లోక నాయకుడు కమల్ హాసన్ గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగల విలక్షణ నటుడు ఆయన. నవరసాలను అద్భుతంగా పండించగలడని మాత్రమే మనకు తెలుసు. కానీ కమల్ హాసన్ 27 రకాల రసాలను కూడా పండించగలడు. అదేంటి భావోద్వేగాలు తొమ్మిది రకాలుగా మాత్రమే ఉంటాయి కదా అంటారా? అది తప్పు అట. మనిషిలో మొత్తం 27 రకాల ఎమోషన్స్ ఉంటాయని చెబుతోంది కాలిఫోర్నియా యూనివర్సీటీ. వాటి పేర్లను కూడా పేర్కొంది.
అయితే ఈ 27 రకాల ఎమోషన్స్‌ని పండించిన ఏకైక హీరో కమల్ హాసన్ మాత్రమేనని ఆయన అభిమానుల మాట. దానికి సంబంధించిన ఓ వీడియోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో కమల్ హాసన్ పాత సినిమాల్లోని కొన్ని సీన్లను ఈ 27 రకాల ఎమోషన్స్‌తో ముడిపెడూతూ.. అన్ని రకాల భావోద్వేగాలు పండించగల ఏకైన నటుడు కమల్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో, ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరి లోకనాయకుడు కమల్ హాసన్ పండించిన 27 రకాల ఎమోషన్స్‌ని చూసేయండి.
#KamalHaasan expressing all the 27 types of emotions denoted by University of California Berkeley
❤️😍🔥💪
pic.twitter.com/igpfyz0Llk— Nammavar (@nammavar11) November 29, 2024
Comments
Please login to add a commentAdd a comment