emotions
-
చిన్నారుల్లో కోపం స్మార్ట్ గాడ్జెట్స్ ప్రభావం..
సాక్షి, అమరావతి: స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ వాడకం చిన్నారుల్లో ప్రతికూల భావోద్వేగాలను పెంచుతోందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఎల్రక్టానిక్ పరికరాలు వాడే ప్రీ స్కూల్ చిన్నారుల్లో చిరాకు, కోపం ఎక్కువగా కనిపిస్తోందని గుర్తించారు. కెనడా లోని షెర్‌బ్రూక్ యూనివర్సిటీ పరిశోధన ప్రకారం.. స్మార్ట్ ఫోన్ వాడకం చిన్నారుల్లో స్వీయ నియంత్రణ, నైపుణ్యాల అభివృద్ధికి అవరోధం ఏర్పడుతోంది. మూడున్నరేళ్లు, నాలుగున్నరేళ్ల వయసు నుంచి టాబ్లెట్‌కు అలవాటుపడ్డ చిన్నారుల భావోద్వేగాలను పరిశీలించారు. ఇలాంటి చిన్నారుల్లో ఏడాది తర్వాత కోపం, నిరాశ విపరీతంగా పెరిగినట్టు గుర్తించారు. చిన్నారులు సొంత ప్రతికూల భావోద్వేగాలను నేర్చుకునే విధానం సాంకేతిక పరికరాల ద్వారా జరుగుతుండటం శ్రేయస్కరం కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సంరక్షకుల పర్యవేక్షణలో బాల్య వికాసం జరిగితేనే.. సరైన భావోద్వేగం ప్రదర్శిస్తారని చెబుతున్నారు. ప్రతి ఇంట్లో చిన్నారుల అల్లరిని కట్టడి చేసేందుకు, ఏడుపును అదుపు చేసేందుకు స్మార్ట్ ఫోన్ అలవాటు చేయడం సరైన పద్ధతి కాదని అధ్యయనం చెబుతోంది. ఇది బాల్యం, యుక్తవయసులో చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోందంటున్నారు. యునిసెఫ్ సైతం యునిసెఫ్ సైతం చిన్నారుల స్క్రీనింగ్ అలవాట్లను తీవ్రంగా తప్పుపడుతోంది. ఏడాది కంటే తక్కువ వయసున్న పిల్లలు ఎటువంటి సాంకేతిక పరికరాల నుంచి ఏమీ నేర్చుకోలేరని చెబుతోంది. వారికి స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లు చూపించడం ద్వారా మెదడుపై ప్రతికూల ప్రభావం గురించి యునిసెఫ్ వైద్య బృందం సైతం హెచ్చరిస్తోంది. ఆఫ్–్రస్కీన్ అనుభవాలను అందించడం ద్వారా క్లిష్టమైన వాటిని కూడా చిన్నారులు నేర్చుకోవడంతో పాటు సామాజిక, అభిజ్ఞా నైపుణ్యాలు మెరుగుపడతాయని చెబుతున్నారు. చిన్నారుల్లో మెదడు బాహ్య ప్రపంచం నుంచి గ్రహించిన వాటితోనే అభివృద్ధి చెందుతుందని, కథలు వినడం, పుస్తకాలను బిగ్గరగా చదవడం, చిత్రాలను గుర్తించడం ద్వారా ప్రేరణ పెరుగుతోందని వైద్యులు నిపుణులు సూచిస్తున్నారు. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు స్క్రీన్ సమయం ఇవ్వకూడదని, నాలుగేళ్ల లోపు చిన్నారులకు పాఠ్యాంశాల పరమైన వాటికి, గంటలోపు మాత్రమే స్క్రీనింగ్‌కు కేటాయించాలని సూచిస్తోంది. తాజా పరిశోధనలో 75 నిమిషాలు, అంతకంటే ఎక్కువ రోజువారీ స్క్రీన్ సమయం ఉండటం గమనార్హం. స్క్రీనింగ్‌తో అనారోగ్యం మన ఫోన్లు, టీవీలు, కంప్యూటర్ల స్క్రీన్లు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. స్క్రీన్ సమయంలో కదలకుండా ఒకేచోట కూర్చోవడంతో బరువు పెరగడం, ఊబకాయం సమస్యలు తలెత్తున్నాయి. ఇది యుక్త వయసు వచ్చేసరికి మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్, చిత్త వైకల్యానికి దారితీస్తున్నాయి. మానసిక ఆరోగ్య సమస్యలతో పాటు మాట్లాడే పదాలను తక్కువగా నేర్చుకోవడంతో పాటు డిప్రెషన్ ప్రమాదాన్ని మూడు రెట్లు పెంచుతాయని అధ్యయనంలో పాల్గొన్న వైద్యులు చెబుతున్నారు. -
Save Money: పండగ ఆఫర్లు.. ఇవి పాటిస్తే డబ్బు ఆదా!
పండగల నేపథ్యంలో కస్టమర్లను ఆకర్షించేందుకు ఆఫ్‌లైన్, ఆన్లైన్ రిటైల్ షాపింగ్‌ల వద్ద రాయితీలు కనిపిస్తున్నాయి. మరోవైపు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్యులు సతమతమవుతున్నారు. దానికితోడు అధికమవుతున్న ద్రవ్యోల్బణమూ ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులు, ఇతర నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు వడ్డీ రేట్లు పెంచడంతో రుణాల భారం హెచ్చవుతుంది. ఈ తరుణంలో డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయాలి. రూపాయి ఖర్చు చేసేముందు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకువాలి. తర్కంతో ఆలోచించి ఖర్చు తగ్గించుకుంటే పరోక్షంగా ఆ డబ్బును సంపాదించినట్లేనని నిపుణులు చెబుతున్నారు. వృథా ఖర్చులకు కళ్లెం వేయకపోతే.. భవిష్యత్ లక్ష్యాలు దెబ్బతింటాయి. ఈ నేపథ్యంలో వ్యయ నియంత్రణలో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆర్థికనిపుణులు సూచిస్తున్నారు. ఎమోషన్స్.. సమాజంలో లగ్జరీగా జీవిస్తున్నామని ఇతరులకు చెప్పుకోవడానికి చాలామంది అనవసర ఖర్చులు చేస్తారు. ఆర్భాటాలకు ప్రయత్నించి అప్పుల్లో కూరుకుంటారు. అనేక సందర్భాల్లో డబ్బు ఖర్చు చేయడం భావోద్వేగాలకు సంబంధించిన వ్యవహారంగా ఉంటుంది. స్తోమతకు మించి ఖర్చు చేయడం ఎప్పుడూ సరికాదు. కొత్త వస్తువును కొనాలి.. ఖరీదైన భోజనం, దుస్తులు.. ఇలా అతిగా ఖర్చు చేసే ప్రతి చోటా ఒకసారి ఆలోచించాలి. అతిగా ఖర్చు చేయాలనే కోరికను సాధ్యమైనంత మేరకు తగ్గించుకోవాలి. బడ్జెట్.. చేసే ప్రతిఖర్చుకూ లెక్క కచ్చితంగా ఉండాలి. మీ ఆదాయం, వ్యయాలను తెలుసుకునేందుకు బడ్జెట్ ఉపకరిస్తుంది. పండగల వేళ ఎంత ఖర్చు చేయాలన్నదీ బడ్జెట్ వేసుకోండి. బోనస్‌ల లాంటివి అందినా.. అందులో నుంచి ఎంత మొత్తం కొనుగోళ్లకు కేటాయించాలి అన్నది ముందే నిర్ణయించుకోవాలి. వచ్చిన బోనస్‌లో సగంకంటే ఎక్కువ పెట్టుబడికి మళ్లించాలి. నెలకు వచ్చిన ఆదాయంలోనూ 20-30 శాతం ముందుగా పొదుపు చేశాకే ఖర్చు చేయాలనే నిబంధన విధిగా పాటించాలి. 40 శాతానికి మించి నెలవారీ వాయిదాలు లేకుండా జాగ్రత్తపడాలి. ఖర్చుల కోసం ప్రత్యేక ఖాతాను కేటాయించాలి. క్రెడిట్ కార్డులు పండగల వేళ ఏదైనా వస్తువులు కొనేందుకు క్రెడిట్ కార్డులపై రాయితీలు ప్రకటిస్తారు. కంపెనీలు ఫెస్టివల్ సీజన్లో విక్రయాలు పెంచుకుని లాభాలు సాధించేందుకు ఇదొక విధానం. నిజంగా ఆ వస్తువులు అవసర నిమిత్తం తీసుకుంటున్నామా లేదా కేవలం ఆఫర్ ఉంది కాబట్టి కొనుగోలు చేస్తున్నామా అనేది నిర్ణయించుకోవాలి. కార్డులోని లిమిట్ మొత్తం వాడేస్తే తిరిగి చెల్లించడం కష్టం అవుతుంది. అవసరం అనుకున్నప్పుడే పండగల కొనుగోళ్లకు క్రెడిట్ కార్డును వాడాలి. వస్తువులు తీసుకుని తర్వాత బిల్లు చెల్లించకపోతే సమస్యలు వస్తాయి. అపరాధ రుసుములు, వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఆలస్యంగా చెల్లింపులు చేస్తే సిబిల్ స్కోరూ దెబ్బతింటుంది. క్రెడిట్ కార్డు పరిమితిలో 30-40 శాతానికి మించి వాడకుండా చూసుకోండి. ఇదీ చదవండి: ఆ ఫోన్ నంబర్లు మళ్లీ మూడు నెలలకే యాక్టివేట్ ఖర్చులు అన్నీ అయిపోయాక మిగిలిన డబ్బును పొదుపు చేద్దామని చాలా మంది అనుకుంటారు. కానీ అలాంటి భావన ఉన్న కొందరు వ్యక్తులవద్ద నెలాఖరుకు పొదుపు చేయడానికి డబ్బే ఉండదు. అదిపోగా చివరికి రోజువారి ఖర్చుల కోసం అప్పు చేయాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. కాబట్టి ముందు పొదుపు.. తర్వాతే ఖర్చు. సమయం, సందర్భాన్ని బట్టి చేసే వ్యయాలు కొన్ని ఉంటాయి. వీటిని తప్పించుకోలేం. కానీ, చేతిలో డబ్బు ఉంది కదా అని ఖర్చు చేయడం పొరపాటు. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను ఏర్పరుచుకుని వాటిని సాధించే వరకూ డబ్బును కూడబెట్టాలి. అందుకు వీలుగా ఖర్చులు తగ్గించుకోవాలి. ఆర్థిక ప్రణాళిక నిర్ణయించుకోవడం ముఖ్యం. అయితే దాన్ని క్రమశిక్షణతో పాటించడం మరీముఖ్యం. ఖర్చులు, పొదుపు విషయంలో ఆలోచన సరళిమార్చుకుంటే తప్పకుండా ఆర్థిక విజయాన్ని సాధించవచ్చు. -
సినిమాల్లో క్లైమాక్స్ అదుర్స్
-
అరుదైన దృశ్యాలు.. ఊహకందని భావోద్వేగాలు!
అందరి జీవితాల్లోనూ కొన్ని అపురూప క్షణాలు ఉంటాయి. అలాంటి వాటిని తడిమి చూసుకున్నప్పుల్లా ఒకలాంటి ఉద్వేగానికి లోనవుతాం. ఆటల్లోనూ ఇలాంటి అరుదైన క్షణాలు అప్పుడప్పుడు మనం చూస్తుంటాం. ప్రతిస్పందనగా రకరకాల భావోద్వేగాలకు గురవుతుంటాం. ముఖ్యంగా గెలుపోటములను నిర్ణయించే సమయంలో క్రీడాకారులతో ప్రేక్షకులు కూడా ఒత్తిడి, ఉత్కంఠ, ఆందోళన చెందుతుంటారు. ఆట చివరి క్షణాల్లోని నాటకీయతను మునివేళ్లపై నిల్చుకుని వీక్షిస్తుంటారు ఫ్యాన్స్. ఫలితాలకు అనుగుణంగా ఆనందం, నిరాశ, నిస్పృహ లాంటి భావావేశాలను ప్రకటిస్తుంటారు. ప్రతిష్టాత్మక ప్రపంచకప్, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నమెంట్లలో ఎంతో పోటీ ఉంటుందో క్రీడాభిమానులందరికీ ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు. సరిగ్గా అలాంటి సందర్భమే ఈసారి ఎదురయింది. ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022 టోర్నీ నుంచి భారత జట్టు భారంగా నిష్ర్కమించింది. తుది అంకానికి చేరువయ్యేందుకు చివరి బంతి వరకు పడతులు పోరు సాగించినా ఫలితం మనకు అనుకూలంగా రాలేదు. అయితే గెలుపు కోసం ఇరు జట్ల క్రీడాకారిణులు సాగించిన సమరం స్ఫూర్తిదాయకంగా నిలవడంతో పాటు ప్రేక్షకులకు ఉత్కంఠతో కూడిన వినోదాన్ని అందించింది. క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్‌లో మార్చి 27న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మిథాలీరాజ్ బృందం పోరాడి ఓడింది. చివరి బంతికి ఫలితం వచ్చిన ఈ మ్యాచ్‌లో అఖరి క్షణాలను ఆటగాళ్లతో పాటు అభిమానులు ఆత్రుతగా చూశారు. తమ జాతకం భారత్ టీమ్ చేతిలో ఉండడంతో వెస్టిండీస్ క్రీడాకారిణులు మరింత ఉత్కంఠగా మ్యాచ్‌ను వీక్షించారు. మిథాలీరాజ్ బృందం ఓడిన క్షణంలో డ్రెసింగ్స్లో రూమ్‌లో విండీస్ క్రీడాకారిణుల ఆనందోత్సాహాలు మిన్నంటాయి. (క్లిక్: కత్తి మీద సాము లాంటిది.. ఎలా డీల్ చేస్తారో?!) ఓడిపోయామనుకున్న మ్యాచ్‌లో గెలిచినట్టు తేలడంతో దక్షిణాఫ్రికా శిబిరంలో సంభ్రమాశ్చర్యాలు వ్యక్తమయ్యాయి. విజయం సాధించేశామన్న సంతోషంతో భారత బృందం ప్రదర్శించిన ఆనంద క్షణాలు.. నోబాల్ నిర్వేదం, ఓటమి బాధతో నిర్వేద వదనంతో నిష్క్రమించిన క్షణాలు, కామెంటేటర్లు మాటలు మర్చిపోయి అవాక్కయిన దృశ్యాలు.. ఇప్పుడు జ్ఞాపకాలుగా మిగిలాయి. కెమెరాలో నిక్షిప్తమైన ఈ అరుదైన దృశ్యాలను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తన అధికారిక ట్విటర్లో పేజీ షేర్ చేసింది. జయాపజయాలను పక్కనపెడితే ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ప్రదర్శించిన పోరాట పటిమ అందరి మనసులను గెలిచింది. (క్లిక్: భారత్ కొంపముంచిన నోబాల్..) -
నవ్వితేనే ఆఫీసుల్లోకి ఎంట్రీ.. ఇదేం విడ్డూరం!
ఆఫీస్ పరిధిల్లో సీసీ కెమెరాలు, ఐరిష్ మెషిన్లు ఉద్యోగుల కదలికలను, హాజరును పరిశీలించేందుకు ఏర్పాటు చేస్తుంటాయి కంపెనీలు. అయితే చైనాలోని కొన్ని ఆఫీసుల్లో కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. ఉద్యోగులు ఆఫీస్‌లోకి అడుగుపెట్టాలంటే కచ్చితంగా నవ్వాల్సిందే. ఈ మేరకు స్మైల్ రికగ్నిషన్ కెమెరా టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఆఫీసుల్లోకి ప్రవేశించడం మాత్రమే కాదు.. పర్సనల్ పీసీలు ఆన్ చేయాలన్నా, లంచ్ యాక్సెస్, మీటింగ్‌లకు అటెండ్ కావాలన్నా ఎంప్లాయి నవ్వాల్సిందే. ఇందుకు సంబంధించి కెనన్ కంపెనీ, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సాయంతో స్మైల్ రికగ్నిషన్ టెక్నాలజీ డెవలప్ చేసింది. పని చేసే టైంలో ఉద్యోగులు సంతోషంగా ఉన్నారా? లేదా? అనేది ఈ టెక్నాలజీ మానిటరింగ్ చేస్తుందని కెనన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తెలిపింది. ప్రయోగాత్మకం మరో 30 దేశాల్లో(భారత్‌తో సహా) ఈ టెక్నాలజీకి ట్రయల్ రన్ నిర్వహించాలని భావిస్తున్నట్లు కెనన్ ఒక స్టేట్మెంట్లో పేర్కొంది. నిజానికి స్మైల్ రికగ్నిషన్ కెమెరాలను కిందటి ఏడాదే డెవలప్ చేసినప్పటికీ.. అది అంతగా గుర్తింపు దక్కించుకోలేదు. అయితే ఈ ఏడాది బీజింగ్‌లో కొన్ని టాప్ కంపెనీలు ఈ టెక్నాలజీని అనుమతించడంతో ప్రముఖంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అయితే ఈ టెక్నాలజీపై విమర్శలు ఉన్నప్పటికీ.. ఇది ఉద్యోగుల మానస్థితిని అదుపు చేస్తుందని, వాళ్లను వందకి వంద శాతం సంతోషంగా ఉంచుతాయని కంపెనీలు వివరణలు ఇచ్చుకుంటున్నాయి. ఇదిలా ఉంటే మాస్కులు పెట్టుకున్న ఉద్యోగుల సంగతేంటని కొందరు సెటైర్లు వేస్తుండడం కొసమెరుపు. చదవండి: ఆర్టిఫిషీయల్ మూడో కన్ను! -
ఔను... ఆ ఇంటి విలువ... నిలువెత్తు మానవత్వం!
‘నా భార్య చివరికోరిక ఈ ఇంట్లో గడపాలని...తన బ్రతుకు వెంటిలేటర్ మీద మృత్యువుకు కూతవేటు దూరంలో వుంది. ఇవి దేశదేశాల్లో వున్న నా ఆస్తులు. వీటన్నింటినీ నీ పేరుతో మార్చేస్తున్నా. ఈ ఒక్క ఇంటిని నాకు...ఇచ్చేయ్....లే...దా ..కనీసం నాకు నా భార్యకు మేమిద్దరమూ కన్ను మూసేవరకూ తల దాచుకోవడానికి ఆ...శ్ర....య...మి...వ్వు...’ ఏడుస్తున్నాడు చంద్రశేఖర్. తన భార్యను ఆ స్థితిలో చూసి తట్టుకోలేకపోతున్నాడు చంద్రశేఖర్. మౌనంగా చూడ్డం...నిశ్శబ్దంగా కన్నీళ్లు కార్చడం తప్ప మరేమీ చేయలేకపోతున్నాడు. ఈ డబ్బు...హోదా...వ్యాపారసామ్రాజ్యం ఆమెను మాట్లాడించలేకపోతున్నాయి. ఆమె మనసును తేలిక పర్చలేకపోతున్నాయి. దానిక్కారణం తనే....బాధగా కళ్ళు మూసుకున్నాడు. కన్నీటి వెంటిలేటర్ మీద వుంది ఇందుమతి. కళ్ళ ముందు రెండు దృశ్యాలు ఒకే కాన్వాసు మీద తన బ్రతుకు చిత్రాన్ని రెండు బొమ్మలుగా చూపిస్తున్నట్టుంది. ఒకటి తెలుపు నలుపుల రసరమ్యమైన ప్రకృతి చిత్రమైతే, మరో దృశ్యభాగం వర్ణమయమే...కానీ వివర్ణమయమై ఉన్నట్టు ప్రకృతి గీసిన చిత్రంలా కాక, సాంకేతిక మాయాజాలంతో మాయచేసి గీసిన గాయంలా అనిపించింది. ఇందుమతి మనసు స్వగతాన్ని, గతాన్ని ఆహ్వానించింది. ∙∙ పచ్చని పంటచేల పైట కప్పుకున్న పడతిలా వుందా ఊరు...ఊరి మధ్యలో పేడతో అలికి, మనసుతో ముగ్గులు వేసి...ప్రేమతో రంగులు అద్ది అనుబంధాలతో వెల్ల వేసి, తీర్చిదిద్దిన పర్ణకుటీరంలా ఉందా ఇల్లు....పాతకాలం నాటి ఆ ఇల్లు అమూల్యమైన తాళపత్రాల్లోని నిధిలా వుంది.పెరట్లో జామచెట్టు మీద వున్న జామకాయలు చిలుక కొరికిన తమ బుగ్గలను చూసుకుని కిందికి నేలమీదికి దుమికి ఆరగించమని తమ యజమానికి చెబుతున్నాయి. చిలుక కొరికిన జామపళ్ళను తినడమంటే ఇందుమతికి ఎంతిష్టమో! నేరేడు పళ్ళు ఏరుకుని మరీ తింటుంది. సన్నజాజులు తానే స్వయంగా కోసి మాలకట్టి తన జడలో తురుముకున్నప్పుడు తన ఇంటి సన్నజాజుల వాసన...తన మదిలో ఎన్నెన్ని అనుభూతులను మిగిల్చాయో ఇందుమతికి మాత్రమే తెలుసు. ∙∙ భర్తది చిన్న వ్యాపారం...రోజూ మోపెడ్ మీద దగ్గర్లో వున్న పట్టణానికి వెళ్లి రాత్రి వరకు తిరిగివస్తాడు. ఒక్కోసారి తన కోసం మధ్యాహ్నమే వస్తాడు. ఒక్కోసారి కాదు అలాంటి చాలాసార్లు వచ్చాడు. వచ్చేప్పుడు కరూర్ సెంటర్లో చేసే వేడివేడి ఉల్లిపాయ పకోడీ భార్య కోసం తీసుకురావడం మర్చిపోడు. ఆ పకోడీ ఎక్కడ చల్లారుతుందోనని స్పీడ్ గా మోపెడ్ నడిపి రెండుమూడు సార్లు దెబ్బలు తగిలించుకున్నాడు. రాత్రి కాగానే భర్త కోసం ఎదురుచూస్తుంది. ఏదో ఒకటి కొనుక్కొస్తాడు...వేడివేడి అన్నం చారు లేదా రసం, వడియాలు, గడ్డపెరుగు సిద్ధంగా ఉంటుంది. నేలమీద కూచోని పెద్ద పళ్లెంలో భర్త అన్నం కలుపుతాడు. ఆవకాయ పచ్చడితో ఒక వాయి కలిపి తనకు తన కొడుక్కి కూతురికి ముద్దలు కలిపి నోట్లో పెడుతాడు. రాత్రిపూట తాను తన భర్త జామచెట్టు కింద కూచోని కిందపడ్డ జామకాయలో, నేరుడు పళ్ళో ఏరుకుంటూ తన కొంగుతో తుడిచి తింటూ కబుర్లు చెప్పుకోవడం ఆ ఇంట్లో నిత్యకృత్యం. హాలులో పెద్ద జంపఖానా. తాను ఆ చివర, భర్త ఇటు చివర మధ్యలో కొడుకు కూతురు, పొద్దున్నే బాయిలర్‌లో నీళ్లు వేడి చేసుకోవడం, కట్టెల పొయ్యిమీద పొగగొట్టంతో కుస్తీపడుతూ ఉంటే భర్త వచ్చి తన కళ్ళను ఊది మంటను పోగొట్టడం. పెరట్లో కాసిన కూరగాయలతో నవనవలాడే వంకాయ వేపుడు. వేసవికాలం ఆరుబయట వెన్నెల్లో, వర్షాకాలం వర్షపుజల్లును కిటికీలో నుంచి చూస్తూ. చలికాలం మంచు వర్షాన్ని ఆస్వాదిస్తూ...రుతువులు ఏవైనా అనుభూతులను మాత్రం పదిల పర్చుకుంటూ...ఈ ప్రయాణంలో తమ వెంట వున్నవ్యక్తి చలమయ్య. పేరుకు ఆ ఇంట్లో పనివాడైనా తమ ఇంటివాడు. తమ ఆప్తుడు అనుకున్నారు. ఎప్పుడూ ఇందుమతికి సోదరుడిలా, వాళ్ళ పిల్లలకు మేనమామలా ఉండేవాడు. ఆ ప్రాంగణంలోనే ఒక చిన్నగదిలో చలమయ్య అతని భార్య ముగ్గురుపిల్లలు...గుట్టుగా సంసారాన్ని నెట్టుకొచ్చేవాడు. ఆత్మాభిమానమే అతని ఆస్తి. భార్య పొలం పనులకు వెళ్తే పిల్లలు కూడా పూలమాలలు కట్టడం, గుడిని శుభ్రం చేయడం లాంటి పనులు చేసేవాళ్ళు. అందరూ కష్టపడాలని తత్త్వం. చేసిన పనికి ఎప్పుడూ జీతం తీసుకోలేదు. తాను ఉండడానికి ఇచ్చిన గదికి అద్దె లేకపోవడమే తనకు జీతంతో సమానమనేవాడు. ∙∙ కాలం తనపని తాను చేసుకుపోతూ ముందుకు వెళ్తోంది. ఇందుమతి భర్త చంద్రశేఖర్ క్రమక్రమంగా ఎదిగాడు. అంతస్తులో పెరిగాడు. అతని తెలివి, శ్రమ, నిజాయితీ వ్యాపార ప్రపంచంలో అతడిని ప్రముఖుడిని చేశాయి. కార్పొరేట్ వరల్డ్ అతనికి రెడ్ కార్పెట్ పరిచింది. హోదా ఆస్తి అంతస్తు...అన్నీ ఇచ్చింది. పల్లెనొదిలి పట్టణానికి, పట్టణాన్ని వదిలి మహానగరానికి, రాష్ట్రరాజధానికి....అతని ప్రస్థానంలో అన్నీ ఉన్నత శిఖరాలే. ఉదయం వెళ్లి ఎంతరాత్రి అయినా ఇంటికి వచ్చే భర్త ఇప్పుడూ వస్తున్నాడు...కాకపోతే ఎక్కడికి వెళ్లినా రాత్రికల్లా ఫ్లైట్ లో... మోపెడ్ స్థానంలో రేంజ్ రోవర్ జాగ్వార్ బీయండబ్లు్య కార్లు వచ్చి చేరాయి. మోపెడ్ స్టోర్ రూమ్ లోకి చేరింది. అతని స్థాయి...ప్రతీ రాష్ట్రంలో ఇళ్లస్థలాలు..విదేశాల్లో ఇళ్ళు. ఉదయం సిడ్నీలో ఉంటే మరుసటి రోజు ఇంగ్లాండ్‌లో. వారంలో ఏ రెండు మూడు దేశాలో తిరుగుతాడు.... ఇది ఇందుమతి బ్రతుకు కాన్వాసు మీద మరో వర్ణచిత్రం ∙∙ అలాంటి స్థితిలో తమ ఇల్లు ఒక చిన్న ఇసుకరేణువులా అనిపించింది. తన దగ్గర నమ్మకంగా వున్న చలమయ్యకు ఆ ఇంటిని కానుకగా ఇవ్వాలనుకున్నారు ఇందుమతి దంపతులు. ఆ విషయాన్నీ చెప్పి అతని కళ్ళలో ఆనందాన్ని చూడాలనుకున్నారు. కానీ వాళ్ళు విస్తుపోయేలా ఆ ఇంటిని కానుకగా స్వీకరించలేను అన్నాడు చలమయ్య. ఇందుమతి చంద్రశేఖర్ దంపతులు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించారు. చివరికి ఒక్క షరతు మీద ఒప్పుకున్నాడు. ఆ ఇంటిని తనకు అమ్మాలన్నాడు. తన తాహతుకు దగ్గరగా ఉంటే కొనుక్కుంటానన్నాడు. అతని ఆత్మాభిమానం చూసిన ఇందుమతికి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆ ఇంటి విలువ నిర్ణయించే బాధ్యత చలమయ్యకే అప్పగించింది ఇందుమతి. చలమయ్య రాత్రి అంత భార్య పిల్లలతో చర్చించాడు. ఇన్నాళ్లు దాచుకున్న డబ్బు, తన పిల్లలు చిట్టి చేతుల్తో సంపాదించిన డబ్బు, తన భార్య పొలం పనులకు వెళ్లి సంపాదించిన డబ్బు...కలిపి పోగేస్తే ముప్పయిఆరువేల ఆరువందల యాభై రూపాయలు తేలింది. తన దగ్గర అంతే డబ్బు ఉందని అంతకు మించి లేదని ఆ ధరలో ఇల్లు కొంటానని, ఇంటి విలువను అపార్థం చేసుకోవద్దని చెప్పాడు చలమయ్య. ఆ డబ్బుతో ఆ ఇంటిని చలమయ్య పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు ఇందుమతి దంపతులు. ఇది జరిగిన ముప్పై ఏళ్లలో ఎన్నో మార్పులు. చంద్రశేఖర్ ఎదుగుతూనే వున్నాడు. పారిస్‌లో కోట్ల విలువచేసే ఇంటిని కొనుగోలు చేసాడు. లెక్కలేనన్ని కార్లు ...ఆస్తులు....కానీ ఇందుమతిలో అసంతృప్తి. రోజురోజుకూ ఇందుమతి చిక్కిపోతుంది. పిల్లలు ప్రయోజకులు అయ్యారు. వ్యాపారాలు పిల్లలకు అప్పగించి సిడ్నీలోనో, మరో దేశంలోనో స్థిరపడాలనుకున్నాడు చంద్రశేఖర్. కానీ ఈ మధ్యకాలంలో భార్యలో చాలా మార్పును గమనించాడు. అతను వృత్తిరీత్యా బిజినెస్‌మేన్.. కానీ భార్య అంటే ప్రాణం...అందుకే కారణం అడిగాడు.అప్పుడు నోరు విప్పింది ఇందుమతి. తన మనసు గొంతు విప్పి చెప్పింది. కన్నీటి స్వరపేటికను సవరించుకుని. ∙∙ మన ఉనికి కోసం, బ్రతుకు పోరాటంలో మనం చాలా దూరం ప్రయాణించాం.ఒక్కో అనుభూతిని వదులుకుంటూ పైకి ఎదిగాం. పదుల గదులు వున్నాయి. ప్రతీగదిలో ఖరీదైన ఏసీలున్నాయి. అయినా ఊపిరాడ్డం లేదు. గాలి సరిపోవడం లేదు. మన ఊళ్ళో, మన చిన్ని ఇంట్లో ఆరు బయట వెన్నెల్లో స్వచ్ఛమైన చెట్ల గాలి ఎంతో బావుంది. నేల మీద మనం పడుకున్నప్పుడు వున్న సెక్యూర్డ్ ఫీలింగ్ నలుగురు పడుకునే ఈ ఖరీదైన బెడ్ మీద మీరో మూల నేనో మూల అన్నట్టుంది. ఎక్కడున్నా రాత్రయితే చాలు...మీరు తెచ్చే వేడివేడి ఉల్లిపాయ పకోడీ రుచి, వేడి అన్నంలో రసం వడియాలతో అన్నం తిన్న రుచి...నలుగురు వంటవాళ్లు వండిన నలభైరకాలైన రుచులలో కనిపించడం లేదండి..ఈ కోట్ల విలువ చేసే ప్యాలెస్‌లో నిద్ర పట్టడం లేదండి... మీకోసం ఇంటి ముందు వరండాలో నిల్చున్నప్పుడు వున్న ఫీలింగ్.. మీకోసం ఎదురుచూసే సెక్యూరిటీ...మీరు రాగానే తెరుచుకునే ఆటోమేటిక్ డోర్స్.. అన్నింటినీ దాటుకుని నా గదిలోకి వచ్చి ఖరీదైన నెక్లస్ ఇచ్చినప్పుడు నాలో స్పందనలు కలుగడం లేదు...ఎందుకో మనం ఈ చివరి రోజులు మనకు ఇష్టమైన మన ఇంట్లో గడపాలనిపిస్తుంది. పెళ్ళైన రోజు నుంచి మిమల్ని ఏమీ అడగలేదు..ఈ కోరిక...ఆమె గొంతులో వణుకు....’ అతనికి అర్థమైంది..మనసు ఆర్ద్రమైంది. బిజినెస్ పనుల వల్ల భార్య కోరికను నిర్లక్ష్యం చేసాడు. ఈ లోగా ఇందుమతి పరిస్థితి సీరియస్‌గా మారింది. మాట పడిపోయింది. చంద్రశేఖర్ కదిలిపోయాడు. తన భార్య కోర్కె తీర్చడానికి సిద్దమయ్యాడు. భార్య కోరికను తీర్చడం కష్టం కాదనుకున్నాడు. అది ఒకప్పుడు తను అమ్మిన తన ఇల్లు...పీఏను పిలిచాడు. ఆగమేఘాల మీద ఇండియా పంపించాడు...ఇరవై లక్షల రూపాయల క్యాష్...చలమయ్య కూడా ఊహించని అమౌంట్...అతను కొన్న ఖరీదుకు కొన్నిపదుల రెట్లుఎక్కువ.... సరిగ్గా ఇరవై నాలుగు గంటల తర్వాత పీఏ దగ్గరి నుంచి ఫోన్...షాక్ కు గురి చేసే ఫోన్.. ‘సారీ సర్ అతను అమ్మనంటున్నాడు’ ‘వాట్?!’ చంద్రశేఖర్ ఊహించని సమాధానం ‘అతను అమ్మనంటున్నాడు సర్’ మరోసారి వినయంగా చెప్పాడు. ‘చూశావా ఇందుమతి...డబ్బుకోసం ఎంత నాటకమో....’ అంటూ పీఏ వైపు తిరిగి చెప్పాడు...నలభై లక్షలు ఆఫర్ చేయండి. రేపీపాటికి రిజిస్ట్రేషన్ అయిపోవాలి. ఇందుమతి గమనిస్తూనే వుంది....కానీ బదులు చెప్పలేదు. మరో గంటలో పీఏ నుంచి ఫోన్....‘అయినా అమ్మనంటున్నాడు సర్’ చంద్రశేఖర్ అహం దెబ్బ తిన్నది. ‘యాభై అరవై..కోటి ..కోటి రూపాయలు ఇస్తామని చెప్పండి...వాడి జీవితంలో అంత డబ్బు చూడలేదు..వెంటనే కాళ్ళ దగ్గరికి వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తాడు’ చెప్పాడు తన అహాన్ని చూపిస్తూ.. ఇందుమతి వైపు చూస్తూ. అయినా ఇందుమతి ఏమీ మాట్లాడలేదు. మౌనంగా వుంది. ‘ఇప్పటి వరకూ డబ్బు మాత్రమే సమస్య అనుకున్నాను...ఇది నా ప్రిస్టేజ్ ఇష్యూ ...లోకల్ పోలీస్‌లకు లైన్ కలపండి. నేను చెప్పానని చెప్పండి...వాళ్ళే డీల్ ఫినిష్ చేస్తారు’ చెప్పాడు. ఆ రాత్రంతా నిద్రపోలేదు. అతని కళ్ళు ఎర్రగా మారాయి. మొదటిసారి తనే పీఏకు ఫోన్ చేసాడు ఆతృతను అణుచుకోలేక....‘ఇప్పుడే పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చాను సర్...సీఐ స్టేషన్‌కు పిలిచి భయపెట్టినా ఇల్లు అమ్మను అంటున్నాడు. సీఐ చేతులెత్తేశాడు సర్. సివిల్ విషయాల్లో ఎక్కువదూరం వెళ్తే ప్రమాదం అంటున్నాడు’ పీఏ చెప్పాడు. అప్పటికే విచక్షణ రేఖ దాటాడు...‘సో మనకు లాస్ట్ ఆప్షన్..ఫస్ట్ టైం నేను రాంగ్ రూట్లో వెళ్తున్నాను. లోకల్ గుండాలను కాంటాక్ట్ చెయ్...బెదిరిస్తారో...ఏం చేస్తారో...ఆ ఇల్లు మన పేరు మీద రిజిస్ట్రేషన్ కావాలి’ చెప్పాడు చంద్రశేఖర్. ఇందుమతి ఎప్పటిలానే మౌనంగా వుంది. ఆమె కళ్ళు అప్రయత్నంగా కన్నీళ్లు కారుస్తున్నాయి. ∙∙ కొన్ని గంటల్లోనే పీఏ నుంచి ఫోన్ కాల్...‘అయామ్ వెరీ సారీ సర్...అతడి ఇంట్లోని సామాన్లు బయటేసినా ఇంటిల్లిపాదినీ కొట్టినా ఇల్లు అమ్మననే అంటున్నాడు...ఇంటిల్లిపాది అదే మాట మీదున్నారు’ చంద్రశేఖర్ ప్రపంచం ఒక్కసారిగా తల్లక్రిందులు అయ్యింది. అతనిలోని అహం పగిలి ముక్కలైంది. మంచంమీద నిష్త్రాణంగా వున్న భార్య వంక చూసాడు. డాక్టర్స్ వస్తున్నారు.. వెళ్తున్నారు... ప్రపంచంలో అన్ని దేశాల్లో వున్న డాక్టర్లు ఇందుమతి ఆరోగ్యస్థితిని గమనించారు. అది మనిషి కనిపెట్టిన సైన్స్‌కు, శరీరశాస్త్రానికి సంబంధించిన జబ్బు కాదు...కనిపించని మనసుకు, కనిపెట్టలేకపోయిన ఎమోషన్స్‌కు సంబంధించిన అనుబంధపు అనారోగ్యం కాబోలు...అందుకే అందరూ పెదవి విరుస్తున్నారు. చేతులెత్తేస్తున్నారు. భార్య వంక చూశాడు...తాను కోరిన ఒకేఒక చివరికోరిక తీర్చని భర్తను నిందిస్తున్నట్టుగా లేదు...‘మీరు మాత్రం ఏం చేయగలరు?’ అని కన్నీటి నిట్టూర్పు విడుస్తున్నట్టు వుంది. ‘చేయగలడు ...చేయాలి ...చేస్తాను..’ చంద్రశేఖర్ ఓ నిర్ణయానికి వచ్చాడు. తన ఆస్తులకు సంబంధించిన అన్ని పేపర్స్ తీసుకున్నాడు. ప్రత్యేక విమానంలో ఇండియా బయల్దేరాడు. అక్కడి నుంచి హెలికాప్టర్లో తన ఊరికి వెళ్ళాడు. స్ట్రెచర్ మీద వున్న భార్యను సహాయకులు కిందికి దించారు. చంద్రశేఖర్ కిందికి దిగాడు. ఇందుమతి కళ్ళు విచ్చుకున్నాయి...దాదాపు ముప్పయేళ్ల తర్వాత తన ఊరు తన ఇల్లు తాను పీల్చిన గాలి.... చంద్రశేఖర్ అలానే చూస్తూ వుండిపోయాడు. ఊరు చాలా మారింది. మల్టీప్లెక్స్‌లు వచ్చాయి. షాపింగ్ మాల్స్ వచ్చాయి. గుర్తుపట్టనంత మారింది. కానీ తాను అమ్మిన ఇళ్లు అలానే వుంది. పాడవకుండా చేసిన మరమ్మత్తులు తప్ప. భార్య ఇష్టంగా నాటిన సన్నజాజుల చెట్టు, జామచెట్టు నేరేడు చెట్టు...అదే నేల,అవే గదులు...అదే ఇంటి తాలూకూ జ్ఞాపకాల పరిమళం...తనూ ఇందుమతి సాయంకాలాల్లో కూచునే రాతిచెప్టా....అలానే చెక్కు చెదరకుండా వుంది. రోజూ దాన్ని శుభ్రం చేస్తున్నట్లుంది. చంద్రశేఖర్ చలమయ్య వైపు చూశాడు... వృద్ధాప్యం తాలూకూ ఛాయల కన్నా తాను బాధ పెట్టిన గాయాల బాధలే కనిపించాయి. వళ్ళంతా దెబ్బలు...రక్తమోడుతోన్న దేహం..అతని భార్య పిల్లలు..పిల్లలు పెద్దవాళ్లయ్యారు. తనని ఒక్కమాట అనలేదు..ఇందుమతిని పలకరిస్తున్నారు..ఇందుమతిని చూసి కంట తడి పెడుతున్నారు... చంద్రశేఖర్ తన బ్రీఫ్ కేసులో వున్న డాక్యుమెంట్స్ చలమయ్య ముందు పెట్టాడు. మోకాళ్ళ మీద కూచున్నాడు..రెండు చేతులు జోడించాడు... ‘నా భార్య చివరికోరిక ఈ ఇంట్లో గడపాలని...తన బ్రతుకు వెంటిలేటర్ మీద మృత్యువుకు కూతవేటు దూరంలో వుంది. ఇవి దేశదేశాల్లో వున్న నా ఆస్తులు. వీటన్నింటినీ నీ పేరుతో మార్చేస్తున్నా. ఈ ఒక్క ఇంటిని నాకు...ఇచ్చేయ్....లే...దా ..కనీసం నాకు నా భార్యకు మేమిద్దరమూ కన్ను మూసేవరకూ తల దాచుకోవడానికి ఆ...శ్ర....య...మి...వ్వు...’ ఏడుస్తున్నాడు చంద్రశేఖర్. పరుగెత్తుకొచ్చి చంద్రశేఖర్ కాళ్ళ మీద పడ్డాడు చలమయ్య. ‘అయ్యా.. ఇది మీ ఇల్లు. మేము కాపలాదారులం. ఇది నా ఇందమ్మ కట్టుకున్న దేవాలయం. దేవుడిని కొలుచుకునే భక్తులం..ఈ ఇల్లు మీదే...మీకు ఈ ఇల్లు అమ్మేస్తున్నాను. ఇప్పుడే ఈ క్షణమే..కానీ నేను కోరిన డబ్బు ఇవ్వాలి...’ గొంతు గాద్గదికం అవుతుండగా చెప్పాడు. చంద్రశేఖర్ ముఖంలో ప్రపంచాన్ని జయించిన సంతోషం. వేలకోట్లు సంపాదించినా కలుగని ఆనందం చలమయ్య ఇల్లు అమ్ముతానన్న మాట చెప్పినప్పుడు కలిగింది. ‘చెప్పు చలమయ్య, ఎంత..ఎన్ని వేల కోట్లు..ఇప్పుడే ఇప్పుడే ఇచ్చేస్తా. ఈ క్షణం నా భార్య ఇందుమతి మీద ఒట్టేసి..’ పరుగెత్తుకు వెళ్లి భార్య తల మీద చేయేసి ఉద్వేగంతో కదిలిపోతూ అన్నాడు. చలమయ్య చెప్పాడు....కళ్లు తుడుచుకుంటూ ఇందుమతి వైపు చూసి. ఆ క్షణం ఇందుమతి కళ్ళు తెరుచుకున్నాయి. ఆ అబ్బుర దృశ్యాన్ని చూడడానికి అన్నట్టు... ‘ఈ ఇల్లు ఖరీదు ముప్పయిఆరువేల ఆరువందల యాభై రూపాయలు’ చెప్పాడు చలమయ్య. చంద్రశేఖర్ ఆశ్చర్యంగా చూసాడు. అక్కడే వున్న పీఏకు మతిపోయింది. వేలకోట్లు వదిలి వేల రూపాయలకా? చలమయ్య ఇందుమతి దగ్గరికి వచ్చి తల మీద చేయేసి...‘అమ్మా నన్ను క్షమించు...’ అని చంద్రశేఖర్ వైపు తిరిగి ‘ఈ ఇంటిని డబ్బుతో విలువ కట్టి కొనలేదు. ఇందమ్మ మనసుతో కొన్నాను. తన ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న ఈ ఇళ్లు మీరు ఉచితంగా ఇస్తానని అన్నప్పుడు ఎందుకు వద్దన్నానో తెలుసా బాబూ? అమ్మ మనసు విలువ మా మీద చూపించిన ప్రేమ విలువ ఉచితం కాకూడదు. అందుకే మేము కష్టపడి ఇంటిల్లిపాది కూడబెట్టుకున్న పైసా పైసా కలిపి సంపాదించిన డబ్బును మా అన్నేళ్ల జీతాన్ని జీవితాన్ని ఈ ఇంటికి ఖరీదుగా విలువ కట్టి దేవుడికి ఉడతాభక్తిగా ఇచ్చినట్టు ఇచ్చి ఇల్లు కొన్నాను. అందుకే ఈ ఇంటికి మరమ్మత్తు్తలు తప్ప మార్పులు చేయించలేదు. ఇందమ్మ నాటిన చెట్టుకాయలు అమ్మలేదు. ప్రసాదంలా మేమే తిన్నాం. పిల్లలకు పంచిపెట్టాం. ఇప్పుడు ఇందమ్మ కోసం..ఈ ఇంటిని అంతే విలువకు అమ్మేస్తున్నాం...కానీ మాదొక కోరిక ...ఒకప్పుడు ఇందమ్మ మేము తలదాచుకోవడానికి ఇచ్చిన గదిలో మేము కన్నుమూసే వరకూ వుండే అవకాశం ఇవ్వండి. మీకు సేవ చేసుకుంటూ ఇంద్రమ్మను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాం’ రెండు చేతులూ జోడించాడు చలమయ్య. మాటలు మర్చిపోయాడు చంద్రశేఖర్. ఇందుమతి గొంతు పెగులుతోంది. కుడి చేయి మెల్లిగా పైకి లేచింది. చలమయ్య చేతిని తన చేతుల్లోకి తీసుకుని కళ్ళకు అద్దుకుంది...దేవుడిచ్చిన అన్నయ్య...మనసు పంచుకున్న అనుబంధానికి అర్థం చెప్పిన అన్నయ్య.... ఇందుమతి కళ్ళు మెరుస్తున్నాయి కన్నీటితో....ఆ ఇంటిని చూస్తూనే వుంది.... ఇపుడు ఆ ఇంటి విలువ....నిలువెత్తు మానవత్వం. -
మంచి మనుషులు
మనుషులు ఎమోషన్స్‌ని అదుపు చేసుకోవడం, బిలీఫ్స్ని చెక్కుచెదరనివ్వక పోవడం.. ఇలాంటి వాటి వల్లనే జీవితానికి ఇంత అందమేమో! అయితే మనుషుల్లో నిద్రపట్టనివ్వని వాళ్లు, నిజాల కుండల్ని బద్దలు కొట్టే వాళ్లు లేకపోతే జీవితంలోని ఆ అందాన్ని చిలికి పైకి తెచ్చేదెవరు? మనిషంటేనే మంచి. మన దేశంలోనైనా, మరో దేశంలోనైనా. ప్రకాశ్‌రాజ్ కూడా అన్నాడు కదా, ‘మనిషంటేనే మంచిరా..’ అని ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో. ఒకవేళ లోకం నిండా చెడ్డవాళ్లు ఉండి, ఒకళ్లిద్దరు మంచివాళ్లు ఉన్నా చాలు లోకంలోని చెడును చెట్టులా కొట్టేయడానికి. చెట్టును కొట్టేయడం చెడు కదా! చెడే. చెట్టును కొట్టేయవలసిన టైమ్ వచ్చినప్పుడు కొట్టేయడం ‘మంచి చెడు’ అవుతుంది తప్ప, చెడు అవదు.లోకమంతటా మంచివాళ్లు ఉన్నప్పుడు డెస్క్ పక్కన డెస్క్‌లో, ఇళ్ల పక్కన ఇళ్లలో మంచివాళ్లు లేకుండా ఉంటారా? ఆఫీస్‌లో కొంతమంది మంచివాళ్లు ఉంటారు. పాపం, ఏం తోచక బల్లపై దరువులు వేస్తుంటారు. దరువు బోర్ కొట్టేస్తే చిటికెలు. పిల్లలు రేకు డబ్బాలను డబడబలాడిస్తూ ఒక్కరే ఏకాంతంలో ఎంటర్టైన్ అవుతుంటారు కదా, చలంగారు అన్నట్లు.. అలాగ. పక్కన డెస్క్‌లో పని జరుగుతుంటుందన్న ఆలోచన వాళ్లకు రావాలని రూలేం ఉంది?! ఇళ్ల పక్క ఇళ్లల్లోనైతే ఈ టైప్ ఆఫ్ ‘బాల్యం’లోని వాల్యూమ్ ఇంకొంచెం వైల్డ్‌గా ఉంటుంది. మూడో, నాలుగో ఇళ్ల్ల అవతలికి వినిపించేలా. భరించే మంచితనం ఉంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. నార్త్ కరొలీనాలో క్యాండైస్ మ్యారీ బెన్బో అనే మంచావిడ ఒకరు ఉన్నారు. ఆమె పక్కింట్లోనూ ఒక మంచి వ్యక్తి ఉన్నాడు. ఆ మంచి వ్యక్తి కొత్తగా వచ్చి చేరాడు. మ్యూజిక్ వీడియో ప్రొడ్యూసర్. పెద్ద శబ్దంతో అతడు ప్రొడ్యూస్ చేసే సంగీతానికి నెల రోజులుగా మ్యారీకి నిద్ర కరువైంది. కళ్ల కిందకు వలయాలు వచ్చేశాయి. అంతరాత్రప్పుడు వెళ్లి చెప్పలేదు. పగలు వెళ్లి చెప్పాలంటే ఉదయమే తలుపుకు తాళం వేసి ఉంటుంది. ఏం చేయాలి? యు.ఎస్.లో న్యూసెన్స్ కేస్ పెట్టడం తేలిక. ఆమె పెట్టదలచుకోలేదు. ఓ సాయంత్రం బయటికి వెళ్లింది. అరకిలో వెనీలా కేక్ బాక్స్‌తో తిరిగొచ్చింది. ఆ కేక్ బాక్స్‌ను తలుపులు మూసి ఉన్న మ్యూజిక్ ప్రొడ్యూసర్ ఇంటి గడపపై పెట్టింది. బాక్స్‌తో పాటు చిన్న నోట్ కూడా. మర్నాడు ఉదయాన్నే ఆ వ్యక్తి వచ్చి మ్యారీ ఇంటి కాలింగ్ బెల్ నొక్కాడు. మ్యారీ బయటికి రాగానే ‘మీరేనా మ్యారీ’ అని, గుడ్మాణింగ్ చెప్పాడు. ‘సారీ’ కూడా చెప్పాడు. ‘ఇక మీదట మీ సౌండ్ స్లీప్‌ను నా మ్యూజిక్ సౌండ్ పాడు చెయ్యదు’ అని చిరునవ్వుతో భరోసా ఇచ్చాడు. వాళ్లిప్పుడు మంచి ఫ్రెండ్స్. ‘మీ మ్యూజిక్ వినసొంపుగా ఉంది. డిసెంబర్ 15న మాత్రం వినసొంపు కాస్త టూ మచ్‌గా ఉంది’ అని రాసింది మ్యారీ ఆ నోట్లో. ఆ మనిషి వెంటనే అర్థం చేసుకున్నాడు. మనుషుల్లోని అమాయకత్వాన్ని పోగొట్టే మంచి మనుషులు కొందరుంటారు. అమాయకత్వాన్ని పోగొట్టడం మంచి పనే. లేకుంటే లోకంలోని అమాయకులు చాలా నష్టపోతారు. ‘ఇదా లోకం’ అని కుంగిపోతారు. అలా కుంగిపోకూడదనే.. ఇటీవల ఎన్నికలకు ముందు ఒక ముఖ్య నాయకుడు ఓటర్ల అమాయకత్వాన్ని పోగొట్టారు. ‘ఓడిపోతే నాకేం నష్టం లేదు. వెళ్లి ఫామ్‌హౌస్‌లో కూర్చుంటాను. మీకే నష్టం’ అన్నాడు. ఓటర్లు అమాయకత్వం పోగొట్టుకుని తమకు నష్టం జరక్కుండా ఆయనకు ఓటేశారు. క్రిస్మస్ రోజు డొనాల్డ్ ట్రంప్ అనే మరో మంచి మనిషి కూడా ఇలాగే ఓ చిన్నారి అమాయకత్వం పోగొట్టే పని చేశారు. హాలిడే ఈవెంట్లో పిల్లల ప్రశ్నలకు ఫోన్లో సమాధానాలు ఇస్తున్నప్పుడు సౌత్ కరోలినాలో ఉంటున్న కాల్మాన్ లాయిడ్ అనే చిన్నారి నుంచి ట్రంప్‌కు కాల్∙వచ్చింది. ‘‘క్రిస్మస్ను ఎలా జరుపుకున్నావ్ డియర్’’ అని ట్రంప్ అడిగారు. ‘‘చాలా బాగా సర్. నేను నా సిస్టర్స్ రాత్రి సెయింట్ నిక్ (శాంటాక్లాజ్) చర్చికి వెళ్లాం. ఐస్డ్ షుగర్ కుకీస్, మిల్క్ పెట్టివచ్చాం. తెల్లారే వెళ్లి చూస్తే అవి అక్కడ లేవు. శాంటాక్లాజ్ వాటిని తీసుకుని మా కోసం అక్కడున్న ఒక చెట్టు కింద కానులు పెట్టి ఉంచాడు. వాటిని తెచ్చుకున్నాం’’ అని సంతోషంగా చెప్పింది లాయిడ్. ‘‘నీ వయసెంత తల్లీ?’’ అని అడిగారు ట్రంప్. ‘‘ఏడేళ్లు’’ అని చెప్పింది. ‘‘నువ్వింకా శాంటాక్లాజ్‌ని నమ్ముతున్నావా.. ఏడేళ్లు వచ్చాక కూడా’’ అని అన్నారు ఆయన. ఆ పాప ‘లాంగ్ ఇన్ ద టూత్’ అని ట్రంప్ ఉద్దేశం. మనం అంటాం కదా, చాలా నిర్దయగా.. పెద్దదానివవుతున్నావ్ అని. ఆ విధంగా. ‘‘ఆర్యూ స్టిల్ ఎ బిలీవర్ ఇన్ శాంటా! బికాజ్ ఎట్ సెవెన్ ఇట్స్ మార్జినల్, రైట్?’’ అన్నారు ట్రంప్. ఆ పాప అప్పుడేం చెప్పలేదు. తర్వాత తల్లి సహాయం తీసుకుని ఇంటర్నెట్లోకి వీడియో అప్లోడ్ చేసి..‘ఎస్ సర్. నేను శాంటాను నమ్ముతున్నాను’ అని అందులో చెప్పింది. పిల్లలు పెరిగి పెద్దవాళ్లు అవుతున్నప్పుడు ఎక్కడో ఒకచోట వాళ్ల అమాయకత్వంలోకి వాస్తవలోకం చొరబడడం ఎలాగైనా జరుగుతుంది. ట్రంప్ కాకపోతే, మరొకరు. ఏడేళ్లకు కాకపోతే మరో ఏడాదికి. ఎవరో ఒకరి వల్ల ఎప్పుడో ఒకసారి అమాయకత్వం తొలగిపోతుంది. తొలగిపోవడం మంచి విషయమే. తొలగిపోకపోతే? అదొక అందమైన విషయం.మనుషులు ఆ శబ్దసంగీతాన్ని భరించలేని ఆవిడలా ఎమోషన్స్‌ని అదుపు చేసుకోవడం, శాంటా లేడంటే నమ్మని ఈ చిన్నారిలా బిలీఫ్స్ని చెక్కుచెదరనివ్వక పోవడం.. ఇలాంటి వాటి వల్లనే జీవితానికి ఇంత అందమేమో! మనుషుల్లో నిద్రపట్టనివ్వని ఆ మ్యూజిక్ ప్రొడ్యూసర్‌లా, నిజాల కుండల్ని బద్దలు కొట్టే డొనాల్డ్ ట్రంప్‌లా మంచివాళ్లే లేకపోతే జీవితంలోని ఈ అందాన్ని చిలికి పైకి తెచ్చేదెవరు?! ∙ -
అమ్మ... ఆయా... ఓ కథ
సినిమాల్లో హీరోయిన్ ఎప్పుడూ హీరోకి చెవిలో తల్లవుతున్న సంగతి చెబుతుంది. పాటలో ఆమెకు నవమాసాలు నిండటం, మొదటి చరణంలో పిల్లాడు పుట్టడం, రెండవ చరణంలో ఎనిమిదేళ్ల వాడయ్యి బెలూన్లు పట్టుకుని పరుగుతీయడం... అంతా హ్యాపీగా జరిగిపోయినట్టు చూపిస్తారు. నిజంగా అంత హ్యాపీనా? మాతృత్వం చుట్టూ మధుర భావనలే సృష్టించింది ఈ ప్రపంచం. ఏ ప్రపంచం? మగ ప్రపంచం. తల్లి కావడం స్త్రీ జీవితానికి ధన్యత అన్నారు. తల్లి వల్లే సమాజం అన్నారు. తల్లి పూజ్యనీయురాలు అన్నారు. తల్లి పాదాల వద్దే స్వర్గం ఉందన్నారు. స్త్రీ వేరు. తల్లి వేరు. తల్లి అయిన స్త్రీకే ఈ సమాజంలో సమ్మతి. లేదంటే ఈసడింపులు. అందుకే స్త్రీలు తల్లులు కావడానికి తహతహలాడతారు. తల్లి కావాలనే సహజాతం వారిలో ఉంటుంది. తల్లి కావాల్సిన భౌతిక అవసరం ఉంటుంది. ఈ రెంటికీ పురుషుడి ప్రోత్సాహం ఉంటుంది. కాని తల్లి అయ్యే సమయంలో, తల్లి అయ్యాక, బిడ్డను, పెంపకాన్ని నిర్వహించాల్సిన సమయంలో తల్లికి పురుషుడి తోడ్పాటు ఎంత? సహకారం ఎంత? సహానుభూతి ఎంత? సినిమాల్లో హీరోయిన్ ఎప్పుడూ హీరోకి చెవిలో తల్లవుతున్న సంగతి చెబుతుంది. పాటలో ఆమెకు నవమాసాలు నిండటం, మొదటి చరణంలో పిల్లాడు పుట్టడం, రెండవ చరణంలో ఎనిమిదేళ్ల వాడయ్యి బెలూన్లు పట్టుకుని పరుగుతీయడం... అంతా హ్యాపీగా జరిగిపోయినట్టు చూపిస్తారు. నిజంగా అంత హ్యాపీనా?హాలీవుడ్లో కూడా సినిమాలు ఇలాగే ఉండేవి.కాని ఆ పరంపరను బ్రేక్ చేస్తూ అక్కడ తాజాగా రాబోతున్న సినిమా ‘టాల్లీ’.ఈ టాల్లీ అనేది ఆయా పేరు. ఈమె ఎవరికి ఆయా? ఈ సినిమాలోని ‘మార్లో’ అనే గృహిణి పిల్లలకు ఆయా. మార్లో న్యూయార్క్ శివార్లలో ఉండే గృహిణి. భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడో బిడ్డకు జన్మనివ్వనుంది. నిండు గర్భిణి. మాతృత్వం గొప్పదే కావచ్చు. పిల్లలకు జన్మనివ్వడం స్త్రీ జన్మకు సార్థకత కావచ్చు. కాని ఏమేమి కోల్పోతే ఒక స్త్రీ ఈ మాతృత్వ దశకు చేరుకుంటుంది? ఈ సినిమాలో ఇద్దరు పిల్లలతో, కడుపులో ఉన్న బిడ్డతో మార్లో సతమతమవుతుంటుంది. గర్భం వల్ల బరువు పెరిగి ఉంటుంది. అందం చందం పట్ల ఆసక్తి ఉండదు. ఏదో ఆందోళన. భర్త మంచివాడే కాని అతడు తన కెరీర్లో తాను బిజీగా ఉంటాడు. మహా అయితే పిల్లల హోమ్ వర్క్‌లో సాయం చేస్తుంటాడు. కాని ఇంట్లో ఇరవై నాలుగ్గంటలు ఉండే భార్య ఇరవై నాలుగ్గంటల పాటు చిన్నా పెద్ద పనులను చక్కబెట్టుకుంటూ తనను తాను ఎలా మిగుల్చుకోగలదు? ఇండియా నుంచి అమ్మలో అత్తలో ఫ్లయిట్ ఎక్కి అమెరికా చేరుకుంటారు కాన్పు సమయంలో సహాయానికి. అమెరికా వాళ్లకు అలా కుదరదు. పైగా న్యూయార్క్‌లో అది చాలా ఖర్చు. మార్లో కష్టాన్ని గమనించిన ఆమె తమ్ముడు తన సొంత ఖర్చుతో ఆమెకు ఒక ఆయాను ఏర్పాటు చేస్తాడు. దీనిని ముందు మార్లో నిరాకరిస్తుంది. కాని తర్వాత ఆ ఆయాను అంగీకరిస్తుంది. పిల్లల బాగోగులు చూడటానికి రోజు రాత్రి వచ్చి నైట్ డ్యూటీ చేసే ఆ ఆయా మార్లో జీవితంలో ఒక పెద్ద సమీరంలా వీస్తుంది. నిద్ర లేచే పిల్లలతో, డైపర్లు మార్చాల్సిన పసి బిడ్డతో, నిద్రే కరువైన మార్లో ఆయా రావడంతో కంటి నిండా నిద్ర పోగలుగుతుంది. కాన్పయ్యాక కూడా ఆమె డెలివరీ తాలూకు బరువైన శరీరంతో కష్టపడుతుంటుంది. పాలు పొంగి వక్షోజాలు సలపరించినప్పుడల్లా బిడ్డ వక్షాన్ని నోటికి అందుకోకపోతే ఏం చేయాలి? ఆ పాలను బాటిళ్లలో పడుతుంటుంది. ఈ సందర్భాలన్నింటిలో ఆయా ఆమె మానసికంగా గట్టి సమర్థింపు ఇస్తుంది. ఒక స్త్రీ కష్టం ఇంకో స్త్రీకే తెలుస్తుందంటారు. అసలు స్త్రీ కష్టం మగ ప్రపంచానికి ఎప్పటికి తెలియాలి?ఈ సినిమా గొప్పతనం ఏమంటే ఇందులో మార్లోగా నటించిన చార్లెజ్ థెరాన్ నిజ జీవితంలో ఎప్పుడూ తల్లి కాలేదు. కాని ఆమె నటన చూసినవారు అవన్నీ అనుభవించి చేస్తున్నట్టుగా భావిస్తారు. ఇక ఆయాగా నటించిన మెకంజీ డేవిస్‌కు ఒక గర్భిణీ స్త్రీ భావోద్వేగాలను గమనించే వీలు గతంలో లేదు. అయినప్పటికీ వీళ్లిద్దరూ అద్భుతంగా ఆ సన్నివేశాలను రక్తి కట్టించి విమర్శకుల ప్రశంసలు పొందుతున్నారు. ఇవాళ నగరాల్లో, పట్టణాల్లో, పల్లెల్లో కూడా మైక్రో ఫ్యామిలీలను ఇష్టపడుతున్నారు. పెళ్లయ్యి విడి కాపురం ఆ తర్వాత గర్భం...గర్భ సమయంలో స్త్రీ గురించి ఆమె మానసిక ప్రపంచం గురించి ఆకాంక్షలు అభిరుచులు గురించి ఆలోచించే అవసరాన్ని ఆమెకు ఎలా ఇష్టమైతే అలా మారాల్సిన మగ ప్రపంచం గురించి మరింత చర్చ జరగాల్సి ఉంది. లైట్ పడాల్సి ఉంది.ఇలాంటి సినిమాలు అందుకు సహకరిస్తాయని ఆశిద్దాం.టాలీ మే 4న అమెరికాలో రిలీజవుతుంది. ఇండియాకు వస్తే తప్పక చూడండి. -
భావోద్వేగాలను నియంత్రించుకోగలరా?
నిద్రలో కలత చెందటం, రోజుల తరబడి నిద్ర కరవు కావడం, శూన్యంలోకి చూస్తూ అంతా కోల్పోయినట్లనుకోవటం, వారిలో వారు మాట్లాడుకోవటం, రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడటం. ఇవన్నీ వివిధరకాల భావోద్వేగాలకు లోనైనవారి లక్షణాలు. సంతోషంతో అరవటం, ఎదుటవున్నవారిని ఎత్తుకోవటం, ఆనందబాష్పాలు మొదలైనవి కూడ భావోద్వేగాలే అయితే వీటివల్ల మనిషికి సంతోషం కలుగుతుంది. ఉరుకుల పరుగుల జీవనశైలిలో ఒత్తిడి, ఆందోళన సహజమైనాయి. ఎలాంటి స్థితిలోనైనా భావోద్వేగాలను నియంత్రించుకోగలిగితే మనిషి ఎప్పుడూ సంతోషంగా ఉండొచ్చు. మీరు మీ ఎమోషన్స్‌ని నియంత్రించుకోగలుగుతున్నారో లేదో తెలుసుకోండి. 1. మిమ్మల్ని బాధపెట్టే, ఇబ్బందిపెట్టే ఆలోచనలకు ప్రతిస్పందించకుండా ఉండే మనస్తత్వాన్ని పెంపొందించుకుంటారు. ఎ. కాదు బి. అవును 2. మీ రియాక్షన్ వల్ల లాభం జరుగుతుందా అని ఆలోచిస్తారు. మీవల్ల ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందనుకుంటే అలాంటి ఆలోచనను మానుకుంటారు. ఎ. కాదు బి. అవును 3. మీ భావోద్వేగాలకు అనుగుణంగా మీరు ప్రవర్తిస్తే తదుపరి పర్యవసానాలు ఎలా ఉంటాయో విశ్లేషించగలరు. ఎ. కాదు బి. అవును 4. ప్రశాంతంగా, నిదానంగా ఉంటారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడ చాలా హుందాగా నడుచుకోవటానికి ప్రయత్నిస్తారు. ఎ. కాదు బి. అవును 5. మాటల వల్ల కొందరు బాధపడతారు. కొందరు తీవ్రంగా రియాక్ట్ అవుతారు. అందుకే మీకు తోచిన విధంగా మాట్లాడరు. ఎ. కాదు బి. అవును 6. ఆందోళనగా ఉన్నప్పుడు సంగీతాన్ని వింటారు. డ్యాన్స్ చేస్తారు. మీ అలవాట్లు ఎలావున్నాయోనని ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటుంటారు. ఎ. కాదు బి. అవును 7. మీరెలాంటి సమయాల్లో చాలా ఆనందంగా గడుపుతారో (కుటుంబ సభ్యులతో మాట్లాడటం, టీవీ చూడటం మొదలైనవి) గుర్తిస్తారు. మీరు డిప్రెషన్లో ఉన్నప్పుడు మీకు ఆనందం కలిగించే పనులను చేయటం అలవాటుగా చేసుకుంటారు. ఎ. కాదు బి. అవును 8. ఎస్/నో, మంచి/చెడు ఇలా ప్రతి విషయానికి రెండు పార్శా్వలు ఉంటాయని మీకు తెలుసు. అందుకే మీరు భావోద్వేగాలకు లోనైనప్పుడు ఈ విషయాన్ని గుర్తిస్తారు. ఎ. కాదు బి. అవును 9. మీ ఎమోషన్స్‌ను అణచివేయడం కన్నా వాటిని మంచిగా మలచుకోవటానికే ప్రయత్నిస్తారు. ప్రతి వ్యక్తికి కొన్ని రకాల భావోద్వేగాలు అవసరమవుతాయని గ్రహిస్తారు. ఎ. కాదు బి. అవును 10. మీ సమస్య మరీ ఎక్కువైనప్పుడు సైకాలజిస్ట్ సహాయం పొందటం మరచిపోరు. ఎ. కాదు బి. అవును ‘బి’ సమాధానాలు ఏడు దాటితే ఎమోషన్స్‌ని నియంత్రించుకోగలిగే శక్తి మీకుంటుంది. ఉత్సాహం కలిగినప్పుడు ఎలా ఉంటారో ఒత్తిడిలో కూడ అలాగే ఉండగలరు. ఒడిదుడుకులలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ‘ఎ’ లు ‘బి’ ల కన్నా ఎక్కువగా వస్తే భావోద్వేగాలను నియంత్రించుకోవటంలో మీరు చాలా వీక్. ప్రతి విషయానికీ డీలా పడిపోతూ అసంతృప్తితో ఉంటారు. దీనివల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలూ మిమ్మల్ని వెంటాడతాయి. ‘బి’ లను సూచనలుగా భావించి ఎమోషన్స్‌ని నియంత్రించుకోవటానికి ప్రయత్నించండి. -
వచ్చే జన్మలో అయినా నీకోసం పుట్టమ్మా.. : వర్మ
సాక్షి, ముంబయి : ఆయనకు ఇష్టమైన నటి, ప్రాణంకంటే ఎక్కువగా ఆరాధించే దేవత.. ఆమె అంటే తనకు పడిచచ్చిపోయేంత ప్రేమ అంటూ బహిరంగంగానే ఎన్నోమార్లు చెప్పిన ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ హఠాన్మరణం చెందిన ప్రముఖ నటి శ్రీదేవికి వీడ్కోలుతోపాటు ఓ విజ్ఞప్తితో కూడిన సందేశాన్ని పంచుకున్నారు. తాజాగా ఆయన ట్విటర్ ద్వారా లక్ష్మీ భూపాల అనే వ్యక్తి శ్రీదేవికి వీడ్కోలు పలుకుతూ రాసిన భావోద్వేగాలతో కూడిన లేఖను పంచుకున్నారు. ఆ వీడ్కోలు సందేశంలో శ్రీదేవిని అమ్మా శ్రీదేవి అంటూ సంబోధించారు. బాల్యం నుంచే శ్రీదేవి చాలా కోల్పోయిందని, తల్లిదండ్రులను పోషించడానికి, కుటుంబాన్ని, బంధువులను ఉద్దరించడానికి అలుపు లేకుండా ఆమె నటనతోనే జీవితాన్ని ముగించారని అన్నారు. అనూహ్యంగా వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లిగా మారి కెమెరాలకు కొన్నాళ్లకు దూరంగా ఉండి పోయారని, కుటుంబానికే అంకితమయ్యారని, అక్కడ కూడా ఆమె సుఖపడింది లేదని చెప్పారు. అనేక ఒడిదొడుకులను ఎదుర్కొన్న ఆమె నటనలోనే ఉండిపోయి జీవించడం మర్చిపోయారని, చివరకు జీవితాన్నే కోల్పోయారని చెప్పారు. ఈ జన్మకు దురుదృష్టవంతురాలైన పరిపూర్ణ మహిళకు భౌతిక వీడ్కోలు అంటూ ఆయన చివరి వీడ్కోలు సందేశాన్ని ప్రారంభించి వచ్చే జన్మలో అయినా నీ కోసం పుట్టమ్మా అని ముగించారు. దీనిని రామ్‌గోపాల్ వర్మ తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు. Here’s a heartwrenchingly written tribute to Sridevi by #LakshmiBhupala pic.twitter.com/nzkWb7EFNV — Ram Gopal Varma (@RGVzoomin) 28 February 2018 -
జీవితాన్ని చక్కదిద్దుకోగలరా?
సెల్ఫ్ చెక్ జీవితం చాలా చిన్నది, విలువైనది. దానిని చక్కదిద్దుకోవటం, ఆనందంగా ఉంచుకోవటం మన చేతుల్లో ఉన్నట్లే, నిస్సారంగా, దుఃఖమయం చేసుకోవటం కూడ మన చేతుల్లోనే ఉంటుంది. ఈ మొత్తం పరిస్థితులకు కారణం ఎమోషన్స్... వీటిని నియంత్రించుకోగలిగితే జీవితం చింతలేకుండా ఉంటుంది. అంటే మన జీవితాన్ని మనమే తీర్చిదిద్దుకోవచ్చు. అంతేకాని మనకు జరిగిన వాటికి ఇతరులను నిందించటమో, వారిపై ఆధారపడాలనుకోవటమో చేయకూడదు. ఇలా ఉండటం తెలియకనే చాలామంది నిస్పృహకు లోనవుతారు. జీవితంపై మీకు ఎంత కంట్రోల్ ఉందో తెలుసుకోవటానికి ఈ క్విజ్‌ను పూర్తిచేయండి. 1. జీవితంలో కొన్ని విషయాలు మిమ్మల్ని ఇబ్బందిపెట్టినా, వాటిని తట్టుకొని నిలబడతారు. ఎ. కాదు బి. అవును 2. మీరు భరించలేని విషయాలు మీ చుట్టూ జరుగుతుంటే... మీ ఫీలింగ్స్‌ను నియంత్రించుకోవటానికి ప్రయత్నిస్తారు. ఎ. కాదు బి. అవును 3. చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనేటప్పుడు ఇతరులపై ఆధారపడరు. మీ నిర్ణయానికే కట్టుబడి ఉంటారు. ఎ. కాదు బి. అవును 4. ఇతరులతో మీకు వచ్చే వివాదాలకు ‘‘కారణం ఎవరు? ఈ విధంగా ఎందుకు జరిగింది?’’ ఇలా అయా పరిస్థితులను అర్థం చేసుకొనే ప్రయత్నం చేస్తారు. ఎ. కాదు బి. అవును 5. ఇతరులు మీకిచ్చే సలహాలను రిసీవ్ చేసుకుంటారు. వారితో వాదించరు. ఎ. కాదు బి. అవును 6. ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండకపోవటానికి కారణం మనమే. ఎ. కాదు బి. అవును 7. జీవితాన్ని చక్కదిద్దుకోవటం మీ చేతుల్లోనే ఉంటుంది. ఎ. కాదు బి. అవును 8. మిమ్మల్ని తీవ్ర ఆందోళనకు గురిచేసే పరిస్థితులకు దూరంగా ఉంటారు. ఎ. కాదు బి. అవును 9. శ్రద్ధ పెడితే కన్నకలలను సాధించుకోవటం కష్టమేమీకాదు. ఎ. కాదు బి. అవును 10. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారంటే దానికి వారు సృష్టించుకున్న పరిస్థితులే కారణం. ఎ. కాదు బి. అవును ‘బి’ లు ఏడు దాటితే జీవితంలో ఎలా ఆనందంగా ఉండాలో, దాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో మీకు తెలుసు, మీ ఎమోషన్స్‌ని నియంత్రించుకోగలరు.‘ఎ’ లు ‘బి’ ల కన్నా ఎక్కవగా వస్తే భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవటం మీకు అంతగా తెలియదు. దీనివల్ల ఎన్నో సమస్యలు మీ చుట్టుముడతాయి... సెల్ఫ్కంట్రోల్ సాధించడానికి కృషి చేయండి. -
ఐసీసీ తీరుపై షోయబ్ అక్తర్ అసంతృప్తి
కరాచి: ఫాస్ట్ బౌలర్ల విషయంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) అనుసరిస్తున్న తీరుపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నిబంధనల పేరుతో ఫాస్ట్ బౌలర్లకు ఐసీసీ ఊపిరాడకుండా చేస్తుందని.. దీంతో క్రికెట్ తన ఆకర్షణను కోల్పోయే ప్రమాదముందని ఆయన హెచ్చరించారు. క్రికెట్లో ఫాస్ట్ బౌలర్లే రియల్ క్యారెక్టర్లు అనే విషయాన్ని ఐసీసీ గుర్తుంచుకోవాలని అక్తర్ సూచించారు. ఆటగాళ్లు తమ భావోద్వేగాలను వ్యక్త పరిచే విషయంలో ఐసీసీ అనేక నిబంధనలు విధిస్తోందని అక్తర్ వాపోయారు. 60, 70వ దశకాల్లోని ఫాస్ట్ బౌలర్లు ఇలాంటి నిబంధనలను ఎదుర్కోలేదని.. తమ ఉద్వేగాలను ప్రదర్శించడంలో వారు ఎప్పుడూ భయపడలేదని ఈ సందర్భంగా వెల్లడించారు. ఐసీసీ నిబంధనలు బ్యాట్స్‌మెన్ అనుకూలంగా ఉంటున్నాయని.. ఈ నిబంధనల వలనే ఫాస్ట్ బౌలర్ల క్వాలిటీ తగ్గుతుందని అక్తర్ ఆవేదన వ్యక్తం చేశారు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో తమ ఫాస్ట్ బౌలర్ల ప్రదర్శనపై అక్తర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. -
ఆ టైమ్‌లో ఉద్వేగాలు యమడేంజర్!
మీరు డ్రైవ్ చేస్తున్న సమయంలో చాలా ప్రశాంతంగా ఉండండి. వాహనం నడుపుతున్న సమయంలో మీలో భావోద్వేగాలు చెలరేగితే వాటి ప్రభావం మీ డ్రైవింగ్‌పై తప్పకుండా ఉంటుంది. దాని దుష్ర్పభావాలు ఏదైనా పెద్ద ప్రమాదంగానూ పరిణమించవచ్చు. మనం ఉద్వేగాలతో బండి నడుపుతుంటే ప్రమాదాలు జరిగే రిస్క్ పది రెట్లు ఎక్కువగా ఉంటుందంటున్నారు అధ్యయనవేత్తలు. యూఎస్‌లో నిర్వహించిన ఒక అధ్యయనంలో దాదాపు 3,500 కంటే ఎక్కువ కార్లలో కెమెరాలను అమర్చారు. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో వాళ్ల భావోద్వేగాలను పసిగట్టగల సెన్సర్లు అమర్చారు. ఏదో కారణాల వల్ల భావోద్వేగాల స్థాయి ఎక్కువగా ఉన్నవారిని ఈ సెన్సర్లు పసిగట్టాయి. అలాంటి వారిలో 1600 మంది డ్రైవింగ్ సమయంలో ఏదో ఒక తప్పు చేశారు. అది టైరు డివైడర్‌కు రాసుకుపోవడం వంటి చిన్న పొరబాట్ల నుంచి కారు దేనికైనా ఢీకొన్న పెద్ద సంఘటనల వరకు ఉన్నాయి. ఇలాంటి పెద్ద సంఘటనలు 900కు పైగా నమోదయ్యాయి. ఈ అధ్యయన వివరాలన్నీ ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ద నేషనల్ అకాడమీ ఆఫ్ సెన్సైస్’లో ప్రచురితమయ్యాయి. ఇక ప్రమాదాలన్నింటికీ మరింత పెద్ద కారణం ‘ఆల్కహాల్’! మద్యం తాగి వాహనం నడిపినప్పుడు యాక్సిడెంట్ చేసే రిస్క్... మామూలు సమయం కంటే 36 రెట్లు ఎక్కువ. అందుకే డ్రైవింగ్ సమయంలో మద్యం జోలికి అస్సలు వెళ్లవద్దు. ఇక భావోద్వేగాలకు గురి కాకుండా కూల్‌గా బండి నడపడం చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి. -
అప్పుడే ఏడుస్తూ... అంతలోనే నవ్వుతూ!
