south africa cricket
-
దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్‌గా ఏబీ డివిలియర్స్..!?
దక్షిణాఫ్రికా పురుషుల క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్ పదవి నుంచి ఆ దేశ మాజీ క్రికెటర్ జేపీ డుమిని తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాల వ్యక్తిగత కారణాల రీత్యా డుమిని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన నిర్ణయాన్ని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుకు డుమినీ తెలియజేశాడు.మార్చి 2023లో వైట్ బాల్ ఫార్మాట్లలో ప్రోటీస్ బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన డుమినీ.. 20 నెలల పాటు ఆ పదవిలో కొనసాగాడు. డుమిని నేతృత్వంలోనే దక్షిణాఫ్రికా టీ20 వరల్డ్‌కప్-2024 ఫైనల్‌కు చేరింది. కాగా అతడి రాజీనామా విషయాన్ని క్రికెట్ సౌతాఫ్రికా సైతం ధ్రువీకరించింది.డుమిని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు తెలిపింది. అదే విధంగా అతడి స్ధానాన్ని భర్తీ చేసేందుకు వేట మొదలు పెట్టినట్లు సదరు క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా డుమిని 2004- 2019 మధ్యకాలంలో దక్షిణాఫ్రికా తరఫున 46 టెస్టులు, 199 వన్డేలు, 81 టీ20ల్లో ప్రాతినిథ్యం వహించాడు.ప్రోటీస్ బ్యాటింగ్ కోచ్‌గా ఏబీడీ..కాగా దక్షిణాఫ్రికా తదుపరి బ్యాటింగ్ కోచ్‌గా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ బాధ్యతలు చేపట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అతడితో సౌతాఫ్రికా క్రికెట్ పెద్దలు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే అందుకు ఏబీడీ ఒప్పుకుంటాడో లేదో వేచి చూడాలి. చదవండి: IND vs AUS: సిరాజ్ మియా అంత దూకుడెందుకు.. ? ఫ్యాన్స్ ఫైర్ -
వెస్టిండీస్ స్టార్ క్రికెటర్‌కు ఊహించని షాక్.. గన్‌తో బెదిరించి! ఏకంగా
దక్షిణాఫ్రికాలో ఉన్న వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఫాబియన్ అలెన్‌కు చేదు అనుభవం ఎదురైంది. సౌతాఫ్రికా టీ20 లీగ్ 2024లో అలెన్ పార్ల్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు. ఈ క్రమంలో జోహాన్స్‌బర్గ్‌లో జట్టు బసచేస్తున్న శాండ్టన్ సన్ హోటల్ సమీపంలో అలెన్‌ను కొంతమంది దుండగలు తుపాకితో బెదరించి తన ఫోన్‌ను, వ్యక్తిగత వస్తువులను ఎత్తుకుపోయారు. ఈ ఘటనతో ఫాబియన్ అలెన్ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైనట్లు విండీస్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం క్రీడావర్గాల్లో చర్చనీయాంశమైంది. ఒక అంతర్జాతీయ క్రికెటర్‌కు కనీస భద్రత లేకపోవడం పట్ల క్రికెట్ సౌతాఫ్రికాపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. "మా జట్టు ప్రధాన కోచ్ ఆండ్రీ కోలీ ఫాబియన్‌తో ఇప్పటికే మాట్లాడాడు. మరో విండీస్ క్రికెటర్ ఒబెడ్ మెక్కాయ్ కూడా ప్రస్తుతం సౌతాఫ్రికాలోనే ఉన్నాడు. ఈ క్రమంలో మెక్‌కాయ్‌ను ఆండ్రీ కోలీ కాంటాక్ట్ అయ్యాడు. ప్రస్తుతం అలెన్ బాగానే ఉన్నాడు. కానీ ఈ ఘటనపై సౌతాఫ్రికా క్రికెట్, పార్ల్ రాయల్స్ ఇంకా స్పందించాల్సి ఉందని" విండీస్ క్రికెట్ సీనియర్ అధికారి ఒకరు క్రిక్‌బజ్‌తో పేర్కొన్నారు. కాగా ఈ ఏడాది సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో అలెన్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ కరేబియన్ ఆల్‌రౌండర్ 8 మ్యాచ్‌లు ఆడి కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు. -
Hashim Amla: మచ్చలేని క్రికెటర్.. కోహ్లితో పోటీపడి పరుగులు
సౌతాఫ్రికా క్రికెట్లో మరొక శకం ముగిసింది. ప్రొటిస్ జట్టు సీనియర్ ఆటగాడు హషీమ్ ఆమ్లా బుధవారం(జనవరి 18న) అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. వివాదాలకు దూరంగా.. ఇస్లాం మతానికి గౌరవం ఇస్తూ కెరీర్‌ను కొనసాగించిన అరుదైన క్రికెటరగా గుర్తింపు పొందాడు. తాను ధరించే జెర్సీపై ఎలాంటి లోగో లేకుండానే బరిలోకి దిగడం ఆమ్లాకు అలవాటు. దక్షిణాఫ్రికా క్రికెట్‌కు ఎక్కువగా స్పాన్సర్షిప్ ఇచ్చేది బీర్ల కంపెనీలే. ఇస్లాం మతంలో మద్యపానం నిషేధం. దానిని క్రికెట్ ఆడినంత కాలం మనసులో ఉంచుకున్న ఆమ్లా అంతర్జాతీయ మ్యాచ్‌లే కాదు కనీసం ప్రాక్టీస్ మ్యాచ్‌లో కూడా జెర్సీపై దక్షిణాఫ్రికా జాతీయ చిహ్నం మినహా ఎలాంటి లోగో లేకుండా జాగ్రత్తపడేవాడు. కౌంటీ క్రికెట్ సహా ఐపీఎల్ లాంటి ప్రైవేటు లీగ్స్‌లోనూ ఇదే జాగ్రత్తలు తీసుకునేవాడు. -సాక్షి, వెబ్‌డెస్క్ కోహ్లితో పోటీపడి పరుగులు.. 2004లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన హషీమ్ ఆమ్లా ఒక దశలో టీమిండియా రన్‌మెషిన్ విరాట్ కోహ్లితో పోటీపడి పరుగులు సాధించేవాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న ఆమ్లా.. 24 ఏళ్ల కెరీర్లో ఎన్నో మైలురాళ్లను అధిగమించాడు . ముఖ్యంగా వన్డేల్లో ఆమ్లా, కోహ్లి మధ్య కొంతకాలం పరుగుల పోటీ నడిచిందని చెప్పొచ్చు.కోహ్లి ఒక రికార్డు అందుకోవడమే ఆలస్యం.. వెంటనే ఆమ్లా లైన్లోకి వచ్చి ఆ రికార్డును తన పేరిట లిఖించుకునేవాడు. అంతర్జాతీయ క్రికెట్లో 55 సెంచరీల సాయంతో 18వేలకు పైగా పరుగులు చేసిన ఆమ్లా.. వన్డేల్లో వేగంగా 2000, 3000, 4000, 5000, 6000, 7000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. ఇక సౌతాఫ్రికా టెస్ట్ టీమ్ కెప్టెన్‌గానూ వ్యవహరించిన ఆమ్లా.. వన్డేల్లో అత్యంత వేగంగా 10, 15, 16, 17, 18, 20, 25, 27 సెంచరీలు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఆమ్లా ఖాతాలో టెస్ట్‌ల్లో ట్రిపుల్ సెంచరీ (311 నాటౌట్)తో పాటు ఐపీఎల్‌లోనూ 2 సెంచరీలు ఉన్నాయి. మరి ఒకప్పుడు కోహ్లితో పోటీపడి పరుగులు సాధించిన ఆమ్లా ఆ తర్వాత ఎందుకనో వెనుకబడిపోయాడు. బహుశా వయస్సు పెరగడం.. ఫిట్నెస్ సమస్యలు.. జట్టులోకి కొత్త ఆటగాళ్లు రావడం అనుకుంటా. తర్వాత ఆమ్లాకు అవకాశాలు నెమ్మదిగా తగ్గిపోయాయి. అలా అంతర్జాతీయ క్రికెట్‌కు మెళ్లగా దూరమైన ఆమ్లా 2019 వన్డే ప్రపంచకప్ ముగియగానే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై పలికాడు. వివాదాలకు ఆమడ దూరం.. క్రికెట్ ఆడినంత కాలం ఆమ్లా ఒక్క వివాదంలో కూడా ఇరుక్కోలేదు. వివాదాలకు ఆమడ దూరంలో ఉండే ఆమ్లా చాలా నెమ్మదస్తుడు. ఒక్కసారి క్రీజులో అడుగుపెట్టాడంటే అతన్ని ఔట్ చేయడం అంత సులువు కాదు. ఎన్నోసార్లు బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. భారత్ మూలాలున్న హషీమ్ ఆమ్లా స్పిన్ బౌలింగ్‌ను అవలీలగా ఆడగల సమర్థుడు. డీన్ జోన్స్ వివాదం ఆమ్లా క్రికెట్ కెరీర్లో ఏదైనా వివాదం ఉందంటే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్.. కామెంటేటర్ డీన్ జోన్స్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే. 2013లో శ్రీలంకతో టెస్టు మ్యాచ్ సందర్భంగా మాటల మధ్యలో డీన్ జోన్స్ ఆమ్లాను ఉగ్రవాది అని సంబోధించాడు. ఆ మ్యాచ్‌లో కుమార సంగక్కర ఇచ్చిన క్యాచ్‌ను ఆమ్లా అందుకున్నాడు. వెంటనే డీన్ జోన్స్.. ఉగ్రవాదికి మరొక వికెట్ లభించింది. ఇది పెద్ద దుమారమే రేపింది. ఆ తర్వాత డీన్ జోన్స్ తన వ్యాఖ్యలపై ఆమ్లాకు క్షమాపణ చెప్పినప్పటికి బ్రాడ్‌కాస్టర్స్ అతన్ని జాబ్ నుంచి తొలగించారు. అంతర్జాతీయ క్రికెట్లో 18వేలకు పైగా పరుగులు.. ఆమ్లా తన కెరీర్లో దక్షిణాఫ్రికా తరపున 124 టెస్టులు ఆడి 46.64 సగటుతో 9,282 పరుగులు చేశాడు. ఇందులో 28 శతకాలు ఉండగా.. 4 డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి. అత్యధిక స్కోరు.. 311. ఇక 181 వన్డేలలో 8,113 పరుగులు చేశాడు. ఇందులో 27 శతకాలు ఉన్నాయి. ఇక 44 టీ20లలో 8 అర్ధశతకాలతో 1277 పరుగులు చేశాడు. ఇక కౌంటీ క్రికెట్ లో ఆమ్లా గణాంకాలు రికార్డులే. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పనుకున్నాక ఆమ్లా సర్రే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 265 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన ఆమ్లా 19521 పరుగులు చేశాడు. హైయెస్ట్ స్కోర్.. 311 నాటౌట్. ఇక లిస్ట్ ఏ క్రికెట్ లో 247 మ్యాచుల్లో10020 పరుగులు చేశాడు.హైయెస్ట్ స్కోరు 159. ఇక టీ20 క్రికెట్ లో 164 మ్యాచుల్లో 2 సెంచరీల సాయంతో 4563 పరుగులు చేశాడు. చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ డబుల్ సెంచరీ కొట్టాలంటే మనోళ్లే.. పదిలో ఏడు మనవే.. మరో విశేషమేమిటంటే..? -
క్రికెట్లో విషాదం.. దిగ్గజ అంపైర్ దుర్మరణం
క్రికెట్లో పెను విషాదం చోటుచేసుకుంది. సౌతాఫ్రికాకు చెందిన మాజీ అంపైర్ రూడి కోర్ట్జెన్(73) కన్నుమూశాడు. మంగళవారం మధ్యాహ్నం సౌతాఫ్రికాలోని రివర్‌డేల్‌లో ఉన్న గోల్ఫ్ కోర్స్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఆయన కారు యాక్సిడెంట్‌కు గురయ్యింది. ఈ ప్రమాదంలో కోర్ట్జెన్‌తో పాటు మరో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. కాగా 1981లో కోర్ట్జెన్ తన కెరీర్‌ను ప్రారంభించారు. 1992లో ఐసీసీ కోర్ట్జెన్ను ఫుల్‌టైం అంపైర్‌గా నియమించింది. 1992లో సౌతాఫ్రికా- భారత్ మధ్య జరిగిన మ్యాచ్‌కు తొలిసారి అంపైరింగ్ అవకాశం వచ్చింది. అంతేకాదు కోర్ట్జెన్ చేసిన మెయిడెన్ అంపైరింగ్ మ్యాచ్‌లో బ్యాటర్ రనౌట్‌కు సంబంధించిన తొలిసారి టెలివిజన్ రీప్లే ప్రవేశపెట్టారు. ఇక 43 ఏళ్ల వయసులో పోర్ట్ ఎలిజిబెత్ వేదికగా జరిగిన టెస్టులో తొలిసారి ఫీల్డ్ అంపైర్‌గా వ్యవహరించారు. అక్కడి నుంచి కోర్ట్జేన్ మళ్లీ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. దాదాపు 100 టెస్టులు, 200 వన్డేలకు కోర్ట్జెన్ అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు. 2003, 2007 వరల్డ్‌కప్స్‌లో కోర్ట్జెన్ థర్డ్ అంపైర్‌గా విధులు నిర్వర్తించాడు. ఇక రూడీ కోర్ట్జెన్ 2010లో పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య టెస్టు మ్యాచ్‌కు చివరిసారి అంపైరింగ్ చేశాడు. పాకిస్తాన్ అంపైర్ అలీమ్ దార్, స్టీవ్ బక్నర్ తర్వాత అత్యధిక టెస్టులకు అంపైర్ గా చేసిన ఘనత సాధించాడు.