భారత్, సౌతాఫ్రికా సిరీస్ కు గాంధీ- మండేలా పేరు | India vs SA series to be called Gandhi-Mandela series | Sakshi
Sakshi News home page

భారత్, సౌతాఫ్రికా సిరీస్ కు గాంధీ- మండేలా పేరు

Published Mon, Aug 31 2015 7:13 PM | Last Updated on Sun, Sep 3 2017 8:29 AM

India vs SA series to be called Gandhi-Mandela series

భారత, దక్షిణాఫ్రికాల మధ్య జరిగే క్రికెట్ సిరీస్ కు గాంధీ- మండేలా పేరు పెట్టనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య జరగ నన్న క్రికెట్ సిరీస్ లన్నీ మహాత్మాగాంధీ- నెల్సన్ మండేలా సిరీస్ గా వ్యవహరించేందుకు ఇరుదేశాల క్రికెట్ బోర్డులు నిర్ణయించాయి.

నవంబర్ లో ఇరు దేశాల మధ్య ప్రారంభం కానున్న టెస్ట్ సిరీస్ ను ''ఫ్రీడం ట్రోఫీ' గా పిలవనున్నారు. ఈ సిరీస్ ను మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలాకు అంకితమివ్వనున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా తెలిపారు. మహాత్మా గాంధీ చేసిన స్వాతంత్ర్య పోరాటం ఇరుదేశాలకు వారధి అని ఆయన అభిప్రాయపడ్డారు. గాంధీ, మండేలా ఇరువురూ అహింస ద్వారానే తమ తమ దేశాలకు స్వాతంత్య్రం సాధించి పెట్టారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement