icc champions
-
ఇన్‌గ్లిస్ ధనాధన్ షో
లాహోర్: ఐసీసీ చాంపియన్స్(ICC Champions) ట్రోఫీలో పలు రికార్డుల్ని చెరిపేసిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా(Australia) ఘన విజయం సాధించింది. గ్రూప్ ‘బి’లో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్(England)నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 351 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ బెన్ డకెట్ (143 బంతుల్లో 165; 17 ఫోర్లు, 3 సిక్స్‌లు) భారీ సెంచరీతో ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు.మిడిలార్డర్ బ్యాటర్ జో రూట్ (78 బంతుల్లో 68; 4 ఫోర్లు) అర్ధ శతకం సాధించాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన ఆ్రస్టేలియా 47.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసి గెలిచింది. 136/4 స్కోరు వద్ద ఓటమి వెంటాడుతున్న దశలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జోష్ ఇన్‌గ్లిస్ (86 బంతుల్లో 120 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు సెంచరీతో జట్టును గెలిపించే దాకా క్రీజులో నిలిచాడు.ఓపెనర్ మాథ్యూ షార్ట్ (66 బంతుల్లో 63; 9 ఫోర్లు, 1 సిక్స్), అలెక్స్ కేరీ (63 బంతుల్లో 69; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించగా, లబుõÙన్ (45 బంతుల్లో 47; 5 ఫోర్లు) రాణించాడు. చివర్లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ (15 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అండగా నిలిచాడు. 2009 తర్వాత ఆసీస్ చాంపియన్స్ ట్రోఫీలో గెలవడం ఇదే తొలిసారి. 2013 ఈవెంట్లో రెండింట ఓడిపోగా, ఓ మ్యాచ్ రద్దయ్యింది. 2017లో రెండు మ్యాచ్‌లు రద్దవగా, ఓ మ్యాచ్‌లో ఓడింది. చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగుల ఛేదన చేసిన జట్టుగా ఆసీస్ నిలిచింది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) కేరీ (బి) డ్వార్షుయిస్ 10; డకెట్ (ఎల్బీడబ్ల్యూ) (బి) లబుషేన్ 165; జేమీ స్మిత్ (సి) కేరీ (బి) డ్వార్షుయిస్ 15; రూట్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జంపా 68; హ్యారీ బ్రూక్ (సి) కేరీ (బి) జంపా 3; బట్లర్ (సి) ఎలీస్ (బి) మ్యాక్స్‌వెల్ 23; లివింగ్‌స్టోన్ (సి) ఎలిస్ (బి) డ్వార్షుయిస్ 14; కార్స్ (సి) అండ్ (బి) లబుõÙన్ 8; ఆర్చర్ నాటౌట్ 21; రషీద్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 23; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 351.వికెట్ల పతనం: 1–13, 2–43, 3–201, 4–219, 5–280, 6–316, 7–322, 8–338. బౌలింగ్: జాన్సన్ 7–0–54–0, డ్వార్షుయిస్ 10–0–66–3, నాథన్ ఎలిస్ 10–0–51–0, మ్యాక్స్‌వెల్ 7–0–58–1, జంపా 10–0–64–2, షార్ట్ 1–0–7–0, లబుõÙన్ 5–0–41–2. ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: షార్ట్ (సి) అండ్ (బి) లివింగ్‌స్టోన్ 63; హెడ్ (సి) అండ్ (బి) ఆర్చర్ 6; స్మిత్ (సి) డకెట్ (బి) వుడ్ 5; లబుషేన్ (సి) బట్లర్ (బి) రషీద్ 47; ఇంగ్లిస్ నాటౌట్ 120; కేరీ (సి) బట్లర్ (బి) కార్స్ 69; మ్యాక్స్‌వెల్ నాటౌట్ 32; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (47.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి) 356. వికెట్ల పతనం: 1–21, 2–27, 3–122, 4–136, 5–282. బౌలింగ్: మార్క్‌వుడ్ 9.3–0–75–1, జోఫ్రా ఆర్చర్ 10–0–82–1, కార్స్ 7–0–69–1, రషీద్ 10–1–47–1, లివింగ్‌స్టోన్ 7–0–47–1, రూట్ 4–0–26–0.లాహోర్‌లో ‘భారత భాగ్య విధాత’ భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్లలేదు... ఆ దేశంలో మ్యాచ్ ఆడటం లేదు... అయినా సరే మన జనగణమన... అక్కడ మోగింది. నిర్వాహకులు చేసిన పొరపాటు వల్ల ఇది చోటు చేసుకుంది. ఏదైనా మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల జాతీయ గీతాలు వినిపించడం రివాజు. శనివారం కూడా ముందుగా ఇంగ్లండ్ జాతీయ గీతం ‘గాడ్ సేవ్ ద కింగ్’ వినిపించింది. ఆ తర్వాత ఆ్రస్టేలియా ‘అడ్వాన్స్ ఆ్రస్టేలియా ఫెయిర్’ రావాల్సి ఉంది. అయితే ఆసీస్ జెండా కనిపిస్తుండగా సాంకేతిక పొరపాటు జరిగింది.భారత జాతీయ గీతంలోని పదం ‘భారత భాగ్య విధాత’ వినిపించింది. ఒక్కసారిగా షాక్‌కు గురైన సిబ్బంది దానిని వెంటనే నిలిపివేశారు. అయితే అప్పటికే అది ప్రసారం అయిపోయింది. దీనిపై పాక్ బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. మైదానంలో నిర్వహణా బాధ్యతలు చూస్తున్న ఐసీసీ వివరణ ఇవ్వాలని కోరింది. -
‘స్పోర్ట్స్ డేటా గేమ్‌థాన్’ను ప్రారంభించింన FIFS..
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10, 2025: స్పోర్ట్స్ టెక్‌లో భారతదేశాన్ని గ్లోబల్ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్స్ (FIFS) ఆధ్వర్యంలో డ్రీమ్11 సమర్పనలో స్పోర్ట్స్ AI ఛాలెంజ్ ‘స్పోర్ట్స్ డేటా గేమ్‌థాన్’ను ప్రారంభించింది. ఈ అధునాతన సాంకేతిక పోటీ డేటాను సమగ్రపరచడంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML) వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను క్రీడలకు ఉపయోగించుకోవడానికి నూతన మార్గాలను అన్వేషించే దిశగా అడుగులేస్తుంది.ఈ గేమ్థాన్లో ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ల నుండి విద్యార్థి జట్లు పాల్గొంటాయి. ఇందులో పాల్గొనే వారు ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సందర్భంగా రోజువారీ ఫాంటసీ స్పోర్ట్స్ ఫార్మాట్లో పోటీపడతారు. ముఖ్యంగా డేటా అనలిటిక్స్ నైపుణ్యాలను ఉపయోగించుకుంటూ, గేమ్‌థాన్ యొక్క బదిలీ పరిమితులు ఇతర నియమాలకు కట్టుబడి విజేతగా నిలవడానికి వ్యూహాన్ని రూపొందించడంలో ఏఐ, ఎమ్ఎల్ నమూనాలను నిర్మించాలి.ఈ ప్రతిష్టాత్మక పోటీకి 30 కి పైగా ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపాయి. వారి వ్యూహాత్మక ప్రణాళికలను సమీక్షించిన తర్వాత., IIT బాంబే, IIT ఢిల్లీ, IIT ఖరగ్‌పూర్, IIT కాన్పూర్, IIIT ధార్వాడ్ వంటి సంస్థల నుండి 52 జట్లు షార్ట్‌లిస్ట్ చేయబడ్డాయి. మొదటి మూడు జట్లు వరుసగా రూ.12.5 లక్షలు, 7.5 లక్షలు, 5 లక్షలు అందుకుంటూ మొత్తంగా 25 లక్షల బహుమతిని గెలుచుకుంటారు.గేమ్‌థాన్ అంతటా విద్యార్థులకు మద్దతుగా, FIFS ఇద్దరు నిపుణులను ఆన్-బోర్డ్ చేసింది - ప్రఖ్యాత క్రికెట్ విశ్లేషకుడు జాయ్ భట్టాచార్య మరియు USలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో AI వైస్ డీన్ ప్రొఫెసర్ విశాల్ మిశ్రా, విద్యార్థి బృందాలకు వారి నిపుణుల మార్గదర్శకత్వాన్ని అందిస్తారు.ఈ సందర్భంగా FIFS డైరెక్టర్ జనరల్ జాయ్ భట్టాచార్య మాట్లాడుతూ.., "స్పోర్ట్స్ డేటా గేమ్‌థాన్ యొక్క మొదటి ఎడిషన్‌ను ప్రారంభించడానికి మేము సంతోషిస్తున్నాము. మా ప్రయత్నానికి విశేష స్పందన లభిస్తుంది. ఈ గేమ్థాన్లో ప్రధానంగా యువతరం పోటీ పడటం పట్ల మేము సంతోషిస్తున్నామ’’ని అన్నారు.‘స్పోర్ట్స్ డేటా గేమ్‌థాన్’ అనేది ఆవిష్కరణకు ప్రోత్సాహక వేదికగా మారడంతో పాటు భారతదేశాన్ని స్పోర్ట్స్ టెక్నాలజీలో ప్రపంచ నేతగా ఎదగడమే లక్ష్యంగా ముందుకు తీసుకెళ్లన్నుంది. ఈ తరంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న స్పోర్ట్స్ అనలిటిక్స్ రంగంలో యువ ప్రతిభను పెంపొందించడంతో గేమ్‌థాన్ అభిమానుల భాగస్వామ్యాన్ని పునర్నిర్వచించడానికి.. అత్యాధునిక సాంకేతికత, డిజిటల్ కంటెంట్ అనుసంధానం చేసే విశిష్టమైన వ్యవస్థను పెంపొందిస్తుంది. -
ఇండో-పాక్ వార్ వన్‌సైడే: చికాగో బాబాయ్
రియాద్: ఇండియా- పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు జరిగినా స్టాండ్స్‌లో అతను ఉండాల్సిందే. తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో నెలవంక గుర్తుండే పాక్ జాతీయ జెండాను రెపరెపలాడిస్తూ ఆయన చేసే సందడి మ్యాచ్‌కు అదనపు ఆకర్షణ. దాయాదిపై పోరులో పాక్ ఆటగాళ్లను ఉత్తేజపరుస్తూ.. తెల్లగడ్డంతో చిరునవ్వులు చిందించే మొహమ్మద్ బషీర్ అలియాస్ చాచా చికాగో(చికాగో బాబాయ్) తాజా ప్రకటన సంచలనంగా మారింది. పాక్ వీరాభిమానిగా పేరుతెచ్చుకున్న ఆయన.. ఇండియాకు వత్తాకు పలకండం పాకిస్థానీ క్రికెట్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాంగంగా బర్మింగ్‌హోమ్‌లో జూన్ 4న జరగనున్న ఇండో-పాక్ మ్యాచ్ ఫలితాన్ని బషీర్ ముందే చెప్పేశాడు. ‘వార్ వన్ సైడే! ధోనీ, కోహ్లీ, యువరాజ్ లాంటి ఉద్ధండుల్ని ఢీకొట్టే సత్తా పాకిస్థాన్‌కు లేదు’ అని తేల్చిచెప్పాడు. కుటుంబంతో కలిసి మక్కా పర్యటనలో ఉన్న తాను.. జూన్ 4నాటి మ్యాచ్‌కు హాజరుకాబోనని చెప్పాడు. పాకిస్థాన్‌లోని కరాచీకి చెందిన మొహమ్మద్ బషీర్.. అమెరికాలోని చికాగోలో రెస్టారెంట్ యజమానిగా స్థిరపడ్డారు. 2011 నుంచి ఇండియా-పాకిస్థాన్‌ల మధ్య జరిగిన అన్ని మ్యాచ్‌లకు హాజరైన ఆయన తనదైన శైలిలో సందడిచేస్తూ ఇరుదేశాల ప్రేమాభిమానాలను పొందాడు ‘నిన్ననే సుధీర్ చౌదరీ(సచిన్ వీరాభిమాని) ఫోన్ చేసి ‘మ్యాచ్‌కు వస్తున్నావా?’ అని అడిగాడు. పరిస్థితి వివరించి రావడంలేదని చెప్పా. అయినా ఇండో-పాక్ మ్యాచ్ అంటే ఒకప్పుడున్నంత మజా ఇప్పుడు లేదు. పాక్ టీమ్ క్రమంగా బలహీనపడింది. అదే సమయంలో టీమిండియా బలపడింది. ఇండియాను ఢీకొట్టే సత్తా మావాళ్లకులేదు’ అని బషీర్ అన్నారు. సౌదీ అరేబియాలో ఫుట్‌బాల్ హవా ఉంటుందని, క్రికెట్ మ్యాచ్‌లు కూడా ప్రసారం కావని బషీర్ చెప్పారు. ‘బర్మింగ్‌హోమ్ వెళ్లలేకపోయినా మ్యాచ్‌ను చూడకుండా ఉండలేను. ఇక్కడ(సౌదీలో) క్రికెట్ మ్యాచ్‌లు ప్రసారంకావు. కాబట్టి ఇంటర్నెట్లో చూస్తా’ అన్నారు బషీర్ అలియాస్ చికాగో చాచా. అన్నట్లు చాచా.. ఎమ్మెస్ ధోనీకి కూడా వీరాభిమానే.