south africa tour
-
సౌతాఫ్రికాలో టీమిండియా పర్యటన.. షెడ్యూల్ విడుదల
వన్డే వరల్డ్‌కప్-2023 ముగిసాక (నవంబర్ 19) కనీసం నెల కూడా తిరక్కుండానే భారత క్రికెట్ జట్టు సౌతాఫ్రికా పర్యటనకు బయల్దేరనుంది. డిసెంబర్ 10 నుంచి మొదలయ్యే ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ, క్రికెట్ సౌతాఫ్రికా ఇవాళ (జులై 14) అధికారికంగా విడుదల చేశాయి. మూడు ఫార్మాట్ల సిరీస్‌లు జరిగే ఈ పర్యటనలో తొలుత 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్, ఆ తర్వాత 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్, ఆఖర్లో 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగనుంది. సౌతాఫ్రికాలో టీమిండియా పర్యటన 2024 జనవరి 7తో ముగియనుంది. ఈ పర్యటనలో భాగంగా జరిగే 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ఫ్రీడం సిరీస్‌గా నామకరణం చేయబడింది. సౌతాఫ్రికాలో భారత పర్యటన షెడ్యూల్ వివరాలు.. టీ20 సిరీస్.. డిసెంబర్ 10: తొలి టీ20 (డర్బన్) డిసెంబర్ 12: రెండో టీ20 (గ్వేబెర్హా) డిసెంబర్ 14: మూడో టీ20 (జోహనెస్బర్గ్) వన్డే సిరీస్.. డిసెంబర్ 17: తొలి వన్డే (జోహనెస్బర్గ్) డిసెంబర్ 19: రెండో వన్డే (గ్వేబెర్హా) డిసెంబర్ 21: మూడో వన్డే (పార్ల్) ఫ్రీడం సిరీస్.. డిసెంబర్ 26 నుంచి 30: తొలి టెస్ట్ (సెంచూరియన్) 2024 జనవరి 3 నుంచి 7: రెండో టెస్ట్ (కేప్‌టౌన్) -
ఉమ్రాన్ మాలిక్‌కు బంపరాఫర్ తగిలే అవకాశం
ఐపీఎల్లో సంచలనాలు సృష్టిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్... త్వరలోనే బంపర్ ఆఫర్ తగిలే అవకాశం కనిపిస్తోంది. గత టీ20 వరల్డ్‌కప్‌లో నెట్ బౌలర్‌గా పని చేసిన ఉమ్రాన్ ఐపీఎల్లో 152 కి.మీ. వేగంతో నిలకడగా బంతులు వేయడంతో పాటు వికెట్లు తీస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. ముఖ్యంగా ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్ అద్భుత ప్రదర్శన నమోదు చేశాడు. పంజాబ్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ మెయిడెన్‌తో వేయడమే గాక రనౌట్ సహా మూడు వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా ఉమ్రాన్ మాలిక్ (4-1-28-4) తన కెరీర్లో బెస్ట్ గణాంకాలు నమోదు చేశాడు. దీంతో ఉమ్రాన్ మాలిక్‌ను జూన్‌లో సౌతాఫ్రికా, ఐర్లాండ్‌తో జరిగే ఏడు టీ20లకు అతన్ని టీమ్‌లోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సొంతగడ్డపై సఫారీలతో పాటు ఐర్లాండ్ టూర్లో ద్వితీయశ్రేణి జట్టును ఆడించాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. దీనికితోడు ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 వరల్డ్‌కప్ కోసం కూడా ఓ పేస్ బౌలింగ్ పూల్‌ను ఏర్పాటు చేయాలని ప్లాన్స్ వేస్తున్నారు. ఉమ్రాన్, నటరాజన్, అర్ష్‌దీప్ సింగ్‌ను కూడా ఈ పరిధిలోకి తీసుకొస్తే బాగుంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రెండు నెలలు ఇదే ఫామ్, ఫిట్నెస్తో ఉంటే ఉమ్రాన్.. టీమిండియా గడప తొక్కడం అసాధ్యమేమీ కాకపోవచ్చు. చదవండి: David Warner: నాన్న ఔటయ్యాడని ఏడ్చేసింది.. వీడియో వైరల్ -
IND A Tour Of SA: టీమిండియాలో ఒమిక్రాన్ కలకలం.. ఇద్దరికి పాజిటివ్..!
Two India A Coaches Tests False Positive For Covid: దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత-ఏ జట్టులో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కలకలం రేపింది. జట్టు కోచింగ్ సిబ్బందిలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వార్తలు రావడంతో భారత శిబిరంలోని ఆటగాళ్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. త్వరలో దక్షిణాఫ్రికాలో పర్యటించాల్సిన టీమిండియా సైతం ఈ వార్త విని ఆందోళనకు గురైంది. అయితే, ఆ ఇద్దరు కోచింగ్ సిబ్బందికి రెండోసారి కోవిడ్ పరీక్ష నిర్వహించగా, అందులో నెగిటివ్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. బ్లూంఫాంటేన్ వేదికగా భారత-ఏ, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న చివరి నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఆటగాళ్లందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో తొలుత ఇద్దరు టీమిండియా కోచ్‌లకు కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్‌గా తేలి, రెండోసారి జరిపిన పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్లు ఓ ప్రముఖ దినపత్రిక పేర్కొంది. ప్రాధమిక పరీక్ష ఫలితాలు తప్పు అని క్రికెట్ దక్షిణాఫ్రికా చీఫ్ మెడికల్ ఆఫీసర్ నిర్ధారించినట్లు సదరు పత్రిక తెలిపింది. భారత బృంద సభ్యులందరికీ నెగిటివ్ రావడంతో మ్యాచ్‌ను యధాతథంగా కొనసాగిస్తున్నారు. ఫాల్స్ పాజిటివ్ వచ్చిన ఇద్దరు కోచ్‌లను క్వారంటైన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. కాగా, భారత-ఏ బౌలింగ్ కోచ్‌గా సాయిరాజ్ బహుతులే, బ్యాటింగ్ కోచ్‌గా సితాన్షు కోటక్, ఫీల్డింగ్ కోచ్‌గా శుభ్‌దీప్ ఘోష్‌లను బీసీసీఐ దక్షిణాఫ్రికాకు పంపింది. ఇదిలా ఉంటే, కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ ప్రకంపనల కారణంగా భారత సీనియర్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటన వారం ఆలస్యంగా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో తొలి టెస్ట్ డిసెంబర్ 26న, రెండో టెస్టు వచ్చే ఏడాది జనవరి 3న, సిరీస్‌లో ఆఖరుదైన మూడో టెస్ట్ జనవరి 11న జరగనున్నాయి. అనంతరం వన్డే, టీ20 సిరీస్‌లు ప్రారంభమవుతాయి. చదవండి: గంగూలీని ఎలా గద్దె దించారో.. కోహ్లిని కూడా అదే తరహాలో.. -
దక్షిణాఫ్రికాకు వెళ్లలేం...
మెల్బోర్న్: వచ్చే నెలలో దక్షిణాఫ్రికా గడ్డపై మూడు టెస్టుల సిరీస్‌లో తలపడాల్సిన ఆస్ట్రేలియా జట్టు ఆ పర్యటనను నిరవధికంగా వాయిదా వేసుకుంది. సమీప భవిష్యత్తులో ఎలాంటి తేదీలు కూడా ప్రకటించకపోవడంతో ఈ టెస్టు సిరీస్ దాదాపుగా రద్దయినట్లే. దక్షిణాఫ్రికాలో ప్రస్తుతం కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. ఈ టూర్ కోసం ఇప్పటికే జట్టును కూడా ప్రకటించిన కంగారూ టీమ్ అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. అదే కారణమా... అయితే ఆసీస్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటన రద్దు విషయంలో కరోనాకంటే కూడా ఇతర విషయాలు కారణమని వినిపిస్తోంది. భారత్ చేతిలో ఎదురైన ఓటమి నుంచి ఆ జట్టు కోలుకోలేదు. పైగా ఆటగాళ్లకు, కోచ్ లాంగర్‌కు మధ్య విభేదాలు వచ్చాయి. ప్రస్తుత స్థితిలో రబడ, నోర్జే, ఇన్గిడిలాంటి బౌలర్లను ఎదుర్కొని అక్కడ గెలవడం సులువు కాదు. మరొక్క సిరీస్ ఓడినా టీమ్ మేనేజ్మెంట్లో సమూల మార్పులు ఖాయమనే భావన అందరిలో ఉండటమే వెళ్లకపోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కరోనా కాలంలోనూ ఇటీవల దక్షిణాఫ్రికా జట్టు శ్రీలంకకు ఆతిథ్య మిచ్చింది. ఇరు జట్ల మధ్య బయో బబుల్‌లో రెండు టెస్టులు జరిగాయి. అవే ఏర్పాట్లు ఇప్పుడు చేయడం కూడా కష్టం కాదు. మరో వైపు ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టు పర్యటన కూడా సాఫీగా కొనసాగుతోంది. పాపం ఆసీస్! ఆస్ట్రేలియా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరే అవకాశాలకు భారత్‌తో సిరీస్ సందర్భంగా దెబ్బ పడింది. మెల్బోర్న్లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టుకు జరిమానాతో పాటు ఐసీసీ నాలుగు పాయింట్ల కోత కూడా విధించింది. అది జరగకపోయి ఉంటే ఆస్ట్రేలియా కూడా న్యూజిలాండ్‌తో సమంగా 70 పాయింట్ల శాతంతో ఉండేది. అప్పుడు ఒక్కో వికెట్‌కు చేసిన పరుగులు, ఇచ్చిన పరుగుల నిష్పత్తిని పరిగణనలోకి తీసుకోవాల్సి వచ్చేది. ఈ అంశంలో కివీస్ (1.28) కంటే మెరుగ్గా ఉన్న ఆసీస్ (1.39)కు మంచి అవకాశం ఉండేది. -
గాంధీజీ కళ్లజోడు.. జీవితాన్నే మార్చేసింది!
ప్రిటోరియా: దక్షిణాఫ్రికాలో మహాత్మా గాంధీ ధరించిన బంగారు వృత్తాకారపు కళ్లజోడు ఇటీవల వేలం పాటలో అత్యంత భారీ మొత్తానికి అమ్ముడు పోయింది. మూడు వారాల క్రితం దక్షిణాఫ్రికాలోని బ్రిస్టల్‌ల్లో నిర్వహించిన ఈ వేల పాటలో ఆ కళ్లజోడు సుమారు 260,000 పౌండ్లకు అమ్ముడుపోడంతో దాని యాజమాని హర్షం వ్యక్తం చేశాడు. ఈ కళ్లజోడును దక్షిణాఫ్రికా పర్యటన సమయంలో మహత్మా గాంధీ ధరించారు. ఈ అరుదైన వస్తువును ఆమెరికాకు చెందిన ఓ వ్యక్తి కొనుగోలు చేశాడు. గాంధీజీ కళ్లద్దాలకు రిజర్వ్ ధరను 15,000 పౌండ్లగా నిర్ణయించారు. అయితే దీనిని సొంతం చేసుకునేందుకు భారతదేశంతో సహా వివిధ దేశాల నుండి చాలా మంది ఆసక్తిచూపించినట్లు వేలం పాట నిర్వహకుడు ఆండీ స్టోవ్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా స్టోవ్ శనివారం అక్కడి మీడియాతో మాట్లాడుతూ.. “ఇది అద్భుతమైన ఫలితం. ఇప్పటికీ నమ్మలేకపోతున్న. ఇంత మొత్తంలో ఈ కళ్లజోడు వేలానికి పోతుందని ఎవరూ కూడా ఊహించలేదు. నిజానికి ఈ కళ్లద్దాలు దాదాపు 50 ఏళ్లుగా తమ ప్రదర్శన శాలలోనే ఉంటోంది. అయితే కొంతమంది దీనిని వేలంలో ఎవరూ కొనరని, పనికి రాని వస్తువుగా చూసేవారు. దీనిని బయటపడేయడమే ఉత్తమమంటూ దీని యాజమానికి పలువురు సూచించారు. అయితే ఈ కళ్లజోడు యాజమాని ఓ వృద్ధుడు. అతడి కుటుంబం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. వేలంలో ఊహించనంతా మొత్తానికి అమ్ముడుపోడంతో అతడి జీవితాన్నే మార్చేసేంతా డబ్బును అతడు పొందాడు’ అని పేర్కొన్నాడు. అయితే కళ్లద్దాలను కొనుగోలును సొంతం చేసుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా భారత్, ఖతార్, కెనడా, రష్యా, అమెరికా నుంచి పాల్గొన్నారని చెప్పాడు. అయితే దీనిని 1920-1930 మధ్య కాలంలో గాంధీజీ దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం తిరిగి భారత్‌కు వెళ్లేటప్పుడు సదరు వృద్దుడి మామకు ఇచ్చినట్లు స్టోవ్ వెల్లడించాడు. ఇది దాదాపు దశాబ్ధాలుగా వారి వద్దే ఉంటోందని, గాంధీ ఇక్కడకు వచ్చినప్పుడు వృద్ధుడి మామ దక్షిణాఫ్రికాలోని బ్రిటిష్ పెట్రోలియంతో కలిసి పనిచేసేవాడని చెప్పాడు. భారత్‌లో గాంధీ స్వాతంత్ర్య పోరాటాన్ని ప్రారంభించడానికి ముందు ఇక్కడ చాలా సంవత్సరాలు గడిపారని, ఆ సమయంలో గాంధీజీ వారి ఇంట్లోనే నివిసించినట్లు అతడు తెలిపాడు. ఆయనకు ఆతిథ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతగా గాంధీ ఈ కళ్లజోడును వారికి బహుకరించారని స్టోవ్ వెల్లడించాడు. అయితే ఈ కళ్లద్దాలు మొత్తం బంగారు పూతతో ఉండి ప్రిస్క్రిప్షన్ లెన్స్‌లతో ఇమిడి ఉంటుందని అతడు చెప్పాడు. ఇక ముక్కు పట్టి కూడా బంగారంలోనే ఉంటుందన్నాడు. ఈ వేలంలో గాంధీకి సంబంధించిన పలు వస్తువులలో ఈ అద్దాలు ఉత్తమైనవే కాకుండా మొత్తం ప్రదర్శనలో ఐకానిక్‌గా నిలిచిందని స్టోవ్ తెలిపాడు. -
సఫారీ పర్యటనకు మాటివ్వలేదు: ధుమాల్
న్యూఢిల్లీ: ఆగస్టు నెలలో దక్షిణాఫ్రికాలో పర్యటించే అంశంపై సఫారీలకు తాము ఎటువంటి మాటివ్వలేదని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు. కేవలం ద్వైపాక్షిక సిరీస్ నిర్వహణకు అందుబాటులో ఉండే అవకాశాల గురించి మాత్రమే చర్చించామని తెలిపారు. భారత్ తమ దేశంలో పర్యటించేందుకు ఒప్పుకుందని గురువారం పేర్కొన్న క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్ఏ) డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ వ్యాఖ్యలను ధుమాల్ కొట్టిపారేశారు. అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షలు అమల్లో ఉన్నంత కాలం ఏ దేశంలోనూ తాము పర్యటించబోమని పునరుద్ఘాటించారు. -
సైలెంట్ వారియర్‌కు సచిన్ విషెస్
సాక్షి, స్పోర్ట్స్ : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ టీమిండియా సైలెంట్ వారియర్.. ఛటేశ్వర పుజారాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. గురువారం(జనవరి 25) పుజారా పుట్టిన రోజు సందర్భంగా సచిన్ తన ట్వీటర్లో ఓ పోస్ట్ చేశారు. ‘‘టీమిండియా సైలెంట్ వారియర్ పుజారాకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో అతను రాణించాలని కోరుకుంటున్నా’’ అని సచిన్ ట్వీట్లో పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం సౌతాఫ్రికాతో టీమిండియా మూడో టెస్ట్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. Wishing the silent warrior of #TeamIndia a very very happy birthday. My best wishes for the ongoing test match, @cheteshwar1. pic.twitter.com/8X2Twqoz4R — Sachin Tendulkar (@sachin_rt) 25 January 2018 -
మీడియా సమావేశానికి కోహ్లి గైర్హాజరు
కేప్‌టౌన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియా సమావేశానికి డుమ్మా కొట్టాడు. సాధారణంగా టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు ఇరు జట్ల కెప్టెన్లు మీడియా సమావేశంలో పాల్గొనడం ఆనవాయితీ. అలాంటిది గురువారం నిర్వహించిన మీడియా సమావేశానికి కోహ్లీ హాజరుకాకుండా భారత బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌ను పంపించాడు. దీంతో దక్షిణాఫ్రికా మీడియా అసంతృప్తిని వ్యక్తం చేసింది. ‘ఆటగాళ్లంతా సానుకూల దృక్పథంతో కాన్పిడెంట్‌గా ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. కోహ్లీ హాజరుకాకపోవడంపై వివరణ కోరగా.. ‘కోహ్లీ-రవిశాస్త్రి ఇప్పటికే మీడియాతో మాట్లాడారు. అంతేకాదు సౌతాఫ్రికా కెప్టెన్ హాజరవుతున్నాడన్న సమాచారం లేదని తెలిపాడు. ఇక టీమిండియా ఆటగాళ్లు సైతం గురువారం ప్రాక్టీస్ సెషన్‌నూ ఎగ్గొట్టారు. గురువారం ఉదయమే టీమ్ మేనేజ్మెంట్ ఆటగాళ్లకు ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్ అని చెప్పింది. దీంతో ఒక్క ఆటగాడు కూడా ప్రాక్టీస్ సెషన్‌కు హాజరుకాలేదు. భారత జట్టు సిబ్బందితో పాటు ప్రధాన కోచ్ రవిశాస్త్రి, చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మాత్రమే టెస్టు జరిగే పిచ్‌ను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశానికి రవిశాస్త్రితో కలిసి కోహ్లీ హాజరుకావాల్సి ఉండే. కానీ, ఎవరూ రాలేదు. సుమారు గంట తర్వాత అసిస్టెంట్ కోచ్ సంజయ్ బంగర్ వచ్చాడు. గతంలో ఇలా భారత కెప్టెన్ మీడియా సమావేశానికి హాజరుకాకపోవడం ఎప్పుడు జరగలేదు. మాజీ కెప్టెన్ ధోని ఈడెన్ గార్డెన్స్‌లో ఓ సారి ఇషాంత్‌ను పంపించాడు. ఈ రోజు మధ్యాహ్నం 2గంటల నుంచి భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు ప్రారంభంకానుంది. -
కోహ్లితో అభిమాని ఫొటో.. వైరల్ !
విరాట్ కోహ్లి-అనుష్కల వివాహం ఇటీవల చాలా హాట్ టాఫిక్ మారిన విషయం తెలిసిందే. సఫారీ పర్యటనకు బయలుదేరే ముందు కోహ్లి తనకు క్రికెట్‌పై ఉన్న ఇష్టాన్ని తెలిపారు. క్రికెట్ అంటే తనకు రక్తంతో సమానం అన్నారు. అంతేకాక పెళ్లి తనలో ఏ విధమైన మార్పు తేలేదని కోహ్లి అన్నారు. విరాట్ కేప్ టౌన్లో ప్రాక్టీస్ సెషన్ అనంతరం ఓ అభిమానితో కలిసి ఫొటో దిగారు. ఆ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పెళ్లిలో అనుష్క విరాట్ కోహ్లి వేలికి ఉంగరం తొడిగింది. ఆ రింగ్‌ను మన కెప్టెన్ ఒక గొలుసుతో కలిపి మెడలో వేసుకున్నట్లు ఆ ఫొటోలో కనిపిస్తోంది. సఫారీ పర్యటనలో టీమిండియా మూడు టెస్టు మ్యాచ్‌లు, 6 వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లను ఆడనుంది. రేపు (జనవరి 5న) కేప్ టౌన్ లో తొలి టెస్టు ప్రారంభకానున్న విషయం తెలిసిందే. -
పాండ్యా మన జట్టుకు ఒక ఆయుధం..!
ఇండియా-సౌతాఫ్రికాల మధ్య మొదటి టెస్టు జనవరి 5న కేప్‌టౌన్‌లో ప్రారంభకానున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ టీమిండయాకు తన అనుభవంతో కూడిన సలహాలు, సూచనలు ఇచ్చారు. అంతేకాక కెప్టెన్ విరాట్‌కోహ్లి, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాలపై ప్రశంసల జల్లుకురిపించారు. ‘ప్రస్తుతం ఉన్న టీమిండియా జట్టు చాలా బలంగా ఉంది. నా క్రికెట్ కెరీర్లో ఇండియా జట్టు ఇప్పుడు ఉన్నంతా బలంగా ఎప్పుడూ లేదు. ఇండియా జట్టులో బౌలింగ్, బ్యాటింగ్‌లో కూడా బాగా రాణించే వాళ్లు ఉన్నారు. అంతేకాక ఆల్‌రౌండర్ హార్దికపాండ్యా సఫారీ పర్యటనలో మనకు అదనపు బలమని చెప్పవచ్చు. అతను కోహ్లికి దొరికిన ఆయుధం. అతను 7లేదా 8వ ప్లేస్‌లో కూడా వచ్చి చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడు.’ అని సచిన్ పొగడ్తలతో ముంచెత్తారు. అంతేకాక మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా సచిన్ పంచుకున్నారు. ‘ సఫరీ గడ్డపై ఇండియా జట్టు జాగ్రత్తగా ఆడి, బాగా రాణిస్తే కోహ్లి సేనకు గెలుపు ఖాయం. జట్టులోని బౌలర్లు, బ్యాట్స్మెన్లు ఉమ్మడిగా రాణించాలి. ఏ టెస్టు మ్యాచ్‌లోనైనా ఫస్ట్ రోజు ఆటే ముఖ్యం. మొదటి స్పెల్‌లో బ్యాట్్తో లేదా బౌలింగ్‌తో ఏ జట్టు అయితే రాణిస్తుందో వారే విజయదుందుబి మోగించే అవకాశం ఎక్కువగా ఉంది.’ అని మాస్టర్ బ్లాస్టర్ తెలిపారు. కపిల్ దేవ్ సారథ్యంలో కూడా ఇండియా జట్టు ఎప్పుడు ముగ్గురు పేసర్లతో దిగడం గురించి ఆలోచన జరగలేదు. సఫారీ పిచ్‌పై బంతులు లైన్ అండ్ లెంగ్త్‌తో దూసుకోస్తాయి. అందుచేత స్లిప్‌లో ఫీల్డిండ్ ఉన్నవాళ్లు చాలా చురుకుగా ఉండాలి. దక్షిణాఫ్రికా జట్టులో ఏబీ డివిలియర్స్, హసీమ్ ఆమ్లాలు చాలా బాగా ఆడుతున్నారు. వారిని త్వరగా ఫెవిలియన్ కు పంపిస్తే టీమిండియాకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి* అని మాస్టర్ అన్నారు. -
‘కోహ్లికి ఈ సిరీసే అసలు పరీక్ష’
న్యూఢిల్లీ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి దక్షిణాఫ్రికా పర్యటనే అసలైన పరీక్షా అని భారత మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడి అభిప్రాయపడ్డారు. బ్యాట్స్‌మన్‌గానే కాకుండా కెప్టెన్‌గా అయినా కోహ్లి సత్తా ఏంటో ఈ సిరీస్‌లో తెలుస్తుందని ఈ దిగ్గజ స్పిన్నర్ చెప్పుకొచ్చారు. భారత స్టార్ బ్యాడ్మింటన్ షట్లర్ పీవీ సింధూపై బిషన్ సింగ్ బేడి పొగడ్తల వర్షం కురిపించారు. ప్రపంచ దిగ్గజాలకు సింధూ గట్టి పోటీనిచ్చిందని కొనియాడారు. ఈ ఒలింపిక్ పతాక విజేత ఇప్పటికే తన సత్తాను చాటిందన్నారు. సింధూలా తన సామర్థ్యం నిరూపించుకోవడానికి కోహ్లి ఇబ్బంది పడవచ్చన్నారు. దిగ్గజ జట్టైన దక్షిణాఫ్రికాతో కోహ్లి సేనకు గట్టిపోటీ ఎదురవ్వనుందని తెలిపారు. -
ఎయిర్‌పోర్టులో ధావన్‌కు చేదు అనుభవం
దుబాయ్ : టీమిండియా ఓపెనర్ శిఖర్‌ధావన్‌కు దుబాయ్ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా కుటుంబంతో బయలుదేరిన ధావన్ కుటుంబాన్ని ఎయిర్‌లైన్స్ అధికారులు బోర్డింగ్‌కు అనుమతించలేదు. ఈ విషయంపై ధావన్ ట్విట్టర్ వేదికగా అసహనం వ్యక్తం చేశాడు. ‘నాతో దక్షిణాఫ్రికా వస్తున్న నా ఫ్యామిలీని అడ్డుకోవడం ఎమిరేట్స్‌కు అనైతిక చర్య. నా భార్య, పిల్లలకు దుబాయ్ నుంచి దక్షిణాఫ్రికా వెళ్లే విమానానికి బోర్డింగ్ ఇవ్వలేదు. మా పిల్లల జనన ధృవీకరణ పత్రాలు సమర్పించాలని కోరారు. ఆ సమయంలో అవి అందుబాటులో లేవు. వాటికోసం వారు దుబాయ్ ఎయిర్‌పోర్టులో నిరీక్షిస్తున్నారు. ముంబై విమానాశ్రయంలోనే ఈ పత్రాలను అడిగి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. ఎలాంటి కారణం లేకుండా ఓ ఎమిరేట్స్ ఉద్యోగి తన కుటుంబ పట్ల దురుసుగా ప్రవర్తించాడని’ అసహనం వ్యక్తం చేశాడు. 2/2.They are now at Dubai airport waiting for the documents to arrive. Why didn't @emirates notify about such a situation when we were boarding the plane from Mumbai? One of the emirates' employee was being rude for no reason at all. — Shikhar Dhawan (@SDhawan25) 29 December 2017 ఇక చీలమండ గాయంతో బాధపడుతున్న ధావన్ తొలి టెస్టుకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హోటల్‌కు చేరే సమయంలో ధావన్ తన ఎడమ చీలమండకు పట్టీ కట్టుకొని కనిపించాడు. ధావన్ గాయంపై ఫిజియో నుంచి ఎలాంటి సమాచారం అందలేదని, అతను తొలి మ్యాచ్ ఆడుతాడా లేదా అని ఇప్పుడే చెప్పలేమని ఓ బీసీసీఐ సీనియర్ అధికారి తెలిపారు. -
క్రికెట్‌పై కోహ్లీ భారీ డైలాగ్
సాక్షి ,ముంబై : క్రికెట్‌పై ఉన్న అభిమానాన్ని కోహ్లీ మరోసారి చాటుకున్నాడు. క్రికెట్ అంటే తనకు చాలా ఇష్టం అని పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరే ముందు కోచ్ రవిశాస్త్రితో కలిసి మీడియాతో మాట్లాడిన కోహ్లీ, తనకు క్రికెట్‌పై ఉన్న ఇష్టాన్ని తెలిపాడు. క్రికెట్ అంటే తనకు రక్తంతో సమానం అన్నాడు. జీవితంలో చాలా విలువైన దాని కోసం కొన్ని రోజులు మాత్రమే క్రికెట్‌కు దూరంగా ఉన్నానని తెలిపిన కోహ్లీ, తిరిగి క్రికెట్ ఆడటానికి సన్నద్ధమవడం ఏమాత్రం కష్టం కాదన్నాడు. జట్టు ఆటగాళ్లు ఏఒక్కరికోసమో, విదేశాలకు వెళ్లడం లేదన్నాడు. తాము దేశం తరపున ఆడటానికి మాత్రమే వెళ్తున్నామని, ఆటలో గెలవడానికి వందశాతం కృషి చేస్తామని తెలిపాడు. కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ దక్షిణాఫ్రికాతో సిరీస్ అంటే ఒక ఛాలెంజ్ లాంటిదని, పర్యటనలో జట్టు మెత్తం రాణించాలని ఆకాంక్షించారు. -
దక్షిణాఫ్రికా పర్యటనపై ద్రవిడ్ ఏమన్నాడంటే.?
న్యూఢిల్లీ : శ్రీలంకతో సిరీస్, కోహ్లి పెళ్లి సందడి అయిపోయింది. ఇప్పుడంతా టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనపైనే చర్చ. ఈ పర్యటనపై పలువురు మాజీ క్రికెటర్లు ఇప్పటికే తమ అభిప్రాయం తెలియజేయగా.. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్, అండర్-19 కోచ్ రాహుల్ ద్రవిడ్ ఈ పర్యటనలో భారత్ గట్టిపొటీనిస్తుందని అభిప్రాయపడ్డారు. సిరీస్ గెలిచే అవకాశాలపై మాట్లాడుతూ.. సీనియర్ బ్యాట్స్‌మన్ సహాకారంతోనే ఇది సాధ్యమవుతుందన్నారు. ‘బ్యాటింగ్, బౌలింగ్‌లో సమతూకంగా ఉన్న భారత జట్టుకు విజయవకాశాలున్నాయి. జట్టులో మంచి ఆల్‌రౌండర్స్, స్పిన్నర్లు, పేస్ బౌలర్లున్నారు. దక్షిణాఫ్రికాకు తొలిసారేం వెళ్లడం లేదు. సీనియర్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, చతేశ్వర పుజారా, రోహిత్ శర్మలు ఇంతకు ముందు దక్షిణాఫ్రికాలో ఆడారు. అక్కడి పరిస్థితులు వారికి బాగా తెలుసు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకోని సన్నదమైతే విజయం సులవు.’ అని ద్రవిడ్ పేర్కొన్నారు. ప్రతీ క్రికెటర్‌కు ఓ సమయంలో లక్ కలుసోస్తుంది. అది విరాట్‌కు ఈ పర్యటనలో కలిసి రావచ్చని, కోహ్లిని ఎవరు ఆపలేరనే తాను నమ్ముతున్నట్లు ద్రవిడ్ చెప్పుకొచ్చారు. 2011లో 1-1 మినహా భారత్ ఇప్పటి వరకు దక్షిణాఫ్రికాలో టెస్ట్ సిరీస్ గెలవలేదు. వరుస విజయాలతో ఊపు మీదున్న కోహ్లి సేన సిరీస్ గెలిచి రికార్డు నమోదు చేస్తుందని అందరు భావిస్తున్నారు. -
బీసీసీఐపై భగ్గుమన్న కోహ్లి.. వరుస సిరీస్‌లపై ఆగ్రహం!
నాగ్‌పూర్: ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వకుండా వరుస క్రికెట్ సిరీస్‌లు నిర్వహిస్తున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తీరుపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వరుస సిరీస్‌లు నిర్వహించేటప్పడు ఆటగాళ్ల కోణంలో సైతం ఆలోచించాలని బీసీసీఐకి హితవు పలికారు. గత్యంతరం లేకనే వరుస సిరీస్‌లు ఆడాల్సి వస్తుందని బీసీసీఐకి ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీలంకతో రేపటి నుంచి నాగ్‌పూర్‌లో రెండో టెస్టు ప్రారంభం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ ముగిసిన వెంటనే టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లబోతోంది. ఈ నేపథ్యంలో గురువారం నాగ్‌పూర్‌లో కోహ్లి విలేకరులతో మాట్లాడారు. ‘ఈ సిరీస్ ముగిసిన అనంతరం దక్షిణాఫ్రికాకు వెళ్లేందుకు మాకు రెండు రోజుల సమయం మాత్రమే ఉన్నది. మాకు గేమ్‌లో ఉండటం తప్ప మరో గత్యంతరం లేదు. మాకు ఒక నెల గడువు దొరికినట్టయితే.. మేం సరిగ్గా ఈ పర్యటనకు సన్నద్ధమై ఉండేవాళ్లం. కానీ ఇప్పుడు మాకు ఇచ్చిన సమయంలోనే సన్నద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది’ అని కోహ్లి అసహనం వ్యక్తం చేశారు. ‘మేం సమయం కోసం అల్లాడిల్సిన పరిస్థితి నెలకొంది. సహజంగా విదేశీ పర్యటనలు అంటే జట్టు తగినంతగా సన్నద్ధం కావడానికి సమయం ఇస్తారు. కానీ ఇప్పుడు మాకు ప్రిపరేషన్ కోసం ఎన్ని రోజులు ఉన్నాయో తెలియని పరిస్థితి’ అని కోహ్లి అన్నారు. -
దక్షిణాఫ్రికా టూర్‌ను బహిష్కరించిన ఆసీస్ ‘ఎ’
సిడ్నీ: క్రికెట్ ఆస్ట్రేలియా, ఆ దేశ ఆటగాళ్లకు కొనసాగుతున్న జీతభత్యాల వివాదం మరింతగా ముదిరింది. సీఏ, ఆటగాళ్ల సంఘం (ఏసీఏ) మధ్య జరిగిన చర్చల్లో ఎలాంటి ఫలితం కానరాలేదు. దీంతో దక్షిణాఫ్రికా పర్యటనకు ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు దూరంగా ఉండనుందని ఏసీఏ ప్రకటించింది. అనధికారిక టెస్టులు, ముక్కోణపు వన్డే టోర్నీలో పాల్గొనేందుకు ఆసీస్ ‘ఎ’ జట్టు ఈనెల 12న సఫారీ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఉస్మాన్ ఖాజా కెప్టెన్‌గా ఉన్న ఈ జట్టులో మ్యాక్స్‌వెల్, బర్డ్‌లాంటి సీనియర్ టీమ్ ఆటగాళ్లు కూడా ఉన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే బంగ్లాదేశ్, భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌లకు సీనియర్ జట్టు వెళ్లేది కూడా అనుమానంగానే మారింది. -
అచ్చు ఇంటికి వచ్చినట్లే ఉంది: మోదీ
-
అచ్చు ఇంటికి వచ్చినట్లే ఉంది: మోదీ
దక్షిణాఫ్రికాకు వస్తే తనకు, తన బృందంలోని అధికారులకు అచ్చం ఇంటికి వచ్చినట్లుగానే ఉందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అందుకుగాను దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భారత్, దక్షిణాఫ్రికా దేశాలు రెండూ వలస పాలన, జాతివివక్షలపై పోరాటంలో ఒకే దారిలో ఉన్నాయని ఆయన అన్నారు. నాలుగు రోజుల ఆఫ్రికా దేశాల పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికా వెళ్లిన ప్రధాని.. అక్కడ అధ్యక్షుడు, ఇతర ఉన్నతాధికార బృందంతో సమావేశమయ్యారు. అనంతరం అధ్యక్షుడు జాకబ్ జుమాతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇరు దేశాలు చేసిన పోరాటం ఫలితంగా రెండు దేశాల మధ్య మంచి వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడిందన్నారు. దక్షిణాఫ్రికాలో మైనింగ్, రసాయనాలు, ఔషధ పరిశ్రమలలో వ్యాపార, పెట్టుబడుల బంధాలను మరింత విస్తరించడానికి అవకాశం ఉందని తెలిపారు. తాను దక్షిణాఫ్రికా రావడం వల్ల ఇద్దరు మహానుభావులు.. మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా నడిచిన భూమి మీద వారికి నివాళులు అర్పించే మహాభాగ్యం కలిగిందని మోదీ చెప్పారు. వృత్తివిద్యారంగంలో భారత దేశానికి ఉన్న సామర్థ్యం రెండు దేశాలకు ఉపయోగపడుతుందన్నారు. అంతర్జాతీయ సమస్యలపై రెండు దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని జాకబ్ జుమా, తాను అంగీకారానికి వచ్చామన్నారు. ఇక ఎన్ఎస్జీలో భారత సభ్యత్వం విషయంలో మద్దతు పలికినందుకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. దక్షిణాఫ్రికా లాంటి మిత్రదేశాల అండ తమకు ఎంతో అవసరమన్నారు. ఇక రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోడానికి, విస్తరించుకోడానికి తమ ఇరు దేశాలు అంగీకరించినట్లు జాకబ్ జుమా చెప్పారు. -
అర్ధరాత్రి అనుష్క ఇంట్లో విరాట్
కొత్త సంవత్సరం నచ్చినవాళ్లతో గడిపితే ఎంతో మజాగా ఉంటుంది. ఆ మజాని అనుభవించడానికేనేమో క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లి మంగళవారం అర్థరాత్రి అనుష్క శర్మ ఇంటికెళ్లిపోయారు. తమ మీటింగ్ గురించి మూడో కంటికి తెలియదని ఈ ఇద్దరూ అనుకున్నారు. కానీ, దక్షిణాఫ్రికాలో టెస్ట్ టూర్ ముగించుకుని, ముంబయ్ వచ్చినప్పట్నుంచీ విరాట్ ఏమేం చేశారో చాలామందికి తెలిసిపోయింది. నువ్వు గింజ నోట్లో నానదు కదా. అలా ఆ నోటా ఈ నోటా విరాట్, అనుష్కల వ్యవహారం బయటికొచ్చింది. ఆ వార్తల ప్రకారం... ముంబయ్ ఎయిర్‌పోర్ట్‌కి సమారు 11 గంటల ప్రాంతంలో విరాట్ చేరుకున్నారు. నేరుగా గ్రే కలర్ రేంజ్ రోవర్ దగ్గరకెళ్లి, తన లగేజ్ మొత్తం అందులో పెట్టేశారాయన. అది అనుష్క శర్మ కారు. కానీ, ఆ కారులో విరాట్ వెళ్లలేదు. ఆ పక్కనే ఓ ఆడి కారు ఉంది. అందులో ఎక్కడికో వెళ్లి, అర్ధరాత్రికి అనుష్క ఇంటికి చేరుకున్నారు. అనుష్క ఇంటి నుంచి ఆయన బయటికొచ్చినది బుధవారం మధ్యాహ్నం. ప్రస్తుతం ముంబయ్‌లో ఈ తతంగం గురించి చెప్పుకుని చాలామంది టైమ్‌పాస్ చేస్తున్నారు. ఇక విరాట్, అనుష్కల మధ్య పరిచయం ఎలా ఏర్పడింది? అనే విషయంలోకి వస్తే.. ఈ ఇద్దరూ కలిసి ఓ షాంపూ యాడ్‌లో యాక్ట్ చేశారు. ఆ ప్రకటనలో నటిస్తుండగా, ఇద్దరి మధ్యా ప్రేమ చిగురించిందని పరిశీలకులు అంటున్నారు. ఇద్దరూ లాంగ్ డ్రైవ్స్‌కి వెళ్లడం మాత్రమే కాదు.. ఓసారి విరాట్‌ని పబ్లిక్‌గా అనుష్క ముద్దాడిన విషయం కూడా హాట్ టాపిక్ అయ్యింది. మరి.. వీరి ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళుతుందో లేదో కాలమే చెప్పాలి. -
మళ్ళీ దెబ్బ పడింది
