
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో హైవోల్టేజ్ మ్యాచ్‌కు సమయం అసన్నమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా చిరకాల ప్రత్యర్ధిలు భారత్-పాకిస్తాన్(IND-PAK) జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్.. పాక్‌పై కూడా గెలిచి సెమీస్‌కు ఆర్హత సాధించాలని పట్టుదలతో ఉంది.
కానీ పాకిస్తాన్‌కు మాత్రం ఇది డూర్ ఆర్ డై మ్యాచ్. మొదటి మ్యాచ్‌లో కివీస్ చేతిలో ఓటమి చవిచూసిన పాకిస్తాన్.. సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే భారత్‌పై ఖచ్చితంగా గెలవాల్సిందే. ఈ క్రమంలో టీమిండియాతో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
కేవలం ఒక్క మ్యాచ్ కోసం తమ జట్టు స్పెషల్ కోచ్‌గా మాజీ క్రికెటర్ ముదాసర్ నాజర్‌ను పీసీబీ నియమించింది. పాకిస్థాన్ తాత్కాలిక ప్రధాన కోచ్ ఆకిబ్ జావేద్‌తో కలిసి ముదాసర్ పనిచేయనున్నాడు. రెండు రోజుల కిందటే జట్టుతో కలిసిన ముదాసర్.. ప్రాక్టీస్ సెషన్‌లో తన అనుభవాన్ని ఆటగాళ్లతో పంచుకున్నాడు.
కాగా ముదాసర్ దుబాయ్ పిచ్ కండీషన్స్‌పై విస్తృతమైన అవగాహన ఉంది. అతడు గత కొంతకాలంగా దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే ముదాసర్‌ను పాక్ క్రికెట్ బోర్డు తమ జట్టు కోచింగ్ స్టాప్‌లోకి తీసుకుంది. కాగా ముదాసర్‌కు కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది.
గతంలో పాకిస్తాన్, కెన్యా, యూఏఈ జట్లకు కోచ్‌గా అతడు పనిచేశాడు. అంతేకాకుండా లాహోర్‌లోని పీసీబీ హై పెర్ఫార్మెన్స్ సెంటర్ డైరకర్ట్‌గా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించాడు. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన ముదాసర్ పాకిస్తాన్ తరఫున 76 టెస్ట్‌లు ఆడి 4114 పరుగులు, 122 వన్డేల్లో 2653 పరుగులు చేశాడు.
తుది జట్లు(అంచనా)
భారత్: శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి
పాకిస్తాన్: ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్
చదవండి: Champions Trophy: కళ్లు చెదిరే క్యాచ్.. సూపర్‌మేన్‌లా డైవ్ చేస్తూ! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment