దక్షిణాఫ్రికా క్రికెటర్లకు ఆదేశ క్రికెట్ బోర్డు షాకిచ్చింది. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఆడేందుకు అనుమతిని తిరస్కరించింది. రాబోయే అంతర్జాతీయ పర్యటనలు, దేశీయ మ్యాచ్‌ల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు తెలిపింది. సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉన్నఆటగాళ్లు పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పాల్గొనడం లేదని సౌతాఫ్రికా క్రికెట్ డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ తెలిపారు. కాగా ఫిబ్రవరిలో న్యూజిలాండ్ పర్యటనకు ప్రోటిస్ జట్టు వెళ్లనుంది. అదే విధంగా స్వదేశంలో బంగ్లాదేశ్‌తో కూడా ఆడనుంది. ఇక పాకిస్తాన్ సూపర్ లీగ్ జనవరి 24 నుంచి ప్రారంభం కానుంది.
"అంతర్జాతీయ షెడ్యూల్, దేశీయ మ్యాచ్‌ల కారణంగా పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పాల్గొనేందకు ప్రోటిస్ ఆటగాళ్ల అనుమతిని తిరస్కరించాం. త్వరలోనే మేము న్యూజిలాండ్‌లో పర్యటించున్నాం. అదే విధంగా స్వదేశంలో బంగ్లాదేశతో ఆడనున్నాం. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు జట్టు సేవలకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇవ్వాలి" అని స్మిత్ పేర్కొన్నాడు. కాగా ఇమ్రాన్ తాహిర్, రిలీ రోసౌ, మర్చంట్ డి లాంజే పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఆడుతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment