ఫాబియన్ అలెన్(ఫైల్ ఫోటో)
దక్షిణాఫ్రికాలో ఉన్న వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఫాబియన్ అలెన్‌కు చేదు అనుభవం ఎదురైంది. సౌతాఫ్రికా టీ20 లీగ్ 2024లో అలెన్ పార్ల్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు. ఈ క్రమంలో జోహాన్స్‌బర్గ్‌లో జట్టు బసచేస్తున్న శాండ్‌టన్ సన్ హోటల్ సమీపంలో అలెన్‌ను కొంతమంది దుండగలు తుపాకితో బెదరించి తన ఫోన్‌ను, వ్యక్తిగత వస్తువులను ఎత్తుకుపోయారు.
ఈ ఘటనతో ఫాబియన్ అలెన్ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైనట్లు విండీస్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం క్రీడావర్గాల్లో చర్చనీయాంశమైంది. ఒక అంతర్జాతీయ క్రికెటర్‌కు కనీస భద్రత లేకపోవడం పట్ల క్రికెట్ సౌతాఫ్రికాపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. "మా జట్టు ప్రధాన కోచ్ ఆండ్రీ కోలీ ఫాబియన్‌తో ఇప్పటికే మాట్లాడాడు. మరో విండీస్ క్రికెటర్ ఒబెడ్ మెక్‌కాయ్ కూడా ప్రస్తుతం సౌతాఫ్రికాలోనే ఉన్నాడు.
ఈ క్రమంలో మెక్‌కాయ్‌ను ఆండ్రీ కోలీ కాంటాక్ట్ అయ్యాడు. ప్రస్తుతం అలెన్ బాగానే ఉన్నాడు. కానీ ఈ ఘటనపై సౌతాఫ్రికా క్రికెట్, పార్ల్ రాయల్స్ ఇంకా స్పందించాల్సి ఉందని" విండీస్ క్రికెట్ సీనియర్ అధికారి ఒకరు క్రిక్‌బజ్‌తో పేర్కొన్నారు. కాగా ఈ ఏడాది సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో అలెన్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ కరేబియన్ ఆల్‌రౌండర్ 8 మ్యాచ్‌లు ఆడి కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment