cricket south africa
-
సౌతాఫ్రికా క్రికెటర్ షంసీ కీలక నిర్ణయం
సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ తబ్రేజ్ షంసీ సెంట్రల్ కాంట్రాక్టు నుంచి వైదొలిగాడు. ప్రపంచ వ్యాప్తంగా ఫ్రాంఛైజీ క్రికెట్లో భాగమయ్యేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. అయితే, జాతీయ జట్టుకు తన సేవలు అవసరమైన వేళ తప్పకుండా అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. ఈ విషయాన్ని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు నిర్ధారించింది.అందుకే ఈ నిర్ణయం‘‘సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. దేశవాళీ క్రికెట్ సీజన్ సమయంలో కాస్త విరామంతో పాటు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లీగ్ మ్యాచ్‌లు ఆడాలని కోరుటుకుంటున్నాను. నా కుటుంబానికి తగినంత సమయం కేటాయించాలని భావిస్తున్నాను.అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. అయితే, ప్రొటిస్ జట్టుకు నా అవసరం ఉందనుకున్న సమయంలో బోర్డు పిలిస్తే కచ్చితంగా దేశానికి ఆడతా’’ అని తబ్రేజ్ షంసీ పేర్కొన్నాడు. కాగా 2016లో సౌతాఫ్రికా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన తబ్రేజ్ షంసీ.. వన్డే, టీ20 జట్టలో ఫస్ట్ ఛాయిస్ స్పిన్నర్‌గా ఎదిగాడు.ఇప్పటి వరకు సౌతాఫ్రికా తరఫున 51 వన్డేలు, 70 టీ20లు ఆడి ఆయా ఫార్మాట్లలో 72, 89 వికెట్లు పడగొట్టాడు. అయితే, టెస్టుల్లో మాత్రం షంసీ నిలదొక్కుకోలేకపోయాడు. కేవలం రెండే మ్యాచ్‌లు ఆడి ఆరు వికెట్లు తీయగలిగాడు.సెంట్రల్ కాంట్రాక్టు లేకపోయినాఇక షంసీ నిర్ణయాన్ని తాము ఆమోదిస్తున్నట్లు క్రికెట్ సౌతాఫ్రికా డైరెక్టర్ ఎనోచ్ తెలిపాడు. సౌతాఫ్రికా పరిమిత ఓవర్ల క్రికెట్ జట్లలో షంసీ కీలక సభ్యుడని.. సెంట్రల్ కాంట్రాక్టు లేకపోయినా సెలక్షన్‌కు అందుబాటులో ఉంటానని చెప్పడం అతడి నిజాయితీకి నిదర్శనమని ప్రశంసించాడు. కాగా షంసీ ఐపీఎల్‌తో పాటు మరెన్నో టీ20లలో భాగమవుతున్నాడు. చివరగా.. ఈ ఏడాది కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్‌తో అతడు ఒప్పందం కుదుర్చుకున్నాడు. చదవండి: ధోని కంటే రోహిత్ బెటర్ కెప్టెన్: భారత స్పిన్ దిగ్గజం -
సౌతాఫ్రికా టీ20 లీగ్‌కు సంబంధించి బిగ్ అప్డేట్
సౌతాఫ్రికా టీ20 లీగ్‌కు (SA20) సంబంధించిన ఆసక్తికర ప్రకటన వెలువడింది. లీగ్ మూడో ఎడిషన్ (2025) ప్రారంభ తేదీ, ఫైనల్ మ్యాచ్ జరుగబోయే తేదీలను క్రికెట్ సౌతాఫ్రికా అధ్యక్షుడు గ్రేమ్ స్మిత్ ప్రకటించారు. SA20 2025 సీజన్ వచ్చే ఏడాది జనవరి 9న ప్రారంభై, ఫిబ్రవరి 8న జరిగే ఫైనల్‌తో ముగుస్తుందని స్మిత్ వెల్లడించాడు. పూర్తి షెడ్యూల్, ఆటగాళ్ల వేలం తదితర అంశాలకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని స్మిత్ తెలిపాడు.కాగా, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు ఎడిషన్లలో సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ విజేతగా నిలిచింది. ఈ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ ఆథ్వర్యంలో నడుస్తుంది. గడిచిన సీజన్ ఫైనల్లో సన్‌రైజర్స్.. డర్బన్ సూపర్ జెయింట్స్‌పై 89 పరుగుల తేడాతో విజయం సాధించి, వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది. దీనికి ముందు జరిగిన అరంగేట్రం సీజన్ ఫైనల్లో సన్‌రైజర్స్.. ప్రిటోరియా క్యాపిటల్స్‌పై విజేతగా నిలిచి టైటిల్ ఎగరేసుకుపోయింది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్‌తో పాటు ప్రిటోరియా క్యాపిటల్స్, డర్బన్ సూపర్ జెయింట్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్, పార్ల్ రాయల్స్, ఎంఐ కేప్‌టౌన్ మిగతా ఫ్రాంచైజీలుగా ఉన్నాయి. ఈ లీగ్‌లోని ఫ్రాంచైలన్నీ వివిధ ఐపీఎల్ ఫ్రాంచైజీలకు చెందిన ఓనర్ల ఆథ్వర్యంలో నడుస్తున్నాయి.ఈ లీగ్‌లో అత్యధిక పరుగుల రికార్డు హెన్రిచ్ క్లాసెన్ (810 పరుగులు) పేరిట ఉండగా.. అత్యధిక వికెట్ల ఘనత ఓట్నీల్ బార్ట్మన్కు (30 వికెట్లు) దక్కుతుంది. కెప్టెన్ల విషయానికొస్తే.. ఎంఐ కేప్‌టౌన్‌కు కీరన్ పోలార్డ్ నాయకత్వం వహిస్తుండగా.. డర్బన్ సూపర్ జెయింట్స్‌కు కేశవ్ మహారాజ్, జోబర్గ్ సూపర్ కింగ్స్‌కు డెప్లెసిస్, పార్ల్ రాయల్స్‌కు డేవిడ్ మిల్లర్, ప్రిటోరియా క్యాపిటల్స్‌కు వేన్ పార్నెల్, సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్‌కు ఎయిడెన్ మార్క్రమ్ సారథులుగా వ్యవహరిస్తున్నారు. -
వన్డే వరల్డ్‌కప్ వేదికలు ఖరారు
తదుపరి జరుగబోయే వన్డే వరల్డ్‌కప్‌కు సంబంధించిన వేదికలు ఖరారైయ్యాయి. 2027 అక్టోబర్, నవంబర్లలో షెడ్యూలైన ఈ మెగా టోర్నీకి సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు ఆతిథ్యమివ్వనున్నాయి. ప్రస్తుతానికి సౌతాఫ్రికాలో జరుగబోయే మ్యాచ్‌లకు సంబంధించిన వేదికలు ఖరారైయ్యాయి. సౌతాఫ్రికాలో ఐసీసీ గుర్తింపు పొందిన మైదానాలు మొత్తం 11 ఉండగా.. వాటిలో ఎనిమిదింట వరల్డ్‌కప్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. వాండరర్స్, ప్రిటోరియాలోని సెంచూరియన్ పార్క్, కింగ్స్‌మీడ్, గ్కెబెర్హాలోని సెయింట్ జార్జ్ పార్క్, పార్ల్ అండ్ న్యూలాండ్స్‌లోని బోలాండ్ పార్క్, బ్లూమ్‌ఫోంటెయిన్‌లోని మాంగాంగ్ ఓవల్, తూర్పు లండన్‌లోని బఫెలో పార్క్ మైదానాలు 2027 క్రికెట్ వరల్డ్‌కప్ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నాయి. బెనోని, జేబీ మార్క్స్ ఓవల్, డైమండ్ ఓవల్ మైదానాల్లో వసతులు సక్రమంగా లేనందుకు వాటిని పక్కకు పెట్టారు. చాలా అంశాలను (హోటల్స్, ఎయిర్‌పోర్ట్‌లు, స్టేడియం కెపాసిటీ తదితర అంశాలు) పరిగణలోకి తీసుకున్న అనంతరం ఈ ఎనిమిది వేదికలను వరల్డ్‌కప్ మ్యాచ్‌ల కోసం ఎంపిక చేసినట్లు క్రికెట్ సౌతాఫ్రికా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫోలెట్సీ మోసెకీ తెలిపారు. జింబాబ్వే నమీబియాలో జరుగబోయే మ్యాచ్‌లకు సంబంధించిన వేదికలు త్వరలోనే ఖరారుకానున్నాయి. కాగా, 2027 వరల్డ్‌కప్‌కు ఆతిథ్య దేశాలు దక్షిణాఫ్రికా, జింబాబ్వే నేరుగా అర్హత సాధించగా.. నమీబియా ఆఫ్రికన్ క్వాలిఫైయర్‌ను అధిగమిస్తే అర్హత సాధిస్తుంది. ఈ మెగా టోర్నీకి వన్డే ర్యాంకింగ్స్‌లో మొదటి ఎనిమిది స్థానాల్లో ఉండే జట్లు నేరుగా అర్హత పొందనుండగా.. మిగిలిన నాలుగు స్థానాలు గ్లోబల్ క్వాలిఫైయర్ టోర్నమెంట్ల ద్వారా నిర్ణయించబడతాయి. ఈ టోర్నీలో పాల్గొనే 14 జట్లు గ్రూప్‌కు ఏడు చొప్పున రెండు గ్రూపులు విభజించబడతాయి. ప్రతి గ్రూప్ నుండి మొదటి మూడు జట్లు సూపర్ సిక్స్ దశకు చేరుకుంటాయి. అనంతరం సెమీఫైనల్స్, ఫైనల్ జరుగుతాయి. 2003 వరల్డ్‌కప్ తరహాలోనే ఈ ప్రపంచకప్‌లోనూ గ్రూప్ దశలో జట్లు ఒకదానితో ఒకటి తలపడతాయి. -
సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించిన క్రికెట్ సౌతాఫ్రికా
2024-25 సంవత్సరానికి గాను సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్ల జాబితాను క్రికెట్ సౌతాఫ్రికా ఇవాళ ప్రకటించింది. ఈ జాబితాలో స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జే పేరు కనిపించలేదు. గతేడాది కాలంలో నోర్జే జాతీయ జట్టుకు అడపాదడపా ప్రాతినిథ్యం వహించడమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. సౌతాఫ్రికా గతేడాదికాలంలో అన్ని ఫార్మాట్లలో కలిపి 37 మ్యాచ్‌లు ఆడగా.. నోర్జే కేవలం తొమ్మిది మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడాడు. సీఎస్ఏ సెంట్రల్ కాంట్రాక్ లిస్ట్‌లో నోర్జే పేరుతో పాటు సిసండ మగాల, వేన్ పార్నెల్, కీగన్ పీటర్సన్ పేర్లు కూడా కనిపించలేదు. ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన టెస్ట్ కెప్టెన్ డీన్ ఎల్గర్, టీ20లకు మాత్రమే పరిమతమైన క్వింటన్ డికాక్ పేర్లను సైతం సీఎస్ఏ అధికారులు తొలగించారు. కొత్తగా సెంట్రల్ కాంట్రాక్ట్ ఆశించిన కైల్ వెర్రిన్, డేవిడ్ బెడింగ్హమ్లకు మొండిచెయ్యి ఎదురైంది. పేస్ బౌలర్ నండ్రే బర్గర్, ఓపెనింగ్ బ్యాటర్ టోనీ డి జోర్జీ కొత్తగా కాంట్రాక్ట్ దక్కించుకోగా.. అండీల్ ఫెహ్లుక్వాయో ఏడాది గ్యాప్ తర్వాత తిరిగి కాంట్రాక్ట్‌ను పొందాడు. గతేడాది మొత్తం 20 మంది సెంట్రల్ కాంట్రాక్ట్ పొందగా.. ఈ ఏడాది ఆ సంఖ్యను 18కే కుదించారు. మహిళల విషయానికొస్తే.. సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ప్లేయర్స్ సంఖ్య 15 నుంచి 16కు పెరిగింది. ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన షబ్నిమ్ ఇస్మాయిల్ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోగా.. కొత్తగా అయండ హ్లుబి, ఎలిజ్-మారి మార్క్స్ కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. 2024-25 సంవత్సరానికి గాను సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన సౌతాఫ్రికా పురుష క్రికెటర్లు.. టెంబా బవుమా, నండ్రే బర్గర్, గెరాల్డ్ కొయెట్జీ, టోనీ డి జోర్జి, జోర్న్ ఫోర్టుయిన్, రీజా హెండ్రిక్స్, మార్కో జన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఎయిడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, ఆండీల్ ఫెహ్లుక్వాయో, కగిసో రబాడ, ర్యాన్ రికెల్టన్, తబ్రేజ్ షంషి, ట్రిస్టన్ స్టబ్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్ సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన మహిళా క్రికెటర్లు.. అన్నేకే బోష్, తజ్మిన్ బ్రిట్స్, నాడిన్ డి క్లెర్క్, లారా గుడాల్, అయాండా హ్లూబి, సినాలో జాఫ్తా, మారిజన్ కప్, అయాబొంగా ఖాకా, మసాబాటా క్లాస్, సున్ లూస్, ఎలిజ్-మారీ మార్క్స్, నోంకులులేకో మ్లాబా, తుమీ సెఖుఖునే, క్లో ట్రైయాన్, డెల్మి టక్కర్, లారా వోల్వార్డ్ట్ -
55 పరుగులకే ఆలౌట్.. టెస్ట్ క్రికెట్‌ను అవమానించినందుకు తగిన శాస్తి జరిగింది..!
స్వదేశంలో జరిగే టీ20 లీగ్ కోసం న్యూజిలాండ్ పర్యటనకు ద్వితియ శ్రేణి జట్టును ఎంపిక చేసి టెస్ట్ క్రికెట్‌ను ఘోరంగా అవమానించిన క్రికెట్ సౌతాఫ్రికాకు రోజుల వ్యవధిలోనే తగిన శాస్తి జరిగింది. ఆ జట్టు స్వదేశంలో భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో తొలి రోజే 55 పరుగులకు ఆలౌటై, 135 ఏళ్ల కిందటి చెత్త రికార్డును తిరగరాసుకుంది. 1889 (ఇంగ్లండ్‌పై 84 పరుగులు) తర్వాత స్వదేశంలో టాస్ గెలిచి, తొలుత బ్యాటింగ్ చేస్తూ సౌతాఫ్రికా చేసిన అత్యల్ప స్కోర్ ఇదే. ఈ మ్యాచ్‌లో భారత పేసర్లు మొహమ్మద్ సిరాజ్ (9-3-15-6), ముకేశ్ కుమార్ (2.2-2-0-2), జస్ప్రీత్ బుమ్రా (8-1-25-2) నిప్పులు చెరుగుతూ, టెస్ట్ క్రికెట్‌ను అవమానించినందుకు సఫారీలపై ప్రతీకారం తీర్చుకున్నారు. భారత పేస్ త్రయం ధాటికి సఫారీలు లంచ్ విరామంలోపే (23.2 ఓవర్లలో) కుప్పకూలారు. అప్పటివరకు పటిష్టంగా కనిపించిన సౌతాఫ్రికా టెస్ట్‌లను అవమానించిన తర్వాత ఇలా కుప్పకూలడంతో టెస్ట్ క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టెస్ట్‌లంటే గౌరవం లేని వారికి ఇలాంటి శాస్తి జరిగి తీరాల్సిందేనని శాపనార్థాలు పెడుతున్నారు. And this was the Test they actually cared about 😳 Karma strikes as days after disrespecting cricket, South Africa is bowled out before lunch for a 135-year worst >> https://t.co/WRU2aJihX8 pic.twitter.com/zYnjeVrh9W — Fox Cricket (@FoxCricket) January 3, 2024 కాగా, ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌లో జరుగబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం క్రికెట్ సౌతాఫ్రికా (CSA) సీనియర్లను కాదని ద్వితియ శ్రేణి జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. స్వదేశంలో జరిగే లీగ్‌లో (SA20) సీనియర్లను ఆడించేందుకు క్రికెట్ సౌతాఫ్రికా ఈ నిర్ణయం తీసుకుంది. న్యూజిలాండ్ పర్యటన కోసం CSA ఏడుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లు, కొత్త కెప్టెన్‌తో కూడిన జట్టును ఎంపిక చేసింది. క్రికెట్ సౌతాఫ్రికా చేసిన ఈ పని టెస్ట్ క్రికెట్‌ను అవమానించడమేనని మాజీ క్రికెటర్లు గగ్గోలు పెడుతున్నారు. ఈ విషయంపై క్రికెట్ సర్కిల్స్‌లో దుమారం రేగుతుండగానే సౌతాఫ్రికా ఇలా 55 పరుగులకు ఆలౌట్ కావడం చర్చనీయాశంగా మారింది. ఇదిలా ఉంటే, సౌతాఫ్రికాను తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే ఆలౌట్ చేసిన అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. తొలి రోజు టీ విరామం సమయానికి 4 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (20), కేఎల్ రాహుల్ (0) క్రీజ్‌లో ఉన్నారు. -
టెస్ట్ క్రికెట్‌ను చంపే కుట్ర జరుగుతుంది..!
ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌లో జరుగబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం క్రికెట్ సౌతాఫ్రికా (CSA) సీనియర్లను కాదని ద్వితియ శ్రేణి జట్టును ఎంపిక చేయడంపై ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ స్టీవ్ వా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. కాసులు కురిపించే లీగ్ (SA20) కోసం క్రికెట్ సౌతాఫ్రికా టెస్ట్ క్రికెట్‌ను చంపే కుట్ర చేస్తుందని సంచలన ఆరోపణలు చేశాడు. ఏడుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లు, కొత్త కెప్టెన్‌తో కూడిన జట్టును న్యూజిలాండ్‌కు పంపిస్తూ క్రికెట్ సౌతాఫ్రికా న్యూజిలాండ్ క్రికెట్‌ను అవమానపరిచిందని మండిపడ్డాడు. స్వదేశంలో జరిగే లీగ్‌పై అంత మమకారం ఉన్నప్పుడు న్యూజిలాండ్ సిరీస్‌ను మొత్తంగా రద్దు చేసుకుని ఉండాల్సిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్రికెట్ సౌతాఫ్రికా టెస్ట్ క్రికెట్‌ను చులకన చేసిందని, వాళ్లకు దేశం కంటే ఫ్రాంచైజీ క్రికెట్టే ఎక్కువైందని తూర్పారబెట్టాడు. టెస్ట్ క్రికెట్‌ను చులకన చేస్తూ క్రికెట్ సౌతాఫ్రికా చేసిన ఈ పనిని చూసిచూడనట్లు వ్యవహరించినందుకు ఐసీసీ సహా బీసీసీఐపై కూడా మండిపడ్డాడు. ఐసీసీ, బీసీసీఐ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ బోర్డులు టెస్ట్ క్రికెట్ పరిరక్షణకు పాటు పడాలని పిలుపునిచ్చాడు. సౌతాఫ్రికా టెస్ట్ క్రికెట్‌ను చులకన చేసేటువంటి చర్యలకు పాల్పడటం ఇది తొలిసారి కాదని, గతంలోనూ ఆ దేశ క్రికెట్ బోర్డు స్వదేశంలో జరిగే టీ20 లీగ్ కోసం ఆస్ట్రేలియాకు ద్వితియ శ్రేణి జట్టును పంపించిందని గుర్తు చేశాడు. దక్షిణాఫ్రికాతో పాటు వెస్టిండీస్ లాంటి దేశాలు సైతం ఇదే రీతిన వ్యవహరిస్తున్నాయని ఆరోపించాడు. ఇలాంటి చర్యలు టెస్టు క్రికెట్ మనుగడకు ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశాడు. మార్నింగ్ హెరాల్డ్‌తో మాట్లాడుతూ వా ఈ మేరకు వ్యాఖ్యానించాడు. కాగా, స్వదేశంలో జరిగే టీ20 లీగ్ కోసం క్రికెట్ సౌతాఫ్రికా సీనియర్లను కాదని అనామక జట్టును న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక చేసింది. న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టు: నీల్ బ్రాండ్ (కెప్టెన్), డేవిడ్ బెడింగ్హమ్, రువాన్ డి స్వర్డ్ట్, క్లైడ్ ఫోర్టుయిన్, జుబేర్ హంజా, త్షెపో మోరేకి, మిహ్లాలీ మ్పోంగ్వానా, డ్యుయన్ ఒలివియర్, డేన్ ప్యాటర్సన్, కీగన్ పీటర్సన్, డేన్ పీడ్ట్, రేనార్డ్ వాన్ టోండర్, షాన్ వాన్ బెర్గ్, ఖాయా జోండో. -
న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌లో జరుగబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం క్రికెట్ సౌతాఫ్రికా ఇవాళ (డిసెంబర్ 30) 14 మంది సభ్యుల టెస్ట్ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు నీల్ బ్రాండ్ నాయకత్వం వహించనుండగా.. సభ్యులంతా కొత్తవారు. ఫిబ్రవరిలో సౌతాఫ్రికాలో టీ20 లీగ్ (SA20) జరుగనుండటంతో న్యూజిలాండ్ సిరీస్ కోసం అనామక జట్టును ఎంపిక చేశారు. ఆ సమయంలో సీనియర్ ఆటగాళ్లంతా సౌతాఫ్రికా టీ20 లీగ్‌తో బిజీగా ఉంటారు. న్యూజిలాండ్ సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో డేవిడ్ బెడింగ్హమ్, జుబేర్ హంజా, డ్యుయన్ ఒలివియర్, కీగన్ పీటర్సన్, ఖాయా జోండో మాత్రమే కాస్తోకూస్తో సుపరిచిత ఆటగాళ్లు. న్యూజిలాండ్ పర్యటనలో ఫిబ్రవరి 4 నుంచి 8 వరకు మౌంట్ మాంగనూయ్‌లో తొలి టెస్ట్.. అనంతరం ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు హ్యామిల్టన్‌లో రెండో టెస్ట్ జరుగనుంది. 🟢 SQUAD ANNOUNCEMENT 🟡 CSA has today announced a 14-player squad for the Proteas two-match Test tour of New Zealand next month🇿🇦🇳🇿#WozaNawe #BePartOfIt #SAvIND pic.twitter.com/pLBxCrNvJF — Proteas Men (@ProteasMenCSA) December 30, 2023 ఇదిలా ఉంటే, ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ఇప్పటికే టీ20, వన్డే సిరీస్‌లు పూర్తి కాగా.. టెస్ట్ సిరీస్ నడుస్తుంది. రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో టీమిండియా తొలి మ్యాచ్‌లో ఓటమిపాలుకాగా.. రెండో మ్యాచ్ వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 7 వరకు కేప్‌టౌన్ వేదికగా జరుగనుంది. ఈ పర్యటనలో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1-1తో డ్రా కాగా.. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టు: నీల్ బ్రాండ్ (కెప్టెన్), డేవిడ్ బెడింగ్హమ్, రువాన్ డి స్వర్డ్ట్, క్లైడ్ ఫోర్టుయిన్, జుబేర్ హంజా, త్షెపో మోరేకి, మిహ్లాలీ మ్పోంగ్వానా, డ్యుయన్ ఒలివియర్, డేన్ ప్యాటర్సన్, కీగన్ పీటర్సన్, డేన్ పీడ్ట్, రేనార్డ్ వాన్ టోండర్, షాన్ వాన్ బెర్గ్, ఖాయా జోండో. -
గ్రౌండ్ కవర్ చేసేందుకూ డబ్బుల్లేవా?: భారత దిగ్గజం ఫైర్
South Africa vs India, 1st T20I: ఆస్ట్రేలియాపై స్వదేశంలో టీ20 సిరీస్ గెలిచిన టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటననూ ఘనంగా ఆరంభించాలని భావించింది. అయితే, ఆదిలోనే వరుణుడు సూర్యకుమార్ సేనకు అడ్డుపడ్డాడు. ప్రొటిస్ గడ్డపై కఠిన సవాలు ఎదురవుతుందనుకుంటే ఎడతెరిపిలేని వర్షంతో తొలి టి20 మ్యాచ్ రద్దయ్యింది. అదేపనిగా వాన కురవడంతో పిచ్‌పై కప్పి ఉంచిన కవర్స్‌ను తీయాల్సిన అవసరమే రాలేదు. కాస్త ఆలస్యంగానైనా మ్యాచ్‌ను అస్వాదించవచ్చని ఎదురుచూస్తూ మైదానంలో గొడుగుల కిందే గడిపిన క్రికెట్ ప్రియుల ఆశలపై నీళ్లు పడ్డాయి. ఆగని వాన వల్ల కనీసం టాస్ కూడా వేసే అవకాశం లేకపోయింది. దీంతో మైదానంలో ఆడాల్సిన ఇరుజట్ల ఆటగాళ్లు... డ్రెస్సింగ్ రూమ్‌లలో సగటు ప్రేక్షకుల్లానే మిగిలిపోయారు. అభిమానులకు తప్పని నిరాశ వాతావరణ పరిస్థితిని సమీక్షించిన ఫీల్డ్ అంపైర్లు బాన్గని జెలె, స్టీఫెన్ హారిస్ రెండు గంటల అనంతరం ఓ నిర్ణయానికి వచ్చారు. వర్షం ఇంకా కొనసాగడం, అవుట్ ఫీల్డ్ అంతా చిత్తడిగా ఉండటంతో ఇక మ్యాచ్ నిర్వహించేందుకు అవకాశం లేదని, ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మెరుపులు చూడాలనుకున్న అభిమానులంతా చినుకులతో విసిగి నిరాశగా వెనుదిరిగారు. వర్షం కారణంగా.. కింగ్స్‌మేడ్ మైదానంలో జరగాల్సిన తొలి టీ20 రద్దు (PC: BCCI) సీఎస్ఏపై గావస్కర్ ఫైర్ ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు(సీఎస్ఏ) తీరుపై టీమిండియా దిగ్గజం, కామెంటేటర్ సునిల్ గావస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆర్థికంగా తమకు ఎంతో ముఖ్యమైన సిరీస్ అని చెప్పిన సీఎస్ఏ.. ఏర్పాట్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించాడు. తొలి టీ20 సమయంలో.. ఒకవేళ వర్షం ఆగిపోయినా ఆట కొనసాగకపోయేదని.. అప్పటికే గ్రౌండ్ మొత్తం తడిచిపోయిందని గావస్కర్ పేర్కొన్నాడు. ఈ విషయం గురించి గావస్కర్ మాట్లాడుతూ.. ‘‘మైదానం మొత్తం కవర్ చేయనేలేదు. వర్షం తెరిపినిచ్చినా మరో గంట.. రెండు గంటల వరకు మ్యాచ్ కొనసాగే పరిస్థితి కనిపించలేదు. అంతలోనే మళ్లీ వర్షం పడింది. బీసీసీఐ దగ్గర ఉన్నంత డబ్బు మీకు లేకపోవచ్చు.. కానీ కాబట్టి మ్యాచ్ రద్దు చేశారు. నిజానికి ప్రతి క్రికెట్ బోర్డు దగ్గర చాలానే డబ్బు ఉంది. ఒకవేళ ఈ మాట తప్పని ఎవరైనా చెబితే వారు అబద్ధం ఆడుతున్నట్లే లెక్క! అయితే, అందరి దగ్గరా బీసీసీఐ వద్ద ఉన్నంత డబ్బు లేకపోవచ్చు. అయితే, ప్రతి బోర్డు దగ్గర కనీసం గ్రౌండ్ తడవకుండా కాపాడే కవర్లు కొనుగోలు చేసేంత సొమ్ము అయినా ఉంటుంది కదా!’’ అంటూ దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుకు చురకలు అంటించాడు. టీమిండియాతో సిరీస్‌ను ప్రతిష్టాత్మకంగా భావించినపుడు కనీస ఏర్పాట్లైనా చేసి ఉండాల్సిందని సునిల్ గావస్కర్ స్టార్ స్పోర్ట్స్ షోలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా మంగళవారం పోర్ట్ ఎలిజబెత్‌లో భారత్, దక్షిణాఫ్రికాల మధ్య రెండో టి20 మ్యాచ్ జరుగనుంది. చదవండి: #Virushka: అందుకే విరాట్ కోహ్లి పేరును రాహుల్‌గా మార్చి మరీ! -
క్రికెట్ సౌతాఫ్రికా కీలక నిర్ణయం.. ఆటగాళ్లకు అదిరిపోయే శుభవార్త! కానీ..
