ముంబై: భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనపై కొనసాగుతున్న సందిగ్ధతను తొలగించేందుకు ఇరు జట్ల బోర్డు అధ్యక్షులు నేడు (శనివారం) సమావేశం కానున్నారు. బీసీసీఐని సంప్రదించకుండానే గతంలో దక్షిణాఫ్రికా క్రికెట్ (సీఎస్‌ఏ) షెడ్యూల్‌ను ప్రకటించడంతో వివాదం ప్రారంభమైంది.
వచ్చే నెల నుంచి జనవరి 15 వరకు జరగాల్సిన ఈ పర్యటనపై బోర్డు ఇప్పటిదాకా సానుకూలంగా స్పందించలేదు. మరోవైపు నవంబర్ 27 నుంచి వెస్టిండీస్‌తో స్వదేశంలో సిరీస్ ఆడనుండగా జనవరి 19 నుంచి న్యూజిలాండ్ పర్యటనను ఖరారు చేసుకుంది. దీంతో మ్యాచ్‌లను కుదించి దక్షిణాఫ్రికాతో క్రికెట్ సిరీస్ కొనసాగించాల్సి ఉంది. ఇదే విషయమై సీఎస్‌ఏ అధ్యక్షుడు క్రిస్ నెన్‌జాని, ఎన్.శ్రీనివాసన్ చర్చలు జరిపి ఓ నిర్ణయం తీసుకోనున్నారు.
నేడు సీఎస్‌ఏ అధ్యక్షుడితో శ్రీనివాసన్ భేటీ
Published Sat, Oct 12 2013 1:43 AM | Last Updated on Fri, Sep 1 2017 11:34 PM
Advertisement
Advertisement