దక్షిణాఫ్రికా పురుషుల క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్ పదవి నుంచి ఆ దేశ మాజీ క్రికెటర్ జేపీ డుమిని తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాల వ్యక్తిగత కారణాల రీత్యా డుమిని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన నిర్ణయాన్ని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుకు డుమినీ తెలియజేశాడు.
మార్చి 2023లో వైట్ బాల్ ఫార్మాట్లలో ప్రోటీస్ బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన డుమినీ.. 20 నెలల పాటు ఆ పదవిలో కొనసాగాడు. డుమిని నేతృత్వంలోనే దక్షిణాఫ్రికా టీ20 వరల్డ్‌కప్-2024 ఫైనల్‌కు చేరింది. కాగా అతడి రాజీనామా విషయాన్ని క్రికెట్ సౌతాఫ్రికా సైతం ధ్రువీకరించింది.
డుమిని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు తెలిపింది. అదే విధంగా అతడి స్ధానాన్ని భర్తీ చేసేందుకు వేట మొదలు పెట్టినట్లు సదరు క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా డుమిని 2004- 2019 మధ్యకాలంలో దక్షిణాఫ్రికా తరఫున 46 టెస్టులు, 199 వన్డేలు, 81 టీ20ల్లో ప్రాతినిథ్యం వహించాడు.
ప్రోటీస్ బ్యాటింగ్ కోచ్‌గా ఏబీడీ..
కాగా దక్షిణాఫ్రికా తదుపరి బ్యాటింగ్ కోచ్‌గా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ బాధ్యతలు చేపట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అతడితో సౌతాఫ్రికా క్రికెట్ పెద్దలు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే అందుకు ఏబీడీ ఒప్పుకుంటాడో లేదో వేచి చూడాలి.
చదవండి: IND vs AUS: సిరాజ్ మియా అంత దూకుడెందుకు.. ? ఫ్యాన్స్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment