jp dumini
-
దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్‌గా ఏబీ డివిలియర్స్..!?
దక్షిణాఫ్రికా పురుషుల క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్ పదవి నుంచి ఆ దేశ మాజీ క్రికెటర్ జేపీ డుమిని తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాల వ్యక్తిగత కారణాల రీత్యా డుమిని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన నిర్ణయాన్ని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుకు డుమినీ తెలియజేశాడు.మార్చి 2023లో వైట్ బాల్ ఫార్మాట్లలో ప్రోటీస్ బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన డుమినీ.. 20 నెలల పాటు ఆ పదవిలో కొనసాగాడు. డుమిని నేతృత్వంలోనే దక్షిణాఫ్రికా టీ20 వరల్డ్‌కప్-2024 ఫైనల్‌కు చేరింది. కాగా అతడి రాజీనామా విషయాన్ని క్రికెట్ సౌతాఫ్రికా సైతం ధ్రువీకరించింది.డుమిని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు తెలిపింది. అదే విధంగా అతడి స్ధానాన్ని భర్తీ చేసేందుకు వేట మొదలు పెట్టినట్లు సదరు క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా డుమిని 2004- 2019 మధ్యకాలంలో దక్షిణాఫ్రికా తరఫున 46 టెస్టులు, 199 వన్డేలు, 81 టీ20ల్లో ప్రాతినిథ్యం వహించాడు.ప్రోటీస్ బ్యాటింగ్ కోచ్‌గా ఏబీడీ..కాగా దక్షిణాఫ్రికా తదుపరి బ్యాటింగ్ కోచ్‌గా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ బాధ్యతలు చేపట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అతడితో సౌతాఫ్రికా క్రికెట్ పెద్దలు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే అందుకు ఏబీడీ ఒప్పుకుంటాడో లేదో వేచి చూడాలి. చదవండి: IND vs AUS: సిరాజ్ మియా అంత దూకుడెందుకు.. ? ఫ్యాన్స్ ఫైర్ -
దక్షిణాఫ్రికా కొత్త కెప్టెన్‌గా స్టార్ క్రికెటర్.. బవుమాపై వేటు!
దక్షిణాఫ్రికా కొత్త టీ20 కెప్టెన్‌గా ఆ జట్టు స్టార్ బ్యాటర్ ఐడెన్ మార్క్రమ్ ఎంపికయ్యాడు. టెంబా బవుమా స్థానంలో తమ జట్టు కెప్టెన్‌గా మార్క్రమ్ను దక్షిణాఫ్రికా క్రికెట్ నియమించింది. ఇక బవుమా కేవలం వన్డేలు,టెస్టుల్లో మాత్రమే ప్రోటీస్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. అదే విధంగా వైట్‌బాల్ క్రికెట్లో తమ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా మాజీ ఆటగాడు జేపీ డుమిని, బౌలింగ్ కోచ్‌గా రోరీ క్లీన్వెల్ట్ను దక్షిణాఫ్రికా క్రికెట్ ఎంపిక చేసింది. కాగా స్వదేశంలో వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు జట్టును ప్రకటించిన క్రికెట్ సౌతాఫ్రికా.. ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక ఇది ఇలా ఉండగా.. మాజీ కెప్టెన్ బవుమాను ఇకపై టీ20లకు పరిగణించకూడదని ప్రోటీస్ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న ప్రోటీస్ మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్.. విండీస్ సిరీస్‌తో తిరిగి రీ ఎంట్రీ ఇస్తాడని వార్తలు వినిపించాయి. అయితే సెలక్టర్లు మాత్రం అతడి పునరాగమనంపై ఆసక్తి చూపకపోయినట్లు తెలుస్తోంది. అదే విధంగా ప్రోటీస్ పరిమిత ఓవర్ల హెడ్ కోచ్ రాబ్ వాల్టర్‌తో డుప్లెసిస్ జరిపిన చర్చలు కూడా విఫలమైనట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇక జట్టు ఎంపిక విషయానికి వస్తే.. వన్డే సిరీస్‌కు స్టార్ పేసర్లు కగిసో రబాడ, అన్రిచ్ నోర్జేకు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. యువ క్రికెటర్లు గెరాల్డ్ కోయెట్జీ, ర్యాన్ రికెల్టన్, టోనీ డి జోర్జి,ట్రిస్టన్ స్టబ్స్ కు తొలి సారి దక్షిణాఫ్రికా వన్డే జట్టులో చోటు దక్కింది. తొలి రెండు వన్డేలకు దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బవుమా (కెప్టెన్), గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, జార్న్ ఫార్టుయిన్, రీజా హెండ్రిక్స్, సిసంద మగాలా, కేశవ్ మహరాజ్, వియాన్ ముల్డర్, లుంగీ ఎంగిడీ, ర్యాన్ రికెల్టన్, ఆండిలే స్టిల్బుబ్స్, ఫెహ్లుక్వేబ్స్, లిజాడ్ విలియమ్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్. మూడో వన్డే కోసం జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, బ్జోర్న్ ఫోర్టుయిన్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, సిసంద మగల, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్ , లుంగి ఎం, ర్యాన్ రికెల్టన్, వేన్ పార్నెల్, ఆండిలే ఫెహ్లుక్వాయో, ట్రిస్టన్ స్టబ్స్, లిజాడ్ విలియమ్స్, రాస్సీ వాన్ డెర్ డ్యూసెన్. టీ20లకు ప్రోటీస్ జట్టు: ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్, జార్న్ ఫోర్టుయిన్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, సిసంద మగాలా, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్గిడి, అన్రిచ్ నార్టే, వేన్ పార్నెల్, కగిసో రబాడ, రిలీ రోసోవ్, , ట్రిస్టన్ స్టబ్స్. -
ఈ సెంచరీ ప్రత్యేకమైనది
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడోవన్డేలో సాధించిన అజేయ సెంచరీ చాలా ప్రత్యేకమని, ఇన్నింగ్స్ మొత్తం ఆటను వివిధ రకాలుగా మార్చుకుంటూ శతకం సాధించానని భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. బుధవారం ప్రొటీస్‌తో జరిగిన వన్డేలో భారత్ 124 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో మ్యాచ్ ముగిసిన అనంతరం మీడియాతో ముచ్చటించాడు. కేప్‌టౌన్ వికెట్ చాలా కష్టమైన వికెటని, ప్రత్యర్థి పదునైన బౌలింగ్‌ను ఎదుర్కొని శతకం బాదడం సంతృప్తిగా ఉందని పేర్కొన్నాడు. మ్యాచ్‌లో 30వ ఓవర్ అనంతరం వికెట్ స్లోగా మారిందని, ఆ సమయంలో భారత్ వికెట్లను కోల్పోవడంతో తాను సమయోచితగా ఆడాల్సి వచ్చిందని తెలిపాడు. ఇన్నింగ్స్ మొత్తం బ్యాటింగ్ చేయడం ఆనందంగా ఉందని, అయితే 90ల్లో ఉన్నప్పుడు కాస్తా నెర్వస్‌గా భావించానని పేర్కొన్నాడు. మరోవైపు తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు లేదా ఛేదనకు దిగినప్పుడు తన వ్యూహాలు వేర్వేరుగా ఉంటాయని చెప్పుకొచ్చాడు. మరోవైపు వరుసగా మూడు వన్డేల్లో నెగ్గి 3–0తో తిరుగులేని ఆధిక్యం సాధించిన తమజట్టు నిర్లిప్తంగా ఉండరాదని కోహ్లి సూచించాడు. జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన మూడోటెస్టు నుంచి తాము చాలా కష్టపడి ఆడామని, ఈక్రమంలో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించామని గుర్తు చేశాడు. జట్టు ప్రదర్శన గర్వకారణంగా ఉందని, అయితే ఇప్పటికి తాము సాధించాల్సింది చాలా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. సిరీస్‌లో మరో మూడుమ్యాచ్‌లు ఉన్నాయని, 6–0తో వైట్‌వాష్‌పై దృష్టిసారించాలని పరోక్షంగా జట్టుకు సూచించాడు. ప్రస్తుతానికి తాము సిరీస్ కోల్పోని దశకు చేరుకున్నామని, ఇది జట్టులో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంపొందిస్తుందని అభిప్రాయపడ్డాడు. నాలుగోవన్డేలో ప్రస్తుతానికి మించిన తీవ్రత, కోరికతో మైదానంలోకి అడుగుపెడతామని కోహ్లి పేర్కొన్నాడు. తీవ్రతే నా మంత్రం తీవ్రతే (ఇంటెన్సిటీ) తన బ్యాటింగ్ హాల్‌మార్కు అని, ఒకవేళ అది కోల్పోతే తనకేమీ తోచదని కోహ్లి పేర్కొన్నాడు. ఈ ఏడాది తను 30వ పడిలోకి ప్రవేశిస్తానని, మరో నాలుగైదేళ్లు ఇలాంటి ఇంటెన్సిటీతోనే ఆడతానని తెలిపాడు. ఈక్రమంలో తాను చాలా కఠోర శిక్షణ తీసుకున్నానని తెలిపాడు. తన ఆహారం పట్ల కఠినంగా ఉంటానని పేర్కొన్నాడు. ఇలాంటి విషయాలే తను రాణించాడని దోహదపడుతున్నాయని తెలిపాడు. జట్టుకు అవసరమైన సందర్భాల్లో రాణించడం చాలా ఆనందంగా ఉందని అభిప్రాయపడ్డాడు. బుధవారం వన్డేల్లో చేసిన సెంచరీతో వన్డేల్లో అత్యధిక సెంచరీలు (12)చేసిన భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లి నిలిచాడు. ఈక్రమంలో సౌరవ్ గంగూలీ (11)ని వెనక్కినెట్టాడు. కేప్‌టౌన్ వన్డే విజయంతో ఆరువన్డేల సిరీస్‌లో 3–0తో ఆధిక్యంలో నిలిచిన భారత్.. శనివారం జోహన్నెస్‌బర్గ్‌లో ప్రొటీస్‌తో నాలుగోవన్డే ఆడనుంది. చహల్, కుల్దీప్లపై ప్రణాళికల్ని సవరించుకోవాలి: డుమిని భారత స్పిన్నర్లు యజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్‌లను ఎదుర్కోవడానికి తమజట్టు తాజాగా మళ్లీ ప్రణాళికల్ని రూపొందించాల్సిన అవసరముందని దక్షిణాఫ్రికా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ జేపీ డుమిని అభిప్రాయపడ్డాడు. పరిస్థితులకు తగినట్లుగా వీరిద్దరూ అద్భుతంగా బౌలింగ్ చేశారని, సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు విసిరి తమను కట్టడి చేశారని ప్రశంసించాడు. వారి గూగ్లీలకు తమవద్ద సమాధానం లేకపోయిందని, వారిపై రచించిన వ్యూహాలన్నీ పనికిరాకుండా పోయాయని పేర్కొన్నాడు. వన్డే సిరీస్‌లో తమ పని అయిపోలేదని, నాలుగోవన్డేకు ముందు తమజట్టు తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరముందని తెలిపాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో తాము చక్కని భాగస్వామ్యం నమోదు చేశామని, అయితే కెప్టెన్ ఐదెన్ మార్క్రమ్ ఔటైన తర్వాత పరిస్థితి మారిందని చెప్పుకొచ్చాడు. సరైన భాగస్వామ్యాలు లేకపోవడమే సిరీస్‌లో తమ ఓటములకు కారణమని అంగీకరించాడు. మరోవైపు మూడోవన్డేలో సెంచరీ చేసిన కోహ్లిపై ప్రశంసలు కురిపించాడు. తను ప్రపంచ అత్యుత్తమ ఆటగాడని, తనను ఔట్ చేయాలంటే బౌలర్లు విభిన్నమైన వ్యూహాల్ని రూపొందించాల్సిన అవసరముందని పేర్కొన్నాడు. మరోవైపు నాలుగోవన్డేకు విధ్వంసక బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ అందుబాటులోకి రావడం తమ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని డుమిని అభిప్రాయపడ్డాడు. వన్డే క్రికెట్లో తనో అత్యుత్తమ ఆటగాడని, తన నాయకత్వ లక్షణాలు జట్టుకు ఎంతో విలువ తెస్తుందని డుమిని అభిప్రాయపడ్డాడు. కేప్‌టౌన్ వన్డేలో చహల్, కుల్దీప్లు చెరో నాలుగు వికెట్లతో దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో వీరిద్దరూ కలిపి ఏకంగా 21 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఈక్రమంలో 304 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రొటీస్ 40 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. -
ఆసీస్‌ను కుమ్మేస్తున్నారు!
పెర్త్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా భారీ ఆధిక్యం సాధించింది. 104/2 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా జట్టులో జేపీ డుమినీ(141; 225 బంతుల్లో 20 ఫోర్లు, 1 సిక్స్) భారీ శతకంతో మెరిశాడు. మరోవైపు ఓపెనర్ డీన్ ఎల్గర్ కూడా సెంచరీ సాధించడంతో దక్షిణాఫ్రికా టీ విరామానికి మూడు వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. డుమినీ-ఎల్గర్ల జోడి ఆస్ట్రేలియా బౌలర్లను కుమ్మేసి మూడో వికెట్ కు 250 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని సాధించింది. ఈ భాగస్వామ్యం ఆస్ట్రేలియాలో ఆ జట్టుపై దక్షిణాఫ్రికన్లు నమోదు చేసిన రెండో అత్యుత్తమ భాగస్వామ్యంగా నమోదైంది. దాంతో దక్షిణాఫ్రికా ప్రస్తుతం 293 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో సఫారీలు 242 పరుగులకు ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియా తన మొదటి ఇన్నింగ్స్‌లో 244 పరుగులు చేసింది. కేవలం తొలి రోజు ఆటలో మాత్రమే ఆసీస్ పైచేయి సాధించగా, రెండు, మూడు రోజు ఆటలో దక్షిణాఫ్రికా తన హవా కొనసాగిస్తోంది.