డర్బన్: దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. అన్ని రంగాల్లో విఫలమైన జట్టు వన్డే సిరీస్ కోల్పోయింది. ఆదివారం ఇక్కడి కింగ్స్‌మీడ్ మైదానంలో జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా 134 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తుగా ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 49 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 280 పరుగులు చేసింది. అనంతరం భారత్ 35.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. సఫారీ ఆటగాళ్లలో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ క్వాంటన్ డి కాక్ (118 బంతుల్లో 106; 9 ఫోర్లు) సిరీస్‌లో వరుసగా రెండో సెంచరీ చేయగా... హాషిం ఆమ్లా (117 బంతుల్లో 100; 8 ఫోర్లు) కూడా శతకంతో చెలరేగాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు ఏకంగా 194 పరుగులు జత చేసి తమ జట్టుకు అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. భారత బౌలర్లలో షమీ 3 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా తరఫున రైనా (50 బంతుల్లో 36; 3 ఫోర్లు)దే అత్యధిక స్కోరు. సోట్సోబ్ (4/25) జట్టును దెబ్బ తీశాడు. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌ను డివిలియర్స్ బృందం 2-0తో గెలుచుకుంది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే బుధవారం సెంచూరియన్‌లో జరుగుతుంది. మళ్లీ ఆ ఇద్దరే... అవుట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో ఆట గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది. దాంతో మ్యాచ్‌ను 49 ఓవర్లుగా కుదించారు. టాస్ గెలిచిన ధోని మరోసారి ఫీల్డింగ్ ఎంచుకున్నారు. భువనేశ్వర్, మోహిత్‌ల స్థానంలో ఇషాంత్, ఉమేశ్‌లకు అవకాశం ఇవ్వగా... అనారోగ్యంతో ఉన్న యువరాజ్ స్థానంలో రహానేకు చోటు దక్కింది. దక్షిణాఫ్రికా జట్టులో పార్నెల్ స్థానంలో ఫిలాండర్‌ను ఎంపిక చేశారు. ప్రొటీస్ ఓపెనర్లు డి కాక్, ఆమ్లా భారత్‌కు గత మ్యాచ్ ‘రీప్లే’ చూపించారు. అదే తరహాలో ఆరంభం నుంచి చక్కటి షాట్లతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఎలాంటి తొందరపాటు ప్రదర్శించకుండా సాధికారికంగా ఆడారు. చిన్న స్పెల్స్‌తో పదే పదే బౌలర్లను మార్చిన ధోని వ్యూహం పని చేయకపోగా... ఏ బౌలర్ కూడా ప్రభావం చూపించలేకపోయాడు. దాంతో ఇద్దరూ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకోవడంతో పాటు 18.3 ఓవర్లలో భాగస్వామ్యం వంద పరుగులు దాటింది. ఆ తర్వాత కూడా ఈ జోడి జోరు తగ్గలేదు. ఇషాంత్ బౌలింగ్‌లో సింగిల్ తీసి డి కాక్ 112 బంతుల్లో వరుసగా రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భాగస్వామ్యం 200 పరుగులకు చేరువైన తరుణంలో ఎట్టకేలకు భారత్‌కు తొలి వికెట్ దక్కింది. అశ్విన్ బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి డి కాక్ వెనుదిరిగాడు. గత మ్యాచ్ తరహాలోనే భారీ హిట్టింగ్ చేసే ప్రయత్నంలో మూడో స్థానంలో దిగిన డివిలియర్స్ (3) ఎత్తుగడ పని చేయలేదు. జడేజా చక్కటి బంతిని షాట్ ఆడలేక వెనుదిరిగాడు. కట్టడి చేసిన బౌలర్లు.... 194/1తో పటిష్టంగా కనిపించిన దక్షిణాఫ్రికా గత మ్యాచ్ తరహాలోనే 300కు పైగా పరుగుల భారీ స్కోరు చేసేట్లు కనిపించింది. అయితే భారత బౌలర్లు చక్కటి బౌలింగ్‌తో పరుగులు రాకుండా నిరోధించారు. ముఖ్యంగా జడేజా, షమీ కట్టడి చేశారు. 35 నుంచి 48 ఓవర్ల మధ్య ఆ జట్టు 66 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఓపిగ్గా ఆడిన ఆమ్లా కూడా కెరీర్లో 12వ సెంచరీని అందుకున్నాడు. ఆ వెంటనే ఒకే ఓవర్లో ఆమ్లా, మిల్లర్ (0)లను షమీ పెవిలియన్ పంపించాడు. డుమిని (29 బంతుల్లో 26; 2 ఫోర్లు) రనౌట్ కాగా, కలిస్ (10) మళ్లీ విఫలమయ్యాడు. ఉమేశ్ వేసిన చివరి ఓవర్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 20 పరుగులు వచ్చాయి. టప టపా... రోహిత్ శర్మ (26 బంతుల్లో 19; 2 ఫోర్లు) గత మ్యాచ్ తరహాలో కాకుండా ఈ సారి స్టెయిన్‌ను మెరుగ్గా ఎదుర్కొన్నాడు. అయితే మరోవైపు స్టెయిన్ బౌలింగ్‌లో తాను ఆడిన రెండో బంతికే షాట్ ఆడబోయి ధావన్ (0) వెనుదిరిగాడు. ఈ సారి సోట్సోబ్ వంతు. చక్కటి బంతితో కోహ్లి (0)ని వెనక్కి పంపిన అతను... మరో రెండు ఓవర్ల తర్వాత రోహిత్ శర్మను అవుట్ చేశాడు. షార్ట్ మిడ్ వికెట్లో ఆమ్లా అద్భుత క్యాచ్ పట్టడంతో రోహిత్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తర్వాత ఓవర్లో దురదృష్టవశాత్తూ రహానే (8) అవుటయ్యాడు. మోర్కెల్ బౌలింగ్‌లో దూరంగా వెళుతున్న బంతిని వేటాడగా, అది కీపర్ చేతిలో పడింది. రీప్లేలో బంతి, బ్యాట్‌కు తాకలేదని కనిపించింది. ఈ దశలో ధోని (31 బంతుల్లో 19), రైనా కలిసి కొద్ది సేపు నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. ఐదో వికెట్‌కు 40 పరుగులు జత చేసిన అనంతరం డి కాక్ అద్భుత క్యాచ్‌కు కెప్టెన్ నిష్ర్కమించాడు. ఆ వెంటనే రైనా కూడా పెవిలియన్ చేరాడు. జడేజా (34 బంతుల్లో 26; 1 ఫోర్, 1 సిక్స్) కొద్ది సేపు నిలబడ్డా లాభం లేకపోయింది. మరో 13.5 ఓవర్లు ఉండగానే ఇండియా ఇన్నింగ్స్ ముగియడం పరిస్థితిని సూచిస్తోంది. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డి కాక్ (సి) రోహిత్ (బి) అశ్విన్ 106; ఆమ్లా (సి) ధోని (బి) షమీ 100; డివిలియర్స్ (స్టంప్డ్) ధోని (బి) జడేజా 3; డుమిని (రనౌట్) 26; మిల్లర్ (ఎల్బీ) (బి) షమీ 0; కలిస్ (బి) షమీ 10; మెక్లారెన్ (నాటౌట్) 12; ఫిలాండర్ (నాటౌట్) 14; ఎక్స్‌ట్రాలు (బై 1, లెగ్‌బై 2, వైడ్ 6) 9; మొత్తం (49 ఓవర్లలో 6 వికెట్లకు) 280. వికెట్ల పతనం: 1-194; 2-199; 3-233; 4-234; 5-249; 6-255. బౌలింగ్: ఉమేశ్ యాదవ్ 6-0-45-0; షమీ 8-0-48-3; ఇషాంత్ 7-0-38-0; అశ్విన్ 9-0-48-1; రైనా 6-0-32-0; కోహ్లి 3-0-17-0; జడేజా 10-0-49-1. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) ఆమ్లా (బి) సోట్సోబ్ 19; ధావన్ (సి) డుమిని (బి) స్టెయిన్ 0; కోహ్లి (సి) డి కాక్ (బి) సోట్సోబ్ 0; రహానే (సి) డి కాక్ (బి) మోర్కెల్ 8; రైనా (సి) మిల్లర్ (బి) మోర్కెల్ 36; ధోని (సి) డి కాక్ (బి) ఫిలాండర్ 9; జడేజా (సి) డివిలియర్స్ (బి) సోట్సోబ్ 26 ; అశ్విన్ (సి) డి కాక్ (బి) స్టెయిన్ 15 ; షమీ (బి) సోట్సోబ్ 8 ; ఉమేశ్ యాదవ్ (బి) స్టెయిన్ 1 ; ఇషాంత్ (నాటౌట్) 0 ; ఎక్స్‌ట్రాలు (బై 4, లెగ్‌బై 1, వైడ్ 8, నోబాల్ 1) 14 ; మొత్తం (35.1 ఓవర్లలో ఆలౌట్) 146. వికెట్ల పతనం: 1-10; 2-16; 3-29; 4-34 ; 5-74 ; 6-95 ; 7-133 ; 8-145 ; 9-146 ; 10-146. బౌలింగ్: స్టెయిన్ 7-1-17-3; సోట్సోబ్ 7.1-0-25-4; మోర్కెల్ 6-0-34-2; ఫిలాండర్ 6-1-20-1 ; డుమిని 5-0-20-0 ; మెక్లారెన్ 4-0-25-0. -
షెడ్యూల్‌ను గౌరవించాలి: ధోని
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా పర్యటనలో ఎన్ని మ్యాచ్‌లు ఆడుతున్నామనేది ముఖ్యం కాదని, ఎన్ని మ్యాచ్‌లు ఆడినా నాణ్యత ముఖ్యమని భారత కెప్టెన్ ధోని అన్నాడు. సోమవారం దక్షిణాఫ్రికా చేరగానే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్థానిక మీడియా ఎక్కువగా షెడ్యూల్ గురించే ప్రశ్నించింది. దక్షిణాఫ్రికా బోర్డుతో బీసీసీఐ విభేదాల వల్ల మ్యాచ్‌ల సంఖ్య తగ్గడం గురించి గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడిగారు. దీనికి ధోని కూడా తెలివిగా సమాధానం చెప్పాడు. ‘బోర్డు పరిపాలకుల మధ్య మ్యాచ్‌లు ఏర్పాటు చేసి ఆడుకోమని చెబితే సరిపోతుంది (నవ్వుతూ). షెడ్యూల్ ఎలా ఉందనేది ముఖ్యం కాదు. మేం ఏడాదంతా విరామం లేకుండా ఎక్కడో చోట క్రికెట్ ఆడుతూనే ఉన్నాం. మ్యాచ్‌ల సంఖ్య కంటే మ్యాచ్‌ల నాణ్యత ముఖ్యం’ అని ధోని చెప్పాడు. బోర్డు పెద్దల మధ్య విభేదాల సంగతి తమకు తెలియదని, రెండు దేశాల క్రికెటర్ల మధ్య మాత్రం మంచి స్నేహం ఉందని చెప్పాడు. ‘ఐపీఎల్లో మేమంతా కలిసి ఆడుతున్నాం. ఇరు దేశాల క్రికెటర్లు మంచి స్నేహితులు’ అని చెప్పారు. ఎవరైనా ప్రేక్షకులు మీపై ఏదైనా వస్తువు విసిరితే ఏం చేస్తారని ప్రశ్నించగా... ‘ఏం చేస్తాం... తిరిగి ఇచ్చేస్తాం’ అని నవ్వుతూ అన్నాడు. ఇలాంటి విషయాలను చూసుకోవడానికి భద్రతా సిబ్బంది ఉంటారని ధోని బదులిచ్చాడు. -
‘రికార్డు’ ఊరిస్తోంది!
సాక్షి క్రీడావిభాగం: ఆధునిక క్రికెట్లో ఆస్ట్రేలియాలా హవా కొనసాగించిన జట్టు మరొకటి లేదు. దాదాపు దశాబ్ద కాలం పాటు రికార్డులన్నింటినీ అధిగమించిన ఆస్ట్రేలియా... ఆ తర్వాత సాధారణ జట్టుగా మారిపోయింది. ప్రతి జట్టుకూ ఓ సీజన్ ఉంటుంది. ప్రస్తుతం భారత వన్డే జట్టుకు కూడా అలాంటి సీజనే నడుస్తోంది. వరుసగా ఆరు సిరీస్‌లు గెలచుకున్న ధోనిసేన... గతంలో ఏ భారత జట్టూ సాధించని ఘనతపై కన్నేసింది. ప్రపంచ క్రికెట్లో వరుసగా ఆరు సిరీస్‌లు గెలిచిన జట్లు అనేకం ఉన్నాయి. 2008-09 సీజన్లో కూడా భారత్ ఆరు సిరీస్‌లు గెలిచింది. ఇప్పుడు ఆ రికార్డును అధిగమించేందుకు ధోనిసేనకు మంచి అవకాశం దొరికింది. గెలవగలమా? నిజానికి దక్షిణాఫ్రికాను అభేద్యమైన జట్టని చెప్పలేం. ముఖ్యంగా వన్డేల్లో ఇటీవల స్వదేశంలో ఆ జట్టు పాకిస్థాన్ చేతిలో సిరీస్ కోల్పోయింది. మూడు వన్డేల సిరీస్‌ను మిస్బాసేన 2-1తో గెలిచింది. సఫారీలు గెలిచిన చివరి వన్డేలోనూ కష్టపడ్డారు. కాబట్టి దక్షిణాఫ్రికా ఫామ్ లేమి ధోనిసేనలో ఆత్మవిశ్వాసం పెంచే అవకాశం ఉంది. పైగా గత కొంత కాలంగా భారత వన్డే జట్టు తిరుగు లేకుండా కనిపిస్తోంది. స్వదేశంలో విజయాల సంగతి పక్కన పెట్టినా...ఇంగ్లండ్‌లో చాంపియన్స్ ట్రోఫీలో సాధించిన విజయం భారత్ సత్తా ఏపాటిదో చూపిస్తోంది. ఆ టోర్నీలో ప్రతీ జట్టు ఏదో ఒక దశలో కొంత ఇబ్బంది పడ్డట్లు కనిపించినా...మన టీమ్ మాత్రం అజేయంగా దూసుకుపోయింది. ప్రస్తుత ఆటగాళ్లు కూడా ఫామ్‌లో ఉండటంతో ఏ సవాల్‌కైనా సిద్ధమే అనే పట్టుదల అందరిలోనూ కనిపిస్తోంది. బౌలింగ్ ఓకేనా! ఇటీవల ఆస్ట్రేలియా సిరీస్‌లో భారత బౌలర్ల ప్రదర్శన చూస్తే ఒక రకమైన జాలి కలిగింది. పిచ్‌లు, నిబంధనల కారణంగా అంతా బ్యాట్స్మెన్మయంగా మారిపోయిన ఆటలో తమ సహజ ప్రతిభను కూడా ప్రదర్శించే అవకాశం వారికి దక్కలేదు. అయితే దక్షిణాఫ్రికాలో అలా ఉండే అవకాశం లేదు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ వికెట్లు దాదాపుగా ఒకేలా ఉంటాయి. మన పేసర్లు కూడా చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టి పడేయగల సమర్థులు. చాంపియన్స్ ట్రోఫీలో భువనేశ్వర్ కుమార్ ప్రదర్శన ఈ సిరీస్‌లో ఆశలు పెంచుతోంది. ఇటీవలి ప్రదర్శనను కాస్త పక్కన పెడితే...వికెట్‌పై బౌన్స్‌ను సమర్థంగా ఉపయోగించుకోవడంలో ఇషాంత్, ఉమేశ్ సమర్థులు. ప్రత్యామ్నాయంగా షమీ కూడా స్వింగ్ బౌలర్‌గా రాణించగలడు. ‘మేం పూర్తిగా బౌన్సీ, బౌలింగ్‌కు అనుకూలమైన వికెట్లు తయారు చేస్తే అది మాకూ వ్యతిరేకంగా పరిణమించే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆ పరిస్థితులను భారత బౌలర్లు కూడా బాగా ఉపయోగించుకోగలరు’ అని దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ డేల్ స్టెయిన చేసిన హెచ్చరిక మన జట్టు బౌలింగ్ బలం గురించి కూడా అన్యాపదేశంగా చెబుతోంది. 2002-04 సీజన్లలో కలిపి ఆస్ట్రేలియా వరుసగా పది సిరీస్ విజయాలు సాధించింది. అలాగే 2009-10లో కూడా వరుసగా 9 సిరీస్‌లలో గెలిచింది. వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఇంగ్లండ్ కూడా వరుసగా ఆరు సిరీస్‌లు గెలిచాయి. ఉపఖండంలా స్కోర్లు ఉండవు! వన్డేల్లో నిబంధనల మార్పుతో సొంతగడ్డపై బౌలర్లను చితక్కొట్టి ఇటీవల భారత్ పరుగుల ప్రవాహం పారించింది. మన బ్యాట్స్‌మెన్ కారణంగానే వరుసగా సిరీస్‌లు గెలిచాం. అయితే ఇక్కడి తరహాలో దక్షిణాఫ్రికాలో భారీ స్కోర్లకు పెద్దగా అవకాశం లేదు. గత రికార్డులు కూడా ఇదే చెబుతున్నాయి. దక్షిణాఫ్రికాపై ఆ దేశంలో భారత్ అత్యధిక స్కోరు 50 ఓవర్లలో 279/5 (2001లో) మాత్రమే. ఇటీవల సఫారీలతో జరిగిన పాక్ సిరీస్‌లో కూడా ఇదే కనిపించింది. కాబట్టి 260-275 పరుగులు సాధిస్తే దానిని మెరుగైన స్కోరుగానే చెప్పవచ్చు. ఇక్కడి తరహాలో ఆటగాళ్లు ఏకధాటిగా దూకుడుకు పోకుండా నిలకడగా ఇన్నింగ్స్‌ను నిర్మించాల్సి ఉంటుంది. మన మిడిలార్డర్ సత్తా బయట పడేది ఇక్కడే. సెంచరీల హోరుకు అవకాశం తక్కువగా ఉండే చోట...జట్టులో కనీసం ఇద్దరు బ్యాట్స్‌మెన్ చక్కటి ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది. -
పుజారా డబుల్ సెంచరీ
చెన్నై: దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా తన సూపర్ ఫామ్‌ను చాటుకున్నాడు. రంజీ ట్రోఫీ గ్రూప్-సి మ్యాచ్‌లో సౌరాష్ట్ర తరఫున బరిలోకి దిగిన పుజారా తమిళనాడుపై డబుల్ సెంచరీ (461 బంతుల్లో 269; 33 ఫోర్లు)తో చెలరేగాడు. ఫలితంగా రెండో ఇన్నింగ్స్‌లో 161.4 ఓవర్లలో ఆరు వికెట్లకు సౌరాష్ట్ర 581 పరుగుల భారీ స్కోరును సాధించింది. జయదేవ్ షా (296 బంతుల్లో 195; 17 ఫోర్లు) కొద్దిలో ‘డబుల్’ను కోల్పోయాడు. తమిళనాడు తమ తొలి ఇన్నింగ్స్‌లో 565/8 స్కోరు సాధించడంతో 16 పరుగుల ఆధిక్యం సాధించిన సౌరాష్ట్రకు మూడు పాయింట్లు దక్కాయి. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు: త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో గోవా 49 పరుగుల తేడాతో నెగ్గింది. జార్ఖండ్, గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. విదర్భతో జరిగిన మ్యాచ్‌లో ముంబై 338 పరుగుల భారీ విజయం సాధించింది. ఒడిశాతో జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక నాలుగు వికెట్ల తేడాతో నెగ్గింది. బెంగాల్, సర్వీసెస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రా అయ్యింది. -
ఈ ‘వేగం’ సరిపోతుందా!
ఒక్క మ్యాచ్‌లో 20 వికెట్లు తీయగల బౌలర్లు ఉంటేనే టెస్టు గెలవగలం. ఏ దేశంలో, ఏ పరిస్థితుల్లో అయినా అన్ని జట్లు చూసేది ఇదే. స్వదేశంలో టెస్టుల్లో స్పిన్నర్లు చకచకా వికెట్లు తీస్తారు... కాబట్టి భారత్ స్వదేశంలో టెస్టుల్లో దూసుకుపోతోంది. మరి దక్షిణాఫ్రికాలో పరిస్థితి ఏమిటి? పేసర్లకు స్వర్గధామంలాంటి పిచ్‌లపై టెస్టులో 20 వికెట్లు తీయగల సత్తా భారత సీమర్లకు ఉందా? సాక్షి క్రీడావిభాగం దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ ఆడబోతోంది కేవలం రెండు టెస్టులు మాత్రమే. కానీ ఈ పర్యటనకు కావలసినంత ప్రచారం వచ్చేసింది. ర్యాంకుల్లో మొదటి రెండు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య పోరాటం కావడం ఒక కారణమైతే... సీనియర్లంతా వైదొలిగిన తర్వాత భారత జట్టుకు ఇది మొదటి పర్యటన. దీంతో భారత జట్టు భవిష్యత్ ఎలా ఉండబోతోందనే అంశం ఈ పర్యటన ద్వారా తేలుతుందనేది ఆసక్తికర అంశం. బ్యాటింగ్‌లో అనుభవం లేకపోయినా రోహిత్, విరాట్ కోహ్లి, శిఖర్ ధావన్, ధోని, పుజారాల రూపంలో అందరూ ఫామ్‌లో ఉన్న క్రికెటర్లు ఉన్నారు. ముఖ్యంగా పుజారా, రోహిత్ సాంకేతికంగా ఉన్నతంగా ఆడుతున్నారు. కాబట్టి ఈ విభాగం నుంచి పెద్దగా ఆందోళన లేదు. కానీ అసలు సిసలు పరీక్ష బౌలింగ్. ముఖ్యంగా పేస్ బౌలర్లు ఏం చేస్తారనేది చూడాలి. స్పిన్నర్‌కు అవకాశం ఉందా? విదేశాల్లో టెస్టుల్లో సాధారణంగా భారత్ ముగ్గురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగుతుంది. ఈసారి కూడా ఇదే వ్యూహాన్ని అవలంబించే అవకాశం ఉంది. అయితే పేస్‌కు సహకరించే పిచ్‌పై నలుగురు పేసర్లతో ఎందుకు ఆడకూడదు? అనేది ఓ ఆలోచన. ఆల్‌రౌండర్ రూపంలో జడేజాను జట్టులోకి తీసుకుంటే నలుగురు పేసర్లతో ఆడటానికి అవకాశం ఉంటుంది. కానీ ఓవర్‌రేట్ సమస్యగా మారుతుంది. అశ్విన్‌ను ఆపి నలుగురు పేసర్లతో ధోని బరిలోకి దిగుతాడా అనేది సందేహమే. జహీర్, షమీ, భువనేశ్వర్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్‌ల రూపంలో జట్టులో ఐదుగురు పేసర్లు ఉన్నారు. ఇందులో జహీర్, షమీ తుది జట్టులో ఉండటం ఖాయం. మూడో పేసర్ స్థానం కోసం భువనేశ్వర్, ఉమేశ్ యాదవ్‌ల మధ్య పోటీ ఉండొచ్చు. కొత్త బంతితో అద్భుతాలు చేయగలగడం భువనేశ్వర్ బలం. కానీ బంతి పాతబడ్డాక భువీ నుంచి పెద్దగా ఏమీ ఆశించలేం. కాబట్టి కొత్త బంతితో వికెట్లు తీయడం కోసమే భువనేశ్వర్‌ను తీసుకుంటారా అనేది ఆలోచించాలి. ఉపఖండంలో ఓ 15-20 ఓవర్ల తర్వాత పేసర్‌తో పనిలేదు కాబట్టి... భువీ స్థానం పదిలమే. కానీ దక్షిణాఫ్రికాలో ఇది సరిపోతుందా అనేది సందేహమే. ఉమేశ్ నిలకడగా 140-150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగలడు. కాబట్టి పేస్ కోసం ఉమేశ్ వైపు మొగ్గొచ్చు. ఒకవేళ నలుగురు పేసర్లతో ఆడితే ఈ ఇద్దరూ తుది జట్టులో ఉండొచ్చు. రివర్స్ రాబడతారా? ప్రస్తుత సిరీస్‌లో జహీర్‌ఖాన్ మీద ఆశలు భారీగా ఉన్నాయి. జట్టులోకి ఏడాది తర్వాత వచ్చినా ఈ ఎడంచేతి సీమర్ బౌలింగ్ విభాగానికి కెప్టెన్ అనే అనుకోవాలి. ఇప్పటివరకూ దక్షిణాఫ్రికాలో జహీర్ 12 ఇన్నింగ్స్‌ల్లో 23 వికెట్లు తీశాడు. జహీర్ టెస్టు ఆడి ఏడాది గడిచింది. కానీ ఈ సీజన్ రంజీల్లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. మొత్తానికి జహీర్ ఆత్మవిశ్వాసంతోనే ఉన్నాడు. జహీర్ ఖాన్ బలం రివర్స్ స్వింగ్. ఉపఖండంలో పిచ్‌లపై కూడా రివర్స్ స్వింగ్‌తో వికెట్లు తీయగలడు. తాజాగా షమీ కూడా రివర్స్ స్వింగ్ అంశంలో మెరుగ్గా కనిపిస్తున్నాడు. జహీర్, షమీ ద్వయం పాత బంతితో ఏం చేయగలదనే అంశం కూడా భారత ప్రణాళికల్లో కీలకం. అందరికీ కీలకమే ఈ పర్యటన భారత పేసర్లందరికీ కీలకమే. బీసీసీఐ కాంట్రాక్టు కూడా కోల్పోయి... ఇక జట్టులోకి రావడం కష్టమే అనుకున్న స్థితిలో జహీర్‌కు అనుకోకుండా దక్షిణాఫ్రికా పర్యటన అవకాశం లభించింది. దీనిని ఉపయోగించుకుని మళ్లీ జట్టులో కుదురుకోవాలి. జహీర్ నిలకడగా రాణిస్తేనే భారత్‌కు విజయావకాశాలు ఉంటాయనడంలో సందేహం లేదు. ఒకవేళ ఫామ్ పరంగా తాను ఇబ్బందిపడ్డా... తన అనుభవంతో యువ పేసర్లను నడిపించాల్సిన బాధ్యత ఈ స్టార్ పేసర్‌ది. కాబట్టి ఈ పర్యటనలో జహీర్ అందరికంటే కీలకం. ఇక భువనేశ్వర్, షమీ స్వదేశంలో టెస్టుల్లో రాణించారు. విదేశాల్లో అది కూడా దక్షిణాఫ్రికాలాంటి పేస్ బౌలింగ్ పిచ్‌లపై ఇదే ఆత్మవిశ్వాసాన్ని కొనసాగించాలి. ఈ పర్యటనలో రాణిస్తే ఇక టెస్టుల్లో స్థానాలు పదిలంగా మారతాయి. కాబట్టి ఈ యువ ద్వయానికి ఇది అద్భుతమైన అవకాశం. మరోవైపు ఉమేశ్ యాదవ్, ఇషాంత్‌లకు ఇది చావోరేవో తేల్చుకోవాల్సిన పర్యటన. రెండు టెస్టుల సిరీస్ కాబట్టి వీరికి అవకాశాలు ఏ మేరకు దొరుకుతాయనేది చెప్పలేం. ఒకవేళ అవకాశం దొరికితే... దానిని వినియోగించుకోవడంలో విఫలమయ్యారంటే మాత్రం... ఇక అంతర్జాతీయ క్రికెట్ నుంచి తాత్కాలికంగా కనుమరుగైనా ఆశ్చర్యపోవాల్సిందేం లేదు. ‘జహీర్ దక్షిణాఫ్రికా పర్యటనలో చాలా కీలకం. అక్కడ ఆడిన అనుభవం ద్వారా జహీర్... షమీ, భువనేశ్వర్‌లాంటి కుర్రాళ్లకు ఉపయోగపడతాడు. ఒక్కసారి కుదురుకున్నాడంటే జహీర్ వరుసగా వికెట్లు తీయగల సత్తా ఉన్న బౌలర్.’ -సునీల్ గవాస్కర్ టెస్టు ఆటగాళ్లను ముందే పంపిద్దాం! ముంబై: దక్షిణాఫ్రికాలో వాతావరణ పరిస్థితులకు అలవాటు పడేందుకు వీలుగా కొంత మంది స్పెషలిస్ట్ టెస్టు ఆటగాళ్లను ముందే అక్కడికి పంపించాలని బీసీసీఐ భావిస్తోంది. జహీర్‌ఖాన్‌ను వన్డే జట్టుతో పాటే పంపాలని కెప్టెన్ కోరడంతో... ఈ సీనియర్ పేసర్ ఇప్పటికే ప్రయాణ సన్నాహకాలు చేసుకున్నాడు. ‘జహీర్ ఖాన్‌ను ఒక్కడినే కాకుండా మిగతా వారిని కూడా వీలైనంత ముందే పంపించాలని భావిస్తున్నాం. అయితే అక్కడ హోటల్ రూమ్‌లు అందుబాటులో ఉండటంపై ఇది ఆధారపడి ఉంటుంది’ అని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ అన్నారు. పేసర్ జహీర్ ఖాన్, చతేశ్వర్ పుజారా, మురళీ విజయ్, వృద్ధిమాన్ సాహా, స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజాలకు కేవలం టెస్టు జట్టులో మాత్రమే చోటు దక్కింది. డిసెంబర్ 5 నుంచి జరగబోయే వన్డే సిరీస్ కోసం భారత జట్టు ఆదివారం రాత్రి దక్షిణాఫ్రికాకు బయదేరుతుంది. -
‘సాఫారీ’ సులువు కాదు!
మందకొడి పిచ్‌లు, టన్నుల కొద్దీ పరుగులు, పేరుకే తప్ప వేగం లేని ఫాస్ట్ బౌలింగ్... గత కొద్ది రోజులుగా భారత జట్టు ఆడిందే ఆటగా సాగింది. ఇకపై బౌన్సీ పిచ్‌లు, హడలెత్తించే పేస్, ప్రతీ బంతికి పోరాటం... రాబోయే రోజుల్లో టీమిండియాకు ఇలాంటి సవాళ్లు ఎదురు కానున్నాయి. పలు వివాదాలు, హెచ్చరికలు, షరతుల నడుమ ఎట్టకేలకు కుదించిన దక్షిణాఫ్రికా పర్యటనకు భారత్ సిద్ధమైంది. సఫారీ గడ్డపై టెస్టుల్లో భారత్ గత రికార్డు అంతంత మాత్రంగానే ఉంది. మొత్తం ఐదుసార్లు అక్కడ పర్యటిస్తే మొదటి మూడుసార్లు రిక్తహస్తాలతోనే జట్టు వెనుదిరిగింది. అయితే భారత క్రికెట్ జట్టు ఉచ్ఛ దశలో నిలిచిన సమయంలో గత రెండు పర్యటనల్లో మాత్రం ఒక్కో విజయాన్ని నమోదు చేసింది. ఈసారి రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడుతున్న మన టీమ్ అంతకంటే మెరుగైన ప్రదర్శన ఇవ్వగలదా చూడాలి. సచిన్ లేకుండా మన జట్టు తొలిసారి పర్యటిస్తుండటం విశేషం. ఓవరాల్‌గా దక్షిణాఫ్రికాలో భారత్ 15 టెస్టులు ఆడింది. 2 టెస్టుల్లో గెలిచింది. 7 మ్యాచ్‌ల్లో ఓడింది. మిగతా 6 మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. తాజా సిరీస్ నేపథ్యంలో గత టెస్టు సిరీస్ రికార్డులను ఒక్కసారిగా గుర్తు చేసుకుంటే... - సాక్షి క్రీడా విభాగం 2001 (2 టెస్టులు, 1 అనధికారిక టెస్టు) కెప్టెన్లు: గంగూలీ, పొలాక్ ఫలితం: 0-1తో భారత్ ఓటమి మ్యాన్ ఆఫ్ ది సిరీస్: గిబ్స్ విశేషాలు: సచిన్, తన కెరీర్ తొలి టెస్టులోనే వీరేంద్ర సెహ్వాగ్ సెంచరీలు చేసినా బ్లూమ్ఫౌంటీన్లో జరిగిన తొలి టెస్టులో భారత్ 9 వికెట్లతో ఓడింది. రెండో టెస్టు సాధారణ డ్రాగా ముగిసింది. అయితే ఈ టెస్టులో బాల్ టాంపరింగ్ వివాదం చెలరేగింది. ఆరుగురు భారత ఆటగాళ్లు టాంపరింగ్‌కు పాల్పడ్డారంటూ మైక్ డెన్నిస్ నిషేధం విధించడం సంచలనం రేపింది. దాంతో మూడో టెస్టు జరిగినా... అనంతరం ఐసీసీ దానిని రద్దు చేస్తూ అనధికారిక టెస్టుగా గుర్తింపు ఇచ్చింది. సెంచూరియన్‌లో జరిగిన ఈ మూడో టెస్టులోనూ భారత్ ఇన్నింగ్స్ 73 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 2006-07 (3 టెస్టులు) కెప్టెన్లు: ద్రవిడ్, స్మిత్ ఫలితం: 1-2 తో భారత్ ఓటమి మ్యాన్ ఆఫ్ ది సిరీస్: పొలాక్ విశేషాలు: ఎట్టకేలకు దక్షిణాఫ్రికా గడ్డపై భారత్‌కు తొలి విజయం అందించిన సిరీస్ ఇది. మొదటి టెస్టులో భారత్ 123 పరుగులతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. శ్రీశాంత్ (8/99) అద్భుత బౌలింగ్ టీమిండియాకు విజయాన్ని అందించింది. అయితే అదే జోరును కొనసాగించలేకపోయిన ద్రవిడ్ సేన తర్వాతి రెండు టెస్టుల్లో పరాజయం పాలైంది. డర్బన్‌లో ఎన్తిని (8/89) దెబ్బకు టీమిండియా 174 పరుగులతో ఓడగా... కేప్‌టౌన్‌లో 5 వికెట్ల తేడాతో తలవంచింది. 2010-11 (3 టెస్టులు) కెప్టెన్లు: ధోని, స్మిత్ ఫలితం: 1-1తో డ్రా మ్యాన్ ఆఫ్ ది సిరీస్: జాక్ కలిస్ విశేషాలు: గత పర్యటన ప్రదర్శనతో పోలిస్తే టీమిండియా ఈసారి మరింత మెరుగైంది. నాలుగు సార్లు సిరీస్‌లను కోల్పోయిన జట్టు మొదటి సారి డ్రాతో ముగించగలిగింది. సచిన్ 50వ సెంచరీ చేసినా... కలిస్ (201 నాటౌట్) ప్రదర్శనతో తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్, 25 పరుగులతో ఓడింది. అయితే రెండో టెస్టులో అద్భుత విజయంతో కోలుకుంది. లక్ష్మణ్ (38, 96) ఆటతో 87 పరుగుల తేడాతో ఇండియా మ్యాచ్ నెగ్గింది. మూడో టెస్టులో ఇరు జట్లు సమ ఉజ్జీలుగా పోరాడటంతో ఫలితం తేలలేదు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో స్టెయిన్ విధ్వంసకర స్పెల్‌ను ఎదుర్కొని సచిన్ (146) చేసిన సెంచరీ చిరస్మరణీయం. 1992-93 (4 టెస్టులు) కెప్టెన్లు: అజహరుద్దీన్, వెసెల్స్ ఫలితం: 0-1తో భారత్ ఓటమి మ్యాన్ ఆఫ్ ది సిరీస్: డొనాల్డ్ విశేషాలు: క్రికెట్ ప్రపంచంలో దక్షిణాఫ్రికా పునరాగమనం చేసిన తర్వాత సొంతగడ్డపై జరిగిన తొలి టెస్టు సిరీస్ ఇది. దాంతో అనేక వ్యక్తిగత మైలురాళ్లకు సిరీస్ వేదికగా నిలిచింది. పోర్ట్ ఎలిజబెత్‌లో జరిగిన మూడో టెస్టు మినహా భారత్ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చడంతో మూడు టెస్టులు డ్రాగా ముగిశాయి. మూడో టెస్టులో దక్షిణాఫ్రికా 9 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. డొనాల్డ్ (12/139) చెలరేగి జట్టును గెలిపించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 27/5 ఉన్న దశలో బరిలోకి దిగి కపిల్‌దేవ్ (129) చేసిన వీరోచిత సెంచరీ భారత్‌ను కాపాడలేకపోయింది. 1996-97 (3 టెస్టులు) కెప్టెన్లు: సచిన్, క్రానే ఫలితం: 0-2తో భారత్ ఓటమి మ్యాన్ ఆఫ్ ది సిరీస్: డొనాల్డ్ విశేషాలు: దక్షిణాఫ్రికా వికెట్ల స్వభావం ఏమిటో భారత్‌కు రుచి చూపించిన సిరీస్ ఇది. గతంలో ఎన్నడూ ఆడని అత్యంత వేగవంతమైన, బౌన్సీ డర్బన్ పిచ్‌పై తొలి టెస్టులో 100... 66 పరుగులకే కుప్పకూలి భారత్ 328 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. రెండో టెస్టులోనూ ఫలితం మారలేదు. తొలి ఇన్నింగ్స్‌లో సచిన్ (169), అజహర్ (115) సెంచరీలు చేసినా జట్టు 282 పరుగులతో పరాజయం పాలైంది. జొహన్నెస్‌బర్గ్ లో మూడో టెస్టులో భారత్ విజయానికి చేరువగా వచ్చినా... వర్షంతో అంతరాయం కలగడంతో దక్షిణాఫ్రికా బయట పడింది. ద్రవిడ్ (148, 81) ఆకట్టుకున్నాడు. వన్డేలూ అంతే... మరోవైపు వన్డేల్లో దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ 3 ద్వైపాక్షిక సిరీస్‌లలో తలపడింది. 1992లో 2-5తో, 2006లో 0-4తో, 2010లో 2-3 తేడాతో ఓడింది. ఇతర జట్లు పాల్గొన్న రెండు టోర్నీలలో దక్షిణాఫ్రికాపై ఒక మ్యాచ్ మాత్రమే నెగ్గి 7 సార్లు పరాజయం పాలైంది.