
రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన ఆసీస్
5 వికెట్ల తేడాతో స్మిత్ సేన జయభేరి
టోర్నీ చరిత్రలో భారీ స్కోరు చేసినా ఓటమి పాలైన ఇంగ్లండ్
డకెట్ శతకం వృథా
లాహోర్: ఐసీసీ చాంపియన్స్(ICC Champions) ట్రోఫీలో పలు రికార్డుల్ని చెరిపేసిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా(Australia) ఘన విజయం సాధించింది. గ్రూప్ ‘బి’లో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్(England)నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 351 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ బెన్ డకెట్ (143 బంతుల్లో 165; 17 ఫోర్లు, 3 సిక్స్‌లు) భారీ సెంచరీతో ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు.
మిడిలార్డర్ బ్యాటర్ జో రూట్ (78 బంతుల్లో 68; 4 ఫోర్లు) అర్ధ శతకం సాధించాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన ఆ్రస్టేలియా 47.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసి గెలిచింది. 136/4 స్కోరు వద్ద ఓటమి వెంటాడుతున్న దశలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జోష్ ఇన్‌గ్లిస్ (86 బంతుల్లో 120 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు సెంచరీతో జట్టును గెలిపించే దాకా క్రీజులో నిలిచాడు.
ఓపెనర్ మాథ్యూ షార్ట్ (66 బంతుల్లో 63; 9 ఫోర్లు, 1 సిక్స్), అలెక్స్ కేరీ (63 బంతుల్లో 69; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించగా, లబుõÙన్ (45 బంతుల్లో 47; 5 ఫోర్లు) రాణించాడు. చివర్లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ (15 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అండగా నిలిచాడు. 2009 తర్వాత ఆసీస్ చాంపియన్స్ ట్రోఫీలో గెలవడం ఇదే తొలిసారి. 2013 ఈవెంట్‌లో రెండింట ఓడిపోగా, ఓ మ్యాచ్ రద్దయ్యింది. 2017లో రెండు మ్యాచ్‌లు రద్దవగా, ఓ మ్యాచ్‌లో ఓడింది. చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగుల ఛేదన చేసిన జట్టుగా ఆసీస్ నిలిచింది.
స్కోరు వివరాలు
ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) కేరీ (బి) డ్వార్షుయిస్ 10; డకెట్ (ఎల్బీడబ్ల్యూ) (బి) లబుషేన్ 165; జేమీ స్మిత్ (సి) కేరీ (బి) డ్వార్షుయిస్ 15; రూట్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జంపా 68; హ్యారీ బ్రూక్ (సి) కేరీ (బి) జంపా 3; బట్లర్ (సి) ఎలీస్ (బి) మ్యాక్స్‌వెల్ 23; లివింగ్‌స్టోన్ (సి) ఎలిస్ (బి) డ్వార్షుయిస్ 14; కార్స్ (సి) అండ్ (బి) లబుõÙన్ 8; ఆర్చర్ నాటౌట్ 21; రషీద్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 23; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 351.
వికెట్ల పతనం: 1–13, 2–43, 3–201, 4–219, 5–280, 6–316, 7–322, 8–338. బౌలింగ్: జాన్సన్ 7–0–54–0, డ్వార్షుయిస్ 10–0–66–3, నాథన్ ఎలిస్ 10–0–51–0, మ్యాక్స్‌వెల్ 7–0–58–1, జంపా 10–0–64–2, షార్ట్ 1–0–7–0, లబుõÙన్ 5–0–41–2.
ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: షార్ట్ (సి) అండ్ (బి) లివింగ్‌స్టోన్ 63; హెడ్ (సి) అండ్ (బి) ఆర్చర్ 6; స్మిత్ (సి) డకెట్ (బి) వుడ్ 5; లబుషేన్ (సి) బట్లర్ (బి) రషీద్ 47; ఇంగ్లిస్ నాటౌట్ 120; కేరీ (సి) బట్లర్ (బి) కార్స్ 69; మ్యాక్స్‌వెల్ నాటౌట్ 32; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (47.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి) 356. వికెట్ల పతనం: 1–21, 2–27, 3–122, 4–136, 5–282. బౌలింగ్: మార్క్‌వుడ్ 9.3–0–75–1, జోఫ్రా ఆర్చర్ 10–0–82–1, కార్స్ 7–0–69–1, రషీద్ 10–1–47–1, లివింగ్‌స్టోన్ 7–0–47–1, రూట్ 4–0–26–0.
లాహోర్‌లో ‘భారత భాగ్య విధాత’
భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్లలేదు... ఆ దేశంలో మ్యాచ్ ఆడటం లేదు... అయినా సరే మన జనగణమన... అక్కడ మోగింది. నిర్వాహకులు చేసిన పొరపాటు వల్ల ఇది చోటు చేసుకుంది. ఏదైనా మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల జాతీయ గీతాలు వినిపించడం రివాజు. శనివారం కూడా ముందుగా ఇంగ్లండ్ జాతీయ గీతం ‘గాడ్ సేవ్ ద కింగ్’ వినిపించింది. ఆ తర్వాత ఆ్రస్టేలియా ‘అడ్వాన్స్ ఆ్రస్టేలియా ఫెయిర్’ రావాల్సి ఉంది. అయితే ఆసీస్ జెండా కనిపిస్తుండగా సాంకేతిక పొరపాటు జరిగింది.
భారత జాతీయ గీతంలోని పదం ‘భారత భాగ్య విధాత’ వినిపించింది. ఒక్కసారిగా షాక్‌కు గురైన సిబ్బంది దానిని వెంటనే నిలిపివేశారు. అయితే అప్పటికే అది ప్రసారం అయిపోయింది. దీనిపై పాక్ బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. మైదానంలో నిర్వహణా బాధ్యతలు చూస్తున్న ఐసీసీ వివరణ ఇవ్వాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment