సౌతాఫ్రికా టీ20 ఛాలెంజ్‌ విజేతగా లయన్స్‌ | CSA T20 Challenge 2024 Final Match 31: Lions Beat Titans By 8 Wickets, Check Full Score Details | Sakshi
Sakshi News home page

CSA T20 Challenge 2024: సౌతాఫ్రికా టీ20 ఛాలెంజ్‌ విజేతగా లయన్స్‌

Published Mon, Oct 28 2024 7:23 AM | Last Updated on Mon, Oct 28 2024 9:45 AM

CSA T20 Challenge 2024 Final: Lions Beat Titans By 8 Wickets

క్రికెట్‌ సౌతాఫ్రికా టీ20 ఛాలెంజ్‌ విజేతగా లయన్స్‌ జట్టు ఆవిర్భవించింది. నిన్న (అక్టోబర్‌ 27) జరిగిన ఫైనల్లో లయన్స్‌.. టైటాన్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టైటాన్స్‌ 19.2 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. క్లాసెన్‌ (13), ఫెరియరా (0) లాంటి భారీ హిట్టర్లు ఉన్న టైటాన్స్‌.. లయన్స్‌ బౌలర్ల దెబ్బకు కుదేలైంది. టైటాన్స్‌ ఇన్నింగ్స్‌లో గెరాల్డ్‌ కొయెట్జీ (20) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. సిపామ్లా (4-0-12-4), మపాకా (4-0-15-2), ఫోర్టుయిన్‌ (3-0-10-2) టైటాన్స్‌ను దెబ్బకొట్టారు.

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన లయన్స్‌ 15.1 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. రస్సీ వాన్‌ డెర్‌ డస్సెన్‌ (44 నాటౌట్‌), కాన్నర్‌ ఎస్టర్‌హ్యుజెన్‌ (48 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి లయన్స్‌ను గెలిపించారు. లయన్స్‌ ఇన్నింగ్స్‌లో జుబేర్‌ హమ్జా 20, రీజా హెండ్రిక్స్‌ 4 పరుగులు చేసి ఔటయ్యారు. టైటాన్స్‌ బౌలర్లలో గేలియమ్‌, గెరాల్డ్‌ కొయెట్జీ తలో వికెట్‌ పడగొట్టారు. సీఎస్‌ఏ టీ20 ఛాలెంజ్‌లో లయన్స్‌ను ఇది ఐదో టైటిల్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement