
ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌కు వచ్చిన కస్టమర్లకు రకరకాల రుచులు ఆహ్వానం పలుకుతుంటే.. వాటిని ఆరగించే తొందరలో హడావిడి చేస్తుంటారు. ఆ హడావిడి నార్మల్‌గా ఉంటే పర్లేదు. ఒక్కోసారి శృతి మించితే..! లేదంటే ఫాస్ట్‌ఫుడ్ సిబ్బంది విచక్షణ కోల్పోతే నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి అమెరికాలో చోటుచేసుకుంది. అమెరికాలోని మేరిల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్ నగరానికి చెందిన ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ 'చిపోటిల్'కు ఆంటోనీ ఎవాన్స్ అనే కస్టమర్ వచ్చాడు. ఆంటోనీ తనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్ ఆన్‌లైన్ లో ఆర్డర్ ఇచ్చాడు.
అయితే, ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ ఐటమ్ అందాలంటే అరగంట వెయిట్ చేయాల్సి ఉంది. కానీ ఆంటోనీకి ఇక్కడ సర్వీస్ బాగోలేదని తిట్టుకుంటూనే ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ ఐటమ్‌ను వెంటనే తీసుకొని రావాలని అడిగాడు. ఆలస్యం అవుతుందని మేనేజర్‌తో మాట్లాడాలని హడావిడి చేశాడు. అదే సమయంలో కౌంటర్‌లో ఉన్న ఓ మహిళా ఉద్యోగి తానే ఈ రెస్టారెంట్ మేనేజర్‌ను అంటూ కస్టమర్ తో వాదనకు దిగింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ మహిళా.. కస్టమర్‌పై కత్తెర విసిరి కొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నేను ఆర్డర్ ఇచ్చాను. మీరు ఆర‍్డర్‌ను తీసుకొని రాలేదు. అందుకే కంప‍్లెయింట్ ఇచ్చానంటూ మాట్లాడుతున్న వీడియో ఫేస్ బుక్‌లో లైవ్‌లో వస్తుంది. దీంతో కస్టమర్ తీరుతో ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు మహిళా ఉద్యోగి కిచెన్ రూమ్‌లో నుంచి కేకలు వేసింది. అయినా వీడియో తీస్తుండడంతో.. క్యాష్ కౌంటర్‌లో ఉన్న రెండు కత్తెర్లని కస్టమర్‌పై విసిరేసింది. దీంతో భయాందోళనకు గురైన కస్టమర్ .. వామ్మో మీరే చూశారుగా ఆమె నాపై కత్తెర్లతో ఎలా దాడి చేసిందో అంటూ కేకలు వేశాడు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న బాల్టిమోర్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment