ఫాస్ట్‌ఫుడ్‌తో అదుపు తప్పే భావోద్వేగాలు..
కొత్త పరిశోధన
ఫాస్ట్‌ఫుడ్‌కు ఎక్కువగా అలవాటు పడితే డయాబెటిస్, రక్తపోటు, స్థూలకాయం, గుండెజబ్బులు, కేన్సర్ వంటి వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉన్నట్లు ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలిన సంగతి తెలిసిందే. అయితే, ఫాస్ట్‌ఫుడ్ భావోద్వేగాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని ఇటీవల అమెరికాలో నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. కొన్నిరకాల ఫాస్ట్‌ఫుడ్ వంటకాల్లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ ప్రభావం వల్ల భావోద్వేగాలు అదుపు తప్పుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఫాస్ట్‌ఫుడ్ ఎక్కువగా తినేవారు డిప్రెషన్‌తో బాధపడటం లేదా తరచు చిర్రుబుర్రులాడటం వంటి సమస్యలకు గురవుతారని అంటున్నారు. ఐదువేల మంది ఆహారపు అలవాట్లను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత ఫాస్ట్‌ఫుడ్ వల్ల భావోద్వేగాలు అదుపు తప్పుతాయని నిర్ధారించారు. ఈ అంశాన్ని ‘జర్నల్ ఆఫ్ హెల్త్ సైకాలజీ’లో ప్రచురించారు.