క్రికెట్ సౌతాఫ్రికా(సీఎస్ఏ) కీలక నిర్ణయం తీసుకుంది. ఫిట్నెస్ టెస్టుల విషయంలో ఊరటనిస్తూ తమ క్రికెటర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై రెండు కిలోమీటర్ల పరుగును నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయలేకపోయినా... సెలక్షన్‌కు అందుబాటులో ఉండొచ్చని పేర్కొంది. అయితే, ఫిట్‌నెస్‌లో విఫలమైన ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలన్న నిబంధన కూడా తప్పనిసరి కాదని.. జాతీయ జట్ల కోచ్‌లదే అంతిమ నిర్ణయం అని స్పష్టం చేసింది. ఫిట్నెస్ విషయంలో కనీస స్థాయి ప్రమాణాలు అందుకోకపోనట్లయితే అధికారిక మ్యాచ్‌లలో మైదానంలో దిగే అవకాశం మాత్రం ఉండదని కరాఖండిగా చెప్పింది. పరిమిత ఓవర్లు, రెడ్ బాల్ క్రికెట్లోనూ ఈ కొత్త మార్గదర్శకాలను పాటిస్తామని బోర్డు తెలిపింది. పురుష, మహిళా క్రికెటర్లకు ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయని క్రికెట్ సౌతాఫ్రికా స్పష్టం చేసింది. కాగా ఇటీవల ప్రొటిస్ మహిళా క్రికెటర్లు డేన్ వాన్ నికెర్క్, లిజెల్లీ లీ.. సౌతాఫ్రికా మెన్స్ స్టార్ పేసర్ సిసంద మగల నిర్ణీత సమయంలో రెండు కిలోమీటర్ల పరుగు పూర్తి చేయడంలో విఫలమయ్యారు. ఈ క్రమంలో 18 సెకండ్ల తేడాతో టెస్టులో విఫలమై టీ20 ప్రపంచకప్‌కు దూరమైన నికెర్క్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకగా.. మగల మాత్రం ఫిట్నెస్ టెస్టులో పాసై నెదర్లాండ్స్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో నివేదిక ప్రకారం.. 2023-24 సీజన్లో మాత్రం పాత నిబంధనలు పాటించాల్సి ఉంటుందని క్రికెట్ సౌతాఫ్రికా తెలిపింది. అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ ఆడే పురుష క్రికెటర్లు 8 నిమిషాల 30 సెకండ్లలో పరుగు పూర్తి చేయాలి. ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడే మహిళా క్రికెటర్లు 9 నిమిషాల 30 సెకండ్లలో రన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.అయితే, దేశవాళీ క్రికెట్ ఆడే వాళ్లు మాత్రం 10 నిమిషాల 15 సెకండ్ల వరకు ఛాన్స్ ఉంటుంది. చదవండి: క్రికెట్ చరిత్రలోనే సూపర్ క్యాచ్.. తిలక్ వర్మ మైండ్ బ్లాక్! వీడియో వైరల్ -
సౌతాఫ్రికాలో టీమిండియా పర్యటన.. షెడ్యూల్ విడుదల
వన్డే వరల్డ్‌కప్-2023 ముగిసాక (నవంబర్ 19) కనీసం నెల కూడా తిరక్కుండానే భారత క్రికెట్ జట్టు సౌతాఫ్రికా పర్యటనకు బయల్దేరనుంది. డిసెంబర్ 10 నుంచి మొదలయ్యే ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ, క్రికెట్ సౌతాఫ్రికా ఇవాళ (జులై 14) అధికారికంగా విడుదల చేశాయి. మూడు ఫార్మాట్ల సిరీస్‌లు జరిగే ఈ పర్యటనలో తొలుత 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్, ఆ తర్వాత 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్, ఆఖర్లో 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగనుంది. సౌతాఫ్రికాలో టీమిండియా పర్యటన 2024 జనవరి 7తో ముగియనుంది. ఈ పర్యటనలో భాగంగా జరిగే 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ఫ్రీడం సిరీస్‌గా నామకరణం చేయబడింది. సౌతాఫ్రికాలో భారత పర్యటన షెడ్యూల్ వివరాలు.. టీ20 సిరీస్.. డిసెంబర్ 10: తొలి టీ20 (డర్బన్) డిసెంబర్ 12: రెండో టీ20 (గ్వేబెర్హా) డిసెంబర్ 14: మూడో టీ20 (జోహనెస్బర్గ్) వన్డే సిరీస్.. డిసెంబర్ 17: తొలి వన్డే (జోహనెస్బర్గ్) డిసెంబర్ 19: రెండో వన్డే (గ్వేబెర్హా) డిసెంబర్ 21: మూడో వన్డే (పార్ల్) ఫ్రీడం సిరీస్.. డిసెంబర్ 26 నుంచి 30: తొలి టెస్ట్ (సెంచూరియన్) 2024 జనవరి 3 నుంచి 7: రెండో టెస్ట్ (కేప్‌టౌన్) -
క్రికెట్ సౌతాఫ్రికాకు భారీ షాక్
Mark Boucher To Step Down As SA Head Coach: ఇంగ్లండ్ చేతిలో 1-2 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయి బాధలో ఉన్న సౌతాఫ్రికా క్రికెట్ జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ అనంతరం జట్టు హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు మార్క్ బౌచర్ నిన్న (సెప్టెంబర్ 12) ప్రకటించాడు. ఈ విషయాన్ని క్రికెట్ సౌతాఫ్రికా(సీఎస్ఏ) సైతం ధృవీకరించింది. 2019 డిసెంబర్లో సౌతాఫ్రికా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన బౌచర్.. గత మూడేళ్ల కాలంలో సౌతాఫ్రికాకు అపురూప విజయాలు అందించాడు. సౌతాఫ్రికాను ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో రెండో స్థానంలో (ప్రస్తుతం) నిలిపాడు. బౌచర్ హయాంలో సఫారీ టీమ్ 11 టెస్టులు, 12 వన్డేలు, 23 టీ20ల్లో విజయం సాధించింది. ఇందులో ఈ ఏడాది టీమిండియాతో జరిగిన టెస్ట్ సిరీస్ (2-1) విజయం కూడా ఉంది. సీఎస్ఏతో బౌచర్ కాంట్రాక్ట్ 2023 వరల్డ్ కప్ వరకు ఉన్నప్పటికీ.. త్వరలో ప్రారంభంకానున్న సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ ఫ్రాంచైజీ కోచింగ్ బాధ్యతలు చేపట్టే నిమిత్తం సీఎస్ఏతో తెగదెంపులు చేసుకున్నట్లు తెలుస్తోంది. బౌచర్ దక్షిణాఫ్రికా కోచ్‌గా తన చివరి ద్వైపాక్షిక సిరీస్‌ను భారత్‌లో ఆడనున్నాడు. సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 11 వరకు జరుగనున్న 3 టీ20లు, 3 వన్డేల సిరీస్‌లు బౌచర్‌కు సౌతాఫ్రికా కోచ్‌గా ఆఖరివి. అనంతరం జరగనున్న టీ20 ప్రపంచకప్ (అక్టోబరు 16 నుంచి నవంబరు 13) తర్వాత అతను సౌతాఫ్రికా కోచ్ బాధ్యతల నుంచి పూర్తిగా వైదొలగనున్నాడు. -
సౌతాఫ్రికా కొత్త టీ20 లీగ్ పేరు ఖరారు
CSA T20 League: క్రికెట్ సౌతాఫ్రికా ఆధ్వర్యంలో వచ్చే ఏడాది నుంచి ప్రారంభంకానున్న నయా టీ20 లీగ్‌కు పేరు ఖరారైంది. క్రికెట్ సౌతాఫ్రికా ఈ లీగ్‌కు 'ఎస్ఏ20' లీగ్‌గా నామకరణం చేసింది. ఈ మేరకు సీఎస్ఏ బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ లీగ్‌లో పాల్గొనబోయే ఆరు జట్లను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీలే సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఎస్ఏ20 లీగ్ ఫ్రాంచైజీలను ఐపీఎల్ యాజమాన్యాలే దక్కించుకోవడంతో క్రికెట్ ప్రేమికలు ఈ లీగ్‌ను మినీ ఐపీఎల్‌గా పిలుచుకుంటున్నారు. ఐపీఎల్ తరహాలోనే ఎస్ఏ20లోనూ ఆటగాళ్లను వేలం ద్వారానే దక్కించుకోనున్నారు. సెప్టెంబర్ 19న ఎస్ఏ20 లీగ్ వేలం ప్రక్రియ మొదలవుతుందని సీఎస్ఎ అధ్యక్షుడు, ఎస్ఏ20 లీగ్ కమిషనర్ గ్రేమ్ స్మిత్ వెల్లడించాడు. 2023 జనవరి 23 నుంచి ఎస్ఏ20 లీగ్ ప్రారంభమవుతుందని స్మిత్ సూచనప్రాయంగా వెల్లడించాడు. కాగా, ఈ లీగ్ కోసం ఆయా ఫ్రాంచైజీలు డ్రాఫ్ట్ రూపంలో ఐదుగురు ఆటగాళ్లను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఎస్ఏ20 లీగ్‌లో పాల్గొనే ఫ్రాంచైజీల వివరాలు.. - ఎంఐ కేప్‌టౌన్ (ముంబై ఇండియన్స్) - జోహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ (చెన్నై సూపర్ కింగ్స్) - పార్ల్ రాయల్స్ (రాజస్తాన్ రాయల్స్) - ప్రిటోరియా క్యాపిటల్స్ (ఢిల్లీ క్యాపిటల్స్) - సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ (సన్ రైజర్స్ హైదరాబాద్) - డర్బన్ (లక్నో సూపర్ జెయింట్స్) చదవండి: అంతర్జాతీయ క్రికెట్‌కు కివీస్ ఆల్‌రౌండర్ గుడ్‌బై -
సౌతాఫ్రికా టి20 లీగ్‌లో ఆడనున్న ఎంఎస్ ధోని?
ఐపీఎల్‌కు చెందిన ఆరు ఫ్రాంచైజీలు సౌతాఫ్రికా టి20 లీగ్‌లో ఉన్న జట్లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరిలో సౌతాఫ్రికా టి20 లీగ్ తొలి సీజన్ ప్రారంభించేందుకు క్రికెట్ సౌతాఫ్రికా(సీఎస్ఏ) కసరత్తులు చేస్తోంది. టోర్నీలో మొత్తం ఆరు జట్లు ఉండగా.. కేప్‌టౌన్‌ను-ముంబై ఇండియన్స్, జోహన్నెస్‌బర్గ్- చెన్నై సూపర్ కింగ్స్, డర్బన్- లక్నో సూపర్ జెయింట్స్, పోర్ట్ ఎలిజిబెత్- ఎస్ఆర్హెచ్, ప్రిటోరియా-ఢిల్లీ క్యాపిటల్స్, పార్ల్- రాజస్తాన్ రాయల్స్ దక్కించకున్నాయి. కాగా జోహన్నెస్‌బర్గ్‌ను దక్కించుకున్న సీఎస్కే నుంచి ఇంకో ఆసక్తికర విషయం బయటకొచ్చింది. సీఎస్కే తరపున విజయవంతమైన కెప్టెన్‌గా పేరు పొందిన ఎంఎస్ ధోని సౌతాఫ్రికా టి20లీగ్‌లో ఆడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీఎస్కేతో ఉన్న అనుబంధం దృశ్యా ప్రొటిస్ టి20 లీగ్‌లో ఆడనున్నట్లు తెలిసింది. ఇది నిజమైతే మాత్రం సీఎస్కే కొనుగోలు చేసిన జోహన్నెస్‌బర్గ్‌కు ధోని కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ఐపీఎల్లో ధోని ఎంత సక్సెస్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐపీఎల్ ఆరంభం నుంచి సీఎస్కేలో కొనసాగిన ధోని జట్టును నాలుగుసార్లు విజేతగా(20210, 2011,2018, 2021).. మరో ఐదుసార్లు రన్నరప్‌గా(2008,2012,2013,2015,2019) నిలిపాడు. 2010, 2014లో ధోని సీఎస్కేకు చాంపియన్స్ లీగ్ టి20 టైటిల్స్ అందించాడు. గత ఐపీఎల్ సీజన్లో ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. జడేజాకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాడు. కానీ అంచనాలకు భిన్నంగా దారుణంగా విఫలమైన సీఎస్కే నిరాశపరిచింది. దీంతో సీజన్ మధ్యలోనే జడ్డూ కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. మళ్లీ ధోనినే కెప్టెన్సీ అందుకున్నాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 14 మ్యాచ్‌ల్లో 4 విజయాలు.. 10 ఓటములతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఐపీఎల్ 2022 సీజన్ ధోనికి ఆఖరిదని అంతా భావించినప్పటికి.. ఆ వార్తలను ఖండించిన ధోని తర్వాతి సీజన్లోనూ ఆడనున్నట్లు స్పష్టం చేశాడు. చదవండి: పేరుకే సౌతాఫ్రికా టి20 లీగ్.. అన్ని ఫ్రాంచైజీలు మనోళ్లవే.. Graeme Smith: కీలక పదవి చేపట్టనున్న సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ -
కీలక పదవి చేపట్టనున్న సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్
క్రికెట్లో అత్యంత విజయవంతమైన టోర్నీగా పేరు తెచ్చుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తర్వాత ఎన్నో లీగ్‌లు పుట్టుకొచ్చాయి. బిగ్‌బాష్, పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్(పీఎస్ఎల్), టి10 లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇక వీటి జాబితాలోకి సౌతాఫ్రికా కూడా చేరనుంది. క్రికెట్ సౌతాఫ్రికా(సీఎస్ఏ) సౌతాఫ్రికా టి20 లీగ్ పేరిట కొత్త టోర్నీని నిర్వహించనుంది. ఈ టోర్నీ వెనుక పరోక్షంగా ఐపీఎల్ ప్రాంచైజీలు ఉండడం విశేషం. మొత్తం ఆరు టీమ్‌లు ఉండగా.. ఈ ఆరింటిని ఐపీఎల్ ఫ్రాంచైజీలు కొనుగోలు చేయడం విశేషం. కేప్‌టౌన్, జోహెన్నెస్‌బర్గ్, డర్బన్, పోర్ట్ ఎలిజిబెత్, ప్రిటోరియా, పార్ల్ పేర్లతో ఉన్న ప్రాంచైజీలను ముంబై ఇండియన్స్, సీఎస్కే, లక్నో సూపర్ జెయింట్స్, ఎస్ఆర్హెచ్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేశాయి. ఈ కొత్త టి20 లీగ్‌కు ఆ జట్టు మాజీ దిగ్గజ ఆటగాడు గ్రేమీ స్మిత్‌ను కమిషనర్‌గా ఎంపిక చేసింది. ఒక ఆటగాడిగా, కెప్టెన్‌గా, కామెంటేటర్‌గా, అంబాసిడర్‌గా, కన్సల్టెంట్‌గా ఎన్నో ఘనతలు సాధించిన స్మిత్.. తాజాగా సీఎస్ఏలో డైరెక్టర్ ఆఫ్ క్రికెట్(డీఓసీ)గా విధులు నిర్వర్తిస్తున్నాడు. సౌతాఫ్రికాలో క్రికెట్‌ను జాతీయంగా మరింత పటిష్టంగా తయారు చేయాలని.. కొత్త ఆటగాళ్లను ప్రోత్సహించడానికే ఈ టోర్నీని నిర్వహించనున్నట్లు సీఎస్ఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా సౌతాఫ్రికా టి20 లీగ్ కమిషనర్‌గా ఎంపికైన స్మిత్ స్పందించాడు. ''కొత్త తరహా టోర్నీకి కమిషనర్‌గా ఎంపికవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ కొత్త బాధ్యతను సక్రమంగా నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తా. సౌతాఫ్రికా క్రికెట్‌కు పనిచేయడానికి ఎంత సమయమైనా సంతోషంగా కేటాయిస్తా. ఇలాంటి పోటీతత్వం ఉన్న కొత్త టి20 లీగ్‌ను నడిపించేందుకు దైర్యం కావాలి. అది ఉందనే నమ్ముతున్నా. దేశవాలీ క్రికెట్లో మనకు తెలియని అద్బుత ఆటగాళ్లను వెలికి తీయాలనేదే సీఎస్ఏ ప్రధాన ఉద్దేశం. అందుకే సౌతాఫ్రికా టి20 లీగ్‌ను ప్రారంభించనుంది. ఆరంభ దశలో సక్సెస్ అయ్యేందుకు నా వంతు ప్రయత్నం చేస్తా.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక సీఎస్ఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఫోలెట్సీ మోసికీ కొత్త బాధ్యతలు తీసుకున్న గ్రేమీ స్మి్త్‌కు శుభాకాంక్షలు తెలపగా.. దక్షిణాఫ్రికాకు చెందిన పలువురు మాజీ క్రికెటర్లు స్మిత్‌ను అభినందనల్లో ముంచెత్తారు. వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరిలో ఈ టోర్నీ జరిగేలా ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ఐపీఎల్ రెండు నెలల విండో క్రికెట్‌కు అనుమతించాలని బీసీసీఐ ఐసీసీని కోరగా.. అందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఐపీఎల్‌కు ఆటంకం లేకుండా ఈ లీగ్‌ను నిర్వహించాలని సీఎస్ఏ భావిస్తోంది. ఇక గ్రేమి స్మిత్ దక్షిణాఫ్రికా తరపున అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు. అంతేగాక ఆల్‌టైమ్ టెస్టు కెప్టెన్లలో స్మిత్ పేరు కూడా ఉంటుంది. సౌతాఫ్రికాకు 54 టెస్టుల్లో విజయాలు అందించి.. అత్యధిక విజయాలు అందుకున్న కెప్టెన్‌గా స్మిత్ రికార్డు సృష్టించాడు. 2003లో షాన్ పొలాక్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న స్మిత్.. 2014లో తాను రిటైర్ అయ్యే వరకు టెస్టు కెప్టెన్‌గా కొనసాగడం విశేషం. ఇక బ్యాటింగ్‌లోనూ ఆల్‌టైమ్ గ్రేట్ ఓపెనర్స్ జాబితాలో స్మిత్ పేరు కచ్చితంగా ఉంటుంది. 2002-2014 వరకు సౌతాఫ్రికా తరపున స్మిత్ 117 టెస్టుల్లో 9265 పరుగులు, 197 వన్డేల్లో 6989 పరుగులు, 33 టి20ల్లో 982 పరుగులు సాధించాడు. స్మిత్ ఖాతా 27 టెస్టు సెంచరీలు, 10 వన్డే సెంచరీలు ఉన్నాయి. చదవండి: యాసిర్ షా 'బాల్ ఆఫ్ ది సెంచరీ'... దిగ్గజ బౌలర్ గుర్తురాక మానడు -
మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లు.. గుజరాత్ ప్లేయర్‌కు బంపర్ ఆఫర్
