చెలికాడి చెంప ఛెళ్లుమనిపించె! | Animals can Lions | Sakshi
Sakshi News home page

చెలికాడి చెంప ఛెళ్లుమనిపించె!

Published Sat, Feb 20 2016 4:09 PM | Last Updated on Sun, Sep 3 2017 6:03 PM

Animals can Lions

బోత్సువానా: మనిషిని, జంతువుని వేరు చేసేదే ఎమోషన్! అలాగని జంతువులకు భావోద్వేగాలు పూర్తిగా లేవని మాత్రం చెప్పలేం. ఫొటోలో కనిపిస్తున్న ఈ మృగరాజు తన తోడుతో కలిసి నీరు తాగేందుకు మడుగు దగ్గరికి వచ్చింది. ఆడసింహం నీళ్లు తాగుతుండగానే.. మృగరాజు మరో ఆడ సింహానితో స్నేహం చేసేందుకు ప్రయత్నించింది.

 
 దూరం నుంచి ఈ దృశ్యాన్ని చూసిన ఆడసింహం కోపంతో ఒక్క ఉదుటన వాటి వద్దకు వచ్చింది. మగసింహాన్ని పంజాతో ఒక్కటిచ్చింది. అంతే!  మృగరాజు నేలకరిచాడు. బోత్సువానాలోని ఓ అటవీప్రాంతంలోనిదీ దృశ్యం.



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement