Markram Named Sas T20I Captain, Bavuma Dropped - Sakshi
Sakshi News home page

SA vs WI: దక్షిణాఫ్రికా కొత్త కెప్టెన్‌గా స్టార్‌ క్రికెటర్‌.. బవుమాపై వేటు!

Published Mon, Mar 6 2023 7:00 PM | Last Updated on Mon, Mar 6 2023 7:37 PM

Markram named SAs T20I captain, Bavuma dropped - Sakshi

దక్షిణాఫ్రికా కొత్త టీ20 కెప్టెన్‌గా ఆ జట్టు స్టార్‌ బ్యాటర్‌ ఐడెన్‌ మార్క్‌రమ్ ఎంపికయ్యాడు. టెంబా బవుమా స్థానంలో తమ జట్టు కెప్టెన్‌గా మార్క్‌రమ్‌ను దక్షిణాఫ్రికా క్రికెట్‌ నియమించింది. ఇక బవుమా కేవలం వన్డేలు,టెస్టుల్లో మాత్రమే ప్రోటీస్‌ జట్టుకు సారథ్యం వహించనున్నాడు.  అదే విధంగా వైట్‌బాల్‌ క్రికెట్‌లో తమ జట్టు బ్యాటింగ్‌ కోచ్‌గా మాజీ ఆటగాడు జేపీ డుమిని, బౌలింగ్‌ కోచ్‌గా రోరీ క్లీన్‌వెల్ట్‌ను  దక్షిణాఫ్రికా క్రికెట్‌ ఎంపిక చేసింది.

కాగా స్వదేశం‍లో వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు జట్టును ప్రకటించిన క్రికెట్‌ సౌతాఫ్రికా.. ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక ఇది ఇలా ఉండగా.. మాజీ కెప్టెన్‌ బవుమాను ఇకపై టీ20లకు పరిగణించకూడదని ప్రోటీస్‌ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

మరోవైపు అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకున్న ప్రోటీస్‌ మాజీ కెప్టెన్‌ ఫాఫ్ డుప్లెసిస్.. విండీస్‌ సిరీస్‌తో తిరిగి రీ ఎంట్రీ ఇస్తాడని వార్తలు వినిపించాయి. అయితే సెలక్టర్లు మాత్రం అతడి పునరాగమనంపై ఆసక్తి చూపకపోయినట్లు తెలుస్తోంది. అదే విధంగా ప్రోటీస్ పరిమిత ఓవర్ల హెడ్‌ కోచ్‌ రాబ్ వాల్టర్‌తో డుప్లెసిస్‌ జరిపిన చర్చలు కూడా విఫలమైనట్లు పలు నివేదికలు పేర్కొం‍టున్నాయి.

ఇక​ జట్టు ఎంపిక విషయానికి వస్తే.. వన్డే సిరీస్‌కు స్టార్‌ పేసర్లు కగిసో రబాడ, అన్రిచ్‌ నోర్జేకు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. యువ క్రికెటర్లు గెరాల్డ్ కోయెట్జీ, ర్యాన్ రికెల్టన్, టోనీ డి జోర్జి,ట్రిస్టన్ స్టబ్స్ కు తొలి సారి దక్షిణాఫ్రికా వన్డే జట్టులో చోటు దక్కింది.

తొలి రెండు వన్డేలకు దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బవుమా (కెప్టెన్), గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, జార్న్ ఫార్టుయిన్, రీజా హెండ్రిక్స్, సిసంద మగాలా, కేశవ్ మహరాజ్, వియాన్ ముల్డర్, లుంగీ ఎంగిడీ, ర్యాన్ రికెల్టన్, ఆండిలే స్టిల్బుబ్స్, ఫెహ్లుక్వేబ్స్, లిజాడ్ విలియమ్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్.

మూడో వన్డే కోసం జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, బ్జోర్న్ ఫోర్టుయిన్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, సిసంద మగల, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్ , లుంగి ఎం, ర్యాన్ రికెల్టన్, వేన్ పార్నెల్, ఆండిలే ఫెహ్లుక్వాయో, ట్రిస్టన్ స్టబ్స్, లిజాడ్ విలియమ్స్, రాస్సీ వాన్ డెర్ డ్యూసెన్.

టీ20లకు ప్రోటీస్‌ జట్టు: ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్, జార్న్ ఫోర్టుయిన్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, సిసంద మగాలా, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్‌గిడి, అన్రిచ్ నార్టే, వేన్ పార్నెల్, కగిసో రబాడ, రిలీ రోసోవ్, , ట్రిస్టన్ స్టబ్స్.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement