అర్ధరాత్రి అనుష్క ఇంట్లో విరాట్
అర్ధరాత్రి అనుష్క ఇంట్లో విరాట్
Published Fri, Jan 3 2014 1:48 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM
కొత్త సంవత్సరం నచ్చినవాళ్లతో గడిపితే ఎంతో మజాగా ఉంటుంది. ఆ మజాని అనుభవించడానికేనేమో క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లి మంగళవారం అర్థరాత్రి అనుష్క శర్మ ఇంటికెళ్లిపోయారు. తమ మీటింగ్ గురించి మూడో కంటికి తెలియదని ఈ ఇద్దరూ అనుకున్నారు. కానీ, దక్షిణాఫ్రికాలో టెస్ట్ టూర్ ముగించుకుని, ముంబయ్ వచ్చినప్పట్నుంచీ విరాట్ ఏమేం చేశారో చాలామందికి తెలిసిపోయింది. నువ్వు గింజ నోట్లో నానదు కదా. అలా ఆ నోటా ఈ నోటా విరాట్, అనుష్కల వ్యవహారం బయటికొచ్చింది. ఆ వార్తల ప్రకారం... ముంబయ్ ఎయిర్‌పోర్ట్‌కి సమారు 11 గంటల ప్రాంతంలో విరాట్ చేరుకున్నారు. నేరుగా గ్రే కలర్ రేంజ్ రోవర్ దగ్గరకెళ్లి, తన లగేజ్ మొత్తం అందులో పెట్టేశారాయన. అది అనుష్క శర్మ కారు. కానీ, ఆ కారులో విరాట్ వెళ్లలేదు. ఆ పక్కనే ఓ ఆడి కారు ఉంది.
అందులో ఎక్కడికో వెళ్లి, అర్ధరాత్రికి అనుష్క ఇంటికి చేరుకున్నారు. అనుష్క ఇంటి నుంచి ఆయన బయటికొచ్చినది బుధవారం మధ్యాహ్నం. ప్రస్తుతం ముంబయ్‌లో ఈ తతంగం గురించి చెప్పుకుని చాలామంది టైమ్‌పాస్ చేస్తున్నారు. ఇక విరాట్, అనుష్కల మధ్య పరిచయం ఎలా ఏర్పడింది? అనే విషయంలోకి వస్తే.. ఈ ఇద్దరూ కలిసి ఓ షాంపూ యాడ్‌లో యాక్ట్ చేశారు. ఆ ప్రకటనలో నటిస్తుండగా, ఇద్దరి మధ్యా ప్రేమ చిగురించిందని పరిశీలకులు అంటున్నారు. ఇద్దరూ లాంగ్ డ్రైవ్స్‌కి వెళ్లడం మాత్రమే కాదు.. ఓసారి విరాట్‌ని పబ్లిక్‌గా అనుష్క ముద్దాడిన విషయం కూడా హాట్ టాపిక్ అయ్యింది. మరి.. వీరి ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళుతుందో లేదో కాలమే చెప్పాలి.
Advertisement
Advertisement