వన్డే వరల్డ్‌కప్-2023 ముగిసాక (నవంబర్ 19) కనీసం నెల కూడా తిరక్కుండానే భారత క్రికెట్ జట్టు సౌతాఫ్రికా పర్యటనకు బయల్దేరనుంది. డిసెంబర్ 10 నుంచి మొదలయ్యే ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ, క్రికెట్ సౌతాఫ్రికా ఇవాళ (జులై 14) అధికారికంగా విడుదల చేశాయి. మూడు ఫార్మాట్ల సిరీస్‌లు జరిగే ఈ పర్యటనలో తొలుత 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్, ఆ తర్వాత 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్, ఆఖర్లో 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగనుంది. సౌతాఫ్రికాలో టీమిండియా పర్యటన 2024 జనవరి 7తో ముగియనుంది. ఈ పర్యటనలో భాగంగా జరిగే 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ఫ్రీడం సిరీస్‌గా నామకరణం చేయబడింది.
సౌతాఫ్రికాలో భారత పర్యటన షెడ్యూల్ వివరాలు..
టీ20 సిరీస్..
- డిసెంబర్ 10: తొలి టీ20 (డర్బన్)
- డిసెంబర్ 12: రెండో టీ20 (గ్వేబెర్హా)
- డిసెంబర్ 14: మూడో టీ20 (జోహనెస్‌బర్గ్)
వన్డే సిరీస్..
- డిసెంబర్ 17: తొలి వన్డే (జోహనెస్‌బర్గ్)
- డిసెంబర్ 19: రెండో వన్డే (గ్వేబెర్హా)
- డిసెంబర్ 21: మూడో వన్డే (పార్ల్)
ఫ్రీడం సిరీస్..
- డిసెంబర్ 26 నుంచి 30: తొలి టెస్ట్ (సెంచూరియన్)
- 2024 జనవరి 3 నుంచి 7: రెండో టెస్ట్ (కేప్‌టౌన్)
Comments
Please login to add a commentAdd a comment