South Africa Tour Of England: జులై 19 నుంచి దాదాపు మూడు నెలల పాటు ఇంగ్లండ్, ఐర్లాండ్‌లలో పర్యటించనున్న దక్షిణాఫ్రికా జట్లను (మూడు ఫార్మాట్ల జట్లు) క్రికెట్ సౌతాఫ్రికా మంగళవారం ప్రకటించింది. వచ్చే నెల నుంచి సౌతాఫ్రికా ఈ రెండు దేశాలతో మూడు ఫార్మాట్లలో సిరీస్‌లు ఆడనుంది. జులై 19 నుంచి 31 వరకు ఇంగ్లండ్‌తో 3 వన్డేలు, 3 టీ20లు ఆడనున్న సపారీ టీమ్.. మధ్యలో ఆగస్ట్ 3, 5 తేదీల్లో ఐర్లాండ్‌తో రెండు టీ20లు, ఆతర్వాత ఆగస్ట్ 17-సెప్టెంబర్ 12 వరకు ఇంగ్లండ్‌తో మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ సుదీర్ఘ పర్యటనల కోసం క్రికెట్ సౌతాఫ్రికా మూడు ఫార్మాట్లకు మూడు వేర్వేరు జట్లతో పాటు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లను ప్రకటించింది. ఇటీవల టీమిండియాతో ముగిసిన టీ20 సిరీస్‌లో గాయపడిన వైట్‌బాల్ కెప్టెన్ టెంబా బవుమా మూడు జట్లలో స్థానం కోల్పోగా.. గుజరాత్ టైటాన్స్ (ఐపీఎల్) ఆటగాడు డేవిడ్ మిల్లర్, భారత సంతతి ఆటగాడు కేశవ్ మహారాజ్‌లు బంపర్ ఆఫర్లు కొట్టేశారు. టెస్ట్‌ల్లో డీన్ ఎల్గర్‌ను కెప్టెన్‌గా కొనసాగించిన సీఎస్ఏ.. వన్డేల్లో కేశవ్ మహారాజ్‌ను, టీ20ల్లో డేవిడ్ మిల్లర్‌ను కెప్టెన్లుగా నియమించింది. South Africa announced Test, ODI, and T20I squads for the upcoming England tour.#SkyFair #ENGvsSA #SouthAfrica #England #DavidMiller #Cricket #T20I #TestCricket #ODI #CricketTwitter pic.twitter.com/CQrxXoOwVc — SkyFair (@officialskyfair) June 29, 2022 ఇంగ్లండ్, ఐర్లాండ్ దేశాల్లో సౌతాఫ్రికా పర్యటన వివరాలు.. జులై 19 : ఇంగ్లాండ్ తో తొలి వన్డే జులై 22 : రెండో వన్డే జులై 24 : మూడో వన్డే జులై 27 : తొలి టీ20 జులై 28 : రెండో టీ20 జులై 31 : మూడో టీ20 ఆగస్టు 3 : ఐర్లాండ్ తో తొలి టీ20 ఆగస్టు 5 : రెండో టీ20 ఆగస్టు 17-21 : ఇంగ్లాండ్ తో తొలి టెస్టు ఆగస్టు 25-29 : రెండో టెస్టు సెప్టెంబర్ 8-12 : మూడో టెస్టు చదవండి: విరాట్ కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన బాబర్ ఆజమ్ -
టీమిండియాతో టీ20 సిరీస్.. దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు దూరం..!
దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఐడెన్ మార్క్రామ్ టీమిండియాతో జరిగిన తొలి మూడు టీ20లకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే మిగిలిన రెండు టీ20లకు కూడా మార్క్రామ్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని క్రికెట్ దక్షిణాఫ్రికా ట్విటర్ వేదికగా వెల్లడించింది. తొలి టీ20కు ముందు మార్క్రామ్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే గత ఏడు రోజులుగా ఐషోలేషన్‌లో ఉన్న మార్క్రామ్ ఇంకా కొవిడ్ నుంచి కోలుకోలేనట్లు తెలుస్తోంది. "మార్క్రామ్కు పాజిటివ్‌గా తేలిన తర్వాత 7 రోజులు క్వారంటైన్లో గడిపాడు. అయితే అతడు ఇంకా కోలుకోలేదు. కాబట్టి మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు" అని క్రికెట్ దక్షిణాఫ్రికా ట్వీట్ చేసింది. ఇక గాయం కారణంగా గత రెండు టీ20లకు దూరమైన ప్రోటిస్ ఓపెనర్ క్వింటన్ డికాక్ నాలుగో టీ20కు తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఇరు ఇక రాజ్‌కోట్ వేదికగా నాలుగో టీ20 శుక్రవారం జరగనుంది. చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో నాలుగో టీ20.. టీమిండియా యువ పేసర్ దూరం..! -
కోమాలోనే సౌతాఫ్రికా యువ క్రికెటర్.. అండగా నిలబడిన క్రికెట్ బోర్డు
గత ఆదివారం(మే 29న) దుండగుల చేతిలో తీవ్రంగా గాయపడి కోమాలో ఉన్న సౌతాఫ్రికా క్రికెటర్ మొండ్లీ ఖుమాలోకు ఆ దేశ క్రికెట్ బోర్డు(క్రికెట్ సౌతాఫ్రికా) అండగా నిలబడింది. ఖుమాలో కుటుంబసభ్యులకు ఆర్థిక సహాయం అందించిన బోర్డు తన పెద్ద మనసు చాటుకుంది. ''యూకేలో దుండగుల చేతిలో గాయపడిన మొండ్లీ ఖుమాలో త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం. ఈ దాడిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. అతని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాం. అతని కుటుంబసభ్యులకు మా అండ ఎప్పటికి ఉంటుంది.'' అని పేర్కొంది. కాగా దుండగుల చేతిలో తీవ్రంగా గాయపడిన ఖుమాలో ఇప్పటికి కోమాలోనే ఉన్నాడు. ప్రస్తుతం యూకేలోని సౌత్‌మెడ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఖుమాలోకు బుధవారం మూడో సర్జరీ నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. తలలో రక్తం గడ్డకట్టడంతో ఖుమాలో కోమాలోకి వెళ్లిపోయాడని.. బ్లడ్‌ప్రెషర్ కూడా ఎక్కువగా ఉందన్నారు. దీంతో గడ్డకట్టిన రక్తాన్ని తొలగించడానికి మూడు సర్జరీలు చేశామని.. మరొక సర్జరీతో అతనికి పూర్తిగా నయమయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా ఖుమాలో కోమాలోనే ఉన్నప్పటికి అతని ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని తెలిపారు. కాగా మే29(ఆదివారం) తెల్లవారుజామున తన పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న మొండ్లీ ఖుమాలోపై కొందరు దుండగులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. కాగా ఖుమాలోపై దాడికి దిగిన వారిలో ఒక 27 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. ఇక 20 ఏళ్ల మొండ్లీ ఖుమాలో 2018లో క్వాజులు-నాటల్ ఇన్లాండ్ తరపున టి20 అరంగేట్రం చేశాడు. 2020 అండర్-19 ప్రపంచకప్ సౌతాఫ్రికా జట్టులో మొండ్లీ ఖుమాలో చోటు దక్కించుకున్నాడు. ఇక 2020 మార్చి 7న లిస్ట్-ఏ, 2021 మార్చి 4న ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఐదు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, రెండు లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 4 టి20 మ్యాచ్‌లు ఆడాడు. చదవండి: యూకేలో సౌతాఫ్రికా క్రికెటర్‌పై దాడి.. పరిస్థితి విషమం -
క్రికెట్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ తరహాలో మరో లీగ్
క్రికెట్ ప్రేమికులకు శుభవార్త. త్వరలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలో మరో టీ20 క్రికెట్ లీగ్ ప్రారంభం కానుంది. ఈ లీగ్ క్రికెట్ సౌతాఫ్రికా ఆధ్వర్యంలో జరుగనుంది. మొత్తం ఆరు జట్లు పాల్గొనే ఈ లీగ్‌ను వచ్చే ఏడాది (2023) జనవరిలో నిర్వహించనున్నట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించింది. లీగ్‌లో పాల్గొనే ఆరు జట్లు ఒక్కో జట్టుతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతాయి. పాయింట్ల పట్టికలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ప్లేఆఫ్ దశకు చేరుకుంటాయి. ఇక్కడ ఈ మూడు జట్లు ప్రతి జట్టుతో ఒక్కో మ్యాచ్ ఆడతాయి. ఈ స్టేజీలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన రెండు జట్లు ఫైనల్లో తలపడతాయి. 3 నుంచి 4 వారాల పాటు సాగే ఈ లీగ్‌లో మొత్తం 33మ్యాచ్‌లు జరుగుతాయి. ఐపీఎల్ తరహాలో ఈ లీగ్‌లోనూ ప్రతి జట్టులో నలుగురు అంతర్జాతీయ ఆటగాళ్లు (విదేశీ) ఉంటారు. వేలం ప్రక్రియ ద్వారా ఆటగాళ్ల కొనుగోలు జరుగుతుంది. వేలం తేదీలు, మ్యాచ్‌ల వివరాలు త్వరలోనే తెలుస్తాయి. ఈ లీగ్ విజయవంతమైతే తదనంతరం మహిళల టీ20 లీగ్ కూడా ప్రారంభిస్తామని క్రికెట్ సౌతాఫ్రికా ప్రకటించింది. కాగా, ఐపీఎల్ తరహాలో ఆస్ట్రేలియా, వెస్టిండీస్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ దేశాల్లో ఇదివరకే టీ20 లీగ్‌లు జరుగుతున్న విషయం తెలిసిందే. చదవండి: రోహిత్ శర్మ కెప్టెన్సీపై షాకింగ్ కామెంట్స్ చేసిన యువీ -
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్ క్రికెటర్..
దక్షిణాఫ్రికా స్టార్ మహిళా క్రికెటర్ మిగ్నాన్ డు ప్రీజ్ వన్డే, టెస్టు పార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించింది. తన కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డు ప్రీజ్ తెలిపింది. "ఇప్పటి వరకు నాలుగు వన్డే ప్రపంచకప్‌లలో ఆడడం నా అదృష్టం. ఇవి నా జీవితంలో చాలా విలువైన జ్ఞాపకాలు. అయితే నేను ఎక్కువ సమయం నా కుటుంబంతో గడపాలి అనుకుంటున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. అదే విధంగా నాకెంతో మద్దతుగా నిలిచిన క్రికెట్ సౌతాఫ్రికాకు, అభిమానులకు నా ధన్యవాదాలు" అని క్రికెట్ సౌత్ ఆఫ్రికా విడుదల చేసిన ప్రకటనలో డు ప్రీజ్ పేర్కొంది. కాగా 2007 లో అంతర్జాతీయ క్రికెట్లో మిగ్నాన్ డు ప్రీజ్ అరంగేట్రం చేసింది. కాగా దక్షిణాఫ్రికా తరపున అత్యధిక వన్డేలు ఆడిన మహిళా క్రికెటర్ కూడా డు ప్రీజ్ కావడం విశేషం. ఆమె తన వన్డే కెరీర్లో 154 మ్యాచ్‌లు ఆడిన డు ప్రీజ్.. 3760 పరుగులు సాధించింది. తన కెరీర్లో 18 అర్ధ సెంచరీలు, 2 సెంచరీలు ఉన్నాయి. 2011 నుంచి 2016 వరకు దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా కూడా డు ప్రీజ్ బాధ్యతలు నిర్వహించింది. ఇక ఆమె చివరగా మహిళల వన్డే ప్రపంచకప్-2022 సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఆడింది. చదవండి: IPL 2022: 51 పరుగుల దూరంలో వార్నర్.. తొలి విదేశీ ఆటగాడిగా! 1️⃣ 5️⃣ incredible years 1️⃣ 5️⃣ 4️⃣ ODIs 1️⃣ Test What a career in the longer formats it has been @MdpMinx22 🏏 #AlwaysRising pic.twitter.com/vOLG2Yas9p — Cricket South Africa (@OfficialCSA) April 7, 2022 -
ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్.. సీజన్ మొత్తానికి దూరం కానున్న స్టార్ బౌలర్..!
ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, దక్షిణాఫ్రికా బౌలర్ అన్రిచ్ నోర్జే సీజన్ మొత్తానికి దూరం కానున్నాడని తెలుస్తోంది. గతేడాది ఐపీఎల్ సందర్భంగా గాయపడ్డ నోర్జే ఇంకా కోలుకోలేదు. గతేడాది టీ20 ప్రపంచకప్‌తో పాటు ఇటీవల టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు కూడా అతను అందుబాటులో లేడు. తాజాగా స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరగనున్న వన్డే సిరీస్ కోసం ప్రకటించిన దక్షిణాఫ్రికా జట్టులో కూడా నోర్జేకు స్థానం లేదు. దీంతో నోర్జే గాయానికి సంబంధించిన సమాచారం కోసం ఢిల్లీ జట్టు.. బీసీసీఐని సంప్రదించింది క్రికెట్ సౌతాఫ్రికాతో చర్చలు జరపాలని కోరింది. కాగా, ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు జరిగిన రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా రిషబ్ పంత్, పృథ్వీ షా, అక్షర్ పటేల్, నోర్జేలను డీసీ జట్టు రిటైన్ చేసుకుంది. నోర్జేకు డీసీ రూ. 6.5 కోట్లు ముట్టజెప్పి అట్టిపెట్టుకుంది. మరోవైపు, నోర్జేతో పాటు ఐపీఎల్లో పాల్గొనాల్సి ఉన్న ఇతర దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు సంబంధించి కూడా బీసీసీఐ.. క్రికెట్ సౌతాఫ్రికాతో సంప్రదించనుంది. ఐపీఎల్ ప్రారంభ సమయానికి సఫారీ జట్టు బంగ్లాదేశ్‌తో టెస్ట్, వన్డే సిరీస్‌లు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో లీగ్ ఆరంభ మ్యాచ్‌లకు ఆ దేశ ఆటగాళ్లు అందుబాటులో ఉంటారా..? లేదా..? అన్న విషయంపై బీసీసీఐ క్లారిటీ కోరనుంది. ఐపీఎల్ 2022 సీజన్ ఈ నెల 26 నుంచి ప్రారంభమవుతుండగా.. బంగ్లా-దక్షిణాఫ్రికా సిరీస్‌లు ఈనెల 18న ప్రారంభమై, ఏప్రిల్ 12న ముగుస్తాయి. ఈ షెడ్యూల్ ప్రకారం దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కనీసం మూడు వారాలైనా ఐపీఎల్‌కు దూరంగా ఉండాల్సి వస్తుంది. కగిసొ రబాడా, మార్కో జన్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, రస్సీ వాన్ డర్ డసెన్, లుంగి ఎంగిడి, క్వింటన్ డికాక్ వంటి ఆటగాళ్లు పలు ఐపీఎల్ జట్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. వీరిలో డికాక్ టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో అతను ఐపీఎల్ ప్రారంభం నుంచే అందుబాటులో ఉండే అవకాశముంది. కాగా, జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అంశాన్ని ఆటగాళ్ల విజ్ఞతకే వదిలిపెట్టినట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: జట్టును ప్రకటించిన దక్షిణాఫ్రికా.. స్టార్ బౌలర్ దూరం -
ఐపీఎల్ 2022ను మా దేశంలో నిర్వహించండి.. ఇక్కడైతే ఖర్చులు చాలా తక్కువ..!
ఇటీవల దక్షిణాఫ్రికాలో భారత పర్యటన విజయవంతం కావడంతో క్రికెట్ సౌతాఫ్రికా మరో ప్రతిపాదనతో బీసీసీఐ ముందుకొచ్చింది. భారత్‌లో కరోనా ఉధృతి తగ్గకపోతే ఈ ఏడాది ఐపీఎల్‌ను తమ దేశంలో నిర్వహించాలని బీసీసీఐకి లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ లేఖలో క్రికెట్ సౌతాఫ్రికా కొన్ని ఆసక్తికర విషయాలను పొందుపరిచింది. ఐపీఎల్ 15వ సీజన్ నిర్వహణ భారత్‌లో సాధ్యపడని పక్షంలో యూఏఈ కాకుండా తమ దేశంలో నిర్వహిస్తే బీసీసీఐకి లాభాల పంట పండుతుందని పేర్కొంది. యూఏఈతో పోల్చుకుంటే దక్షిణాఫ్రికాలో ఖర్చులు చాలా తక్కువనే లాజిక్‌ను చెప్పుకొచ్చింది. రవాణా, హోటల్ ఖర్చులు ఫ్రాంచైజీలకు కలిసొస్తాయని వివరించింది. కట్టుదిట్టమైన బయోబబుల్ ఏర్పాట్ల నడుమ నాలుగు వేదికల్లోనే లీగ్‌ను నిర్వహిస్తామని ప్రతిపాదించింది. గతంలో సౌతాఫ్రికాలో ఐపీఎల్ విజయవంతమైన విషయాన్ని గుర్తు చేస్తూ.. కరోనా బీభత్సంలోనూ ఇటీవలి భారత పర్యటన సక్సెస్ అయిన వైనాన్ని ప్రస్తావించింది. కాగా, ఈ ఏడాది ఐపీఎల్‌ను ఎలాగైనా భారత్‌లోనే నిర్వహించాలని బీసీసీఐ పట్టుదలగా ఉంది. అయితే, దేశంలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి విపరీతంగా ఉండడంతో ఐపీఎల్ నిర్వహణపై బీసీసీఐ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ నిర్వహణకు తొలి ఛాయిస్ భారత్ అయినప్పటికీ.. యూఏఈ, దక్షిణాఫ్రికా వేదికలను కూడా పరిశీలిస్తోంది. ఐపీఎల్ 2022 వేదికపై ఫిబ్రవరి 20 తేదీలోగా తేలుస్తామని ఐపీఎల్ జట్లకు సైతం ఇదివరకే స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే, ఈ ఏడాది ఐపీఎల్ ఏప్రిల్ 2 నుంచి జూన్ 3 మధ్యలో జరగనున్న విషయం తెలిసిందే. చదవండి: IPL 2022: అదే నా ప్లాన్.. ఆల్‌రౌండర్‌గానే...: హార్దిక్ పాండ్యా -
SA Vs Ind: ఓవైపు భారత్‌తో సిరీస్.. మరోవైపు హెడ్‌కోచ్‌పై విచారణ
Racism In Cricket South Africa: ఆటగాళ్లుగా ఉన్న సమయంలో నల్ల జాతీయుల క్రీడాకారులపట్ల వివక్ష ప్రదర్శించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ క్రికెటర్లు గ్రేమ్ స్మిత్, మార్క్ బౌచర్లపై సౌతాఫ్రికా క్రికెట్ (సీఎస్ఏ) అధికారికంగా విచారణ ప్రారంభించనుంది. ప్రస్తుతం స్మిత్ సీఎస్ఏ డైరెక్టర్‌గా, బౌచర్ జట్టు హెడ్ కోచ్‌గా ఉన్నారు. క్రికెట్లో జాతివివక్షకు సంబంధించి సోషల్ జస్టిస్ అండ్ నేషన్ బిల్డింగ్ (ఎస్‌జేఎన్) ఇటీవల ఇచ్చిన నివేదికలో వీరిద్దరి పేర్లను ప్రస్తావించారు. ఎస్‌జేఎన్ ఇచ్చిన నివేదికకు కొనసాగింపుగా ఈ అంశంపై సీఎస్ఏ మరింత సమగ్రంగా విచారణ జరపాలని నిర్ణయించింది. నివేదికలో పై ఇద్దరితో పాటు ఏబీ డివిలియర్స్ పేరు కూడా ఉంది. కాగా మూడు టెస్టులు, మూడు వన్డేల సిరీస్ నిమిత్తం టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. డిసెంబరు 26 నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ఆరంభం కానుంది. ఓవైపు సిరీస్ కొనసాగుతుండగానే.. మరోవైపు ప్రస్తుత హెడ్‌కోచ్, డైరెక్టర్‌పై సీఎస్ఏ అధికారిక విచారణకు ఆదేశించడం గమనార్హం. చదవండి: ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముహూర్తం ఖరారు..! IND VS SA: ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా.. క్రికెట్ అభిమానులకు నిరాశే.. కష్టమే ఇక! -
దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా కేశవ్ మహారాజ్
Keshav Maharaj To Lead South Africa For ODI Series Against Netherlands: ఈనెల(నవంబర్) 26 నుంచి స్వదేశంలో నెదర్లాండ్స్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం ప్రకటించిన దక్షిణాఫ్రికా జట్టులో భారీ మార్పులు జరిగాయి. రెగ్యులర్ కెప్టెన్ టెంబా బవుమా, సీనియర్లు ఎయిడెన్ మార్క్రమ్, క్వింటన్ డికాక్, వాన్ డర్ డస్సెన్, కగిసో రబాడ, అన్రిచ్ నోర్జేలకు విశ్రాంతి కల్పించిన క్రికెట్ సౌతాఫ్రికా.. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, వైస్ కెప్టెన్ కేశవ్ మహారాజ్‌కు పగ్గాలు అప్పజెప్పింది. వర్క్ లోడ్, కఠిన బయోబబుల్ నిబంధనల కారణంగా సీనియర్లకు విశ్రాంతి కల్పిస్తున్నట్లు సీఎస్ఏ పేర్కొంది. సీనియర్లంతా డిసెంబర్లో టీమిండియాతో ప్రారంభమయే సిరీస్‌కు అందుబాటులో ఉంటారని బోర్డు తెలిపింది. వెటరన్ ఆటగాడు వేన్ పార్నెల్ సుదీర్ఘకాలం తర్వాత జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికా జట్టు: కేశవ్ మహారాజ్(కెప్టెన్), డారిన్ డుపావిల్లోన్, జేబేర్ హమ్జా, రీజా హెండ్రిక్స్, సిసండా మగాల, జన్నెమాన్ మలాన్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, వేన్ పార్నెల్, అండైల్ ఫెలుక్వాయో, డ్వెయిన్ ప్రిటోరియస్, రియాన్ రికెల్టంన్, తబ్రేజ్ షంషి, కైల్ వెర్రిన్(వికెట్‌కీపర్), లిజాడ్ విలియమ్స్, ఖాయా జోండో చదవండి: టోక్యో ఒలింపిక్స్ పతక విజేతకు షాక్.. కోర్టుకు వెళ్లిన తోటి బాక్సర్ -
దక్షిణాఫ్రికాతో ఆట ముగిసినట్లే.. క్రిస్ మోరిస్ ఆవేదన
All Rounder Chris Morris Statement Not Playing South Africa.. బ్లాక్‌లైవ్ మ్యాటర్స్ మూమెంట్ మద్దతు విషయంలో డికాక్ వివాదం మరిచిపోకముందే సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుకు మరోషాక్ తగిలింది. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ ఇకపై దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు ఆడే రోజులు పూర్తయ్యాయంటూ సంచలన ప్రకటన చేశాడు. క్రిస్ మోరిస్ తాజా ప్రకటనతో క్రికెట్ సౌతాఫ్రికా బోర్డు(సీఎస్ఏ) తెరవెనుక సంక్షోభం మరోసారి మొదలైనట్లు స్పష్టంగా కనిపిస్తుంది. సీఎస్ఏ రాజకీయాలతో తానెంత నలిగిపోయాననేది మోరిస్ ప్రకటనలో స్పష్టంగా కనిపించింది. చదవండి: మోకాలిపై నిలబడకపోవడంపై క్షమాపణలు కోరిన డికాక్ దీనికి సంబంధించి మోరిస్ మాట్లాడుతూ.. ‘దక్షిణాఫ్రికా జాతీయ జట్టు కోసం నేను ఆడే రోజులు పూర్తయ్యాయి.అధికారికంగా రిటైర్మెంట్పై చెప్పాల్సింది ఏమీ లేదు. నేను దేశవాళీ క్రికెట్ మీద దృష్టి సారించాలనుకుంటున్నాను. దక్షిణాఫ్రికా తరఫున మూడు ఫార్మాట్లకు ఆడాను. నా దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం రావడం నాకు గర్వంగా ఉంది. నేను ఎక్కడ ఉంటానో (దక్షిణాఫ్రికా బోర్డు ను ఉద్దేశిస్తూ..) వాళ్లకు తెలుసు. అలాగే నేను ఎక్కడ నిలబడగలనో నాకు తెలుసు. కానీ జాతీయ జట్టు కోసం ఆడే రోజులు మాత్రం పూర్తయ్యాయి. బాధగా ఉన్నప్పటికీ ఇదే నిజం’ అని పేర్కొన్నాడు. 34 ఏండ్ల క్రిస్ మోరిస్.. దక్షిణాఫ్రికా తరఫున 2012లో క్రికెట్ లో అరంగ్రేటం చేశాడు. ఇప్పటివరకు అతడు 42 వన్డేలు, 23 టీ20లు, నాలుగు టెస్టులు ఆడాడు. జాతీయ జట్టు తరఫున మోరిస్ చివరి వన్డేను 2019 ప్రపంచకప్ లో ఆడాడు. ఇక యూఏఈలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో దక్షిణాఫ్రికా తరఫున మోరిస్ తుది జట్టులో లేడు. మోరిస్ తో పాటు స్టార్ ఓపెనర్ డూప్లెసిస్, ఇమ్రాన్ తాహిర్ లను కూడా ఎంపిక చేయలేదు. దక్షిణాఫ్రికాలో బోర్డు, ఆటగాళ్ల మధ్య కొంతకాలంగా సఖ్యత కొరవడింది. టి20 టోర్నీ ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికా బోర్డుకు ఆటగాళ్లకు మధ్య ఎన్ని వివాదాలు తలెత్తుతాయో అని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: Quinton De Kock: మ్యాచ్‌కు 30 నిమిషాల ముందు డికాక్ ఔట్.. కారణం -
De Kock: తగ్గేదేలే అన్నాడు.. ఇప్పుడేమో దిగొచ్చాడు..!
Quinton De Kock Apologises For Refusing To Take Knee: ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ప్రపంచవ్యాప్తంగా వివిధ క్రీడా వేదికలపై ఆటగాళ్లు సంఘీభావం తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా వెస్టిండీస్‌తో మ్యాచ్ ఆరంభానికి ముందు.. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు(సీఎస్ఏ) సైతం మోకాలిపై కూర్చుని ఉద్యమానికి మద్దతు తెలపాల్సిందిగా ఆ దేశ ఆటగాళ్లను ఆదేశించింది. అయితే ఆ జట్టు వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ మాత్రం ఇందుకు ససేమిరా అన్నాడు. ఏకంగా జట్టు నుంచే తప్పుకున్నాడు. అయితే, సదరు అంశంపై వివరణ ఇవ్వాల్సిందిగా సీఎస్ఏ చివరి అవకాశం ఇవ్వడంతో తాజాగా అతను దిగొచ్చాడు. Quinton de Kock statement 📝 pic.twitter.com/Vtje9yUCO6— Cricket South Africa (@OfficialCSA) October 28, 2021 జట్టు సభ్యులకు, అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. జాత్యాహంకారానికి వ్యతిరేకంగా నిలబడడం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నానని, తదుపరి మ్యాచ్‌లో మోకాలిపై నిల్చొని ఉద్యమానికి మద్దతు తెలుపుతానని అన్నాడు. ఈ సున్నితమైన అంశాన్ని రాద్దాంతం చేయడం, ఎవరినీ అగౌరవపరచడం తన ఉద్దేశం కాదని వివరణ ఇచ్చాడు. తన చర్యలు ఎవరినైనా బాధించి ఉంటే పెద్ద మనసుతో తనను క్షమించాలని కోరాడు. జట్టుతో చేరేందుకు తాను సుముఖంగా ఉన్నానని తెలిపాడు. కాగా, మొదట్లో ఈ అంశంపై స్పందించేందుకు కూడా ఇష్టపడని డికాక్.. ఓ దశలో కెరీర్‌ను అర్ధంతరంగా ముగించేందుకు సన్నిహితులతో చర్చించినట్లు సమాచారం. చదవండి: David Warner: మోకాలిపై కూర్చుంటాం... ఆ విషయం గురించి స్పందించలేను!