
ముచ్చటగా మూడోసారి గెలిచి.. సౌతాఫ్రికా టీ20 లీగ్(South Africa T20 League)లో ‘హ్యాట్రిక్’ చాంపియన్‌గా నిలవాలన్న సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్(Sunrisers Eastern Cape) జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. బ్యాటర్ల సమష్టి కృషికి... రబడ, బౌల్ట్ బుల్లెట్ బౌలింగ్ తోడవడంతో... ముంబై ఇండియన్స్ (ఎంఐ) కేప్‌టౌన్ జట్టు ఫైనల్లో రైజర్స్‌పై విజయం సాధించింది.
తద్వారా తొలిసారి SAT20 ట్రోఫీ చేజిక్కించుకుంది. మరి ఫైనల్ విశేషాలు, ప్రైజ్‌మనీ వివరాలు, అత్యధిక పరుగులు, వికెట్ల వీరులు తదితర అంశాలపై ఓ లుక్కేద్దామా?!
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా శనివారం అర్ధరాత్రి దాటాక ఎంఐ కేప్‌టౌన్- సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. రషీద్ ఖాన్ కెప్టెన్సీలోని ఎంఐ జట్టు మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.
రికెల్టన్ (15 బంతుల్లో 33; 1 ఫోర్, 4 సిక్స్‌లు), ఎస్టెర్‌హ్యుజెన్ (39; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), బ్రేవిస్ (18 బంతుల్లో 38; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), డసెన్ (23) తలా కొన్ని పరుగులు చేశారు.
సన్‌రైజర్స్‌బ్యాటింగ్ ఆర్డర్ కుదేలు
ఇక సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ బౌలర్లలో మార్కో యాన్సెన్, రిచర్డ్ గ్లీసన్, లియామ్ డాసన్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఎంఐ కేప్‌టౌన్ బౌలర్ల ధాటికి సన్‌రైజర్స్ జట్టు నిలవలేకపోయింది. 18.4 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌటైంది.
టామ్ అబెల్ (30) టాప్ స్కోరర్ కాగా... కెప్టెన్ మార్క్‌రమ్ (6), స్టబ్స్ (15), యాన్సెన్ (5), బెడింగ్‌హమ్ (5) విఫలమయ్యారు. ఎంఐ బౌలర్లలో రబడ 4 వికెట్లు పడగొట్టగా... బౌల్డ్ 4 ఓవర్లలో కేవలం 9 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీశాడు.
ఈ క్రమంలో ఎంఐ కేప్‌టౌన్ జట్టు 76 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్‌ను చిత్తు చేసింది. ఈ నేపథ్యంలో గత రెండు పర్యాయాలు విజేతగా నిలిచిన సన్‌రైజర్స్ ఫ్రాంచైజీకి చెందిన ఈస్టర్న్ కేప్ జట్టు... ఈసారి రన్నరప్‌తో సరిపెట్టుకోగా... ఎంఐ కేప్‌టౌన్ తొలిసారి ట్రోఫీ హస్తగతం చేసుకుంది. బౌల్డ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, మార్కో యాన్సెన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’అవార్డులు దక్కాయి. కాగా 2023లో తొలిసారి సౌతాఫ్రికా టీ20 లీగ్ ప్రవేశపెట్టగా
అవార్డుల వివరాలు
👉ఫైనల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్- బౌల్ట్ (ఎంఐ కేప్‌టౌన్)
👉స్పిరిట్ ఆఫ్ ద సీజన్- ఎంఐ కేప్‌టౌన్
👉క్యాచ్ ఆఫ్ ద సీజన్- బ్రేవిస్ (ఎంఐ కేప్‌టౌన్)
👉రైజింగ్ స్టార్ బ్రేవిస్- (ఎంఐ కేప్‌టౌన్)
👉బ్యాటర్ ఆఫ్ ద సీజన్- ప్రిటోరియస్ (పార్ల్ రాయల్స్)
👉బౌలర్ ఆఫ్ ద సీజన్- యాన్సెన్ (ఈస్టర్న్ కేప్)
👉ప్లేయర్ ఆఫ్ ది సీజన్- యాన్సెన్ (ఈస్టర్న్ కేప్)
ఎస్‌ఏ20 2025 విశేషాలు
👉అత్యధిక పరుగులు- ప్రిటోరియస్ 397
👉అత్యధిక వికెట్లు- యాన్సెన్ 19 వికెట్లు
👉అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన- రబడ 4/25
👉అత్యధిక సిక్స్‌లు- బ్రేవిస్ 25
👉అత్యధిక ఫోర్లు- ప్రిటోరియస్ 47
ప్రైజ్‌మనీ వివరాలు
👉విజేత జట్టుకు 3,25,00,000 ర్యాండ్‌లు (రూ. 15 కోట్ల 46 లక్షలు)
👉రన్నరప్ జట్టుకు 1,62,00,000 ర్యాండ్‌లు (రూ. 7 కోట్ల 70 లక్షలు).
చదవండి: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ టెండుల్కర్‌ను దాటేసి..
𝐏𝐎𝐕 - 𝒀𝒐𝒖'𝒗𝒆 𝒋𝒖𝒔𝒕 𝒘𝒐𝒏 #BetwaySA20 season 3 🏆 #WelcomeToIncredible pic.twitter.com/RZmQFsGMFK
— Betway SA20 (@SA20_League) February 8, 2025
Comments
Please login to add a commentAdd a comment