోసం హెలికాప్టర్లో 725 కిమీ.. -
బెక్టర్స్ ఫుడ్ రికార్డ్ వెనుక.. మహిళ
ముంబై, సాక్షి: రెండు రోజుల క్రితమే ముగిసిన పబ్లిక్ ఇష్యూ ద్వారా మార్కెట్లో రికార్డ్ సృష్టించిన బెక్టర్స్ ఫుడ్ విజయాన్ని పరిశీలిస్తే.. ప్రతీ వ్యాపార విజయం వెనుకా ఒక మహిళ ఉంటుందని.. పాత సామెతను చదువుకోవాలేమో? 2020లో వచ్చిన ఐపీవోలలోకెల్లా అత్యధిక సబ్‌స్క్రిప్షన్‌ను సాధించిన కంపెనీగా బెక్టర్స్ ఫుడ్ నిలిచిన సంగతి తెలిసిందే. గురువారం(17)తో ముగిసిన ఇష్యూకి ఏకంగా 198 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. కంపెనీ ప్రస్థాన వివరాలిలా.. (బెక్టర్స్ ఫుడ్ ఐపీవో- వెల్లువెత్తిన బిడ్స్) తొలుత నష్టాలు.. బెక్టర్స్ ఫుడ్ స్పెషాలిటీస్‌ను 1978 ప్రాంతంలో రజనీ బెక్టర్ ప్రారంభించారు. కేవలం రూ. 20,000 పెట్టుబడితో ఐస్‌క్రీముల తయారీ ద్వారా వ్యాపారంలోకి ప్రవేశించారు. పంజాబ్‌లోని లూఢియానాలో ప్రారంభమైన వ్యాపారం ప్రస్తుతం ఆరు యూనిట్లకు ఎగసింది. ఫిల్లౌర్, రాజ్‌పురా, తహిల్వాల్, గ్రేటర్ నోయిడా, ఖోపోలీ, బెంగళూరుల్లో తయారీ యూనిట్లున్నాయి. దేశ విభజన సమయంలో రజనీ బెక్టర్ కుటుంబం లాహోర్ నుంచి ఢిల్లీకి తరలివచ్చింది. తదుపరి లూఢియానాకు చెందిన ధరమ్వీర్ బెక్టర్ను రజనీ వివాహమాడారు. ఆపై విభిన్న వంటకాలపట్ల ఆసక్తిని చూపే రజనీ బెక్టర్ పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్శిటీలో బేకింగ్ విద్యను అభ్యసించారు. ఖాళీ సమయాల్లో ఐస్‌క్రీములు, కేకులు, కుకీస్ తయారు చేస్తుండటంతో సన్నిహితులు వ్యాపార ఆలోచనకు బీజం వేశారు. అయితే తొలినాళ్లలో నష్టాలపాలయ్యారు. ఇది గమనించిన ధరమ్వీర్ వ్యాపార మెళకువలు నేర్పించడంతో రూ. 20,000 పెట్టుబడితో ఐస్‌క్రిమ్ తయారీని ప్రారంభించారు. ఆపై నెమ్మదిగా భారీ కేటరింగ్ ఆర్డర్లు లభించడంతో వ్యాపారం పుంజుకుంది. (30 రోజుల్లో 100 శాతం లాభాలు) టర్నింగ్ పాయింట్ 1990 మధ్య ప్రాంతంలో కుటుంబ సభ్యులు సైతం అప్పటికి క్రెమికా పేరుతో నడుస్తున్న కంపెనీలో చేరారు. ఇదేసమయంలో దేశీయంగా కార్యకలాపాలు ప్రారంభించిన గ్లోబల్ దిగ్గజం మెక్‌డొనాల్డ్స్.. బన్స్, సాస్‌లు తదితరాల సరఫరా కోసం క్రెమికాను ఎంచుకుంది. ఆపై క్వేకర్ ఓట్స్‌తో జత కట్టి క్వేకర్ క్రెమికా ఫుడ్స్ పేరుతో భాగస్వామ్య సంస్థ(జేవీ)ను ఏర్పాటు చేసింది. తద్వారా ప్రధానంగా మెక్‌డొనాల్డ్స్‌కు సరఫరా చేసేందుకు కెచప్‌లు, సాస్‌లు, మిల్క్ షేక్స్ తదితరాల తయారీని ప్రారంభించింది. 1996 తదుపరి కాలంలో బిస్కట్ల సరఫరాకు ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు క్యాడ్బరీస్, ఐటీసీలకూ కస్టమర్లుగా చేసుకుంది. 1999లో జేవీ నుంచి క్వేకర్ ఓట్స్ వైదొలగడంతో కంపెనీ పేరును బెక్టర్స్ ఫుడ్ స్పెషాలిటీస్‌గా మార్పు చేసింది. 2006కల్లా 30 శాతం వార్షిక వృద్ధితో రూ. 100 కోట్ల టర్నోవర్‌కు కంపెనీ చేరుకుంది. ఇదే సమయంలో గోల్డ్‌మన్ శాక్స్ 10 శాతం వాటాను రూ. 50 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో బెక్టర్ ఫుడ్స్ విలువ రూ. 500 కోట్లను తాకింది. నిధులను గ్రేటర్ నోయిడా, ముంబై, హిమాచల్‌ప్రదేశ్ ప్లాంట్ల ఆధునికీకరణకు వినియోగించింది. 2010లో గోల్డ్‌మన్ శాక్స్ 10 శాతం వాటాను మోతీలాల్ ఓస్వాల్‌కు విక్రయించింది. (క్రికెట్ బాల్ దెబ్బ- ఉదయ్ కొటక్‌కు భలే ప్లస్) న్యూ జనరేషన్ 2013లో ముగ్గురు కుమారులు అజయ్, అనూప్,అక్షయ్ బెక్టర్లకు వ్యాపార నిర్వహణను అప్పగించారు. మొత్తం టర్నోవర్‌లో 65 శాతం వాటా కలిగిన బిస్కట్స్, బేకరీ బిజినెస్‌ను అజయ్, అనూప్ నిర్వహిస్తుంటే.. కెచప్, సాస్ తదితరాల బిజినెస్‌ను అక్షయ్ చేపట్టారు. క్రెమికా ఫుడ్ ఇండస్ట్రీస్ పేరుతో ఈ విభాగం తదుపరి కెటిల్ చిప్స్ తయారీలోకి ప్రవేశించింది. తద్వారా దేశవ్యాప్త రిటైల్ రంగంలోకి అడుగు పెట్టింది. కాంట్రాక్ట్ తయారీతోపాటు.. క్రెమికా, ఇంగ్లీష్ ఒవెన్ పేరుతో సొంత బ్రాండ్ల ద్వారా సైతం బిస్కట్స్, బేకరీ ఫుడ్స్‌ను బెక్టర్స్ ఫుడ్ విక్రయిస్తోంది. ప్రస్తుతం 4,000 మందికి ఉపాధినిస్తున్న కంపెనీ టర్నోవర్ గతేడాదికల్లా రూ. 762 కోట్లను తాకింది. ఈ ఏడాది రూ. 1,000 కోట్ల బాటలో సాగుతున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. -
బర్గర్ కింగ్.. బ్లాక్‌బస్టర్ లిస్టింగ్
ముంబై, సాక్షి: అంతర్జాతీయ ఫాస్ట్‌ఫుడ్(QSR) చైన్ల దిగ్గజం బర్గర్ కింగ్ తొలి రోజు స్టాక్ ఎక్స్ఛేంజీలలో భారీ లాభాలతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 60కాగా.. ఎన్ఎస్ఈలో ఏకంగా 85 శాతం ప్రీమియంతో రూ. 111 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. వెరసి రూ. 51లాభంతో లిసయ్యింది. తదుపరి రూ. 119 వరకూ ఎగసింది. ప్రస్తుతం రూ. 111 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలోనూ. 115 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇటీవలే ముగిసిన బర్గర్ కింగ్ పబ్లిక్ ఇష్యూ దాదాపు 157 రెట్లు అధికంగా సబ్స్క్రిప్షన్ లభించిన సంగతి తెలిసిందే. 7.44 కోట్ల షేర్లను కంపెనీ అమ్మకానికి ఉంచగా.. మొత్తం 1,167 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖయ్యాయి. రూ. 59-60 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 810 కోట్లను సమకూర్చుకుంది. ఇష్యూ నిధులలో కొంతమేర బర్గర్ కింగ్ రెస్టారెంట్స్ పేరుతో కొత్త కంపెనీ ఏర్పాటుకు వినియోగించనున్నట్లు మాతృ సంస్థ ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. అంతేకాకుండా స్టోర్ల విస్తరణకూ వినియోగించనుంది. ఇష్యూకి ముందు రోజు కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 364 కోట్లకుపైగా సమకూర్చుకుంది. (బర్గర్‌కింగ్ పుష్- బెక్టర్స్ ఫుడ్ ఐపీవోకు రెడీ) ఐదేళ్లలో.. గ్లోబల్ క్యూఎస్ఆర్ చైన్ సంస్థ బర్గర్ కింగ్ దేశీయంగా ఐదేళ్లక్రితం ఏర్పాటైంది. ఈ ఐదేళ్లలో రెస్టారెంట్ల ఏర్పాటురీత్యా వేగంగా వృద్ధి చెందుతూ వచ్చింది. మాస్టర్ ఫ్రాంచైజీ ఒప్పందాల ద్వారా బర్గర్ కింగ్ బ్రాండును దేశీయంగా విస్తరిస్తోంది. అంతర్జాతీయంగా బర్గర్ బ్రాండ్లలో నెట్వర్క్ రీత్యా ఈ కంపెనీ రెండో ర్యాంకులో నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 18,000 రెస్టారెంట్లు కలిగి ఉంది. 2020 సెప్టెంబర్‌కల్లా దేశీయంగా 261 రెస్టారెంట్లను ఏర్పాటు చేసింది. ఫ్రాంచైజీలతో కలిపి దేశవ్యాప్తంగా 57 పట్టణాలలో విస్తరించింది. 2017లో రూ. 233 కోట్లుగా నమోదైన ఆదాయం 2019కల్లా రూ. 633 కోట్లకు జంప్‌చేసింది. ఇదే సమయంలో నష్టాలు రూ. 72 కోట్ల నుంచి రూ. 38 కోట్లకు తగ్గాయి. కాగా.. జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్, వెస్ట్‌లైఫ్ డెవలప్మెంట్ కంపెనీలను దేశీయంగా లిస్టయిన ప్రధాన ప్రత్యర్ధి సంస్థలుగా పేర్కొనవచ్చు. జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్.. డోమినోస్ పిజ్జా రెస్టారెంట్లను నిర్వహిస్తుంటే.. వెస్ట్‌లైఫ్ డెవలప్మెంట్.. మెక్‌డొనాల్డ్ రెస్టారెంట్లను నిర్వహిస్తున్న విషయం విదితమే. -
ఫాస్ట్ ఫుడ్ కోసం హెలికాప్టర్లో 725 కిమీ..
మాకావ్: ఫాస్ట్ ఫుడ్ అంటే ఇష్టముండని వారంటుండరు. సామాన్యూలు నుంచి ధనికులకు వరకు ఫాస్ట్ ఫుడ్ అంటే చేవి కోసుకుంటారు. అలాంటి ఫాస్ట్ ప్రియులంతా లాక్డౌన్ నిబంధనలను సైతం పక్కన పెట్టి సాహాసాలు చేసిన సందర్భాలు వెలుగు చుస్తున్నాయి. లాక్డౌన్ కారణంగా సమీప ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు తెరుచుకోకపోవడంతో ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి తనకు ఇష్టమైన బట్టర్ చికెన్ వెతుక్కుంటూ యూకె బార్డర్‌కు వెళ్లి వచ్చిన సంఘటన సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అయింది. ఆస్ట్రేలియాకు చెందిన ఆ డ్రైవర్ తన ఇంటి నుంచి దాదాపు 32 కిమీ దూరంలో ఉన్న మెయిన్ సిటీకి ప్రయాణించాడు. యుకేలోని ఓ డ్రైవర్ పిజ్జా కోసం లాక్డౌన్ నిబంధనలు విస్మరిస్తూ.. గంటకు 72 కిమీ వేగంతో వెళ్లి కొనుగోలు చేశాడు. ఇటీవల జరిగిన ఈ రెండు సంఘటనలు అందరిని ఆశ్చర్యపరచగా... తాజా ఈ ఫాస్ట్ ఫుడ్ కోసం రష్యా బిలియర్ ఏం చేశాడో తెలిస్తే నోళ్లు వెల్లబెట్టాల్సిందే. రష్యాకు చెందిన విక్టోర్ మార్టినవ్(33) బిలియనీర్ తనకు ఇష్టమైన మెక్‌డోనాల్డ్స్ ఫెంచ్ ప్రైస్, బర్గర్ కోసం 720కిమీ హెలికాప్టర్లో ప్రయాణించి దాదాపు 2,680 డాలర్లు ఖర్చు పెట్టాడు. క్రస్నోర్ సమీపంలో మెయిన్ సిటీలో ఉన్న మెక్‌డోనాల్డ్స్‌కు అతడు తన చాటెడ్ హెలికాప్టర్లో 450 మైళ్లు ప్రయాణించి పెద్ద పెద్ద మకావ్ ప్యాకెట్స్, మిల్క్ షేక్స్, ఫ్రెంచ్ ప్రైస్, బర్గర్లు కొనుగొలు చేశాడు. అయితే అక్కడ హెలికాప్టర్ నిలిపెందుకు స్థలం లేనప్పటికి అతడు క్రస్నోర్కు కాస్తా దూరంలో హెలికాప్టర్‌ను నిలిపి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లి మరి ఇష్టమైన ఫెంచ్ ప్రైస్, మిల్క్ షేక్, తెచ్చుకున్నాడంట. ఇక దీనిపై మార్టినవ్ మాట్లాడుతూ.. ‘నా గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఆలుస్తాకు హాలీడే ట్రిప్‌కు వచ్చాను. ఆలుస్తాలోని బ్లాక్ సీ సమీపంలో ఓ రిసార్ట్‌లో దిగాం. రిసార్ట్‌లో పెట్టె సాధారణ మాకావ్ ఫుడ్ తిని విసిగిపోయాం. దీంతో హెలికాప్టర్లో క్రస్నోర్లో ఉన్న మెక్‌డోనాల్డ్స్‌కు వెళ్లి మాకు ఇష్టమైన ఆహారాన్ని తీసుకుని వచ్చాం’ అని ఆయన చెప్పుకొచ్చాడు. -
ఫాస్ట్‌పుడ్ తింటున్నారా.. జర జాగ్రత్త!
ఫాస్ట్‌ఫుడ్ సెంటర్.. ఏ గల్లీలో చూసినా ఇవే దర్శనమిస్తుంటాయి. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా పుట్టగొడుగుల్లా ఫాస్ట్‌పుడ్ సెంటర్లు పుట్టుకొచ్చాయి. ప్రతి ఏరియాలోనూ నాలుగైదు జంక్‌పుడ్ సెంటర్లు కనిపిస్తాయి. దీంతో యువత వీటిపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. స్కూల్ పిల్లలు, యువతీ, యువకులు.. ఇలా అన్ని వర్గాలకు చెందిన వారు ఫాస్ట్‌ఫుడ్‌ను ఆశ్రయిస్తున్నారు. బ్యాచిలర్స్ వీటికి ఎక్కువగా అలవాటు పడుతున్నారు. యువ ఉద్యోగులు రాత్రివేళల్లోనూ పనిచేయాల్సి రావడంతో ఫాస్ట్‌ఫుడ్‌కు పట్టణాలలో బాగా ఆదరణ లభిస్తున్నది. ఇదే సంస్కృతి ఇప్పుడు పల్లెలలో కూడా వ్యాపించింది. జంక్ పుడ్ పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇవి తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిసి కూడా యువత జంక్‌పుడ్‌పై మోజు చూపుతుంది. ఫాస్ట్‌ఫుడ్‌కు ఎక్కువగా అలవాటు పడితే డయాబెటిస్, రక్తపోటు, స్థూలకాయం, గుండెజబ్బులు, కేన్సర్ వంటి వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉన్నట్లు ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలిన సంగతి తెలిసిందే. అయితే, ఫాస్ట్‌ఫుడ్ భావోద్వేగాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఫాస్ట్‌ఫుడ్ ఎక్కువగా తీసుకునేవారు డిప్రెషన్‌తో బాధపడుతున్నారని చెబుతున్నారు బర్మింగామ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ అలబామాకు చెందిన పరిశోధకులు. కొంతమంది పాఠశాల విద్యార్థుల ఆహారపు అలవాట్లను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత ఫాస్ట్‌ఫుడ్ వల్ల వ్యాకులతకు లోనవుతారని నిర్ధారించారు. పరిశోధన జరిగిందిలా.. పరిశీలన కోసం ఫాస్ట్‌పుడ్ ఎక్కువగా తీసుకునే 84 మంది పాఠశాల వయసు గల బాల, బాలికలను తీసుకున్నారు. వీరిలో 95 శాతం మంది తక్కువ ఆదాయ గృహాలకు చెందిన ఆఫ్రికన్ అమెరికన్లు. సోడియం,పోటాషియంల శాతాన్ని పరీక్షించడం కోసం ప్రతి రోజు రాత్రిపూట వారి మూత్ర నమూనాలు సేకరించారు. ఇలా ఏడాదిన్నర కాలంపాటు అధ్యయనం చేసి తర్వాత ఈ విషయాన్ని వెల్లడించారు. జంక్‌పుడ్ తీసుకునేవారిలో సోడియం శాతం పెరిగి, పోటాషియం తగ్గుతుందని పరిశోధనలో తేలిందని యూనివర్సీటీ నిపుణులు పేర్కొన్నారు. సోడియం శాతం పెరగడానికి కారణం ఇవే ‘ఫాస్ట్‌ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్లే శరీరంలో సోడియం శాతం పెరుగుతుంది. దీని వల్ల కుంగుబాటుకి లోనవుతారు’ అని యూనివర్సిటీ ఆఫ్ అలబామా కు చెందిన మనోవిజ్ఞాన శాస్త్ర ప్రొఫెసర్ సిల్వీ మ్రగ్ తెలిపారు. జంక్పుడ్లో ఎక్కువ మొత్తం కొవ్వు, చక్కెర, ఉప్పు వుంటాయి. శరీరానికి ఉపయోగపడే ప్రొటీన్స్, విటమిన్స్, ఇతర పోషక పదార్థాలు వుండవు. మనకు అవసరమైన పీచు పదార్థాలు లభించవని చెప్పారు. బీన్స్, చిలగడ దుంపలు, బచ్చలికూర, టమోటాలు, అరటిపండ్లు, నారింజ, పెరుగు, కూరగాయలు వంటి ఆహారాన్ని తీసుకోకపోవడం వల్లే పోటాషియం శాతం తగ్గుతుందని చెప్పారు. ఈ అధ్యయనం సోడియం, డిప్రెషన్‌పై మాత్రమే జరిగిందన్నారు. అయితే జంక్పుడ్తో డిప్రెషన్‌కు ఎందుకు లోనవుతారనే దానిపై మరిన్ని పరిశోధనలు చేస్తున్నామని వెల్లడించారు. డిప్రెషన్‌కు లోనయ్యేవారిలో అధికులు వీరే వ్యాకులత గురయ్యే వారిలో ఎక్కువమంది పాఠశాల వయసువారే ఉంటున్నారు. 12 నుంచి 17 ఏళ్ల పిల్లలలో ఎక్కువ మంది డిప్రెషన్‌కు లోనవుతున్నారని జాతీయ డేటా విశ్లేషణలో తేలింది. 2005-2017 మధ్య కాలంలో ఇది 52 శాతం పెరిగింది. ఇక యువకుల్లో ఇది 63 శాతంగా ఉంది. డిప్రెషన్, మానసిక క్షోభకు గురికావడం, ఆత్మహత్య ఆలోచనలు రావడం యువకుల్లో ఎక్కువగా పెరుగుతోంది. ఆహారానికి, డిప్రెషన్‌కి మధ్య బలమైన అనుబంధం ఫాస్ట్‌పుడ్ వల్ల యువకులు కూడా డిప్రెషన్‌కు గురవుతున్నారని ఎన్నో అధ్యయనాల్లో తేలింది. స్పెయిన్‌లో వెలువడిన ఓ అధ్యయనం ప్రకారం.. ప్రాసెస్ చేసిన ఆహారం ఎక్కువగా తీసుకునే వారిలో 48 శాతం మంది డిప్రెషన్‌కు లోనవుతున్నారని తేలింది. దాదాపు 9000 మందిని ఆరేళ్లు పరిశీలించి ఈ విషయాన్ని ప్రకటించారు. మనం తీసుకునే ఆహారానికి, డిప్రెషన్‌కి మధ్య బలమైన అనుబంధం ఉందని పలు పరిశోధనల్లో తేలింది. అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, గ్రీస్ మరియు ఇరాన్ పరిశోధనల యొక్క మెటా విశ్లేషణ ప్రకారం.. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల అనారోగ్యంతో పాటు డిప్రెషన్‌కు లోనవుతారని తేలింది. తాజా పండ్లు, కూరగాయలు, ఆకు కూరలతో పాటు కొద్ది మోతాదులో ఫాస్ట్‌పుడ్ తీసుకుంటే డిప్రెషన్ ప్రమాదాన్ని అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి తగ్గాలంటే.. ► ఫాస్ట్‌ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెరలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినకూడదు. ఇవి మెదడులో ఒత్తిడిని కలగజేసే కెమికల్స్‌పై ఏమాత్రం ప్రభావం చూపవు. ఈ క్రమంలో సరైన విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు కలిగిన ఆహారాన్ని నిత్యం తగిన మోతాదులో సరైన వేళకు తీసుకోవాలి. దీని వల్ల కూడా మనకు కలిగే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ►తాజా పండ్లు, కూరగాయలు, పీచు పదార్థాలు కలిగి ఉండే ఆహారాన్ని తీసుకోవాలి ►నిత్యం వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. కష్టతరమైన ఎక్సర్సైజ్లు చేయకున్నా కనీసం ఒక అరగంట పాటు వాకింగ్ చేసినా చాలు. దీంతో శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. అంతేకాదు ఇది బరువు తగ్గడం కోసం, మానసిక ఉల్లాసం కోసం కూడా ఉపయోగపడుతుంది. ►ఆరోగ్యవంతమైన వ్యక్తులు రోజుకు కనీసం 6 నుంచి 8 గంటల పాటు తప్పనిసరిగా నిద్రపోవాలి. లేదంటే ఒత్తిడిని కలిగించే హార్మోన్లు వివిధ రసాయనాలను ఎక్కువగా విడుదల చేస్తాయి. దీంతో ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి. కనుక వీటిని తగ్గించుకోవాలంటే నిత్యం తగినంత సమయం పాటు నిద్రపోవడం తప్పనిసరి. ►నిత్యం పని ఒత్తిడితో బిజీగా ఉన్నా ఏదో ఒక సమయంలో వినోదం అందేలా చూసుకోవాలి. దీంతో ఒత్తిడి కొంత మేర తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అందరితో ఫన్నీగా మాట్లాడడం, జోక్స్ వినడం వంటివి చేస్తే ఒత్తిడి దూరమవుతుంది. ►ఒత్తిడి అధికంగా ఉన్నట్టు భావిస్తే చేసే పనినంతా పక్కన పెట్టి కొన్ని నిమిషాల పాటు కళ్లు మూసుకుని గట్టిగా శ్వాస తీసుకోండి. గాలి పీల్చేటప్పుడు, వదిలేటప్పుడు శ్వాసను గమనించండి. దీంతో ఒత్తిడి కొద్దిగా తగ్గుతుంది. -శెట్టె అంజి, సాక్షి వెబ్ డెస్క్. -
లొట్టలేస్తున్నారా.. జర జాగ్రత్త!
ఏలూరు (మెట్రో) : ఫాస్ట్‌ఫుడ్ సెంటర్.. జిల్లాలోని ఏ గల్లీలో చూసినా ఇవే దర్శనమిస్తున్నాయి. పట్టణాలు, పలెల్లు తేడా లేకుండా ప్రతి ముఖ్యకూడలిలోనూ ఒకటి నుంచి నాలుగైదు వరకు దర్శనమిస్తున్నాయి. దీంతో యువత వీటిపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. జిల్లా కేంద్రమైన ఏలూరులో సుమారు 200 వరకూ పాస్ట్‌ఫుడ్ సెంటర్లు, జిల్లావ్యాప్తంగా వేలల్లో ఉన్నాయి. మున్సిపల్ కేంద్రాల్లోనూ, చిన్న పంచాయతీల్లోనూ పాస్ట్‌ఫుడ్ సెంటర్లు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్నాయి. వీటికి తోడు ఇటీవల మొబైల్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు ఇష్టం వచ్చిన రీతిలో పుట్టుకొస్తున్నాయి. హైస్కూల్ పిల్లలు, యువతీ, యువకులు.. ఇలా అన్ని వర్గాలకు చెందిన వారు ఫాస్ట్‌ఫుడ్‌ను ఆశ్రయిస్తున్నారు. బ్యాచిలర్స్ వీటికి ఎక్కువగా అలవాటు పడుతున్నారు. ప్రజల ఆదరణ చూసి ఫుడ్ కోర్టులు ఏ వీధిలో చూసినా దర్శనమిస్తున్నాయి. ప్రతి సంవత్సరం 20 నుండి 40 శాతం ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు పెరుగుతూ వస్తున్నాయి. చిన్నారుల్లో స్థూలకాయం చిన్నారులు చిరుతిళ్లుపై ఎక్కువగా ఆధారపడుతుంటే కచ్చితంగా ఒబిసిటీ సమస్య వస్తుందని వైద్యులు చెబుతున్నారు. పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తినాలని సూచిస్తున్నా వాటిని పెడచెవిన పెడుతున్నారు. అదే విధంగా జంక్‌ఫుడ్ మార్కెట్ విస్తరించడం కూడా శుభపరిమాణం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అది రాబోయే అనారోగ్యానికి హెచ్చరిక అని నిపుణులు చెబుతున్నారు. సిగరెట్లు, పాన్‌పరాగ్ వంటివి ఆరోగ్యాన్ని కుళ్లబొడిచినట్లే జంక్ఫుడ్స్ కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు. మధుమేహం, గుండె రక్తనాళాల వ్యాధులకు జంక్‌ఫుడ్ కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఆహార తనిఖీ శాఖ నిర్లక్ష్యమూ అంతే ఆహార తనిఖీ శాఖ నిర్లక్ష్యం కూడా ఈ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు పెరగడానికి ఒక కారణంగా చెప్పొచ్చు. కనీసం వీటిపై ఏ మాత్రం దాడులు చేయకపోవడంతో ఈ సెంటర్లలో కల్తీలు చేసినా ప్రశ్నించే నాథుడే లేకుండా పోతున్నాడు. ఫాస్ట్‌ఫుడ్ వినియోగం ఇలా 10–15 సంవత్సరాల లోపు వారు 85 శాతం ఉంటే, 16–20 సంవత్సరాల లోపు 65 శాతం, 21–25 సంవత్సరాల లోపు వారు 55శాతం, 26–35 సంవత్సరాల లోపు వారు 45 శాతం, 36–45 సంవత్సరాల లోపు వారు 25 శాతం, 46–50 సంవత్సరాల లోపు వారు 20 శాతం ఈ జంక్‌ఫుడ్స్‌పై అధికాసక్తి చూపిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సులు ఫాస్ట్‌ఫుడ్ వాడకాన్ని నియంత్రించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ మూడు రకాల సిఫార్సులు చేసింది. పండ్లు, కూరగాయలు ధరలు తగ్గేలా... ఫాస్ట్‌ఫుడ్ ధరలు పెరిగేలా పన్నులు ఉండాలని పేర్కొంది. వీటిలో ఒకటి పండ్లు, కూరగాయల సాగుకు రాయితీలిచ్చి ప్రోత్సహించాలని పేర్కొంది. రెండో అంశం ఫాస్ట్ఫుడ్స్, కూల్‌డ్రింక్స్ ప్రచారాన్ని కట్టుదిట్టంగా కట్టడి చేయాలని పేర్కొంది. ఆహార ఉత్పత్తుల ప్యాకెట్లు డబ్బాలపై మరింత స్పష్టమైన సమాచారంతో కూడిన లేబుల్స్ ఉండాలన్నది మూడో సూచన. ధూమపానం ఆరోగ్యానికి హానికరమని సిగరెట్ ప్యాకెట్లపై ముద్రించినట్లే పాస్టుఫుడ్ సెంటర్లపైనా, ప్యాకెట్లపైనా ఇలాంటి హెచ్చరికలు ముద్రించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. చెవికెక్కని వైద్యుల సూచన కాలానుగుణంగా లభించే పండ్లు తింటే రోగాలు దరిచేరవని ఫిజ్జా, బర్గర్లు, రోడ్లపై దొరికే ఫాస్ట్ఫుడ్స్ కొలెస్ట్రాల్ పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఆహారంలో పీచుపదార్థం లేకపోవడంతో మలబద్ధకం, కారం, మసాలాలు ఎక్కువగా ఉండటంలో ఎసిడిటీ పెరుగుతోంది. వీటన్నింటి నుంచి బయటపడాలంటే సంప్రదాయ వంటకాల గొప్పదనాన్ని, అవి ఇచ్చే ఆరోగ్యాన్ని నేటి తరానికి తెలపాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. చికిత్స కన్నా నివారణే మేలు జబ్బు చేసిన తరువాత చికిత్స పొందటం కంటే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు. ప్రస్తుతం ఫాస్ట్ ఫుడ్స్ అంటే పిల్లలు, పెద్దలు లొట్టలేసుకుని తినేస్తున్నారు. ఫాస్ట్‌ఫుడ్‌లో వాడే రంగులు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. బయట ఫాస్ట్ఫుడ్స్లో లభించే ఆహారం వల్ల అధిక కొలెస్ట్రాల్, మధుమేహం, రక్తపోటు, మానసిక రుగ్మతలు, గురక వంటి సమస్యలు వస్తాయి. ప్రస్తుతం పిల్లలు బయట ఆ టలకు దూరం అయ్యారు. ఇంట్లో టీవీ చూస్తూ గడపడం, వీడియోగేమ్స్, స్మార్ట్ఫోన్లతో కాలం గడిపేస్తున్నారు. దీంతో చిన్నవయసులోనే ఊబకాయులుగా మారుతున్నారు. ఫాస్ట్‌ఫుడ్ తినడం తగ్గిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చు. – డాక్టర్ ప్రవీణ్‌కుమార్, ప్రభుత్వ వైద్యులు -
సిటీజన్స్.. బీ అలర్ట్..
సాక్షి, సిటీబ్యూరో: రెడీమేడ్ ఫుడ్ అంటే మక్కువ చూపుతున్నారా.. పిజ్జా, బర్గర్, షుగర్ డ్రింక్స్.. చికెన్ నగ్గెట్స్.. చాకొబార్స్ వంటివి ఇష్టంగా లాగించేస్తున్నారా.. అయితే కొద్ది పరిమాణంలో ఓకేగాని.. 50 శాతం మించితే క్యాన్సర్ ముప్పు తప్పదంటున్నారు వైద్యులు. ఇటీవల దేశంలో కాస్మో పాలిటన్ కల్చర్‌కు కేంద్ర బిందువుగా మారిన పలు మెట్రో నగరాల్లో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్(వివిధ రీతుల్లో శుద్ధి చేసి నిల్వ ఉండేందుకు సంరక్షకాలను కలిపిన పదార్థాలు) వినియోగం 10 శాతం మేర పెరిగినట్లు ‘కాల్ హెల్త్’ సంస్థ అధ్యయనంలో తేలింది. ఇలాంటి ఆహార పదార్థాల వినియోగం అనూహ్యంగా పెరగ్గా.. దానితో పాటు 12 శాతం క్యాన్సర్ రిస్క్ పెరుగినట్టు ఈ అధ్యయనం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగం దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కత్తా నగరాల్లో అధికంగా ఉన్నట్లు అధ్యయన నివేదిక వెల్లడించడం గమనార్హం. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ జాబితాలోఉన్న కొన్ని పదార్థాలు.. ♦ తినడానికి సిద్ధంగా.. ఫ్రిజ్‌లో నిల్వచేసిన ఆహారం (ఫ్రోజెన్ రెడీ టు ఈట్ మీల్స్) ♦ చికెన్ నగ్గెట్స్, పిజ్జా, అధిక మొత్తంలో నిల్వచేసి ప్రాసెస్ చేసిన బ్రెడ్, కేకులు ♦ చక్కెరతో తయారు చేసిన డ్రింక్స్, రెండు నిమిషాల్లో రెడీ చేసుకునే నూడుల్స్, సూప్స్ ♦ చక్కెర కలిపిన తృణ పప్పు ధాన్యాలు (షుగర్ బ్రేక్‌ఫాస్ట్ సిరిల్స్) ♦ చక్కెర మోతాదు అధికంగా ఉండే స్నాక్స్, చిప్స్ ♦ చాకొబార్స్, స్వీట్స్ తగ్గించకుంటే క్యాన్సర్ ముప్పు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తయారీలో ముడి పదార్థాలను వివిధ రీతుల్లో అత్యధికంగా వేడిచేసి శుద్ధి చేస్తారు. ఇవి ఎక్కు కాలం నిల్వ ఉండేలా చక్కెర, ఇతర సంరక్షాలు, ఫ్లేవర్స్, రంగులను అధిక మోతాదులో కలుపుతారు. అంతేగాక వీటిలో ఎక్కువగా వినియోగించే సోడియం నైట్రేట్, టిటానియం ఆక్సైడ్తో క్యాన్సర్ ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగం, వ్యాపారం, ఇతర వ్యాపకాలతో తీరిక లేకుండా గడుపుతోన్న సిటీజన్లు ఆన్లైన్లోనే ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. ఇందులో ఎక్కువగా బర్గర్స్, చికెన్ నగ్గెట్స్, చాకొబార్స్ వంటి ప్రాసెస్డ్ ఫుడ్ వెరైటీలే అధికమని ప్రముఖ ఫుడ్‌డెలివరీ సంస్థ స్విగ్గీ తాజా సర్వేలోనూ తేలింది. సో సిటీజన్స్ బీ అలర్ట్. తాజా పదార్థాలైతే బెటర్.. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ కంటే ఇళ్లలో తయారు చేసుకునే బ్రెడ్, బిస్కట్లు, వెన్న, నెయ్యి వంటి పదార్థాలే మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రిఫ్రజిరేటర్లలో అధిక కాలం నిల్వ చేసిన పదార్థాల కంటే తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయాలను తీసుకుంటే క్యాన్సర్ మప్పును సమర్థవంతంగా ఎదుర్కోవచ్చంటునన్నారు. -
సగ్గుతో నెగ్గు
ఓ కోడలమ్మా..! ఊరి నుంచి బంధువులొస్తున్నారేమ్! ఆటో వీధి మలుపు తిరిగిందట ఏదైనా చేసి పెట్టరాదూ!! ఓ క్వీన్ వైఫ్! ఫ్రెండ్స్ క్రికెట్ మ్యాచ్ ఇక్కడే చూస్తారట మంచింగ్‌కి ఏమైనా...! ఓ మమ్మీ! సంజయ్, లీలా, లక్ష్మీ, అనంత్, సౌరవ్, సోనూ సింగ్, బెనర్జీ, యూసుఫ్.. అందరికీ ఆకలేస్తోంది ఏముంది తినటానికి..? జీవితంలో ఎక్కడైనా గెలవచ్చు కానీ వంటగదిలో గెలవడం కొద్దిగా కష్టమే చక చకా వండి నెగ్గుకురావాలంటే ఏం చేయాలి?! మేడమ్.. సగ్గుతో నెగ్గండి! మనింట్లో చేసుకునే సూపర్‌ఫాస్ట్ ఫుడ్! ఇడ్లీ కావల్సినవి: సగ్గుబియ్యం – అర కప్పు ఇడ్లీ రవ్వ – కప్పు పెరుగు – 2 కప్పులు నీళ్లు – ఒకటిన్నర కప్పు (తగినన్ని) ఉప్పు – తగినంత బేకింగ్ సోడా – పావు టీ స్పూన్ జీడిపప్పులు – 16 (సగం పలుకు) నూనె – ఇడ్లీ ప్లేట్‌కి రాసేటంత తయారీ: పెద్ద గిన్నెలో సగ్గుబియ్యం (కడగకూడదు), ఇడ్లీ రవ్వ, 2 కప్పుల పెరుగు, కప్పు నీళ్లు పోసి కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రంతా లేదా 8 గంటలు అలాగే ఉంచాలి. మరుసటి రోజు పిండిని ఎక్కువ కలపకూడదు. నానిన సగ్గుబియ్యం మరీ మెత్తగా అయిపోతాయి. ఇడ్లీ చేసే ముందు పావు కప్పు నీళ్లు, సరిపడా ఉప్పు, బేకింగ్ సోడా వేసి కలపాలి. ఇడ్లీ ప్లేట్స్కి నూనె రాసి, జీడిపప్పు పలుకులు ఒక్కొక్కటి పెట్టి, పిండి సర్దాలి. ఈ ప్లేట్‌ని ఇడ్లీపాత్రలో పెట్టి ఆవిరి మీద కనీసం 10 నిమిషాలు ఉడికించాలి. మంట తీసేసాక ఐదు నిమిషాలు అలాగే ఉంచి, అప్పుడు ఇడ్లీలు తీయాలి. ఏదైనా నచ్చిన చట్నీతో సర్వ్ చేయాలి. నోట్: సగ్గుబియ్యం కుకర్‌లో పెట్టి ఉడికించి కూడా పిండిని సిద్ధం చేసుకోవచ్చు. ఇందుకు తక్కువ సమయం పడుతుంది. బనానా కోకనట్ మిల్క్ కావల్సినవి: సగ్గుబియ్యం – అర కప్పు; పంచదార పొడి – అర కప్పు; అరటిపండ్లు – 2; కొబ్బరిపాలు – కప్పు; వేయించిన నువ్వులు – 2 టేబుల్ స్పూన్లు తయారీ: ∙సగ్గుబియ్యం కడిగి, నీళ్లు పోసి, ఆ నీళ్లను వడకట్టాలి. తర్వాత నీళ్లు పోసి గంటసేపు నానబెట్టాలి. లేదంటే కుకర్‌లో పెట్టి ఉడికించవచ్చు. ఈ సగ్గుబియ్యంలో 2 కప్పుల నీళ్లు, పంచదార పొడి, చిటికెడు ఉప్పు సాస్పాన్లో పోసి సన్నని మంట మీద మళ్లీ ఉడికించాలి. ∙అరటి పండుపై తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలను ఉడుకుతున్న సగ్గుబియ్యంలో వేసి 3 నిమిషాలు ఉంచాలి. అరటిపండు ముక్కలు మరీ మృదువుగా అవుతాయి. దీంట్లో కొబ్బరి పాలు పోసి మంట తీసేసి చల్లారనివ్వాలి. ఈ మిశ్రమంలో పైన వేయించిన నువ్వులు, మామిడిపండు ముక్కలు వేసి చల్లగానూ, వేడిగానూ అందించవచ్చు. కిచిడి కావల్సినవి: సగ్గుబియ్యం – కప్పు; నూనె – 2 టేబుల్ స్పూన్లు; జీలకర్ర – టీ స్పూన్; బంగాళదుంప ముక్కలు – ముప్పావు కప్పు ; ఉప్పు – తగినంత; వేరుశనగపొడి – అర కప్పు ; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు; పచ్చిమిర్చి తరుగు – 2 టీ స్పూన్లు; కరివేపాకు – 2 రెమ్మలు; నిమ్మరసం – 2 టీ స్పూన్లు; పంచదార – 2 టీ స్పూన్లు తయారీ: ∙ సగ్గుబియ్యం కడిగి, ముప్పావు కప్పు నీళ్లుపోసి నానబెట్టాలి. ∙ నూనె వేసి, వేడయ్యాక నాన్‌స్టిక్ పాన్‌లో జీలకర్ర వేసి వేయించాలి. పోపుగింజలు, ఉడికిన బంగాళదుంప ముక్కలు, బాగా నానిన సగ్గుబియ్యం, ఉప్పు, వేరుశనగపొడి, పచ్చిమిర్చి, కరివేపాకు, నిమ్మరసం, పంచదార, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గబెట్టాలి. ∙ వేడి వేడిగా సర్వ్ చేయాలి. పకోడీ కావల్సినవి: సగ్గుబియ్యం – 2 కప్పులు; బియ్యప్పిండి – 2 కప్పులు; మజ్జిగ – 3 కప్పులు; కారం – టీ స్పూన్; పచ్చిమిర్చి – 4; ఉప్పు – తగినంత; ఉల్లిపాయలు – 2; నూనె – వేయించడానికి తగినంత తయారీ: సగ్గుబియ్యం కడిగి మజ్జిగలో గంట సేపు నానబెట్టాలి. దీంట్లో బియ్యప్పిండి, కారం కలపాలి. నీళ్లు కలపకూడదు. ఉప్పు, ఉల్లిపాయల తరుగు, టీ స్పూన్ నూనె వేసి బాగా కలపాలి. స్టౌ మీద మూకుడు పెట్టి, నూనె పోసి కాగనివ్వాలి. సిద్దంగా ఉంచుకున్న పిండి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ కాగుతున్న నూనెలో వేసి అన్ని వైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీయాలి. ఖీర్ కావల్సినవి: సగ్గుబియ్యం – అర కప్పు; పాలు – 2 కప్పులు; నీళ్లు – 2 కప్పులు; పంచదార – 5 టేబుల్‌స్పూన్లు; యాలకులు – 5 (పొడి చేయాలి); జీడిపప్పు, బాదంపప్పు పలుకులు – 2 టేబుల్ స్పూన్లు; కిస్మిస్ – అర టేబుల్ స్పూన్; కుంకుమపువ్వు – 5 రేకలు తయారీ: సగ్గుబియ్యం , 15 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత మందపాటి గిన్నెలో సగ్గుబియ్యం, నీళ్లు కలిపి ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత పాలు పోసి మళ్లీ మరిగించాలి. దీంట్లో పంచదార, యాలకుల పొడి వేసి సన్నని మంట మీద ఉడికించాలి. సగ్గుబియ్యం ఉడికాక వేయించిన జీడిపప్పు , బాదం పలుకులు, కిస్మిస్, చివరగా కుంకుమపువ్వు వేసి మంట తీసేయాలి. సర్వ్ చేసేముందు టీ స్పూన్ నెయ్యి వేస్తే ఇంకా రుచిగా ఉంటుంది. వడ కావల్సినవి: సగ్గుబియ్యం – అర కప్పు; ఉడకబెట్టిన బంగాళదుంపలు – కప్పు; వేరుశనగపప్పు (కచ్చాపచ్చాగా దంచాలి)– ముప్పావుకప్పు జీలకర్ర – అర టీ స్పూన్; అల్లం తరుగు – టీ స్పూన్; పచ్చిమిర్చి తరుగు – ఒకటిన్నర టీ స్పూన్; కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్లు; నిమ్మరసం – అర టీ స్పూన్; పంచదార – తగినంత; ఉప్పు – తగినంత; నూనె – వేయించడానికి తగినంత తయారీ: ∙ సగ్గుబియ్యం కడిగి ముప్పావు కప్పు నీళ్లు పోసి ఉడికించాలి. ∙ బాగా ఉడికిన సగ్గుబియ్యంలో మిగతా దినుసులన్నీ వేసి కలపాలి. దీనిని 8 భాగాలు గా చేయాలి. ఒక్కో భాగాన్ని ఉండగా, చేసి అరచేత్తో అదమాలి. ∙ మూకుడులో నూనె పోసి, కాగాక సిద్ధం చేసుకున్న వడలను వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. వీటిని టిష్యూ పేపర్ మీద వేసి, తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. గ్రీన్ చట్నీ లేదా పంచదార కలిపిన పెరుగుతో వడ్డించాలి.