జీవితాన్ని చక్కదిద్దుకోగలరా?
సెల్ఫ్ చెక్
జీవితం చాలా చిన్నది, విలువైనది. దానిని చక్కదిద్దుకోవటం, ఆనందంగా ఉంచుకోవటం మన చేతుల్లో ఉన్నట్లే, నిస్సారంగా, దుఃఖమయం చేసుకోవటం కూడ మన చేతుల్లోనే ఉంటుంది. ఈ మొత్తం పరిస్థితులకు కారణం ఎమోషన్స్... వీటిని నియంత్రించుకోగలిగితే జీవితం చింతలేకుండా ఉంటుంది. అంటే మన జీవితాన్ని మనమే తీర్చిదిద్దుకోవచ్చు. అంతేకాని మనకు జరిగిన వాటికి ఇతరులను నిందించటమో, వారిపై ఆధారపడాలనుకోవటమో చేయకూడదు. ఇలా ఉండటం తెలియకనే చాలామంది నిస్పృహకు లోనవుతారు. జీవితంపై మీకు ఎంత కంట్రోల్ ఉందో తెలుసుకోవటానికి ఈ క్విజ్‌ను పూర్తిచేయండి.
1. జీవితంలో కొన్ని విషయాలు మిమ్మల్ని ఇబ్బందిపెట్టినా, వాటిని తట్టుకొని నిలబడతారు.
ఎ. కాదు బి. అవును
2. మీరు భరించలేని విషయాలు మీ చుట్టూ జరుగుతుంటే... మీ ఫీలింగ్స్‌ను నియంత్రించుకోవటానికి ప్రయత్నిస్తారు.
ఎ. కాదు బి. అవును
3. చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనేటప్పుడు ఇతరులపై ఆధారపడరు. మీ నిర్ణయానికే కట్టుబడి ఉంటారు.
ఎ. కాదు బి. అవును
4. ఇతరులతో మీకు వచ్చే వివాదాలకు ‘‘కారణం ఎవరు? ఈ విధంగా ఎందుకు జరిగింది?’’ ఇలా అయా పరిస్థితులను అర్థం చేసుకొనే ప్రయత్నం చేస్తారు.
ఎ. కాదు బి. అవును
5. ఇతరులు మీకిచ్చే సలహాలను రిసీవ్ చేసుకుంటారు. వారితో వాదించరు.
ఎ. కాదు బి. అవును
6. ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండకపోవటానికి కారణం మనమే.
ఎ. కాదు బి. అవును
7. జీవితాన్ని చక్కదిద్దుకోవటం మీ చేతుల్లోనే ఉంటుంది.
ఎ. కాదు బి. అవును
8. మిమ్మల్ని తీవ్ర ఆందోళనకు గురిచేసే పరిస్థితులకు దూరంగా ఉంటారు.
ఎ. కాదు బి. అవును
9. శ్రద్ధ పెడితే కన్నకలలను సాధించుకోవటం కష్టమేమీకాదు.
ఎ. కాదు బి. అవును
10. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారంటే దానికి వారు సృష్టించుకున్న పరిస్థితులే కారణం.
ఎ. కాదు బి. అవును
‘బి’ లు ఏడు దాటితే జీవితంలో ఎలా ఆనందంగా ఉండాలో, దాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో మీకు తెలుసు, మీ ఎమోషన్స్‌ని నియంత్రించుకోగలరు.‘ఎ’ లు ‘బి’ ల కన్నా ఎక్కవగా వస్తే భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవటం మీకు అంతగా తెలియదు. దీనివల్ల ఎన్నో సమస్యలు మీ చుట్టుముడతాయి... సెల్ఫ్‌కంట్రోల్ సాధించడానికి కృషి చేయండి.