సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో (SA20 2025) భాగంగా ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్‌తో నిన్న (జనవరి 15) జరిగిన మ్యాచ్‌లో పార్ల్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ కేప్‌టౌన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఓపెనర్ రస్సీ వాన్ డర్ డస్సెన్ (64 బంతుల్లో 91 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ అర్ద శతకంతో ఎంఐ కేప్‌టౌన్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. రీజా హెండ్రిక్స్ 27 బంతుల్లో 30.. అజ్మతుల్లా 11 బంతుల్లో 13, జార్జ్ లిండే 10 బంతుల్లో 10, డెవాల్డ్ బ్రెవిస్ 4 బంతుల్లో 8, డెలానో పాట్‌గెటర్ 5 బంతుల్లో 2 (నాటౌట్) పరుగులు చేశారు.
డస్సెన్ ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో క్వేనా మఫాకాకు చుక్కలు చూపించాడు. ఈ ఓవర్‌లో డస్సెన్ రెండు సిక్సర్లు, బౌండరీ సహా 20 పరుగులు పిండుకున్నాడు. స్పెషలిస్ట్ బ్యాటర్ అయిన జో రూట్ ఈ మ్యాచ్‌లో బంతితో అద్భుతంగా రాణించాడు. ఇన్నింగ్స్ 16, 18, 20 ఓవర్లు వేసిన రూట్ కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి ముంబై బ్యాటర్లను కట్టడి చేశాడు. రాయల్స్ బౌలర్లలో ముజీబ్ రెండు, రూట్, గేలిమ్ తలో వికెట్ పడగొట్టారు.
ప్రిటోరియస్ విధ్వంసం
159 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్ 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. యువ ఓపెనర్ డ్రి ప్రిటోరియస్ (52 బంతుల్లో 83; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర అర్ద శతకం బాది రాయల్స్ విజయానికి గట్టి పునాది వేశాడు. రూట్ 15, మిచెల్ వాన్ బూరెన్ 22, డేవిడ్ మిల్లర్ 24 (నాటౌట్), దినేశ్ కార్తీక్ (10), అండైల్ ఫెహ్లుక్వాయో 1 (నాటౌట్) పరుగులు చేశారు.
ముంబై బౌలర్లలో రషీద్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో రాయల్స్ గత మ్యాచ్‌లో ముంబై చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది.
అదరగొడుతున్న ప్రిటోరియస్
ప్రస్తుత ఎడిషన్‌లో పార్ల్ రాయల్స్ యువ ఓపెనర్ డ్రి ప్రిటోరియస్ అదరగొడుతున్నాడు. ఈ సీజన్‌లో ప్రిటోరియస్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 68.67 సగటున, 179.13 స్ట్రయిక్‌రేట్‌తో 206 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో ప్రిటోరియస్ లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. 18 ఏళ్ల వయసులోనే అద్భుతమైన బ్యాటింగ్ ప్రతిభ కనబరుస్తున్న ప్రిటోరియస్ సౌతాఫ్రికాకు ఆశాకిరణంలా మారాడు.
SA20 2025లో ప్రిటోరియస్ స్కోర్లు..
సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్‌పై 51 బంతుల్లో 97 (ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్)
ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్‌పై 12 బంతుల్లో 26
ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్‌పై 52 బంతుల్లో 83 (ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్)
Comments
Please login to add a commentAdd a comment