బ్యాటర్ క్యాచ్ ఔట్, స్టంప్, ఎల్బీడబ్ల్యూ, రనౌట్ అయినప్పుడు ఎల్బీడబ్ల్యూ ఔట్ ఇచ్చే విధానం కూడా హైలైట్ గా ఉండేది. మెల్లిగా చేతిని పైకెత్తుతూ ఆయన ఔట్ ఇచ్చే విధానానికి కల్ట్ ఫ్యాన్స్ ఉండడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్ లో దీనిని ‘ది స్లో ఫింగర్ ఆఫ్ డెత్’గా అభివర్ణించేవారు. రూడి కోర్ట్జెన్ కుమారుడు జూనియర్ కోర్ట్జెన్ మాట్లాడుతూ.. ''ప్రతీ వారాంతంలో గోల్ఫ్ ఆడిన తర్వాత కేప్ టౌన్ నుండి నెల్సన్ మండేలా బేలోని డెస్పాచ్ వద్ద వెళ్లడం నాన్నకు అలవాటు. వాస్తవానికి సోమవారమే ఆయన ఇంటికి రావాలి. కానీ గోల్ఫ్‌లో మరొక రౌండ్ ఆడాలన్న ఉద్దేశంతో అక్కడే ఉండిపోయారు. ఇంటికి తిరిగి వస్తారని సంతోషంలో ఉన్న మాకు ఆయన మరణవార్త కలచివేసింది అంటూ ఎమోషనల్ అయ్యాడు. రూడీ కోర్ట్జెన్ మృతి పట్ల ఐసీసీ సహా పలువురు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు నివాళి ప్రకటించారు. కాగా రూడీ కోర్ట్జెన్ మరణవార్త తెలుసుకున్న దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఆయన మృతికి సంతాపం తెలిపారు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న సౌతాఫ్రికా జట్టు మంగళవారం ఇంగ్లండ్ లయన్స్‌తో జరగనున్న ప్రాక్టీస్ మ్యాచ్‌కు నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగనుంది. Former South African umpire Rudi Koertzen has died in a car accident at the age of 73 Our thoughts go out to his family and friends pic.twitter.com/R0bhtNZu13 — ESPNcricinfo (@ESPNcricinfo) August 9, 2022 చదవండి: Hundred 2022: ఆరు సెకన్ల పాటు గాల్లోనే.. సెకన్ల వ్యవధిలో రెండు అద్భుతాలు -
దక్షిణాఫ్రికా క్రికెటర్లకు భారీ షాక్!
దక్షిణాఫ్రికా క్రికెటర్లకు ఆదేశ క్రికెట్ బోర్డు షాకిచ్చింది. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఆడేందుకు అనుమతిని తిరస్కరించింది. రాబోయే అంతర్జాతీయ పర్యటనలు, దేశీయ మ్యాచ్‌ల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు తెలిపింది. సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉన్నఆటగాళ్లు పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పాల్గొనడం లేదని సౌతాఫ్రికా క్రికెట్ డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ తెలిపారు. కాగా ఫిబ్రవరిలో న్యూజిలాండ్ పర్యటనకు ప్రోటిస్ జట్టు వెళ్లనుంది. అదే విధంగా స్వదేశంలో బంగ్లాదేశ్‌తో కూడా ఆడనుంది. ఇక పాకిస్తాన్ సూపర్ లీగ్ జనవరి 24 నుంచి ప్రారంభం కానుంది. "అంతర్జాతీయ షెడ్యూల్, దేశీయ మ్యాచ్‌ల కారణంగా పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పాల్గొనేందకు ప్రోటిస్ ఆటగాళ్ల అనుమతిని తిరస్కరించాం. త్వరలోనే మేము న్యూజిలాండ్‌లో పర్యటించున్నాం. అదే విధంగా స్వదేశంలో బంగ్లాదేశతో ఆడనున్నాం. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు జట్టు సేవలకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇవ్వాలి" అని స్మిత్ పేర్కొన్నాడు. కాగా ఇమ్రాన్ తాహిర్, రిలీ రోసౌ, మర్చంట్ డి లాంజే పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఆడుతున్న సంగతి తెలిసిందే. చదవండి: IPL- 2022: ఐపీఎల్‌పై బీసీసీఐ కీలక ప్రకటన! -
క్రికెట్, రగ్బీపై దక్షిణాఫ్రికా సంచలన నిర్ణయం
దక్షిణాఫ్రికాలో అంతర్జాతీయ క్రికెట్, రగ్బీ మ్యాచులు నిర్వహించకుండా ఆ దేశ ప్రభుత్వం దాదాపు ఏడాదిపాటు నిషేధం విధించింది. క్రికెట్, రగ్బీ ఆటల్లో నల్లజాతీయులను విస్మరించి.. కేవలం శ్వేతజాతీయులకు మాత్రమే అవకాశమిస్తుండటంతో దక్షిణాఫ్రికా క్రీడామంత్రి ఫికిలి ఎంబాలులా ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ టోర్నమెంట్లు నిర్వహించకుండా, మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వకుండా జాతీయ రగ్బీ, క్రికెట్ ఫెడరేషన్లపై ఆయన నిషేధం విధించారు. రగ్బీ, క్రికెట్, ఫుట్‌బాల్, అథ్లెటిక్స్, నెట్‌బాల్.. మొత్తం ఐదు క్రీడలకు ఈ నిషేధం వర్తించనుందని ఆయన సోమవారం తెలిపారు. నల్లజాతీయులను ప్రోత్సహించడంలో ఒక్క ఫుట్‌బాల్ క్రీడ మాత్రమే ముందున్నదని, కాబట్టి ఫుట్‌బాల్‌కు ఈ నిషేధం వర్తించబోదని ఆయన తెలిపారు. దక్షిణాఫ్రికా ప్రభుత్వం నిర్ణయం వల్ల 2023 రగ్బీ వరల్డ్ కప్ నిర్వహణకు బిడ్డింగ్ దాఖలుచేసే అవకాశాన్ని ఆ దేశ బోర్డు కోల్పోనుంది. అంతర్జాతీయ టోర్నమెంట్లు, మేజర్ మ్యాచులు నిర్వహించకుండా క్రికెట్, రగ్బీ తదితర ఫెడరేషన్లపై విధించిన నిషేధంపై వచ్చే ఏడాది సమీక్ష జరుపుతానని, అప్పటివరకు ఈ నిషేధం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. -
దక్షిణాఫ్రికా చేతిలో విండీస్ చిత్తు
జొహాన్నెస్‌బర్గ్: వెస్టిండీస్ తో జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. విండీస్ ను 148 పరుగుల తేడాతో చిత్తు చేసింది. 440 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 291 పరుగులు చేసింది. రామదిన్(57), స్మిత్(64) అర్థ సెంచరీలు సాధించారు. శామ్యూల్స్ 40, కార్టర్ 40, స్యామీ 25, హోల్డర్ 21, గేల్ 19 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మోర్కల్, ఫిలాండర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. -
డర్బన్‌లో ఢమాల్
రెండో టెస్టులో భారత్ ఓటమి 10 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా గెలుపు 1-0తో సిరీస్ కైవసం రహానే సెంచరీ మిస్ తొలి టెస్టులో దక్షిణాఫ్రికా చూపిన పోరాట స్ఫూర్తిని రెండో టెస్టులో భారత బ్యాట్స్‌మెన్ చూపలేకపోయారు. సులువుగా డ్రా చేసుకోవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా జారవిడుచుకున్నారు. కలిస్‌కు విజయంతో వీడ్కోలు పలకాలన్న కసితో సఫారీ బౌలర్లు క్రమశిక్షణ చూపించి విజయం సాధించారు. నాణ్యమైన టెస్టు క్రికెట్ ఆడిన స్మిత్ సేన సిరీస్‌ను కైవసం చేసుకుంది. డర్బన్: దక్షిణాఫ్రికా క్రికెట్‌కు 18 ఏళ్లుగా వెన్నెముకగా నిలిచిన ఆల్‌రౌండర్ జాక్వస్ కలిస్ కెరీర్ చివరి టెస్టును చిరస్మరణీయంగా మల్చుకున్నాడు. ఎంతో మంది దిగ్గజాలను ఊరించిన అరుదైన మైలురాయిని (ఆఖరి టెస్టులో సెంచరీ) అతను అలవోకగా అందుకుంటే... సహచరులు అంతకు రెట్టింపు స్థాయిలో ఘనమైన వీడ్కోలు ఇచ్చారు. బ్యాట్స్‌మెన్ ప్రతిభ.. బౌలర్ల మెరుపులు దక్షిణాఫ్రికాకు సిరీస్‌తో పాటు కలిస్‌కు చివరి మ్యాచ్ విజయాన్ని అందించాయి. డర్బన్‌లో సోమవారం ముగిసిన రెండో టెస్టులో స్మిత్‌సేన 10 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. ఫలితంగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుంది. ధోనిసేన నిర్దేశించిన 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 11.4 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 59 పరుగులు చేసి ఛేదించింది. స్మిత్ (33 బంతుల్లో 27 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్సర్), పీటర్సన్ (37 బంతుల్లో 31 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్సర్) వేగంగా ఆడి జట్టుకు గెలుపును అందించారు. అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 86 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. రహానే (157 బంతుల్లో 96; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) తృటిలో సెంచరీ మిస్సయ్యాడు. పుజారా (100 బంతుల్లో 32; 4 ఫోర్లు) మినహా మిగతా వారు విఫలమయ్యారు. స్టెయిన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’; డివిలియర్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. స్టెయిన్ ఝలక్ : ఓవర్‌నైట్ స్కోరు 68/2తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్‌కు ఆరంభంలోనే స్టెయిన్ ఝలక్ ఇచ్చాడు. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ కోహ్లి (27 బంతుల్లో 11; 1 ఫోర్)ని తొలి బంతికే అవుట్ చేశాడు. ఆఫ్ స్టంప్ బయట పడ్డ బంతి బ్యాట్స్‌మన్ భుజాలకు తాకుతూ కీపర్ చేతుల్లోకి వెళ్లడంతో అంపైర్ అవుటిచ్చారు. దీంతో ఒకింత నిరాశతో కోహ్లి పెవిలియన్‌కు వెళ్లాడు. మరో 16 బంతుల తర్వాత స్టెయిన్ అద్భుతమైన బంతితో పుజారాను బోల్తా కొట్టించాడు. వీరిద్దరు వ్యక్తిగత ఓవర్‌నైట్ స్కోరు వద్దే అవుటయ్యారు. ఇక రోహిత్ (46 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్సర్), రహానే కుదురుకునేందుకు ప్రాధాన్యమిచ్చారు. కానీ ఫిలాండర్ ఫుల్ లెంగ్త్‌కు రోహిత్ వికెట్ల ముందు దొరికిపోయాడు. తర్వాత రహానేతో జత కలిసిన ధోని (29 బంతుల్లో 15; 2 ఫోర్లు) ఆరో వికెట్‌కు 42 పరుగులు జోడించి అవుటయ్యాడు. జడేజా (5 బంతుల్లో 8; 1 సిక్సర్) విఫలమయ్యాడు. దీంతో భారత్ 154 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టెయిలెండర్ల సహాయంతో రహానే ఇన్నింగ్స్‌ను నడిపించేందుకు ప్రయత్నించాడు. స్టెయిన్ బౌలింగ్‌లో ఓవర్‌కో బౌండరీ కొడుతూ 84 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జహీర్ (3), ఇషాంత్ (1) స్వల్ప వ్యవధిలో అవుట్ కావడంతో రహానే ఎక్కువగా స్ట్రయిక్ తీసుకున్నాడు. ఫిలాండర్ బౌలింగ్‌లో ఓ ఫోర్, సిక్సర్‌తో సెంచరీకి చేరువైనా... తర్వాతి బంతికే అవుటయ్యాడు. పీటర్సన్ 4, స్టెయిన్, ఫిలాండర్ మూడేసి వికెట్లు తీశారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 334 ఆలౌట్ దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 500 ఆలౌట్ భారత్ రెండో ఇన్నింగ్స్: ధావన్ (సి) డు ప్లెసిస్ (బి) పీటర్సన్ 19; విజయ్ (సి) స్మిత్ (బి) ఫిలాండర్ 6; పుజారా (బి) స్టెయిన్ 32; కోహ్లి (సి) డివిలియర్స్ (బి) స్టెయిన్ 11; రోహిత్ ఎల్బీడబ్ల్యు (బి) ఫిలాండర్ 25; రహానే (బి) ఫిలాండర్ 96; ధోని (సి) అల్విరో (బి) పీటర్సన్ 15; జడేజా (సి) మోర్కెల్ (బి) పీటర్సన్ 8; జహీర్ ఎల్బీడబ్ల్యు (బి) పీటర్సన్ 3; ఇషాంత్ (సి) డివిలియర్స్ (బి) స్టెయిన్ 1; షమీ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: (86 ఓవర్లలో ఆలౌట్) 223. వికెట్లపతనం: 1-8; 2-53; 3-68; 4-71; 5-104; 6-146; 7-154; 8-189; 9-206; 10-223 బౌలింగ్: స్టెయిన్ 21-8-47-3; ఫిలాండర్ 16-4-43-3; మోర్కెల్ 16-6-34-0; పీటర్సన్ 24-3-74-4; డుమిని 8-2-20-0; డు ప్లెసిస్ 1-0-1-0 దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: స్మిత్ నాటౌట్ 27; ఎ.పీటర్సన్ నాటౌట్ 31; ఎక్స్‌ట్రాలు: 1; మొత్తం: (11.4 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా) 59. బౌలింగ్: షమీ 2-1-4-0; ఇషాంత్ 5-1-29-0; జడేజా 4-0-16-0; రోహిత్ 0.4-0-10-0. -
భారత్, దక్షిణాఫ్రికా తొలి టెస్టు డ్రా
