![Can you control emotions? - Sakshi](/styles/webp/s3/article_images/2018/04/17/iStock-178457795.jpg.webp?itok=xri_PSat)
నిద్రలో కలత చెందటం, రోజుల తరబడి నిద్ర కరవు కావడం, శూన్యంలోకి చూస్తూ అంతా కోల్పోయినట్లనుకోవటం, వారిలో వారు మాట్లాడుకోవటం, రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడటం. ఇవన్నీ వివిధరకాల భావోద్వేగాలకు లోనైనవారి లక్షణాలు. సంతోషంతో అరవటం, ఎదుటవున్నవారిని ఎత్తుకోవటం, ఆనందబాష్పాలు మొదలైనవి కూడ భావోద్వేగాలే అయితే వీటివల్ల మనిషికి సంతోషం కలుగుతుంది. ఉరుకుల పరుగుల జీవనశైలిలో ఒత్తిడి, ఆందోళన సహజమైనాయి. ఎలాంటి స్థితిలోనైనా భావోద్వేగాలను నియంత్రించుకోగలిగితే మనిషి ఎప్పుడూ సంతోషంగా ఉండొచ్చు. మీరు మీ ఎమోషన్స్‌ని నియంత్రించుకోగలుగుతున్నారో లేదో తెలుసుకోండి.
1. మిమ్మల్ని బాధపెట్టే, ఇబ్బందిపెట్టే ఆలోచనలకు ప్రతిస్పందించకుండా ఉండే మనస్తత్వాన్ని పెంపొందించుకుంటారు.
ఎ. కాదు బి. అవును
2. మీ రియాక్షన్ వల్ల లాభం జరుగుతుందా అని ఆలోచిస్తారు. మీవల్ల ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందనుకుంటే అలాంటి ఆలోచనను మానుకుంటారు.
ఎ. కాదు బి. అవును
3. మీ భావోద్వేగాలకు అనుగుణంగా మీరు ప్రవర్తిస్తే తదుపరి పర్యవసానాలు ఎలా ఉంటాయో విశ్లేషించగలరు.
ఎ. కాదు బి. అవును
4. ప్రశాంతంగా, నిదానంగా ఉంటారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడ చాలా హుందాగా నడుచుకోవటానికి ప్రయత్నిస్తారు.
ఎ. కాదు బి. అవును
5. మాటల వల్ల కొందరు బాధపడతారు. కొందరు తీవ్రంగా రియాక్ట్ అవుతారు. అందుకే మీకు తోచిన విధంగా మాట్లాడరు.
ఎ. కాదు బి. అవును
6. ఆందోళనగా ఉన్నప్పుడు సంగీతాన్ని వింటారు. డ్యాన్స్ చేస్తారు. మీ అలవాట్లు ఎలావున్నాయోనని ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటుంటారు.
ఎ. కాదు బి. అవును
7. మీరెలాంటి సమయాల్లో చాలా ఆనందంగా గడుపుతారో (కుటుంబ సభ్యులతో మాట్లాడటం, టీవీ చూడటం మొదలైనవి) గుర్తిస్తారు. మీరు డిప్రెషన్‌లో ఉన్నప్పుడు మీకు ఆనందం కలిగించే పనులను చేయటం అలవాటుగా చేసుకుంటారు.
ఎ. కాదు బి. అవును
8. ఎస్/నో, మంచి/చెడు ఇలా ప్రతి విషయానికి రెండు పార్శా్వలు ఉంటాయని మీకు తెలుసు. అందుకే మీరు భావోద్వేగాలకు లోనైనప్పుడు ఈ విషయాన్ని గుర్తిస్తారు.
ఎ. కాదు బి. అవును
9. మీ ఎమోషన్స్‌ను అణచివేయడం కన్నా వాటిని మంచిగా మలచుకోవటానికే ప్రయత్నిస్తారు. ప్రతి వ్యక్తికి కొన్ని రకాల భావోద్వేగాలు అవసరమవుతాయని గ్రహిస్తారు.
ఎ. కాదు బి. అవును
10. మీ సమస్య మరీ ఎక్కువైనప్పుడు సైకాలజిస్ట్ సహాయం పొందటం మరచిపోరు.
ఎ. కాదు బి. అవును
‘బి’ సమాధానాలు ఏడు దాటితే ఎమోషన్స్‌ని నియంత్రించుకోగలిగే శక్తి మీకుంటుంది. ఉత్సాహం కలిగినప్పుడు ఎలా ఉంటారో ఒత్తిడిలో కూడ అలాగే ఉండగలరు. ఒడిదుడుకులలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ‘ఎ’ లు ‘బి’ ల కన్నా ఎక్కువగా వస్తే భావోద్వేగాలను నియంత్రించుకోవటంలో మీరు చాలా వీక్. ప్రతి విషయానికీ డీలా పడిపోతూ అసంతృప్తితో ఉంటారు. దీనివల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలూ మిమ్మల్ని వెంటాడతాయి. ‘బి’ లను సూచనలుగా భావించి ఎమోషన్స్‌ని నియంత్రించుకోవటానికి ప్రయత్నించండి.
Comments
Please login to add a commentAdd a comment