Grame Smith
-
రోహిత్ ఫామ్‌లోకి రావాలంటే అదొక్కటే మార్గం: స్మిత్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గత కొంత కాలంగా పేలవ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా అంతగా రాణించలేకపోయాడు. అంతేకాకుండా ఈ తుది పోరులో కెప్టెన్‌గా కూడా రోహిత్ విఫలమయ్యాడు. ఈ క్రమంలో రోహిత్‌ను టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పించి మరోకరికి జట్టు పగ్గాలు అప్పజెప్పాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మను ఉద్దేశించి దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ కీలక వాఖ్యలు చేశాడు. రోహిత్‌కు ప్రస్తుతం తగినంత విశ్రాంతి అవసరమని గ్రేమ్ స్మిత్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ తిరిగి గాడిలో పడాలంటే ఇదొక్కటే మార్గమని అతడు తెలిపాడు. "కెప్టెన్‌కి ఎదురయ్యే అతిపెద్ద సవాళ్లలో వారి వ్యక్తిగత ప్రదర్శన ఒకటి. జట్టును నడిపించే వాడికి ఎప్పుడూ ఒత్తిడి ఉండే ఉంటుంది. నా వరకు అయితే రోహిత్‌కు ప్రస్తుతం విశ్రాంతి అవసరం. అతడు రిఫ్రెష్ కావాలి. అతడు ఏ ఫార్మాట్లో కూడా నిలకడగా ఆడటం లేదు. ఐపీఎల్, డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా అదే తీరు కనబరిచాడు. అతడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. అందరూ అతడి వ్యక్తిగత ప్రదర్శన పట్ల విమర్శలు కురిపిస్తున్నారు తప్ప కెప్టెన్సీ పై కాదు. అతడు తన ఫామ్‌ను తిరిగి పొందడం ప్రస్తుతం భారత జట్టుకు ఎంతో అవసమని" టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్మిత్ పేర్కొన్నాడు. చదవండి: CWC Qualifiers 2023: వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన సీన్ విలియమ్స్ -
దక్షిణాఫ్రికా టీ20 లీగ్ ప్రైజ్‌మనీ ఎన్ని కోట్లంటే?
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తొలిసారి నిర్వహించనున్న ఎస్ఏ టి20 లీగ్‌లో మొత్తం ప్రైజ్‌మనీ వివరాలను ప్రకటించారు. టోర్నీలో 7 కోట్ల ర్యాండ్ లు (రూ. 33 కోట్ల 35 లక్షలు) ప్రైజ్‌మనీగా ఇవ్వనున్నట్లు లీగ్ కమిషనర్, మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ వెల్లడించారు. దక్షిణాఫ్రికా ఫ్రాంచైజీ క్రికెట్లో ఇప్పటి వరకు ఇదే అతి పెద్ద మొత్తం. జనవరి 10 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరిగే ఈ టోర్నమెంట్లో మొత్తం 33 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. మొత్తం 6 జట్లు ఇందులో పాల్గొంటుండగా... ఆరు టీమ్‌లనూ ఐపీఎల్‌కు చెందిన యాజమాన్యాలే కొనుగోలు చేశాయి. ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్, పార్ల్ రా యల్స్, జొహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్, ప్రిటోరియా క్యాపిటల్స్, డర్బన్ సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ పేర్లతో జట్లు బరిలోకి దిగుతాయి. చదవండి: AUS-W vs IND-W: ఆఖరి టీ20లోనూ భారత్‌కు తప్పని ఓటమి.. -
దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమాకు ఘోర అవమానం! ఎందుకిలా జరిగిందో చెప్పిన మాజీ ఆల్‌రౌండర్
CSA T20 League- సౌతాఫ్రికా టీ20 లీగ్ వేలంలో ప్రొటిస్ యువ ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్ చరిత్ర సృష్టించాడు. కేప్‌టౌన్ వేదికగా సోమవారం జరిగిన ఆక్షన్‌లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ దాదాపు 4 కోట్ల రూపాయలు ఖర్చు (9.2 మిలియన్ సౌతాఫ్రికన్ ర్యాండ్స్) చేసి 22 ఏళ్ల ఈ వపర్ హిట్టర్‌ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే, ఈ వేలంలో దక్షిణాఫ్రికా పరిమిత ఓవర్ల కెప్టెన్ తెంబా బవుమాకు చేదు అనుభవం ఎదురైంది. అతడి పేరు రెండుసార్లు వేలంలోకి వచ్చినా ఏ ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపలేదు. కనీస ధర( 850,000 సౌతాఫ్రికన్ ర్యాండ్స్)కు కూడా కొనుగోలు చేయలేదు. బవుమాకు ఘోర అవమానం! ఈ విషయంపై స్పందించిన దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్, డర్బన్ సూపర్‌జెయింట్స్ కోచ్ లాన్స్ క్లూస్నర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి టీ20 లీగ్‌లలో ఆడాలంటే దక్షిణాఫ్రికా కెప్టెన్ ట్యాగ్ సరిపోదని పేర్కొన్నాడు. ప్రపంచవ్యాప్తంగా సరైన గుర్తింపు ఉంటేనే ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపుతాయని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు.. ఐఓఎల్ న్యూస్‌తో మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి లీగ్‌లలో ఆడాలంటే తీవ్రమైన పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. దేశం తరఫున కీలక ఆటగాడు అయినంత మాత్రాన సరిపోదు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉండాలి. అప్పుడే ఫ్రాంఛైజీలు సదరు ఆటగాళ్లను పరిగణనలోకి తీసుకుంటాయి’’ అని క్లూస్నర్ చెప్పుకొచ్చాడు. మరేం పర్లేదు! ఇక మరో మాజీ క్రికెటర్ గ్రేమ్ స్మిత్ మాట్లాడుతూ.. ‘‘ఫ్రాంఛైజీ ఓనర్లు ఎలాంటి ఆటగాళ్లను ఎంపిక చేసుకుంటాయో మనకు తెలియదు కదా! అయినా.. ఇప్పుడే అంతా ముగిసిపోలేదు. టోర్నీ ఆరంభమయ్యే లోపు కొంతమంది గాయాల బారిన పడొచ్చు. లేదంటే మరో రూపంలో కూడా అవకాశం రావచ్చు’’ అంటూ బవుమాలా చేదు అనుభవం ఎదుర్కొన్న వారు నిరాశలో కూరుకుపోకూడదని చెప్పుకొచ్చాడు. కాగా దక్షిణాఫ్రికా తరఫున ఇప్పటి వరకు 25 టీ20 మ్యాచ్‌లు ఆడిన బవుమా 120.6 స్ట్రైక్‌రేటుతో 562 పరుగులు చేశాడు. ఇక వచ్చే ఏడాది నుంచి సౌతాఫ్రికా టీ20 లీగ్ ఆరంభం కానుంది. చదవండి: Virat Kohli: ఆసీస్‌తో మ్యాచ్‌కు ముందు కోహ్లికి స్పెషల్ గిఫ్ట్! వీడియో వైరల్ -
'ట్విటర్‌కు బదులుగా ఆటపై దృష్టి పెట్టు, అప్పుడే జట్టులోకి'
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టులోకి తనని ఎంపిక చేయకపోవడంపై రాహుల్ తెవాటియా పెదవి విరిచిన సంగతి తెలిసిందే. ట్విటర్ వేదికగా 'అంచనాలు బాధిస్తాయి' అంటూ తన నిరాశను వ్యక్తం చేశాడు.ఈ క్రమంలో తెవాటిపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ట్విటర్‌కు బదులుగా తన ఆటపై ఎక్కువ దృష్టి పెట్టాలని తెవాటియాను సూచించాడు. "ప్రస్తుతం చాలా మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. కాబట్టి భారత జట్టులో చోటు దక్కడం చాలా కష్టం. కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టును ఎంపిక చేశారని భావిస్తున్నాను. మీరు ట్విటర్ బదులుగా ఆటపై ఎక్కువగా దృష్టి పెట్టి, అద్భుతమైన ప్రదర్శన చేయాలి. తర్వాత సిరీస్‌లకు జట్టును ఎంపిక చేసేటప్పుడు మీ పేరు ఖచ్చితంగా ఉండేలా చేసుకోవాలి" అని గ్రేమ్ స్మిత్ పేర్కొన్నాడు. గతేడాది స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు రాహుల్ తెవాటియా ఎంపికయ్యాడు. అయితే గాయం కారణంగా సిరీస్‌కు ముందే తప్పుకున్నాడు. ఇక ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడిన తెవాటియా బాగా రాణించాడు. ఈ ఏడాది సీజన్లో 16 మ్యాచ్ల్ ఆడిన తెవాటియా.. 147.62 స్ట్రైక్ రేట్‌తో 217 పరుగులు చేశాడు. చాలా మ్యాచ్‌ల్లో గుజరాత్ జట్టుకు బెస్ట్ ఫినిషర్‌గా మారాడు. చదవండి: IND VS SA T20 Series: భువనేశ్వర్ ఖాతాలో మరో అరుదైన రికార్డు -
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్‌కు క్లీన్చిట్
జాతి వివక్ష ఆరోపణల నుంచి దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్‌కు విముక్తి లభించింది. అతనితో పాటు ప్రస్తుత కోచ్, మాజీ వికెట్ కీపర్ మార్క్ బౌచర్, ఏబీ డివిలియర్స్‌లకు కూడా క్లీన్చిట్ ఇచ్చారు. స్మిత్ తదితరులు జట్టులోని నల్లజాతి క్రికెటర్లపై వివక్షకు పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలు లభించలేదని... ఎన్సెబెజా నేతృత్వంలోని సోషల్ జస్టిస్ అండ్ నేషన్ బిల్డింగ్ కమిటీ తమ నివేదికలో పేర్కొంది. -
దక్షిణాఫ్రికా క్రికెటర్లకు భారీ షాక్!
దక్షిణాఫ్రికా క్రికెటర్లకు ఆదేశ క్రికెట్ బోర్డు షాకిచ్చింది. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఆడేందుకు అనుమతిని తిరస్కరించింది. రాబోయే అంతర్జాతీయ పర్యటనలు, దేశీయ మ్యాచ్‌ల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు తెలిపింది. సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉన్నఆటగాళ్లు పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పాల్గొనడం లేదని సౌతాఫ్రికా క్రికెట్ డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ తెలిపారు. కాగా ఫిబ్రవరిలో న్యూజిలాండ్ పర్యటనకు ప్రోటిస్ జట్టు వెళ్లనుంది. అదే విధంగా స్వదేశంలో బంగ్లాదేశ్‌తో కూడా ఆడనుంది. ఇక పాకిస్తాన్ సూపర్ లీగ్ జనవరి 24 నుంచి ప్రారంభం కానుంది. "అంతర్జాతీయ షెడ్యూల్, దేశీయ మ్యాచ్‌ల కారణంగా పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పాల్గొనేందకు ప్రోటిస్ ఆటగాళ్ల అనుమతిని తిరస్కరించాం. త్వరలోనే మేము న్యూజిలాండ్‌లో పర్యటించున్నాం. అదే విధంగా స్వదేశంలో బంగ్లాదేశతో ఆడనున్నాం. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు జట్టు సేవలకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇవ్వాలి" అని స్మిత్ పేర్కొన్నాడు. కాగా ఇమ్రాన్ తాహిర్, రిలీ రోసౌ, మర్చంట్ డి లాంజే పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఆడుతున్న సంగతి తెలిసిందే. చదవండి: IPL- 2022: ఐపీఎల్‌పై బీసీసీఐ కీలక ప్రకటన! -
ధోని అంటే తెలియని వారు ఉన్నారా?
కేప్‌టౌన్: భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ ఎమ్ ఎస్ ధోనిని దక్షిణాఫ్రికా క్రికెట్ డైరెక్టర్, మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ పొగడ్తలతో ముంచెత్తాడు. క్రికెట్ కనెక్ట్ పేరుతో నిర్వహిస్తున్న ఒక స్పోర్ట్స్ షోలో ఆయన మాట్లాడారు. అసలు ధోని తెలియని వారు క్రికెట్ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారనే సందేహం వ్యక్తం చేశాడు. ధోని అంటే తెలియన వారు ఎవరూ ఉండరంటూ స్మిత్ కొనియాడాడు. ఇంకా ధోని గురించి మాట్లాడుతూ, అతను చాలా సౌమ్యుడని, అందరితో కలుపుగోలుగా ఉంటారని ప్రశంసించారు. ధోని అంటే తనకి ఎంతో గౌరవం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్మిత్ తో పాటు గౌతమ్ గంభీర్ కూడా పాల్గొన్నారు. చదవండి: 'ధోనికున్న మద్దతు కోహ్లికి లేదు' ధోని గురించి గంభీర్ మాట్లాడుతూ, తామిద్దరం రూమ్ మేట్స్ అని తెలిపారు. నెల రోజుల పాటు తామిద్దరం కలిసి ఒకే రూం లో ఉన్నామని, మాహీ చాలా మంచి వ్యక్తి అని గంభీర్ పేర్కొన్నారు. చిన్న రూంలో ఉన్న తామిద్దరం ఆ రూం పెద్దగా కనిపించడం కోసం మంచాలు తీసేసి బెడ్స్ వేసుకొని నేలపై పడుకునే వారమని చెప్పారు. ఇక ధోని, తాను ఎప్పుడు జుట్టు గురించే మాట్లాడుకేనే వారమన్నారు. ధోనికి అప్పట్లో పొడుగాటి హెయిర్ స్టైల్ ఉండేది. అలా జుట్టును మెయిన్టైన్ చేయడం చాలా కష్టమని గంభీర్ తెలిపారు. ఇంకా ధోనితో కలిసి కెన్యా, జింబాంబ్వే, ఇండియా ఏ టూర్‌కు వెళ్లనని ఆ టూర్ బాగా ఎంజాయ్ చేశామని గంభీర్ చెప్పారు. ధోని సారధ్యంలో భారత్ 2007 టీ20 ప్రపంచకప్, 2011లో వరల్డ్ కప్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ధోని తన చివరి మ్యాచ్ 2019 వరల్డ్ కప్‌లో ఆడారు. తరువాత ధోని రిటైర్డ్మెంట్ ప్రకటించారు. చదవండి: భారత అభిమానుల గుండె పగిలిన రోజు -
మార్క్ బౌచర్‌కు కీలక పదవి
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా మాజీ వికెట్ కీపర్ మార్క్ బౌచర్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు కీలక పదవిని కట్టబెట్టింది. బౌచర్‌ను ప్రధాన కోచ్‌గా నియమిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ విషయాన్ని క్రికెట్ దక్షిణాఫ్రికా డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ అధికారికంగా ప్రకటించాడు. వరల్డ్ కప్‌లో ఘోర ఓటమి, వరుస వైఫల్యాలు, బోర్డులో అంతర్గత సమస్యలతో దక్షిణాఫ్రికా క్రికెట్ సంక్షభంలో చిక్కుకుంది. దీంతో ప్రొటీస్ క్రికెటన్ చక్కదిద్దే బాధ్యతను మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్‌కు అప్పగించింది. దీనిలో భాగంగా దక్షిణాఫ్రికా క్రికెట్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్మిత్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. త్వరలో ఇంగ్లండ్‌తో జరగబోయే నాలుగు టెస్టుల సిరీస్ నుంచి దక్షిణాఫ్రికాకు ప్రధాన కోచ్‌గా బౌచర్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ మేరకు 2023 వరకు బౌచర్‌తో క్రికెట్ సౌతాఫ్రికా కాంట్రాక్ట్ చేసుకుంది. అయితే తొలుత తాత్కాలిక కోచ్‌గా నియమించినట్టు అందరూ భావించారు. అయితే బౌచర్‌తో మూడేళ్లకు గాను కాంట్రాక్ట్ చేసుకున్నట్టు స్మిత్ తెలపడంతో అతడు పూర్తిస్థాయి కోచ్‌గా ఎంపికైనట్టు స్పష్టమైంది. మార్క్ బౌచర్‌తో పాటు దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్ అష్వెల్ ప్రిన్స్‌ను అదనపు సహాయక కోచ్‌గా ఎంపిక చేశామని స్మిత్ పేర్కొన్నాడు. ప్రస్తుత సహాయక కోచ్‌గా ఉన్న ఎనోచ్ ఎంక్వేతో కలిసి ప్రిన్స్ పనిచేయనున్నాడు. ఇక 2012లో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన బౌచర్ ఆతర్వాత 2016లో కోచ్ అవతారం ఎత్తాడు. దేశవాళీ క్రికెట్లో టైటాన్స్ జట్టుకు కోచ్‌గా పనిచేసిన అనుభవంగా ఈ దిగ్గజ వికెట్ కీపర్‌కు ఉంది. అంతేకాకుండా దేశవాళీ క్రికెట్లో బెస్ట్ కోచ్‌గా బౌచర్‌ను దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సత్కరించింది. ఇక వికెట్ కీపర్‌గా దక్షిణాఫ్రికాకు సుదీర్ఘకాలం తన సేవలందించిన బౌచర్ ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. రికార్డు ఛేజింగ్ మ్యాచ్‌లో భాగంగా ఆస్ట్రేలియాపై చివరి బంతికి బౌండరీ సాధించిన సఫారీ జట్టుకు విజయాన్నందించింది బౌచరే అన్న విషయం తెలిసిందే. ఇక 147 టెస్టులు ఆడిన బౌచర్ ఓవరాల్ అంతర్జాతీయ కెరీర్లో 999 ఔట్లలో ఈ వికెట్ కీపర్ భాగస్వామ్యమయ్యాడు. -
భారత్ పై మాది చెత్త ప్రదర్శన..
లండన్: చాంపియన్స్‌ట్రోఫీలో భారత్‌తో జరిగిన కీలకపోరులో దక్షిణాఫ్రికా చెత్త ప్రదర్శనపై ఆ జట్టు మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. చావోరేవో మ్యాచ్‌లో కనీస పోటీని ఇవ్వలేకపోవడం ఆహ్వానించదగిన విషయం కాదన్నాడు. తమ జట్టు ప్రదర్శన ఆశ్యర్యానికి గురిచేసిందని ఐసీసీకి రాసిన కాలమ్‌లో చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు భారత పేస్ బౌలర్లు బుమ్రా, భువనేశ్వర్‌లపై విరుచుకుపడతానని ఊహించానట్లు పేర్కొన్నాడు. అయితే తమ ఆటగాళ్లే ఒత్తిడికి లోనై తగిన మూల్యం చెల్లించుకున్నారన్నాడు. తమ ఇన్నింగ్స్ లో రెండు రనౌట్లు కావడం ఆటగాళ్లను ఒత్తిడికి గురిచేసిందన్నాడు. ఇక విరాట్ సేన అద్భుతంగా రాణించిందని కొనియాడాడు. దక్షిణాఫ్రికాపై పటిష్టమైన ప్రణాళికలతో రాణించారని తెలిపాడు. భారత్ ఫైనల్ ఫేవరేట్ అని బంగ్లాదేశ్‌తో జరిగే సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్స్ నెగ్గుతుందని స్మిత్ జోస్యం చెప్పాడు. ఇక భారత్‌తో మ్యాచ్‌కు ముందు స్మిత్ దక్షిణాఫ్రికా ఆటగాళ్ల శిక్షణా శిబిరంలో పాల్గొని వారికి సూచనలు చేశాడు.