
CSA T20 League: క్రికెట్ సౌతాఫ్రికా ఆధ్వర్యంలో వచ్చే ఏడాది నుంచి ప్రారంభంకానున్న నయా టీ20 లీగ్‌కు పేరు ఖరారైంది. క్రికెట్ సౌతాఫ్రికా ఈ లీగ్‌కు 'ఎస్‌ఏ20' లీగ్‌గా నామకరణం చేసింది. ఈ మేరకు సీఎస్‌ఏ బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ లీగ్‌లో పాల్గొనబోయే ఆరు జట్లను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీలే సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఎస్‌ఏ20 లీగ్ ఫ్రాంచైజీలను ఐపీఎల్ యాజమాన్యాలే దక్కించుకోవడంతో క్రికెట్ ప్రేమికలు ఈ లీగ్‌ను మినీ ఐపీఎల్‌గా పిలుచుకుంటున్నారు. ఐపీఎల్ తరహాలోనే ఎస్‌ఏ20లోనూ ఆటగాళ్లను వేలం ద్వారానే దక్కించుకోనున్నారు. సెప్టెంబర్ 19న ఎస్‌ఏ20 లీగ్ వేలం ప్రక్రియ మొదలవుతుందని సీఎస్ఎ అధ్యక్షుడు, ఎస్‌ఏ20 లీగ్ కమిషనర్ గ్రేమ్ స్మిత్ వెల్లడించాడు.
2023 జనవరి 23 నుంచి ఎస్‌ఏ20 లీగ్ ప్రారంభమవుతుందని స్మిత్ సూచనప్రాయంగా వెల్లడించాడు. కాగా, ఈ లీగ్ కోసం ఆయా ఫ్రాంచైజీలు డ్రాఫ్ట్ రూపంలో ఐదుగురు ఆటగాళ్లను దక్కించుకున్న విషయం తెలిసిందే.
ఎస్‌ఏ20 లీగ్‌లో పాల్గొనే ఫ్రాంచైజీల వివరాలు..
- ఎంఐ కేప్‌టౌన్ (ముంబై ఇండియన్స్)
- జోహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ (చెన్నై సూపర్ కింగ్స్)
- పార్ల్ రాయల్స్ (రాజస్తాన్ రాయల్స్)
- ప్రిటోరియా క్యాపిటల్స్ (ఢిల్లీ క్యాపిటల్స్)
- సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ (సన్ రైజర్స్ హైదరాబాద్)
- డర్బన్ (లక్నో సూపర్ జెయింట్స్)
చదవండి: అంతర్జాతీయ క్రికెట్‌కు కివీస్ ఆల్‌రౌండర్ గుడ్‌బై