మెడిక్షనరీ ఎవరిలోనైనా భావోద్వేగాలు అప్పటికప్పుడే మారిపోతూ కనిపిస్తున్నాయా? అప్పుడే నవ్వుతూ కనిపించిన వాడు, అంతలోనే ఏడుస్తున్నాడా? పరస్పర విరుద్ధమైన ఈ ఫీలింగ్స్‌ను అతడు నియంత్రించుకోలేకపోతున్నాడా? ఎంతగా ప్రయత్నించినా ఈ ఏడుపూ, నవ్వూ... ఈ రెండింటినీ ఆపుకోలేకపోతున్నాడా? అయితే... అతడు ‘సూడో బల్బులార్ ఎఫెక్ట్’ అనే జబ్బుతో బాధపడుతుండవచ్చేమోనని అనుమానించాలి. ఇదో రకం నరాల రుగ్మత. ఇందులో రోగి తన ప్రమేయం లేకుండానే నవ్వుతుంటాడు. అంతలోనే ఏడుస్తుంటాడు. లేదా వెంటవెంటనే ఈ రెండూ చేస్తుంటాడు. చిత్రమేమిటంటే... ఏదైనా విషాదవార్త విన్నప్పుడు నవ్వుతుండవచ్చు. లేదా నవ్వాల్సిన చోట ఏడ్వవచ్చు. ఇవన్నీ తాను అనుకోకపోయినా జరుగుతుండవచ్చు. ఇలా తన భావోద్వేగాల మీద తనకే అదుపు లేకపోవడంతో సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంటాడు. ఇలాంటి రోగుల విషయంలో డాక్టర్లకు రోగికి చికిత్స కంటే ముందుగా అతడి ప్రవర్తన గురించి కుటుంబ సభ్యులకుఅవగాహన కల్పించాల్సి వస్తుంది. కొన్ని మందులతో దీనికి చికిత్స కూడా అందుబాటులో ఉంది. -
చెలికాడి చెంప ఛెళ్లుమనిపించె!
బోత్సువానా: మనిషిని, జంతువుని వేరు చేసేదే ఎమోషన్! అలాగని జంతువులకు భావోద్వేగాలు పూర్తిగా లేవని మాత్రం చెప్పలేం. ఫొటోలో కనిపిస్తున్న ఈ మృగరాజు తన తోడుతో కలిసి నీరు తాగేందుకు మడుగు దగ్గరికి వచ్చింది. ఆడసింహం నీళ్లు తాగుతుండగానే.. మృగరాజు మరో ఆడ సింహానితో స్నేహం చేసేందుకు ప్రయత్నించింది. దూరం నుంచి ఈ దృశ్యాన్ని చూసిన ఆడసింహం కోపంతో ఒక్క ఉదుటన వాటి వద్దకు వచ్చింది. మగసింహాన్ని పంజాతో ఒక్కటిచ్చింది. అంతే! మృగరాజు నేలకరిచాడు. బోత్సువానాలోని ఓ అటవీప్రాంతంలోనిదీ దృశ్యం. -
ఫాస్ట్ఫుడ్తో అదుపు తప్పే భావోద్వేగాలు..
కొత్త పరిశోధన ఫాస్ట్‌ఫుడ్‌కు ఎక్కువగా అలవాటు పడితే డయాబెటిస్, రక్తపోటు, స్థూలకాయం, గుండెజబ్బులు, కేన్సర్ వంటి వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉన్నట్లు ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలిన సంగతి తెలిసిందే. అయితే, ఫాస్ట్‌ఫుడ్ భావోద్వేగాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని ఇటీవల అమెరికాలో నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. కొన్నిరకాల ఫాస్ట్‌ఫుడ్ వంటకాల్లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ ప్రభావం వల్ల భావోద్వేగాలు అదుపు తప్పుతాయని నిపుణులు చెబుతున్నారు. ఫాస్ట్‌ఫుడ్ ఎక్కువగా తినేవారు డిప్రెషన్‌తో బాధపడటం లేదా తరచు చిర్రుబుర్రులాడటం వంటి సమస్యలకు గురవుతారని అంటున్నారు. ఐదువేల మంది ఆహారపు అలవాట్లను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత ఫాస్ట్‌ఫుడ్ వల్ల భావోద్వేగాలు అదుపు తప్పుతాయని నిర్ధారించారు. ఈ అంశాన్ని ‘జర్నల్ ఆఫ్ హెల్త్ సైకాలజీ’లో ప్రచురించారు. -
రంగస్థలం కొత్త ఆశను చివురిస్తుందా?
రంగస్థలం ఎందుకు ఆకర్షిస్తుంది? ఏడ్చేందుకు. జ్ఞాపకాలను కలబోసుకునేందుకు. నవ్వేందుకు. శోధించుకునేందుకు. బతుకు బాటపై నిబ్బరంగా నడిచేందుకు. అది మనుషులు చేతనత్వాన్ని పొందే వేదిక. శక్తిని సంతరించుకునే ఆవరణ. వివిధ దేశాల, సమూహాల సాంస్కృతిక సంపదను గుణగానం చేసే వేదిక. మనుషులను విభజించే సరిహద్దులన్నిటినీ లుప్తం చేసే అద్భుతస్థలి! బ్రెట్ బైలీ, దక్షిణ ఆఫ్రికా నాటక రచయిత, డిజైనర్. ‘థర్డ్వరల్డ్ బన్ఫైట్’ వ్యవస్థాపక ఆర్టిస్టిక్ డెరైక్టర్. ‘వలస పాలన తర్వాత ప్రపంచం పోకడలు’ అనే అంశం ఆయన అభిమాన విషయం. ‘మనం ఏడాది పొడవునా చేసుకున్న స్వాతంత్య్ర దినోత్సవాల ఆర్భాటాన్ని ఒక ప్రదర్శనతో బ్రెట్ తుస్సుమనిపించారు’ అని యూరోపియన్ దేశాల విమర్శ కులు కొనియాడిన ప్రభావశీలి. ‘మహాభారత్’ ఫేం పీటర్ బ్రూక్ ఆయన అభిమాని. ప్రపంచ నాటక దినోత్సవం సందర్భంగా ‘యునెస్కో’ ద్వారా ప్రపంచ కళాకారులకు బ్రెట్ బైలీ అందిస్తోన్న సందేశ సారాంశం: మానవ సమాజం ఉన్నన్నాళ్లూ అభినయించడం ఆపుకోలేని ఉద్వేగంగా ఆవిష్కృతమవుతూనే ఉంటుంది. పల్లెల్లో చెట్ల క్రింద, హైటెక్ స్టేజ్‌పై మహానగరాలలో, బళ్లల్లో, పొలాల్లో, ప్రార్థనాస్థలాల్లో, మురికివాడల్లో, కమ్యూ నిటీ సెంటర్లలో, సెల్లార్లలో ప్రజలు గుమిగూడుతూనే ఉంటారు. మానవ జీవితంలోని సంక్లిష్టతలు, వైవిధ్యాలు, కలవరపరచే, సాంత్వన పరచే అనేక అంశాలు కళారూపా లుగా వ్యక్తమవుతూనే ఉంటాయి. రక్తమాంసాలతో తొణికిస లాడే, శ్వాసించే, సంభాషించే మనిషి ఉన్నన్నాళ్లూ మనిషితో మనిషి సంభాషించే ‘అభినయం’ సజీవంగా ఉంటుంది. మనుషులు స్టేజ్‌కి ఎందుకు ఆకర్షితులవుతారు? ఏడ్చేం దుకు. జ్ఞాపకాలను కలబోసుకునేందుకు. నవ్వేందుకు. శోధించుకునేందుకు. నేర్చుకునేందుకు. బతుకుబాటపై నిబ్బరంగా నడిచేందుకు. కొత్త ఊహలు అల్లుకునేందుకు. అబ్బురపడే ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో అనాదికాలపు దైవాన్ని అవతరింపజేసేందుకు. మన శ్వాసలన్నీ ఏకం చేసి ఒకే నిశ్వాసంతో భయద-సౌందర్యాలను, కారుణ్యాలను, కర్కశాలను అనుభవంలోకి తెచ్చుకుని నిట్టూర్చేందుకు. అంతేనా? రంగస్థలం ఇంకా ఎందుకు మనుషులను ఆకర్షిస్తుంది? అది, మనుషులు చేతనత్వాన్ని పొందే వేదిక. శక్తిని సంతరించుకునే ఆవరణ. వివిధ దేశాల, సమూహాల సాంస్కృతిక సంపదను గుణగానం చేసే వేదిక. మనుషులను విభజించే సరిహద్దులన్నిటినీ లుప్తం చేసే అద్భుతస్థలి! కేవలం ఒక వ్యక్తి ద్వారా లేదా కొందరి ద్వారా ప్రదర్శన సాధ్యపడదు. ప్రతి ప్రదర్శన సామూహిక జీవితంలోంచే జన్మిస్తుంది. మన వేర్వేరు సంప్రదాయాల వేష - భాషల్లోంచి వస్తుంది. మన శరీర నిర్మాణాలు, కదలికలు, మన హావభావాలు, భాషలు, పాటలు, రాగాల నుంచి ప్రదర్శన ‘ధ్వనిస్తుంది’! మనలోని శూన్యాన్ని ఆ సౌందర్యం పూరిస్తుంది. ఈ నేపథ్యంలో, ఆధునికులంగా, కళాకారులుగా మన పాత్ర ఏమిటి? మానవ సమాజపు సంవేదనలను భవిష్యత్ సమాజాలకు మిరుమిట్లుగొలిపే ఆసక్తులతో మనం ప్రదర్శించాలి! ఈ క్రమంలో మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం? మన చుట్టూ కోట్లాది ప్రజ మనుగడ కోసం సతమత మవుతోంది. నియంత్రణ పదఘట్టనలో ప్రజలు నలిగిపోతు న్నారు. పెట్టుబడిదారీతనానికి రాపాడుతున్నారు. జీవితా ల్లోకి రహస్య సంస్థలు ప్రవేశిస్తున్నాయి. మన మాటలను నిషేధిస్తున్నాయి. అడవులు దగ్ధమవుతున్నాయి. జీవ జాతులు అంతరిస్తున్నాయి. సముద్రాలు విషతుల్యమవుతు న్నాయి. మనం ఏమి చెప్పాలి? ఎలా చెప్పాలి! అంతులేని అధికారాలను కలిగి ఉన్న ప్రభుత్వాలు, సంస్థలు మనలను ఒకే తరహా అభిప్రాయాన్ని కలిగి ఉండమంటున్నాయి. ఒకే జాతి, ఒకే రంగు, ఒకే మతం, ఒకే లింగాధిక్యత, ఒకే సిద్ధాంతం, ఒకే ఫ్రేమ్‌లో సాంస్కృతిక చిత్తరువు ఉండాలని నిర్దేశిస్తున్నాయి. ఈ వాతావరణంలో కళ స్వేచ్ఛగా వ్యక్తం కాగలదా? మార్కెట్ శక్తుల ‘సంబద్ధ’ ఆకాంక్షలకు లోనై మన శక్తి యుక్తులను క్షీణింపజేసు కుంటూ, వివిధ వేదికల నుంచి వచ్చిన కళాకారులం మనం ఏమి చేయాలి? మన చుట్టూ సమూహాలు చేరుతున్నాయి. ‘ఉందిలే మంచి కాలం ముందుముందునా’ అని వారిలో విశ్వాసం నింపేందుకు ఏమి చేయాలి? ఒక కొత్త ఆశ చివురించేందుకు మనం ఏమి చేయాలి? పున్నా కృష్ణమూర్తి