జొహన్నెస్‌బర్గ్: ఉత్కంఠభరితంగా సాగిన భారత్, దక్షిణాఫ్రికా తొలి టెస్టు డ్రాగా ముగిసింది. భారీ విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని దగ్గరగా వచ్చినప్పటికీ విజయాన్ని అందుకోలేపోయింది. చివర్లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సఫారీ టీమ్ అతిపెద్ద లక్ష్యాన్ని ఛేదించే అవకాశాన్ని కోల్పోయింది. టీమిండియా నిర్దేశించిన 458 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఛేధించే క్రమంలో దక్షిణాఫ్రికా ఏడు వికెట్లు కోల్పోయి 450 పరుగులు చేసింది. డీవిలియర్స్(103), డూఫ్లెసిస్(134) సెంచరీలతో చెలరేగడంతో సఫారీ జట్టు అతిపెద్ద లక్ష్యాన్ని ఛేదనకు చేరువగా వచ్చింది. 197 పరుగులకే నాలుగు వికెట్లు పడిన జట్టును వీరిద్దరూ సెంచరీలతో ఆదుకున్నారు. జట్టును గెలుపుబాటలోకి తీసుకొచ్చారు. 402 పరుగుల వద్ద డీవిలియర్స్ అవుటయ్యాడు. ఆ వెంటనే డుమిని(5) పెవిలియన్ చేరడంతో భారత్ శిబిరంలో ఆశలు రేగాయి. దక్షిణాఫ్రికా విజయం ఖాయమనుకున్న దశలో రహానే విసిరిన అద్భుతమైన త్రోకు ఫ్లెసిస్ రనౌట్ అయ్యాడు. చివరి ఓవర్లలో ధోని సేన సమిష్టిగా రాణించి ఆతిథ్య జట్టును కట్టడి చేసి మ్యాచ్ డ్రాగా ముగించింది. భారత బౌలర్లలో షమీ 3 వికెట్లు పడగొట్టాడు. జహీర్‌ఖాన్, ఇషాంత్ శర్మ చెరో వికెట్ తీశారు. విరాట్ కోహ్లికి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది. -
280 పరుగులకు భారత్ ఆలౌట్
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 280 పరుగులకు ఆలౌటయింది. వెంట వెంటనే వికెట్లు కోల్పోవడంతో భారత్ భారీ స్కోరు చేయలేకపోయింది. 255/5 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన టీమిండియా మరో 25 పరుగులకే మిగతా వికెట్లు కోల్పోయింది. అజింక్య రహానే 47, ధోనీ 19 పరుగులు చేశారు. జహీర్‌ఖాన్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ డకౌటయ్యారు. విరాట్ కోహ్లి119, పుజారా 25, రోహిత్ శర్మ 14, ధావన్ 13 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫిలాండర్ 4, మోర్కల్ 3 వికెట్లు పడగొట్టారు. స్టెయిన్, కలిస్ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
సచిన్ నిష్ర్కమణ తర్వాత టీమిండియా తొలి టెస్ట్
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాతో బుధవారమిక్కడ వాండరర్స్ మైదానంలో ప్రారంభమైన తొలి టెస్టులో భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ తీసుకున్నాడు. యువ ఆటగాళ్లను సత్తాకు ఈ టెస్టు పరీక్షగా నిలిచింది. దాదాపు ఏడాది కాలంగా యువ నామస్మరణతో హోరెత్తున్న టీమిండియాకు విదేశీ గడ్డపై సిసలైన పరీక్ష ఎదుర్కొంటోంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్ కోల్పోయిన ధోని సేన టెస్టు సిరీస్‌లోనైనా పరువు కాపాడుకోవాలని భావిస్తోంది. సీనియర్ పేసర్ జహీర్ ఖాన్ చాలా కాలం తర్వాత జట్టులోకి రావడంతో భారత్ ఆత్మవిశ్వాసం పెరిగింది. ద్రవిడ్ వారసుడిగా పేరు గాంచిన ఛతేశ్వర్ పూజారా, అజింక్య రహానే, ఇషాంత్ శర్మ, మురళీ విజయ్ జట్టులోకి వచ్చారు. 24 ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు పర్యాయపదంగా నిలిచిన సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ తర్వాత తొలి సారి టెస్టు మ్యాచ్ బరిలోకి దిగిన భారత జట్టు ఏ మేరకు రాణిస్తోందని క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. కాగా, సొంత గడ్డపై జోరు కొనసాగించాలని దక్షిణాఫ్రికా పట్టుదలతో ఉంది. -
మండేలా-గాంధీ ట్రోఫీ పేరుకు ఒప్పుకోలేదు
బీసీసీఐపై సీఎస్ఏ ఆరోపణ ముంబై: దక్షిణాఫ్రికా క్రికెట్ (సీఎస్ఏ) సీఈఓగా హరూన్ లోర్గాట్ నియామకంతో ఆగ్రహం చెందిన భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) తమ జట్టు పర్యటనపై చాలా రోజులు స్పష్టత ఇవ్వని విషయం తెలిసిందే. ఐదు టెస్టుల సిరీస్ కోసం సీఎస్ఏ ఎంతగా పట్టుబట్టినా బీసీసీఐ ససేమిరా అని రెండు టెస్టులకు కుదించింది. అలాగే ఈ టెస్టు సిరీస్‌కు మండేలా-గాంధీ ట్రోఫీగా పేరు పెడదామని సీఎస్ఏ ప్రతిపాదించగా భారత బోర్డు తిరస్కరించిందని దక్షిణాఫ్రికా క్రికెట్ అధికారి ఒకరు తెలిపారు. ‘మండేలా మృతిని మేం ఊహించలేకపోయాం. అంతకన్నా ముందే ఇరు జట్ల మధ్య జరగాల్సిన ఐదు టెస్టుల సిరీస్‌కు మండేలా-గాంధీ ట్రోఫీగా పేరు పెట్టాలని భావించాం. ఎందుకంటే వీరిద్దరు ప్రపంచ నాయకులు కావడమే కాకుండా ఇరు దేశాల మధ్య చారిత్రక సంబంధాలున్నాయి. దురదృష్టవశాత్తు ఈ ప్రతిపాదనను బీసీసీఐ తోసిపుచ్చింది’ అని సీఎస్ఏ సీనియర్ అధికారి ఓ టీవీ చానెల్‌కు తెలిపారు. -
తప్పుకోవాలనే నిర్ణయం నాదే: లోర్గాట్
జొహన్నెస్‌బర్గ్: బీసీసీఐతో ఏర్పరుచుకునే సంబంధాల్లో పాలుపంచుకోకూడదని తానే నిర్ణయించుకున్నట్టు దక్షిణాఫ్రికా క్రికెట్ (సీఎస్ఏ) సీఈవో హరూన్ లోర్గాట్ స్పష్టం చేశారు. ఇరు జట్ల మధ్య జరుగబోయే సిరీస్‌కు ఎలాంటి ఆటంకం ఉండరాదనేదే తన ఉద్దేశమని అన్నారు. లోర్గాట్తో విభేదాలున్న కారణంగా భారత క్రికెట్ బోర్డు సఫారీ పర్యటనపై మొదట్లో అనాసక్తి ప్రదర్శించిన సంగతి విదితమే. దీంతో రంగంలోకి దిగిన సీఏ అధ్యక్షుడు.. లోర్గాట్‌ను పక్కన పెడతామని హామీ ఇచ్చారు. ‘భారత పర్యటన ఖరారు అయ్యేంతవరకు, అలాగే నాపై వచ్చిన ఆరోపణలు తొలగిపోయే వరకు పక్కకు తప్పుకుంటానని నేనే బోర్డుకు విజ్ఞప్తి చేశాను. ఈ నిర్ణయంతో నేను సంతోషంగా ఉన్నాను. పర్యటన కన్నా ఎవరూ ముఖ్యం కాదు’ అని లోర్గాట్ తెలిపారు. -
నేడు సీఎస్ఏ అధ్యక్షుడితో శ్రీనివాసన్ భేటీ
ముంబై: భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనపై కొనసాగుతున్న సందిగ్ధతను తొలగించేందుకు ఇరు జట్ల బోర్డు అధ్యక్షులు నేడు (శనివారం) సమావేశం కానున్నారు. బీసీసీఐని సంప్రదించకుండానే గతంలో దక్షిణాఫ్రికా క్రికెట్ (సీఎస్ఏ) షెడ్యూల్‌ను ప్రకటించడంతో వివాదం ప్రారంభమైంది. వచ్చే నెల నుంచి జనవరి 15 వరకు జరగాల్సిన ఈ పర్యటనపై బోర్డు ఇప్పటిదాకా సానుకూలంగా స్పందించలేదు. మరోవైపు నవంబర్ 27 నుంచి వెస్టిండీస్‌తో స్వదేశంలో సిరీస్ ఆడనుండగా జనవరి 19 నుంచి న్యూజిలాండ్ పర్యటనను ఖరారు చేసుకుంది. దీంతో మ్యాచ్‌లను కుదించి దక్షిణాఫ్రికాతో క్రికెట్ సిరీస్ కొనసాగించాల్సి ఉంది. ఇదే విషయమై సీఎస్ఏ అధ్యక్షుడు క్రిస్ నెన్‌జాని, ఎన్.శ్రీనివాసన్ చర్చలు జరిపి ఓ నిర్ణయం తీసుకోనున్నారు. -
సీఎస్ఏ అధ్యక్షుడికి బోర్డు ఆహ్వానం
న్యూఢిల్లీ: అనిశ్చితిలో కొనసాగుతున్న భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనపై ఈనెల మూడో వారంలో ఓ స్పష్టత రానుంది. ఈ పర్యటనపై చర్చించేందుకు దక్షిణాఫ్రికా క్రికెట్ అధ్యక్షుడు (సీఎస్ఏ) క్రిస్ నెన్జానిని బీసీసీఐ ఆహ్వానించింది. ‘ఈ సిరీస్ గురించి పూర్తిగా చర్చించేందుకు ఇప్పటికే సీఎస్ఏ అధ్యక్షుడికి ఆహ్వానం పంపాను. చర్చల తేదీ ఇంకా ఖరారు కాకపోయినా వేదిక మాత్రం ముంబై లేక చెన్నైలో జరిగే అవకాశం ఉంది. తమ అధ్యక్షుడి షెడ్యూల్‌ను సీఎస్ఏ అందించాక సమావేశం తేదీలను వెల్లడిస్తాం’ అని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ అన్నారు. అయితే ఈ సమావేశంలో సీఎస్ఏ సీఈ హరూన్ లోర్గాట్ కూడా ఉంటారా? అని అడిగిన ప్రశ్నకు ఆయన లేదని సమాధానమిచ్చారు. తమ ఆహ్వానం కేవలం అధ్యక్షుడికి మాత్రమే పరిమితమని స్పష్టం చేశారు. లోర్గాట్తో బీసీసీఐకి విభేదాలున్న విషయం తెలిసిందే.